Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-አንዓም   አንቀጽ:
ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— خَالِقُ كُلِّ شَیْءٍ فَاعْبُدُوْهُ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟
ఓ ప్రజలారా ఈ లక్షణాలు కలిగిన వాడు మీ ప్రభువు, మీ కొరకు ఆయన తప్ప వేరే ప్రభువు లేడు,ఆయన కాకుండా వేరేవాడు సత్య ఆరాధ్య దైవం కాడు. ప్రతి వస్తువును సృష్టించిన వాడు ఆయనే.ఆయన ఒక్కడినే మీరు ఆరాధించండి. ఆయనే ఆరాధనకు హక్కుదారుడు. మరియు ప్రతి వస్తువుపై సంరక్షకునిగా ఉన్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَا تُدْرِكُهُ الْاَبْصَارُ ؗ— وَهُوَ یُدْرِكُ الْاَبْصَارَ ۚ— وَهُوَ اللَّطِیْفُ الْخَبِیْرُ ۟
ఆయనను ఎవరి చూపులు చుట్టుముట్ట లేవు. ఆయన అందరి చూపులను అందుకోగలడు. మరియు వాటిని చుట్టుముట్టగలడు. మరియు ఆయన తన పుణ్యదాసుల పై సూక్ష్మదృష్టి కలవాడు. వారి గురించి తెలుసుకునేవాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَدْ جَآءَكُمْ بَصَآىِٕرُ مِنْ رَّبِّكُمْ ۚ— فَمَنْ اَبْصَرَ فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ عَمِیَ فَعَلَیْهَا ؕ— وَمَاۤ اَنَا عَلَیْكُمْ بِحَفِیْظٍ ۟
ఓ ప్రజలారా మీ ప్రభువు వద్ద నుండి స్పష్టమైన వాదనలు,స్పష్టమైన ఆధారాలు మీ వద్దకు వచ్చినవి. ఎవరైతే వాటిని అర్థం చేసుకుని స్వీకరిస్తాడో ఆ ప్రయోజనం అతని వైపునకు మరలుతుంది. ఎవడైతే వాటి పట్ల అంధుడైపోతాడో,వాటిని అర్ధం చేసుకోడో ,వాటిని స్వీకరించడో ఆ నష్టం అతనికే పరిమితం అవుతుంది. నేను మీ కర్మలను లెక్క వేసుకుంటూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవాడిని కాదు. నేను కేవలం నా ప్రభువు తరుపు నుంచి ప్రవక్తను మాత్రమే. ఆయనే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَكَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ وَلِیَقُوْلُوْا دَرَسْتَ وَلِنُبَیِّنَهٗ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
మరియు మేము అల్లాహ్ శక్తికి సంబంధించిన సాక్షాధారాలను,రుజువులను విభిన్నంగా చేసినట్లు వాగ్ధానము,హెచ్చరిక,హితబోధనలకు సంబంధించిన సూచనలను విభిన్నంగా చేశాము. ముష్రికులు ముందు ముందు ఇలా పలుకుతారు "ఇది దైవ వాణి కాదు దీనిని నీవు నీకన్న మునుపు గ్రంధవహుల నుండి నేర్చుకున్నావు". మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారిలోంచి విశ్వాసపరులకు ఈ సూచనలను మేము విభిన్నంగా చేయటం ద్వారా సత్యాన్ని ప్రజలకు స్పష్టపరచేందుకు చేస్తాము. అయితే వారే (విశ్వాసపరులు) సత్యాన్ని స్వీకరిస్తారు,దానిని అనుసరిస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِتَّبِعْ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنْ رَّبِّكَ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِیْنَ ۟
ఓ ప్రవక్తా మీ ప్రభువు మీ పై అవతరింపజేసిన సత్యాన్ని అనుసరించండి. ఆయన పరిశుధ్ధుడు. ఆయన తప్ప వేరేవారు నిజ ఆరాధ్యులు కారు. అవిశ్వాసులతో,వారి మొండితనంతో మీ హృదయాన్ని లగ్నం చేయకండి. వారి విషయం అల్లాహ్ కే వదిలేయండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكُوْا ؕ— وَمَا جَعَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ۚ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟
అల్లాహ్ తోపాటు వారు ఎవరిని సాటి కల్పించకూడదు అని ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే వారు ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించేవారు కాదు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారిపై వారి కర్మలను లెక్క వేయటానికి పర్యవేక్షకునిగా నియమించలేదు. వారి వ్యవహారాలకు మీరు బాధ్యులు కారు. మీరు ప్రవక్త మాత్రమే. సందేశాలను చేరవేయటం మాత్రమే మీ బాధ్యత.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَا تَسُبُّوا الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَیَسُبُّوا اللّٰهَ عَدْوًا بِغَیْرِ عِلْمٍ ؕ— كَذٰلِكَ زَیَّنَّا لِكُلِّ اُمَّةٍ عَمَلَهُمْ ۪— ثُمَّ اِلٰی رَبِّهِمْ مَّرْجِعُهُمْ فَیُنَبِّئُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా ముష్రికులు అల్లాహ్ తోపాటు ఆరాధించే విగ్రహాలను దూషించకండి. ఒక వేళ అవి అత్యంత అల్పమైన,దూషించుటకు అవి తగినవైనా సరే. ముష్రికులు అల్లాహ్ ను ఎక్కువగా ద్వేషిస్తూ అజ్ఞానం వలన అల్లాహ్ కు తగని వాటి ద్వారా దూషించనంత వరకు. వీరందరి కొరకు వారు ఉన్న అపమార్గము అలంకరించబడిన విధంగా మేము ప్రతి జాతి వారికి వారి ఆచరణను అది మంచి అయిన,చెడు అయిన అలంకరించాము. ఆ తరువాత వారు తమ కొరకు అలంకరించిన దానిలోంచి తీసుకుని వచ్చారు. ప్రళయదినాన వారి మరలింపు వారి ప్రభువు వైపు ఉంటుంది. వారు ఈ లోకంలో చేసుకున్న కర్మల గురించి ఆయన వారికి తెలియపరుస్తాడు. దాని పరంగా వారికి ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَىِٕنْ جَآءَتْهُمْ اٰیَةٌ لَّیُؤْمِنُنَّ بِهَا ؕ— قُلْ اِنَّمَا الْاٰیٰتُ عِنْدَ اللّٰهِ وَمَا یُشْعِرُكُمْ ۙ— اَنَّهَاۤ اِذَا جَآءَتْ لَا یُؤْمِنُوْنَ ۟
ముష్రికులు తమ శక్తి మేరకు అతి గట్టిగా అల్లాహ్ పై ప్రమాణం చేసారు.ఒక వేళ ముహమ్మద్ వారి వద్దకు వారు ప్రతిపాదించిన సూచనల్లోంచి ఏ ఒక్క సూచన తీసుకుని వచ్చినా వారు దానిని తప్పకుండా విశ్వసిస్తారు(అని). ఓ ప్రవక్తా వారితో ఇలా తెలియ చేయండి : సూచనలు నా వద్ద లేవు నేను వాటిని అవతరింప చేయటానికి.అవి అల్లాహ్ వద్ద మాత్రమే ఉంటాయి.ఆయన వాటిని ఎప్పుడు తలచుకుంటే అప్పుడు అవతరింప చేస్తాడు.ఓ విశ్వాసపరులారా మీకేమి తెలుసు నిశ్చయంగా ఈ సూచనలు వచ్చినప్పుడు వారు ప్రతిపాదించిన ప్రకారం ఉన్నా వారు విశ్వసించరు.కాని వారు తమ మొండితనము,తమ తిరస్కరించటం పైనే ఉంటారు.ఎందుకంటే వారు సన్మార్గమును కోరుకోవటం లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَنُقَلِّبُ اَفْـِٕدَتَهُمْ وَاَبْصَارَهُمْ كَمَا لَمْ یُؤْمِنُوْا بِهٖۤ اَوَّلَ مَرَّةٍ وَّنَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟۠
మరియు సత్యాన్ని మార్గ నిర్దేశం చేయకుండా నిరోధించటం ద్వారా వారి హృదయాలను,వారి కళ్ళను మేము తిప్పి వేశాము. ఏ విధంగానైతే మేము వారి మొండితనం కారణంగా వారి మధ్య,విశ్వాసము మధ్య ఖుర్ఆన్ ద్వారా తొలిసారి పరిష్కరించామో ఆ విధంగా. మరియు మేము వారిని వారి అపమార్గంలో,తమ ప్రభువుకి వ్యతిరేకంగా తమ తలబిరుసు తనంలో దారి తప్పి తిరిగేలా వదిలి పెడతాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تنزيه الله تعالى عن الظلم الذي ترسِّخُه عقيدة (الجَبْر)، وبيان أن كفر العباد وشركهم أمر يحدث باختيارهم.
దుర్మార్గము నుండి అల్లాహ్ ను పరిశుద్ధునిగా చూపటం దేనినైతే అఖీదతుల్ జబ్ర్ తాకీదు చేస్తుందో. దాసుల అవిశ్వాసం,వారి షిర్క్ తమ తరపునుండి ఎంచుకున్నవని తెలపటం.

• ليس بمقدور نبي من الأنبياء أن يأتي بآية من عند نفسه، أو متى شاء، بل ذلك أمر مردود لله تعالى، فهو القادر وحده على ذلك، وهو الحكيم الذي يُقَدِّر نوع الآية ووقت إظهارها.
ప్రవక్తల్లోంచి ఏ ప్రవక్తకు తన తరపు నుంచి ఏ సూచనను తీసుకుని వచ్చే లేదా ఎప్పుడు ఆయన కోరుకుంటే అప్పుడు తీసుకుని వచ్చే శక్తి లేదు. కాని ఆ విషయం అల్లాహ్ వైపునకు మరలించబడుతుంది. ఆయన ఒక్కడే దాని సామర్ధ్యం కలవాడు. మరియు ఆయనే సూచన రకమును,దాని ఆవిర్భవించే సమయమును నిర్ధారించగల వివేకవంతుడు.

• النهي عن سب آلهة المشركين حذرًا من مفسدة أكبر وهي التعدي بالسب على جناب رب العالمين.
ముష్రికుల దేవుళ్ళను దూషించటం నుండి వారించటం అతిపెద్ద చెడు నుండి ముందు జాగ్రత్తగా. మరియు అది (చెడు) సర్వలోకాల ప్రభువును దూషించటం ద్వారా దుర్మార్గానికి పాల్పడటం.

• قد يحول الله سبحانه وتعالى بين العبد والهداية، ويُصرِّف بصره وقلبه على غير الطاعة؛ عقوبة له على اختياره الكفر.
అల్లాహ్ దాసునికి,సన్మార్గమునకు మధ్య అడ్డుగా ఉంటాడు. అతని దృష్టిని,అతని మనస్సును అవిధేయత వైపునకు మరలిస్తాడు. అతను అవిశ్వాసమును ఎంచుకోవటం వలన అతని కొరకు శిక్ష ఉంటుంది.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት