Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-አዕራፍ   አንቀጽ:
قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
సమస్త సృష్టి రాసుల ప్రభువును మేము విశ్వసించాము అని మంత్రజాలకులు పలికారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
رَبِّ مُوْسٰی وَهٰرُوْنَ ۟
మూసా,హారూన్ అలైహిముస్సలాం ప్రభువు. ఆయన కాక ఇతర పేరొందిన దేవతలు కాకుండా ఆయనే ఆరాధనకు అర్హుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ فِرْعَوْنُ اٰمَنْتُمْ بِهٖ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ۚ— اِنَّ هٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوْهُ فِی الْمَدِیْنَةِ لِتُخْرِجُوْا مِنْهَاۤ اَهْلَهَا ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۟
వారు ఒకే అల్లాహ్ ను విశ్వసించిన తరువాత ఫిర్ఔన్ వారిని హెచ్చరిస్తూ ఇలా పలికాడు : నేను మీకు అనుమతివ్వకముందే మూసాను విశ్వసిస్తారా అతడిపై మీ విశ్వాసము,మూసా తీసుకుని వచ్చిన దానిపై మీ నమ్మకము ఒక మోసము,మీరు,మూసా అందరు కలిసి పట్టన వాసులను అక్కడి నుండి వెళ్ళగొట్టటానికి పన్నిన వ్యూహము. ఓ మంత్రజాలకులారా మీపై వచ్చే శిక్షను,మీరు చేసే గుణపాఠరహిత శిక్షను తొందరలోనే తెలుసుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ ثُمَّ لَاُصَلِّبَنَّكُمْ اَجْمَعِیْنَ ۟
నేను తప్పకుండా మీలో నుంచి ప్రతి ఒక్కరి యొక్క కుడి చేయిని,ఎడమ కాలుని లేదా ఎడమ చేయిని,కుడి కాలిని నరికి వేస్తాను. ఆ తరువాత మిమ్మల్నందరిని శిక్షించటానికి,ఆ స్థితిలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి భయం కలిగించటానికి మిమ్మల్నందరిని ఖర్జూరపు చెట్ల మానులపై వ్రేలాడదీస్తాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالُوْۤا اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنْقَلِبُوْنَ ۟ۚ
ఫిర్ఔన్ హెచ్చరికను ఖండిస్తూ మంత్రజాలకులు ఇలా అన్నారు : నిశ్చయంగా మేమందరం ఒక్కడైన మా ప్రభువు వైపునకు మరలి వెళ్ళేవారము. నీవు బెదిరిస్తున్న బెదిరింపులను లెక్కచేయము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَا تَنْقِمُ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاٰیٰتِ رَبِّنَا لَمَّا جَآءَتْنَا ؕ— رَبَّنَاۤ اَفْرِغْ عَلَیْنَا صَبْرًا وَّتَوَفَّنَا مُسْلِمِیْنَ ۟۠
ఓ పిర్ఔన్ మూసా ద్వారా మా ప్రభువు వద్ద నుండి సూచనలు వచ్చినప్పుడు కేవలం మేము వాటిని విశ్వసించామని నీవు మమ్మల్ని విస్మరించావు,మాపై ఆగ్రహాన్ని చూపావు. ఒకవేళ ఇది లోపం చూపించదగిన పాపం అయితే అది మా పాపమే. ఆ తరువాత వారు అణుకువతో ఇలా దుఆ చేస్తూ అల్లాహ్ వైపు మరలారు : ఓ మా ప్రభువా మాపై సహనాన్ని కురిపించు. కడకు అది మేము సత్యంపై నిలకడ చూపటానికి మమ్మల్ని ముంచివేయాలి. నీకు విధేయిలుగా నీ ఆదేశానికి కట్టుబడి ఉండేటట్లు,నీ ప్రవక్తను అనుసరించే వారిగా ఉన్న స్థితిలోనే మాకు మరణాన్ని ప్రసాదించు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اَتَذَرُ مُوْسٰی وَقَوْمَهٗ لِیُفْسِدُوْا فِی الْاَرْضِ وَیَذَرَكَ وَاٰلِهَتَكَ ؕ— قَالَ سَنُقَتِّلُ اَبْنَآءَهُمْ وَنَسْتَحْیٖ نِسَآءَهُمْ ۚ— وَاِنَّا فَوْقَهُمْ قٰهِرُوْنَ ۟
ఫిర్ఔన్ జాతివారిలోంచి నాయకులు,పెద్దవారు ఫిర్ఔన్ ను మూసా,ఆయనతోపాటు విశ్వసించిన వారికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఇలా : అన్నారు ఓ ఫిర్ఔన్ ఏమి నీవు మూసా,అతని జాతివారిని భూమిలో అల్లకల్లోలాలను వ్యాపింపచేయటానికి మరియు వారు నిన్ను,నీ ఆరాధ్య దైవాలను వదిలి పెట్టటానికి,వారు ఒకే అల్లాహ్ ఆరాధన వైపునకు పిలవటానికి వదిలివేస్తావా ?. ఫిర్ఔన్ ఇలా పలికాడు : తొందరలోనే మేము ఇస్రాయీలు సంతతివారి మగ పిల్లలను చంపివేస్తాము,వారి స్త్రీలను సేవకోసం వదిలివేస్తాము. మరియు మేము వారిపై అణిచివేత,అధికారము,ఆధిపత్యము కలిగి ఉన్నాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ مُوْسٰی لِقَوْمِهِ اسْتَعِیْنُوْا بِاللّٰهِ وَاصْبِرُوْا ۚ— اِنَّ الْاَرْضَ لِلّٰهِ ۙ۫— یُوْرِثُهَا مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ— وَالْعَاقِبَةُ لِلْمُتَّقِیْنَ ۟
మూసా తన జాతివారికి తాకీదు చేస్తూ ఇలా అన్నారు : ఓ నా జాతివారా మీరు నష్టమును దూరం చేయటంలో,మీకు లాభం కలగటంలో ఒకే అల్లాహ్ తో సహాయమును అర్ధించండి. మీపై వచ్చే పరీక్షల్లో సహనమును చూపండి. నిశ్చయంగా భూమి ఒక్కడైన అల్లాహ్ ది. అధికారము చెలాయించటానికి ఫిర్ఔన్ ది కాదు. మరియు అల్లాహ్ దాన్ని ప్రజల మధ్య వారి విధివ్రాత ప్రకారం త్రిప్పుతూ ఉంటాడు. కాని అల్లాహ్ ఆదేశాలను పాటించి,అల్లాహ్ వారించిన వాటికి దూరంగా ఉండే విశ్వాసపరులకు మంచి పరిణామం ఉంటుంది. అది వారి కొరకే. ఒకవేళ ఆపదలు,పరీక్షలు వారికి చేరినా.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالُوْۤا اُوْذِیْنَا مِنْ قَبْلِ اَنْ تَاْتِیَنَا وَمِنْ بَعْدِ مَا جِئْتَنَا ؕ— قَالَ عَسٰی رَبُّكُمْ اَنْ یُّهْلِكَ عَدُوَّكُمْ وَیَسْتَخْلِفَكُمْ فِی الْاَرْضِ فَیَنْظُرَ كَیْفَ تَعْمَلُوْنَ ۟۠
ఇస్రాయీలు సంతతి నుంచి మూసా జాతివారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ మూసా ఫిర్ఔన్ చేతిలో మా కుమారుల హత్య ద్వారా,మా స్త్రీలను వదిలివేయటం ద్వారా మీరు మా వద్దకు రాక మునుపు,మీరు వచ్చిన తరువాత పరీక్షింపబడ్డాము (బాదింపబడ్డాము). మూసా వారిని హితోపదేశం చేస్తూ,సుఖవంతమైన జీవితపు శుభవార్తనిస్తూ ఇలా పలికారు : బహుశా మీ ప్రభువు మీ శతృవులైన ఫిర్ఔన్,అతని జాతివారిని వినాశనమునకు గురిచేస్తాడు. వారి తరువాత భూమిలో మీకు నివాసమును కలిగిస్తాడు. దీని తరువాత కృతజ్ఞత లేదా కృతఘ్నత లోంచి మీరు ఏమి చేస్తారో ఆయన చూస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ اَخَذْنَاۤ اٰلَ فِرْعَوْنَ بِالسِّنِیْنَ وَنَقْصٍ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ یَذَّكَّرُوْنَ ۟
మేము ఫిర్ఔన్ జనులను దుర్భిక్షానికి,అనావృష్టికి గురిచేసి శిక్షించాము. మరియు భూమిలో పండ్ల ఉత్పత్తిని,ధాన్యాలను తగ్గించి వారిపై ఇదంతా కేవలం వారి అవిశ్వాసము వలన వచ్చిన శిక్ష అని వారు హితోపదేశం గ్రహిస్తారని,గుణపాఠం నేర్చుకుంటారని,అల్లాహ్ వైపు ప్రాయశ్చిత్తముతో మరలుతారని ఆశిస్తూ వారిని పరీక్షించాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• موقف السّحرة وإعلان إيمانهم بجرأة وصراحة يدلّ على أنّ الإنسان إذا تجرّد عن هواه، وأذعن للعقل والفكر السّليم بادر إلى الإيمان عند ظهور الأدلّة عليه.
మంత్రజాలకుల వైఖరి,వారు సాహసోపేతముగా,బహిరంగముగా తమ విశ్వాసము ప్రకటన మనిషి తన మనోవాంచనల నుండి ఖాళీ అయిపోయినప్పుడు,బుద్ధిని,సరైన ఆలోచనకు విధేయుడైనప్పుడు విశ్వాసము యొక్క ఆధారాలు ప్రస్పుటమయిన వేళ శీఘ్రంగా విశ్వసిస్తాడు అన్న దానిపై సూచిస్తుంది.

• أهل الإيمان بالله واليوم الآخر هم أشدّ الناس حزمًا، وأكثرهم شجاعة وصبرًا في أوقات الأزمات والمحن والحروب.
అల్లాహ్ ను,అంతిమ దినమును విశ్వసించేవారు ప్రజల్లో చాలా ఎక్కువగా జాగ్రత వహించేవారై ఉంటారు. యుద్ధాలు,ఆపదలు,కష్టాల సమయాల్లో చాలా ధైర్యవంతులై,సహనము పాటించేవారై ఉంటారు.

• المنتفعون من السّلطة يُحرِّضون ويُهيِّجون السلطان لمواجهة أهل الإيمان؛ لأن في بقاء السلطان بقاء لمصالحهم.
అధికారము నుండి లబ్ది పొందేవారు విశ్వాసులను ఎదుర్కోవటానికి అధికారము కలవాడిని రెచ్చగొడుతారు,ప్రేరేపిస్తారు. ఎందుకంటే అధికారి మనుగడలోనే వారి ప్రయోజనాల మనుగడ ఉన్నది.

• من أسباب حبس الأمطار وغلاء الأسعار: الظلم والفساد.
హింస,అల్లకల్లోలాలు వర్షాలు ఆగిపోవటానికి,ధరలు పెరిగిపోవటానికి కారణం.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት