Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-አዕራፍ   አንቀጽ:
قَالَا رَبَّنَا ظَلَمْنَاۤ اَنْفُسَنَا ٚ— وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
ఆదం,హవ్వా ఇలా వేడుకున్నారు : ఓ మా ప్రభూ నీవు మమ్మల్ని ఈ వృక్షము నుండి తినటం గురించి వారించిన దాన్ని పాల్పడి మాపై హింసకు పాల్పడ్డాము (అన్యాయం చేసుకున్నాము). ఒక వేళ నీవు మా పాపములను మన్నించకపోతే,నీ కారుణ్యముతో మాపై దయ చూపకపోతే తప్పకుండా మేము ఇహ,పరాల్లో మా యొక్క వాటాను కోల్పోయి నష్టాన్ని చవిచూసే వారిలోంచి అయిపోతాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— وَلَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
అల్లాహ్ ఆదం,హవ్వా,ఇబ్లీసుతో ఇలా పలికాడు : మీరందరు స్వర్గము నుండి భూమి పై దిగిపోండి. తొందరలోనే మీరు ఒండొకరికి శతృవులైపోతారు. భూమిలో మీ కొరకు ఒక నిర్ణీత సమయం వరకు నివాసముండును. మీరు అందులో నిర్ణీత సమయం వరకు ప్రయోజనం పొందండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ فِیْهَا تَحْیَوْنَ وَفِیْهَا تَمُوْتُوْنَ وَمِنْهَا تُخْرَجُوْنَ ۟۠
అల్లాహ్ ఆదం,హవ్వా,వారి సంతతిని ఉద్దేశించి ఇలా పలికాడు : అల్లాహ్ మీ కొరకు నిర్ధారించిన వయస్సు వరకు మీరు భువిలో జీవిస్తారు. మరియు అందులోనే మరణిస్తారు,సమాది చేయబడుతారు. మరణాంతర జీవితం కొరకు మీ సమాదుల నుండి తీయబడుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰبَنِیْۤ اٰدَمَ قَدْ اَنْزَلْنَا عَلَیْكُمْ لِبَاسًا یُّوَارِیْ سَوْاٰتِكُمْ وَرِیْشًا ؕ— وَلِبَاسُ التَّقْوٰی ۙ— ذٰلِكَ خَیْرٌ ؕ— ذٰلِكَ مِنْ اٰیٰتِ اللّٰهِ لَعَلَّهُمْ یَذَّكَّرُوْنَ ۟
ఓ ఆదం సంతతివారా మీరు మీ మర్మావయవాలను కప్పుకోవటం కొరకు అవసరమగు వస్త్రాలను మీ కొరకు మేము తయారు చేశాము. మరియు మేము మీ కొరకు పరిపూర్ణ వస్త్రాలను తయారు చేశాము. మీరు వాటి ద్వారా ప్రజల్లో అందంగా తయారవుతారు. మరియు దైవభీతితో కూడుకున్న దుస్తులు అవి అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటం ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం. అవి ఎంతో మేలైనవి ఈ ఇంద్రియ దుస్తులు కన్న. ఈ ప్రస్తావించబడిన దుస్తులు అల్లాహ్ శక్తి సామర్ధ్యాల పై సూచించే సూచనల్లోంచివి. తద్వారా మీ పై ఉన్న ఆయన అనుగ్రహాలను మీరు గుర్తు చేసుకుని వాటి గురించి కృతజ్ఞతలు తెలుపుకుంటారని.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰبَنِیْۤ اٰدَمَ لَا یَفْتِنَنَّكُمُ الشَّیْطٰنُ كَمَاۤ اَخْرَجَ اَبَوَیْكُمْ مِّنَ الْجَنَّةِ یَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِیُرِیَهُمَا سَوْاٰتِهِمَا ؕ— اِنَّهٗ یَرٰىكُمْ هُوَ وَقَبِیْلُهٗ مِنْ حَیْثُ لَا تَرَوْنَهُمْ ؕ— اِنَّا جَعَلْنَا الشَّیٰطِیْنَ اَوْلِیَآءَ لِلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ ۟
ఓ ఆదం సంతతి వారా మర్మావయవాలను కప్పటం కొరకు ఉన్న ఇంద్రియ దుస్తులను లేదా దైవ భీతితో కూడుకున్న దుస్తులను వదిలివేయటం ద్వారా పాపాన్ని అలంకరించి షైతాను మిమ్మల్ని ప్రలోభ పెట్టకూడదు సుమా. వాస్తవానికి అతడు వృక్షము నుండి తినటంను మంచిగా చేసి చూపించి మీ తల్లిదండ్రులను (ఆదం,హవ్వాను) మోసం చేశాడు. చివరికి అది వారిరువురిని స్వర్గం నుంచి తొలగించటం కొరకు దారి తీసింది. మరియు వారిద్దరి మర్మావయవాలు బహిర్గతమై పోయినవి. నిశ్చయంగా షైతాను,అతని సంతానము మిమ్మల్ని చూస్తూ ఉంటారు,మిమ్మల్ని గమనిస్తుంటారు. మరియు మీరు వారిని చూడలేరు,గమనించలేరు. మీరు అతనితో,అతని సంతానముతో జాగ్రత్తగా ఉండాలి. నిశ్చయంగా మేము షైతానులను అల్లాహ్ ను విశ్వసించని వారి కొరకు స్నేహితులుగా చేశాము. సత్కార్యాలు చేసే విశ్వాసపరుల వైపు వారికి ఎటువంటి మార్గం ఉండదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذَا فَعَلُوْا فَاحِشَةً قَالُوْا وَجَدْنَا عَلَیْهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا ؕ— قُلْ اِنَّ اللّٰهَ لَا یَاْمُرُ بِالْفَحْشَآءِ ؕ— اَتَقُوْلُوْنَ عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
ముష్రికులు షిర్కు,బైతుల్లాహ్ యొక్క నగ్న ప్రదక్షణ,వేరే ఇతర వాటి లాంటి ఏవైన అత్యంత చెడు కార్యానికి పాల్పడినప్పుడు వారు తమ తాతముత్తాతలను వాటిని పాల్పడుతుండగా పొందారని,అల్లాహ్ వారికి దానిని చేయమని ఆదేశించాడని సాకులు చెబుతారు. ఓ ముహమ్మద్ వారిని ఖండిస్తూ ఇలా పలకండి : నిశ్చయంగా అల్లాహ్ పాపాలకు పాల్పడమని ఆదేశించడు. కాని వాటి నుండి వారిస్తాడు. అయితే దానిని మీరు ఆయనపై ఎందుకు అంటగడుతున్నారు?. ఓ ముష్రికులారా ఏమి మీరు మీకు తెలియని అబద్దపు మాటలను,కల్పితాలను అల్లాహ్ పై పలుకుతున్నారా?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قُلْ اَمَرَ رَبِّیْ بِالْقِسْطِ ۫— وَاَقِیْمُوْا وُجُوْهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ۬— كَمَا بَدَاَكُمْ تَعُوْدُوْنَ ۟ؕ
ఓ ముహమ్మద్ ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నిశ్చయంగా అల్లాహ్ న్యాయం గురించి ఆదేశించాడు. మరియు ఆయన అశ్లీలత,చెడు గురించి ఆదేశించలేదు. సాధారణంగా ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించమని,ప్రత్యేకించి మస్జిదులలో చేయమని,విధేయత ఆయన ఒక్కడి కొరకే ప్రత్యేకించుకుని మీరు ఆరాధించాలని మిమ్మల్ని ఆదేశించాడు. మిమ్మల్ని ఆయన మొదటిసారి సృష్టించినట్లు రెండోవసారి మరల జీవింప చేసి మిమ్మల్ని మరలుస్తాడు. మిమ్మల్ని మొదటిసారి సృష్టించే సామర్ధ్యం కలవాడు మిమ్మల్ని మరలించటం,మరణాంతరం లేపటం పై సామర్ధ్యం కలవాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَرِیْقًا هَدٰی وَفَرِیْقًا حَقَّ عَلَیْهِمُ الضَّلٰلَةُ ؕ— اِنَّهُمُ اتَّخَذُوا الشَّیٰطِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ اللّٰهِ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ ۟
మరియు అల్లాహ్ ప్రజలను రెండు వర్గాలుగా చేశాడు మీలో నుంచి ఒక వర్గంకు ఆయన సన్మార్గం చూపాడు. దాని కొరకు సన్మార్గమునకు కారకాలను సులభతరం చేశాడు. దాని నుండి వాటికి సంభందించిన ఆటంకాలను తొలగించాడు. మరోక వర్గం పై సత్య మార్గం నుండి భ్రష్టులవ్వటం రూఢీ అయింది. ఇలా ఎందుకంటే వారు అల్లాహ్ ను వదిలి షైతానులను స్నేహితులుగా చేసుకున్నారు. అజ్ఞానం వలన వారిని అనుసరించసాగారు. వారు సన్మార్గం పొందారని భ్రమలో పడి ఉన్నారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من أَشْبَهَ آدم بالاعتراف وسؤال المغفرة والندم والإقلاع - إذا صدرت منه الذنوب - اجتباه ربه وهداه. ومن أَشْبَهَ إبليس - إذا صدر منه الذنب بالإصرار والعناد - فإنه لا يزداد من الله إلا بُعْدًا.
ఎవరైతే ఆదంలా తన ద్వారా పాపం జరిగినప్పుడు దానిని అంగీకరించి ,మన్నింపు వేడుకుని,కృంగిపోయి,దానిని తన నుండి తొలగించి వేస్తాడో అతడిని అతని ప్రభువు ఎన్నుకుని సన్మార్గం చూపుతాడు. మరియు ఎవరైతే ఇబ్లీసులా తన నుండి మొండితనం వలన,వ్యతిరేకత వలన పాపం జరిగినప్పుడు అతడు అల్లాహ్ నుండి దూరమును పెంచుకున్నాడు.

• اللباس نوعان: ظاهري يستر العورةَ، وباطني وهو التقوى الذي يستمر مع العبد، وهو جمال القلب والروح.
దుస్తులు రెండు రకాలు. బయటకు కనబడేవి.అవి మర్మావయవాలను కప్పుతాయి.అంతరంగా ఉండేవి.అవి దైవభీతితో కూడుకున్నవి.దాసునితో పాటు ఇమిడి ఉంటాయి.అవి హృదయమునకు,ఆత్మకు అందము.

• كثير من أعوان الشيطان يدعون إلى نزع اللباس الظاهري؛ لتنكشف العورات، فيهون على الناس فعل المنكرات وارتكاب الفواحش.
షైతాను సహాయకులు మర్మావయవాలను బహిర్గతం చేయటం కొరకు బయటకు కనబడే దుస్తులను తీసివేయటం వైపునకు పిలుస్తారు. అప్పుడు చెడు కార్యాలు చేయటం,అశ్లీలతకు పాల్పడటం ప్రజలకు సులభమవుతుంది.

• أن الهداية بفضل الله ومَنِّه، وأن الضلالة بخذلانه للعبد إذا تولَّى -بجهله وظلمه- الشيطانَ، وتسبَّب لنفسه بالضلال.
సన్మార్గము అల్లాహ్ అనుగ్రహము,ఆయన ఉపకారము. అపమార్గము దాసుడిని ఆయన అవమాన పరచటం కొరకు ఎప్పుడైతే అతడు తన అజ్ఞానం,అన్యాయం వలన షైతానును స్నేహితునిగా చేసుకుంటాడో.మరియు అతడు తన స్వయం కొరకు అపమార్గము ద్వారా కారకుడవుతాడు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት