Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ


অৰ্থানুবাদ ছুৰা: আল-বাক্বাৰাহ   আয়াত:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا سَوَآءٌ عَلَیْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
నిశ్ఛయంగా విశ్వాసం లేకపోవటం వలన అల్లాహ్ వాక్కు అనివార్యం అయినవారు తమ అపమార్గముపై,మొండితనంపై కొనసాగిపోతారు. వారిని మీరు హెచ్చరించిన హెంచ్చరించకపోయిన రెండూ సమానము.
আৰবী তাফছীৰসমূহ:
خَتَمَ اللّٰهُ عَلٰی قُلُوْبِهِمْ وَعَلٰی سَمْعِهِمْ ؕ— وَعَلٰۤی اَبْصَارِهِمْ غِشَاوَةٌ ؗ— وَّلَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟۠
ఎందుకంటే అల్లాహ్ వారి హృదయాల పై ముద్ర వేసి వాటిని వాటి ఆంతర్యంలోని చెడును పూర్తిగా మూసివేసాడు.మరియు వారి చెవులపై ముద్రవేయబడిన కారణంగా వారు సత్యాన్ని ఆచరించె ఉద్దేశ్యంతో వినలేరు మరియు వారి కళ్ళపై తెరవేయబడిన కారణంగా సత్యం ప్రస్పుటమయిన తరువాత కూడా వారు చూడలేక పోతున్నారు వీరి కొరకు పరలోకంలో ఘోరమైన శిక్ష ఉన్నది.
আৰবী তাফছীৰসমূহ:
وَمِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ وَبِالْیَوْمِ الْاٰخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِیْنَ ۟ۘ
ప్రజలలో ఒక వర్గం తాము విస్వాసులమని బొంకుతుంది వారు తమ ధన మరియు ప్రాణ భయంతో ఇలా బొంకుతున్నారే కానీ అంతర్గతoగా వారు అంతర్గతంగా అవిశ్వాసులు.
আৰবী তাফছীৰসমূহ:
یُخٰدِعُوْنَ اللّٰهَ وَالَّذِیْنَ اٰمَنُوْا ۚ— وَمَا یَخْدَعُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟ؕ
వారు తమ విశ్వాసాన్ని ప్రదర్శించి, అవిశ్వాసాన్ని తిరస్కరించి అల్లాహ్ ను మరియు విస్వాసులను మోసగిస్తున్నారని తమ అజ్ఞానంతో భ్రమపడుతున్నారు. కానీ వాస్తవానికి వారు కేవలం తమను తామే మొసగించుకుంటున్నారు. కానీ ఇది వారు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే అల్లాహ్ కు రహస్యము,గోప్యవిషయాలు తెలుసు. ఆయన విస్వాసులకు వారి గుణాలను మరియు వారి పరిస్థితులను గురిoచి తెలియచేశాడు.
আৰবী তাফছীৰসমূহ:
فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ ۙ— فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۙ۬۟ — بِمَا كَانُوْا یَكْذِبُوْنَ ۟
(వారి ఈ వైఖరికి) కారణం ఏమనగా, వారి హృదయాలలో అనుమానం అనే వ్యాధి ఉన్నది.అల్లాహ్ వారి అనుమానాన్ని మరింతగా రెట్టింపు చేశాడు. మరియు వారి ఆచరణకు ఫలితంగా నరకంలోని అట్టడుగు భాగంలో ఘోరమైన శిక్షను విధించాడు. వారు ప్రజలపై మరియు అల్లాహ్ పై అబద్ధాలను మోపడం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని తిరస్కరించటం కారణంగా ఈ విధమైన శిక్ష విధించబడింది.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا قِیْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِی الْاَرْضِ ۙ— قَالُوْۤا اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ ۟
మరియు వారిని ‘అవిశ్వాసమూ, పాపకార్యాలు మొదలైన వాటితో భూమిపై ఉపద్రవాలను సృష్టించకండి’ అని చెప్పినప్పుడల్లా వారు దానిని నిరాకరించారు. తాము సంఘ సంస్కర్తలమనీ, తాము చేస్తున్నదంతా సంస్కరణే అని వాదించారు.
আৰবী তাফছীৰসমূহ:
اَلَاۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَلٰكِنْ لَّا یَشْعُرُوْنَ ۟
వాస్తవానికి నిశ్చయంగా ఉపద్రవాలను సృష్టించేది వారే. కానీ వారు ఇది గ్రహించలేక పోతున్నారు. మరియు వారు చేసే పనులే అసలైన ఉపద్రవాలు అనేది తెలుసుకోలేక పోతున్నారు.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوْۤا اَنُؤْمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ ؕ— اَلَاۤ اِنَّهُمْ هُمُ السُّفَهَآءُ وَلٰكِنْ لَّا یَعْلَمُوْنَ ۟
మరియు ఎప్పుడైతే వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులవలె విశ్వసించమని ఆదేశించబడినదో అప్పుడు వారు దానిని హేళనాప్రాయంగా మరియు తిరస్కార వైఖరితో సమాధానం పలుకుతూ మేము బుద్ది హీనులవలె విశ్వంసించాలా? అని అన్నారు. వాస్తవానికి వారే బుద్ది హీనులని తెలుసుకోలేక పోతున్నారు.
আৰবী তাফছীৰসমূহ:
وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَوْا اِلٰی شَیٰطِیْنِهِمْ ۙ— قَالُوْۤا اِنَّا مَعَكُمْ ۙ— اِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُوْنَ ۟
వారు విశ్వాసులను కలసినప్పుడు మీరు విశ్వసించిన దానిని మేమూ విశ్వసిస్తున్నామని అంటారు. కానీ అలా వారు కేవలం విశ్వాసుల పట్ల తమకు ఉన్న భయంతోనే అంటున్నారు. మరియు ఎప్పుడైతే వారు విశ్వాసుల నుండి మరలి తమ నాయకుల వద్దకు ఏకాంతంలో చేరుతారో అప్పుడు తాము తమ నాయకుల విధేయతలోనే స్ధిరంగా ఉన్నామని నమ్మిస్తూ నిస్సందేహంగా మేము మీ పద్ధతి పైనే ఉన్నామని, పైకి మాత్రం కేవలం విశ్వాసులతో ఉన్నట్టు ఎగతాళి చేస్తున్నామని అంటారు.
আৰবী তাফছীৰসমূহ:
اَللّٰهُ یَسْتَهْزِئُ بِهِمْ وَیَمُدُّهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
వారు విశ్వాసులతో ఆడుతున్న పరిహాసానికి బదులుగా అల్లాహ్ వారితో పరిహాసమాడుతున్నాడు. ఇది వారి పనులకు ప్రతిఫలం. అందుకే ఇహలోకంలో వీరిపై ముస్లిములకు వర్తించే ఆదేశాలే వర్తిస్తాయి. కానీ, పరలోకంలో మాత్రం వారి కపటవిశ్వాసం మరియు అవిశ్వాసం యొక్క ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మరియు వారు వారి మార్గభ్రష్టత్వంలో, తిరస్కారవైఖరిలో చాలా దూరం చేరుకోవాలనే ఉద్దేశ్యంతో వారికి ఇంకా గడువు ఇవ్వబడుతుంది. చివరకు వారు ఆందోళన చెందుతూ, బిత్తరపోయి మిగిలిపోతారు.
আৰবী তাফছীৰসমূহ:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰی ۪— فَمَا رَبِحَتْ تِّجَارَتُهُمْ وَمَا كَانُوْا مُهْتَدِیْنَ ۟
వారందరే అవివేకులు, ఎందుకంటే వారు విశ్వాసాన్ని అవిశ్వాసంతో మార్పిడి చేసుకున్నారు. వారి ఈ వర్తకం ఎంత మాత్రం లాభదాయకం కాదు. ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల గల తమ విశ్వాసాన్ని కోల్పొయారు. మరియు వారు సత్యం వైపునకు మార్గదర్శకత్వాన్నీ కూడా పొందలేకపోయారు (సన్మార్గాన్నీ నోచుకోలేకపోయారు).
আৰবী তাফছীৰসমূহ:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• أن من طبع الله على قلوبهم بسبب عنادهم وتكذيبهم لا تنفع معهم الآيات وإن عظمت.
తమ అహంకార వైఖరి, మరియు అసత్య వాదనల కారణంగా, అల్లాహ్ ఎవరి హృదయాలపై నైతే ముద్ర వేస్తాడో, అటువంటి వారికి ఏ వాక్యాలూ ప్రయోజనం కలిగించవు, అవి ఎంత గొప్ప వాక్యాలైనా సరే.

• أن إمهال الله تعالى للظالمين المكذبين لم يكن عن غفلة أو عجز عنهم، بل ليزدادوا إثمًا، فتكون عقوبتهم أعظم.
అల్లాహ్ దుర్మార్గులకు, సత్యతిరస్కారులకు గడువును ఇచ్చినది వారి పట్ల అలక్ష్యము వహించి కాదు, లేక వారి పట్ల అశక్తుడై కాదు. వారికి ఇవ్వబడిన గడువు వారి పాపం పండటానికి తద్వారా వారికి ఘోరమైన శిక్షను విధించటానికి.

 
অৰ্থানুবাদ ছুৰা: আল-বাক্বাৰাহ
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

তাফছীৰ চেণ্টাৰ ফৰ কোৰানিক ষ্টাডিজৰ ফালৰ পৰা প্ৰচাৰিত।

বন্ধ