Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ


অৰ্থানুবাদ ছুৰা: আল-বাক্বাৰাহ   আয়াত:
حٰفِظُوْا عَلَی الصَّلَوٰتِ وَالصَّلٰوةِ الْوُسْطٰی ۗ— وَقُوْمُوْا لِلّٰهِ قٰنِتِیْنَ ۟
మీరు నమాజులను అల్లాహ్ ఆదేశమునకు అనుగుణంగా పరిపూర్ణంగా పాటిస్తూ వాటిని కాపాడుకోండి. మరియు మీరు నమాజుల మధ్య ఉన్న మాధ్యమిక నమాజును కాపాడుకోండి,అది అసర్ నమాజు. మరియు మీరు మీ నమాజులలో అల్లాహ్ కొరకు వినయవిధేయతతో,అణుకువతో నిలబడండి.
আৰবী তাফছীৰসমূহ:
فَاِنْ خِفْتُمْ فَرِجَالًا اَوْ رُكْبَانًا ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ فَاذْكُرُوا اللّٰهَ كَمَا عَلَّمَكُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ ۟
ఒక వేళ శతృవు వలన,అటువంటిదే ఏదైన మూలంగా మీరు భయాందోళనలకు గురై మీరు దానిని (నమాజును) పరిపూర్ణంగా పాటించలేకపోతే నడుస్తూ లేదా ఒంటెపై,గుర్రంపై,అలాంటిదే దేనిపైన స్వారీ చేస్తూ లేదా మీకు సౌలభ్యమైన ఏ విధంగానైన నమాజును పాటించండి. మీ నుండి భయాందోళనలు దూరమైనప్పుడు మీరు అల్లాహ్ ను వివిధరకాలుగా స్మరించండి. అందులో నుంచి నమాజు, దానిని పరిపూర్ణంగా చేయండి, ఏవిధంగానైతే సన్మార్గం గురించి,వెలుగు గురించి మీకు తెలియని జ్ఞానమును ఆయన మీకు తెలియజేశాడో.
আৰবী তাফছীৰসমূহ:
وَالَّذِیْنَ یُتَوَفَّوْنَ مِنْكُمْ وَیَذَرُوْنَ اَزْوَاجًا ۖۚ— وَّصِیَّةً لِّاَزْوَاجِهِمْ مَّتَاعًا اِلَی الْحَوْلِ غَیْرَ اِخْرَاجٍ ۚ— فَاِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْ مَا فَعَلْنَ فِیْۤ اَنْفُسِهِنَّ مِنْ مَّعْرُوْفٍ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟
మీలో నుంచి మరణించి తమ వెనుక భార్యలను వదిలి వెళ్ళే వారు వారు (భార్యలు)నివాసము,భరణం ద్వారా పూర్తి ఒక సంవత్సరం లబ్ది పొందుతారని మీ వారసులు వారిని బలవంతాన వారికి చెందవలసిన దాని నుండి వెళ్ళగొట్ట కూడదని వారి కొరకు వీలునామ వ్రాయటం వారిపై (భర్తలపై) బాధ్యత. మృతుని కొరకు పూర్తి చేయాలి. ఒక వేళ వారు సంవత్సరం పూర్తవకముందే తమ తరుపు నుండి బయటకు వెళ్ళి పోతే వారు తమ స్వయాన అలంకరణ చేసుకుంటే,సువాసన పూసుకుంటే మీపై,వారిపై ఎటువంటి దోషం లేదు.అల్లాహ్ సర్వాధిక్యుడు,ఆయనపై ఎవరూ ఆధిక్యతను చూపలేరు. తన కార్యనిర్వహణలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు చాలామంది ఈ వాఖ్యములో ఉన్న ఆదేశము '' మీలో ఎవరయినా మరణించి వారు భార్యలను వదిలి పోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకూ తమనుతాము గడువులో ఆపుకోవాలి '' ( సూరతుల్ బఖ్రా-234 ) అన్న ఆయత్ ద్వారా రద్దు పరచబడినదని తెలిపారు.
আৰবী তাফছীৰসমূহ:
وَلِلْمُطَلَّقٰتِ مَتَاعٌ بِالْمَعْرُوْفِ ؕ— حَقًّا عَلَی الْمُتَّقِیْنَ ۟
విడాకులివ్వబడిన స్త్రీలకు విడాకుల వలన విరిగిన మనసులను కలపటానికి ప్రయోజనకరమైన వస్తువు దుస్తులు,ధనము,ఇంకా ఏదైన వస్తువును ఇవ్వటం వారి హక్కు,దాని ద్వారా వారు ప్రయోజనం చెందాలి. సమాజమునకు అనుకూలంగా భర్త స్థితిని బట్టి అతను ధనికుడా లేదా పేద వాడా చూడాలి. ఈ ఆదేశం అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటున్న దైవభీతి కలవారి పై స్థిరమైన హక్కు.
আৰবী তাফছীৰসমূহ:
كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟۠
ఓ విశ్వాసపరులారా మునుపటి ప్రకటన లాగానే తన నిభందనలు,తన ఆదేశాలు కలిగిన ఆయతులను మీరు అర్ధం చేసుకుని వాటి ప్రకారంగా ఆచరిస్తారని మీ కొరకు వివరిస్తున్నాడు. దాని వలన మీరు ఇహపరాల్లో మేలును పొందగలుగుతారు.
আৰবী তাফছীৰসমূহ:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ خَرَجُوْا مِنْ دِیَارِهِمْ وَهُمْ اُلُوْفٌ حَذَرَ الْمَوْتِ ۪— فَقَالَ لَهُمُ اللّٰهُ مُوْتُوْا ۫— ثُمَّ اَحْیَاهُمْ ؕ— اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
ఓ ప్రవక్త ప్లేగు వ్యాధి లేదా అటువంటిదేదో కారణం చేత మరణమునకు భయపడి చాలా మంది తమ ఇండ్ల నుండి బయటకు వచ్చేసిన వారి సమాచారము మీకు చేరలేదా,వారు ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక వర్గం. అల్లాహ్ వారితో చనిపోమని ఆదేశించాడు,వారు చనిపోయారు. ప్రతీ అధికారం తన చేతిలో ఉన్నదని,వారికి తమకు లాభం చేసుకోవటానికి,నష్టం చేసుకోవటానికి ఎటువంటి అధికారం లేదు అని తెలియపరచటానికి మరల వారిని బ్రతికింపజేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజలపై ప్రసాదించే వాడును,దయ చూపే వాడును. కాని చాలా మంది అల్లాహ్ కి ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకోరు.
আৰবী তাফছীৰসমূহ:
وَقَاتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ ధర్మానికి సహాయంగా,ఆయన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చటానికి అల్లాహ్ శతృవులతో పోరాడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ మాటలను వింటున్నాడని,మీ ఉద్దేశాలను,మీ ఆచరణలను తెలుసుకుంటాడని ,వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని మీరు తెలుసుకోండి.
আৰবী তাফছীৰসমূহ:
مَنْ ذَا الَّذِیْ یُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَیُضٰعِفَهٗ لَهٗۤ اَضْعَافًا كَثِیْرَةً ؕ— وَاللّٰهُ یَقْبِضُ وَیَبْصُۜطُ ۪— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟
రుణం ఇచ్చే వారి కార్యం చేసేవాడు ఎవడైన ఉన్నాడా,అతడు తన సంపదను మంచి ఉద్దేశంతో,సహృదయంతో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తాడు,అది ఎన్నోరెట్లు అధికం అయ్యి అతని వద్దకు చేరుతుంది. మరియు అల్లాహ్ ఉపాధిని,ఆరోగ్యమును ఇతరత్రా వాటిని కుదించి వేస్తాడు,తన వివేకముతో,తన న్యాయముతో వాటిని విస్తరింపజేస్తాడు. ఆయన ఒక్కడి వైపే పరలోకంలో మీరు మరలింపబడుతారు. అతడు మీకు కర్మల ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
আৰবী তাফছীৰসমূহ:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الحث على المحافظة على الصلاة وأدائها تامة الأركان والشروط، فإن شق عليه صلَّى على ما تيسر له من الحال.
నమాజును దాని పూర్తి భాగాలతో,షరతులతో పాటించి రక్షించటం పై ప్రోత్సాహం,వాటిని పాటించటంలో ఇబ్బందిగా ఉంటే స్థితిని బట్టి సౌలభ్యమైన పద్దతిలో నమాజును పాటించటం.

• رحمة الله تعالى بعباده ظاهرة، فقد بين لهم آياته أتم بيان للإفادة منها.
అల్లాహ్ తన ఆయతులను వాటి ద్వారా లబ్ది పొందటం కొరకు తన దాసులకు పూర్తిగా వివరించి వారిపై ప్రత్యక్షంగా కరుణించాడు.

• أن الله تعالى قد يبتلي بعض عباده فيضيِّق عليهم الرزق، ويبتلي آخرين بسعة الرزق، وله في ذلك الحكمة البالغة.
నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి కొంత మంది ఆహారోపాధిని కుదించి పరీక్షిస్తాడు. మరి కొందరి ఆహారోపాధిని విస్తరింపజేసి పరీక్షిస్తాడు. అందులో ఆయన గొప్ప జ్ఞానం ఉన్నది.

 
অৰ্থানুবাদ ছুৰা: আল-বাক্বাৰাহ
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

তাফছীৰ চেণ্টাৰ ফৰ কোৰানিক ষ্টাডিজৰ ফালৰ পৰা প্ৰচাৰিত।

বন্ধ