Check out the new design

কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - আল-কুরআনুল কারীমের সংক্ষিপ্ত তাফসীরের তেলেগু ভাষায় অনুবাদ * - অনুবাদসমূহের সূচী


অর্থসমূহের অনুবাদ সূরা: আন-নাহল   আয়াত:
اَلَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ زِدْنٰهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوْا یُفْسِدُوْنَ ۟
ఎవరైతే అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఇతరులను అల్లాహ్ మార్గము నుండి మరల్చి వేస్తారో వారిని వారి చెడు వలన,ఇతరులను అపమార్గమునకు లోను చేసి చెడును ప్రభలించటం వలన వారి అవిశ్వాసము వలన అర్హులైన వారికి మేము శిక్షపై శిక్షను అధికం చేస్తాము.
আরবি তাফসীরসমূহ:
وَیَوْمَ نَبْعَثُ فِیْ كُلِّ اُمَّةٍ شَهِیْدًا عَلَیْهِمْ مِّنْ اَنْفُسِهِمْ وَجِئْنَا بِكَ شَهِیْدًا عَلٰی هٰۤؤُلَآءِ ؕ— وَنَزَّلْنَا عَلَیْكَ الْكِتٰبَ تِبْیَانًا لِّكُلِّ شَیْءٍ وَّهُدًی وَّرَحْمَةً وَّبُشْرٰی لِلْمُسْلِمِیْنَ ۟۠
ఓ ప్రవక్తా ఒక సారి గుర్తు చేసుకోండి ఆ రోజుని ఏ రోజునైతే మేము ప్రతీ జాతిలో, వారిపై వారు దేనిపైనైతే ఉండేవారో అవిశ్వాసము లేదా విశ్వాసము గురించి సాక్ష్యం పలికే ఒక ప్రవక్తను లేపి నిలబెడుతాము. ఆ ప్రవక్త వారి కోవకు చెందిన వాడై,వారి భాషను మాట్లాడే వాడై ఉంటాడు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని జాతుల వారందరిపై సాక్ష్యం పలికే వాడిగా తీసుకుని వస్తాము. మరియు వారికి హలాల్,హరాం, ప్రతిఫలం,శిక్ష వేరేవి స్పష్టత అవసరమైన వాటన్నింటి స్పష్టత ఇవ్వటానికి మేము మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరియు మేము దాన్ని ప్రజలకి సత్యం వైపునకు మార్గదర్శకముగా,దానిపై విశ్వాసమును కనబరచి అందులో ఉన్న వాటిని ఆచరించిన వారికి కారుణ్యంగా,శాస్వత అనుగ్రహాల కోసం నిరీక్షించటం ద్వారా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారికి శుభవార్తనిచ్చేదానిగా అవతరింపజేశాము.
আরবি তাফসীরসমূহ:
اِنَّ اللّٰهَ یَاْمُرُ بِالْعَدْلِ وَالْاِحْسَانِ وَاِیْتَآئِ ذِی الْقُرْبٰی وَیَنْهٰی عَنِ الْفَحْشَآءِ وَالْمُنْكَرِ وَالْبَغْیِ ۚ— یَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకు న్యాయం చేయమని,దాసుడు అల్లాహ్ హక్కులను,దాసుల హక్కులను నెరవేర్చమని,ఆదేశం విషయంలో ప్రాధాన్యతనివ్వటం అవసరం ఉన్న చోట సత్యముతో మాత్రమే ఒకరిని ఒకరిపై ప్రాధాన్యతనివ్వమని ఆదేశిస్తున్నాడు. మరియు దాసుడు తనపై తప్పనిసరికాని(దాన్ని) స్వచ్ఛందంగా ఖర్చు చేయటం,దుర్మార్గుడుని క్షమించటం లాంటి కార్యాలను ప్రాధాన్యతనివ్వటంలో మంచిగా చేయమని ఆదేశిస్తున్నాడు. మరియు బంధువులకు అవసరమైన వాటిని ఇవ్వమని ఆదేశిస్తున్నాడు. మరియు అశ్లీల మాటల్లాంటి దుర్భాషలాడటం నుండి,వ్యభిచారము లాంటి దుష్కార్యమునకు పాల్పడటం నుండి వారిస్తున్నాడు.మరియు ధర్మం ఇష్టపడని ప్రతీ పాపకార్యము నుండి వారిస్తున్నాడు. మరియు ప్రజలపై దుర్మార్గమునకు పాల్పడటం,అహంకారమును చూపటం నుండి వారిస్తున్నాడు.ఈ ఆయతులో మీకు ఆదేశించిన వాటి ద్వారా, మీకు వారించిన వాటి ద్వారా ,హితోపదేశం చేసిన వాటి ద్వారా మీరు గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తూ అల్లాహ్ మీకు హితోపదేశం చేస్తున్నాడు.
আরবি তাফসীরসমূহ:
وَاَوْفُوْا بِعَهْدِ اللّٰهِ اِذَا عٰهَدْتُّمْ وَلَا تَنْقُضُوا الْاَیْمَانَ بَعْدَ تَوْكِیْدِهَا وَقَدْ جَعَلْتُمُ اللّٰهَ عَلَیْكُمْ كَفِیْلًا ؕ— اِنَّ اللّٰهَ یَعْلَمُ مَا تَفْعَلُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ కు చేసిన లేదా ప్రజలకు చేసిన ప్రతీ వాగ్ధానమును నెరవేర్చండి. మరియు మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి దృఢపరచిన తరువాత మీ ప్రమాణాలను భంగపరచకండి. వాస్తవానికి మీరు చేసిన ప్రమాణాలను నెరవేర్చే విషయంలో మీరు అల్లాహ్ ను మీపై సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేస్తున్నది అల్లాహ్ కి తెలుసు. ఆయనపై అందులో నుండి ఏదీ గోప్యంగా లేదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
আরবি তাফসীরসমূহ:
وَلَا تَكُوْنُوْا كَالَّتِیْ نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قُوَّةٍ اَنْكَاثًا ؕ— تَتَّخِذُوْنَ اَیْمَانَكُمْ دَخَلًا بَیْنَكُمْ اَنْ تَكُوْنَ اُمَّةٌ هِیَ اَرْبٰی مِنْ اُمَّةٍ ؕ— اِنَّمَا یَبْلُوْكُمُ اللّٰهُ بِهٖ ؕ— وَلَیُبَیِّنَنَّ لَكُمْ یَوْمَ الْقِیٰمَةِ مَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
మరియు మీరు ప్రమాణాలను భంగపరచి ఆ ముర్ఖ స్త్రీ వలే బుద్ధి లేని మూర్ఖులు వలే కాకండి. ఎవరైతే తన ఉన్నిని లేదా తన దూదిని వడకటంలో అలసిపోయి దాన్ని వడకటమును బిగువుగా చేసి ఆ తరువాత దాన్ని త్రెంచి దాన్ని వడకక ముందు ఎలా ఉందో అలా వదులుగా చేసివేసింది. అప్పుడు ఆమే దాన్ని వడకటంలో,త్రెంచి వేయటంలో అలిసిపోయింది. ఆమె ఆశించినది పొందలేదు. మీరు మీ ప్రమాణాలను మోసంగా చేసుకుని వాటి ద్వారా మీ లోనుండి ఒకరినొకరు మీ వర్గము మీ శతృవుల వర్గము కన్న ఎక్కువ అధికము,బలవంతులు అవటానికి మోసగించుకుంటున్నారు. అల్లాహ్ ప్రమాణాలను పరిపూర్ణం చేసే విషయంలో మీరు వాటిని పూర్తి చేస్తారా లేదా వాటిని భంగపరుస్తారా ? అని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మరియు అల్లాహ్ మీరు ఇహలోకంలో విభేధించుకున్న వాటిని ప్రళయదినాన మీకు తప్పకుండా స్పష్టపరుస్తాడు. అప్పుడు తప్పు చేసిన వాడి నుండి సరైన వాడిని,అసత్యపరుడి నుండి నిజాయితీపరుడిని స్పష్టపరుస్తాడు.
আরবি তাফসীরসমূহ:
وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَكُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ یُّضِلُّ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَلَتُسْـَٔلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
మరియు ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మిమ్మల్ని సత్యంపై కలిసి ఉండేటట్లుగా ఒకే జాతిగా చేసేవాడు. కాని పరిశుద్ధుడైన ఆయన తాను తలచుకున్న వాడిని తన న్యాయముతో సత్యము నుండి,ప్రమాణాలను పూర్తి చేయటం నుండి పరాభవమునకు లోను చేసి అపమార్గమునకు గురి చేస్తాడు. మరియు తాను కోరుకున్న వాడిని తన అనుగ్రహము ద్వారా దాని సౌభాగ్యమును కలిగిస్తాడు. మీరు ఇహలోకములో ఏమి చేస్తుండేవారో వాటి గురించి ప్రళయదినాన తప్పకుండా ప్రశ్నించబడుతారు.
আরবি তাফসীরসমূহ:
এই পৃষ্ঠার আয়াতগুলোর কতক ফায়দা:
• للكفار الذين يصدون عن سبيل الله عذاب مضاعف بسبب إفسادهم في الدنيا بالكفر والمعصية.
అవిశ్వాసము,పాపకార్యముల ద్వారా ఇహలోకములో చెడును ప్రభలించటం వలన అల్లాహ్ మార్గము నుండి నిరోధించే అవిశ్వాసపరుల కొరకు రెట్టింపు శిక్ష ఉంటుంది.

• لا تخلو الأرض من أهل الصلاح والعلم، وهم أئمة الهدى خلفاء الأنبياء، والعلماء حفظة شرائع الأنبياء.
మీరు ప్రావీణ్యత,జ్ఞానం కలవారి నుండి భూమిని ఖాళీ చేయకండి. వాస్తవానికి వారు మార్గదర్శకత్వము యొక్క నాయకులు,ప్రవక్తల ప్రతినిధులు. ధార్మిక విధ్వాంసులు ప్రవక్తల శాసనాల రక్షకులు.

• حدّدت هذه الآيات دعائم المجتمع المسلم في الحياة الخاصة والعامة للفرد والجماعة والدولة.
ఈ ఆయతులు వ్యక్తికి,సమాజమునకు,ప్రభుత్వమునకు ప్రత్యేక,సాధారణ జీవితములో ముస్లిం సమాజము యొక్క మూల స్థంభాలను నిర్ణయిస్తున్నాయి.

• النهي عن الرشوة وأخذ الأموال على نقض العهد.
ఒప్పందమును భంగం చేయటానికి లంచం తీసుకోవటం,సంపదలను తీసుకోవటం నుండి వారింపు.

 
অর্থসমূহের অনুবাদ সূরা: আন-নাহল
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - আল-কুরআনুল কারীমের সংক্ষিপ্ত তাফসীরের তেলেগু ভাষায় অনুবাদ - অনুবাদসমূহের সূচী

মারকাযু তাফসীর লিদ-দিরাসাতিল কুরআনিয়্যাহ থেকে প্রকাশিত।

বন্ধ