Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Sura: Junus   Ajet:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیَاتُنَا بَیِّنٰتٍ ۙ— قَالَ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا ائْتِ بِقُرْاٰنٍ غَیْرِ هٰذَاۤ اَوْ بَدِّلْهُ ؕ— قُلْ مَا یَكُوْنُ لِیْۤ اَنْ اُبَدِّلَهٗ مِنْ تِلْقَآئِ نَفْسِیْ ۚ— اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤی اِلَیَّ ۚ— اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
అల్లాహ్ ఏకత్వమును నిరూపించే స్పష్టమైన ఖుర్ఆన్ ఆయతులను వారి ముందట పఠించబడినప్పుడు మరణాంతరం లేపబడటమును నిరాకరించిన వారు,ఎవరైతే పుణ్యాన్ని ఆశించరో,శిక్ష నుండి భయపడరో వారు ఇలా పలికారు : ఓ ముహమ్మద్ మీరు ఈ ఖుర్ఆన్ ఏదైతే విగ్రహారాధనను దూషిస్తుందో అది కాకుండా వేరే ఖుర్ఆన్ ను లేదా వేరేది ఇందులో ఉన్న కొన్నింటిని లేదా పూర్తి వాటిని రద్దు పరచి మా కోరికలకు అణుగుణంగా ఉండేది తీసుకుని రా.ఓ ప్రవక్తా వారికి ఇలా తెలియపరచండి : నేను దాన్ని మార్చటం సరికాదు.మరియు మొదటి దాన్ని కాకుండా వేరే దానిని నేను తీసుకుని రాలేను.కాని ఒక్కడైన అల్లాహ్ ఆయనే అందులో నుంచి తాను తలచుకున్న దాన్ని మార్చి వేస్తాడు.అల్లాహ్ నా వైపు అవతరింపజేసిన దైవవాణి ని మాత్రమే నేను అనుసరిస్తాను.ఒక వేళ నేను మీరు కోరిన దాన్ని స్వీకరించి అల్లాహ్ కు అవిధేయత చూపితే నేను గొప్ప దిన శిక్ష నుండి భయపడుతున్నాను.అది ప్రళయదినము.
Tefsiri na arapskom jeziku:
قُلْ لَّوْ شَآءَ اللّٰهُ مَا تَلَوْتُهٗ عَلَیْكُمْ وَلَاۤ اَدْرٰىكُمْ بِهٖ ۖؗۗ— فَقَدْ لَبِثْتُ فِیْكُمْ عُمُرًا مِّنْ قَبْلِهٖ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ అల్లాహ్ నేను మీపై ఖుర్ఆన్ చదివి వినిపించకూడదని అనుకుంటే నేను దాన్ని మీ ముందు చదివే వాడిని కాదు.మరియు దానిని మీకు చేరవేసే వాడిని కాదు.మరియు ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే నా నాలిక (నోటి) ద్వారా మీకు ఖుర్ఆన్ తెలియపరచేవాడు కాదు.వాస్తవానికి నేను మీ మధ్యన చాలా కాలం నివాసమున్నాను.అది నలభై సంవత్సరములు.నేను చదవలేను,వ్రాయలేను.మరియు దీన్ని నేను కోరలేదు,దాని గురించి వెతకలేదు.నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది అల్లాహ్ వద్ద నుండి అని దానిలో (దానిని తీసుకుని రావటంలో) నాకు ఎటువంటి సంబంధం లేదని మీ బుద్ధులు అంగీకరించవా ?.
Tefsiri na arapskom jeziku:
فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰیٰتِهٖ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الْمُجْرِمُوْنَ ۟
అల్లాహ్ పై అబద్దమును కల్పించేవాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు.అలాంటప్పుడు ఆయనపై అబద్దమును కల్పిస్తూ నాకు ఖుర్ఆన్ ను మార్చటం ఎలా కుదురుతుంది.నిశ్చయంగా అల్లాహ్ పై అబద్దమును కల్పిస్తూ ఆయన హద్దులను అతిక్రమించే వారు తాము కోరుకున్నదాన్ని పొందటంలో సాఫల్యం చెందలేరు.
Tefsiri na arapskom jeziku:
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَضُرُّهُمْ وَلَا یَنْفَعُهُمْ وَیَقُوْلُوْنَ هٰۤؤُلَآءِ شُفَعَآؤُنَا عِنْدَ اللّٰهِ ؕ— قُلْ اَتُنَبِّـُٔوْنَ اللّٰهَ بِمَا لَا یَعْلَمُ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟
ముష్రికులు లాభం చేయలేని,నష్టం కలిగించలేని ఆరోపిత దైవాలను అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారు.సత్య ఆరాధ్యదైవము తాను కోరుకున్నప్పుడు లాభం చేకూరుస్తాడు,నష్టం కలిగిస్తాడు.మరియు వారు తమ ఆరాధ్య దైవాల గురించి ఇలా పలికేవారు : వీరందరూ అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేసే మధ్యవర్తులు.వీరు మా పాపముల వలన మమ్మల్ని శిక్షించరు.ఓ ప్రవక్త వారితో ఇలా పలకండి : ఏమీ మీరు అంతా తెలిసిన అల్లాహ్ కి ఆయనకు సాటి ఉన్నారని తెలియపరుస్తున్నారా ?.మరియు ఆయన కొరకు ఆకాశముల్లో,భూమిలో సాటి ఉన్నారని ఆయనకు తెలియదా.ముష్రికులు పలుకుతున్న అవాస్తవాలు,అసత్యాల నుండి ఆయన అతీతుడు,పరిశుద్ధుడు.
Tefsiri na arapskom jeziku:
وَمَا كَانَ النَّاسُ اِلَّاۤ اُمَّةً وَّاحِدَةً فَاخْتَلَفُوْا ؕ— وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِیَ بَیْنَهُمْ فِیْمَا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
ప్రజలందరూ మువహ్హిదులై (ఒకే దైవ ఆరాధకులుగా) విశ్వాసపరులై ఒకే వర్గముగా ఉండేవారు.వారిలోంచి కొందరు విశ్వాసపరులుగా ఉండిపోయారు,వారిలోంచి కొందరు అవిశ్వాసపరులైపోయారు.అల్లాహ్ వారు విభేదించుకున్న విషయాల గురించి ఇహలోకములో వారి మధ్యన తీర్పు ఇవ్వడని ప్రళయదినాన ఆ విషయంలో వారి మధ్యన తీర్పు ఇస్తాడని అల్లాహ్ నిర్ణయం అయిపోకుండా ఉంటే ఇహలోకములోనే వారు విభేధించుకున్న విషయంలో వారి మధ్యన తీర్పు ఇచ్చేవాడు.అప్పుడు మార్గభ్రష్టుడు నుండి సన్మార్గముపై ఉన్న వాడు స్పష్టమయ్యేవాడు.
Tefsiri na arapskom jeziku:
وَیَقُوْلُوْنَ لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ۚ— فَقُلْ اِنَّمَا الْغَیْبُ لِلّٰهِ فَانْتَظِرُوْا ۚ— اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ ۟۠
ముష్రికులు ఇలా అనేవారు : ఎందుకని ముహమ్మద్ పై ఆయన నిజాయితీని నిరూపించే ఏదైన వాఖ్యము (ఆయతు) ఆయన ప్రభువు తరపు నుండి అవతరింపబడలేదు ?.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఆయతుల అవతరణ అగోచరము అల్లాహ్ తన జ్ఞానముతో ప్రత్యేకించుకున్నాడు.కాబట్టి మీరు సూచించిన ఆలోచనాపరమైన ఆయతుల కోసం మీరు నిరీక్షించండి.నిశ్చయంగా నేను కూడా మీతోపాటు వాటి కోసం నిరీక్షించే వారిలోంచి అవుతాను.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• عظم الافتراء على الله والكذب عليه وتحريف كلامه كما فعل اليهود بالتوراة.
అల్లాహ్ పై (మాటలు) కల్పించటం,ఆయన పై అబద్దమును అపాదించటం ఆయన వాక్కును మార్చివేయటం మహా పాపము.ఏ విదంగానైతే యూదులు తౌరాత్ తో చేసేవారో .

• النفع والضر بيد الله عز وجل وحده دون ما سواه.
లాభము నష్టము ఒక్కడైన అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నవి.

• بطلان قول المشركين بأن آلهتهم تشفع لهم عند الله.
అల్లాహ్ వద్ద తమ కొరకు తమ ఆరాధ్యదైవాలు సిఫారసు చేస్తాయి అన్న ముష్రికుల మాట అవాస్తవము.

• اتباع الهوى والاختلاف على الدين هو سبب الفرقة.
మనోవాంచనలను అనుసరించటం,ధర్మ విషయాల్లో విభేధించుకోవటం విభజనకు కారణం.

 
Prijevod značenja Sura: Junus
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje