Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Sura: Jusuf   Ajet:
فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ اَرْسَلَتْ اِلَیْهِنَّ وَاَعْتَدَتْ لَهُنَّ مُتَّكَاً وَّاٰتَتْ كُلَّ وَاحِدَةٍ مِّنْهُنَّ سِكِّیْنًا وَّقَالَتِ اخْرُجْ عَلَیْهِنَّ ۚ— فَلَمَّا رَاَیْنَهٗۤ اَكْبَرْنَهٗ وَقَطَّعْنَ اَیْدِیَهُنَّ ؗ— وَقُلْنَ حَاشَ لِلّٰهِ مَا هٰذَا بَشَرًا ؕ— اِنْ هٰذَاۤ اِلَّا مَلَكٌ كَرِیْمٌ ۟
అజీజు భార్య తనను వారి తప్పుబట్టటమును,ఆమెపైనే వారి నిందారోపణలను విని వారు యూసుఫ్ ని చూసి ఆమెను నిర్దోషిగా భావించటానికి వారిని పిలిపించింది.మరియు పరుపులు,దిండులు కల ఒక ప్రదేశమును ఆమె వారి కొరకు సిద్ధం చేసింది.మరియు పిలవబడిన ప్రతి ఒక్కరికి ఆహారమును కోయటానికి ఒక కత్తిని ఇచ్చింది.మరియు ఆమె యూసుఫ్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించింది : నీవు వారి ముందుకు రా.వారు యూసుఫ్ ను చూసినప్పుడు ఆయన్ను చాలా గొప్పగా భావించారు.మరియు ఆయన అందమును చూసి ఆశ్చర్యపోయారు.మరియు వారు అతని అందమునకు ముగ్దులైపోయారు.ఆయనపై ముగ్దులవటము యొక్క తీవ్రత వలన ఆహారమును కోయటం కొరకు సిద్ధం చేసి ఉన్న కత్తులతో వారు తమ చేతులను గాయపరుచుకున్నారు. మరియు వారు ఇలా పలికారు : అల్లాహ్ పరిశుద్ధుడు ఈ పిల్లవాడు మానవుడు కాదు.అతనిలో ఉన్న అందం మనిషిలో ఉండదు.అతడు గౌరవోన్నతులైన దైవదూతల్లోంచి ఒక దైవదూత మాత్రమే.
Tefsiri na arapskom jeziku:
قَالَتْ فَذٰلِكُنَّ الَّذِیْ لُمْتُنَّنِیْ فِیْهِ ؕ— وَلَقَدْ رَاوَدْتُّهٗ عَنْ نَّفْسِهٖ فَاسْتَعْصَمَ ؕ— وَلَىِٕنْ لَّمْ یَفْعَلْ مَاۤ اٰمُرُهٗ لَیُسْجَنَنَّ وَلَیَكُوْنًا مِّنَ الصّٰغِرِیْنَ ۟
అజీజ్ భార్య వారికి జరిగినది చూసి ఇలా పలికింది : ఇతడే ఆ యువకుడు ఇతని ప్రేమ కారణం చేతనే మీరు నన్ను అపనిందపాలు చేసింది.వాస్తవానికి నేను అతన్ని కోరాను.మరియు నేను అతన్ని వశపరచుకోవటానికి కుట్ర పన్నాను.అయితే అతను ఆగిపోయాడు.ఒక వేళ అతను భవిష్యతులో నేను కోరినది చేయకపోతే తప్పకుండా అతను చెరసాలపాలవుతాడు.మరియు అతను తప్పకుండా అవమానానికి గురైన వారిలో అయిపోతాడు.
Tefsiri na arapskom jeziku:
قَالَ رَبِّ السِّجْنُ اَحَبُّ اِلَیَّ مِمَّا یَدْعُوْنَنِیْۤ اِلَیْهِ ۚ— وَاِلَّا تَصْرِفْ عَنِّیْ كَیْدَهُنَّ اَصْبُ اِلَیْهِنَّ وَاَكُنْ مِّنَ الْجٰهِلِیْنَ ۟
యూసుఫ్ అలైహిస్సలాం తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా వారు నన్ను పిలుస్తున్న అశ్లీల కార్యము కన్న నీవు నాకు చూపించిన చెరసాలయే నాకు చాలా ఇష్టం.వారి ఎత్తుగడలను నాకు బహిర్గతం చేసి ఉండకపోతే నేను వారివైపు మొగ్గే వాడిని.మరియు ఒక వేళ నేను వారి వైపు మొగ్గి వారు నాతో కోరిన విషయంలో వారి మాట విని ఉంటే నేను అజ్ఞానుల్లో నుంచి అయిపోయేవాడిని.
Tefsiri na arapskom jeziku:
فَاسْتَجَابَ لَهٗ رَبُّهٗ فَصَرَفَ عَنْهُ كَیْدَهُنَّ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
అప్పుడు అల్లాహ్ ఆయన దుఆను స్వీకరించాడు.అజీజు భార్య కుట్రను,నగర స్త్రీల కుట్రను ఆయన నుండి తప్పించాడు.నిశ్చయంగా ఆయన పరిశుద్ధుడు మరియు మహోన్నతుడు యూసుఫ్ యొక్క దుఆను వినేవాడు.మరియు ప్రతి వేడుకునే వాడి దుఆని వినేవాడు.అతని స్థితిని మరియు ఇతరుల స్థితిని తెలుసుకునేవాడు.
Tefsiri na arapskom jeziku:
ثُمَّ بَدَا لَهُمْ مِّنْ بَعْدِ مَا رَاَوُا الْاٰیٰتِ لَیَسْجُنُنَّهٗ حَتّٰی حِیْنٍ ۟۠
ఆ తరువాత ఎప్పుడైతే అజీజు,అతని జాతి వారు అతని నిర్దోషత్వమును నిరూపించే ఆధారాలను చూశారో అపనింద భహిర్గతం కానంత వరకు నిర్ణీతం కాని కాలం వరకు అతన్ని చెరసాల్లో బంధించాలని వారి సలహా అయింది.
Tefsiri na arapskom jeziku:
وَدَخَلَ مَعَهُ السِّجْنَ فَتَیٰنِ ؕ— قَالَ اَحَدُهُمَاۤ اِنِّیْۤ اَرٰىنِیْۤ اَعْصِرُ خَمْرًا ۚ— وَقَالَ الْاٰخَرُ اِنِّیْۤ اَرٰىنِیْۤ اَحْمِلُ فَوْقَ رَاْسِیْ خُبْزًا تَاْكُلُ الطَّیْرُ مِنْهُ ؕ— نَبِّئْنَا بِتَاْوِیْلِهٖ ۚ— اِنَّا نَرٰىكَ مِنَ الْمُحْسِنِیْنَ ۟
అప్పుడు వారు అతన్ని చెరసాలలో బంధించారు.మరియు ఆయనతోపాటు ఇద్దరు యువకులు చెరసాలలో ప్రవేశించారు.ఇద్దరి వ్యక్తుల్లోంచి ఒకడు యూసుఫ్ తో ఇలా అన్నాడు : నిశ్చయంగా నేను సారాయి చేయటానికి ద్రాక్ష పండ్లను పిండుతున్నాను.రెండో వ్యక్తి ఇలా పలికాడు : నిశ్చయంగా నేను నా తలపై రొట్టెను ఎత్తుకుని ఉన్నాను అందులో నుంచి పక్షులు తింటున్నవి.ఓ యూసుఫ్ మేము చూసిన దానికి వివరణను మాకు తెలుపు.నిశ్చయంగా మేము నిన్ను ఉపకారము చేసే వారిలోంచి భావిస్తున్నాము.
Tefsiri na arapskom jeziku:
قَالَ لَا یَاْتِیْكُمَا طَعَامٌ تُرْزَقٰنِهٖۤ اِلَّا نَبَّاْتُكُمَا بِتَاْوِیْلِهٖ قَبْلَ اَنْ یَّاْتِیَكُمَا ؕ— ذٰلِكُمَا مِمَّا عَلَّمَنِیْ رَبِّیْ ؕ— اِنِّیْ تَرَكْتُ مِلَّةَ قَوْمٍ لَّا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ ۟
యూసుఫ్ అలైహిస్సలాం ఇలా పలికారు : రాజు తరపు నుండి లేదా ఇతరుని తరపు నుండి మీ పై జారీ అయిన భోజనం మీ వద్దకు రాలేదు కాని నేను అది మీ వద్దకు రాక ముందే నేను దాని వాస్తవమును (కల యొక్క వాస్తవమును),అది ఎలా ఉంటుందో మీకు స్పష్టపరుస్తాను.ఆ తాత్పర్యము నా ప్రభువు నాకు నేర్పించిన విధ్యల్లోంచిది దాన్నే నేను నేర్చుకున్నాను.అది జ్యోతిష్యములో నుంచి కాదు మరియు నక్షత్ర శాస్త్రము కాదు.నిశ్చయంగా నేను అల్లాహ్ ను విశ్వసించని జనుల వారి ధర్మమును వదిలివేశాను.మరియు వారు పరలోకమును తిరస్కరించారు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• بيان جمال يوسف عليه السلام الذي كان سبب افتتان النساء به.
స్త్రీలు పరవశించటానికి కారణమైన యూసుఫ్ అలైహిస్లాం అందము యొక్క ప్రకటన.

• إيثار يوسف عليه السلام السجن على معصية الله.
అల్లాహ్ పై అవిధేయత చూపటం కన్నా చెరసాలలో వెళ్ళటంపై యూసుఫ్ యొక్క ప్రాధాన్యత ఇవ్వటం.

• من تدبير الله ليوسف عليه السلام ولطفه به تعليمه تأويل الرؤى وجعلها سببًا لخروجه من بلاء السجن.
యూసుఫ్ అలైహిస్సలాంనకు అల్లాహ్ కలల తాత్పర్యమును నేర్పించటం మరియు దాన్ని ఆయనను చెరసాల ఆపద నుండి బయటపడటానికి కారణంగా చేయటం అల్లాహ్ కార్య నిర్వహణ లోనిది మరియ ఆయనపై కరుణించటం లోనిది.

 
Prijevod značenja Sura: Jusuf
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje