Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Sura: En-Nur   Ajet:
رِجَالٌ ۙ— لَّا تُلْهِیْهِمْ تِجَارَةٌ وَّلَا بَیْعٌ عَنْ ذِكْرِ اللّٰهِ وَاِقَامِ الصَّلٰوةِ وَاِیْتَآءِ الزَّكٰوةِ— یَخَافُوْنَ یَوْمًا تَتَقَلَّبُ فِیْهِ الْقُلُوْبُ وَالْاَبْصَارُ ۟ۙ
ప్రజల్లోంచి కొంత మందిని ఏ క్రయ విక్రయాలు వారిని పరిశుద్ధుడైన అల్లాహ్ స్మరణ నుండి ,నమాజును సంపూర్ణ పధ్ధతిలో పాటించటం నుండి,జకాతును దాన్ని ఇవ్వవలసిన చోటు ఇవ్వటం నుండి పరధ్యానంలో పడవేయదు. వారు ప్రళయదినం నుండి భయపడుతారు. ఆ రోజు హృదయములు శిక్ష నుండి విముక్తిపొందే ఆశ మధ్యలో దాని నుండి భయపడటంలో తిరుగుతుంటాయి. మరియు కళ్ళు ఏ వైపు వెళ్ళాలో అందులో తిరుగుతుంటాయి.
Tefsiri na arapskom jeziku:
لِیَجْزِیَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا عَمِلُوْا وَیَزِیْدَهُمْ مِّنْ فَضْلِهٖ ؕ— وَاللّٰهُ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟
వారు చేసిన కర్మలకన్న మంచిగా వారికి అల్లాహ్ పుణ్యమును ప్రసాదించాలని,వారికి వాటికి ప్రతిఫలంగా తన అనుగ్రహంలో నుండి అధికంగా ఇవ్వాలని వారు ఇలా చేశారు. మరియు అల్లాహ్ తాను తలచుకున్న వారికి వారి కర్మలకు తగ్గట్టుగా లెక్క లేనంత ప్రసాదిస్తాడు. అంతే కాదు వారికి వారి కర్మల కన్న రెట్టింపు ప్రసాదిస్తాడు.
Tefsiri na arapskom jeziku:
وَالَّذِیْنَ كَفَرُوْۤا اَعْمَالُهُمْ كَسَرَابٍۭ بِقِیْعَةٍ یَّحْسَبُهُ الظَّمْاٰنُ مَآءً ؕ— حَتّٰۤی اِذَا جَآءَهٗ لَمْ یَجِدْهُ شَیْـًٔا وَّوَجَدَ اللّٰهَ عِنْدَهٗ فَوَفّٰىهُ حِسَابَهٗ ؕ— وَاللّٰهُ سَرِیْعُ الْحِسَابِ ۟ۙ
మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు చేసుకున్న కర్మలు వాటికి ఎటువంటి పుణ్యము ఉండదు. భూమికి పల్లములో ఉన్న ఎండమావులు వలే దాహం కలిగిన వ్యక్తి దాన్ని చూసినప్పుడు దాన్ని నీళ్ళు అని భావించి దాని వద్దకు వస్తాడు. చివరికి దాని వద్దకు వచ్చి దాని దగ్గర నిలబడినప్పుడు ఎటువంటి నీటిని పొందడు. ఇదే విధంగా అవిశ్వాసపరుడు అతని కర్మలు అతనికి ప్రయేజనం చేకూరుస్తాయని భావిస్తాడు. చివరికి అతను మరణించి మరలా లేపబడినప్పుడు అతడు వాటి పుణ్యమును పొందడు. మరియు అతడు తన ప్రభువును తన ముందట పొందుతాడు. అప్పుడు ఆయన అతని కర్మలకు పరిపూర్ణంగా లెక్కతీసుకుంటాడు. మరియు అల్లాహ్ శీఘ్రంగా లెక్క తీసుకునే వాడు.
Tefsiri na arapskom jeziku:
اَوْ كَظُلُمٰتٍ فِیْ بَحْرٍ لُّجِّیٍّ یَّغْشٰىهُ مَوْجٌ مِّنْ فَوْقِهٖ مَوْجٌ مِّنْ فَوْقِهٖ سَحَابٌ ؕ— ظُلُمٰتٌ بَعْضُهَا فَوْقَ بَعْضٍ ؕ— اِذَاۤ اَخْرَجَ یَدَهٗ لَمْ یَكَدْ یَرٰىهَا ؕ— وَمَنْ لَّمْ یَجْعَلِ اللّٰهُ لَهٗ نُوْرًا فَمَا لَهٗ مِنْ نُّوْرٍ ۟۠
లేదా వారి కర్మలు లోతైన సముద్రంలో చీకట్ల వలె ఉంటాయి. దానిపై ఒక అల ఎక్కి ఉంటుంది,ఆ అల పై నుండి వేరొక అల ఉంటుంది. దానిపై నుండి మార్గమును పొందటానికి ఉన్న నక్షత్రములను కప్పివేసే ఒక మేఘం ఉంటుంది. చీకట్లు ఒక దానిపై ఒకటి పేరుకుపోయి ఉంటాయి. ఈ చీకట్లలో వాటిల్లిన వాడు తన చేతిని బయటకు తీసినప్పుడు చీకటి తీవ్రత వలన దాన్ని చూడలేక పోతాడు. ఇదే విధంగా అవిశ్వాసపరుడు కూడా. అతనిపై అజ్ఞానం,సందేహం,గందరగోళం,అతని హృదయంపై ముద్ర యొక్క చీకట్లు ఒక దానిపై ఒకటి పేరుకుపోయాయి. ఎవరికైతే అల్లాహ్ మార్గ భ్రష్టత నుండి సన్మార్గమును,తన గ్రంధం ద్వారా జ్ఞానమును ప్రసాదించడో అతని కొరకు మార్గం పొందటానికి సన్మార్గము గాని,వెలుగును పొందటానికి ఎటువంటి గ్రంధము గాని ఉండవు.
Tefsiri na arapskom jeziku:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یُسَبِّحُ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ وَالطَّیْرُ صٰٓفّٰتٍ ؕ— كُلٌّ قَدْ عَلِمَ صَلَاتَهٗ وَتَسْبِیْحَهٗ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِمَا یَفْعَلُوْنَ ۟
ఓ ప్రవక్తా ఆకాశముల్లో ఉన్నవి అల్లాహ్ పరిశుద్ధతను తెలుపుతున్నవని మరియు భూమిలో ఉన్న ఆయన సృష్టితాలు ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవని మీకు తెలియదా. మరియు పక్షులు గాలిలో తమ రెక్కలను చాచి ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఆ సృష్టితాల్లోంచి ప్రతీ ఒక్కరికీ వారిలో నుండి నమాజును చదివే వారికి అల్లాహ్ నమాజును నేర్పించాడు ఉదా : మనిషి. వారిలో నుండి పరిశుద్ధతను కొనియాడే వారికి పరిశుద్ధతను నేర్పించాడు ఉదా : పక్షులు. వారు చేసే వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Tefsiri na arapskom jeziku:
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَاِلَی اللّٰهِ الْمَصِیْرُ ۟
ఆకాశముల యొక్క అధికారము,భూమి యొక్క అధికారము ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ప్రళయదినాన లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు ఆయన ఒక్కడి వైపే మరలిపోవలసి ఉంది.
Tefsiri na arapskom jeziku:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یُزْجِیْ سَحَابًا ثُمَّ یُؤَلِّفُ بَیْنَهٗ ثُمَّ یَجْعَلُهٗ رُكَامًا فَتَرَی الْوَدْقَ یَخْرُجُ مِنْ خِلٰلِهٖ ۚ— وَیُنَزِّلُ مِنَ السَّمَآءِ مِنْ جِبَالٍ فِیْهَا مِنْ بَرَدٍ فَیُصِیْبُ بِهٖ مَنْ یَّشَآءُ وَیَصْرِفُهٗ عَنْ مَّنْ یَّشَآءُ ؕ— یَكَادُ سَنَا بَرْقِهٖ یَذْهَبُ بِالْاَبْصَارِ ۟ؕ
ఓ ప్రవక్తా అల్లాహ్ మేఘాలను నడుపుతాడని మీకు తెలియదా .ఆ పిదప వాటి కొన్నింటి భాగములను కొన్నింటితో కలిపి వేస్తాడు. ఆ తరువాత వాటిని ఒక దానిపై ఒకటి ఎక్కి గుట్టలాగా ఉండేటట్లు పేరుస్తాడు. అప్పుడు నీవు వర్షాన్ని మేఘముల మధ్య నుండి వెలికి రావటమును చూస్తావు. మరియు ఆయన ఆకాశము వైపు నుండి పెద్దవవటంలో పర్వతాలను పోలిన దట్టమైన మేఘముల నుండి కంకర రాళ్ళ వలే ఘనీభవించిన నీటి ముక్కలను కురిపిస్తాడు. అప్పుడు ఆ వడగండ్లను తన దాసుల్లోంచి ఆయన కోరిన వారికి చేరవేస్తాడు. మరియు ఆయన కోరిన వారి నుండి మరలింపజేస్తాడు. మేఘముల మెరుపు కాంతి దాని తీవ్ర మెరవటం వలన చూపులను తీసుకుని పోయే విధంగా ఉంటుంది.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• موازنة المؤمن بين المشاغل الدنيوية والأعمال الأخروية أمر لازم.
ప్రాపంచిక కార్యాలకి,పరలోక కార్యాలకి మధ్య విశ్వాసపరుడు సమతుల్యం చేయటం అవసరం.

• بطلان عمل الكافر لفقد شرط الإيمان.
విశ్వాసము యొక్క షరతు కోల్పోవటం వలన అవిశ్వాసపరుడి యొక్క కర్మ శూన్యము.

• أن الكافر نشاز من مخلوقات الله المسبِّحة المطيعة.
అవిశ్వాసపరుడు పరిశుద్ధతను కొనియాడే విధేయులైన అల్లాహ్ యొక్క సృష్టితాల్లోంచి అవిధేయుడైన వాడు.

• جميع مراحل المطر من خلق الله وتقديره.
వర్షం యొక్క అన్ని దశలు అల్లాహ్ సృష్టిలోంచివి,ఆయన పర్యాలోచనలోంచివి.

 
Prijevod značenja Sura: En-Nur
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje