Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Sadržaj prijevodā


Prijevod značenja Sura: Sura el-Hudžurat   Ajet:

సూరహ్ అల్ హుజురాత్

Intencije ove sure:
معالجة اللسان وبيان أثره على إيمان الفرد وأخلاق المجتمع.
నాలుక యొక్క చికిత్స మరియు వ్యక్తి యొక్క విశ్వాసం మరియు సమాజం యొక్క నైతికతపై దాని ప్రభావాన్ని చూపించడం.

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُقَدِّمُوْا بَیْنَ یَدَیِ اللّٰهِ وَرَسُوْلِهٖ وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు మాట పరంగా లేదా చేత పరంగా అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ మాటలను వినేవాడును మరియు మీ కార్యాలను తెలుసుకునేవాడును. ఆయన నుండి వాటిలో నుండి ఏదీ తప్పిపోదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tefsiri na arapskom jeziku:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَرْفَعُوْۤا اَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِیِّ وَلَا تَجْهَرُوْا لَهٗ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ اَنْ تَحْبَطَ اَعْمَالُكُمْ وَاَنْتُمْ لَا تَشْعُرُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు ఆయన ప్రవక్తతో క్రమశిక్షణతో వ్యవహరించండి. మరియు ఆయనతో మాట్లాడే సమయంలో మీరు మీ స్వరములను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరము కన్న పెంచకండి. మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ఆయన పేరుతో ఆయనను పిలవకండి. కాని ఆయనను దైవదౌత్యముతో,సందేశహరునితో మృధువుగా పిలవండి. దాని వలన మీ కర్మల ప్రతిఫలం నిష్ఫలితం అయిపోతుందని భయముతో. మరియు దాని ప్రతిఫలం నిష్ఫలితమవుతుందని మీరు గ్రహించలేరు.
Tefsiri na arapskom jeziku:
اِنَّ الَّذِیْنَ یَغُضُّوْنَ اَصْوَاتَهُمْ عِنْدَ رَسُوْلِ اللّٰهِ اُولٰٓىِٕكَ الَّذِیْنَ امْتَحَنَ اللّٰهُ قُلُوْبَهُمْ لِلتَّقْوٰی ؕ— لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ عَظِیْمٌ ۟
నిశ్ఛయంగా ఎవరైతే తమ స్వరములను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద తగ్గించుకుంకుంటారో వారందరి హృదయములను అల్లాహ్ తన భీతి కొరకు పరీక్షించుకున్నాడు. మరియు వారిని దాని కొరకు ప్రత్యేకించుకున్నాడు. వారి కొరకు వారి పాపముల మన్నింపు కలదు. ఆయన వారిని శిక్షించడు. మరియు వారి కొరకు ప్రళయదినమున గొప్ప ప్రతిఫలం కలదు. మరియు అది అల్లాహ్ వారిని స్వర్గములో ప్రవేశింపజేయటం.
Tefsiri na arapskom jeziku:
اِنَّ الَّذِیْنَ یُنَادُوْنَكَ مِنْ وَّرَآءِ الْحُجُرٰتِ اَكْثَرُهُمْ لَا یَعْقِلُوْنَ ۟
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా పల్లెవాలుల్లోంచి మిమ్మల్ని మీ సతీమణుల కుటీరాల వెనుక నుండి పిలిచే చాలామందికి బుద్ధి లేదు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• تشرع الرحمة مع المؤمن، والشدة مع الكافر المحارب.
విశ్వాసపరునికి తోడుగా కారుణ్యము మరియు యుద్దము చేసే అవిశ్వాసపరునికి తోడుగా కాఠిన్యము ధర్మబద్ధం చేయబడినది.

• التماسك والتعاون من أخلاق أصحابه صلى الله عليه وسلم.
సమన్వయంపాటించటం,సహాయసహకారాలు చేసుకోవటం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరుల సుగుణాల్లోంచివి.

• من يجد في قلبه كرهًا للصحابة الكرام يُخْشى عليه من الكفر.
ఎవరి హృదయములో గౌరవప్రదమైన సహచరుల కొరకు అసహ్యం పొందబడుతుందో అతనిలో అవిశ్వాసం గురించి భయపడాలి.

• وجوب التأدب مع رسول الله صلى الله عليه وسلم، ومع سُنَّته، ومع ورثته (العلماء).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో,ఆయన సున్నత్ తో మరియు ఆయన వారసులతో (ధార్మికపండితులతో) క్రమశిక్షణతో మెలగటం అనివార్యము.

وَلَوْ اَنَّهُمْ صَبَرُوْا حَتّٰی تَخْرُجَ اِلَیْهِمْ لَكَانَ خَیْرًا لَّهُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్త ఒక వేళ మిమ్మల్ని మీ సతీమణుల కుటీరముల వెనుక నుండి పిలిచే వీరందరు మీరు వారి వద్దకు వచ్చేంతవరకు మిమ్మల్ని పిలవకుండా ఓపికపట్టి తమ స్వరములను తగ్గించి మీతో మాట్లాడి ఉంటే అది వారికి మిమ్మల్ని వాటి వెనుక నుండి పిలవటం కన్న మేలైనది అందులో ఉన్న మర్యాద మరియు గొప్పతనము వలన. మరియు అల్లాహ్ వారిలో నుండి పశ్ఛాత్తాప్పడిన వారి మరియు ఇతరుల పాపములను మన్నించేవాడును మరియు వారి అజ్ఞానత వలన వారికి మన్నించేవాడును, వారిపై కనికరించేవాడును.
Tefsiri na arapskom jeziku:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ جَآءَكُمْ فَاسِقٌ بِنَبَاٍ فَتَبَیَّنُوْۤا اَنْ تُصِیْبُوْا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوْا عَلٰی مَا فَعَلْتُمْ نٰدِمِیْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా ఒక వేళ ఎవరైన పాపాత్ముడు మీ వద్దకు ఏ జాతి వారి గురించైన ఏదైన వార్తను తీసుకుని వస్తే మీరు అతని వార్త సరైనదన్న విషయాన్ని నిరూపించండి. మరియు మీరు అతన్ని నమ్మటానికి తొందరపడకండి. మీరు ఆ జాతి వారికి ఏదైన నేరము వలన వారి విషయము యొక్క వాస్తవమును తెలుసుకోకుండా బాధకు గురి చేస్తారని బయపడుతూ - మీరు అతని వార్తను సరైనదని నిరూపించకుండానే మీరు నమ్మినప్పుడు - మీరు వారిని బాధను కలిగించిన తరువాత అతని వార్త అబద్దమని మీకు స్పష్టమైనప్పుడు మీరు అవమానపాలవుతారు.
Tefsiri na arapskom jeziku:
وَاعْلَمُوْۤا اَنَّ فِیْكُمْ رَسُوْلَ اللّٰهِ ؕ— لَوْ یُطِیْعُكُمْ فِیْ كَثِیْرٍ مِّنَ الْاَمْرِ لَعَنِتُّمْ وَلٰكِنَّ اللّٰهَ حَبَّبَ اِلَیْكُمُ الْاِیْمَانَ وَزَیَّنَهٗ فِیْ قُلُوْبِكُمْ وَكَرَّهَ اِلَیْكُمُ الْكُفْرَ وَالْفُسُوْقَ وَالْعِصْیَانَ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الرّٰشِدُوْنَ ۟ۙ
ఓ విశ్వాసపరులారా మీలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారని,ఆయనపై దైవ వాణి అవతరింపబడుతున్నదని తెలుసుకోండి. కాబట్టి మీరు అబద్దము పలకటం నుండి జాగ్రత్తపడండి ఎందుకంటే ఆయనపై దైవ వాణి అవతరించి మీ అబద్దము పలకటం గురించి ఆయనకు తెలియపరుస్తుంది. మీ ప్రయోజనం ఎందులో ఉన్నదో దాని గురించి ఆయనకు బాగా తెలుసు. ఒక వేళ మీరు ఆయనకు ప్రతిపాదించిన వాటి విషయంలో ఆయన మీ మాట వింటే ఆయన మీ కొరకు ఇష్టపడని కష్టముల్లో మీరు పడిపోతారు. కాని అల్లాహ్ తన అనుగ్రహంతో మీ కొరకు విశ్వాసమును ఇష్టపడి,దాన్ని మీ మనస్సుల్లో మంచిగా చూపిస్తే మీరు విశ్వసించారు. మరియు ఆయన మీకు అవిశ్వాసమును,ఆయన విధేయత నుండి వైదొలగిపోవటమును అసహ్యకరంగా చేశాడు. మరియు మీకు ఆయన అవిధేయతను అసహ్యకరం చేశాడు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరే సన్మార్గము,ఋజు మార్గముపై నడుస్తారు.
Tefsiri na arapskom jeziku:
فَضْلًا مِّنَ اللّٰهِ وَنِعْمَةً ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
మీ హృదయముల్లో మంచిని మెరుగు పరచటం మరియు చెడును ద్వేషించటం వంటిది మీకు కలిగినది అది అల్లాహ్ తరపు నుండి ఒక ఉపకారము. ఆయన దాని ద్వారా మీపై ఉపకారం చేశాడు. మరియు ఒక అనుగ్రహము దాన్ని మీపై అనుగ్రహించాడు. మరియు తన దాసుల్లోంచి తనకు కృతజ్ఞత తెలుపుకునే వారి గురించి అల్లాహ్ కు తెలుసు కాబట్టి ఆయన దాని భాగ్యమును కలిగిస్తాడు. మరియు విజ్ఞత కలవాడు కాబట్టే ఆయన ప్రతీ వస్తువును దానికి తగిన ప్రదేశములో ఉంచుతాడు.
Tefsiri na arapskom jeziku:
وَاِنْ طَآىِٕفَتٰنِ مِنَ الْمُؤْمِنِیْنَ اقْتَتَلُوْا فَاَصْلِحُوْا بَیْنَهُمَا ۚ— فَاِنْ بَغَتْ اِحْدٰىهُمَا عَلَی الْاُخْرٰی فَقَاتِلُوا الَّتِیْ تَبْغِیْ حَتّٰی تَفِیْٓءَ اِلٰۤی اَمْرِ اللّٰهِ ۚ— فَاِنْ فَآءَتْ فَاَصْلِحُوْا بَیْنَهُمَا بِالْعَدْلِ وَاَقْسِطُوْا ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ ۟
మరియు ఒక వేళ విశ్వాసపరుల్లోంచి ఏవైన రెండు వర్గములు తగువులాడితే ఓ విశ్వాసపరులారా మీరు వారికి కలిగిన విబేధములో వారిని అల్లాహ్ ధర్మ శాస్త్ర తీర్పు వైపునకు పిలిచి వారిరువురి మధ్య సయోద్య చేయండి. ఒక వేళ ఇరు వర్గముల్లోంచి ఒక వర్గము సయోద్యను నిరాకరించి మితిమీరితే మీరు మితిమీరిన వారితో వారు అల్లాహ్ తీర్పు వైపునకు మరలే వరకు యుద్ధం చేయండి. ఒక వేళ వారు అల్లాహ్ తీర్పు వైపునకు మరలితే మీరు వారి మధ్య న్యాయముతో,సరైన తీర్పుతో సయోద్యను చేయండి. మరియు మీరు వారి మధ్య మీ తీర్పులో న్యాయం చేయండి. నిశ్చయంగా అల్లాహ్ తమ తీర్పులో న్యాయంగా వ్యవహరించే వారిని ఇష్టపడుతాడు.
Tefsiri na arapskom jeziku:
اِنَّمَا الْمُؤْمِنُوْنَ اِخْوَةٌ فَاَصْلِحُوْا بَیْنَ اَخَوَیْكُمْ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟۠
వాస్తవానికి ఇస్లాంలో విశ్వాసపరులు సహోదరులు. మరియు ఇస్లాంలో సహోదరులు ఓ విశ్వాసపరులారా మీరు తగువులాడే మీ సహోదరుల మధ్య సయోద్యచేయాలి. మరియు మీరు అల్లాహ్ కి ఆయన ఆదేశములు పాటించి మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి మీరు దయ చూపబడుతారని ఆశిస్తూ భయపడుతూ ఉండండి.
Tefsiri na arapskom jeziku:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا یَسْخَرْ قَوْمٌ مِّنْ قَوْمٍ عَسٰۤی اَنْ یَّكُوْنُوْا خَیْرًا مِّنْهُمْ وَلَا نِسَآءٌ مِّنْ نِّسَآءٍ عَسٰۤی اَنْ یَّكُنَّ خَیْرًا مِّنْهُنَّ ۚ— وَلَا تَلْمِزُوْۤا اَنْفُسَكُمْ وَلَا تَنَابَزُوْا بِالْاَلْقَابِ ؕ— بِئْسَ الِاسْمُ الْفُسُوْقُ بَعْدَ الْاِیْمَانِ ۚ— وَمَنْ لَّمْ یَتُبْ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీలో నుండి ఒక వర్గము ఇంకొక వర్గముని ఎగతాళి చేయకండి. బహుశా వారి ద్వారా ఎగతాళి చేయబడిన వారు అల్లాహ్ వద్ద గొప్పవారు కావచ్చు. అల్లాహ్ వద్ద ఉన్నదాని ద్వారా గుణపాఠం ఉన్నది. మరియు స్త్రీల్లోంచి కొందరు ఇంకొందరి స్త్రీలను ఎగతాళి చేయకూడదు బహుశా వారి ద్వారా ఎగతాళి చేయబడిన వారు అల్లాహ్ వద్ద గొప్పవారు కావచ్చు. మరియు మీరు మీ సహోదరులను నిందించకండి వారు మీలాంటి వారే. మరియు మీరు ద్వేషించుకునే మారు పేరుతో ఏ విధంగానైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాక మునుపు కొందరి అన్సారుల స్థితి ఉండేదో ఆ విధంగా ఒకరినొకరు పిలుచుకోకండి. మీలో నుండి ఎవరైతే ఇలా చేస్తారో వారు పాపాత్ములు. విశ్వాసము తరువాత పాప గుణము ఎంతో చెడ్డదైన గుణము. మరియు ఎవరైతే ఈ పాప కార్యముల నుండి పశ్ఛాత్తాప్పడరో వారందరు తాము పాల్పడిన పాప కార్యముల వలన వినాశన స్థానములకు చేరి తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడినవారు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• وجوب التثبت من صحة الأخبار، خاصة التي ينقلها من يُتَّهم بالفسق.
సమాచారములు నిజనిజాలను నిర్ధారించుకోవటం తప్పనిసరి, ప్రత్యేకించి పాపాత్ములని నిందించబడినవారు వాటిని చేరవేసినప్పుడు.

• وجوب الإصلاح بين من يتقاتل من المسلمين، ومشروعية قتال الطائفة التي تصر على الاعتداء وترفض الصلح.
ముస్లిముల్లోంచి తగువులాడే వారి మధ్య సయోధ్య చేయటం తప్పనిసరి. మరియు మితిమీరిపోవటంపై మొరటవైఖరి చూపి,సయోధ్యను తిరస్కరించే వర్గముతో పోరాడటం ధర్మబద్దం చేయబడింది.

• من حقوق الأخوة الإيمانية: الصلح بين المتنازعين والبعد عما يجرح المشاعر من السخرية والعيب والتنابز بالألقاب.
విశ్వాస సోదరభావ హక్కుల్లోంచి : వివాదాస్పద వ్యక్తుల మధ్య సయోధ్య చేయటం మరియు బాధకు గురిచేసే అపవాదభావాలైనటువంటి అపహాస్యం,లోపాలను చూపటం,చెడు పేర్లతో పిలవటం నుండి దూరంగా ఉండటం,

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اجْتَنِبُوْا كَثِیْرًا مِّنَ الظَّنِّ ؗ— اِنَّ بَعْضَ الظَّنِّ اِثْمٌ وَّلَا تَجَسَّسُوْا وَلَا یَغْتَبْ بَّعْضُكُمْ بَعْضًا ؕ— اَیُحِبُّ اَحَدُكُمْ اَنْ یَّاْكُلَ لَحْمَ اَخِیْهِ مَیْتًا فَكَرِهْتُمُوْهُ ؕ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ تَوَّابٌ رَّحِیْمٌ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు తగిన కారణాలు మరియు ఆధారాలు లేని అనేక ఆరోపణల నుండి దూరంగా ఉండండి. నిశ్చయంగా కొన్ని అనుమానాలు బాహ్యంగా ప్రయోజనం కలిగించేవాడి విషయంలో దురాలోచన లాంటివి పాపములవుతాయి. మరియు మీరు విశ్వాసపరుల రహస్యాలను వారి చాటునుండి తెలుసుకోవటానికి అనుసరించకండి. మరియు మీలో నుండి ఏ ఒక్కరు కూడా తన సోదరుడు ఇష్టపడని వాటి గురించి చర్చించకండి. ఎందుకంటే అతడు ఇష్టపడని దాని గురించి చర్చించటం అతని మృత శరీరం నుండి మాంసమును తిన్నట్లే. ఏమి మీ లో నుండి ఎవరైన తన సోదరుని మృత శరీరము నుండి మాంసమును తినటం ఇష్టపడుతాడా ?. మీరు ఇష్టపడరు అతని చాడీలు చెప్పటము దాని లాంటిదే. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
Tefsiri na arapskom jeziku:
یٰۤاَیُّهَا النَّاسُ اِنَّا خَلَقْنٰكُمْ مِّنْ ذَكَرٍ وَّاُ وَجَعَلْنٰكُمْ شُعُوْبًا وَّقَبَآىِٕلَ لِتَعَارَفُوْا ؕ— اِنَّ اَكْرَمَكُمْ عِنْدَ اللّٰهِ اَتْقٰىكُمْ ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌ خَبِیْرٌ ۟
ఓ ప్రజలారా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మీ తండ్రి అయిన ఆదమ్ మరియి ఒకే స్త్రీ మీ తల్లి అయిన హవ్వాతో సృష్టించాము. కావున మీ వంశము ఒక్కటే. కాబట్టి మీరు వంశం విషయంలో ఒకరిపై ఒకరు గర్వించకండి. మరియు మేము దాని తరువాత మిమ్మల్ని చాలా వర్గములుగా మరియు విస్తరించిన తెగలుగా చేశాము మీరు ఒకరినొకరు గుర్తించుకోవటానికి దానిపై గర్వించటానికి కాదు. ఎందుకంటే వ్యత్యాసం అనేది దైవభీతి పరంగా మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయన (అల్లాహ్) ఇలా పలికాడు : నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి కలవాడే అల్లాహ్ వద్ద మీలో ఎక్కువ గౌరవం కలవాడు. నిశ్చయంగా అల్లాహ్ మీ పరిస్థితుల గురించి తెలిసినవాడు, మీలో ఉన్న పరిపూర్ణతను,లోపమను తెలుసుకునేవాడు. దానిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Tefsiri na arapskom jeziku:
قَالَتِ الْاَعْرَابُ اٰمَنَّا ؕ— قُلْ لَّمْ تُؤْمِنُوْا وَلٰكِنْ قُوْلُوْۤا اَسْلَمْنَا وَلَمَّا یَدْخُلِ الْاِیْمَانُ فِیْ قُلُوْبِكُمْ ؕ— وَاِنْ تُطِیْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ لَا یَلِتْكُمْ مِّنْ اَعْمَالِكُمْ شَیْـًٔا ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
కొందరు పల్లెవాసులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ఇలా పలికారు : మేము అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచాము. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : మీరు విశ్వసించ లేదు, కాని మీరు మేము విధేయులయ్యాము మరియు కట్టుబడి ఉన్నాము అని పలకండి. మీ హృదయముల్లో ఇంకా విశ్వాసము ప్రవేశించలేదు. మరియు అది వాటిలో ప్రవేశిస్తుందని ఆశించవచ్చు. ఓ పల్లెవాసుల్లారా ఒక వేళ మీరు విశ్వసించే విషయంలో,సత్కర్మలు చేయటంలో,నిషిద్దతాల నుండి దూరంగా ఉండటంలో అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను అనుసరిస్తే అల్లాహ్ మీ కర్మల ప్రతిఫలము నుండి ఏమాత్రం మీకు తగ్గించడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛచత్తాప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కనికరించేవాడును.
Tefsiri na arapskom jeziku:
اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ثُمَّ لَمْ یَرْتَابُوْا وَجٰهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الصّٰدِقُوْنَ ۟
వాస్తవానికి విశ్వాసపరులు వారే ఎవరైతే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి ఆ తరువాత వారి విశ్వాసమునకు ఎటువంటి సందేహము కలవలేదో మరియు వారు అల్లాహ్ మార్గములో తమ సిరిసంపదలతో,తమ ప్రాణములతో పోరాడి వాటిలో కొంచము కూడా పిసినారితనము చూపరో వారు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరే తమ విశ్వాసములో సత్యవంతులు.
Tefsiri na arapskom jeziku:
قُلْ اَتُعَلِّمُوْنَ اللّٰهَ بِدِیْنِكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ పల్లె వాసులందరితో ఇలా పలకండి : ఏమీ మీరు అల్లాహ్ కు మీ ధార్మికత గురించి తెలియపరుస్తున్నారా,జ్ఞానోదయం చేస్తున్నారా ?! వాస్తవానికి ఆకాశముల్లో ఏమున్నదో,భూమిలో ఏమున్నదో అల్లాహ్ కు తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతీది తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మీ ధార్మికత గురించి మీరు ఆయనకు తెలియపరచవలసిన అవసరం లేదు.
Tefsiri na arapskom jeziku:
یَمُنُّوْنَ عَلَیْكَ اَنْ اَسْلَمُوْا ؕ— قُلْ لَّا تَمُنُّوْا عَلَیَّ اِسْلَامَكُمْ ۚ— بَلِ اللّٰهُ یَمُنُّ عَلَیْكُمْ اَنْ هَدٰىكُمْ لِلْاِیْمَانِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ప్రవక్త ఈ పల్లెవాసులందరు తమ ఇస్లామును స్వీకరించటమును మీ పై ఉపకారము చేసినట్లు చూపుతున్నారు. మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ ధర్మములో మీరు ప్రవేశించటమును నా పై ఉపకారము చేసినట్లు చెప్పకండి. దాని ప్రయోజనము ఒక వేళ కలిగితే అది మీపైనే మరలుతుంది. కానీ అల్లాహ్ ఆయనే మీకు ఆయనపై విశ్వాసమును కనబరచే భాగ్యమును కలిగించి మీపై ఉపకారం చేశాడు ఒక వేళ మీరు అందులో ప్రవేశించారని మీ వాదనలో సత్యవంతులే అయితే.
Tefsiri na arapskom jeziku:
اِنَّ اللّٰهَ یَعْلَمُ غَیْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟۠
నిశ్ఛయంగా ఆకాశముల యొక్క అగోచర విషయముల గురించి అల్లాహ్ కు తెలుసు మరియు ఆయనకు భూమి యొక్క అగోచర విషయముల గురించి తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పుణ్య కార్యాలపై మరియు దుష్కార్యాలపై మీకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• سوء الظن بأهل الخير معصية، ويجوز الحذر من أهل الشر بسوء الظن بهم.
మంచి వ్యక్తుల గురించి దురాలోచన కలిగి ఉండటం పాపము. వారిపై దురాలోచనను కలిగిన దుష్టుల నుండి జాగ్రత్తపడటం సమ్మతము.

• وحدة أصل بني البشر تقتضي نبذ التفاخر بالأنساب.
మానవ సంతానము మూలం యొక్క ఐక్యత వంశాల గురించి ప్రగల్బాలు విడనాడటమును నిర్ణయిస్తుంది.

• الإيمان ليس مجرد نطق لا يوافقه اعتقاد، بل هو اعتقاد بالجَنان، وقول باللسان، وعمل بالأركان.
విశ్వాసం అనేది కేవలం విశ్వాసముతో ఏకీభవించని మాట కాదు. మనస్పూర్తిగా విశ్వసించటం మరియు నాలికతో పలకటం మరియు మూలసూత్రాలపై ఆచరించటం.

• هداية التوفيق بيد الله وحده وهي فضل منه سبحانه ليست حقًّا لأحد.
అనుగ్రహించే భాగ్యం ఒక్కడైన అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నది. అది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. పరిశుద్ధుడైన ఆయన తరపు నుండి ఒక అనుగ్రహము.

 
Prijevod značenja Sura: Sura el-Hudžurat
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Sadržaj prijevodā

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Zatvaranje