Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed * - Sadržaj prijevodā

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Prijevod značenja Sura: El-Bekara   Ajet:
وَاقْتُلُوْهُمْ حَیْثُ ثَقِفْتُمُوْهُمْ وَاَخْرِجُوْهُمْ مِّنْ حَیْثُ اَخْرَجُوْكُمْ وَالْفِتْنَةُ اَشَدُّ مِنَ الْقَتْلِ ۚ— وَلَا تُقٰتِلُوْهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتّٰی یُقٰتِلُوْكُمْ فِیْهِ ۚ— فَاِنْ قٰتَلُوْكُمْ فَاقْتُلُوْهُمْ ؕ— كَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِیْنَ ۟
వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమి వేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమి వేయండి. మరియు సత్యధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా) [1], చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్ అల్ హరామ్ వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుద్ధం చేయకండి[2]. ఒకవేళ వారే మీతో (ఆ పవిత్ర స్థలంలో) యుద్ధం చేస్తే వారిని వధించండి. ఇదే సత్యతిరస్కారులకు తగిన శిక్ష.
[1] ఇక్కడ ఫిత్నా - అంటే సత్యతిరస్కారం, షిర్క్, సత్యధర్మానికి అడ్డుగా నిలవటం. సత్యాన్ని స్వీకరించిన వారిని హింసా, దౌర్జన్యాలకు గురి చేయడం. చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 797. ఫిత్నతున్ : యొక్క ఇతర అర్థాలు పీడన, ఉపద్రవం, పరీక్ష, ప్రేరేపించటం, కలతలు రేకెత్తించటం, శోధన, పురికొల్పటం మరియు దుష్కృత్యం మొదలైనవి ఉన్నాయి. [2] మస్జిద్ అల్ - 'హరామ్ సరిహద్దులలో యుద్ధం చేయటం నిషేధించబడింది. అది శాంతినిలయం, కాని ఎవరైనా దానిని లెక్క చేయక మీపై దాడి చేసి మిమ్మల్ని చంపగోరితే, అలాంటి వారితో మీరు అక్కడ యుద్థం చేసి వారిని చంపవచ్చు!
Tefsiri na arapskom jeziku:
فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
కానీ, వారు (యుద్ధం చేయటం) మానుకుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
Tefsiri na arapskom jeziku:
وَقٰتِلُوْهُمْ حَتّٰی لَا تَكُوْنَ فِتْنَةٌ وَّیَكُوْنَ الدِّیْنُ لِلّٰهِ ؕ— فَاِنِ انْتَهَوْا فَلَا عُدْوَانَ اِلَّا عَلَی الظّٰلِمِیْنَ ۟
మరియు ఫిత్నా[1] ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి. [2]
[1] చూడండి, 2:191 వ్యాఖ్యానం 2. [2] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 24.
Tefsiri na arapskom jeziku:
اَلشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمٰتُ قِصَاصٌ ؕ— فَمَنِ اعْتَدٰی عَلَیْكُمْ فَاعْتَدُوْا عَلَیْهِ بِمِثْلِ مَا اعْتَدٰی عَلَیْكُمْ ۪— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟
నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే మరియు నిషిద్ధ స్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖిసాస్) తీసుకోవచ్చు[1]. కాబట్టి మీపై ఎవరైనా దాడి చేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడి చేయండి. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.
[1] నిషిద్ధ మాసాలు: జు'ల్ - ఖాఇదహ్, జు'ల్ హిజ్జహ్, ము'హర్రం మరియు రజబ్ (హిజ్రీ శకపు 11, 12, 1, 7 మాసాలు). ఈ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు పూర్వం నుండి కూడా అరేబియా వాసులలో నిషేధించబడి ఉండింది. చూడండి, 2:217. ఈ నిషేధాలను దరూ గౌరవించాలి. ఎదుటి వారు వాటిని గౌరవించని పక్షంలో వారితో పోరాడి ప్రతీకారం తీర్చుకోవచ్చు.
Tefsiri na arapskom jeziku:
وَاَنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا تُلْقُوْا بِاَیْدِیْكُمْ اِلَی التَّهْلُكَةِ ۛۚ— وَاَحْسِنُوْا ۛۚ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟
మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; మేలు చేయండి. నిశ్చయంగా, అల్లాహ్ మేలు చేసే వారిని ప్రేమిస్తాడు.
Tefsiri na arapskom jeziku:
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِ ؕ— فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰی یَبْلُغَ الْهَدْیُ مَحِلَّهٗ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ بِهٖۤ اَذًی مِّنْ رَّاْسِهٖ فَفِدْیَةٌ مِّنْ صِیَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍ ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ ۥ— فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَی الْحَجِّ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ فِی الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْ ؕ— تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ— ذٰلِكَ لِمَنْ لَّمْ یَكُنْ اَهْلُهٗ حَاضِرِی الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟۠
మరియు అల్లాహ్ (ప్రసన్నత) కొరకు హజ్జ్ మరియు ఉమ్రా పూర్తి చేయండి[1]. మీకు అక్కడ చేరటానికి (వాటిని పూర్తి చేయటానికి) ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వదలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి[2]. బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి[3]. కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరోముండనం చేసుకొని) దాని పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దానధర్మాలు చేయాలి (ఆరుగురు నిరుపేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా హజ్జె తమత్తు[4] చేయదలుచుకుంటే, అతడు తన శక్తిమేరకు బలి[5] ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో, హజ్జ్ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగి వచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్ అల్ హరామ్ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి.
[1] 'ఉమ్రా: 'హజ్ సమయంలో కాకుండా వేరే దినాలలో కూడా 'ఉమ్రా చేయవచ్చు. 'ఉమ్రా చేయగోరే వారు 'హరమ్ సరిహద్దుల నుండి, (మీఖాత్ సరిహద్దుల బయట నుండి వచ్చే వారు మీఖాత్ నుండి) ఇ'హ్రామ్ ధరించి, (అంటే పురుషులు, ఒక తెల్లని లుంగీ కట్టుకొని మరొక తెల్లని దుప్పటిని శరీరంపై కప్పుకోవటం. స్త్రీలకు, వారు ధరించిన బట్టలే ఇ'హ్రామ్; మగవారివలే వారికి ప్రత్యేకమైన ఇ'హ్రామ్ దుస్తులు లేవు) 'హరమ్ కు వచ్చి, క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు ('తవాఫ్) చేసి, రెండు రకాతులు నమాజ్' చేసి, తరువాత 'సఫా, మర్వాల మధ్య ఏడుసార్లు పచార్లు (స'యీ) చేసి, ఆ తరువాత (స్త్రీలు) తల వెంట్రుకలను కొంత మట్టుకు కత్తిరించుకోవాలి. పురుషులు శిరోముండనం చేయించుకొని లేక తల వెంట్రుకలను కొంత మట్టుకు కత్తిరించుకొని ఇ'హ్రామ్ విడిచి పెట్టాలి. మీఖాత్ మరియు 'హరమ్ సరిహద్దులను మహా ప్రవక్త ('స'అస) సూచించారు. [2] దైవప్రవక్త ('స'అస) 6వ హిజ్రీలో 'ఉమ్రా కొరకు వచ్చినప్పుడు 'హుదైబియహ్ దగ్గరగా ఆగారు. అప్పుడు మక్కాలోని ముష్రిక్ ఖురైషులతో సంధి చేసుకున్నారు. 'హుదైబియహ్ లోనే తమ బలి (ఖుర్బానీ) చేసి తమ శిరోముండనాలు చేయించుకొని ఇ'హ్రాం వదిలారు. తరువాత 7వ హిజ్రీలో వచ్చి 'ఉమ్రా చేశారు. [3] శాంతి సమయాలలో 'హజ్ యొక్క అన్ని మనాసిక్ లు పూర్తి చేయనంత వరకు శిరోముండనం చేయించుకోగూడదు అంటే, ఇ'హ్రీమ్ విడువగూడదు. [4] తమత్తు' - అంటే 'హజ్ కాలంలో 'ఉమ్రా కొరకు ఇ'హ్రామ్ ధరించి 'ఉమ్రా చేసి శిరోముండనం చేసి, ఇ'హ్రామ్ విడవాలి. మరల 8వ జి'ల్-'హిజ్ రోజున 'హజ్ కొరకు ఇ'హ్రామ్ ధరించాలి. దీనికి బలి ఇవ్వ వలసి ఉంటుంది. బలి ఇవ్వలేని వారు 10 రోజులు ('హజ్ కాలంలో 3 రోజులు 'హజ్ తరువాత 7 రోజులు), ఉపవాసాలుండాలి. 'హజ్ 3 రకాలుగా చేయవచ్చు: అవి 1)ఇఫ్రాద్: అంటే 'హజ్ సంకల్పంతో ఇ'హ్రాం ధరించి కేవలం 'హజ్ మాత్రమే చేయటం. దీనికి బలి అవసరం లేదు. ఇది 'హరమ్ ప్రాంతంలో నివసించే వారు చేసే 'హజ్, 2) తమత్తు : పైన వివరించిన విధానం. 'హజ్జె తమత్తు'కు బలి (ఖుర్బానీ) ఇవ్వటం వాజిబ్. 3) ఖిరన్ : ఒకే ఇ'హ్రామ్ తో 'ఉమ్రా మరియు 'హజ్ నెరవేర్చటం. 'ఉమ్రా చేసిన తరువాత తలవెంట్రుకలు కత్తిరించుకోకుండా 'హజ్ వరకు ఇ'హ్రాంలోనే ఉండి 'హజ్ విదులు నెరవేర్చిన పిదప ఇ'హ్రామ్ విడవటం. 'హజ్జె ఖిరన్ కు కూడా బలి (ఖుర్బానీ) ఇవ్వటం వాజిబ్. [5] హద్ యున్, బలి (ఖుర్బానీ): ఒక వ్యక్తి ఒక మేక లేక గొర్రె; లేక ఏడుగురు కలిసి ఒక ఆవు, ఎద్దు, లేక ఒంటె బలి చేయవచ్చు.
Tefsiri na arapskom jeziku:
 
Prijevod značenja Sura: El-Bekara
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed - Sadržaj prijevodā

Prevodilac: Abdurahim ibn Muhammed.

Zatvaranje