Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed * - Sadržaj prijevodā

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Prijevod značenja Sura: El-En'am   Ajet:
ذٰلِكَ اَنْ لَّمْ یَكُنْ رَّبُّكَ مُهْلِكَ الْقُرٰی بِظُلْمٍ وَّاَهْلُهَا غٰفِلُوْنَ ۟
ఇదంతా ఎందుకంటే! నీ ప్రభువు నగరాలను - వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగకుండా ఉన్నప్పుడు - అన్యాయంగా నాశనంగా చేయడు.[1]
[1] చూడండి, 16:26, 17:15, 35:24 మరియు 67:8-9.
Tefsiri na arapskom jeziku:
وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ؕ— وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا یَعْمَلُوْنَ ۟
మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.
Tefsiri na arapskom jeziku:
وَرَبُّكَ الْغَنِیُّ ذُو الرَّحْمَةِ ؕ— اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَیَسْتَخْلِفْ مِنْ بَعْدِكُمْ مَّا یَشَآءُ كَمَاۤ اَنْشَاَكُمْ مِّنْ ذُرِّیَّةِ قَوْمٍ اٰخَرِیْنَ ۟ؕ
మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు[1], కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతి వారి తరువాత మిమ్మల్ని పుట్టించినట్లు, మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు[2].
[1] అల్-'గనియ్యు: Self-Sufficient, స్వయంసమృద్ధుడు, సర్వసంపన్నుడు, Free of Want, నిరుపేక్షాపరుడు, ఏ అక్కరా లేనివాడు, చూడండి, 2:263. [2] చూడండి, 4:133, 14:19, 35:15-17 మరియు 47:38.
Tefsiri na arapskom jeziku:
اِنَّ مَا تُوْعَدُوْنَ لَاٰتٍ ۙ— وَّمَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ ۟
మీకు చేయబడిన వాగ్దానం తప్పక పూర్తయి తీరుతుంది. మీరు దాని (శిక్ష) నుండి తప్పించుకోలేరు.
Tefsiri na arapskom jeziku:
قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ— مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ ۟
ఇలా అను: "ఓ నా జాతి (విశ్వసించని) ప్రజలారా! మీరు (సరి అనుకున్నది) మీ శక్తి మేరకు చేయండి. మరియు నిశ్చయంగా (నేను సరి అనుకున్నది) నేనూ చేస్తాను[1]. ఎవరి పరిణామం సఫలీకృతం కాగలదో! మీరు త్వరలోనే తెలుసుకుంటారు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందరు."
[1] చూడండి, 11:121-122.
Tefsiri na arapskom jeziku:
وَجَعَلُوْا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الْحَرْثِ وَالْاَنْعَامِ نَصِیْبًا فَقَالُوْا هٰذَا لِلّٰهِ بِزَعْمِهِمْ وَهٰذَا لِشُرَكَآىِٕنَا ۚ— فَمَا كَانَ لِشُرَكَآىِٕهِمْ فَلَا یَصِلُ اِلَی اللّٰهِ ۚ— وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ یَصِلُ اِلٰی شُرَكَآىِٕهِمْ ؕ— سَآءَ مَا یَحْكُمُوْنَ ۟
మరియు ఆయన (అల్లాహ్) పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి, వారు అల్లాహ్ కొరకు కొంత భాగాన్ని నియమించి: "ఇది అల్లాహ్ కొరకు మరియు ఇది మా దేవతల (అల్లాహ్ కు వారు సాటి కల్పించినవారి) కొరకు." అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందిన భాగం అల్లాహ్ కు చేరదు. మరియు అల్లాహ్ కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు![1]
[1] ముష్రిక్ ఖురైషులు తమ సేద్యపు పంటలలో మరియు ఇతర ఆదాయలలో కొంతభాగం అల్లాహ్ (సు.తా.) పేర, మరికొంత తమ కల్పిత దైవాల పేర నిర్ణయించేవారు. అల్లాహుతా'ఆలా పేర ఉన్న దానిని తమ దగ్గరి బంధువుల పై, పేదవారిపై మరియు అతిథులపై ఖర్చు చేసేవారు. కల్పిత దైవాల పేర ఉన్న దానిని, వారి పూజారుల మీద. కల్పిత దేవాల పేర ఉన్నదానిలో పంట సరిగ్గా పండకుంటే అల్లాహ్ (సు.తా.) పేర ఉన్నదాని నుండి తీసుకొని పూజారులకు ఇచ్చేవారు, కాని అల్లాహుతా'ఆలా పేర ఉన్నదానిలో తగ్గింపు అయితే అల్లాహ్ (సు.తా.) స్వయంసమృద్ధుడు, ఏమీ అక్కర లేనివాడనేవారు. అంటే తమ దగ్గరి బంధువులకు , పేదవారికి మరియు అతిథులకు ఇచే వారు కాదు.
Tefsiri na arapskom jeziku:
وَكَذٰلِكَ زَیَّنَ لِكَثِیْرٍ مِّنَ الْمُشْرِكِیْنَ قَتْلَ اَوْلَادِهِمْ شُرَكَآؤُهُمْ لِیُرْدُوْهُمْ وَلِیَلْبِسُوْا عَلَیْهِمْ دِیْنَهُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ مَا فَعَلُوْهُ فَذَرْهُمْ وَمَا یَفْتَرُوْنَ ۟
మరియు ఇదే విధంగా చాలా మంది బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) తమ సంతాన హత్యను - వారు (అల్లాహ్ కు సాటి కల్పించిన) భాగస్వాములు - సరైనవిగా కనిపించేటట్లు చేశారు. ఇది వారిని నాశనానికి గురి చేయటానికి మరియు వారి ధర్మం వారికి సంశయాస్పదమైనదిగా చేయటానికి! అల్లాహ్ కోరితే వారు అలా చేసి ఉండేవారు కాదు. కావున నీవు వారిని వారి కల్పనలోనే వదలిపెట్టు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) కోరితే, తాను కోరినట్లు చేయటానికి వారికి మార్గం చూపేవాడు. కాని అల్లాహుతా'ఆలా వారికి తెలివినిచ్చి, మంచి-చెడుల విచక్షణా శక్తినిచ్చి, వారికి తాము కోరిన మార్గాన్ని ఎన్నుకోవటానికి స్వాతంత్ర్యం ఇచ్చి, వారి కర్మల ప్రకారం వారి కొరకు స్వర్గ-నరకాలను ఏర్పాటు చేశాడు మరియు తన ప్రవక్తల మరియు దివ్యగ్రంథాల ద్వారా, ఈ విషయం మానవులకు విశదం కూడా చేశాడు.
Tefsiri na arapskom jeziku:
 
Prijevod značenja Sura: El-En'am
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed - Sadržaj prijevodā

Prevodilac: Abdurahim ibn Muhammed.

Zatvaranje