Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Yūsuf   Ayah:
وَمَاۤ اُبَرِّئُ نَفْسِیْ ۚ— اِنَّ النَّفْسَ لَاَمَّارَةٌ بِالسُّوْٓءِ اِلَّا مَا رَحِمَ رَبِّیْ ؕ— اِنَّ رَبِّیْ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
మరియు అజీజు భార్య తన మాటలను కొనసాగిస్తూ ఇలా పలికింది : మరియు నన్ను నేను చెడు యొక్క సంకల్పము నుండి నిర్దోషిని అని చెప్పుకోను.దీని ద్వారా నేను నా మనస్సును పరిశుద్ధపరచుకోవాలనుకోలేదు.ఎందుకంటే మానవుని మనస్సుది ఎక్కువగా చెడును ఆదేశించే పరిస్థితి ఎందుకంటే అది తాను కోరుకునే దాని వైపునకు మొగ్గు చూపటం మరియు దాని నుండి తనను నిర్మూలించుకోవటం కష్టం వలన .అల్లాహ్ కనికరించి చెడు ఆదేశించటం నుండి రక్షించిన మనస్సులు తప్ప.నిశ్చయంగా నా ప్రభువు తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.
Arabic explanations of the Qur’an:
وَقَالَ الْمَلِكُ ائْتُوْنِیْ بِهٖۤ اَسْتَخْلِصْهُ لِنَفْسِیْ ۚ— فَلَمَّا كَلَّمَهٗ قَالَ اِنَّكَ الْیَوْمَ لَدَیْنَا مَكِیْنٌ اَمِیْنٌ ۟
మరియు యూసుఫ్ నిర్దోషత్వము మరియు ఆయన జ్ఞానము స్పష్టమైనప్పుడు రాజు తన సేవకులతో ఇలా పలికాడు : మీరు అతడిని నా వద్దకు తీసుకుని రండి. నేను అతడిని నా కొరకు ప్రత్యేకంగా నియమించుకుంటాను. అప్పుడు వారు అతడిని తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే అతడు (రాజు) అతనితో మాట్లాడాడో మరియు అతనికి అతడి జ్ఞానము మరియు అతడి బుద్ది స్పష్టమైనదో అప్పుడు అతడితో ఇలా పలికాడు : ఓ యూసుఫ్ నిశ్చయంగా నీవు మా వద్ద ఈ రోజు ఉన్నత స్థానం,గౌరవం నమ్మకం కలవాడిగా అయిపోయావు.
Arabic explanations of the Qur’an:
قَالَ اجْعَلْنِیْ عَلٰی خَزَآىِٕنِ الْاَرْضِ ۚ— اِنِّیْ حَفِیْظٌ عَلِیْمٌ ۟
యూసుఫ్ అలైహిస్సలాం రాజుతో ఇలా పలికారు : నీవు నన్నుమిసర్ ప్రాంతములో ధాన్యాగారాల,సంపదల కోశాగారాల సంరక్షణ బాధ్యతను అప్పగించు. ఎందుకంటే నేను బాధ్యత వహించే వాటిలో జ్ఞానము కల,రక్షణ కల నీతిమంతుడైన కోశాధికారిని.
Arabic explanations of the Qur’an:
وَكَذٰلِكَ مَكَّنَّا لِیُوْسُفَ فِی الْاَرْضِ ۚ— یَتَبَوَّاُ مِنْهَا حَیْثُ یَشَآءُ ؕ— نُصِیْبُ بِرَحْمَتِنَا مَنْ نَّشَآءُ وَلَا نُضِیْعُ اَجْرَ الْمُحْسِنِیْنَ ۟
మరియు ఏవిధంగానైతే మేము నిర్దోషత్వమును మరియు చెరసాల నుండి విముక్తిని కలిగించి యూసుఫ్ పై ఉపకారము చేశామో అలాగే ఆయనకు మిసర్ లో అధికారమును ప్రసాధించి ఆయనపై ఉపకారము చేశాము.ఆయన ఏ ప్రదేశంలో తలచుకుంటే అక్కడ దిగుతారు మరియు నివసిస్తారు.ఇహలోకములో మా దాసుల్లోంచి మేము తలచుకున్న వారిని మా కారుణ్యమును అనుగ్రహిస్తాము.మరియు మేము సజ్జనుల పుణ్యాన్ని వృధా చేయము.కాని మేము వారికి దానినే పరిపూర్ణంగా ఎటువంటి తగ్గుదల లేకుండా ప్రసాధిస్తాము.
Arabic explanations of the Qur’an:
وَلَاَجْرُ الْاٰخِرَةِ خَیْرٌ لِّلَّذِیْنَ اٰمَنُوْا وَكَانُوْا یَتَّقُوْنَ ۟۠
అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి మరియు ఆయన ఆదేశాలను పాటించి మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భయభీతి కలిగిన వారి కొరకు పరలోకములో అల్లాహ్ తయారు చేసి ఉంచిన ప్రతిఫలము ఇహలోక ప్రతిఫలముకన్న మేలైనది.
Arabic explanations of the Qur’an:
وَجَآءَ اِخْوَةُ یُوْسُفَ فَدَخَلُوْا عَلَیْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهٗ مُنْكِرُوْنَ ۟
మరియు యూసుఫ్ సోదరులు తమ సరుకుల కొరకు మిసర్ ప్రాంతమునకు వచ్చారు.అప్పుడు వారు ఆయన వద్దకు వచ్చారు.ఆయన వారు తన సోదరులని గుర్తించారు.మరియు వారు అతన్ని తమ సోదరుడని గుర్తించలేదు.కాలం ఎక్కువవటం వలన మరియు ఆయన రూపము మారటం వలన ఎందుకంటే వారు ఆయన్ను బావిలో పడవేశినప్పుడు పిల్లవాడిగా ఉన్నారు.
Arabic explanations of the Qur’an:
وَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ قَالَ ائْتُوْنِیْ بِاَخٍ لَّكُمْ مِّنْ اَبِیْكُمْ ۚ— اَلَا تَرَوْنَ اَنِّیْۤ اُوْفِی الْكَیْلَ وَاَنَا خَیْرُ الْمُنْزِلِیْنَ ۟
మరియు ఆయన (యూసుఫ్) వారు కోరిన ఆహారపు సామగ్రి,ప్రయాణపు సామగ్రిని వారికి సమకూర్చినప్పుడు వారు తమ తండ్రి నుండి ఒక సోదరుడు ఉన్నాడని అతడిని వారు అతని తండ్రి వద్ద వదిలి వచ్చారని ఆయనకు (యూసుఫ్ కు) తెలియపరచిన తరువాత ఆయన ఇలా పలికారు : మీ తండ్రి తరపు నుండి మీ సోదరుడిని నా వద్దకు తీసుకుని రండి అప్పుడు నేను ఒక ఒంటె మోసే బరువంత ఆహార సామగ్రిని మీకు ఇస్తాను.ఏమీ నేను తగ్గించకుండా పరిపూర్ణంగా కొలతలు వేస్తున్నది మీరు చూడటం లేదా .మరియు నేను ఉత్తమ అతిధేయుడిని.
Arabic explanations of the Qur’an:
فَاِنْ لَّمْ تَاْتُوْنِیْ بِهٖ فَلَا كَیْلَ لَكُمْ عِنْدِیْ وَلَا تَقْرَبُوْنِ ۟
ఒక వేళ మీరు అతడిని నా వద్దకు తీసుకుని రాకపోయి మీ తండ్రి నుండి మీకు ఒక సోదరుడు ఉన్నాడన్న మీ వాదనలో మీ అబద్దము స్పష్టమైతే నేను మీ కొరకు ఎటువంటి ఆహారమును కొలచి ఇవ్వను.మరియు మీరు నా నగర దరిదాపులకు రాకండి.
Arabic explanations of the Qur’an:
قَالُوْا سَنُرَاوِدُ عَنْهُ اَبَاهُ وَاِنَّا لَفٰعِلُوْنَ ۟
అప్పుడు అతని సోదరులు ఇలా పలుకుతూ అతనికి సమాధానమిచ్చారు : మేము అతని తండ్రి నుండి అతడిని కోరుతాము.మరియు ఈ విషయంలో మేము ప్రయత్నం చేస్తాము.మరియు నిశ్చయంగా మేము నీవు మాకు ఇచ్చిన ఆదేశమును ఎటువంటి లోపము లేకుండా పూర్తి చేస్తాము.
Arabic explanations of the Qur’an:
وَقَالَ لِفِتْیٰنِهِ اجْعَلُوْا بِضَاعَتَهُمْ فِیْ رِحَالِهِمْ لَعَلَّهُمْ یَعْرِفُوْنَهَاۤ اِذَا انْقَلَبُوْۤا اِلٰۤی اَهْلِهِمْ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
మరియు యూసుఫ్ అలైహిస్సలాం తన సేవకులతో ఇలా ఆదేశించారు : మీరు వీరందరి ధాన్యమును కొనే రుసుమును వారికి వాపసు ఇచ్చేయండి చివరికి వారు మరలి వెళ్లినప్పుడు మేము వారి నుండి ధాన్యపు రుసుమును తీసుకో లేదని గుర్తిస్తారు.ఇది వారిని రెండోవసారి రావటానికి బలవంతం చేస్తుంది.మరియు తమతోపాటు తమ సోదరుడిని యూసుఫ్ యందు తమ నిజాయితీని నిరూపించుకోవటానికి తీసుకుని వస్తారు.మరియు ఆయన వారి నుండి తమ సరకులను అంగీకరించటానికి.
Arabic explanations of the Qur’an:
فَلَمَّا رَجَعُوْۤا اِلٰۤی اَبِیْهِمْ قَالُوْا یٰۤاَبَانَا مُنِعَ مِنَّا الْكَیْلُ فَاَرْسِلْ مَعَنَاۤ اَخَانَا نَكْتَلْ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ ۟
అయితే వారు తమ తండ్రి వద్దకు మరలి మరియు ఆయనకు వారు తమకు యూసుఫ్ అలైహిస్సలాం చేసిన గౌరవ మర్యాదల గురించి తెలియపరచినప్పుడు వారు ఇలా పలికారు : ఓ మా తండ్రి మేము ధాన్యం ఇవ్వబడటం నుండి ఆపబడ్డాము ఒక వేళ మేము మాతోపాటు మా సోదరుడిని తీసుకుని రాకపోతే. కావున నీవు అతడిని మాతోపాటు పంపించు.ఒక వేళ నీవు అతడిని మాతోపాటు పంపిస్తే మాకు ధాన్యం కొలచి ఇవ్వటం జరుగుతుంది.నిశ్చయంగా అతడిని నీ వద్దకు భద్రంగా తీసుకుని వచ్చేంత వరకు అతని రక్షణ గురించి నీకు మేము మాట ఇస్తున్నాము.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من أعداء المؤمن: نفسه التي بين جنبيه؛ لذا وجب عليه مراقبتها وتقويم اعوجاجها.
విశ్వాసపరుని శతృవుల్లోంచి అతని హృదయము ఏదైతే అతని రెండు మొండెముల (వైపుల) మధ్యలో ఉన్నది.అందు వలనే అతనిపై దాన్ని పరిరక్షించుకోవటం మరియు దాని వంకరు తనమును సరి దిద్దటం అవసరము.

• اشتراط العلم والأمانة فيمن يتولى منصبًا يصلح به أمر العامة.
ప్రజల విషయాలు సరిగా ఉండే స్ధానం బాధ్యత వహించే వాడిలో జ్ఞానం,అమానత్ ఉండటం అవసరము.

• بيان أن ما في الآخرة من فضل الله، إنما هو خير وأبقى وأفضل لأهل الإيمان.
పరలోకములో ఉన్న అల్లాహ్ అనుగ్రహము విశ్వాసము కలవారి కొరకు మేలైనది,శాస్వతమైనది,ఉత్తమమైనది అని ప్రకటన.

• جواز طلب الرجل المنصب ومدحه لنفسه إن دعت الحاجة، وكان مريدًا للخير والصلاح.
అవసరమైతే మనిషి పదవిని కోరటం మరియు తనను తాను ప్రశంసించుకోవటం ధర్మసమ్మతమే.మరియు అతడు మంచిని,సంస్కరణను కోరేవాడై ఉంటాడు.

 
Translation of the meanings Surah: Yūsuf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close