Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: An-Noor   Ayah:
اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَاِذَا كَانُوْا مَعَهٗ عَلٰۤی اَمْرٍ جَامِعٍ لَّمْ یَذْهَبُوْا حَتّٰی یَسْتَاْذِنُوْهُ ؕ— اِنَّ الَّذِیْنَ یَسْتَاْذِنُوْنَكَ اُولٰٓىِٕكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ ۚ— فَاِذَا اسْتَاْذَنُوْكَ لِبَعْضِ شَاْنِهِمْ فَاْذَنْ لِّمَنْ شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరుస్తారో,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తారో వారే తమ విశ్వాసములో సత్యవంతులైన విశ్వాసవంతులు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఏదైన వ్యవహారం విషయంలో ముస్లిముల ప్రయోజనం కొరకు సమావేశమైనప్పుడు వారు ఆయనతో తాము మరలటానికి అనుమతి కోరనంత వరకు వారు మరలరు. ఓ ప్రవక్తా నిశ్ఛయంగా ఎవరైతే మరలేటప్పుడు మీతో అనుమతి కోరుతారో వారందరు వాస్తవానికి అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారు,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరిచే వారు. వారు తమ అత్యవసర ఏదైన పని నిమిత్తం మీతో అనుమతి కోరినప్పుడు మీరు వారిలో నుండి ఎవరికి అనుమతినివ్వదలచుకుంటే వారికి అనుమతినివ్వండి. మరియు వారి పాపముల కొరకు మన్నింపును వేడుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును.
Arabic explanations of the Qur’an:
لَا تَجْعَلُوْا دُعَآءَ الرَّسُوْلِ بَیْنَكُمْ كَدُعَآءِ بَعْضِكُمْ بَعْضًا ؕ— قَدْ یَعْلَمُ اللّٰهُ الَّذِیْنَ یَتَسَلَّلُوْنَ مِنْكُمْ لِوَاذًا ۚ— فَلْیَحْذَرِ الَّذِیْنَ یُخَالِفُوْنَ عَنْ اَمْرِهٖۤ اَنْ تُصِیْبَهُمْ فِتْنَةٌ اَوْ یُصِیْبَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ ప్రవక్తను గౌరవించండి. మీరు ఆయనను పిలిచినప్పుడు ఆయన పేరుతో ఓ ముహమ్మద్ అని లేదా ఆయన తండ్రి పేరుతో కలిపి ఓ అబ్దుల్లాహ్ కుమారుడా అని పిలవకండి. ఏ విధంగానైతే మీరు ఒకరితో ఒకరు చేసేవారో అలా (చేయకండి). కాని మీరు ఓ అల్లాహ్ ప్రవక్తా (యా రసూలల్లాహ్) ఓ అల్లాహ్ సందేశహరుడా (యా నబియల్లాహ్ ) అని పలకండి. మరియు ఆయన మిమ్మల్ని ఏదైన సాధారణ విషయం కోసం పిలిచినప్పుడు మీరు ఆయన పిలుపును అలవాటు ప్రకారంగా మీలో కొందరు కొందరిని అల్పమైన విషయాల కోసం పిలిచే పిలుపుగా చేయకండి. అంతేకాదు మీరు దాన్ని స్వీకరించటానికి త్వరపడండి. వాస్తవానికి మీలో నుండి అనుమతి లేకుండా చాటుగా మరలేవారి గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశమునకు వ్యతిరేకించేవారు అల్లాహ్ వారిని ఏదైన బాధను,ఆపదను కలిగింపజేస్తాడని లేదా వారికి వారు భరించలేని బాధాకరమైన శిక్షను కలిగింపజేస్తాడని జాగ్రత్తపడాలి.
Arabic explanations of the Qur’an:
اَلَاۤ اِنَّ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قَدْ یَعْلَمُ مَاۤ اَنْتُمْ عَلَیْهِ ؕ— وَیَوْمَ یُرْجَعُوْنَ اِلَیْهِ فَیُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
వినండి నిశ్ఛయంగా ఆకాశముల్లో ఉన్నవన్నీ,భూమిలో ఉన్నవన్నీ సృష్టిపరంగా,అధికారం పరంగా, పర్యాలోచన పరంగా ఒక్కడైన అల్లాహ్ కొరకే. ఓ ప్రజలారా మీరు ఉన్న స్థితుల గురించి ఆయనకు తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ప్రళయదినాన - మరణాంతరం లేపబడటం ద్వారా వారు మరలించబడినప్పుడు - ఆయన వారికి ఇహలోకంలో వారు చేసిన కర్మల గురించి తెలియపరుస్తాడు. మరియు అల్లాహ్ అన్ని విషయాల గురించి బాగా తెలిసినవాడు. ఆకాశముల్లో గాని భూమిలో గాని ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• دين الإسلام دين النظام والآداب، وفي الالتزام بالآداب بركة وخير.
ఇస్లాం ధర్మం క్రమం,పధ్ధతుల యొక్క ధర్మం. మరియు పధ్ధతులకు కట్టుబడి ఉండటంలో శుభము,మేలు ఉంటాయి.

• منزلة رسول الله صلى الله عليه وسلم تقتضي توقيره واحترامه أكثر من غيره.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఇతరుల కన్న ఎక్కువగా ఆయనను గౌరవించటమును నిర్ధారిస్తుంది.

• شؤم مخالفة سُنَّة النبي صلى الله عليه وسلم.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయమును విబేధము యొక్క అశుభము.

• إحاطة ملك الله وعلمه بكل شيء.
ప్రతీ వస్తువును అల్లాహ్ యొక్క అధికారము,ఆయన జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది.

 
Translation of the meanings Surah: An-Noor
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close