Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: An-Noor   Ayah:
قُلْ اَطِیْعُوا اللّٰهَ وَاَطِیْعُوا الرَّسُوْلَ ۚ— فَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَیْهِ مَا حُمِّلَ وَعَلَیْكُمْ مَّا حُمِّلْتُمْ ؕ— وَاِنْ تُطِیْعُوْهُ تَهْتَدُوْا ؕ— وَمَا عَلَی الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ الْمُبِیْنُ ۟
ఓ ప్రవక్తా ఈ కపట విశ్వాసులందరితో అనండి : మీరు అల్లాహ్ కు,ప్రవక్తకు బహిర్గంగా,అంతరంగా విధేయత చూపండి. ఒక వేళ మీరు వారిద్దరి విధేయత విషయంలో మీకు ఆదేశించబడిన వాటి గురించి విముఖత చూపితే ఆయనపై సందేశాలను చేరవేసే బాధ్యత ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే ఆయన బాధ్యులు మరియు ఆయన తీసుకుని వచ్చిన దానిపై వీధేయత చూపే, ఆచరించే బాధ్యత, మీకు ఏదైతే ఇవ్వబడినదో దాని బాధ్యత మీపై ఉన్నది. ఒక వేళ మీరు ఆయన మీకు ఆదేశించిన వాటిని పాటించి,మీకు వారించిన వాటిని విడనాడి ఆయనకు విధేయత చూపితే మీరు సత్యము వైపునకు మార్గం పొందుతారు. మరియు ప్రవక్తపై స్పష్టంగా చేరవేసే బాధ్యత మాత్రమే ఉన్నది. సన్మార్గము పై మిమ్మల్ని ప్రేరేపించే,దానిపై మిమ్మల్ని బలవంతం పెట్టే బాధ్యత ఆయనపై లేదు.
Arabic explanations of the Qur’an:
وَعَدَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا مِنْكُمْ وَعَمِلُوا الصّٰلِحٰتِ لَیَسْتَخْلِفَنَّهُمْ فِی الْاَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ۪— وَلَیُمَكِّنَنَّ لَهُمْ دِیْنَهُمُ الَّذِی ارْتَضٰی لَهُمْ وَلَیُبَدِّلَنَّهُمْ مِّنْ بَعْدِ خَوْفِهِمْ اَمْنًا ؕ— یَعْبُدُوْنَنِیْ لَا یُشْرِكُوْنَ بِیْ شَیْـًٔا ؕ— وَمَنْ كَفَرَ بَعْدَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟
మీలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసే వారికి వారి శతృవులకు విరుద్ధంగా సహాయం చేస్తాడని,వారికన్న మునుపు విశ్వాసపరులని భూమిలో ప్రతి నిధులుగా చేసినట్లు వారినీ ప్రతినిధులుగా చేస్తాడని అల్లాహ్ వాగ్దానం చేశాడు. మరియు వారి కొరకు తాను ఇష్టపడిన ధర్మమైన ఇస్లాం ధర్మమును స్థిరంగా,ఆధిక్యంగా చేస్తాడని వారికి వాగ్దానం చేశాడు. మరియు వారి భయాందోళనల స్థితి తరువాత వారికి శాంతి స్థితిగా మారుస్తాడని వాగ్దానం చేశాడు. వారు నన్నే ఆరాధించాలి. మరియు నాతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు. ఈ అనుగ్రహాల తరువాత ఎవరైతే కృతఘ్నులవుతారో వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలిగిన వారు.
Arabic explanations of the Qur’an:
وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاَطِیْعُوا الرَّسُوْلَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ కారుణ్యమును పొందటమును ఆశిస్తూ నమాజులను సంపూర్ణ పధ్ధతిలో పాటించండి, మీ సంపదల నుండి జకాతును చెల్లించండి,మీకు ఆదేశించిన వాటిని పాటించి,మీకు వారించిన వాటిని విడనాడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి.
Arabic explanations of the Qur’an:
لَا تَحْسَبَنَّ الَّذِیْنَ كَفَرُوْا مُعْجِزِیْنَ فِی الْاَرْضِ ۚ— وَمَاْوٰىهُمُ النَّارُ ؕ— وَلَبِئْسَ الْمَصِیْرُ ۟۠
ఓ ప్రవక్తా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు నేను వారిపై శిక్షను అవతరింపదలచినప్పుడు వారు నా నుండి తప్పించుకుంటారని మీరు భావించకండి. ప్రళయదినాన వారి నివాసం నరకము. ఎవరి గమ్య స్థానము నరకమయిద్దో వారి గమ్య స్థానం ఎంత చెడ్డదైనదో.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لِیَسْتَاْذِنْكُمُ الَّذِیْنَ مَلَكَتْ اَیْمَانُكُمْ وَالَّذِیْنَ لَمْ یَبْلُغُوا الْحُلُمَ مِنْكُمْ ثَلٰثَ مَرّٰتٍ ؕ— مِنْ قَبْلِ صَلٰوةِ الْفَجْرِ وَحِیْنَ تَضَعُوْنَ ثِیَابَكُمْ مِّنَ الظَّهِیْرَةِ وَمِنْ بَعْدِ صَلٰوةِ الْعِشَآءِ ۫ؕ— ثَلٰثُ عَوْرٰتٍ لَّكُمْ ؕ— لَیْسَ عَلَیْكُمْ وَلَا عَلَیْهِمْ جُنَاحٌ بَعْدَهُنَّ ؕ— طَوّٰفُوْنَ عَلَیْكُمْ بَعْضُكُمْ عَلٰی بَعْضٍ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీ బానిస పురుషులు,మీ బానిస స్త్రీలు,ప్రజ్ఞా వయస్సుకు చేరని స్వతంతృలైన పిల్లలు మూడు వేళల్లో మీతో అనుమతి తీసుకోవాలి అవి : 1) ప్రొద్దున నమాజు కన్నముందు నిద్ర బట్టలను మార్చి మేల్కొనే బట్టలు వేసుకునే వేళ, 2) మద్యాహ్న నమాజు తరువాత మీరు విశ్రాంతి కొరకు మీ వస్త్రములను విడిచిన వేళ, 3) ఇషా నమాజు తరువాత ఎందుకంటే అది మీ నిద్ర సమయము మరియు మేల్కొన్నప్పుడు వేసుకున్న బట్టలను విడిచి నిద్ర బట్టలు తొడుగుకునే సమయము. ఈ మూడు మీ పరదా సమయములు. ఆ సమయాలలో వారు మీ వద్దకు మీ అనుమతి తరువాతే రావాలి. వేరే సమయములలో అనుమతి లేకుండా వారు మీ వద్దకు వస్తే మీ పై ఎటువంటి పాపం లేదు. వారు ఎక్కువగా వస్తూ పోవు వారు. మీరు ఒకరి వద్దకు ఒకరు వచ్చి పోయేవారు. అనుమతితో తప్ప అన్ని సమయాలలో ప్రవేశించకుండా వారిని నిరోధించలేము. ఏ విధంగానైతే అల్లాహ్ మీకు అనుమతి తీసుకునే ఆదేశాలను స్పష్టపరచాడో మీ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన ఆదేశములను సూచించే ఆయతులను మీ కొరకు స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనాల గురించి బాగా తెలిసినవాడు,వారి కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటి విషయంలో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• اتباع الرسول صلى الله عليه وسلم علامة الاهتداء.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం సన్మార్గం పొందటమునకు సూచన.

• على الداعية بذل الجهد في الدعوة، والنتائج بيد الله.
ధర్మ ప్రచారంలో శ్రమను ధారపోయటం ప్రచారకుని బాధ్యత. మరియు ఫలితాలు అల్లాహ్ చేతిలో ఉన్నవి.

• الإيمان والعمل الصالح سبب التمكين في الأرض والأمن.
విశ్వాసం,సత్కార్యము భూమిపై సాధికారతకు మరియు భద్రతకు కారణం.

• تأديب العبيد والأطفال على الاستئذان في أوقات ظهور عورات الناس.
ప్రజల సిగ్గు ప్రదేశాలు బహిర్గతమయ్యే వేళల్లో అనుమతి తీసుకోవటంపై బానిసల,పిల్లల యొక్క క్రమశిక్షణ.

 
Translation of the meanings Surah: An-Noor
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close