Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: An-Nisā’   Ayah:
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَیَجْمَعَنَّكُمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ لَا رَیْبَ فِیْهِ ؕ— وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ حَدِیْثًا ۟۠
అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం ఎవరూ లేరు. ఎటువంటి సందేహం లేని ప్రళయదినమున ఆయన మీలోని మొదటి వారిని మరియు మీ చివరి వారిని మీ కర్మలపై మీకు ప్రతిఫలం ప్రసాదించటానికి తప్పకుండా సమావేశపరుస్తాడు. మాటపరంగా అల్లాహ్ కన్నా ఎక్కువ సత్యవంతుడు ఎవడూ లేడు.
Arabic explanations of the Qur’an:
فَمَا لَكُمْ فِی الْمُنٰفِقِیْنَ فِئَتَیْنِ وَاللّٰهُ اَرْكَسَهُمْ بِمَا كَسَبُوْا ؕ— اَتُرِیْدُوْنَ اَنْ تَهْدُوْا مَنْ اَضَلَّ اللّٰهُ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِیْلًا ۟
ఓ విశ్వాసపరులారా మీ విషయమేమిటి? కపటవిశ్వాసులతో వ్యవహరించే విషయంలో విభేదించుకున్న రెండు వర్గములుగా అయిపోయారు. ఒక వర్గము వారి అవిశ్వాసం వలన వారితో యుద్ధం చేయాలని అంటుంది. మరియు ఒక వర్గము వారి విశ్వాసం వలన వారితో యుద్ధంను వదిలివేయాలని అంటుంది ?. వారి విషయంలో మీరు విభేదించుకోవటం మీకు తగదు. మరియు అల్లాహ్ వారి కర్మల వలన వారిని అవిశ్వాసం,అపమార్గం వైపునకు మరల్చాడు. ఏమీ అల్లాహ్ సత్యం వైపునకు భాగ్యం కలిగించని వారిని మీరు సన్మార్గం చూపదలచారా ? అల్లాహ్ ఎవరినైతే అపమార్గమునుకు గురి చేస్తాడో అతని కొరకు నీవు సన్మార్గం వైపునకు మార్గం పొందలేవు.
Arabic explanations of the Qur’an:
وَدُّوْا لَوْ تَكْفُرُوْنَ كَمَا كَفَرُوْا فَتَكُوْنُوْنَ سَوَآءً فَلَا تَتَّخِذُوْا مِنْهُمْ اَوْلِیَآءَ حَتّٰی یُهَاجِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— فَاِنْ تَوَلَّوْا فَخُذُوْهُمْ وَاقْتُلُوْهُمْ حَیْثُ وَجَدْتُّمُوْهُمْ ۪— وَلَا تَتَّخِذُوْا مِنْهُمْ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟ۙ
కపటులు ఒక వేళ మీపై అవతరించిన దాన్ని వారు తిరస్కరించినట్లే మీరూ తిరస్కరిస్తే మీరు అవిశ్వాసంలో వారితో పాటు సమానులవుతారని కోరుకుంటున్నారు. కావున వారు తమ విశ్వాసమునకు సూచనగా షిర్క్ ప్రాంతము నుండి ఇస్లాం ఉన్న ప్రాంతములకు హిజ్రత్ చేయనంతవరకు మీరు వారితో ఉన్న శతృత్వం వలన వారిని స్నేహితులుగా చేసుకోకండి. ఒక వేళ వారు విముఖత చూపి తమ స్థితిపై కొనసాగితే వారిని మీరు ఎక్కడ పొందితే అక్కడ పట్టుకుని చంపండి. మరియు మీ వ్యవహారాలకు బాధ్యతవహించే సంరక్షకులుగా,మీ శతృవులకు వ్యతిరేకంగా మీకు సహాయం చేసే మద్దతుదారులుగా వారిలో నుండి మీరు చేసుకోకండి.
Arabic explanations of the Qur’an:
اِلَّا الَّذِیْنَ یَصِلُوْنَ اِلٰی قَوْمٍ بَیْنَكُمْ وَبَیْنَهُمْ مِّیْثَاقٌ اَوْ جَآءُوْكُمْ حَصِرَتْ صُدُوْرُهُمْ اَنْ یُّقَاتِلُوْكُمْ اَوْ یُقَاتِلُوْا قَوْمَهُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمْ عَلَیْكُمْ فَلَقٰتَلُوْكُمْ ۚ— فَاِنِ اعْتَزَلُوْكُمْ فَلَمْ یُقَاتِلُوْكُمْ وَاَلْقَوْا اِلَیْكُمُ السَّلَمَ ۙ— فَمَا جَعَلَ اللّٰهُ لَكُمْ عَلَیْهِمْ سَبِیْلًا ۟
కాని వారిలో నుండి ఎవరైతే ఆ జాతి ప్రజల వద్దకు చేరారో మీకూ వారికీ మధ్య యుద్ధము వదిలివేసే విషయం పై దృఢ ఒప్పందం ఉంటే లేదా మీ వద్దకు ఎవరైతే వచ్చారో వారి హృదయములు కుదించిపోయి వారు మీతో గాని లేదా తమ జాతి వారితో యుద్దము చేయటమును కోరటం లేదో వారికి ఈ ఆదేశం నుండి మినహాయింపు ఉంది. ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే వారికి మీపై ఆధిక్యతను ప్రసాదించేవాడు అప్పుడు వారు మీతో యుద్ధం చేసేవారు. కావున మీరు అల్లాహ్ నుండి ఆయన ప్రసాదించిన శ్రేయస్సును అంగీకరించండి. మరియు చంపడం మరియు బంధించడం ద్వారా మీరు వారితో తలపడకండి. ఒక వేళ వారు మీ నుండి మరలిపోతే వారు మీతో పోరాడరు. మరియు వారు మీతో యుద్ధంను వదిలి వేస్తూ సంధి చేసుకుంటూ మీ వైపునకు వస్తారు. కావున అల్లాహ్ వారిని హతమార్చటానికి లేదా వారిని బంధీ చేయటానికి మీకు వారిపై మార్గం చేయలేదు.
Arabic explanations of the Qur’an:
سَتَجِدُوْنَ اٰخَرِیْنَ یُرِیْدُوْنَ اَنْ یَّاْمَنُوْكُمْ وَیَاْمَنُوْا قَوْمَهُمْ ؕ— كُلَّ مَا رُدُّوْۤا اِلَی الْفِتْنَةِ اُرْكِسُوْا فِیْهَا ۚ— فَاِنْ لَّمْ یَعْتَزِلُوْكُمْ وَیُلْقُوْۤا اِلَیْكُمُ السَّلَمَ وَیَكُفُّوْۤا اَیْدِیَهُمْ فَخُذُوْهُمْ وَاقْتُلُوْهُمْ حَیْثُ ثَقِفْتُمُوْهُمْ ؕ— وَاُولٰٓىِٕكُمْ جَعَلْنَا لَكُمْ عَلَیْهِمْ سُلْطٰنًا مُّبِیْنًا ۟۠
ఓ విశ్వాసపరులారా తొందరలోనే మీరు కపటుల్లోంచి ఇంకో వర్గమును పొందుతారు. వారు మీ ముందట విశ్వాసమును బహిర్గతం చేస్తారు తమ స్వయంపై శాంతి పొందటానికి మరియు తమ జాతి వారిలోంచి అవిశ్వాసపరుల ముందు వారి వైపు మరలినప్పుడు వారి నుండి శాంతి పొందటానికి అవిశ్వాసమును బహిర్గతం చేస్తారు. అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచటం వైపునకు మరియు ఆయనతో పాటు సాటి కల్పించటం వైపునకు వారు పిలవబడినప్పుడల్లా వారు అందులో తీవ్రంగా పడిపోయేవారు. వీరందరు మీతో యుద్దమును వదలకుండా, మీతో సంధీకి రాకుండా,మీ నుండి తమ చేతులను ఆపనప్పుడు మీరు వారిని ఎక్కడ పొందితే అక్కడ పట్టుకుని వారిని సంహరించండి. మరియు వీరందరి ఈ లక్షణమును మేము మీకు వారిని పట్టుకుని సంహరించటానికి స్పష్టమైన వాదనగా చేశాము. వారి విశ్వాసఘాతకానికి మరియు వారి కుట్రకి.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• خفاء حال بعض المنافقين أوقع الخلاف بين المؤمنين في حكم التعامل معهم.
కొంత మంది కపటుల పరిస్థితిని దాచిపెట్టడం వల్ల వారితో వ్యవహరించే ఆదేశం విషయంలో విశ్వాసుల మధ్య విభేదాలు తలెత్తాయి.

• بيان كيفية التعامل مع المنافقين بحسب أحوالهم ومقتضى المصلحة معهم.
కపటులతో వారి పరిస్థితిని బట్టి మరియు వారితో ప్రయోజనం యొక్క అవసరాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో దాని ప్రకటన.

• عدل الإسلام في الكف عمَّن لم تقع منه أذية متعدية من المنافقين.
కపటుల్లోంచి ఎవరి నుండైతే అతిక్రమించే హాని వాటిల్లదో వారి నుండి (యుద్ధంను) ఆపటంలో ఇస్లాం న్యాయం.

• يكشف الجهاد في سبيل الله أهل النفاق بسبب تخلفهم عنه وتكلُّف أعذارهم.
అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం కపటులను దాని నుండి వారు వెనుక ఉండిపోవటం వలన మరియు తమ సాకులను చూపటం వలన బహిర్గతం చేస్తుంది.

 
Translation of the meanings Surah: An-Nisā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close