Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: An-Nisā’   Ayah:
وَاِنِ امْرَاَةٌ خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوْزًا اَوْ اِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَیْهِمَاۤ اَنْ یُّصْلِحَا بَیْنَهُمَا صُلْحًا ؕ— وَالصُّلْحُ خَیْرٌ ؕ— وَاُحْضِرَتِ الْاَنْفُسُ الشُّحَّ ؕ— وَاِنْ تُحْسِنُوْا وَتَتَّقُوْا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟
ఒక వేళ స్త్రీ కి తన భర్త తన నుండి ముఖము తిప్పుకునే మరియు తనలో అయిష్టత చూపే భయం గనక ఉంటే వారిద్దరు పరస్పరం సంధి చేసుకోవటంలో వారిపై ఎటువంటి పాపం లేదు. ఎలాగంటే ఆమె తన పై విధిగావించబడిన తనపై ఖర్చు చేయటం,తన వద్ద రాత్రి గడపటం లాంటి కొన్ని హక్కులను వదిలివేయాలి. ఇక్కడ వారిరువురు సంధి చేసుకోవటం విడాకులు తీసుకోవటం కన్నా వారికి మంచిది. వాస్తవానికి మనస్సులు అత్యాశ,పిసినారి తనంపై పుట్టించబడినవి. కావున అవి తమ కొరకు ఉన్న ఏ హక్కును వదలటానికి కోరుకోవు. కావున భార్యాభర్తలు ఇద్దరు క్షమాపణ,మంచి చేయటంతో మనస్సును పోషించి ఈ గుణము యొక్క వైధ్యం చేయటం అవసరం. మరియు ఒక వేళ మీరు మీ వ్యవహారములన్నింటిలో మంచి చేసి మరియు అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడితే. నిశ్చయంగా మీరు చేసేవాటి గురించి బాగా తెలుసుకునేవాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
وَلَنْ تَسْتَطِیْعُوْۤا اَنْ تَعْدِلُوْا بَیْنَ النِّسَآءِ وَلَوْ حَرَصْتُمْ فَلَا تَمِیْلُوْا كُلَّ الْمَیْلِ فَتَذَرُوْهَا كَالْمُعَلَّقَةِ ؕ— وَاِنْ تُصْلِحُوْا وَتَتَّقُوْا فَاِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟
ఓ భర్తల్లారా మనస్సు మరలే విషయంలో భార్యలతో ఖచ్చితంగా పూర్తిగా న్యాయం చేయలేరు. ఒక వేళ మీకు దాని పై అత్యాశ ఉన్నా కూడా; కొన్ని కారణాల వలన ఒక్కొక్కసారి అవి మీ ఉద్దేశము నుండి బయట ఉంటాయి. కావున మీరు ఇష్టపడని వారి (భార్యల) నుండి పూర్తిగా మరలకండి. ఆమె హక్కును పూర్తి చేయని భర్త వలె మరియు భర్త లేకుండా వివాహంకోసం వేచి ఉన్న దాని (స్త్రీ) వలె వేళాడుతూ ఉన్న దాని(స్త్రీ) వలె ఆమెను వదలకండి. ఒక వేళ మీరు మీ మనస్సులను భార్య హక్కును నెరవేర్చే విషయంలో అవి కోరని వాటిపై ప్రేరేపించి మీ మధ్య సయోధ్య చేసుకుని,దాని విషయంలో మీరు అల్లాహ్ తో భయపడితే నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును,మీపై కరుణించేవాడును.
Arabic explanations of the Qur’an:
وَاِنْ یَّتَفَرَّقَا یُغْنِ اللّٰهُ كُلًّا مِّنْ سَعَتِهٖ ؕ— وَكَانَ اللّٰهُ وَاسِعًا حَكِیْمًا ۟
భార్యాభర్తలు విడాకులు తీసుకోవడ౦ ద్వారా లేదా ఖులా ద్వారా విడిపోతే, అల్లాహ్ తన విస్తారమైన అనుగ్రహ౦ నుండి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తాడు, అల్లాహ్ తన నిర్వహణలోను, తన విధివ్రాతలోను ఎ౦తో ఘనతను, కారుణ్యమును కలిగిన వివేచనాపరుడు.
Arabic explanations of the Qur’an:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَلَقَدْ وَصَّیْنَا الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَاِیَّاكُمْ اَنِ اتَّقُوا اللّٰهَ ؕ— وَاِنْ تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَانَ اللّٰهُ غَنِیًّا حَمِیْدًا ۟
భూమ్యాకాశముల్లో ఉన్న దాని సామ్రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న వాటి సామ్రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు నిశ్చయంగా మేము గ్రంధవహులైన యూదులతో మరియు క్రైస్తవులతో మరియు మీతో అల్లాహ్ ఆదేశములను పాటించమని ఆయన వారించిన వాటికి దూరంగా ఉండమని వాగ్దానం తీసుకున్నాము. మరియు ఒక వేళ మీరు ఈ వాగ్దానమును భంగపరిస్తే మీరు మీ స్వయానికే నష్టం కలిగించుకుంటారు. మరియు అల్లాహ్ కు మీ విధేయత అవసరం లేదు. ఆకాశములో మరియు భూమిలో ఉన్నవాటి అధికారము అల్లాహ్ కే చెందును. ఆయన తన సృష్టితాల అక్కర లేని వాడు. తన గుణాలనన్నింటిలో మరియు తన చర్యలన్నింటిలో ప్రశంసించబడినవాడు.
Arabic explanations of the Qur’an:
وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟
ఆకాశముల్లో ఉన్న వాటి మరియు భూమిలో ఉన్న వాటి రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. విధేయత చూపబడటానికి ఆయన యోగ్యుడు. మరియు తన సృష్టితాల వ్యవహారాలన్నింటి కార్య నిర్వాహకునిగా అల్లాహ్ చాలు.
Arabic explanations of the Qur’an:
اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ اَیُّهَا النَّاسُ وَیَاْتِ بِاٰخَرِیْنَ ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی ذٰلِكَ قَدِیْرًا ۟
ఒక వేళ ఓ ప్రజలారా ఆయన తలచుకుంటే మిమ్మల్ని నాశనం చేసి మీరు కాక ఇతరులను తీసుకుని వస్తాడు వారు అల్లాహ్ కు విధేయత చూపుతారు. మరియు ఆయనకు వారు అవిధేయత చూపరు. మరియు అల్లాహ్ దీని సామర్ధ్యం కలవాడు.
Arabic explanations of the Qur’an:
مَنْ كَانَ یُرِیْدُ ثَوَابَ الدُّنْیَا فَعِنْدَ اللّٰهِ ثَوَابُ الدُّنْیَا وَالْاٰخِرَةِ ؕ— وَكَانَ اللّٰهُ سَمِیْعًا بَصِیْرًا ۟۠
ఓ ప్రజలారా మీలో నుండి ఎవరైన తన కర్మ ద్వారా ప్రాపంచిక ప్రతిఫలమును మాత్రమే కోరుకుంటాడో అతడు ఇహపరాల ప్రతిఫలము అల్లాహ్ వద్దనే ఉన్నదని తెలుసుకోవాలి. మరియు ఆ రెండిటి ప్రతిఫలమును ఆయన నుండి కోరుకోవాలి. మరియు అల్లాహ్ మీ మాటలను వినేవాడు మీ కర్మలను వీక్షించేవాడు. మరియు ఆయన మీకు వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• استحباب المصالحة بين الزوجين عند المنازعة، وتغليب المصلحة بالتنازل عن بعض الحقوق إدامة لعقد الزوجية.
వివాద సమయంలో భార్యభర్తల మధ్య సయోధ్య అవసరం. మరియు వివాహ ఒప్పందమును శాశ్వతం చేయడానికి కొన్ని హక్కులను రద్దు చేయటం ద్వారా ప్రయోజనం ప్రబలంగా ఉంటుంది.

• أوجب الله تعالى العدل بين الزوجات خاصة في الأمور المادية التي هي في مقدور الأزواج، وتسامح الشرع حين يتعذر العدل في الأمور المعنوية، كالحب والميل القلبي.
మహోన్నతుడైన అల్లాహ్ భార్యల మధ్య న్యాయాన్ని అనివార్యం చేశాడు. ముఖ్యంగా భర్తల ఆదీనంలో ఉన్న భౌతిక విషయాల్లో. మరియు ప్రేమ,హృదయ మరలింపు వంటి నైతిక విషయాల్లో న్యాయంగా ఉండటం సాధ్యం కానప్పుడు ధర్మం అనుమతిస్తుంది.

• لا حرج على الزوجين في الفراق إذا تعذرت العِشْرة بينهما.
భార్యాభర్తలిద్దరు కలిసి కాపురం చేయటం సాధ్యం కానప్పుడు విడిపోవటంలో వారిపై ఎటువంటి దోషం లేదు.

• الوصية الجامعة للخلق جميعًا أولهم وآخرهم هي الأمر بتقوى الله تعالى بامتثال الأوامر واجتناب النواهي.
సృష్టినంతటికి వారిలోని మొదటి వారికి,వారిలోని చివరి వారికి సార్వత్రిక ఆజ్ఞ అదేమిటంటే ఆదేశములను పాటించి,వారింపులకు దూరంగా ఉండి అల్లాహ్ భయభీతి గురించి ఆదేశించటం.

 
Translation of the meanings Surah: An-Nisā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close