Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Ash-Shūra   Ayah:

అష్-షురా

Purposes of the Surah:
بيان كمال تشريع الله، ووجوب متابعته، والتحذير من مخالفته.
అల్లాహ్ శాసన౦ యొక్క పరిపూర్ణత గురి౦చి, దాన్ని అనుసరి౦చవలసిన అవసర౦ గురి౦చి, దాన్ని ఉల్ల౦ఘి౦చకు౦డా హెచ్చరి౦చవలసిన అవసర౦ గురి౦చి ప్రకటన

حٰمٓ ۟ۚ
{حمٓ ۝۱ عٓسٓقٓ} హా- మీమ్, ఐన్ - సీన్ - ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది.
Arabic explanations of the Qur’an:
عٓسٓقٓ ۟
{حمٓ ۝۱ عٓسٓقٓ} హా- మీమ్, ఐన్ - సీన్ - ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది.
Arabic explanations of the Qur’an:
كَذٰلِكَ یُوْحِیْۤ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۙ— اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
ఈ దివ్యవాణి లాగే ఆయన ఓ ముహమ్మద్ మీ వైపునకు మరియు మీకన్న మునుపటి అల్లాహ్ సందేశహరుల వైపునకు దివ్యవాణిని అవతరింపజేశాడు. అల్లాహ్ తన శతృవుల నుండి ప్రతీకారం తీర్చుకోవటంలో సర్వాధిక్యుడు మరియు తన పర్యాలోచనలో,తన సృష్టించటంలో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَهُوَ الْعَلِیُّ الْعَظِیْمُ ۟
ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది సృష్టి పరంగా,అధికారము పరంగా,పర్యాలోచన పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు ఆయన తన అస్తిత్వములో,తన సామర్ధ్యములో,తన ఆధిఖ్యతలో మహోన్నతుడు. తన ఉనికిలో గొప్పవాడు.
Arabic explanations of the Qur’an:
تَكَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرْنَ مِنْ فَوْقِهِنَّ وَالْمَلٰٓىِٕكَةُ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیَسْتَغْفِرُوْنَ لِمَنْ فِی الْاَرْضِ ؕ— اَلَاۤ اِنَّ اللّٰهَ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟
పరిశుద్దుడైన ఆయన ఔన్నత్యములో నుంచి ఆకాశములు అవి పెద్దవై,ఎత్తుగా ఉండి కూడా భూముల పై నుండి పేలిపోవటానికి సిద్ధంగా ఉండటం మరియు దైవ దూతలు తమ ప్రభువు యొక్క పరిశుద్ధతను కొనియాడటం మరియు ఆయన కొరకు అణుకువతో,ఆదరణతో స్థుతులను పలుకుతూ ఆయన గొప్పతనమును కొనియాడటం మరియు భూమిలో ఉన్న వారందరి కొరకు అల్లాహ్ నుండి మన్నింపును కోరుకోవటం. వినండీ నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి మన్నింపు కోరుకునే వారి పాపములను బాగా మన్నించేవాడు మరియు వారిపై కరుణించేవాడు.
Arabic explanations of the Qur’an:
وَالَّذِیْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ اللّٰهُ حَفِیْظٌ عَلَیْهِمْ ۖؗ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి విగ్రహాలను తయారు చేసుకున్నారో వారు అల్లాహ్ ను వదిలి వారిని సంరక్షకులుగా చేసుకుని వారిని ఆరాధిస్తున్నారో. అల్లాహ్ వారి కొరకు మాటువేసి ఉండి వారి కర్మలను నమోదు చేసి ఉంటాడు. మరియు వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఓ ప్రవక్త మీకు వారి కర్మలను పరిరక్షించే బాధ్యత లేదు. మీరు వారి కర్మల గురించి ప్రశ్నించబడరు. మీరు మాత్రం సందేశాలను చేరవేసేవారు మాత్రమే.
Arabic explanations of the Qur’an:
وَكَذٰلِكَ اَوْحَیْنَاۤ اِلَیْكَ قُرْاٰنًا عَرَبِیًّا لِّتُنْذِرَ اُمَّ الْقُرٰی وَمَنْ حَوْلَهَا وَتُنْذِرَ یَوْمَ الْجَمْعِ لَا رَیْبَ فِیْهِ ؕ— فَرِیْقٌ فِی الْجَنَّةِ وَفَرِیْقٌ فِی السَّعِیْرِ ۟
ఓ ప్రవక్తా మేము మీ కన్న మునుపటి ప్రవక్తలకు దైవవాణి పంపించినట్లే మీ వైపున అరబీ ఖుర్ఆన్ ను దైవవాణి ద్వారా పంపించినాము. మీరు మక్కా వాసులను,దాని పరిసరములైన అరబ్ బస్తీలను, ఆ తరువాత ప్రజలందరిని హెచ్చరించటానికి మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ముందు వారిని మరియు చివరి వారిని ఒకే భూమిలో సమీకరించే రోజైన ప్రళయదినము నుండి ప్రజలను మీరు భయపెట్టటానికి. ఆ రోజు వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. మరియు ప్రజలు అందులో రెండు వర్గములుగా విభజించబడి ఉంటారు : ఒక వర్గము స్వర్గములో ఉంటారు, వారు విశ్వాసపరులు. మరియు ఒక వర్గము నరకాగ్నిలో ఉంటారు, వారు అవిశ్వాసపరులు.
Arabic explanations of the Qur’an:
وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ— وَالظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
ఒక వేళ అల్లాహ్ వారిని ఇస్లాం ధర్మంపై ఒకే సమాజముగా చేయదలచితే వారిని దానిపై ఒకే సమాజముగా చేస్తాడు. మరియు కాని ఆయన తలచిన వారిని ఇస్లాంలో ప్రవేశింపజేసి అతడిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడని ఆయన వివేకము నిర్ణయించి ఉన్నది. మరియు అవిశ్వాసము ద్వారా,పాప కార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడిన వారిని పరిరక్షించేవాడు ఎవడూ ఉండడు మరియు అల్లాహ్ శిక్ష నుండి వారిని రక్షించే సహాయకుడెవడూ ఉండడు.
Arabic explanations of the Qur’an:
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ۚ— فَاللّٰهُ هُوَ الْوَلِیُّ وَهُوَ یُحْیِ الْمَوْتٰی ؗ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
కాని ఈ ముష్రికులందరు అల్లాహ్ ను వదిలి వారిని సంరక్షించే సంరక్షకులుగా చేసుకున్నారు. మరియు అల్లాహ్ యే వాస్తవ సంరక్షకుడు. ఇతరులు లాభమూ చేకూర్చలేరు మరియు నష్టమూ కలిగించలేరు. మరియు ఆయన మృతులను వారిని మరల లేపటం ద్వారా లెక్క తీసుకుని,ప్రతిఫలం ప్రసాదించటానికి జీవింపజేసేవాడు. పరిశుద్ధుడైన ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Arabic explanations of the Qur’an:
وَمَا اخْتَلَفْتُمْ فِیْهِ مِنْ شَیْءٍ فَحُكْمُهٗۤ اِلَی اللّٰهِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبِّیْ عَلَیْهِ تَوَكَّلْتُ ۖۗ— وَاِلَیْهِ اُنِیْبُ ۟
ఓ ప్రజలారా మీరు మీ ధర్మ మూలముల్లో నుండి లేదా దాని శాఖల్లో నుండి దేని గురించైతే విభేదించుకున్నారో దాని ఆదేశం అల్లాహ్ వద్ద ఉన్నది. కాబట్టి అది ఆ విషయంలో ఆయన గ్రంధం వైపునకు లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ (హదీస్) వైపునకు మరలుతుంది. ఈ గుణాలను కలిగిన ఇతనే నా ప్రభువు. నా వ్యవహారములన్నింటిలో ఆయనపైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను. మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపముతో మరలుతాను.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• عظمة الله ظاهرة في كل شيء.
అల్లాహ్ యొక్క గొప్పతనం ప్రతీ వస్తువులో బహిర్గతమవుతుంది.

• دعاء الملائكة لأهل الإيمان بالخير.
విశ్వాసపరుల కొరకు మేలు గురించి దైవదూతల ప్రార్ధన.

• القرآن والسُنَّة مرجعان للمؤمنين في شؤونهم كلها، وبخاصة عند الاختلاف.
ఖుర్ఆన్ మరియు హదీసు విశ్వాసపరుల కొరకు తమ పూర్తి వ్యవహారములలో రెండూ మరలే చోట్లు. ముఖ్యంగా విభేదాల సమయములో.

• الاقتصار على إنذار أهل مكة ومن حولها؛ لأنهم مقصودون بالرد عليهم لإنكارهم رسالته صلى الله عليه وسلم وهو رسول للناس كافة كما قال تعالى: ﴿وَمَآ أَرسَلنُّكَ إلَّا كافةً لِّلنَّاس...﴾، (سبأ: 28).
మక్కా వాసులకు మరియు దాని చుట్టుపక్కల వారికి హెచ్చరించటం ప్రత్యేకించబడినది ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యమును వారు తిరస్కరించటం వలన వారినే ఖండించే ఉద్దేశముతో. వాస్తవానికి ఆయనే ప్రజలందరి కొరకు ప్రవక్త. ఎలాగైతే మహోన్నతుడైన ఆయన పలికాడో : {وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا كَآفَّةً لِّلنَّاسِ} మేము నిన్ను సమస్త జనుల కొరకు ప్రవక్తగా పంపించాము. (సూర సబా :28)

 
Translation of the meanings Surah: Ash-Shūra
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close