Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Ash-Shūra   Ayah:
وَتَرٰىهُمْ یُعْرَضُوْنَ عَلَیْهَا خٰشِعِیْنَ مِنَ الذُّلِّ یَنْظُرُوْنَ مِنْ طَرْفٍ خَفِیٍّ ؕ— وَقَالَ الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّ الْخٰسِرِیْنَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَاَهْلِیْهِمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اَلَاۤ اِنَّ الظّٰلِمِیْنَ فِیْ عَذَابٍ مُّقِیْمٍ ۟
మరియు ఓ ప్రవక్తా ఈ దుర్మార్గులందరిని, వారు నరకాగ్నిపై ప్రవేశపెట్టబడినప్పుడు వారు అవమానమునకు గురై,సిగ్గు పడతూ ప్రజల వైపునకు దాని భయము వారికి ఉండటం వలన దొంగ చూపులు చూస్తుండగా మీరు చూస్తారు. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచిన వారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా వాస్తవానికి నష్టపోయేవారు వారే ఎవరైతే అల్లాహ్ శిక్షను పొందటం వలన ప్రళయ దినమున తమకు మరియు తమ ఇంటి వారికి నష్టం కలిగించుకుంటారో. వినండి నిశ్ఛయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంనకు అన్యాయం చేసుకున్న వారు ఎన్నటికి అంతం కాని శాశ్వతమైన శిక్షలో ఉంటారు.
Arabic explanations of the Qur’an:
وَمَا كَانَ لَهُمْ مِّنْ اَوْلِیَآءَ یَنْصُرُوْنَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ سَبِیْلٍ ۟ؕ
మరియు వారి కొరకు ప్రళయదినమున అల్లాహ్ శిక్ష నుండి రక్షించటం ద్వారా వారికి సహాయం చేసే సంరక్షకుడెవడూ ఉండడు. మరియు అల్లాహ్ ఎవరినైతే సత్యము నుండి విఫలం చేసి అపమార్గమునకు లోను చేస్తాడో అతని కొరకు ఎన్నటికి సత్యం వైపునకు మార్గదర్శకం చేయటం వైపునకు దారి తీసే ఎటువంటి మార్గం ఉండదు.
Arabic explanations of the Qur’an:
اِسْتَجِیْبُوْا لِرَبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا مَرَدَّ لَهٗ مِنَ اللّٰهِ ؕ— مَا لَكُمْ مِّنْ مَّلْجَاٍ یَّوْمَىِٕذٍ وَّمَا لَكُمْ مِّنْ نَّكِیْرٍ ۟
ఓ ప్రజలారా మీరు మీ ప్రభువునకు ఆయన ఆదేశములను పాటించటానికి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటానికి మరియు కాలయాపనను వదిలిపెట్టటానికి వెంటనే ప్రతిస్పందించండి. ప్రళయం రాక ముందే అది వచ్చినప్పుడు దాన్ని తొలగించేవాడు ఎవడూ ఉండడు. మీ కొరకు మీరు శరణం తీసుకోవటానికి ఎటువంటి శరణాలయం ఉండదు. మరియు మీరు ఇహలోకములో చేసుకున్నటువంటి మీ పాపములను మీరు నిరాకరించటానికి మీ కొరకు ఎటువంటి నిరాకరము ఉండదు.
Arabic explanations of the Qur’an:
فَاِنْ اَعْرَضُوْا فَمَاۤ اَرْسَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ؕ— اِنْ عَلَیْكَ اِلَّا الْبَلٰغُ ؕ— وَاِنَّاۤ اِذَاۤ اَذَقْنَا الْاِنْسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ فَاِنَّ الْاِنْسَانَ كَفُوْرٌ ۟
అయితే ఒక వేళ వారు దేని గురించైతే మీరు వారికి ఆదేశించారో వాటి నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారి కర్మలను పరిరక్షించటానికి వారిపై పరిరక్షకునిగా పంపించలేదు. మీకు ఏ సందేశములను చేరవేయమని ఆదేశించబడినదో వాటిని చేరవేసే బాధ్యత మాత్రమే మీపై ఉన్నది. వారి లెక్క తీసుకునే బాధ్యత అల్లాహ్ పై ఉన్నది. మరియు నిశ్చయంగా మేము మానవునికి మా వద్ద నుండి ఐశ్వర్యము,ఆరోగ్యము, వాటి లాంటి వాటిని కారుణ్యముగా రుచి చూపించినప్పుడు అతడు వాటితో సంబరపడిపోయేవాడు. మరియు ఒక వేళ మానవునికి ఏదైన ఆపద వారి పాపముల వలన కలిగితే నిశ్ఛయంగా వారి స్వభావము అల్లాహ్ అనుగ్రహములకు కృతఘ్నులయ్యి వాటికి కృతజ్ఞత తెలుపకపోవటం మరియు అల్లాహ్ తన విజ్ఞతతో నిర్ణయించిన దాని విషయంలో ఆగ్రహానికి లోనవటం.
Arabic explanations of the Qur’an:
لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— یَخْلُقُ مَا یَشَآءُ ؕ— یَهَبُ لِمَنْ یَّشَآءُ اِنَاثًا وَّیَهَبُ لِمَنْ یَّشَآءُ الذُّكُوْرَ ۟ۙ
ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి యొక్క సామ్రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. మగ లేదా ఆడ లేదా ఇతర వాటిలోంచి తాను తలచిన దాన్ని సృష్టిస్తాడు. తాను తలచిన వారికి ఆడ సంతానమును ఇచ్చి వారికి మగ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి మగ సంతానమును ఇచ్చి వారికి ఆడ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి ఆడ,మగ సంతానమును కలిపి ఇస్తాడు. మరియు తాను తలచిన వారికి సంతానము కలగకుండా గొడ్రాలుగా చేస్తాడు. నిశ్చయంగా జరుగుతున్నది,భవిష్యత్తులో జరగబోయేది ఆయనకు బాగా తెలుసు. మరియు ఇది ఆయన పరిపూర్ణ జ్ఞానం వలన మరియు సంపూర్ణ విజ్ఞత వలన జరుగుతుంది. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Arabic explanations of the Qur’an:
اَوْ یُزَوِّجُهُمْ ذُكْرَانًا وَّاِنَاثًا ۚ— وَیَجْعَلُ مَنْ یَّشَآءُ عَقِیْمًا ؕ— اِنَّهٗ عَلِیْمٌ قَدِیْرٌ ۟
ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి యొక్క సామ్రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. మగ లేదా ఆడ లేదా ఇతర వాటిలోంచి తాను తలచిన దాన్ని సృష్టిస్తాడు. తాను తలచిన వారికి ఆడ సంతానమును ఇచ్చి వారికి మగ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి మగ సంతానమును ఇచ్చి వారికి ఆడ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి ఆడ,మగ సంతానమును కలిపి ఇస్తాడు. మరియు తాను తలచిన వారికి సంతానము కలగకుండా గొడ్రాలుగా చేస్తాడు. నిశ్చయంగా జరుగుతున్నది,భవిష్యత్తులో జరగబోయేది ఆయనకు బాగా తెలుసు. మరియు ఇది ఆయన పరిపూర్ణ జ్ఞానం వలన మరియు సంపూర్ణ విజ్ఞత వలన జరుగుతుంది. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Arabic explanations of the Qur’an:
وَمَا كَانَ لِبَشَرٍ اَنْ یُّكَلِّمَهُ اللّٰهُ اِلَّا وَحْیًا اَوْ مِنْ وَّرَآئِ حِجَابٍ اَوْ یُرْسِلَ رَسُوْلًا فَیُوْحِیَ بِاِذْنِهٖ مَا یَشَآءُ ؕ— اِنَّهٗ عَلِیٌّ حَكِیْمٌ ۟
అల్లాహ్ ఏ మానవునితో మాట్లాడటం సంభవం కాదు కాని దైవ వాణి తో లేదా వేరే విధంగా లేదా అతనితో కనబడకుండా తన మాటను వినే విధంగా లేదా జిబ్రయీల్ లాంటి ఒక దూతను పంపించి మాట్లాడుతాడు. అప్పుడు అతను మానవ పాత్రుడైన ప్రవక్తకు అల్లాహ్ ఆదేశం మేరకు ఆయనకు అల్లాహ్ దైవ వాణి చేరవేయదలచుకున్న దైవవాణిని చేరవేస్తాడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన అస్తిత్వంలో,తన గుణములలో మహోన్నతుడు, తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• وجوب المسارعة إلى امتثال أوامر الله واجتناب نواهيه.
అల్లాహ్ ఆదేశములను పాటించటం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం వైపునకు త్వరపడటం తప్పనిసరి.

• مهمة الرسول البلاغ، والنتائج بيد الله.
ప్రవక్త లక్ష్యం సందేశములను చేరవేయటం. మరియు ఫలితాలు అల్లాహ్ చేతిలో కలవు.

• هبة الذكور أو الإناث أو جمعهما معًا هو على مقتضى علم الله بما يصلح لعباده، ليس فيها مزية للذكور دون الإناث.
మగ సంతానమును లేదా ఆడ సంతానమును లేదా రెండింటిని కలిపి ప్రసాదించటం అది తన దాసులకు ఏది ప్రయోజనం కలిగించునో అల్లాహ్ జ్ఞాన నిర్ణయం పై జరుగును. ఆడ సంతానము కాకుండా మగసంతానమునకు ఇందులో ఎటువంటి ప్రాధాన్యత లేదు.

• يوحي الله تعالى إلى أنبيائه بطرق شتى؛ لِحِكَمٍ يعلمها سبحانه.
మహోన్నతుడైన అల్లాహ్ తన సందేశహరులకు రకరకాల మార్గముల ద్వారా దైవవాణిని చేరవేస్తాడు.పరిశుద్ధుడైన ఆయనకు తెలిసిన విజ్ఞతల వలన.

 
Translation of the meanings Surah: Ash-Shūra
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close