Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Mā’idah   Ayah:
سَمّٰعُوْنَ لِلْكَذِبِ اَكّٰلُوْنَ لِلسُّحْتِ ؕ— فَاِنْ جَآءُوْكَ فَاحْكُمْ بَیْنَهُمْ اَوْ اَعْرِضْ عَنْهُمْ ۚ— وَاِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ یَّضُرُّوْكَ شَیْـًٔا ؕ— وَاِنْ حَكَمْتَ فَاحْكُمْ بَیْنَهُمْ بِالْقِسْطِ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ ۟
ఈ యూదులందరు అబద్దాలను ఎక్కువగా వినేవారు,వడ్డీ లాంటి నిషిద్ధ సంపదను అధికంగా తినేవారు. ఓ ప్రవక్తా ఒక వేళ వారు మీ వద్దకు తీర్పు ఇవ్వమని వస్తే మీరు తలచుకుంటే వారి మధ్య తీర్పునివ్వండి లేదా మీరు తలచుకుంటే వారి మధ్య తీర్పును వదిలివేయండి. ఈ రెండు విషయముల్లో మీకు ఎంపిక చేసుకునే హక్కు ఉన్నది. మరియు ఒక వేళ మీరు వారి మధ్య తీర్పునివ్వటమును వదిలివేస్తే వారు మీకు ఎటువంటి కీడును కలిగించలేరు. మరియు ఒక వేళ మీరు వారి మధ్య తీర్పునిస్తే న్యాయముతో వారి మధ్య తీర్పునివ్వండి. మరియు ఒక వేళ వారు దుర్మార్గులైనా,శతృవులైనా. నిశ్చయంగా అల్లాహ్ తమ తీర్పునివ్వటంలో న్యాయంగా వ్యవహరించేవారిని ఇష్టపడుతాడు. మరియు ఒక వేళ తీర్పు ఇవ్వబడిన వారు తీర్పునిచ్చే వారి కొరకు శతృవులైనా సరే.
Arabic explanations of the Qur’an:
وَكَیْفَ یُحَكِّمُوْنَكَ وَعِنْدَهُمُ التَّوْرٰىةُ فِیْهَا حُكْمُ اللّٰهِ ثُمَّ یَتَوَلَّوْنَ مِنْ بَعْدِ ذٰلِكَ ؕ— وَمَاۤ اُولٰٓىِٕكَ بِالْمُؤْمِنِیْنَ ۟۠
మరియు నిశ్చయంగా వీరందరి విషయం ఆశ్ఛర్యకరమైనది. వారు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు మరియు తమ మనోవాంఛలకు అనుగుణంగా ఉండే వాటితో మీ తీర్పు ఉంటుందని ఆశిస్తూ మీ వద్దకు తీర్పుకోసం వస్తున్నారు. వాస్తవానికి తమ విశ్వాసమున్నదని వారు వాదిస్తున్న తౌరాత్ వారి వద్ద ఉన్నది. అందులో అల్లాహ్ తీర్పు ఉన్నది. ఆ పిదప వారు మీ తీర్పు నుండి అది వారి మనో వాంఛలకు అనుగుణంగా లేనప్పుడు విముఖత చూపుతున్నారు. అయితే వారు తమ పుస్తకములో ఉన్న వాటి పట్ల తిరస్కారము మరియు మీ తీర్పు నుండి విముఖతకు మధ్య సమీకరిస్తున్నారు. మరియు వారందరు చేసినది విశ్వాసపరులు చేసినది కాదు. కావున వారు అప్పుడు మీపై మరియు మీరు తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసము కనబరచినవారు కాదు.
Arabic explanations of the Qur’an:
اِنَّاۤ اَنْزَلْنَا التَّوْرٰىةَ فِیْهَا هُدًی وَّنُوْرٌ ۚ— یَحْكُمُ بِهَا النَّبِیُّوْنَ الَّذِیْنَ اَسْلَمُوْا لِلَّذِیْنَ هَادُوْا وَالرَّبّٰنِیُّوْنَ وَالْاَحْبَارُ بِمَا اسْتُحْفِظُوْا مِنْ كِتٰبِ اللّٰهِ وَكَانُوْا عَلَیْهِ شُهَدَآءَ ۚ— فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ ۟
నిశ్చయంగా మేము తౌరాతును మూసా అలైహిస్సలాంపై అవతరింపజేశాము. అందులో ఋజుమార్గ దర్శకం మరియు మేలు గురించి సూచనలు కలవు. మరియు వెలుగును పొందే జ్యోతి కలదు. అల్లాహ్ కు విధేయత ద్వారా కట్టుబడి ఉండిన బనీ ఇస్రాయీల్ యొక్క ప్రవక్తలు వాటి ద్వారా తీర్పునిస్తున్నారు. మరియు తమను అల్లాహ్ తన గ్రంధముపై పరిరక్షకులుగా చేయటం వలన ప్రజలను సంస్కరించే (బోధించే) ధర్మ పండితులు మరియు విధ్వంసులు వాటి ద్వారా తీర్పునిస్తున్నారు. మరియు ఆయన వారిని దాని పరిరక్షకులుగా చేశాడు వారు దాన్ని మర్పు చేర్పుల నుండి పరిరక్షిస్తున్నారు. మరియు అది సత్యమని వారే సాక్షులు. మరియు ప్రజలు దాని విషయంలో వారి వైపునకే మరలుతున్నారు. ఓ యూదులారా మీరు ప్రజల నుండి భయపడకండి నా ఒక్కడితోనే భయపడండి. మరియు అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశమునకు బదులుగా అల్ప ఖరీదైన రాజరికమును లేదా గౌరవమును లేదా సంపదను తీసుకోకండి. మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ద్వారా తీర్పు జెప్పడో దాన్ని ధర్మ సమ్మతంగా అనుకుంటూ లేదా దానిపై వేరేదాన్ని ప్రాధాన్యతనిస్తూ లేదా దాన్ని దానికి సమానంగా అనుకుంటూ. వారే వాస్తవానికి అవిశ్వాసులు.
Arabic explanations of the Qur’an:
وَكَتَبْنَا عَلَیْهِمْ فِیْهَاۤ اَنَّ النَّفْسَ بِالنَّفْسِ ۙ— وَالْعَیْنَ بِالْعَیْنِ وَالْاَنْفَ بِالْاَنْفِ وَالْاُذُنَ بِالْاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ ۙ— وَالْجُرُوْحَ قِصَاصٌ ؕ— فَمَنْ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
మరియు మేము తౌరాతులో యూదులపై విధిగావించాము ఎవరైతే అన్యాయంగా కావాలని ఏ ప్రాణమును హతమార్చినా అతడిని దానికి బదులుగా హతమార్చాలి మరియు ఎవరైతే ఉద్ధేశపూర్వకంగా ఏదైన కన్ను పీకితే అతని కన్ను పీకివేయాలని మరియు ఎవరైతే ఉద్ధేశపూర్వకంగా ఏదైన ముక్కు కోసినా అతని ముక్కు కోసివేయాలని మరియు ఎవరైతే ఉద్ధేశపూర్వకంగా ఏదైన చెవి కోస్తే అతని చెవి కోసివేయాలని మరియు ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఏదైన పన్ను పీకితే అతని పన్ను పీకివేయాలని. మరియు గాయాల విషయంలో నేరస్తుడు తన అదే నేరంతో శిక్షింపబడతాడని మేము వారిపై వ్రాశాము. మరియు ఎవరైతే నేరస్తుడిని స్వచ్ఛందంగా క్షమించి వేస్తాడో అతని క్షమాపణ అతని పాపములకు పరిహారమవుతుంది అతని క్షమాపణ తనకు అన్యాయం చేసినవాడి కొరకు. ప్రతీకారం విషయంలో మరియు ఇతర వ్యవహారాల విషయంలో అల్లాహ్ అవతరించిన దాని ద్వారా ఎవడైతే తీర్పు ఇవ్వడో అతడు అల్లాహ్ హద్దులను అతిక్రమించినవాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• تعداد بعض صفات اليهود، مثل الكذب وأكل الربا ومحبة التحاكم لغير الشرع؛ لبيان ضلالهم وللتحذير منها.
అబద్దము మరియు వడ్డీ సొమ్ము తినటం మరియు ధర్మమునకు విరుద్ధంగా తీర్పునివ్వటమును ఇష్టపడటం లాంటి యూదుల కొన్ని గుణాల గణణ వారి మార్గభ్రష్టతను ప్రకటించటానికి మరియు వాటి నుండి హెచ్చరించటానికి.

• بيان شرعة القصاص العادل في الأنفس والجراحات، وهي أمر فرضه الله تعالى على من قبلنا.
ప్రాణం,గాయాల విషయంలో న్యాయపూరిత ప్రతీకార చట్ట ప్రకటన. మరియు అది మనకన్న మునుపటివారిపై మహోన్నతుడైన అల్లాహ్ విధిగావించిన ఆదేశము.

• الحث على فضيلة العفو عن القصاص، وبيان أجرها العظيم المتمثّل في تكفير الذنوب.
ప్రతీకారం తీర్చుకోవటం నుండి మన్నింపు యొక్క ప్రాముఖ్యతపై ప్రోత్సహించటం. మరియు దాని గొప్ప ప్రతిఫలం యొక్క ప్రకటన ఏదైతే పాపముల మన్నింపు రూపములో ఉంటుంది.

• الترهيب من الحكم بغير ما أنزل الله في شأن القصاص وغيره.
ప్రతీకారం మరియు ఇతర వాటి విషయంలో అల్లాహ్ అవతరింపజేసిన దానికి భిన్నంగా తీర్పునివ్వటం నుండి హెచ్చరిక.

 
Translation of the meanings Surah: Al-Mā’idah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close