Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Mā’idah   Ayah:
اُحِلَّ لَكُمْ صَیْدُ الْبَحْرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّكُمْ وَلِلسَّیَّارَةِ ۚ— وَحُرِّمَ عَلَیْكُمْ صَیْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ؕ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
అల్లాహ్ మీ కొరకు నీటి జంతువుల వేటను ధర్మ సమ్మతం చేశాడు.మరియు సముద్రం మీ కొరకు జీవించి ఉన్న దానిని లేదా మరణించిన దానిని బయటకు విసిరేస్తే మీలో నుంచి ప్రయాణంలో ఉన్నవారి కొరకు,ప్రయాణంలో లేని వారి కొరకు దానిని ఆహార సామగ్రిగా చేసుకోవటం ప్రయోజనకరమైనది.మీరు హజ్ లేదా ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకు అడవి జంతువుల వేటను ఆయన మీపై నిషేదించాడు.అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన పట్ల భయభీతిని కలిగి ఉండండి.ప్రళయ దినాన ఆయన ఒక్కడి వైపునే మీరు మరలించబడుతారు.ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
جَعَلَ اللّٰهُ الْكَعْبَةَ الْبَیْتَ الْحَرَامَ قِیٰمًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْیَ وَالْقَلَآىِٕدَ ؕ— ذٰلِكَ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَاَنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
గౌరవప్రద గృహమైన కాబాను అల్లాహ్ మానవుల కొరకు నివాసంగా చేశాడు.వారి మతపరమైన ఆసక్తులు : నమాజు,హజ్,ఉమ్రా అక్కడే నిర్వహించబడుతాయి.మరియు ప్రాపంచిక ఆసక్తులు : హరమ్ (నిషిద్ద ప్రాంతం) లో శాంతిని (కార్యాలు) నెలకొల్పటం, దాని వైపు అన్ని రకాల ఫలాలలను తీసుకుని రావటం జరుగుతుంది.వారి కొరకు నిషిద్ద మాసములైన జీఖాఅద,జిల్ హిజ్జ,ముహర్రం,రజబ్ మాసములను అందులో వారికి శాంతిని కలిగించి నివాసం కొరకు చేశాడు.హదీ పశువులను మెడలో పట్టాలు వేసిన జంతువులను హరమ్ ప్రాంతమునకు తీసుకుని వెళ్ళటం వలన ఆ జంతువుల యజమానులకు ఎటువంటి బాధను కలిగించకుండా ఉండటం ద్వారా శాంతిని కలిలిగించి వారి కొరకు మనుగడ సాధనంగా చేశాడు.భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తము గురించి అల్లాహ్ కు తెలుసని ,అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడని మీరు తెలుసుకోవాలని మీ పై ఈ ఉపకారాలను చేశాడు.ఆయన శాసనాలు దీని కొరకే.మీ కొరకు ఆసక్తులను తీసుకు రావటానికి,మీకు నష్టం వాటిల్లక ముందే మీ నుండి నష్టమును ఆపటానికి,దాసుల కొరకు ఉపయోగ కరమైన ఆయన జ్ఞానమునకు రుజువు.
Arabic explanations of the Qur’an:
اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟ؕ
ఓ ప్రజలారా అల్లాహ్ తనపై అవిధేయతకు పాల్పడే వాడిని కఠినంగా శిక్షించే వాడని,పశ్చ్యాత్తాప్పడే వాడిని క్షమించే వాడని,అతని పట్ల కరుణ కల వాడని మీరు తెలుసుకోండి.
Arabic explanations of the Qur’an:
مَا عَلَی الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا تَكْتُمُوْنَ ۟
అల్లాహ్ ఏ సందేశాలను చేరవేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆదేశించాడో వాటిని చేరవేయటం ఒక్కటే ఆయన బాధ్యత. ప్రజలను సన్మార్గము పై నడిచే సౌభాగ్యం కలిగించటం ఆయన బాధ్యత కాదు.అది ఒక్కడైన అల్లాహ్ చేతిలోనే ఉన్నది.సన్మార్గము,మార్గభ్రష్టత దేనినైతే మీరు బహిర్గతం చేస్తున్నారో,గోప్యంగా ఉంచుతున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
قُلْ لَّا یَسْتَوِی الْخَبِیْثُ وَالطَّیِّبُ وَلَوْ اَعْجَبَكَ كَثْرَةُ الْخَبِیْثِ ۚ— فَاتَّقُوا اللّٰهَ یٰۤاُولِی الْاَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟۠
ఓ ప్రవక్త మీరు తెలియ పరచండి : ఒక వేళ అపవిత్రమైన వస్తువుల ఆధిక్యత మీకు ఎంత బాగా నచ్చినప్పటికి అపవిత్రమైన వస్తువులన్ని పవిత్రమైన వస్తువులన్నింటికి సరితూగలేవు.ఎందుకంటే వాటి ఆధిక్యత వాటిని గొప్పవిగా చేయలేవు.ఓ వివేకవంతులారా స్వర్గము ద్వారా మీరు సాఫల్యము చెందుట కొరకు అపవిత్రమైన వాటిని విడనాడి పవిత్రమైన వాటిని చేసి అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. బహుశా మీరు స్వర్గమును పొంది సాఫల్యమును పొందుతారు.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَسْـَٔلُوْا عَنْ اَشْیَآءَ اِنْ تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ ۚ— وَاِنْ تَسْـَٔلُوْا عَنْهَا حِیْنَ یُنَزَّلُ الْقُرْاٰنُ تُبْدَ لَكُمْ ؕ— عَفَا اللّٰهُ عَنْهَا ؕ— وَاللّٰهُ غَفُوْرٌ حَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా మీరు ప్రవక్తని మీకు అనవసరమైన విషయాల గురించి అడగకండి అవి మీ ధర్మ విషయాల్లో మీకు తోడ్పడవు. ఒక వేళ వాటిని మీ కొరకు బహిర్గతం చేస్తే అందులో ఉన్న కష్టము వలన మీకు చెడుగా అనిపిస్తాయి. ప్రశ్నించడం గురించి మీకు వారించబడిన ఈ విషయాల గురించి మీరు ప్రవక్తపై వహీ అవతరించే వేళ అడిగితే వాటి గురించి మీకు విశదపరచవచ్చు. ఇది అల్లాహ్ పై ఎంతో శులభమైనది. అల్లాహ్ వదిలి వేసిన విషయాల గురించి ఖుర్ఆన్ మౌనం వహించింది. అయితే మీరు వాటి గురించి అడగకండి. ఒక వేళ మీరు వాటి గురించి అడిగితే వాటిని పాటించే ఆదేశం మీపై అవతరిస్తుంది. మరియు అల్లాహ్ తన దాసుల పాపములను వారు పశ్చాత్తాపము పడినప్పుడు మన్నించేవాడును. వాటి వలన వారిని శిక్షించటం నుండి ఆయన దయ కలవాడును.
Arabic explanations of the Qur’an:
قَدْ سَاَلَهَا قَوْمٌ مِّنْ قَبْلِكُمْ ثُمَّ اَصْبَحُوْا بِهَا كٰفِرِیْنَ ۟
మీకన్న పూర్వం గతించిన వారు ఇలాంటి విషయాల గురించి అడిగారు.వారిపై పాటించటం తప్పనిసరి అయినప్పుడు వారు వాటిని ఆచరించలేదు.అంచేత వారు సత్య తిరస్కారులైపోయారు.
Arabic explanations of the Qur’an:
مَا جَعَلَ اللّٰهُ مِنْ بَحِیْرَةٍ وَّلَا سَآىِٕبَةٍ وَّلَا وَصِیْلَةٍ وَّلَا حَامٍ ۙ— وَّلٰكِنَّ الَّذِیْنَ كَفَرُوْا یَفْتَرُوْنَ عَلَی اللّٰهِ الْكَذِبَ ؕ— وَاَكْثَرُهُمْ لَا یَعْقِلُوْنَ ۟
అల్లాహ్ జంతువులను ధర్మసమ్మతం (హలాల్) చేశాడు.ఆయన విగ్రహారాధకులు తమ విగ్రహాల కొరకు తమ పై నిషేదించుకున్న జంతువులను నిషేదించ లేదు.అవి బహీరహ్ :నిర్దిష్ట సంఖ్యను జన్మనిచ్చిన ఒంటే.దాని చెవి కోయబడుతుంది.సాయిబహ్ :నిర్దిష్ట వయస్సుకు చేరుకున్న ఒంటే వారి విగ్రహాల పేరు మీద వదిలివేయబడుతుంది.వసీలహ్ :ఒక సారి ఆడ ఒంటెను ఈని రెండవ సారి కూడా ఆడ ఒంటెనే ఈనిన ఒంటె దేవతల పేరు మీద వదిలి పెట్టబడుతుంది.హామ్ :అనేక ఒంటె పిల్లల పుట్టుకకు మూలంగా నిలిచిన మగ ఒంటే.కాని అల్లాహ్ ఈ తెలుపబడిన జంతువులను నిషేదించాడని సత్యతిరస్కారులు అల్లాహ్ పై అబద్దమును,నిందను అంటగడుతున్నారు.చాలామంది అవిశ్వాసపరులు సత్య,అసత్యాలు,హలాల్,హరాంల మధ్య వ్యత్యాసం చేయటం లేదు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الأصل في شعائر الله تعالى أنها جاءت لتحقيق مصالح العباد الدنيوية والأخروية، ودفع المضار عنهم.
అల్లాహ్ ఆచారాల్లో వాస్తవమేమిటంటే అవి దాసుల ఇహపరలోక ప్రయోజనాలను సాధించటానికి,వారి నష్టాలను అడ్డుకోవటానికి వచ్చినవి

• عدم الإعجاب بالكثرة، فإنّ كثرة الشيء ليست دليلًا على حِلِّه أو طِيبه، وإنما الدليل يكمن في الحكم الشرعي.
వస్తువు అధికంగా ఉండటం స్వీకరించటానికి అర్హత లేనిది.ఎందుకంటే వస్తువు యొక్క ఆధిక్యత దాని హలాల్ అవ్వటంలో హరాం అవ్వటంలో ఆధారం కాదు.ఆధారమన్నది ధర్మ ఆదేశాల్లో ఇమిడి ఉంటుంది.

• من أدب المُسْتفتي: تقييد السؤال بحدود معينة، فلا يسوغ السؤال عما لا حاجة للمرء ولا غرض له فيه.
ఫత్వా అడిగే వారి పద్దతులు: నిర్ధారిత హద్దుల్లో ప్రశ్నను పరిమితం చేయటం,మనిషి తనకు అనవసర విషయాల గురించి,తనకు ఎటువంటి ప్రయోజనం లేని వాటి గురించి ప్రశ్నించకుండా ఉండటం.

• ذم مسالك المشركين فيما اخترعوه وزعموه من محرمات الأنعام ك: البَحِيرة، والسائبة، والوصِيلة، والحامي.
బహుదైవారధకుల మార్గములను దూషించటం జరిగింది ఏవైతే వారు తమ తరుపు నుండి పశువుల్లోంచి బహీరహ్,సాయిబహ్,వసీలహ్,హామ్ లాగా కల్పించుకుని నిషేధం అని వాదించుకున్నారు.

 
Translation of the meanings Surah: Al-Mā’idah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close