Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

Page Number:close

external-link copy
27 : 67

فَلَمَّا رَاَوْهُ زُلْفَةً سِیْٓـَٔتْ وُجُوْهُ الَّذِیْنَ كَفَرُوْا وَقِیْلَ هٰذَا الَّذِیْ كُنْتُمْ بِهٖ تَدَّعُوْنَ ۟

ఎప్పుడైతే వారిపై వాగ్దానం వచ్చిపడి వారు శిక్షను తమకు దగ్గరవటమును కళ్లారా చూసినప్పుడు అది ప్రళయదినము అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ముఖములు మారిపోతాయి మరియు నల్లగా మారిపోతాయి. మరియు వారితో ఇలా పలకబడును : ఇది అదే దేనినైతే మీరు ఇహలోకంలో కోరేవారో మరియు తొందరపెట్టేవారో. info
التفاسير: |

external-link copy
28 : 67

قُلْ اَرَءَیْتُمْ اِنْ اَهْلَكَنِیَ اللّٰهُ وَمَنْ مَّعِیَ اَوْ رَحِمَنَا ۙ— فَمَنْ یُّجِیْرُ الْكٰفِرِیْنَ مِنْ عَذَابٍ اَلِیْمٍ ۟

ఓ ప్రవక్తా ఈ తిరస్కరించే ముష్రికులతో వారిని ఖండిస్తూ ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ నన్ను మరణింపజేసి, నాతోపాటు ఉన్న విశ్వాసపరులను మరణింపజేస్తే అవిశ్వాసపరులని బాధాకరమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు ?!. దాని నుండి వారిని ఎవరూ రక్షించరు. info
التفاسير: |

external-link copy
29 : 67

قُلْ هُوَ الرَّحْمٰنُ اٰمَنَّا بِهٖ وَعَلَیْهِ تَوَكَّلْنَا ۚ— فَسَتَعْلَمُوْنَ مَنْ هُوَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : అనంత కరుణామయుడు అయిన ఆయనే మిమ్మల్ని తన ఒక్కడి ఆరాధన వైపు పిలుస్తున్నాడు. మేము ఆయన్ని విశ్వసించాము. మా వ్యవహారాలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే మేము నమ్మకమును కలిగి ఉన్నాము. మీరు తొందరలోనే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరు స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారో ఎవరు సన్మార్గంపై ఉన్నారో. info
التفاسير: |

external-link copy
30 : 67

قُلْ اَرَءَیْتُمْ اِنْ اَصْبَحَ مَآؤُكُمْ غَوْرًا فَمَنْ یَّاْتِیْكُمْ بِمَآءٍ مَّعِیْنٍ ۟۠

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ మీరు త్రాగే నీరు మీరు చేరలేనంత వరకు భూమి లోతులో అయిపోతే మీ వద్దకు ఎక్కువగా ప్రవహించే నీరును ఎవరు తీసుకుని వస్తారు ?! అల్లాహ్ తప్ప ఎవరూ కాదు. info
التفاسير: |
Benefits of the Verses on this page:
• اتصاف الرسول صلى الله عليه وسلم بأخلاق القرآن.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంగారు ఖుర్ఆన్ లో గల గుణాలను కలిగి ఉండటం. info

• صفات الكفار صفات ذميمة يجب على المؤمن الابتعاد عنها، وعن طاعة أهلها.
అవిశ్వాసపరుల గుణాలు దిగజారిన గుణాలు. విశ్వాసపరులు వాటి నుండి దూరం వహించటం,వారిని అనుసరించటం నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. info

• من أكثر الحلف هان على الرحمن، ونزلت مرتبته عند الناس.
అధికంగా ప్రమాణాలు చేసేవాడు అల్లాహ్ యందు దిగజారిపోయాడు. మరియు ప్రజల వద్ద అతని స్థానం దిగజారిపోతుంది. info