Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Anfāl   Ayah:
وَمَا لَهُمْ اَلَّا یُعَذِّبَهُمُ اللّٰهُ وَهُمْ یَصُدُّوْنَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوْۤا اَوْلِیَآءَهٗ ؕ— اِنْ اَوْلِیَآؤُهٗۤ اِلَّا الْمُتَّقُوْنَ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
వారు ప్రజలను మస్జిదుల్ హరామ్ ప్రదక్షణలు చేయటం నుండి లేదా అందులో నమాజు పాటించటం నుండి ఆపటం మూలంగా వారిపై శిక్ష అనివార్యమయ్యే చర్యకు పాల్పడినా వారిని శిక్ష నుండి ఏది ఆపుతుంది ?.మరియు ముష్రికులు అల్లాహ్ యొక్క స్నేహితులు కారు.అల్లాహ్ యొక్క స్నేహితులు దైవభీతి కలవారు మాత్రమే అవుతారు.వారు ఆయన ఆదేశించిన వాటిని పాటించటం,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన భయబీతి కలిగి ఉంటారు.కాని చాలా మంది ముష్రికులు తాము ఆయన స్నేహితులని ఆరోపించేటప్పుడు తెలుసుకోలేరు.మరియు వారు ఆయన స్నేహితులు కారు.
Arabic explanations of the Qur’an:
وَمَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَیْتِ اِلَّا مُكَآءً وَّتَصْدِیَةً ؕ— فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟
మస్జిదుల్ హరాం వద్ద ముష్రికుల ఆరాధన ఈలలు వేయటం,చప్పట్లు కొట్టటం తప్ప ఇంకేమి ఉండేది కాదు.అయితే ఓ ముష్రికులారా అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తను మీరు తిరస్కరించటం వలన మీరు బదర్ దినమున హత్య,బంధీ అవటం ద్వారా శిక్షను చవిచూడండి.
Arabic explanations of the Qur’an:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ لِیَصُدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— فَسَیُنْفِقُوْنَهَا ثُمَّ تَكُوْنُ عَلَیْهِمْ حَسْرَةً ثُمَّ یُغْلَبُوْنَ ؕ۬— وَالَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی جَهَنَّمَ یُحْشَرُوْنَ ۟ۙ
నిశ్చయంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచేవారు తమ సంపదను ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి మరల్చటానికి ఖర్చు చేస్తారు.అయితే వారు దానిని ఖర్చు చేస్తారు.వారు కోరుకున్నది వారి కొరకు నెరవేరదు.ఆ పిదప వారు తమ సంపదను ఖర్చు చేయటం యొక్క పరిణామము దాన్ని కోల్పోవటం వలన,దాన్ని ఖర్చు చేయటము యొక్క ఉద్దేశమును కోల్పోవటం వలన అవమానము కలుగుతుంది.ఆ తరువాత వారిపై విశ్వాసపరుల విజయం ద్వారా వారు ఓడించబడుతారు.మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచేవారు ప్రళయదినాన నరకము వైపునకు తరిమివేయబడుతారు.వారు అందులో శాస్వతంగా ఉండే విధంగా ప్రవేశిస్తారు.
Arabic explanations of the Qur’an:
لِیَمِیْزَ اللّٰهُ الْخَبِیْثَ مِنَ الطَّیِّبِ وَیَجْعَلَ الْخَبِیْثَ بَعْضَهٗ عَلٰی بَعْضٍ فَیَرْكُمَهٗ جَمِیْعًا فَیَجْعَلَهٗ فِیْ جَهَنَّمَ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
అల్లాహ్ మార్గము నుండి ఆపటానికి తమ సంపదలను ఖర్చు చేసే ఈ అవిశ్వాసులందరు నరకాగ్ని వైపునకు తరిమి వేయబడుతారు.అల్లాహ్ దుష్టులైన అవిశ్వాసపరులను సత్పురుషులైన విశ్వాసుల నుండి వేరు చేయటానికి,అపవిత్రులైన జనము,కర్మలు,సంపదలను వారిలో నుండి కొందరిని కొందరిపై గుంపుగా పేర్చి నరకములో పడవేయటానికి.నష్టమును చవిచూసేవారు వారందరే.ఎందుకంటే వారు ప్రళయదినాన తమ స్వయానికి,తమ ఇంటి వారికి నష్టమును కలిగించుకున్నారు.
Arabic explanations of the Qur’an:
قُلْ لِّلَّذِیْنَ كَفَرُوْۤا اِنْ یَّنْتَهُوْا یُغْفَرْ لَهُمْ مَّا قَدْ سَلَفَ ۚ— وَاِنْ یَّعُوْدُوْا فَقَدْ مَضَتْ سُنَّتُ الْاَوَّلِیْنَ ۟
ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుండి అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారితో పలకండి : ఒక వేళ వారు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల తమ అవిశ్వాసమును,అల్లాహ్ మార్గము నుండి ఆయనపై విశ్వాసమును కనబరచిన వారిని ఆపటం నుండి విరమించుకుంటే అల్లాహ్ వారి కొరకు వారి గతించిన పాపములను మన్నించి వేస్తాడు.ఇస్లాము దాని ముందు జరిగిన పాపములను నేలమట్టము చేస్తుంది.ఒక వేళ వారు తమ అవిశ్వాసము వైపునకు మరలితే నిశ్చయంగా గతించిన వారిలో అల్లాహ్ సాంప్రదాయం ముందస్తు జరిగే ఉన్నది.వారు తిరస్కరించి తమ అవిశ్వాసము పై స్థిరంగా ఉన్నప్పుడు ఆయన వారిపై శిక్షను కలిగించటంలో తొందర చేశాడు.
Arabic explanations of the Qur’an:
وَقَاتِلُوْهُمْ حَتّٰی لَا تَكُوْنَ فِتْنَةٌ وَّیَكُوْنَ الدِّیْنُ كُلُّهٗ لِلّٰهِ ۚ— فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ بِمَا یَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
ఓ విశ్వాసపరులారా ఎటువంటి షిర్కు ఉండనంత వరకు,ముస్లిములను అల్లాహ్ మార్గము నుండి ఆపటం ఉండనంత వరకు,మరియు ధర్మము,విధేయత ఒక్కడైన అల్లాహ్ కొరకే అయ్యి అందులో ఆయనతో ఎవరూ సాటి ఉండనంత వరకు మీ శతృవులైన అవిశ్వాసపరులతో మీరు పోరాడండి.ఒక వేళ అవిశ్వాసపరులు తాము ఉన్న షిర్కును,అల్లాహ్ మార్గము నుండి ఆపటమును విడనాడితే వారిని మీరు వదిలివేయండి.నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను తెలుసుకునేవాడును. గోప్యంగా ఉండే ఏ వస్తువు ఆయన పై గోప్యంగా ఉండదు.
Arabic explanations of the Qur’an:
وَاِنْ تَوَلَّوْا فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَوْلٰىكُمْ ؕ— نِعْمَ الْمَوْلٰی وَنِعْمَ النَّصِیْرُ ۟
ఒక వేళ అవిశ్వాసము,అల్లాహ్ మార్గము నుండి ఆపటమును విడనాడటం గురించి వారికి ఆదేశించబడిన దాని నుండి వారు మరలిపోతే ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వారిపై మీకు సహాయమును చేస్తాడని (విజయమును కలిగిస్తాడని) మీరు నమ్మకమును కలిగి ఉండండి.ఆయనతో స్నేహం చేసేవాడి కొరకు ఆయన ఎంతో గొప్ప సంరక్షకుడు,ఆయనకి సహాయపడే వాడికి ఆయన ఎంతో గొప్ప సహాయకుడు.ఎవరినైతే ఆయన సంరక్షిస్తాడో అతడు సాఫల్యం చెందుతాడు.మరియు ఆయన ఎవరికైతే సహాయం చేస్తాడో అతడు విజయమును పొందుతాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الصد عن المسجد الحرام جريمة عظيمة يستحق فاعلوه عذاب الدنيا قبل عذاب الآخرة.
మస్జిదుల్ హరామ్ నుండి ఆపటం మహా పాపము.దాని చర్యకు పాల్పడే వాడు పరలోక శిక్ష కన్నా ముందు ఇహలోక శిక్షకు అర్హుడవుతాడు.

• عمارة المسجد الحرام وولايته شرف لا يستحقه إلّا أولياء الله المتقون.
మస్జిదుల్ హరామ్ సంరక్షణ,కార్య నిర్వహణ బాధ్యత గౌరవోన్నతమైనది. దైవ భీతి కలిగిన అల్లాహ్ స్నేహితులు మాత్రమే దానికి హక్కుదారులవుతారు

• في الآيات إنذار للكافرين بأنهم لا يحصلون من إنفاقهم أموالهم في الباطل على طائل، وسوف تصيبهم الحسرة وشدة الندامة.
ఆయతుల్లో అవిశ్వాసపరులకు హెచ్చరిక ఉన్నది.ఎందుకంటే వారు తమ సొమ్మును అసత్యములో అర్ధం లేకుండా ఖర్చు చేసి ఏమి పొందలేరు. వారికి తొందరలోనే విచారము,తీవ్రమైన అవమానము కలుగుతుంది.

• دعوة الله تعالى للكافرين للتوبة والإيمان دعوة مفتوحة لهم على الرغم من استمرار عنادهم.
అవిశ్వాసపరులకు పశ్చాత్తాప్పడటం కొరకు,విశ్వాసమును కనబరచడం కొరకు అల్లాహ్ పిలుపు సత్యము నుండి వారు వ్యతిరేకతలో ఉన్నప్పటికి వారికి బహిరంగంగా పిలుపునివ్వటం జరిగింది.

• من كان الله مولاه وناصره فلا خوف عليه، ومن كان الله عدوًّا له فلا عِزَّ له.
అల్లాహ్ ఎవరికి సంరక్షకుడై ఉంటాడో,ఎవరికి సహాయకుడై ఉంటాడో అతనిపై ఎటువంటి భయం ఉండదు.మరియు అల్లాహ్ ఎవరికి శతృవైపోతాడో అతనికి ఎటువంటి గౌరవం,ఆధిక్యత ఉండదు.

 
Translation of the meanings Surah: Al-Anfāl
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close