Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Anfāl   Ayah:
وَاِنْ یُّرِیْدُوْۤا اَنْ یَّخْدَعُوْكَ فَاِنَّ حَسْبَكَ اللّٰهُ ؕ— هُوَ الَّذِیْۤ اَیَّدَكَ بِنَصْرِهٖ وَبِالْمُؤْمِنِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా ఒక వేళ వారు సంధి కొరకు,యద్దమును వదలటం కొరకు వారి మొగ్గటం ద్వారా మిమ్మల్ని మోసగించదలచుకుంటే,దాని ద్వారా మీతో యుద్ధం కొరకు వారు సిద్ధం కావాలనుకుంటే నిశ్చయంగా అల్లాహ్ వారి వ్యూహం విషయంలో,వారి మోసం విషయంలో మీకు చాలు.ఆయనే మీకు తన సహాయము ద్వారా బలపరిచాడు.మరియు మీపై విశ్వాసము కనబరచిన ముహాజిరుల,అన్సారుల సహాయము ద్వారా మిమ్మల్ని బలపరిచాడు.
Arabic explanations of the Qur’an:
وَاَلَّفَ بَیْنَ قُلُوْبِهِمْ ؕ— لَوْ اَنْفَقْتَ مَا فِی الْاَرْضِ جَمِیْعًا مَّاۤ اَلَّفْتَ بَیْنَ قُلُوْبِهِمْ ۙ— وَلٰكِنَّ اللّٰهَ اَلَّفَ بَیْنَهُمْ ؕ— اِنَّهٗ عَزِیْزٌ حَكِیْمٌ ۟
మరియు ఆయన ఆ విశ్వాసపరుల హృదయాలను వారు వేరు వేరుగా ఉన్న తరువాత కూడా ఎవరి ద్వారా నైతే ఆయన మీకు సహాయపడ్డాడో సమీకరించాడు.ఒక వేళ మీరు భూమిలో ఉన్న సమస్త సంపదను విడిపోయి ఉన్న వారి హృదయములను సమీకరించటానికి ఖర్చు చేసినా మీరు వాటి మధ్య సమీకరించ లేరు.నిశ్చయంగా ఆయన తన రాజరికంలో ఆధిక్యత కలవాడు ఆయనను ఎవరూ ఓడించలేరు.తన విధిని నిర్వహించటంలో.తన కార్యపర్యవేక్షణలో,తన ధర్మ నిర్దేశనలో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا النَّبِیُّ حَسْبُكَ اللّٰهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మీ శతృవుల కీడు విషయంలో మీకు చాలు,మీతోపాటు విశ్వసించిన జనులకూ చాలు.అయితే మీరు అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి,ఆయనపైనే ఆధారపడండి.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا النَّبِیُّ حَرِّضِ الْمُؤْمِنِیْنَ عَلَی الْقِتَالِ ؕ— اِنْ یَّكُنْ مِّنْكُمْ عِشْرُوْنَ صٰبِرُوْنَ یَغْلِبُوْا مِائَتَیْنِ ۚ— وَاِنْ یَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ یَّغْلِبُوْۤا اَلْفًا مِّنَ الَّذِیْنَ كَفَرُوْا بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులను యుద్ధానికి ప్రోత్సహించండి,వారి సంకల్పాలను బలపరిచే,వారి ఉద్దేశాలను ఉత్తేజపరిచే వాటి ద్వారా యుద్ధానికి ప్రోత్సహించండి.ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీలో నుండి ఇరవై మంది అవిశ్వాసపరులతో యుద్ధానికి స్థైర్యం కలవారు ఉంటే రెండు వందల మంది అవిశ్వాసపరులపై విజయం పొందుతారు.ఒక వేళ మీలో నుండి వంద మంది స్థైర్యం కలవారు ఉంటే వెయ్యి మంది అవిశ్వాసపరులపై విజయం పొందుతారు.ఇది ఎందుకంటే అల్లాహ్ తన స్నేహితుల విజయం ద్వారా,తన శతృవుల పరాజయం ద్వారా అల్లాహ్ సాంప్రదాయమును వారు అర్ధం చేసుకోలేదు.మరియు యుద్ధం యొక్క ఉద్ధేశమును గ్రహించలేదు.వారు ఇహ లోకంలో ఎదిగిపోవటానికి మాత్రమే యుద్ధం చేస్తారు.
Arabic explanations of the Qur’an:
اَلْـٰٔنَ خَفَّفَ اللّٰهُ عَنْكُمْ وَعَلِمَ اَنَّ فِیْكُمْ ضَعْفًا ؕ— فَاِنْ یَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ صَابِرَةٌ یَّغْلِبُوْا مِائَتَیْنِ ۚ— وَاِنْ یَّكُنْ مِّنْكُمْ اَلْفٌ یَّغْلِبُوْۤا اَلْفَیْنِ بِاِذْنِ اللّٰهِ ؕ— وَاللّٰهُ مَعَ الصّٰبِرِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీ బలహీనతను గుర్తించి ఇప్పుడు మీపై నుండి భారమును తేలిక చేశాడు.అయితే ఆయన తన తరుపు నుండి మీ పై దయతో మీ నుండి బరువును తగ్గించాడు.మీలో నుండి ఒక్కడు అవిశ్వాసపరుల్లోంచి పదికి బదులుగా ఇద్దరి ముందు స్థిరత్వాన్ని ప్రదర్శించాలని అనివార్యం చేశాడు.ఒక వేళ మీలో నుండి అవిశ్వాసపరులతో యుద్ధంలో వంద మంది స్థైర్య వంతులు ఉంటే రెండు వందల మంది పై విజయం సాధిస్తారు.ఒక వేళ మీలో నుండి వెయ్యి మంది స్థైర్య వంతులు ఉంటే రెండు వేల మంది అవిశ్వాసపరులపై అల్లాహ్ ఆదేశముతో విజయం సాధిస్తారు.మరియు అల్లాహ్ మద్దతు,విజయం ద్వారా విశ్వాసపరుల్లోంచి స్థైర్య వంతులకు తోడుగా ఉంటాడు.
Arabic explanations of the Qur’an:
مَا كَانَ لِنَبِیٍّ اَنْ یَّكُوْنَ لَهٗۤ اَسْرٰی حَتّٰی یُثْخِنَ فِی الْاَرْضِ ؕ— تُرِیْدُوْنَ عَرَضَ الدُّنْیَا ۖۗ— وَاللّٰهُ یُرِیْدُ الْاٰخِرَةَ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟
ప్రవక్తతో యుద్ధం చేయటానికి వచ్చిన అవిశ్వాసపరులను వారిలో హత్యాకాండ ఎక్కువయ్యి వారి హృదయాల్లో భయం కలిగి ఆయనతో యుద్ధం వైపు మరలకుండా ఉండేంతవరకు వారిని ఖైదీలుగా చేసుకోవటం ఆయనకు సరికాదు.ఓ విశ్వాసపరులారా మీరు బదర్ యుద్ధ ఖైదీలనుండి ఫిదియ (పరిహారము) కోరుకున్నారు.మరియు అల్లాహ్ ధర్మ విజయం,దాని ఆధిక్యత ద్వారా పొందపడే పరలోకమును ఆశిస్తున్నాడు.అల్లాహ్ తన అస్తిత్వంలో,గుణగణాల్లో,అణచివేతలో ఆధిక్యతను కలవాడు.ఆయనను ఎవరు ఓడించరు.తన భవిత్వంలో,తన ధర్మశాసనాల్లో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
لَوْلَا كِتٰبٌ مِّنَ اللّٰهِ سَبَقَ لَمَسَّكُمْ فِیْمَاۤ اَخَذْتُمْ عَذَابٌ عَظِیْمٌ ۟
అల్లాహ్ మీ కొరకు యుద్ధ ప్రాప్తులను హలాల్ చేశాడని,ఖైదీల నుండి పరిహారం తీసుకోవటానికి మీకు ఆయన సమ్మతించాడని ఆయన విధి వ్రాత,ఆయన నిర్ణయం ముందే జరిగి పోయినట్లు అల్లాహ్ వద్ద నుండి పుస్తకంలో ఉండకపోతే అల్లాహ్ వద్ద నుండి దాని అనుమతి గురించి దైవ వాణి అవతరించక ముందే మీరు యుద్ధప్రాప్తిని,ఖైదీల నుండి పరుహారం తీసుకోవటం వలన అల్లాహ్ వద్దనుండి మీపై కఠినమైన శిక్ష వచ్చి పడేది.
Arabic explanations of the Qur’an:
فَكُلُوْا مِمَّا غَنِمْتُمْ حَلٰلًا طَیِّبًا ۖؗ— وَّاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
అయితే ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరుల నుండి తీసుకున్న యుద్ధ ప్రాప్తిలో నుండి తినండి.అది మీకు ధర్మసమ్తమే.అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు భయపడండి.నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసపరులైన తన దాసులను మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• في الآيات وَعْدٌ من الله لعباده المؤمنين بالكفاية والنصرة على الأعداء.
ఆయతుల్లో అల్లాహ్ వద్ద నుండి విశ్వాసపరులైన ఆయన దాసులకు ఆయన చాలు అని,శతృవులపై విజయం ఉన్నదని వాగ్దానం ఉన్నది.

• الثبات أمام العدو فرض على المسلمين لا اختيار لهم فيه، ما لم يحدث ما يُرَخِّص لهم بخلافه.
శతృవుల ముందు స్థిరత్వాన్ని చూపటం ముస్లిములపై తప్పనిసరి,దానికి విరుద్ధంగా వారికి అనుమతిని కలిగించే విషయం చోటు చేసుకోనంత వరకు అందులో వారికి ఎటువంటి అనుమతి లేదు.

• الله يحب لعباده معالي الأمور، ويكره منهم سَفْسَافَها، ولذلك حثهم على طلب ثواب الآخرة الباقي والدائم.
అల్లాహ్ తన దాసుల కొరకు గొప్ప విషయాలను (కార్యాలను) ఇష్టపడతాడు.వారి నుండి వాటిలోని అల్పమైన వాటిని ధ్వేషిస్తాడు.అందుకే ఆయన శాస్వతంగా ఉండిపోయే పరలోక ప్రతిఫలాన్ని కోరుకోవటం గురించి మిమ్మల్ని ప్రోత్సహించాడు.

• مفاداة الأسرى أو المنّ عليهم بإطلاق سراحهم لا يكون إلا بعد توافر الغلبة والسلطان على الأعداء، وإظهار هيبة الدولة في وجه الآخرين.
(ఎప్పుడైైతే) శతృవులపై పూర్తి ఆధిక్యత,నియంత్రణ కలుగుతుందో,మరియు వేరే వారిలో ప్రభుత్వం యొక్క భయం ఉంటుందో అప్పుడే ఖైదీల నుండి పరిహారము తీసుకుని లేదా వారిపై దయచూపి వదిలి వేయటం జరుగుతుంది.

 
Translation of the meanings Surah: Al-Anfāl
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close