Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad * - Translations’ Index

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Translation of the meanings Surah: Al-Baqarah   Ayah:
وَلَا تَقُوْلُوْا لِمَنْ یُّقْتَلُ فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتٌ ؕ— بَلْ اَحْیَآءٌ وَّلٰكِنْ لَّا تَشْعُرُوْنَ ۟
మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని 'మృతులు' అనకండి![1] వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.
[1] అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ (ధర్మపోరాటం) చేసి చంపబడిన వారు మృతులు కారు. వారు అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో సజీవులుగా ఉంటారు. చూడండి, 3:169.
Arabic explanations of the Qur’an:
وَلَنَبْلُوَنَّكُمْ بِشَیْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوْعِ وَنَقْصٍ مِّنَ الْاَمْوَالِ وَالْاَنْفُسِ وَالثَّمَرٰتِ ؕ— وَبَشِّرِ الصّٰبِرِیْنَ ۟ۙ
మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఫల (ఆదాయాల) నష్టానికి గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు.
Arabic explanations of the Qur’an:
الَّذِیْنَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌ ۙ— قَالُوْۤا اِنَّا لِلّٰهِ وَاِنَّاۤ اِلَیْهِ رٰجِعُوْنَ ۟ؕ
ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: "నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము!" అని అంటారో!
Arabic explanations of the Qur’an:
اُولٰٓىِٕكَ عَلَیْهِمْ صَلَوٰتٌ مِّنْ رَّبِّهِمْ وَرَحْمَةٌ ۫— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُهْتَدُوْنَ ۟
అలాంటి వారికి వారి ప్రభువు నుండి అనుగ్రహాలు[1] మరియు కరణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు[2].
[1] 'సలవాతున్: అంటే blessings, bendictions, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, వరాలు మరియు శుభాకాంక్షలు అనే అర్థాలున్నాయి. [2] నష్టం కలిగినపుడు : 'ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి'ఊన్.' మరియు, 'అల్లాహుమ్మ అజుర్నీ ఫీ ము'సీబతీ, వ అ'ఖ్ లిఫ్ లీ ఖైరమ్మిన్ హా.' చదవాలి, ('స.ముస్లిం, 'హదీస్' నం. 918).
Arabic explanations of the Qur’an:
اِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَآىِٕرِ اللّٰهِ ۚ— فَمَنْ حَجَّ الْبَیْتَ اَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَیْهِ اَنْ یَّطَّوَّفَ بِهِمَا ؕ— وَمَنْ تَطَوَّعَ خَیْرًا ۙ— فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِیْمٌ ۟
నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు[1]. కావున ఎవడు (కఅబహ్) గృహానికి 'హజ్జ్ లేక 'ఉమ్రా కొరకు పోతాడో[2], అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స'యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచికార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు[3], సర్వజ్ఞుడు.
[1] 'సఫా-మర్వాలు మక్కాలో క'అబహ్ కు కొంత దూరంలో ఉన్న చిన్న గుట్టలు. 'హజ్ లేక 'ఉమ్రా చేసేవారు క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు ('తవాఫ్) చేసిన తరువాత 'సఫా-మర్వా గుట్టల మధ్య ఏడు సార్లు పచార్లు (స'యీ) చేయాలి. ఇది తప్పకుండా చేయాలి (వాజిబ్). ఇబ్రాహీమ్ ('అ.స.) భార్య - ఇస్మా'యీల్ ('అ.స.) యొక్క తల్లి - అయిన సయ్యిదా హాజర్, ఇస్మా'యీల్ ('అ.స.)ను కాబా దగ్గర పరుండబెట్టి, నీటి కొరకు ఈ రెండు గుట్టల మధ్య పరుగెత్తుతూ, తన కుమారుణ్ణి ఈ గుట్టలెక్కి చూసేది. అదే కార్యాన్ని అల్లాహ్ (సు.తా.) ముస్లింలకు 'హజ్ లేక 'ఉమ్రా చేసేటప్పుడు, ఆచరించమని ఆజ్ఞాపించాడు.ఇవే కాకుండా 'హజ్ చేసే వారి కొరకు ఇతర ఆచారాలు అంటే బలి (ఖుర్బానీ) ఇవ్వటం, మీనాలోని మూడు జమరాతుల మీద ప్రతిదానిపై ఏడేసి గులక రాళ్ళు రువ్వటం, మొదలైనవి ఉన్నాయి. సయ్యిదా హాజర్ యొక్క ప్రార్థనను అంగీకరించి అల్లాహ్ (సు.తా.) ఇస్మా'యీల్ (అ.స.) కాళ్ళ దగ్గర 'జమ్ 'జమ్ నీటి బుగ్గను పుట్టించాడు. అందులో ఈనాటి వరకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. బైతుల్లాహ్ ను సందర్శించే వారు ఈ నీటిని త్రాగి, అల్లాహుతా'ఆలాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకా అక్కడ తమ కోరికల పూర్తికై, పాపవిమోచనకై, ఉత్తమ ప్రతిఫలాలకై అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. [2] 'హజ్ అంటే జుల్-'హజ్ నెలలో 8-13 తేదీల వరకు క'అబహ్, మీనా, 'అరఫాత్ మరియు ము'జ్దలిఫాలను సందర్శించటం. 'ఉమ్రా అంటే ఈ తేదీలలో కాక ఇతర కాలంలో ఎప్పుడైనా క;అబహ్ ను దర్శించటం. చూడండి' 14:37). 'ఉమ్రా చేయదలుచుకున్నవారు: 'హరమ్ సరిహద్దుల బయటి నుండి (మీఖాత్ బయట ఉండేవారు మీఖాత్ నుండి) 'ఉమ్రా దీక్ష (నియ్యత్)తో, ఇ'హ్రామ్ ధరించి, క'అబహ్ చుట్టు ఏడు ప్రదక్షిణలు చేసి, తరువాత 'సఫా-మర్వాల మధ్య ఏడు సార్లు పచార్లు చేసి, ఆ తరువాత శరోముండనం చేయించుకొని, ఇ'హ్రామ్ విడుస్తారు. మీఖాత్ మరియు 'హరమ్ సరిహద్దులను మహా ప్రవక్త ('స'అస) సూచించారు. [3] షాకిరున్ (అష్-షకూరు): One who approves or Rewards or Forgives much or largely. అంటే కృతజ్ఞతలను ఆమోదించే, అంగీకరించే, ఆదరించే, విలువనిచ్చే వాడు. తన దాసుల మంచి కార్యాలకు అమితంగా ప్రతిఫలమిచ్చేవాడు. All-Appreciative, యోగ్యతను గుర్తించే, పరిగణించే వాడు. అష్-షుకూర్ కు చూడండి, 4:147. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
Arabic explanations of the Qur’an:
اِنَّ الَّذِیْنَ یَكْتُمُوْنَ مَاۤ اَنْزَلْنَا مِنَ الْبَیِّنٰتِ وَالْهُدٰی مِنْ بَعْدِ مَا بَیَّنّٰهُ لِلنَّاسِ فِی الْكِتٰبِ ۙ— اُولٰٓىِٕكَ یَلْعَنُهُمُ اللّٰهُ وَیَلْعَنُهُمُ اللّٰعِنُوْنَ ۟ۙ
నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన పిదప కూడా - దాచుతారో! వారిని అల్లాహ్ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు.[1]
[1] ఇబ్నె 'అబ్బాస్ ('ర.ది.'అ.) కథనం : ఈ ఆయతులో - తౌరాత్ గ్రంథంలో దైవ ప్రవక్త ('స'అస) గురించి వచ్చిన స్పష్టమైన సూచనలను - యూదులు మరియు క్రైస్తవులు దాచిన విషయం గురించి చెప్పబడింది. (అబూ-దావూద్, మరియు సునన్ తిర్మిజీ', 'హదీస్' నం. 651.
Arabic explanations of the Qur’an:
اِلَّا الَّذِیْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَبَیَّنُوْا فَاُولٰٓىِٕكَ اَتُوْبُ عَلَیْهِمْ ۚ— وَاَنَا التَّوَّابُ الرَّحِیْمُ ۟
కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను[1], అపార కరుణా ప్రదాతను.
[1] అత్-తవ్వాబు: Oft-Returning. తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరించే, స్వీకరించే, కటాక్షించే, మన్నించే వాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
Arabic explanations of the Qur’an:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ اُولٰٓىِٕكَ عَلَیْهِمْ لَعْنَةُ اللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟ۙ
నిశ్చయంగా ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతి చెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటంది.
Arabic explanations of the Qur’an:
خٰلِدِیْنَ فِیْهَا ۚ— لَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟
అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ మరియు వారికి మళ్ళీ వ్యవధి ఇవ్వటం కానీ జరుగదు.
Arabic explanations of the Qur’an:
وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الرَّحْمٰنُ الرَّحِیْمُ ۟۠
మరియు మీ ఆరాధ్యదైవ కేవలం ఆ అద్వితీయుడు[1] (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రదాత.
[1] అల్-వా'హిద్: The One, The Sole. అద్వితీయుడు, ఒకే ఒక్కడు. చూడండి 2:133, 12:39.
Arabic explanations of the Qur’an:
 
Translation of the meanings Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad - Translations’ Index

Translated by Abdurrahim ibn Muhammad

close