Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad * - Translations’ Index

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Translation of the meanings Surah: Al-Baqarah   Ayah:
وَاِنْ كُنْتُمْ عَلٰی سَفَرٍ وَّلَمْ تَجِدُوْا كَاتِبًا فَرِهٰنٌ مَّقْبُوْضَةٌ ؕ— فَاِنْ اَمِنَ بَعْضُكُمْ بَعْضًا فَلْیُؤَدِّ الَّذِی اؤْتُمِنَ اَمَانَتَهٗ وَلْیَتَّقِ اللّٰهَ رَبَّهٗ ؕ— وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ؕ— وَمَنْ یَّكْتُمْهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلْبُهٗ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ ۟۠
మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు[1]. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
[1] తాకట్టు యొక్క ఉద్దేశం, కేవలం అప్పు ఇచ్చేవాడి సొమ్ము తిరిగి అతనికి దొరుకు తుందనే యథార్థానికే! అతనికి తాకట్టు పెట్టుకొన్న వస్తువును ఉపయోగించుకునే హక్కు లేదు. అది వడ్డి అవుతుంది. కాని తాకట్టు పెట్టుకున్న వస్తువుపై ఆదాయం వస్తే దాని నుండి దాని ఖర్చు తీసి మిగిలింది దాని యజమానికి ఇవ్వాలి. చూడండి, 'స. బు'ఖారీ పుస్తకం - 3, 'హ. నం. 685.
Arabic explanations of the Qur’an:
لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَاِنْ تُبْدُوْا مَا فِیْۤ اَنْفُسِكُمْ اَوْ تُخْفُوْهُ یُحَاسِبْكُمْ بِهِ اللّٰهُ ؕ— فَیَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَیُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే! మీరు మీ మనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు[1]. మరియు ఆయన తాను కోరిన వానిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
[1] ఆ ఆయత్ అవతరింపజేయబడినపుడు స'హాబీలు దైవప్రవక్త ('స'అస) దగ్గర హాజరై ఇలా విన్నవించుకున్నారు: "ఓ ప్రవక్తా('స'అస)! నమా'జ్, ఉపవాసం, 'జకాత్ మరియు జిహాద్ మా శక్కికి మించినవి కావు. కాని మనస్సులో పుట్టే ఆలోచనలపై మాకు అదుపు లేదు కదా! అయినా అల్లాహుతా'ఆలా వాటి లెక్క తీసుకుంటానని అంటున్నాడు కదా!" అప్పుడు దైవప్రవక్త ('స'అస) ఇలా సెలవిచ్చారు: "మీరిప్పుడు కేవలం విన్నాము మరియు విధేయుల మయ్యాము" అని మాత్రమే అనండి. అప్పుడు అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ అవతరిపజేశాడు: "అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు." (ఇబ్నె - కసీ'ర్, ఫ'త్తహ అల్ ఖదీర్). దీనిని గురించి ఇంకా ఈ 'హదీస్' కూడా ఉంది: "అల్లాహుతా'ఆలా నా ఉమ్మత్ వారి మనస్సులలో వచ్చిన విషయాలను క్షమిస్తాడు. కాని నాలుకతో పలికిన దానిని మరియు అమలు పరచిన దానిని లెక్కలోకి తీసుకుంటాడు." (బు'ఖారీ, ముస్లిం).
Arabic explanations of the Qur’an:
اٰمَنَ الرَّسُوْلُ بِمَاۤ اُنْزِلَ اِلَیْهِ مِنْ رَّبِّهٖ وَالْمُؤْمِنُوْنَ ؕ— كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۫— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْ رُّسُلِهٖ ۫— وَقَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَاِلَیْكَ الْمَصِیْرُ ۟
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు [1] మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.
[1] ఈ చివరి రెండు ఆయత్ లు ఎంతో ఘనత గలవి. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: ఎవరైనా రాత్రి ఈ రెండు ఆయత్ లను చదివితే చాలు. ('స. బు'ఖారీ, పుస్తకం - 5, 'హదీస్' నం. 345). అంటే అల్లాహ్ (సు.తా.) అతనిని రక్షిస్తాడు. మరొక 'హదీస్' లో మేరాజ్ రాత్రిలో దైవప్రవక్త ('స'అస) కు దొరికిన మూడు విషయాలలో ఒకటి, ఈ రెండు ఆయతులు. ('స. ముస్లిం).
Arabic explanations of the Qur’an:
لَا یُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا وُسْعَهَا ؕ— لَهَا مَا كَسَبَتْ وَعَلَیْهَا مَا اكْتَسَبَتْ ؕ— رَبَّنَا لَا تُؤَاخِذْنَاۤ اِنْ نَّسِیْنَاۤ اَوْ اَخْطَاْنَا ۚ— رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَیْنَاۤ اِصْرًا كَمَا حَمَلْتَهٗ عَلَی الَّذِیْنَ مِنْ قَبْلِنَا ۚ— رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ ۚ— وَاعْفُ عَنَّا ۥ— وَاغْفِرْ لَنَا ۥ— وَارْحَمْنَا ۥ— اَنْتَ مَوْلٰىنَا فَانْصُرْنَا عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟۠
"అల్లాహ్, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దానికి (పుణ్య) ఫలితం దానికి లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు! ఓ మా ప్రభూ! పూర్వం వారిపై మోపినట్టి భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ! మేము సహంచలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు విజయము (సహాయము) నొసంగు."
Arabic explanations of the Qur’an:
 
Translation of the meanings Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad - Translations’ Index

Translated by Abdurrahim ibn Muhammad

close