Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (104) Simoore: Simoore nagge
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقُوْلُوْا رَاعِنَا وَقُوْلُوا انْظُرْنَا وَاسْمَعُوْا ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟
అల్లాహ్ విశ్వాసపరులకు మంచి మాటల ఎంపికను నిర్దేశిస్తూ వారితో ఇలా పలికాడు : ఓ విశ్వాసపరులారా మీరు రాయినా అని పలకకండి. అంటే మీరు మా పరిస్థితులను గమనించండి. ఎందుకంటే యూదులు దాన్ని వక్రీ కరించేవారు. దాని ద్వారా వారు దైవ ప్రవక్తను ఉద్దేశించి పెడ అర్ధమును నిర్ణయించుకుని పలికేవారు. అది రఊన (కాయటం ,కాపరి). కావున అల్లాహ్ ఈ మార్గమును అడ్డుకోవటానికి ఈ మాటను నిషేధించాడు. మరియు తన దాసులకు దానికి బదులుగా ఉన్జుర్నా అని పలకమని ఆదేశించాడు. అంటే మీరు మా కొరకు నిరీక్షించండి మీరు పలికే మాటను మేము అర్ధం చేసుకుంటాము. మరియు ఇది హెచ్చరిక లేకుండా అర్ధానికి దారితీసే పదం. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కెరకు బాధాకరమైన శిక్ష కలదు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• سوء أدب اليهود مع أنبياء الله حيث نسبوا إلى سليمان عليه السلام تعاطي السحر، فبرّأه الله منه، وأَكْذَبَهم في زعمهم.
అల్లాహ్ ప్రవక్తల పట్ల యూదుల చెడ్డ ప్రవర్తన ఎలాగంటే వారు సులైమాన్ అలాహిస్సలాం మంత్రజాలమును వినియోగించారని వారు అపాదించారు. అయితే అల్లాహ్ ఆయనను దాని నుండి పరిశుద్ధుడని తెలియపరచాడు. మరియు వారు తమ వాదనలో అసత్యులని తెలియపరచాడు.

• أن السحر له حقيقة وتأثير في العقول والأبدان، والساحر كافر، وحكمه القتل.
మంత్రజాలము అన్నది దానికి వాస్తవికత ఉన్నది. మరియు అది మనస్సులపై మరియు శరీరములపై ప్రభావం చూపుతుంది. మరియు మంత్రజాలకుడు అవిశ్వాసపరుడు. అతని విషయంలో ఆదేశం అతన్ని హతమార్చటం.

• لا يقع في ملك الله تعالى شيء من الخير والشر إلا بإذنه وعلمه تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ రాజ్యంలో ఏదైన మేలుగాని,కీడుగాని కలిగితే మహోన్నతుడైన ఆయన అనుమతితో మరియు ఆయన జ్ఞానంతో కలుగుతుంది.

• سد الذرائع من مقاصد الشريعة، فكل قول أو فعل يوهم أمورًا فاسدة يجب تجنبه والبعد عنه.
కారకాలను నిరోధించటం ధర్మ ఉద్దేశముల్లోంచిది. కావున ఆ ప్రతి మాట,చర్య చెడును కలిగించేది అని సందేహముంటే దాని నుండి జాగ్రత్తగా ఉండటం మరియు దాని నుండి దూరంగా ఉండటం తప్పనిసరి.

• أن الفضل بيد الله تعالى وهو الذي يختص به من يشاء برحمته وحكمته.
అనుగ్రహము అన్నది మహోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉన్నది. మరియు ఆయనే దాని ద్వారా తాను తలచుకున్న వారికి తన కారుణ్యముతో,తన విజ్ఞతతో ప్రత్యేకిస్తాడు.

 
Firo maanaaji Aaya: (104) Simoore: Simoore nagge
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude