Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tippudi firooji ɗii


Firo maanaaji Simoore: Simoore Muhammed   Aaya:

సూరహ్ ముహమ్మద్

Ina jeyaa e payndaale simoore ndee:
تحريض المؤمنين على القتال، تقويةً لهم وتوهينًا للكافرين.
విశ్వాసపరులను యుద్దమునకు ప్రేరేపించటం,వారికి బలోపేతనంగా మరియు అవిశ్వాసపరులకు అవమానముకు గురి చేయటంగా.

اَلَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ اَضَلَّ اَعْمَالَهُمْ ۟
ఎవరైతే అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరిచి ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి మరల్చి వేశారో వారి కర్మలను అల్లాహ్ నిష్ఫలం చేశాడు.
Faccirooji aarabeeji:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاٰمَنُوْا بِمَا نُزِّلَ عَلٰی مُحَمَّدٍ وَّهُوَ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۙ— كَفَّرَ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَاَصْلَحَ بَالَهُمْ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, సత్కర్మలు చేసి అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దాన్ని - మరియు అది వారి ప్రభువు వద్ద నుండి సత్యము అని విశ్వసిస్తారో ఆయన వారి నుండి వారి పాపములను తొలగించివేస్తాడు. వాటి వలన వారిని శిక్షించడు. మరియు వారి ప్రాపంచిక,పరలోక వ్యవహారములను సంస్కరిస్తాడు.
Faccirooji aarabeeji:
ذٰلِكَ بِاَنَّ الَّذِیْنَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَاَنَّ الَّذِیْنَ اٰمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَّبِّهِمْ ؕ— كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ لِلنَّاسِ اَمْثَالَهُمْ ۟
ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము ఇరువర్గముల కొరకు అది అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి అసత్యమును అనుంసరించిన వారు అవటం వలన మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి తమ ప్రభువు వద్ద నుండి వచ్చిన సత్యమును అనుసరించటం వలన. వారిరువురి కృషి వేరు వేరుగా ఉండటం వలన వారిరువురి ప్రతిఫలము వేరయినది. ఏ విధంగా నైతే అల్లాహ్ తన తీర్పును ఇరు వర్గముల మధ్య స్పష్టపరిచాడో : విశ్వాసపరుల ఒక వర్గము మరియు అవిశ్వాసపరుల ఒక వర్గము. అల్లాహ్ ప్రజల కొరకు తన ఉపమానములను తెలుపుతున్నాడు. కావున ఎలాంటి వాడు అలాంటి వాడితోనే కలపబడుతాడు.
Faccirooji aarabeeji:
فَاِذَا لَقِیْتُمُ الَّذِیْنَ كَفَرُوْا فَضَرْبَ الرِّقَابِ ؕ— حَتّٰۤی اِذَاۤ اَثْخَنْتُمُوْهُمْ فَشُدُّوا الْوَثَاقَ ۙ— فَاِمَّا مَنًّا بَعْدُ وَاِمَّا فِدَآءً حَتّٰی تَضَعَ الْحَرْبُ اَوْزَارَهَا— ذٰلِكَ ۛؕ— وَلَوْ یَشَآءُ اللّٰهُ لَانْتَصَرَ مِنْهُمْ ۙ— وَلٰكِنْ لِّیَبْلُوَاۡ بَعْضَكُمْ بِبَعْضٍ ؕ— وَالَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ فَلَنْ یُّضِلَّ اَعْمَالَهُمْ ۟
విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరులను యుద్దం చేస్తుండగా ఎదుర్కొన్నపప్పుడు మీ ఖడ్గములతో వారి మెడలను వదించండి. వారిలో మీరు హత్యాకాండను అధికం చేసేంత వరకు వారితో యుద్ధమును కొనసాగించండి. వారి ప్రాబల్యమును కూకటి వ్రేళ్ళతో తీసివేయండి. మీరు వారిలో హత్యాకాండను అధికం చేసినప్పుడు ఖైదీల గొలుసులను బిగించండి. మీరు వారిని బందీలుగా చేసుకున్నప్పుడు ప్రయోజనమునకు తగినట్లుగా మీకు ఎంపిక చేసుకునే అధికారముంటుంది. ఎటువంటి బదులు లేకుండా వారిని బందీ నుండి విడుదల చేయటం ద్వారా లేదా ధనం లేదా వేరే ఇతర వాటి ద్వారా వారి నుండి లబ్ది పొంది వారిపై కనికరించటం. అవిశ్వాసపరులు ఇస్లాం స్వీకరించటం లేదా వారితో ఒప్పందం తో యుద్ధం ముగిసేంతవరకు వారితో మీరు యుద్దమును మరియు బందీలను చేయటమును కొనసాగించండి. ఈ ప్రస్తావించబడిన అవిశ్వాసపరులతో విశ్వాసపరులను పరీక్షించటం, కాల చక్రము, ఒకరిపై ఒకరికి విజయము ఇవి అల్లాహ్ ఆదేశము. ఒక వేళ అల్లాహ్ ఎటువంటి యుద్ధం లేకుండా అవిశ్వాసపరులపై విజయం కలిగించదలచుకుంటే వారిపై విజయమును కలిగించేవాడు. కాని ఆయన ధర్మ పోరాటమును మీలో నుండి కొందరిని కొందరితో పరీక్షించటానికి ధర్మబద్ధం చేశాడు. కాబట్టి ఆయన విశ్వాసపరుల్లోంచి ఎవరు యుద్ధం చేస్తాడో మరియు ఎవరు యుద్ధం చేయడో ఆయన పరీక్షిస్తాడు. మరియు ఆయన ఆవిశ్వాసపరుడిని విశ్వాసపరుడితో పరీక్షిస్తాడు. ఒక వేళ అతడు విశ్వాసపరుడిని వదించితే అతడు (విశ్వాసపరుడు) స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఒక వేళ అతడిని విశ్వాసపరుడు వదిస్తే అతడు (అవిశ్వాసపరుడు) నరకంలో ప్రవేశిస్తాడు. మరియు అల్లాహ్ మార్గంలో వదించబడే వారి కర్మలను అల్లాహ్ వృధా చేయడు.
Faccirooji aarabeeji:
سَیَهْدِیْهِمْ وَیُصْلِحُ بَالَهُمْ ۟ۚ
అల్లాహ్ వారిని వారి ఇహలోక జీవితంలోనే సత్యమును అనుసరించే భాగ్యమును కలిగించి వారి వ్యవహారమును చక్కదిద్దుతాడు.
Faccirooji aarabeeji:
وَیُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ ۟
మరియు వారిని ప్రళయదినమున స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. వారి కొరకు దాని లక్షణాలను ఇహలోకంలోనే స్పష్టపరచాడు. వారు దాన్ని గుర్తించారు. మరియు ఆయన పరలోకంలో అందులోని వారి స్థానములను వారికి తెలియపరచాడు.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تَنْصُرُوا اللّٰهَ یَنْصُرْكُمْ وَیُثَبِّتْ اَقْدَامَكُمْ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించిన వారా ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన ప్రవక్తను,ఆయన ధర్మమునకు సహాయం చేసి,అవిశ్వాసపరులతో యుద్ధం చేసి సహాయపడితే ఆయన వారిపై మీకు ఆధిక్యతను ప్రసాదించి,వారితో యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు మీ పాదాలను స్థిరపరచి మీకు సహాయం చేస్తాడు.
Faccirooji aarabeeji:
وَالَّذِیْنَ كَفَرُوْا فَتَعْسًا لَّهُمْ وَاَضَلَّ اَعْمَالَهُمْ ۟
మరియు అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి కొరకు నష్టము,వినాశనము కలదు. మరియు అల్లాహ్ వారి కర్మల పుణ్యమును వ్యర్ధం చేస్తాడు.
Faccirooji aarabeeji:
ذٰلِكَ بِاَنَّهُمْ كَرِهُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ فَاَحْبَطَ اَعْمَالَهُمْ ۟
వారిపై వాటిల్లిన ఈ శిక్ష వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన ఖుర్ఆన్ ను అందులో ఉన్న అల్లాహ్ ఏకత్వము వలన అసహ్యించుకునటం వలన. కావున అల్లాహ్ వారి కర్మలను వృధా చేసాడు. కాబట్టి వారు ఇహపరాల్లో నష్టపోయారు.
Faccirooji aarabeeji:
اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— دَمَّرَ اللّٰهُ عَلَیْهِمْ ؗ— وَلِلْكٰفِرِیْنَ اَمْثَالُهَا ۟
ఏమీ ఈ తిరస్కారులందరు భూమిలో సంచరించలేదా ?. వారి కన్న మునుపు తిరస్కరించిన వారి ముగింపు ఎలా జరిగినదో వారు యోచన చేసేవారు. నిశ్చయంగా ముగింపు బాధాకరంగా జరిగినది. అల్లాహ్ వారి నివాసములను నాశనం చేశాడు. వారినీ నాశనం చేశాడు మరియు వారి సంతానమును,వారి సంపదలను నాశనం చేశాడు. మరియు ఈ శిక్షల్లాంటివే ప్రతీ కాలంలో మరియు ప్రతీ చోట అవిశ్వాసపరుల కొరకు కలవు.
Faccirooji aarabeeji:
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ مَوْلَی الَّذِیْنَ اٰمَنُوْا وَاَنَّ الْكٰفِرِیْنَ لَا مَوْلٰی لَهُمْ ۟۠
ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము ఇరు వర్గముల కొరకు కలదు. ఎందుకంటే అల్లాహ్ తనపై విశ్వాసమును కనబరిచే వారికి సహాయం చేసేవాడు. మరియు అవిశ్వాసపరుల కొరకు ఎటువంటి సహాయకుడు లేడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• النكاية في العدوّ بالقتل وسيلة مُثْلى لإخضاعه.
శతృవు విషయంలో హత్యాకాండ ద్వారా ఆధిక్యత చూపటం అతన్ని లొంగదీసుకోవటానికి అనువైన మార్గం.

• المن والفداء والقتل والاسترقاق خيارات في الإسلام للتعامل مع الأسير الكافر، يؤخذ منها ما يحقق المصلحة.
కనికరించటం,వియోచనం,హతమార్చటం మరియు బానిస చేసుకోవటం అవిశ్వాసపరుడైన ఖైదీ పట్ల వ్యవహరించటం కొరకు ఇస్లాంలో అనుమతులు కలవు. వాటిలో నుండి ప్రయోజనకరమైన దానిని ఎంచుకోబడును.

• عظم فضل الشهادة في سبيل الله.
అల్లాహ్ మార్గములో వీరగతి పొందటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము.

• نصر الله للمؤمنين مشروط بنصرهم لدينه.
విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము ఆయన ధర్మమునకు వారి సహాయము షరతుతో కూడినది.

اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا یَتَمَتَّعُوْنَ وَیَاْكُلُوْنَ كَمَا تَاْكُلُ الْاَنْعَامُ وَالنَّارُ مَثْوًی لَّهُمْ ۟
నిశ్ఛయంగా అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసేవారిని అల్లాహ్ స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాడు వాటి భవనములు,వాటి వృక్షముల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచినవారు ఇహలోకములో తమ మనోవాంఛలను అనుసరించి భోగబాగ్యాల్లో మునిగి ఉన్నారు. మరియు పశువులు తినే మాదిరిగా తింటున్నారు. వారి కడుపులు మరియు వారి మర్మాంగములు తప్ప వారికి ఎటువంటి ఉద్దేశము లేదు. ప్రళయదినమున అగ్నియే వారి నివాస స్థలము,అందులోనే వారు శరణు తీసుకుంటారు.
Faccirooji aarabeeji:
وَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ هِیَ اَشَدُّ قُوَّةً مِّنْ قَرْیَتِكَ الَّتِیْۤ اَخْرَجَتْكَ ۚ— اَهْلَكْنٰهُمْ فَلَا نَاصِرَ لَهُمْ ۟
మరియు పూర్వ సమాజాల నగరముల్లోంచి చాలా నగరములు మిమ్మల్ని మక్కా నుండి వెలివేసిన దాని వాసుల కన్న బలములో ఆధిక్యత కలవారు మరియు సంపదను,సంతానమును అధికంగా కలవారు. వారు తమ ప్రవక్తలను తిరస్కరించినప్పుడు మేము వారిని నాశనం చేశాము. అయితే వారి వద్దకు అల్లాహ్ శిక్ష వచ్చినప్పుడు దాని నుండి వారిని రక్షించటమునకు ఎటువంటి సహాయకుడు వారి కొరకు లేడు. మేము మక్కా వాసులను నాశనం చేయదలచినప్పుడు వారిని నాశనం చేయటం మమ్మల్ని అశక్తుడిని చేయదు.
Faccirooji aarabeeji:
اَفَمَنْ كَانَ عَلٰی بَیِّنَةٍ مِّنْ رَّبِّهٖ كَمَنْ زُیِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ وَاتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ ۟
ఏమీ తన ప్రభువు వద్ద నుండి స్పష్టమైన ఆధారము మరియు స్పష్టమైన వాదన కలవాడు మరియు అంతర్దృష్టితో ఆయన ఆరాధన చేసేవాడు ఆ వ్యక్తిలా కాగలడా ఎవరికైతే షైతాను అతని దుష్కర్మను అలంకరించి చూపించాడో మరియు విగ్రహాలను ఆరాధించటం,పాపాలకు పాల్పడటం మరియు దైవ ప్రవక్తలను తిరస్కరించటం లాంటి కార్యాలకు వారు మనోవాంఛలు వారిని నిర్దేశించిన వాటిని అనుసరించారు.
Faccirooji aarabeeji:
مَثَلُ الْجَنَّةِ الَّتِیْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ— فِیْهَاۤ اَنْهٰرٌ مِّنْ مَّآءٍ غَیْرِ اٰسِنٍ ۚ— وَاَنْهٰرٌ مِّنْ لَّبَنٍ لَّمْ یَتَغَیَّرْ طَعْمُهٗ ۚ— وَاَنْهٰرٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشّٰرِبِیْنَ ۚ۬— وَاَنْهٰرٌ مِّنْ عَسَلٍ مُّصَفًّی ؕ— وَلَهُمْ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ وَمَغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْ ؕ— كَمَنْ هُوَ خَالِدٌ فِی النَّارِ وَسُقُوْا مَآءً حَمِیْمًا فَقَطَّعَ اَمْعَآءَهُمْ ۟
అల్లాహ్ తన ఆదేశాలను పాటించి,తాను వారించిన వాటికి దూరంగా ఉండి తన భయభీతి కలిగిన వారికి అల్లాహ్ వారిని ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేసిన స్వర్గము యొక్క గుణము : అందులో ఎక్కువ కాలం ఉండటం వలన వాసన గాని రుచి గాని మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి. మరియు అందులో రుచి మారని పాల సెలయేళ్ళు ఉంటాయి. మరియు అందులో త్రాగేవారికి రుచికరమైన మధు పానియముల సెలయేళ్ళు ఉంటాయి. మరియు మలినముల నుండి శుద్ధి చేయబడిన తేనె సెలయేళ్ళు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో వారు కోరుకునే ఫలాల రకములన్నీ ఉంటాయి. మరియు వారి కొరకు వాటన్నింటికి మించి వారి పాపముల కొరకు అల్లాహ్ వద్ద నుండి మన్నింపు ఉంటుంది. ఆయన వాటి మూలంగా వారిని శిక్షించడు. ఏమీ ఇటువంటి ప్రతిఫలము కలవాడికి నరకము నుండి ఎన్నడూ బయటికి రాకుండా అందులో నివాసముండేవాడితో సమానుడు కాగలడా ?. మరియు వారికి తీవ్రమైన వేడి గల నీరు త్రాపించబడును. దాని వేడి తీవ్రత వలన వారి కడుపులలోని పేగులు కోయబడుతాయి.
Faccirooji aarabeeji:
وَمِنْهُمْ مَّنْ یَّسْتَمِعُ اِلَیْكَ ۚ— حَتّٰۤی اِذَا خَرَجُوْا مِنْ عِنْدِكَ قَالُوْا لِلَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ مَاذَا قَالَ اٰنِفًا ۫— اُولٰٓىِٕكَ الَّذِیْنَ طَبَعَ اللّٰهُ عَلٰی قُلُوْبِهِمْ وَاتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ ۟
మరియు ఓ ప్రవక్త కపటుల్లోంచి కొందరు మీ మాటలను దాన్ని స్వీకరించే ఉద్దేశంతో కాదు కాని విముఖతతో చెవి యొగ్గి వినే వారు ఉన్నారు. చివరికి వారు మీ వద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు అల్లాహ్ జ్ఞానమును ప్రసాదించిన వారితో "ఆయన దగ్గరలోనే (ఇప్పుడు) తన మాటలో చెప్పినదేమిటి ?" అని తమ అజ్ఞానంతో,విముఖతతో పలుకుతారు. వారందరి హృదయములపై అల్లాహ్ సీలు వేశాడు కాబట్టి వారికి మేలు కలుగదు. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరించారు కాబట్టి అవి వారిని సత్యము నుండి అంధులుగా చేసివేసింది.
Faccirooji aarabeeji:
وَالَّذِیْنَ اهْتَدَوْا زَادَهُمْ هُدًی وَّاٰتٰىهُمْ تَقْوٰىهُمْ ۟
మరియు సత్య మార్గము వైపునకు,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించటం వైపునకు మార్గం పొందిన వారికి వారి ప్రభువు సన్మార్గమును మరియు మేలు చేయటమునకు భాగ్యమును అధికం చేస్తాడు. మరియు వారికి నరకము నుండి వారిని రక్షించే కర్మను చేయటానికి మనసులో మాట వేస్తాడు.
Faccirooji aarabeeji:
فَهَلْ یَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِیَهُمْ بَغْتَةً ۚ— فَقَدْ جَآءَ اَشْرَاطُهَا ۚ— فَاَنّٰی لَهُمْ اِذَا جَآءَتْهُمْ ذِكْرٰىهُمْ ۟
ఏమీ అవిశ్వాసపరులు వారి వద్దకు అంతిమ ఘడియ వారికి దాని గురించి ముందస్తు జ్ఞానం లేకుండానే అకస్మాత్తుగా రావాలని నిరీక్షిస్తున్నారా ?. నిశ్చయంగా దాని సూచనలు వచ్చినవి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరునిగా పంపబడటం వాటిలో నుంచే. అయితే వారి వద్దకు ప్రళయం వచ్చినప్పుడు హితబోధన గ్రహించటం వారికి ఎలా సాధ్యమగును ?
Faccirooji aarabeeji:
فَاعْلَمْ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَلِلْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوٰىكُمْ ۟۠
కావున ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడని నమ్మకమును కలిగి ఉండండి. మరియు మీరు మీ పాపముల మన్నింపును అల్లాహ్ తో వేడుకోండి. మరియు మీరు విశ్వాసపరులైన మగవారి పాపముల కొరకు, విశ్వాసపరులైన స్త్రీల పాపముల కొరకు ఆయనతో మన్నింపును వేడుకోండి. మరియు మీ పగటిలో మీ కార్యకలాపాల గురించి మరియు మీ రాత్రిలో మీ నివాసము గురించి అల్లాహ్ కు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• اقتصار همّ الكافر على التمتع في الدنيا بالمتع الزائلة.
ఇహలోకములో అంతమైపోయే ఆనందాలను ఆస్వాదించటానికి అవిశ్వాసపరుని సంకల్పముయొక్క పరిమితి.

• المقابلة بين جزاء المؤمنين وجزاء الكافرين تبيّن الفرق الشاسع بينهما؛ ليختار العاقل أن يكون مؤمنًا، ويختار الأحمق أن يكون كافرًا.
విశ్వాసపరుల ప్రతిఫలమునకు,అవిశ్వాసపరుల శిక్షకు మధ్య వ్యత్యాసం వారి మధ్య విస్తారమైన వ్యత్యాసమును స్పష్టపరుస్తుంది తద్వారా బుద్ధిమంతుడు విశ్వాసపరుడవటానికి ఎంచుకుంటాడు మరియు మూర్ఖుడు అవిశ్వాసపరుడవటమును ఎంచుకుంటాడు.

• بيان سوء أدب المنافقين مع رسول الله صلى الله عليه وسلم.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కపటవిశ్వాసుల చెడు ప్రవర్తన ప్రకటన.

• العلم قبل القول والعمل.
మాట కన్న,అమలు కన్న ముందు జ్ఞానముండాలి.

وَیَقُوْلُ الَّذِیْنَ اٰمَنُوْا لَوْلَا نُزِّلَتْ سُوْرَةٌ ۚ— فَاِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ مُّحْكَمَةٌ وَّذُكِرَ فِیْهَا الْقِتَالُ ۙ— رَاَیْتَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ یَّنْظُرُوْنَ اِلَیْكَ نَظَرَ الْمَغْشِیِّ عَلَیْهِ مِنَ الْمَوْتِ ؕ— فَاَوْلٰى لَهُمْ ۟ۚ
మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారు అల్లాహ్ తన ప్రవక్తపై యుద్ధ ఆదేశమును కలిగిన ఏదైన సూరాను అవతరింపజేయాలని ఆశిస్తూ ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ యుద్ద ప్రస్తావనను కలిగిన ఏదైన సూరాను అవతరింపజేయలేదు ?. ఎప్పుడైతే అల్లాహ్ ఏదైన స్పష్టమైన సూరా అందులో యుద్ధ ఆదేశముల ప్రస్తావన కలిగినది అవతరింపజేసినప్పుడు ఓ ప్రవక్తా హృదయముల్లో రోగము కలిగిన కపటులు మీ వైపునకు తనపై భయము,ఆందోళన కమ్ముకున్న వాడిలా చూస్తారు. వారు యుద్ధం నుండి మరలిపోవటం వలన మరియు దాని నుండి భయపడటం వలన వారి శిక్ష వారికి ఆసన్నమైనదని మరియు వారికి దగ్గరైనదని అల్లాహ్ వారికి వాగ్దానం చేశాడు.
Faccirooji aarabeeji:
طَاعَةٌ وَّقَوْلٌ مَّعْرُوْفٌ ۫— فَاِذَا عَزَمَ الْاَمْرُ ۫— فَلَوْ صَدَقُوا اللّٰهَ لَكَانَ خَیْرًا لَّهُمْ ۟ۚ
వారు అల్లాహ్ ఆదేశమును అనుసరించటం మరియు మంచి మాటను పలకటం అందులో ఎటువంటి తిరస్కారం లేకపోవటం వారి కొరకు మేలైనది. యుద్ధం అనివార్యమైనప్పుడు మరియు కృషి చేసినప్పుడు ఒక వేళ వారు అల్లాహ్ పై తమ విశ్వాసమును మరియు ఆయన పై తమ విధేయతను నిజం చేసి చూపిస్తే కపటత్వం కన్న,అల్లాహ్ ఆదేశములను ఉల్లంఘించటం కన్న వారి కొరకు ఎంతో మేలైనది.
Faccirooji aarabeeji:
فَهَلْ عَسَیْتُمْ اِنْ تَوَلَّیْتُمْ اَنْ تُفْسِدُوْا فِی الْاَرْضِ وَتُقَطِّعُوْۤا اَرْحَامَكُمْ ۟
ఒక వేళ మీరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం నుండి,ఆయన పై విధేయత చూపటం నుండి విముఖత చూపితే అవిశ్వాసం మరియు పాపకార్యములతో భూమిలో మీరు ఉపద్రవాలను తలపెట్టటం అజ్ఞాన కాలంలో మీ స్థితి ఉన్నట్లుగా మీ స్థితిపై ఆధిక్యతను చూపుతుంది.
Faccirooji aarabeeji:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُ فَاَصَمَّهُمْ وَاَعْمٰۤی اَبْصَارَهُمْ ۟
భూమిలో ఉపద్రవాలను తలపెట్టటం మరియు బంధుత్వాలను త్రెంచటం లాంటి లక్షణాలు కలిగిన వారందరినే అల్లాహ్ తన కారుణ్యము నుండి దూరం చేశాడు. మరియు సత్యమును స్వీకరించే,అంగీకరించే ఉద్దేశంతో వినటం నుండి వారి చెవులను చెవిటిగా చేశాడు. గుణపాటం నేర్చుకునే ఉద్దేశంతో దాన్ని చూడటం నుండి వారి కళ్ళను అంధులుగా చేశాడు.
Faccirooji aarabeeji:
اَفَلَا یَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ اَمْ عَلٰی قُلُوْبٍ اَقْفَالُهَا ۟
విముఖత చూపే వీరందరు ఖుర్ఆన్ గరించి ఎందుకు యోచన చేయటం లేదు మరియు అందులో ఉన్న విషయాల గురించి ఆలోచించటం లేదు ?!. ఒక వేళ వారు దాని గురించి యోచన చేస్తే ఆయన (అల్లాహ్) వారికి ప్రతీ మేలును సూచించేవాడు. మరియు వారిని ప్రతీ కీడు నుండి దూరం చేసేవాడు. లేదా వారందరి హృదయాలపై తాళాలు ఉండి వాటిని దృఢంగా కట్టివేయబడి ఉన్నాయా ? అందుకని వాటి వరకు హితోపదేశం చేరటం లేదు మరియు వాటికి హితోపదేశం ప్రయోజనం కలిగించటం లేదు.
Faccirooji aarabeeji:
اِنَّ الَّذِیْنَ ارْتَدُّوْا عَلٰۤی اَدْبَارِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدَی ۙ— الشَّیْطٰنُ سَوَّلَ لَهُمْ ؕ— وَاَمْلٰی لَهُمْ ۟
నిశ్చయంగా ఎవరైతే తమపై వాదన నిరూపితమై,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిజాయితీ తమకు స్పష్టమైన తరువాత కూడా తమ విశ్వాసము నుండి అవిశ్వాసము వైపునకు,కపటత్వము వైపునకు మరలి వెళ్ళి పోయారో. షైతానే వారికి అవిశ్వాసమును,కపటత్వమును అలంకరించి చూపించి దాన్ని వారి కొరకు శులభతరం చేశాడు. మరియు వాడు వారికి సుదీర్ఘ ఆశలను కలిగించాడు.
Faccirooji aarabeeji:
ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لِلَّذِیْنَ كَرِهُوْا مَا نَزَّلَ اللّٰهُ سَنُطِیْعُكُمْ فِیْ بَعْضِ الْاَمْرِ ۚ— وَاللّٰهُ یَعْلَمُ اِسْرَارَهُمْ ۟
ఈ మార్గవిహీనత వారికి కలగటానికి కారణం వారు ఆయన తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన దివ్యవాణిని అసహ్యించుకున్న ముష్రికులతో గోప్యుంగా ఇలా పలకటం : యుద్ధం నుండి ఆగిపోవటం లాంటి కొన్ని విషయములలో మేము మీకు విధేయత చూపుతాము. మరియు వారు దాచేది,వారు బహిర్గతం చేసేది అల్లాహ్ కు తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. అయితే ఆయన దానిలో నుండి తాను తలచినది తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బహిర్గతం చేస్తాడు.
Faccirooji aarabeeji:
فَكَیْفَ اِذَا تَوَفَّتْهُمُ الْمَلٰٓىِٕكَةُ یَضْرِبُوْنَ وُجُوْهَهُمْ وَاَدْبَارَهُمْ ۟
వారి ఆత్మలను స్వాధీనం చేసుకునే బాధ్యతను కలిగిన దైవదూతలు వారి ముఖములపై మరియు వారి వీపులపై లోహపు సమిటెలతో కొడుతూ వారి ఆత్మలను స్వాధీనం చేసుకునేటప్పుడు వారు అనుభవించే శిక్షను మరియు భయంకరమైన పరిస్థితులను మీరు ఎలా చూస్తారు ?.
Faccirooji aarabeeji:
ذٰلِكَ بِاَنَّهُمُ اتَّبَعُوْا مَاۤ اَسْخَطَ اللّٰهَ وَكَرِهُوْا رِضْوَانَهٗ فَاَحْبَطَ اَعْمَالَهُمْ ۟۠
ఈ శిక్ష కలగటానికి కారణం వారు తమపై అల్లాహ్ కు క్రోదమును కలిగించే అవిశ్వాసం,కపటత్వం మరియు అల్లాహ్ ని,ఆయన ప్రవక్తని వ్యతిరేకించటం లాంటి వాటన్నింటిని అనుసరించారు. మరియు వారు తమ ప్రభువు సాన్నిధ్యమును కలిగించే వాటిని,తమపై ఆయన మన్నతను దించే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం మరియు ఆయన ప్రవక్తను అనుసరించటం లాంటి వాటిని అసహ్యించుకున్నారు. కావున ఆయన వారి కర్మలను వృధా చేశాడు.
Faccirooji aarabeeji:
اَمْ حَسِبَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَنْ لَّنْ یُّخْرِجَ اللّٰهُ اَضْغَانَهُمْ ۟
ఏమీ తమ హృదయముల్లో సందేహము కలిగిన కపటులు అల్లాహ్ వారి ద్వేషాలను వెలికి తీసి వాటిని బహిర్గతం చేయడని భావిస్తున్నారా ?! అసత్యపరుడి నుండి సత్య విశ్వాసపరుడు వేరయి విశ్వాసపరుడు స్పష్టమై కపటుడు బహిర్గతం కావటానికి ఆయన తప్పకుండా వాటిని పరీక్షల ద్వారా,కష్టాల ద్వారా వెలికి తీస్తాడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• التكليف بالجهاد في سبيل الله يميّز المنافقين من صفّ المؤمنين.
అల్లాహ్ మార్గములో ధర్మపోరాటము ద్వారా బాధ్యత వహించటం కపటులను విశ్వాసపరుల శ్రేణి నుండి వేరు చేస్తుంది.

• أهمية تدبر كتاب الله، وخطر الإعراض عنه.
అల్లాహ్ గ్రంధంలో యోచన చేయటం యొక్క ప్రాముఖ్యత మరియు దాని నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదము.

• الإفساد في الأرض وقطع الأرحام من أسباب قلة التوفيق والبعد عن رحمة الله.
భూమిలో సంక్షోభములను తలపెట్టటం,బంధుత్వములను త్రెంచటం అల్లాహ్ కారుణ్య భాగ్యము తగ్గటానికి మరియు దాని నుండి దూరమవటానికి కారణము.

وَلَوْ نَشَآءُ لَاَرَیْنٰكَهُمْ فَلَعَرَفْتَهُمْ بِسِیْمٰهُمْ ؕ— وَلَتَعْرِفَنَّهُمْ فِیْ لَحْنِ الْقَوْلِ ؕ— وَاللّٰهُ یَعْلَمُ اَعْمَالَكُمْ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ మేము కపటులను మీకు తెలిపరచదలచితే వారిని మీకు తప్పకుండా తెలియపరుస్తాము. అప్పుడు మీరు వారి చిహ్నాల ద్వారా వారిని గుర్తు పడతారు. మరియు మీరు తొందరలోనే వారిని వారి మాట తీరు ద్వారా గుర్తుపట్టేవారు. మరియు మీ కర్మల గురించి అల్లాహ్ కు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Faccirooji aarabeeji:
وَلَنَبْلُوَنَّكُمْ حَتّٰی نَعْلَمَ الْمُجٰهِدِیْنَ مِنْكُمْ وَالصّٰبِرِیْنَ ۙ— وَنَبْلُوَاۡ اَخْبَارَكُمْ ۟
ఓ విశ్వాసపరులారా మేము తప్పకుండా మిమ్మల్ని ధర్మ యుద్దముతో,శతృవుల పోరాటముతో,చంపటముతో పరీక్షిస్తాము చివరికి అల్లాహ్ మార్గములో మీలో నుండి ధర్మపోరాటకులను మరియు ఆయన శతృవులతో పోరాటములో మీలో నుండి సహనం పాటించే వారిని మేము తెలుసుకుంటాము. మరియు మేము మిమ్మల్ని పరీక్షించి మీలో నుండి సత్యపరుడిని మరియు అసత్యపరుడిని మేము తెలుసుకుంటాము.
Faccirooji aarabeeji:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ وَشَآقُّوا الرَّسُوْلَ مِنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدٰی ۙ— لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْـًٔا ؕ— وَسَیُحْبِطُ اَعْمَالَهُمْ ۟
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచి, స్వయంగా అల్లాహ్ ధర్మము నుండి ఆపుకుని మరియు ఇతరులను కూడా దాని నుండి ఆపి మరియు ఆయన ప్రవక్తను విరోధించి,ఆయన ఒక ప్రవక్త అని స్పష్టమైన తరువాత కూడా ఆయనతో శతృత్వమును చూపుతారో వారు అల్లాహ్ కు నష్టం కలిగించలేరు. వారు తమ స్వయమునకు మాత్రమే నష్టం కలిగించుకుంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే వారి కర్మలను నిష్ఫలం చేస్తాడు.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَاَطِیْعُوا الرَّسُوْلَ وَلَا تُبْطِلُوْۤا اَعْمَالَكُمْ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ధర్మబద్దం చేసిన వాటిని ఆచరించిన వారా మీరు అల్లాహ్ పై ,ప్రవక్త పై వారిరువురి ఆదేశములను పాటించి,వారు వారించిన వాటిని విడనాడి విధేయత చూపండి. మరియు మీరు అవిశ్వాసముతో,ప్రదర్శనా బుద్ధితో మీ కర్మలను వృధా చేసుకోకండి.
Faccirooji aarabeeji:
اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ مَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ۟
నిశ్ఛయంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,అల్లాహ్ ధర్మము నుండి తమ స్వయాన్ని ఆపుకుని,ప్రజలను ఆపి ఆ తరువాత పశ్చాత్తాప్పడక ముందే తమ అవిశ్వాస స్థితిలో మరణించేవారిని అల్లాహ్ వారి పాపములను వాటిపై పరదా వేసి మన్నించడు. కాని వారిని వాటి పరంగా పట్టుకుంటాడు మరియు వారిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేశింపజేస్తాడు.
Faccirooji aarabeeji:
فَلَا تَهِنُوْا وَتَدْعُوْۤا اِلَی السَّلْمِ ۖۗ— وَاَنْتُمُ الْاَعْلَوْنَ ۖۗ— وَاللّٰهُ مَعَكُمْ وَلَنْ یَّتِرَكُمْ اَعْمَالَكُمْ ۟
ఓ విశ్వాసపరులారా మీరు మీ శతృవులను ఎదుర్కోవటం నుండి బలహీనపడకండి మరియు మీరు వారిని సంధి కొరకు వారు పిలవక ముందే వారిని పిలవకండి. మరియు మీరే వారిపై ప్రాబల్యం పొందేవారును,ఆధిక్యతను చూపేవారును. మరియు అల్లాహ్ తన సహాయము ద్వారా,తన మద్దతు ద్వారా మీకు తోడుగా ఉంటాడు. మరియు ఆయన మీ కర్మల ప్రతిఫలమును మీకు ఏ మాత్రం తగ్గించడు. అంతేకాదు ఆయన తన వద్ద నుండి ఉపకారముగా మరియు అనుగ్రహముగా మీకు అధికంగా ఇస్తాడు.
Faccirooji aarabeeji:
اِنَّمَا الْحَیٰوةُ الدُّنْیَا لَعِبٌ وَّلَهْوٌ ؕ— وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا یُؤْتِكُمْ اُجُوْرَكُمْ وَلَا یَسْـَٔلْكُمْ اَمْوَالَكُمْ ۟
నిశ్చయంగా ప్రాపంచిక జీవితం ఓ ఆట మరియు కాలక్షేపం మాత్రమే. కావున ఒక బుద్ధిమంతుడు వాటి వలన తన పరలోక కర్మ నుండి నిర్లక్ష్యం చేయకూడదు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి, అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటిని విడనాడి భయభీతిని కలిగి ఉంటే ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలమును తగ్గించకుండా సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన మీ నుండి మీ సంపదలను పూర్తిగా అడగడు. ఆయన మీ నుండి విధి దానమైన జకాత్ ను మాత్రమే అడుగుతాడు.
Faccirooji aarabeeji:
اِنْ یَّسْـَٔلْكُمُوْهَا فَیُحْفِكُمْ تَبْخَلُوْا وَیُخْرِجْ اَضْغَانَكُمْ ۟
ఒక వేళ ఆయన మీ నుండి మీ సంపదలన్నింటిని అడిగి మరియు దాన్ని మీ నుండి అడగటమును పట్టుబట్టితే మీరు దాని విషయంలో పిసినారితనమును చూపుతారు. మరియు ఆయన తన మార్గంలో ఖర్చు చేయటం విషయంలో మీ హృదయముల్లో ఉన్న అసహ్యమును బయటపెడుతాడు. కావున ఆయన మీపై దయ వలన దాన్ని మీ నుండి అడగటమును వదిలివేశాడు.
Faccirooji aarabeeji:
هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ تُدْعَوْنَ لِتُنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ— فَمِنْكُمْ مَّنْ یَّبْخَلُ ۚ— وَمَنْ یَّبْخَلْ فَاِنَّمَا یَبْخَلُ عَنْ نَّفْسِهٖ ؕ— وَاللّٰهُ الْغَنِیُّ وَاَنْتُمُ الْفُقَرَآءُ ۚ— وَاِنْ تَتَوَلَّوْا یَسْتَبْدِلْ قَوْمًا غَیْرَكُمْ ۙ— ثُمَّ لَا یَكُوْنُوْۤا اَمْثَالَكُمْ ۟۠
ఇదిగో మీరే అల్లాహ్ మార్గంలో మీ సంపదల నుండి కొంత భాగమును ఖర్చు చేయమని పిలవబడిన వారందరు. మరియు మీ సంపదలన్నింటిని ఖర్చు చేయమని మీతో అడగబడలేదు. అయితే మీలో నుండి కొందరు దాని నుండి పిసినారితనంతో ఖర్చు చేయమని అడగబడిన దాని నుండి ఆగిపోయిన వారు ఉన్నారు. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో తన సంపద నుండి కొంత భాగమును ఖర్చు చేయటం నుండి పిసినారితనం చూపుతాడో వాస్తవానికి అతను ఖర్చు చేయటం యొక్క పుణ్యమును కొల్పోవటం వలన తన స్వయంపై మాత్రమే పిసినారితనం చూపుతాడు. మరియు అల్లాహ్ స్వయంసమృద్ధుడు ఆయనకు మీ ఖర్చు చేయటం యొక్క అవసరం లేదు. మరియు మీరు ఆయన అవసరం కలవారు. ఒక వేళ మీరు ఇస్లాం నుండి అవిశ్వాసం వైపునకు మరలితే ఆయన మిమ్మల్ని నాశనం చేసి ఇతర జాతిని తీసుకుని వస్తాడు. ఆ పిదప వారు మీలాంటి వారై ఉండరు. అంతే కాదు వారు ఆయనకు విధేయులై ఉంటారు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• سرائر المنافقين وخبثهم يظهر على قسمات وجوههم وأسلوب كلامهم.
కపటుల రహస్యాలు మరియు వారి దుర్మార్గం వారి ముఖాల లక్షణాలు మరియు వారి మాట తీరులో బహిర్గతమవుతాయి.

• الاختبار سُنَّة إلهية لتمييز المؤمنين من المنافقين.
విశ్వాసపరులను కపటుల నుండి వేరు పరచుట కొరకు పరీక్షించటం ఒక దైవ సంప్రదాయం.

• تأييد الله لعباده المؤمنين بالنصر والتسديد.
సహయం చేయటం ద్వారా మరియు సరైన మార్గం చూపటం ద్వారా తన దాసుల కొరకు అల్లాహ్ మద్దతు.

• من رفق الله بعباده أنه لا يطلب منهم إنفاق كل أموالهم في سبيل الله.
తన దాసులతో వారి సంపదలన్నీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటమును కోరకపోవటం వారిపై అల్లాహ్ దయ.

 
Firo maanaaji Simoore: Simoore Muhammed
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tippudi firooji ɗii

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Uddude