Firo maanaaji al-quraan tedduɗo oo - Firo telgiiwo - Abdu rihiim ɓiy Muhammad * - Tippudi firooji ɗii

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Firo maanaaji Simoore: Simoore pelle   Aaya:

సూరహ్ అల్-అహ్'జాబ్

یٰۤاَیُّهَا النَّبِیُّ اتَّقِ اللّٰهَ وَلَا تُطِعِ الْكٰفِرِیْنَ وَالْمُنٰفِقِیْنَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟ۙ
ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు.
Faccirooji aarabeeji:
وَّاتَّبِعْ مَا یُوْحٰۤی اِلَیْكَ مِنْ رَّبِّكَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا ۟ۙ
మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును.
Faccirooji aarabeeji:
وَّتَوَكَّلْ عَلَی اللّٰهِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟
కావున అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకో మరియు కార్యసాధకుడుగా అల్లాహ్ చాలు.
Faccirooji aarabeeji:
مَا جَعَلَ اللّٰهُ لِرَجُلٍ مِّنْ قَلْبَیْنِ فِیْ جَوْفِهٖ ۚ— وَمَا جَعَلَ اَزْوَاجَكُمُ الّٰٓـِٔیْ تُظٰهِرُوْنَ مِنْهُنَّ اُمَّهٰتِكُمْ ۚ— وَمَا جَعَلَ اَدْعِیَآءَكُمْ اَبْنَآءَكُمْ ؕ— ذٰلِكُمْ قَوْلُكُمْ بِاَفْوَاهِكُمْ ؕ— وَاللّٰهُ یَقُوْلُ الْحَقَّ وَهُوَ یَهْدِی السَّبِیْلَ ۟
అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 'తల్లులు' అని పలికి, జిహార్[1] చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
[1] "జిహార్: అంటే భార్యను తల్లిగా ఎంచటం ఏ విధంగానైతే ఒక వక్షంలో రెండు హృదయాలు ఉండవో అదే విధంగా ఒక వ్యక్తికి ఇద్దరు తల్లులు ఉండరు. ఇద్దరు తండ్రులు కూడా ఉండరు. కావున ఇస్లాంకు ముందు, ముష్రికులు తమ భార్యను శిక్షించటానికి :"ఈ నాటి నుండి నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను." అని చెప్పి, ఆమెకు విడాకులివ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకొని బాధించేవారు. ఇస్లాం దానిని నిషేధించింది. దత్తకుమారులు, మీ కుమారులు కారు. కాబట్టి వారిని వారి వాస్తవ తండ్రి పేరుతోనే కిలపి పిలవాలి అనే శాసనం కూడా ఇచ్చింది.
Faccirooji aarabeeji:
اُدْعُوْهُمْ لِاٰبَآىِٕهِمْ هُوَ اَقْسَطُ عِنْدَ اللّٰهِ ۚ— فَاِنْ لَّمْ تَعْلَمُوْۤا اٰبَآءَهُمْ فَاِخْوَانُكُمْ فِی الدِّیْنِ وَمَوَالِیْكُمْ ؕ— وَلَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ فِیْمَاۤ اَخْطَاْتُمْ بِهٖ وَلٰكِنْ مَّا تَعَمَّدَتْ قُلُوْبُكُمْ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟
వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి.[1] అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియక పోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు.[2] మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
[1] అంటే వారు వారి వాస్తవ తండ్రి పేరుతోనే పిలువబడాలి. దానితో వారి నిజ వ్యక్తిత్వం భద్రపరచబడుతుంది. వారిని మీ నిజ సంతానంగా పరిగణించకండి.
[2] ఒకవేళ దత్తపుత్రుని వాస్తవతండ్రి పేరు తెలియకుంటే, వారు మీ ధార్మిక సోదరులు అట్టి పక్షంలో కూడా వారిని పోషించండి, కాని మీ పుత్రులుగా చేసుకొని, మీ పేరు ఇవ్వకండి.
Faccirooji aarabeeji:
اَلنَّبِیُّ اَوْلٰی بِالْمُؤْمِنِیْنَ مِنْ اَنْفُسِهِمْ وَاَزْوَاجُهٗۤ اُمَّهٰتُهُمْ ؕ— وَاُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰی بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ مِنَ الْمُؤْمِنِیْنَ وَالْمُهٰجِرِیْنَ اِلَّاۤ اَنْ تَفْعَلُوْۤا اِلٰۤی اَوْلِیٰٓىِٕكُمْ مَّعْرُوْفًا ؕ— كَانَ ذٰلِكَ فِی الْكِتٰبِ مَسْطُوْرًا ۟
విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు.[1] మరియు అతని భార్యలు వారికి తల్లులు.[2] అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)![3] వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నేను, మీకు మీ తండ్రులకంటే, మీ సంతానం కంటే మరియు సర్వమానవుల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడనయ్యేంత వరకు మీరు నిజమైన విశ్వాసులు కాజాలరు!' (బు'ఖారీ ముస్లిం) - అనస్ (ర'ది.'అ.) కథనం.
[2] దైవప్రవక్త ('స'అస) భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు) ముస్లింల తల్లుల వంటి వారు. కాబట్టి ఈ ఆయత్ శాసనం ప్రకారం దైవప్రవక్త మరణం తరువాత, వారిని ఎవ్వరూ వివాహమాడరాదు. ఇంకా చూడండి 8:75. అందులో విశ్వాసుల పరస్పర సహోదరత్వం తెలుపబడింది. మరియు ఈ ఆయత్ లో ఒక విశ్వాసునికి, దైవప్రవక్త ('స'అస) మరియు అతని భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు), తల్లిదండ్రుల వంటి వారు అని తెలుపబడింది..
[3] చూడండి, 49:10 మరియు 8:75 దగ్గరి బంధువులు తప్ప ఇతరులు వారసులు కాలేరు.
Faccirooji aarabeeji:
وَاِذْ اَخَذْنَا مِنَ النَّبِیّٖنَ مِیْثَاقَهُمْ وَمِنْكَ وَمِنْ نُّوْحٍ وَّاِبْرٰهِیْمَ وَمُوْسٰی وَعِیْسَی ابْنِ مَرْیَمَ ۪— وَاَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًا ۟ۙ
మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము.[1]
[1] చూడండి, 3:81, 42:13.
Faccirooji aarabeeji:
لِّیَسْـَٔلَ الصّٰدِقِیْنَ عَنْ صِدْقِهِمْ ۚ— وَاَعَدَّ لِلْكٰفِرِیْنَ عَذَابًا اَلِیْمًا ۟۠
ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్యతిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.[1]
[1] చూడండి, 5:109 మరియు 7:6.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ جَآءَتْكُمْ جُنُوْدٌ فَاَرْسَلْنَا عَلَیْهِمْ رِیْحًا وَّجُنُوْدًا لَّمْ تَرَوْهَا ؕ— وَكَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرًا ۟ۚ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పైకి సైన్యాలు (దండెత్తి) వచ్చినపుడు, మేము వారి పైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము.[1] మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
[1] చూఈ సూరహ్ యొక్క 9-27 ఆయతులు కందక యుద్ధం ('గ'జ్వతుల్ అ'హ్జాబ్) గురించి ఉన్నాయి. ఇంకా చూడండి, 3:124-125.
Faccirooji aarabeeji:
اِذْ جَآءُوْكُمْ مِّنْ فَوْقِكُمْ وَمِنْ اَسْفَلَ مِنْكُمْ وَاِذْ زَاغَتِ الْاَبْصَارُ وَبَلَغَتِ الْقُلُوْبُ الْحَنَاجِرَ وَتَظُنُّوْنَ بِاللّٰهِ الظُّنُوْنَا ۟ؕ
వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు[1] మరియు మీ కళ్ళు (భయంతో) తిరిగిపోయి, మీ గుండెలు గొంతులోనికి వచ్చినపుడు, మీరు అల్లాహ్ ను గురించి పలువిధాలుగా ఊహించసాగారు.
[1] పై నుండి నజ్ద్, ఉత్తర తూర్పు నుండి వచ్చిన 'గి'త్ఫాన్, హవా'జిన్ మరియు ఇతర తెగల వారు; క్రింది నుండి ఖురైషులు; మరియు పడమర దిక్కునుండి ఇతర ముష్రికులు దాడి చేయటానికి వస్తారు.
Faccirooji aarabeeji:
هُنَالِكَ ابْتُلِیَ الْمُؤْمِنُوْنَ وَزُلْزِلُوْا زِلْزَالًا شَدِیْدًا ۟
అక్కడ (ఆ సమయంలో) విశ్వాసులు పరీక్షించబడ్డారు. మరియు దానితో వారు తీవ్రంగా కంపింప జేయబడ్డారు.
Faccirooji aarabeeji:
وَاِذْ یَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ مَّا وَعَدَنَا اللّٰهُ وَرَسُوْلُهٗۤ اِلَّا غُرُوْرًا ۟
మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు.[1]
[1] ఈ విధమైన సందేశం వచ్చిన వారు దాదాపు డెబ్భై మంది మునాఫిఖులు.
Faccirooji aarabeeji:
وَاِذْ قَالَتْ طَّآىِٕفَةٌ مِّنْهُمْ یٰۤاَهْلَ یَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوْا ۚ— وَیَسْتَاْذِنُ فَرِیْقٌ مِّنْهُمُ النَّبِیَّ یَقُوْلُوْنَ اِنَّ بُیُوْتَنَا عَوْرَةٌ ۛؕ— وَمَا هِیَ بِعَوْرَةٍ ۛۚ— اِنْ یُّرِیْدُوْنَ اِلَّا فِرَارًا ۟
అపుడు వారిలోని ఒక పక్షం వారు: "ఓ యస్ రిబ్[1] (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!" అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: "మా ఇండ్లు భద్రంగా లేవు."[2] కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు.
[1] ఆ కాలంలో ఆ ప్రాంతమంతా యస్'రిబ్ అనే పేరుతో పిలువబడేది. ఆ ప్రాంతంలోనే మదీనా మునవ్వరా ఉంది.
[2] అంటే ఒడంబడిక త్రెంపిన బనూఖురైజా తెగవారు దక్షిణ దిక్కునుండి దాడి చేస్తారేమోననే భయం.
Faccirooji aarabeeji:
وَلَوْ دُخِلَتْ عَلَیْهِمْ مِّنْ اَقْطَارِهَا ثُمَّ سُىِٕلُوا الْفِتْنَةَ لَاٰتَوْهَا وَمَا تَلَبَّثُوْا بِهَاۤ اِلَّا یَسِیْرًا ۟
ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే, వారు వెంటనే సమ్మతించే వారు, మరియు వారు దాని కోసం ఏ మాత్రం ఆలస్యం చేసేవారు కాదు.
Faccirooji aarabeeji:
وَلَقَدْ كَانُوْا عَاهَدُوا اللّٰهَ مِنْ قَبْلُ لَا یُوَلُّوْنَ الْاَدْبَارَ ؕ— وَكَانَ عَهْدُ اللّٰهِ مَسْـُٔوْلًا ۟
వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్ను చూపి పారిపోమని, అల్లాహ్ తో వాగ్దానం చేసి ఉన్నారు. మరియు అల్లాహ్ తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది.
Faccirooji aarabeeji:
قُلْ لَّنْ یَّنْفَعَكُمُ الْفِرَارُ اِنْ فَرَرْتُمْ مِّنَ الْمَوْتِ اَوِ الْقَتْلِ وَاِذًا لَّا تُمَتَّعُوْنَ اِلَّا قَلِیْلًا ۟
వారితో ఇలా అను: "ఒకవేళ మీరు మరణం నుండి గానీ, లేదా హత్య నుండి గానీ, పారిపోదలచు కుంటే! ఆ పారిపోవటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖసంతోషాలు అనుభవిస్తారు!"
Faccirooji aarabeeji:
قُلْ مَنْ ذَا الَّذِیْ یَعْصِمُكُمْ مِّنَ اللّٰهِ اِنْ اَرَادَ بِكُمْ سُوْٓءًا اَوْ اَرَادَ بِكُمْ رَحْمَةً ؕ— وَلَا یَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟
వారితో ఇంకా ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన నుండి మిమ్మల్ని తప్పించే వాడెవడు?" మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరుణ్ణి ఎవడినీ సంరక్షకునిగా గానీ లేక సహాయకునిగా గానీ పొందలేరు.
Faccirooji aarabeeji:
قَدْ یَعْلَمُ اللّٰهُ الْمُعَوِّقِیْنَ مِنْكُمْ وَالْقَآىِٕلِیْنَ لِاِخْوَانِهِمْ هَلُمَّ اِلَیْنَا ۚ— وَلَا یَاْتُوْنَ الْبَاْسَ اِلَّا قَلِیْلًا ۟ۙ
వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుద్ధం నుండి) ఆటంక పరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: "మా వైపునకు రండి!" అని పలుకుతూ ఉన్నారో, అలాంటి వారందరి గురించి, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు;
Faccirooji aarabeeji:
اَشِحَّةً عَلَیْكُمْ ۖۚ— فَاِذَا جَآءَ الْخَوْفُ رَاَیْتَهُمْ یَنْظُرُوْنَ اِلَیْكَ تَدُوْرُ اَعْیُنُهُمْ كَالَّذِیْ یُغْشٰی عَلَیْهِ مِنَ الْمَوْتِ ۚ— فَاِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوْكُمْ بِاَلْسِنَةٍ حِدَادٍ اَشِحَّةً عَلَی الْخَیْرِ ؕ— اُولٰٓىِٕكَ لَمْ یُؤْمِنُوْا فَاَحْبَطَ اللّٰهُ اَعْمَالَهُمْ ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟
(మీకు తోడ్పడే విషయంలో) వారు పరమ లోభులుగా ఉండేవారు. (ఓ ప్రవక్తా!) వారి పైకి ప్రమాదం వచ్చినపుడు వారు (నీ సహాయం కోరుతూ) మరణం ఆసన్నమైన వ్యక్తి కనుగ్రుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని, నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే, వారు లాభాలను పొందే ఉద్దేశంతో, కత్తెర వలే ఆడే నాలుకలతో మీతో బడాయీలు చెప్పుకుంటారు. అలాంటి వారు ఏ మాత్రం విశ్వసించలేదు. కావున, అల్లాహ్ వారి కర్మలను నిరర్థకం చేశాడు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.
Faccirooji aarabeeji:
یَحْسَبُوْنَ الْاَحْزَابَ لَمْ یَذْهَبُوْا ۚ— وَاِنْ یَّاْتِ الْاَحْزَابُ یَوَدُّوْا لَوْ اَنَّهُمْ بَادُوْنَ فِی الْاَعْرَابِ یَسْاَلُوْنَ عَنْ اَنْۢبَآىِٕكُمْ ؕ— وَلَوْ كَانُوْا فِیْكُمْ مَّا قٰتَلُوْۤا اِلَّا قَلِیْلًا ۟۠
దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళి పోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్ళీ దాడి చేస్తే! ఎడారి వాసులతో (బద్దూలతో)[1] కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా! అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు.
[1] ఈ పదానికి ఇంకా చూడండి, 9:90, 97, 98, 99, 101, 120, 48:11, 16, 49:14.
Faccirooji aarabeeji:
لَقَدْ كَانَ لَكُمْ فِیْ رَسُوْلِ اللّٰهِ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ یَرْجُوا اللّٰهَ وَالْیَوْمَ الْاٰخِرَ وَذَكَرَ اللّٰهَ كَثِیْرًا ۟ؕ
వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!
Faccirooji aarabeeji:
وَلَمَّا رَاَ الْمُؤْمِنُوْنَ الْاَحْزَابَ ۙ— قَالُوْا هٰذَا مَا وَعَدَنَا اللّٰهُ وَرَسُوْلُهٗ وَصَدَقَ اللّٰهُ وَرَسُوْلُهٗ ؗ— وَمَا زَادَهُمْ اِلَّاۤ اِیْمَانًا وَّتَسْلِیْمًا ۟ؕ
మరియు విశ్వాసులు, దాడి చేసిన వర్గాల వారిని చూసినపుడు ఇలా పలికారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సత్యం పలికారు." ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లాహ్ పట్ల వారి విధేయతను మరింత అధికమే చేసింది.
Faccirooji aarabeeji:
مِنَ الْمُؤْمِنِیْنَ رِجَالٌ صَدَقُوْا مَا عَاهَدُوا اللّٰهَ عَلَیْهِ ۚ— فَمِنْهُمْ مَّنْ قَضٰی نَحْبَهٗ وَمِنْهُمْ مَّنْ یَّنْتَظِرُ ۖؗ— وَمَا بَدَّلُوْا تَبْدِیْلًا ۟ۙ
విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపినవారు కూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తి చేసుకున్న వారున్నారు, మరికొందరు దానిని పూర్తి చేసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు.
Faccirooji aarabeeji:
لِّیَجْزِیَ اللّٰهُ الصّٰدِقِیْنَ بِصِدْقِهِمْ وَیُعَذِّبَ الْمُنٰفِقِیْنَ اِنْ شَآءَ اَوْ یَتُوْبَ عَلَیْهِمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا ۟ۚ
అల్లాహ్, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు.[1] నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
[1] చూడండి, 6:12.
Faccirooji aarabeeji:
وَرَدَّ اللّٰهُ الَّذِیْنَ كَفَرُوْا بِغَیْظِهِمْ لَمْ یَنَالُوْا خَیْرًا ؕ— وَكَفَی اللّٰهُ الْمُؤْمِنِیْنَ الْقِتَالَ ؕ— وَكَانَ اللّٰهُ قَوِیًّا عَزِیْزًا ۟ۚ
మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే - వారికెలాంటి మేలు లభింప జేయకుండా - వెనుకకు మరలించాడు. యుద్ధరంగంలో విశ్వాసులకు అల్లాహ్ యే (సహాయకునిగా) మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు.
Faccirooji aarabeeji:
وَاَنْزَلَ الَّذِیْنَ ظَاهَرُوْهُمْ مِّنْ اَهْلِ الْكِتٰبِ مِنْ صَیَاصِیْهِمْ وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ فَرِیْقًا تَقْتُلُوْنَ وَتَاْسِرُوْنَ فَرِیْقًا ۟ۚ
మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుద్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్) వారి కోటల నుండి క్రిందికి తీసుకు వచ్చాడు.[1] మరియు వారి హృదయాలలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు.
[1] అంటే యూదులైన బనూ-ఖురై"జా తెగవారు. వారు మొదట శత్రువులకు సహాయపడమని మదీనా ముస్లింలతో ఒప్పందం చేసుకుంటారు. కాని మదీనా నగరం నుండి వెడలగొట్టబడిన బనూ-న'దీర్ తెగవారి మాటలు విని, తమ ఒడంబడికను త్రెంపి శత్రువులకు సహాయపడటానికి పూనుకుంటారు. అందుకే శత్రువులు పారిపోయింది చూసి వారు తమ కోటలలో దాక్కుంటారు. ముస్లింలు వారిని 25 రోజులు ముట్టడించి ఉంచుతారు. చివరకు వారు - తమ విశ్వాసఘాతానికి - శిక్షకు గురి అవుతారు.
Faccirooji aarabeeji:
وَاَوْرَثَكُمْ اَرْضَهُمْ وَدِیَارَهُمْ وَاَمْوَالَهُمْ وَاَرْضًا لَّمْ تَطَـُٔوْهَا ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرًا ۟۠
మరియు ఆయన (అల్లాహ్) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు.[1] మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా, (మిమ్మల్ని వారసులుగా చేశాడు). మరియు వాస్తవంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
[1] కొందరు వ్యాఖ్యాతలు ఇది 6వ హిజ్రీలో జరిగిన 'ఖైబర్ విజయమని అభిప్రాయపడ్డారు. మరి కొందరు రోమ్ మరియు పర్షియాల విజయాలని! (ఫ'త్హ్ అల్-ఖదీర్).
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا النَّبِیُّ قُلْ لِّاَزْوَاجِكَ اِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَیٰوةَ الدُّنْیَا وَزِیْنَتَهَا فَتَعَالَیْنَ اُمَتِّعْكُنَّ وَاُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِیْلًا ۟
ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: "ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లైతే, రండి నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచి పెడతాను."[1]
[1] ఈ విజయాల వల్ల ముస్లింలకు ధన సంపత్తులు దొరకడం వల్ల, వారు మొదటి కంటే ఎంతో అధికంగా సుఖవంతమైన జీవితం గడుపసాగారు. ఇది చూసి దైవప్రవక్త భార్యలు (ర'ది.'అన్హుమ్) కూడా ఆ సంపదలను తమ కొరకు కోరారు. దానికి జవాబుగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది. దీనితో అర్థమయ్యేదేమిటంటే, ఎన్నో సంపత్తులు ముస్లింలకు దొరికినా, దైవప్రవక్త ('స'అస) తన స్వంత వినియోగం కొరకు మొదటి వలెనే అతి తక్కువ జీవనోపాధిని ఉంచుకునే వారు. అంతా ముస్లింలకు పంచేవారు. దీని తరువాత ఉమ్మహాతుల్ మోమినీన్ (ర'ది.'అన్హుమ్) లు తమ పట్టు వదలుకున్నారు. ఆ కాలంలో దైవప్రవక్త ('స'అస) వివాహబంధంలో తొమ్మిది మంది భార్య (ర'ది.'అన్హుమ్) లు ఉన్నారు. ఐదుగురు ఖురైషులు 'ఆయిషహ్, 'హ'ఫ్సా, ఉమ్ము - 'హబీబా, 'సౌదా, మరియు ఉమ్ము సల్మా (ర'ది.'అన్హుమ్) మరియు నలుగురు ఇతరులు: 'సఫియ్యా, మైమూనా, 'జైనబ్ మరియు జువేరియా (ర'ది.'అన్హుమ్).
Faccirooji aarabeeji:
وَاِنْ كُنْتُنَّ تُرِدْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَالدَّارَ الْاٰخِرَةَ فَاِنَّ اللّٰهَ اَعَدَّ لِلْمُحْسِنٰتِ مِنْكُنَّ اَجْرًا عَظِیْمًا ۟
"కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, నిశ్చయంగా, అల్లాహ్ మలో సజ్జనులైన వారికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు."
Faccirooji aarabeeji:
یٰنِسَآءَ النَّبِیِّ مَنْ یَّاْتِ مِنْكُنَّ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ یُّضٰعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَیْنِ ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟
ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది.[1] మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.
[1] అల్ ఫా'హిషహ్ అంటే ఖుర్ఆన్ లో 'జినా' అంటే వ్యభిచారం, అనే అర్థంలో వాడబడింది. అల్ - లేకుండా ఫా'హిషహ్ అని ఉంటే - ఇక్కడ ఉన్నట్లు - సభ్యతలేని పని, లేక అనుచితమైన పని అనే అర్థంలో వాడబడింది. పెద్దవారు చేసే చిన్నతప్పు కూడా పెద్దదే. కాబట్టి వారికి రెండింతలు శిక్ష దని బోధింపబడింది.
Faccirooji aarabeeji:
وَمَنْ یَّقْنُتْ مِنْكُنَّ لِلّٰهِ وَرَسُوْلِهٖ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَاۤ اَجْرَهَا مَرَّتَیْنِ ۙ— وَاَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِیْمًا ۟
మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో, ఆమెకు రెట్టింపు ప్రతిఫలమిస్తాము మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము.[1]
[1] చూడండి, 8:4.
Faccirooji aarabeeji:
یٰنِسَآءَ النَّبِیِّ لَسْتُنَّ كَاَحَدٍ مِّنَ النِّسَآءِ اِنِ اتَّقَیْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَیَطْمَعَ الَّذِیْ فِیْ قَلْبِهٖ مَرَضٌ وَّقُلْنَ قَوْلًا مَّعْرُوْفًا ۟ۚ
ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే! దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్భుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా, సూటిగానే మాట్లాడండి.
Faccirooji aarabeeji:
وَقَرْنَ فِیْ بُیُوْتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِیَّةِ الْاُوْلٰی وَاَقِمْنَ الصَّلٰوةَ وَاٰتِیْنَ الزَّكٰوةَ وَاَطِعْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ— اِنَّمَا یُرِیْدُ اللّٰهُ لِیُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ اَهْلَ الْبَیْتِ وَیُطَهِّرَكُمْ تَطْهِیْرًا ۟ۚ
మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి.[1] మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా![2] నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు.
[1] చూడండి, 5:50.
[2] అహ్లల్ - బైత్, శబ్దానికి ఈ విధంగా అర్థాలు ఇవ్వబడ్డాయి. ఈ ఆయత్ లో ఖుర్ఆన్, దైవప్రవక్త ('స'అస) సతీమణు (ర'ది.'అన్హుమ్)లనే సంబోధిస్తోంది. ఖుర్ఆన్ లో ఇతర చోట్లలో కూడా భార్యలను అహ్లల్-బైత్ అని, సంబోధించబడింది. ఉదాహరణకు 11:73. కొందరు 'అలీ, ఫాతిమా, 'హసన్ మరియు 'హుసైన్ (ర'ది.'అన్హుమ్)లను మాత్రమే అహ్లల్-బైత్ గా భావిస్తున్నారు. వాస్తవమేమిటంటే, దైవప్రవక్త సతీమణులూ (ర'ది.'అన్హుమ్), దైవప్రవక్త ('స'అస) సంతానం (ర'ది'అన్హుమ్) మరియు ఈ నలుగురూ (ర'ది'అన్హుమ్), అందరూ అహ్లల్-బైత్ వారే! (ఫ'త్హ్ అల్-ఖదీర్, షౌకానీ)
Faccirooji aarabeeji:
وَاذْكُرْنَ مَا یُتْلٰی فِیْ بُیُوْتِكُنَّ مِنْ اٰیٰتِ اللّٰهِ وَالْحِكْمَةِ ؕ— اِنَّ اللّٰهَ كَانَ لَطِیْفًا خَبِیْرًا ۟۠
మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు.[1]
[1] చూడండి, 6:103.
Faccirooji aarabeeji:
اِنَّ الْمُسْلِمِیْنَ وَالْمُسْلِمٰتِ وَالْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ وَالْقٰنِتِیْنَ وَالْقٰنِتٰتِ وَالصّٰدِقِیْنَ وَالصّٰدِقٰتِ وَالصّٰبِرِیْنَ وَالصّٰبِرٰتِ وَالْخٰشِعِیْنَ وَالْخٰشِعٰتِ وَالْمُتَصَدِّقِیْنَ وَالْمُتَصَدِّقٰتِ وَالصَّآىِٕمِیْنَ وَالصّٰٓىِٕمٰتِ وَالْحٰفِظِیْنَ فُرُوْجَهُمْ وَالْحٰفِظٰتِ وَالذّٰكِرِیْنَ اللّٰهَ كَثِیْرًا وَّالذّٰكِرٰتِ ۙ— اَعَدَّ اللّٰهُ لَهُمْ مَّغْفِرَةً وَّاَجْرًا عَظِیْمًا ۟
నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు[1] ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు;[2] మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.
[1] 'సౌమున్: కేవలం ఆహార పానీయాలే గాక ఇతర చెడు విషయాల నుండి కూడా దూరంగా ఉండటం. ఇంకా చూడండి, 19:26 అక్కడ ఈ శబ్దం మాట్లాడకుండా ఉండటాన్ని సూచిస్తుంది.
[2] చూడండి, 24:30.
Faccirooji aarabeeji:
وَمَا كَانَ لِمُؤْمِنٍ وَّلَا مُؤْمِنَةٍ اِذَا قَضَی اللّٰهُ وَرَسُوْلُهٗۤ اَمْرًا اَنْ یَّكُوْنَ لَهُمُ الْخِیَرَةُ مِنْ اَمْرِهِمْ ؕ— وَمَنْ یَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَقَدْ ضَلَّ ضَلٰلًا مُّبِیْنًا ۟
మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు.[1] మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే!
[1] ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) మరియు 'జైనబ్ (ర.'అన్హా)ల వివాహం గురించి అవతరింపజేయబడింది.
Faccirooji aarabeeji:
وَاِذْ تَقُوْلُ لِلَّذِیْۤ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِ وَاَنْعَمْتَ عَلَیْهِ اَمْسِكْ عَلَیْكَ زَوْجَكَ وَاتَّقِ اللّٰهَ وَتُخْفِیْ فِیْ نَفْسِكَ مَا اللّٰهُ مُبْدِیْهِ وَتَخْشَی النَّاسَ ۚ— وَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشٰىهُ ؕ— فَلَمَّا قَضٰی زَیْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنٰكَهَا لِكَیْ لَا یَكُوْنَ عَلَی الْمُؤْمِنِیْنَ حَرَجٌ فِیْۤ اَزْوَاجِ اَدْعِیَآىِٕهِمْ اِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ؕ— وَكَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا ۟
మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు:[1] "నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే!
[1] ముహమ్మద్ ('స'అస) ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు 'ఖదీజహ్ (ర.'అన్హా) అతనికి ('స'అస) ఒక బానిసను కానుకగా ఇస్తారు. అతని పేరు 'జైద్ బిన్-'హారిసా. అతడు ఉత్తర అరేబియాకు చెందిన బనూ-కల్బ్ తెగకు చెందిన 'అరబ్బ్. అతడు (ర'ది.'అ.) చిన్నతనంలోనే తెగల మధ్య జరిగే యుద్ధాలలో బందీ అయ్యి అమ్మి వేయబడతారు. అతనిని (ర'ది.'అ.) 'ఖదీజహ్ (ర.'అన్హా) కొని, తరువాత దైవప్రవక్త ('స'అస) కు ఇస్తారు. దైవప్రవక్త ('స'అస) అతనికి స్వేచ్ఛనిస్తారు. ఆ తరువాత అతనిని తమ దత్తకుమారునిగా చేసుకుంటారు. దైవప్రవక్త ('స'అస) పై వ'హీ అవతరించిన తరువాత మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారిలో ఇతను (ర'ది.'అ.) కూడా ఒకరు. అతని ('ర'ది.'అ.) వివాహం దైవప్రవక్త ('స'అస) తన మేనత్త కుమార్తె 'జైనబ్ బింతె-జ'హష్ (ర.'అన్హా) తో చేయిస్తారు. కాని మొదటి నుండియే ఆమె (ర.'అన్హా)కు ఈ వివాహం నచ్చదు. వారి మధ్య మొదటి రోజు నుండియే కలహాలు ప్రారంభమవుతాయి. 'జైద్ (ర'ది.'అ.) కూడా తన మొదటి భార్య - స్వేచ్ఛ ఇవ్వబడిన బానిస - ఉమ్ముఆయ్ మన్ (ర. 'అన్హా), అతని కుమారుడు ఉసామహ్ (ర'ది.'అ.) యొక్క తల్లితో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. 'జైద్ బిన్ 'హారిస'హ్ మరియు 'జైనబ్ బింతె-జ'హష్ (ర'ది. 'అన్హుమ్)ల మధ్య ఎల్లప్పుడూ కలహాలు జరుగుతూ ఉంటాయి. దానితో 'జైద్ (ర'.ది.'అ.) 5వ హిజ్రీలో 'జైనబ్ బింతె-జ'హష్ (ర.'అన్హా)కు విడాకులు ఇస్తారు. తరువాత దైవప్రవక్త ('స'అస) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ ప్రకారం ఆమె (ర.'అన్హా)తో వివాహం చేసుకుంటారు. దత్తపుత్రుడు ఏ మాత్రం స్వంతపుత్రుడు కాజాలడు. కావున అతడు విడిచిన స్త్రీతో వివాహం చేసుకోవచ్చు అనే విషయం కూడా దీనితో స్పష్టమవుతుంది.
Faccirooji aarabeeji:
مَا كَانَ عَلَی النَّبِیِّ مِنْ حَرَجٍ فِیْمَا فَرَضَ اللّٰهُ لَهٗ ؕ— سُنَّةَ اللّٰهِ فِی الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلُ ؕ— وَكَانَ اَمْرُ اللّٰهِ قَدَرًا مَّقْدُوْرَا ۟ؗۙ
అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం;
Faccirooji aarabeeji:
١لَّذِیْنَ یُبَلِّغُوْنَ رِسٰلٰتِ اللّٰهِ وَیَخْشَوْنَهٗ وَلَا یَخْشَوْنَ اَحَدًا اِلَّا اللّٰهَ ؕ— وَكَفٰی بِاللّٰهِ حَسِیْبًا ۟
వారికి, ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహ్ యే చాలు!
Faccirooji aarabeeji:
مَا كَانَ مُحَمَّدٌ اَبَاۤ اَحَدٍ مِّنْ رِّجَالِكُمْ وَلٰكِنْ رَّسُوْلَ اللّٰهِ وَخَاتَمَ النَّبِیّٖنَ ؕ— وَكَانَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا ۟۠
(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు.[1] కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.[2] మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.
[1] అంటే అతను ('స'అస), 'జైద్ బిన్-'హారిసా (ర'ది.'అ.) యొక్క తండ్రి కారు. మరియు ఏ ఇతర పురుషుని తండ్రి కూడా కారు. ప్రతివాడు తన నిజతండ్రి పేరుతోనే పిలువబడాలి. దైవప్రవక్త ('స'అస) కు 'ఖదీజహ్ (ర.'అన్హా) నుండి ముగ్గురు కుమారులు: ఖాసిమ్, 'తయ్యబ్ మరియు 'తాహిర్. మారియా ఖబ్తియా (ర.'అన్హా) నుండి ఇబ్రాహీం. వారంతా బాల్యావస్థలోనే మరణించారు, (ఇబ్నె-కసీ'ర్, ము'హమ్మద్ జూనాగఢి). కొందరు వ్యాఖ్యాతలు 'ఖదీజహ్ (ర.'అన్హా)కు ఇద్దరు కుమారులే అని అంటారు: ఖాసిమ్ మరియు అబ్దుల్లాహ్. 'తయ్యబ్, 'తాహిహ్ అనేవి అబ్దుల్లాహ్ యొక్క మారు పేర్లు అని వారంటారు.
[2] 'ఖాతమున్: అంటే ముద్ర. ముద్రవేయటం చివరిపని, కావున దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) తరువాత ఇక ఏ ప్రవక్త కూడా రాడు. కాబట్టి అతను ప్రవక్తల ముద్ర (చివరివాడు), అని సంబోధించబడ్డారు. కావున అతన తరువాత తనను తాను ప్రవక్తగా పరిగణించేవాడు, అసత్యుడూ, దజ్జాల్ మాత్రమే! చివరికాలంలో దైవప్రవక్త 'ఈసా ('అ.స.) తిరిగి వస్తారు. కానీ అతను ప్రవక్తగా గాక ము'హమ్మద్ ('స'అస) యొక్క ఉమ్మతి (అనుచరునిగా) వస్తారు. ఇదంతా స'హీ 'హదీసులలో ఉంది. చాలా మంది ధర్మవేత్తల అభిప్రాయం ఇదే! అతను ('స'అస) చివరి ప్రవక్త కాబట్టి సమస్తలోకాలకు ప్రవక్తగా పంపబడ్డారు. చూడండి, 21:107.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اذْكُرُوا اللّٰهَ ذِكْرًا كَثِیْرًا ۟ۙ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను (ఏకాగ్రతతో) అత్యధికంగా స్మరించండి.
Faccirooji aarabeeji:
وَّسَبِّحُوْهُ بُكْرَةً وَّاَصِیْلًا ۟
మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి.
Faccirooji aarabeeji:
هُوَ الَّذِیْ یُصَلِّیْ عَلَیْكُمْ وَمَلٰٓىِٕكَتُهٗ لِیُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ— وَكَانَ بِالْمُؤْمِنِیْنَ رَحِیْمًا ۟
ఆయన మీపై ఆశీర్వాదాలు (సలాత్) పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకు రావటానికి (ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు). మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణా ప్రదాత.
Faccirooji aarabeeji:
تَحِیَّتُهُمْ یَوْمَ یَلْقَوْنَهٗ سَلٰمٌ ۖۚ— وَّاَعَدَّ لَهُمْ اَجْرًا كَرِیْمًا ۟
వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది.[1] మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు.
[1] స్వర్గవాసులు లేక దైవదూతలు దానిలోకి వచ్చేవారికి ఈ విధంగా స్వాగతం చేస్తారు.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا النَّبِیُّ اِنَّاۤ اَرْسَلْنٰكَ شَاهِدًا وَّمُبَشِّرًا وَّنَذِیْرًا ۟ۙ
ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము!
Faccirooji aarabeeji:
وَّدَاعِیًا اِلَی اللّٰهِ بِاِذْنِهٖ وَسِرَاجًا مُّنِیْرًا ۟
మరియు ఆయన అనుమతితో, అల్లాహ్ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగానూ (చేసి పంపాము)!
Faccirooji aarabeeji:
وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ بِاَنَّ لَهُمْ مِّنَ اللّٰهِ فَضْلًا كَبِیْرًا ۟
మరియు నిశ్చయంగా, వారి మీద అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు.
Faccirooji aarabeeji:
وَلَا تُطِعِ الْكٰفِرِیْنَ وَالْمُنٰفِقِیْنَ وَدَعْ اَذٰىهُمْ وَتَوَكَّلْ عَلَی اللّٰهِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟
మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్య పెట్టకు మరియు కేవలం అల్లాహ్ నే నమ్ముకో మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్ యే చాలు!
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نَكَحْتُمُ الْمُؤْمِنٰتِ ثُمَّ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ فَمَا لَكُمْ عَلَیْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّوْنَهَا ۚ— فَمَتِّعُوْهُنَّ وَسَرِّحُوْهُنَّ سَرَاحًا جَمِیْلًا ۟
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు.[1] కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి.[2]
[1] వివాహం తరువాత స్త్రీతో సంభోగించి ఉంటే ఆమె వేచిఉండే గడువు ('ఇద్దత్) మూడు రుతుస్రావాలు. చూడండి, 2:228. కాని వివాహం తరువాత సంభోగించక ముందే విడాకులిస్తే ఆమె వేచిఉండక వెంటనే, మరొకనితో వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ సంభోగం జరుగకముందే భర్త చనిపోతే 'ఇద్దత్ నాలుగు నెలల మీద పది రోజులు, (ఫ'త్హ్ అల్-ఖదీర్, ఇబ్నె-కసీ'ర్). నికా'హ్ జరిగిన తరువాతనే 'తలాఖ్, ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నికా'హ్ యే కాకుంటే 'తలాఖ్ ఇవ్వవలసిన అవసరం ఎక్కడ ఉంటుంది! "లా'తలాఖ ఖబ్ ల నికా'హ్." (ఇబ్నె-మాజా): "లా 'తలాఖ లి ఇబ్ని ఆదమ్ ఫీమా లా యమ్ లికు." (అబూ-దావూద్, తిర్మిజీ' మరియు అ'హ్మద్ - 2/189) అంటే పెండ్లి (నికా'హ్) కానిదే 'తలాఖ్ విషయమే రాదు.
[2] అంటే వారి మహ్ర్ నిర్ణయించబడి ఉంటే సగం ఇవ్వండి. లేకపోతే మీకు తోటినది ఇచ్చి మంచివిధంగా సాగనంపండి.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا النَّبِیُّ اِنَّاۤ اَحْلَلْنَا لَكَ اَزْوَاجَكَ الّٰتِیْۤ اٰتَیْتَ اُجُوْرَهُنَّ وَمَا مَلَكَتْ یَمِیْنُكَ مِمَّاۤ اَفَآءَ اللّٰهُ عَلَیْكَ وَبَنٰتِ عَمِّكَ وَبَنٰتِ عَمّٰتِكَ وَبَنٰتِ خَالِكَ وَبَنٰتِ خٰلٰتِكَ الّٰتِیْ هَاجَرْنَ مَعَكَ ؗ— وَامْرَاَةً مُّؤْمِنَةً اِنْ وَّهَبَتْ نَفْسَهَا لِلنَّبِیِّ اِنْ اَرَادَ النَّبِیُّ اَنْ یَّسْتَنْكِحَهَا ۗ— خَالِصَةً لَّكَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ؕ— قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَیْهِمْ فِیْۤ اَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ اَیْمَانُهُمْ لِكَیْلَا یَكُوْنَ عَلَیْكَ حَرَجٌ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟
ఓ ప్రవక్తా! నిశ్చయంగా, మేము నీకు: నీవు మహ్ర్ చెల్లించిన నీ భార్యలను[1] మరియు అల్లాహ్ ప్రసాదించిన (బానిస) స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని (స్త్రీలను)[2] మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి (తండ్రి సోదరుల) కుమార్తెలను మరియు నీ మేనత్తల (తండ్రి సోదరీమణుల) కుమార్తెలను మరియు నీ మేనమామల (తల్లిసోదరుల) కుమార్తెలను మరియు నీ పినతల్లుల (తల్లిసోదరీమణుల) కుమార్తెలను; మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని - ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకు గాక ప్రత్యేకంగా నీ కొరకే - ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి (ఇతర విశ్వాసుల) కొరకు, వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో, మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు.[3] ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
[1] దైవప్రవక్త ('స'అస) కు కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు అతని ('స'అస) పై తహజ్జుద్ నమా'జ్ విధిగా చేయబడింది. మరియు సదఖహ్ (దానం) అతని ('స'అస)పై హరాం చేయబడింది. ఇక్కడ ఎవరికైతే అతను ('స'అస) మహ్ర్ చెల్లించారో వారు అతనికి 'హలాల్ గావించబడ్డారు. వారికి మహ్ర్ ఇంత అని నియమించబడలేదు. ఉదాహరణకు: 'సఫియా మరియు జువేరియా (ర'ది. 'అన్హుమ్)ల మహ్ర్. ఇతరులందరికీ దైవప్రవక్త ('స'అస) మహ్ర్ నగదు చెల్లించారు. కేవలం ఉమ్మె 'హబీబా (ర.'అన్హా) మహ్ర్ నజ్జాషీ (ర'ది.'అ.) చెల్లించారు.
[2] జువేరియా మరియు చివరి భార్య 'సఫియా (ర'ది.'అన్హుమ్)లను ఇద్దరిని అతను ('స'అస) వారి స్వేచ్ఛనే మహ్ర్ గా ప్రసాదించి వివాహమాడారు. రె'హానా మరియు మారియా ఖిబ్తియా (ర'ది.'అన్హుమ్)లు బానిసలుగానే ఉన్నారు. (ము'హమ్మద్ జూనాగఢి).
[3] ఇతర విశ్వాసులు ఒకేసారి నలుగురి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండరాదు. మరియు వారి నికా'హ్ కొరకు వలీ, సాక్షులు మరియు మహ్ర్ తప్పనిసరిగా ఉండాలి. ఈనాడు బానిసలు లేరు. ఎందుకంటే బానిసలు జిహాద్ లో పట్టుబడిన వారు మాత్రమే. డబ్బిచ్చి బానిసను కొనడం ఇస్లాంలో 'హరామ్. చూడండి, 2:221, 4:3-4 మరియు 19:25.
Faccirooji aarabeeji:
تُرْجِیْ مَنْ تَشَآءُ مِنْهُنَّ وَتُـْٔوِیْۤ اِلَیْكَ مَنْ تَشَآءُ ؕ— وَمَنِ ابْتَغَیْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَیْكَ ؕ— ذٰلِكَ اَدْنٰۤی اَنْ تَقَرَّ اَعْیُنُهُنَّ وَلَا یَحْزَنَّ وَیَرْضَیْنَ بِمَاۤ اٰتَیْتَهُنَّ كُلُّهُنَّ ؕ— وَاللّٰهُ یَعْلَمُ مَا فِیْ قُلُوْبِكُمْ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَلِیْمًا ۟
నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంత కాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతోపాటు ఉంచవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే, నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్ కు తెలుసు.[1] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహన శీలుడు).
[1] 'అయి'షహ్ (ర.'అన్హా) కథనం - దైవప్రవక్త ('స'అస) ఇలా ప్రార్థించేవారు: "ఓ అల్లాహ్! నేను నా మేరకు నా భార్యల మధ్య న్యాయంగా వ్యవహరిస్తున్నాను. ఇక నా వశంలో లేని దాని కొరకు నన్ను బాధ్యునిగా చేయకు! అది కేవలం నీ చేతిలో ఉంది." అంటే హృదయంలో ఉన్న ప్రేమ, అది ఒక భార్యకంటే మరొక భార్య కొరకు అధికంగా ఉండవచ్చు! (ఇబ్నె-'హంబల్).
Faccirooji aarabeeji:
لَا یَحِلُّ لَكَ النِّسَآءُ مِنْ بَعْدُ وَلَاۤ اَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ اَزْوَاجٍ وَّلَوْ اَعْجَبَكَ حُسْنُهُنَّ اِلَّا مَا مَلَكَتْ یَمِیْنُكَ ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ رَّقِیْبًا ۟۠
వీరు గాక, ఇతర స్త్రీలు నీకు (వివాహమాడటానికి) ధర్మసమ్మతం కారు.[1] వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు - వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా - నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప![2] వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు.
[1] అప్పుడు దైవప్రవక్త ('స'అస) కు తొమ్మిది మంది సతీమణులు (ర'ది.'అన్హుమ్) ఉండేవారు. ఐదుమంది ఖురైషులు 'ఆయిషహ్, 'హఫ్సా, ఉమ్ము-'హబీబా, 'సౌదా, మరియు ఉమ్ము-సల్మా. నలుగురు ఇతరులు: 'సఫియ్యా, మైమూనా, 'జైనబ్ మరియు జువేరియా. అతను ('స'అస) ఆ తరువాత ఎవ్వరితోనూ వివాహమాడలేదు.
[2] బానిస స్త్రీల విషయంలో సంఖ్యాపరిమితి లేదు. వారిని గురించి 4:3, 23:6 మరియు 70:30.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُیُوْتَ النَّبِیِّ اِلَّاۤ اَنْ یُّؤْذَنَ لَكُمْ اِلٰی طَعَامٍ غَیْرَ نٰظِرِیْنَ اِنٰىهُ وَلٰكِنْ اِذَا دُعِیْتُمْ فَادْخُلُوْا فَاِذَا طَعِمْتُمْ فَانْتَشِرُوْا وَلَا مُسْتَاْنِسِیْنَ لِحَدِیْثٍ ؕ— اِنَّ ذٰلِكُمْ كَانَ یُؤْذِی النَّبِیَّ فَیَسْتَحْیٖ مِنْكُمْ ؗ— وَاللّٰهُ لَا یَسْتَحْیٖ مِنَ الْحَقِّ ؕ— وَاِذَا سَاَلْتُمُوْهُنَّ مَتَاعًا فَسْـَٔلُوْهُنَّ مِنْ وَّرَآءِ حِجَابٍ ؕ— ذٰلِكُمْ اَطْهَرُ لِقُلُوْبِكُمْ وَقُلُوْبِهِنَّ ؕ— وَمَا كَانَ لَكُمْ اَنْ تُؤْذُوْا رَسُوْلَ اللّٰهِ وَلَاۤ اَنْ تَنْكِحُوْۤا اَزْوَاجَهٗ مِنْ بَعْدِهٖۤ اَبَدًا ؕ— اِنَّ ذٰلِكُمْ كَانَ عِنْدَ اللّٰهِ عَظِیْمًا ۟
ఓ విశ్వాసులారా! ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి, కాని మీరు పిలువబడి నప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మనటానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గు పడడు).[1] మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం.
[1] దైవప్రవక్త ('స'అస) 'జైనబ్ (ర.'అన్హా) తో వివాహమాడి ఇచ్చిన వలీమా భోజనం సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఆ రోజు కొందరు 'స'హాబీలు భోజనం తరువాత కూర్చొని కాలక్షేపం చేయసాగారు. ('స.బు'ఖారీ).
Faccirooji aarabeeji:
اِنْ تُبْدُوْا شَیْـًٔا اَوْ تُخْفُوْهُ فَاِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا ۟
ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా! నిశ్చయంగా, అల్లాహ్ కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
Faccirooji aarabeeji:
لَا جُنَاحَ عَلَیْهِنَّ فِیْۤ اٰبَآىِٕهِنَّ وَلَاۤ اَبْنَآىِٕهِنَّ وَلَاۤ اِخْوَانِهِنَّ وَلَاۤ اَبْنَآءِ اِخْوَانِهِنَّ وَلَاۤ اَبْنَآءِ اَخَوٰتِهِنَّ وَلَا نِسَآىِٕهِنَّ وَلَا مَا مَلَكَتْ اَیْمَانُهُنَّ ۚ— وَاتَّقِیْنَ اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدًا ۟
వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస (స్త్రీల) - యెదుట వస్తే ఎలాంటి దోషం లేదు.[1] (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షి;
[1] చూడండి, 24:31 అక్కడ కూడా ఈ శాసనం ఉంది.
Faccirooji aarabeeji:
اِنَّ اللّٰهَ وَمَلٰٓىِٕكَتَهٗ یُصَلُّوْنَ عَلَی النَّبِیِّ ؕ— یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا صَلُّوْا عَلَیْهِ وَسَلِّمُوْا تَسْلِیْمًا ۟
నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి.[1]
[1] అల్లాహ్ (సు.తా.) దైవదూతల ('అలైహిమ్. స.) ముందు దైవప్రవక్త ('స'అస) ను ప్రశంసిస్తాడు. మరియు అతనిపై తన కారుణ్యాలను అవతరింపజేస్తాడు. మరియు దైవదూత ('అలైహిమ్.స.) లు అతని ('స'అస) ఔన్నత్యాలకు ప్రార్థనలు చేస్తారు. సహాబీ (ర'ది.'అన్హుమ్)లు దైవప్రవక్తతో మేము ఏ విధంగా మీపై దురూద్ పంపాలి అని ప్రశ్నించగా, అతను ('స'అస) నమాజ్ లో చదివే దురూద్ ఇబ్రాహీమ్ వివరించారు, ('స.బు'ఖారీ).
Faccirooji aarabeeji:
اِنَّ الَّذِیْنَ یُؤْذُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ لَعَنَهُمُ اللّٰهُ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ وَاَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِیْنًا ۟
నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) ను ఎవ్వరూ బాధించలేరు. ఇక్కడ దీని అర్థం అల్లాహ్ (సు.తా.) కు ఇష్టం లేని పని చేయడం. ఉదా: అల్లాహ్ (సు.తా.)కు సంతానం అంటగట్టడం. అల్లాహ్ (సు.తా.) యొక్క సందేశహరునికి బాధ కలిగించడం అంటే, అతని ('స'అస) పై అసత్యవాదుడు, కవి, మాంత్రికుడు అని అపనిందలు మోపడం. ల'అనతున్: అంటే అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాల నుండి బహిష్కరించ, శపించ, నిషేధించ, త్రోసివేయ, దూషించ బడటం అనే అర్థాలున్నాయి. చూడండి, 2:88.
Faccirooji aarabeeji:
وَالَّذِیْنَ یُؤْذُوْنَ الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ بِغَیْرِ مَا اكْتَسَبُوْا فَقَدِ احْتَمَلُوْا بُهْتَانًا وَّاِثْمًا مُّبِیْنًا ۟۠
మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే!
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا النَّبِیُّ قُلْ لِّاَزْوَاجِكَ وَبَنٰتِكَ وَنِسَآءِ الْمُؤْمِنِیْنَ یُدْنِیْنَ عَلَیْهِنَّ مِنْ جَلَابِیْبِهِنَّ ؕ— ذٰلِكَ اَدْنٰۤی اَنْ یُّعْرَفْنَ فَلَا یُؤْذَیْنَ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟
ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది.[1] మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
[1] చూడండి, 24:31. శరీరాన్ని పూర్తిగా కప్పుకొని, నెత్తిపై ఉన్న దుప్పటిని ముఖం మీదికి లాగుకొని కప్పుకోమని ఆజ్ఞ ఇవ్వబడింది.
Faccirooji aarabeeji:
لَىِٕنْ لَّمْ یَنْتَهِ الْمُنٰفِقُوْنَ وَالَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْمُرْجِفُوْنَ فِی الْمَدِیْنَةِ لَنُغْرِیَنَّكَ بِهِمْ ثُمَّ لَا یُجَاوِرُوْنَكَ فِیْهَاۤ اِلَّا قَلِیْلًا ۟ۚۛ
ఒకవేళ ఈ కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం (కలుషితం) ఉన్న వారు మరియు మదీనాలో వదంతులు వ్యాపింప జేసేవారు. తమ (దుశ్చేష్టలను) మానుకోక పోతే, మేము తప్పక నీకు వారిపై ఆధిక్యత నొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగు వారిగా కొన్నాళ్ళ కంటే ఎక్కువ ఉండలేరు.
Faccirooji aarabeeji:
مَّلْعُوْنِیْنَ ۛۚ— اَیْنَمَا ثُقِفُوْۤا اُخِذُوْا وَقُتِّلُوْا تَقْتِیْلًا ۟
వారు శపించబడ్డ (బహిష్కరించబడ్డ) వారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు.[1]
[1] చూడండి, 2:191.
Faccirooji aarabeeji:
سُنَّةَ اللّٰهِ فِی الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلُ ۚ— وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللّٰهِ تَبْدِیْلًا ۟
ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లాహ్ సంప్రదాయమే! మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు.[1]
[1] చూడండి, 35:42-44.
Faccirooji aarabeeji:
یَسْـَٔلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ ؕ— وَمَا یُدْرِیْكَ لَعَلَّ السَّاعَةَ تَكُوْنُ قَرِیْبًا ۟
ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరుత్థానం) ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: "దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది." మరియు నీకెలా తెలియదు? బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు![1]
[1] చూడండి, 7:187.
Faccirooji aarabeeji:
اِنَّ اللّٰهَ لَعَنَ الْكٰفِرِیْنَ وَاَعَدَّ لَهُمْ سَعِیْرًا ۟ۙ
నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను శపించాడు (బహిష్కరించాడు) మరియు ఆయన వారి కొరకు మండే (నరక) అగ్నిని సిద్ధపరచి ఉంచాడు.
Faccirooji aarabeeji:
خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ۚ— لَا یَجِدُوْنَ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟ۚ
వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గానీ సహాయకుణ్ణి గానీ పొందలేరు.
Faccirooji aarabeeji:
یَوْمَ تُقَلَّبُ وُجُوْهُهُمْ فِی النَّارِ یَقُوْلُوْنَ یٰلَیْتَنَاۤ اَطَعْنَا اللّٰهَ وَاَطَعْنَا الرَّسُوْلَا ۟
వారి ముఖాలు నిప్పులపై బొర్లింప బడిన నాడు; వారు: "అయ్యే! మేము అల్లాహ్ కు విధేయులమై ఉండి, సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?" అని వాపోతారు.
Faccirooji aarabeeji:
وَقَالُوْا رَبَّنَاۤ اِنَّاۤ اَطَعْنَا سَادَتَنَا وَكُبَرَآءَنَا فَاَضَلُّوْنَا السَّبِیْلَا ۟
వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము. కాని, వారే మమ్మల్ని (ఋజు) మార్గం నుండి తప్పించారు."
Faccirooji aarabeeji:
رَبَّنَاۤ اٰتِهِمْ ضِعْفَیْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِیْرًا ۟۠
"ఓ మా ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు (బహిష్కరించు)!"
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ اٰذَوْا مُوْسٰی فَبَرَّاَهُ اللّٰهُ مِمَّا قَالُوْا ؕ— وَكَانَ عِنْدَ اللّٰهِ وَجِیْهًا ۟
ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి.[1] తరువాత అల్లాహ్ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు.
[1] మూసా ('అ.స.) ను బాధించిన వివరాలకు చూడండి, 2:55, 5:24.
Faccirooji aarabeeji:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَقُوْلُوْا قَوْلًا سَدِیْدًا ۟ۙ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి.
Faccirooji aarabeeji:
یُّصْلِحْ لَكُمْ اَعْمَالَكُمْ وَیَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ ؕ— وَمَنْ یُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَقَدْ فَازَ فَوْزًا عَظِیْمًا ۟
ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు!
Faccirooji aarabeeji:
اِنَّا عَرَضْنَا الْاَمَانَةَ عَلَی السَّمٰوٰتِ وَالْاَرْضِ وَالْجِبَالِ فَاَبَیْنَ اَنْ یَّحْمِلْنَهَا وَاَشْفَقْنَ مِنْهَا وَحَمَلَهَا الْاِنْسَانُ ؕ— اِنَّهٗ كَانَ ظَلُوْمًا جَهُوْلًا ۟ۙ
నిశ్చయంగా, మేము బాధ్యతను[1] ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను.
[1] బాధ్యత అంటే, అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ పాఠించడం వల్ల కలిగే పుణ్యఫలాలు మరియు తిరస్కరించడం వల్ల కలిగే కష్టనష్టాలు. శిక్షలకు భయపడి, ఆకాశాలూ, భూమీ మరియు పర్వతాలు, దానిని భరించటానికి సమ్మతించలేదు. కాని మానవుడు తన మూఢత్వం వల్ల ఈ బాధ్యతను తన మీద మోపుకున్నాడు. బాధ్యత అంటే ఖుర్ఆన్ కూడా కావచ్చు!
Faccirooji aarabeeji:
لِّیُعَذِّبَ اللّٰهُ الْمُنٰفِقِیْنَ وَالْمُنٰفِقٰتِ وَالْمُشْرِكِیْنَ وَالْمُشْرِكٰتِ وَیَتُوْبَ اللّٰهُ عَلَی الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠
(దాని ఫలితంగా!) అల్లాహ్ కపట విశ్వాసులయిన పురుషులను మరియు కపట విశ్వాసులయిన స్త్రీలను మరియు అల్లాహ్ కు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు; మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Faccirooji aarabeeji:
 
Firo maanaaji Simoore: Simoore pelle
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Firo telgiiwo - Abdu rihiim ɓiy Muhammad - Tippudi firooji ɗii

Firo maanaaji al-quraan tedduɗo oo fayde e ɗemngal telgoo, firi ɗum ko Abdu Al-rahiim ɓiy Muhammad.

Uddude