మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ - ముహమ్మద్ మీద అవతరింప జేయబడిన దానిని - తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచి వేశాడు మరియు వారి స్థితిని బాగు పరిచాడు.
ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియజేస్తున్నాడు.
కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు,[1] వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుద్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి,[2] లేదా పరిహార ధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు.
[1] ప్రతి మానవునికి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ధర్మ విషయంలో బలవంతం లేదు, చూడండి, 2:256. కావున ఎవరైనా మీ ఇస్లాం ధర్మపాలన కారణంగా మీపై దౌర్జన్యాలు చేస్తే! మీరు ఇస్లాంపై నడవకుండా మీ స్వాతంత్ర్యాన్ని భంగపరిస్తే, వారితో మీ మానప్రాణాల రక్షణ మరియు మీ ఇస్లాం ధర్మ రక్షణకై, వారిని పూర్తిగా అణగద్రొక్కే వరకు, లేదా వారిని ఖైదీలుగా చేసుకునే వరకు, వారితో భయంకరంగా పోరాడమే జిహాద్. వారిపై ప్రాబల్యం వహించిన తరువాత వారిని బంధించండి. యుద్ధం ముగిసిన తరువాత వారిలో మంచితనం చూస్తే వారిని కనికరించి, లేదా పరిహారం తీసుకొని వదలండి. చూడండి, 2:190-191. ఇంకా చూడండి జిహాద్ ను గురించి అవతరింపజేయబడిన మొట్టమొదటి ఆయత్ లకు 22:39-40. [2] పరిహారధనానికి బదులుగా యుద్ధఖైదీలను పరస్పరం మార్పిడి కూడా చేసుకోవచ్చు.
ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కాబట్టి ఆయన వారి కర్మలను విఫలం చేశాడు.[1]
[1] కర్మలంటే ఇక్కడ సత్యతిరస్కారుల సత్కర్మలు విఫలమవుతాయి. వీశ్వాసం లేనిదే ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవి విఫలమే అవుతాయి. పరలోకంలో వాటికి ఎలాంటి మంచి ఫలితం దొరకదు. సత్యతిరస్కారుల గమ్యస్థానం నరకమే.
ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది.[1]
ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు.[1]
[1] ఉ'హుద్ యుద్ధంలో మక్కా ముష్రిక్ లు తమకు కొంత ప్రాబల్యం దొరికినందుకు: 'అ'అలు హుబల్' - హుబల్ కు జై! అంటే! విశ్వాసులు: 'అల్లాహు అ'అలావ అజల్లు' - అల్లాహ్ మహోన్నతుడు, గొప్పస్థానం గలవాడు. అని అన్నారు. మరియు ముష్రికులు: 'లనల్'ఉ'జ్జా వలా 'ఉ'జ్జాలకుమ్' - 'ఉ'జ్జా మాతోపాటు ఉన్నాడు, 'ఉ'జ్జా మీతో లేడు. అని, అంటే! ముస్లింలు: 'అల్లాహు మౌలానా వలా మౌలా లకుమ్' - అల్లాహ్ (సు.తా.) మా సంరక్షకుడు, మీ సంరక్షకుడు ఎవ్వడూ లేడు! అని అన్నారు. ('స.బు'ఖారీ)
నిశ్చయంగా, అల్లాహ్! విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగభాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్న వారి నివాసం నరకాగ్నియే అవుతుంది.[1]
[1] సత్యతిరస్కారుకు, తమ ఐహిక జీవితానికే ప్రాధాన్యతనివ్వటం, అంటే కడుపు నింపుకోవటం మరియు లైంగిక అవసరాలను పూర్తి చేసుకోవటమే ప్రధానమైనది. వీరు పరలోక జీవితం గురించి పూర్తిగా అంధకారంలో పడి ఉన్నారు.
మరియు (ఓ ముహమ్మద్!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము. వారికి సహాయపడే వాడెవ్వడూ లేకపోయాడు.[1]
[1] ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) యొక్క మక్కా నుండి మదీనా ప్రస్థానం చేసిన మొదటి రాత్రి అవతరింపజేయబడింది. ('తబరీ - ఇబ్నె- 'అబ్బాస్, కథనం) ఇంకా చూడండి, 6:131.
భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి[1] మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుద్ధమైన తేనె కాలువలు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో అన్ని రకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి.[2] ఇలాంటి వాడు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి సలసల కాగే నీటిని[3] త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో - సమానుడు కాగలడా?
[1] చూడండి, 37:45-47 మరియు 56:19. [2] మీరు ఎప్పుడు ప్రార్థించినా జన్నతుల్ ఫిర్ దౌస్ కొరకే ప్రార్థించండి. అది స్వర్గాలలో అన్నింటికంటే ఉత్తమమైనది. దాని నుంచే స్వర్గపు సెలయేర్లు ప్రారంభమవుతాయి. మరియు దాని పైననే అనంతకరుణామయుని సింహాసనం ('అర్ష్) ఉంది.('స.బు'ఖారీ). [3] చూడండి, 6:70.
మరియు (ఓ ముహమ్మద్!) వారిలో (కపట విశ్వాసులలో) నీ మాటలను చెవి యొగ్గి వినేవారు కొందరున్నారు.[1] కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: "అతను చెప్పినదేమిటి?" వీరే! అల్లాహ్ హృదయాల మీద ముద్రివేసిన వారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు.[2]
ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురు చూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి.[1] అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?
[1] చూదైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నా కాలం మరియు పునరుత్థానదినం ఈ రెండు వ్రేళ్ళవలే ఉంటాయి.' అంటూ అతను (సఅస) తన రెండు వ్రేళ్ళను చూపుతూ అన్నారు: 'ఏ విధంగానైతే ఒక వ్రేలు మరొక వ్రేలుతో కొద్ది మాత్రమే పొడవుగా ఉందో, అదే విధంగా పునరుత్థానదినం నా తరువాత కొంత కాలంలోనే రానున్నది.' (సహీహ్ బుఖారీ).
కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో![1] మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ప్రజలారా! అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో, పశ్చాత్తాపపడుతూ క్షమాపణలు వేడుకుంటూ ఉండండి. నేను కూడా అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో ప్రతిరోజూ డెబ్బై కంటే ఎక్కువసార్లు పశ్చాత్తాపపడుతూ క్షమాపణ వేడుకుంటూ ఉంటాను.' ('స. బు'ఖారీ).
మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: "(యుద్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్ ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1] కాని ఇప్పుడు యుద్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్ అవతరింప జేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, మరణం ఆవహించిన వారి వలే నీ వైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు.[2] కాని అది వారికే మేలైనదై ఉండేది.
[1] ఈ సూరహ్ 22:39 కంటే ముందు అవతరింపజేయబడింది. [2] చూడండి, 4:77 ఇటువంటి వాక్యానికి.
ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది.
మార్గదర్శకత్వం స్పష్టమైన తర్వాత కూడా, ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలి పోయారో! నిశ్చయంగా, షైతాన్ (వారి చేష్టలను) వారికి మంచివిగా చూపాడు మరియు (అల్లాహ్) వారికి వ్యవధినిచ్చాడు.
ఇది ఎందుకంటే వాస్తవానికి వారు, అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునే వారితో ఇలా అన్నందుకు: "మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము." మరియు అల్లాహ్ కు వారి రహస్య సమాలోచనలను గురించి బాగా తెలుసు.[1]
ఇది వాస్తవానికి, వారు అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించి నందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించుకున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు.
మరియు మేము తలచుకుంటే, వారిని నీకు చూపేవారం; వారి లక్షణాలను బట్టి నీవు వారిని తెలుసుకోగలవు. మరియు వారు మాట్లాడే రీతిని బట్టి, వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. మరియు అల్లాహ్ కు మీ కర్మలు బాగా తెలుసు.
మరియు నిశ్చయంగా, మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము.[1] మరియు మేము మీ ప్రతిజ్ఞావచనాలను కూడా పరీక్షిస్తాము.
నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్ని తిరస్కరించి, ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగి వున్నవారు,[1] అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు.
కావున మీరు (ధర్మయుద్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధి కొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు.[1] మరియు అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు.
[1] చూడండి, 3:139 కానీ మీరు మీ శత్రువుల కంటే బలహీనులుగా ఉన్నారనుకుంటే సంధి చేసుకోవచ్చు. దైవప్రవక్త ('స'అస) మక్కా ముష్రికులతో హుదైబియాలో పది సంవత్సరాల సంధి చేసుకున్నారు.
నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) కు మీ ధనం అవసరం లేదు. మదీనా కాలపు మొదటి రోజులలోనే 'జకాత్ విధించబడింది. అది ఇస్లాం ధర్మాన్ని కాపాడుకోవటానికి దాని ప్రచారానికి మరియు ముస్లింల కుశలత కొరకు వారి సౌకర్యాల కొరకు. 'జకాత్ ఒక సంవత్సరం వరకు జమ ఉన్న ధనసంపత్తుల మీద, 2.5% మాత్రమే. సంవత్సరం గడిచిన పిదపనే 'జకాత్ ఇవ్వవలసి ఉంటుంది.
ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలువబడుతున్నవారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరత గల (పేద) వారు.[1] మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటి వారై ఉండరు.
[1] అల్లాహ్ (సు.తా.) మిమ్మల్ని ఖర్చు చేయమని ప్రోత్సహించేది మీ ఆత్మశుద్ధి కొరకు, మీ చుట్టు ప్రక్కలలో ఉండే పేదవారి అత్యావసరాలను పూర్తి చేయటానికి మరియు మీరు మీ శత్రువులపై ఆధిక్యత పొందటానికి.
Contents of the translations can be downloaded and re-published, with the following terms and conditions:
1. No modification, addition, or deletion of the content.
2. Clearly referring to the publisher and the source (QuranEnc.com).
3. Mentioning the version number when re-publishing the translation.
4. Keeping the transcript information inside the document.
5. Notifying the source (QuranEnc.com) of any note on the translation.
6. Updating the translation according to the latest version issued from the source (QuranEnc.com).
7. Inappropriate advertisements must not be included when displaying translations of the meanings of the Noble Quran.
Njeñtudi wiɗto ngoo:
API specs
Endpoints:
Sura translation
GET / https://quranenc.com/api/v1/translation/sura/{translation_key}/{sura_number} description: get the specified translation (by its translation_key) for the speicified sura (by its number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114)
Returns:
json object containing array of objects, each object contains the "sura", "aya", "translation" and "footnotes".
GET / https://quranenc.com/api/v1/translation/aya/{translation_key}/{sura_number}/{aya_number} description: get the specified translation (by its translation_key) for the speicified aya (by its number sura_number and aya_number)
Parameters: translation_key: (the key of the currently selected translation) sura_number: [1-114] (Sura number in the mosshaf which should be between 1 and 114) aya_number: [1-...] (Aya number in the sura)
Returns:
json object containing the "sura", "aya", "translation" and "footnotes".