Traduction des sens du Noble Coran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Lexique des traductions


Traduction des sens Verset: (29) Sourate: AL-KAHF
وَقُلِ الْحَقُّ مِنْ رَّبِّكُمْ ۫— فَمَنْ شَآءَ فَلْیُؤْمِنْ وَّمَنْ شَآءَ فَلْیَكْفُرْ ۚ— اِنَّاۤ اَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ نَارًا اَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ؕ— وَاِنْ یَّسْتَغِیْثُوْا یُغَاثُوْا بِمَآءٍ كَالْمُهْلِ یَشْوِی الْوُجُوْهَ ؕ— بِئْسَ الشَّرَابُ ؕ— وَسَآءَتْ مُرْتَفَقًا ۟
ఓ ప్రవక్తా తమ హృదయముల నిర్లక్ష్యం వలన అల్లాహ్ స్మరణ నుండి పరధ్యానంలో ఉన్న వీరందరితో ఇలా పలకండి : నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది అది సత్యము. అది నా వద్ద నుండి కాదు అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. విశ్వాసపరులని నేను గెంటి వేయాలని మీరు నాతో కోరిన దానిని నేను స్వీకరించను. అయితే మీలో నుండి ఎవరు ఈ సత్యమును విశ్వసించదలచుకుంటే దాన్ని విశ్వసించండి. అతను దాని ప్రతిఫలం ద్వారా సంతోషం కలిగించబడుతాడు. మరియు మీలో నుండి ఎవరు దాన్ని తిరస్కరించదలచుకుంటే తిరస్కరించండి. అతని కోసం నిరీక్షిస్తున్న శిక్ష ద్వారా అతను తొందరలోనే శిక్షించబడుతాడు. నిశ్చయంగా మేము అవిశ్వాసమును ఎంచుకుని తమ మనస్సులపై హింసకు పాల్పడిన వారి కొరకు పెద్ద అగ్ని జ్వాలను సిద్ధపరచాము. దాని ప్రహరీ వారిని చుట్టుముట్టి ఉంటుంది. అయితే వారు దాని నుండి పారిపోలేరు. ఒక వేళ వారు తమకు కలిగిన తీవ్ర దాహం నుండి నీటి ద్వారా ఉపశమనం పొందాలని కోరితే తీవ్ర వేడి గల మురుగు నూనె లాంటి నీటితో వారికి ఉపశమనం కలిగించటం జరుగుతుంది. దాని వేడి తీవ్రత వలన వారి ముఖములు మాడిపోతాయి. వారు ఉపశమనం కలిగించబడిన ఈ పానియం ఎంతో చెడ్డదైనది. అయితే అది వారి దాహంను తీర్చదు కాని దానిని ఇంకా అధికం చేస్తుంది. వారి చర్మములను కాలుస్తున్న అగ్ని జ్వాలను అది ఆర్పదు. వారు నివాసమున్న స్థానమైన,వారు బస చేస్తున్న స్థలమైన అగ్ని ఎంతో చెడ్డది.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• فضيلة صحبة الأخيار، ومجاهدة النفس على صحبتهم ومخالطتهم وإن كانوا فقراء؛ فإن في صحبتهم من الفوائد ما لا يُحْصَى.
మంచి వ్యక్తుల సహచర్యం,వారి సహచర్యంలో,వారితో కలిసి ఉండటంలో ప్రయత్నించటం యొక్క ఘనత ఉన్నది. ఒక వేళ వారు పేదవారైనా సరే.ఎందుకంటే వారి సహచర్యంలో లెక్కలేనన్ని లాభలు కలవు.

• كثرة الذكر مع حضور القلب سبب للبركة في الأعمار والأوقات.
మనస్సును ప్రత్యక్షం పెట్టి అధికంగా స్మరణ చేయటం వయస్సులలో,సమయములో సమృద్ధతకు (బర్కత్ కు) కారణమవుతుంది.

• قاعدتا الثواب وأساس النجاة: الإيمان مع العمل الصالح؛ لأن الله رتب عليهما الثواب في الدنيا والآخرة.
ప్రతిఫలమునకు నియమాలు,విముక్తికి సామగ్రి : సత్కార్యముతోపాటు విశ్వాసముండటం. ఎందుకంటే ఆ రెండిటి పైనే అల్లాహ్ ఇహ,పర లోకాల్లో ప్రతిఫలమును జత చేశాడు.

 
Traduction des sens Verset: (29) Sourate: AL-KAHF
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Lexique des traductions

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Fermeture