Check out the new design

Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. * - Lexique des traductions


Traduction des sens Verset: (6) Sourate: Al Ahzâb
اَلنَّبِیُّ اَوْلٰی بِالْمُؤْمِنِیْنَ مِنْ اَنْفُسِهِمْ وَاَزْوَاجُهٗۤ اُمَّهٰتُهُمْ ؕ— وَاُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰی بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ مِنَ الْمُؤْمِنِیْنَ وَالْمُهٰجِرِیْنَ اِلَّاۤ اَنْ تَفْعَلُوْۤا اِلٰۤی اَوْلِیٰٓىِٕكُمْ مَّعْرُوْفًا ؕ— كَانَ ذٰلِكَ فِی الْكِتٰبِ مَسْطُوْرًا ۟
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విశ్వాసపరులపై స్వయంగా వారి మనస్సుల కన్నా ఆయన వారిని పిలిచే విషయములలో ఎక్కువ హక్కు కలదు. ఒక వేళ వారి మనస్సులు ఇతర వాటి వైపు మొగ్గు చూపినా సరే. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు విశ్వాసపరులందరి కొరకు తల్లుల స్థానముతో సమానము. కావున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తరువాత వారిలో నుండి ఎవరితోనైనా వివాహం చేసుకోవటం ప్రతీ విశ్వాసపరునిపై నిషేధమవుతుంది. మరియు రక్తసంబంధీకులు పరస్పరం వారసత్వం విషయంలో అల్లాహ్ ఆదేశం ప్రకారం విశ్వాసపరులకన్న,అల్లాహ్ మార్గంలో ముహాజిర్ ల కన్న ఎక్కువ హక్కుదారులు. వారు (ముహాజిర్ లు, వారు) ఇస్లాం ఆరంభంలో తమ మధ్య ఉన్న వాటిలో పరస్పరం వారసులయ్యేవారు. దీని తరువాత వారి వారసత్వము రద్దు చేయబడింది. కానీ ఓ విశ్వాసపరులారా మీరు మీ స్నేహితుల యెడల వారసత్వము కాకుండా వారికి వీలునామా,వారి కొరకు ఉపకారము ద్వారా ఏదైన సద్వ్యవహారం చేయాలనుకుంటే మీకు దాని అధికారం కలదు. ఈ ఆదేశం లౌహె మహఫూజ్ లో వ్రాయబడి ఉంది కాబట్టి దానిని అమలు చేయటం తప్పనిసరి అవుతుంది.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• لا أحد أكبر من أن يُؤْمر بالمعروف ويُنْهى عن المنكر.
మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించటం కన్న గొప్ప పని ఏదీ లేదు.

• رفع المؤاخذة بالخطأ عن هذه الأمة.
అనుకోకుండా జరిగిన తప్పుకి శిక్షను ఈ ఉమ్మత్ నుండి ఎత్తివేయటం జరిగింది.

• وجوب تقديم مراد النبي صلى الله عليه وسلم على مراد الأنفس.
మన కోరికలపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కోరికను ముందుంచటం తప్పనిసరి.

• بيان علو مكانة أزواج النبي صلى الله عليه وسلم، وحرمة نكاحهنَّ من بعده؛ لأنهن أمهات للمؤمنين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణుల స్థానము గొప్పతనము యొక్క ప్రకటన మరియు ఆయన తరువాత వారితో నికాహ్ నిషేధము ఎందుకంటే వారు విశ్వాసపరుల తల్లులు.

 
Traduction des sens Verset: (6) Sourate: Al Ahzâb
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. - Lexique des traductions

Émanant du Centre d'Exégèse pour les Études Coraniques.

Fermeture