Check out the new design

Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. * - Lexique des traductions


Traduction des sens Verset: (108) Sourate: Al Mâ'idah
ذٰلِكَ اَدْنٰۤی اَنْ یَّاْتُوْا بِالشَّهَادَةِ عَلٰی وَجْهِهَاۤ اَوْ یَخَافُوْۤا اَنْ تُرَدَّ اَیْمَانٌ بَعْدَ اَیْمَانِهِمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاسْمَعُوْا ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟۠
ఈ తెలియజేయబడిన ఆదేశము వారిరువురి సాక్షం విషయంలో సందేహం కలిగినప్పుడు నమాజు తరువాత ఇద్దరి సాక్షుల ప్రమాణంను తీసుకోవటం నుండి,వారిరువురి సాక్షమును రద్దుపరచడం నుండి సాక్షులిరువురు తమ తమ సాక్షమును ధర్మబద్దంగా ప్రవేశ పెట్టటానికి ఎంతో దోహదపడుతుంది.అయితే వారిరువురు సాక్షమును తారుమారు చేయరు,అవినీతికి పాల్పడరు.మరియు తాము ప్రమాణం చేసిన తరువాత వారసులు తమ సాక్షాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేసి తమ ప్రమాణాలను రద్దు పరిస్తే తలదించుకోవలసి వస్తుందని వారిరువురు భయపడటానికి ఎంతో దోహద పడుతుంది.సాక్షం విషయంలో,ప్రమాణం చేసే విషయంలో,అబద్దమును,అవినీతిని విడనాడటం ద్వారా అల్లాహ్ కు భయపడండి.మీకు ఆదేశించబడిన వాటిని స్వీకరించే ఉద్దేశంతో మీరు వినండి.అల్లాహ్ తన విధేయత నుండి దూరం అయ్యేవారిని సన్మార్గమును పొందే సౌభాగ్యమును కలిగించడు.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• إذا ألزم العبد نفسه بطاعة الله، وأمر بالمعروف ونهى عن المنكر بحسب طاقته، فلا يضره بعد ذلك ضلال أحد، ولن يُسْأل عن غيره من الناس، وخاصة أهل الضلال منهم.
దాసుడు తన శక్తి మేరకు అల్లాహ్ పై విధేయత చూపటంను,మంచిని గురించి ఆదేశించటంను,చెడు నుండి వారించటంను తన పై తప్పనిసరి చేసుకున్నప్పుడు ఎవరి మార్గభ్రష్టత కూడా దాని తరువాత అతనిని నష్టం కలిగించలేదు.మరియు ప్రజల్లోంచి ఇతరుల గురించి,వారిలోంచి ప్రత్యేకించి మార్గభ్రష్టుల గురించి అతనిని ప్రశ్నించటం జరగదు.

• الترغيب في كتابة الوصية، مع صيانتها بإشهاد العدول عليها.
వీలునామాను వ్రాసే విషయంలో దానికి తోడుగా న్యాయపూరితంగా సాక్షాలను ఏర్పరచి దానిని కాపాడటంలో ప్రోత్సహించడం జరిగింది.

• بيان الصورة الشرعية لسؤال الشهود عن الوصية.
వీలునామా గురించి సాక్షులను అడగే చట్టబద్దమైన రూపమును ప్రకటించబడింది.

 
Traduction des sens Verset: (108) Sourate: Al Mâ'idah
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. - Lexique des traductions

Émanant du Centre d'Exégèse pour les Études Coraniques.

Fermeture