Check out the new design

Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. * - Lexique des traductions


Traduction des sens Sourate: Al Hadîd   Verset:
وَالَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖۤ اُولٰٓىِٕكَ هُمُ الصِّدِّیْقُوْنَ ۖۗ— وَالشُّهَدَآءُ عِنْدَ رَبِّهِمْ ؕ— لَهُمْ اَجْرُهُمْ وَنُوْرُهُمْ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟۠
మరియు అల్లాహ్ ను విశ్వసించేవారు మరియు ఆయన ప్రవక్తలను వారి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా విశ్వసించేవారు వారందరు సత్యసంధులు మరియు తమ ప్రభువు వద్ద అమరవీరులు, వారికి వారి కొరకు తయారు చేయబడిన వారి ఆదరణీయమైన ప్రతిఫలం కలదు. మరియు వారి కొరకు ప్రళయదినమున వారి ముందు మరియు వారి కుడి వైపున పరిగెత్తే వారి వెలుగు ఉంటుంది. మరియు అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరచి,మన ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారందరు నరకవాసులు. ప్రళయదినమున వారు అందులో ప్రవేశిస్తారు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. దాని నుండి వారు బయటకు రారు.
Les exégèses en arabe:
اِعْلَمُوْۤا اَنَّمَا الْحَیٰوةُ الدُّنْیَا لَعِبٌ وَّلَهْوٌ وَّزِیْنَةٌ وَّتَفَاخُرٌ بَیْنَكُمْ وَتَكَاثُرٌ فِی الْاَمْوَالِ وَالْاَوْلَادِ ؕ— كَمَثَلِ غَیْثٍ اَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهٗ ثُمَّ یَهِیْجُ فَتَرٰىهُ مُصْفَرًّا ثُمَّ یَكُوْنُ حُطَامًا ؕ— وَفِی الْاٰخِرَةِ عَذَابٌ شَدِیْدٌ ۙ— وَّمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرِضْوَانٌ ؕ— وَمَا الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا مَتَاعُ الْغُرُوْرِ ۟
ఇహలోక జీవితం శరీరములు ఆడుకునే ఒక ఆట అని మరియు హృదయములు వినోదం పొందే ఒక వినోదమని మరియు మీరు అలంకరించుకునే ఒక అలంకరణ అని మీరు తెలుసుకోండి. అందులో ఉన్న అధికారము మరియు ప్రయోజన సామగ్రితో మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవటం మరియు సంపదలు అధికముగా ఉండటం వలన,సంతానము ఎక్కువగా ఉండటం వలన ప్రగల్బాలు పలకటం. ఆ వర్షపు ఉపమానము మాదిరిగా ఉన్నది దాని మొక్కలు రైతులకు ఆనందం కలిగిస్తాయి. ఆ పిదప ఆ పచ్చటి మొక్కలు ఎండిపోకుండా ఉండవు. ఓ చూసే వాడా నీవు దాన్ని పచ్చగా అయిన తరువాత పసుపుగా చూస్తావు. ఆ తరువాత అల్లాహ్ దాన్ని ముక్కలు ముక్కలుగా అయిన పొట్టు వలె చేస్తాడు. మరియు పరలోకములో అవిశ్వాసపరులకు,కపటులకు కఠినమైన శిక్ష కలదు. మరియు అల్లాహ్ వద్ద నుండి విశ్వాసపరులైన తన దాసుల పాపములకు మన్నింపు మరియు ఆయన మన్నత కలదు. మరియు ఇహలోక జీవితం స్థిరత్వం లేని తరగిపోయే సామగ్రి మాత్రమే. ఎవరైతే తరిగి పోయే దాని సామగ్రికి పరలోక అనుగ్రహాలపై ప్రాధాన్యతనిస్తాడో అతడు మోసపోయి నష్టపోయేవాడు.
Les exégèses en arabe:
سَابِقُوْۤا اِلٰی مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَآءِ وَالْاَرْضِ ۙ— اُعِدَّتْ لِلَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ؕ— ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟
ఓ ప్రజలారా మీరు మీ పాపముల మన్నింపును పొందేటటువంటి సత్కర్మలైన పశ్ఛాత్తాపము మరియు సాన్నిధ్యమును కలిగించే మొదలగు వాటి వైపునకు ముందుకు సాగండి. మరియు మీరు వాటి ద్వారా భూమ్యాకాశము విశాలమంత విశాలము కల స్వర్గమును పొందటానికి. ఈ స్వర్గమును అల్లాహ్ తనపై విశ్వాసమును కవబరచి తన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన వారి కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఈ ప్రతిఫలం అల్లాహ్ యొక్క అనుగ్రహము ఆయన దాన్ని తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సుబహానహూ వతఆలా విశ్వాసపరులైన తన దాసులపై గొప్ప అనుగ్రహము కలవాడు.
Les exégèses en arabe:
مَاۤ اَصَابَ مِنْ مُّصِیْبَةٍ فِی الْاَرْضِ وَلَا فِیْۤ اَنْفُسِكُمْ اِلَّا فِیْ كِتٰبٍ مِّنْ قَبْلِ اَنْ نَّبْرَاَهَا ؕ— اِنَّ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرٌ ۟ۙ
భూమిలో ప్రజలపై కరువు కాటకాలు,ఇతర ఆపదలు గాని స్వయంగా వారి ప్రాణములపై వచ్చే ఆపద గాని మేము సృష్టిని సృష్టించక ముందే లౌహె మహఫూజ్ లో పొందు పరచబడినదే. నిశ్ఛయంగా ఇది అల్లాహ్ పై సులభము.
Les exégèses en arabe:
لِّكَیْلَا تَاْسَوْا عَلٰی مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوْا بِمَاۤ اٰتٰىكُمْ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُوْرِ ۟ۙ
మరియు ఓ ప్రజలారా ఇదంతా మీరు కోల్పోయిన దానిపై మీరు బాధపడకుండా ఉండటానికి మరియు మీకు ఆయన ప్రసాదించిన అనుగ్రహాలపై మీరు గర్వానికి లోనయ్యే సంతోషమును పొందకుండా ఉండటానికి. నిశ్ఛయంగా అల్లాహ్, అల్లాహ్ ప్రసాదించిన వాటిపై ప్రజల ముందు గర్వానికి,అహంకారమునకు లోనయ్యే ప్రతీ వ్యక్తిని ఇష్టపడడు.
Les exégèses en arabe:
١لَّذِیْنَ یَبْخَلُوْنَ وَیَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ ؕ— وَمَنْ یَّتَوَلَّ فَاِنَّ اللّٰهَ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟
ఎవరైతే తమపై ఖర్చు చేయటము అనివార్యము చేయబడిన వాటి విషయంలో పిసినారితనమును చూపుతారో మరియు ఇతరులను పిసినారి తనం చూపమని ఆదేశిస్తారో వారు నష్టపోతారు. ఎవరైతే అల్లాహ్ పై విధేయత చూపటం నుండి విముఖత చూపుతారో వారు అల్లాహ్ కు నష్టం కలిగించలేరు. వారు మాత్రం తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు. నిశ్ఛయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు. తన దాసుల విధేయత ఆయనకు అవసరం లేదు. అన్నీ స్థితుల్లో పొగడబడేవాడు.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• الزهد في الدنيا وما فيها من شهوات، والترغيب في الآخرة وما فيها من نعيم دائم يُعينان على سلوك الصراط المستقيم.
ఇహలోకము,అందుగల వాంఛల పట్ల వైరాగ్యం మరియు పరలోకం,అందుగల శాశ్వత అనుగ్రహాల పట్ల ఆసక్తి ఋజుమార్గాన్ని అవలంభించడంలో తోడ్పడుతాయి.

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి.

• من فوائد الإيمان بالقدر عدم الحزن على ما فات من حظوظ الدنيا.
ప్రాపంచిక భాగములను కోల్పోవటంపై బాధ లేక పోవటం తఖ్దీర్ పై విశ్వాసము యొక్క ప్రయోజనం.

• البخل والأمر به خصلتان ذميمتان لا يتصف بهما المؤمن.
పిసినారితనం మరియు దాని గురించి ఆదేశించటం రెండు దూషించదగిన లక్షణాలు. అవి రెండు విశ్వాసపరునిలో ఉండవు.

 
Traduction des sens Sourate: Al Hadîd
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. - Lexique des traductions

Émanant du Centre d'Exégèse pour les Études Coraniques.

Fermeture