Check out the new design

Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. * - Lexique des traductions


Traduction des sens Sourate: Al An'am   Verset:
وَقَالُوْا هٰذِهٖۤ اَنْعَامٌ وَّحَرْثٌ حِجْرٌ ۖۗ— لَّا یَطْعَمُهَاۤ اِلَّا مَنْ نَّشَآءُ بِزَعْمِهِمْ وَاَنْعَامٌ حُرِّمَتْ ظُهُوْرُهَا وَاَنْعَامٌ لَّا یَذْكُرُوْنَ اسْمَ اللّٰهِ عَلَیْهَا افْتِرَآءً عَلَیْهِ ؕ— سَیَجْزِیْهِمْ بِمَا كَانُوْا یَفْتَرُوْنَ ۟
ముష్రికులు ఇలా అన్నారు : ఈ కొన్ని పశువులు,పంటపొలాలు నిషేదించబడినవి. కాని వాటి నుంచి వారు తమ తరపు నుంచి తయారు చేసుకుని విగ్రహాల సేవకులు,ఇతరులను ఎవరిని వారు కోరుకుంటే వారు తినవచ్చు. ఈ పశువులపై స్వారీ చేయటం,వాటిపై బరువులు మోయటం నిషిద్ధం. అవి బహీరహ్,సాయిబహ్,హామీ లు. ఈ పశువులను వారు జుబాహ్ చేసే సమయంలో అల్లాహ్ నామం పటించేవారు కాదు. వాటిని కేవలం తమ విగ్రహాల నామం తీసుకుని జుబాహ్ చేసేవారు. ఇదంతా అల్లాహ్ తరుపు నుండి ఆదేశం అని ఆయనపై అబద్దమును అంటగట్టేవారు. వారు అబద్దమును కల్పించుకున్నందు వల్ల అల్లాహ్ వారికి తొందరలోనే తన శిక్షకు గురి చేస్తాడు.
Les exégèses en arabe:
وَقَالُوْا مَا فِیْ بُطُوْنِ هٰذِهِ الْاَنْعَامِ خَالِصَةٌ لِّذُكُوْرِنَا وَمُحَرَّمٌ عَلٰۤی اَزْوَاجِنَا ۚ— وَاِنْ یَّكُنْ مَّیْتَةً فَهُمْ فِیْهِ شُرَكَآءُ ؕ— سَیَجْزِیْهِمْ وَصْفَهُمْ ؕ— اِنَّهٗ حَكِیْمٌ عَلِیْمٌ ۟
మరియు వారు అన్నారు ఈ సవాయిబ్,బహాయిర్ గర్భాల్లో ఉన్న పిండాలు ఒక వేళ అది పుట్టినప్పుడు జీవించి ఉంటే అది మన మగవారి కొరకు హలాల్ (ధర్మ సమ్మతమైనవి),మన స్త్రీల కొరకు హరామ్ (నిషిద్ధం). ఒక వేళ వాటి గర్భాలలో ఉన్నది మరణించి పుడితే మగవారికి స్తీలకి అందులో భాగముంటుంది. అల్లాహ్ తొందరలోనే వారు వారి మాటలకు ఎటువంటి శిక్షకు అర్హులో దానిని ప్రసాధిస్తాడు. నిశ్చయంగా ఆయన తన శాసనంలో,తన సృష్టి నిర్వహణలో వివేకవంతుడు,వారి గురించి తెలిసినవాడు.
Les exégèses en arabe:
قَدْ خَسِرَ الَّذِیْنَ قَتَلُوْۤا اَوْلَادَهُمْ سَفَهًا بِغَیْرِ عِلْمٍ وَّحَرَّمُوْا مَا رَزَقَهُمُ اللّٰهُ افْتِرَآءً عَلَی اللّٰهِ ؕ— قَدْ ضَلُّوْا وَمَا كَانُوْا مُهْتَدِیْنَ ۟۠
తమ బుద్ది లేమి వలన,అజ్ఞానం వలన తమ సంతానమును హత్య చేసినవారు,అల్లాహ్ ప్రసాధించిన పశువులను అల్లాహ్ వైపు అబద్దమును అంటగడుతూ నిషేదించుకున్న వారు నాశనమయ్యారు. వారు సన్మార్గం నుండి దూరం అయిపోయారు,వారు సన్మార్గమును పొందలేరు.
Les exégèses en arabe:
وَهُوَ الَّذِیْۤ اَنْشَاَ جَنّٰتٍ مَّعْرُوْشٰتٍ وَّغَیْرَ مَعْرُوْشٰتٍ وَّالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا اُكُلُهٗ وَالزَّیْتُوْنَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَّغَیْرَ مُتَشَابِهٍ ؕ— كُلُوْا مِنْ ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَاٰتُوْا حَقَّهٗ یَوْمَ حَصَادِهٖ ۖؗ— وَلَا تُسْرِفُوْا ؕ— اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْرِفِیْنَ ۟ۙ
మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా కాండము లేకుండా భూ ఉపరితలంపై వ్యాపించే విధంగా,కాండమును కలిగి భూమి పైకి ఉండే విధంగా తోటలను సృష్టించాడు. మరియు ఆయనే ఖర్జూరపు చెట్లను సృష్టించినాడు. మరియు రూపములో,రుచిలో తేడాకల రకరకాల ఫలాల తోటలను సృష్టించాడు. మరియు ఆయన జైతూను (ఆలివ్),దానిమ్మ చెట్లను వాటి ఆకులు పరస్పరం పోలి ఉండినట్లు,వాటి రూపములో,రుచిలో వేరువేరుగా ఉండేటట్లు సృష్టించాడు. ఓ ప్రజలారా అవి ఫలాలు ఇచ్చినప్పుడు వాటి ఫలాలను తినండి ,వాటిని కోసే రోజు వాటి జకాతును చెల్లించండి. తినే విషయంలో,ఖర్చు చేసే విషయంలో ధర్మ హద్దులను దాటకండి. మరియు అల్లాహ్ ఆ రెండిటి విషయంలో,ఇతర వాటి విషయంలో తన హద్దులను దాటేవారిని ఇష్టపడడు. కాని వారిని ద్వేషిస్తాడు. నిశ్చయంగా ఎవరైతే వాటన్నింటిని సృష్టించాడో ఆయనే వాటిని తన దాసుల కొరకు ధర్మసమ్మతం చేశాడు.అయితే ముష్రికులు వాటిని నిషేదించుకోవటం సరికాదు.
Les exégèses en arabe:
وَمِنَ الْاَنْعَامِ حَمُوْلَةً وَّفَرْشًا ؕ— كُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ وَلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟ۙ
మరియు ఆయనే మీ కొరకు పశువుల్లోంచి ఏవైతే బరువు మోయటం,స్వారీ చేయటం కొరకు అనుకూలమైనవో ఉదాహరణకు ఒంటెలు లాంటి వాటిని,బరువు మోయటం స్వారీ చేయటం కొరకు అనుకూలం కానివి చిన్న ఒంటెలు,మేకల్లాంటి వాటిని సృష్టించాడు. ఓ ప్రజలారా మీకు అల్లాహ్ ప్రసాధించినటువంటి వాటిలోంచి ఏవైతే మీ కొరకు ధర్మ సమ్మతం చేశాడో వాటిని తినండి. మరియు అల్లాహ్ నిషేధించిన వాటిని (హరాం చేసిన) ధర్మసమ్మతం(హలాల్) చేసుకోవటంలో,అల్లాహ్ ధర్మ సమ్మతం చేసిన వాటిని నిషేదించుకోవటంలో ఏ విధంగానైతే ముష్రికులు చేశారో అలా చేసి షైతాను అడుగుజాడలో నడవకండి. ఓ ప్రజలార నిశ్చయంగా షైతాను బహిరంగ శతృవు ఏ విధంగానంటే అతడు దీని ద్వారా మీరు అల్లాహ్ కు అవిధేయత పడాలని ఆశిస్తున్నాడు.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• ذم الله المشركين بسبع صفات هي : الخسران والسفاهة وعدم العلم وتحريم ما رزقهم الله والافتراء على الله والضلال وعدم الاهتداء؛ فهذه أمور سبعة، وكل واحد منها سبب تام في حصول الذم.
ముష్రికులు కొన్ని లక్షణాలు కలిగి ఉండటం వలన అల్లాహ్ వారిని దూషించాడు. అవి : విఫలమవటం (నష్టానికి గురి అవ్వటం),మూర్ఖత్వం,అజ్ఞానము,అల్లాహ్ ప్రసాధించిన వాటిని నిషేదించుకోవటం,అల్లాహ్ పై అబద్దమును అంటగట్టటం,అపమార్గమును పొందటం,సన్మార్గమును పొందకపోవటం ఈ ఏడు విషయాల్లోంచి ప్రతీది వారిని దూషించటానికి సంపూర్ణ కారణమవుతుంది.

• الأهواء سبب تحريم ما أحل الله وتحليل ما حرم الله.
అల్లాహ్ ధర్మసమ్మతం (హలాల్) చేసిన వాటిని నిషేదించటానికి (హరాం) మరియు అల్లాహ్ నిషేదించిన వాటిని ధర్మసమ్మతం చేయటమునకు చెడు మనోవాంచనలు కారణమవుతాయి.

• وجوب الزكاة في الزروع والثمار عند حصادها، مع جواز الأكل منها قبل إخراج زكاتها، ولا يُحْسَب من الزكاة.
పంటలు,ఫలాల్లోంచి వాటిని కోసే సమయమున జకాత్ చెల్లించటం తప్పనిసరి. అలాగే వాటి జకాత్ తీయక మునుపు వాటిలోంచి తినటం ధర్మసమ్మతము.అందులో జకాత్ లెక్కవేయబడదు.

• التمتع بالطيبات مع عدم الإسراف ومجاوزة الحد في الأكل والإنفاق.
ధర్మసమ్మతమైన (హలాల్) వాటి ద్వారా తినటంలో ఖర్చు చేయటంలో వృధా చేయకుండా,హద్దు మీరకుండా ప్రయోజనం చెందవచ్చు.

 
Traduction des sens Sourate: Al An'am
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran. - Lexique des traductions

Émanant du Centre d'Exégèse pour les Études Coraniques.

Fermeture