Traduction des sens du Noble Coran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Lexique des traductions


Traduction des sens Verset: (42) Sourate: AL-ANFÂL
اِذْ اَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْیَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوٰی وَالرَّكْبُ اَسْفَلَ مِنْكُمْ ؕ— وَلَوْ تَوَاعَدْتُّمْ لَاخْتَلَفْتُمْ فِی الْمِیْعٰدِ ۙ— وَلٰكِنْ لِّیَقْضِیَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ۙ۬— لِّیَهْلِكَ مَنْ هَلَكَ عَنْ بَیِّنَةٍ وَّیَحْیٰی مَنْ حَیَّ عَنْ بَیِّنَةٍ ؕ— وَاِنَّ اللّٰهَ لَسَمِیْعٌ عَلِیْمٌ ۟ۙ
మరియు మీరు ఆ వేళను ఒకసారి గుర్తు చేసుకోండి మీరు మదీనాకి ఆవల ఉన్న లోయ దిగువ వైపున ఉన్నారు,ముష్రికులు దానికి దూరాన మక్కాకు దగ్గర ఉన్న వైపున ఉన్నారు,వర్తక బిడారం ఎర్ర సముద్ర తీరమునకు దగ్గరలో మీకన్న దిగువ ప్రదేశంలో ఉన్నది.ఒక వేళ మీరు,ముష్రికులు బదర్ లో తలబడడం గురించి పరస్పరం తీర్మానం చేసుకుని ఉంటే మీలో నుండి కొందరు కొందరిని విభేదించి ఉండేవారు.కానీ అల్లాహ్ సుబహానహు వ తఆలా తీర్మానం లేకుండానే బదర్ లో మిమ్మల్ని సమీకరించాడు ముందే నిర్ణయించబడిన ఒక పనిని పరిపూర్ణం చేయటానికి అది విశ్వాసపరుల విజయము,అవిశ్వాసపరుల పరాభవం,ఆయన ధర్మమునకు ఆధిక్యత,షిర్క్ నకు అవమానము,విశ్వాసపరుల సంఖ్యా బలం,ఆయుధా బలం తక్కువగా ఉండి కూడా వారికి వారిపై విజయము ద్వారా వారిలోంచి (ముష్రికుల్లోంచి) మరణించేవాడు అతనిపై వాదన నిరూపితమైన తరువాత మరణించటానికి,జీవించి ఉండేవాడు జీవించటానికి ఆధారం ద్వారా,వాదన ద్వారా దాన్ని అల్లాహ్ అతని కొరకు బహిర్గతం చేశాడు.అయితే అల్లాహ్ కు వ్యతిరేకంగా వాదించటానికి ఎవరికీ ఎటువంటి వాదన ఉండదు.మరియు అల్లాహ్ అందరి మాటలను వినేవాడు,వారి కర్మలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయనపై గోప్యంగా ఉండదు.వాటి పరంగానే వారికి ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
Les exégèses en arabe:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• الغنائم لله يجعلها حيث شاء بالكيفية التي يريد، فليس لأحد شأن في ذلك.
యుధ్ధప్రాప్తులు అల్లాహ్ కి చెందినవి ఆయన వాటిని ఎక్కడ తలచుకుంటే అక్కడ ఏ విధంగా కోరుకుంటే ఆ విదంగా వినియోగిస్తాడు.

• من أسباب النصر تدبير الله للمؤمنين بما يعينهم على النصر، والصبر والثبات والإكثار من ذكر الله.
విశ్వాసపరుల కొరకు వారికి సహాయమునకు,సహనమునకు,స్థిరత్వమునకు,అల్లాహ్ స్మరణ ఎక్కువగా చేయటానికి తోడ్పాటు చేసే అల్లాహ్ తఆలా పర్యాలోచన విజయ కారణాల్లోంచిది

• قضاء الله نافذ وحكمته بالغة وهي الخير لعباد الله وللأمة كلها.
అల్లాహ్ తీర్పు శాసనమగును (ప్రకటితమగును) మరియు ఆయన వివేకము ఎంతో గొప్పది.మరియు అది అల్లాహ్ దాసులకు,పూర్తి జాతికి (ఉమ్మత్ కు) మంచిది.

 
Traduction des sens Verset: (42) Sourate: AL-ANFÂL
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Lexique des traductions

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Fermeture