Check out the new design

Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad * - Lexique des traductions

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduction des sens Sourate: An Nisâ'   Verset:
لِلرِّجَالِ نَصِیْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ ۪— وَلِلنِّسَآءِ نَصِیْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ مِمَّا قَلَّ مِنْهُ اَوْ كَثُرَ ؕ— نَصِیْبًا مَّفْرُوْضًا ۟
పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది; [1] అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్) విధిగా నియమించిన భాగం.
[1] ముందు వస్తుంది. స్త్రీలకు, పురుషులకు దొరికే భాగంలో సగం ఆస్తి దొరుకుతుందని. దీనికి కారణం స్త్రీలపై ఎవ్వరినీ పెంచే బాధ్యత లేదు. ఆమె పోషణ, రక్షణ బాధ్యత, ఆమె తండ్రి, భర్త, సోదరుని లేక కుమారునిపై ఉంది. చివరకు వీరంతా ఎవ్వరూ లేనపుడు ఇస్లామీయ ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఖుర్ఆన్ చేసిన ఈ పంపకంలో స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరుగలేదు. మరొక విషయమేమిటంటే, దగ్గరి బంధువులు అంటే ప్రథమ శ్రేణికి చెందిన బంధువులు. 1. సంతానం, 2. తల్లిదండ్రులు 3. భర్త లేక భార్యలు.
Les exégèses en arabe:
وَاِذَا حَضَرَ الْقِسْمَةَ اُولُوا الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنُ فَارْزُقُوْهُمْ مِّنْهُ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا ۟
మరియు (ఆస్తి) పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి[1] మరియు వారితో వాత్యల్యంగా మాట్లాడండి.
[1] ఇక్కడ ఇతర బంధువులు అంటే వాసత్వానికి హక్కుదారులు కాని వారు. వారికి కూడా కొంత ఇవ్వాలి. ఆస్తిపరుడు తలుచుకుంటే, తన జీవితకాలంలో, తన ఆస్తిలో మూడో భాగం, వీలు ద్వారా అతని ఆస్తికి హక్కుదారులు కాని, ఇతర బంధువులకు గానీ, పేదలకు గానీ, పుణ్యకార్యాలకు గానీ ఇవ్వవచ్చు. మూడో భాగం కంటే, ఎక్కువ వీలు ద్వారా ఇచ్చే హక్కు ఆస్తిపరునికి లేదు. ఆస్తికి హక్కుదారులైన వారికి ఆస్తి ఇవ్వకూడదని వీలు వ్రాసే అధికారం కూడా అతనికి షరీయత్ లో లేదు. మూడవ భాగం ఆస్తి చాలా తక్కువ ఉంటే, ఇతరులకు ఇచ్చే అవసరం లేదు. తన ఆస్తిని పేరు కొరకు ఇతరులకు పంచి, హక్కుదారులైన తన దగ్గరి బంధువులను, పేదరికంలో ముంచటం తగినది కాదు. (ఫత్హ అల్ ఖదీర్).
Les exégèses en arabe:
وَلْیَخْشَ الَّذِیْنَ لَوْ تَرَكُوْا مِنْ خَلْفِهِمْ ذُرِّیَّةً ضِعٰفًا خَافُوْا عَلَیْهِمْ ۪— فَلْیَتَّقُوا اللّٰهَ وَلْیَقُوْلُوْا قَوْلًا سَدِیْدًا ۟
మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏ విధంగా వారిని గురించి భయపడతారో, అదే విధంగా భయపడాలి. వారు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, యుక్తమైన మాటలనే పలకాలి.
Les exégèses en arabe:
اِنَّ الَّذِیْنَ یَاْكُلُوْنَ اَمْوَالَ الْیَتٰمٰی ظُلْمًا اِنَّمَا یَاْكُلُوْنَ فِیْ بُطُوْنِهِمْ نَارًا ؕ— وَسَیَصْلَوْنَ سَعِیْرًا ۟۠
నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.
Les exégèses en arabe:
یُوْصِیْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْ ۗ— لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِ ۚ— فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَیْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۚ— وَاِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ؕ— وَلِاَبَوَیْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌ ۚ— فَاِنْ لَّمْ یَكُنْ لَّهٗ وَلَدٌ وَّوَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ ۚ— فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْ بِهَاۤ اَوْ دَیْنٍ ؕ— اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ لَا تَدْرُوْنَ اَیُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًا ؕ— فَرِیْضَةً مِّنَ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟
మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి.[1] ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు.[2] మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరోభాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడోభాగం. మృతునికి సోదరసోదరీమణులు ఉంటే, తల్లికి ఆరోభాగం. (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
[1] చిన్నవారైనా పెద్దవారైనా సంతానం అంతా వారసత్వానికి హక్కుదారులు. గర్భంలో ఉన్న సంతానం కూడా వారసత్వానికి హక్కుదారులు. అవిశ్వాసులైన సంతానం వారసత్వానికి హక్కుదారులు కారు. ఆడ మగ సంతానం ఉన్న పక్షంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి 1/6. మిగతా 2/3 సంతానం కొరకు. భార్య లేక భర్త టే వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతాది సంతానం కొరకు. [2] ఒకవేళ ఒకే ఒక్క కుమారుడు ఉంటే, మొత్తం ఆస్తికి వారసుడు అవుతాడు. ఇతర వారసులు, అంటే తల్లి, తండ్రి, భార్య లేక భర్త ఉంటే, వారి హక్కు వారికిచ్చిన తరువాత మిగతా ఆస్తికి అతడు హక్కుదారుడు. మృతునికి ఒకే కుమార్తె ఉంటే, ఆమెకు 1/2 ఆస్తి, తల్లికి 1/6, తండ్రికి 2/6.
Les exégèses en arabe:
 
Traduction des sens Sourate: An Nisâ'
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad - Lexique des traductions

Traduit par 'Abd Ar-Rahîm ibn Muhammad.

Fermeture