Check out the new design

Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad * - Lexique des traductions

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduction des sens Sourate: Al An'am   Verset:
ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— خَالِقُ كُلِّ شَیْءٍ فَاعْبُدُوْهُ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟
ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త[1], కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త[2].
[1] 'ఖాలిఖ్ (అల్-'ఖాలిఖు): The Greatest Creator, The Creator of all things. సృష్టికర్త. చూడండి, 59:24. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. అల్- 'ఖల్లాఖ్, సృష్టిక్రియలో పరిపూర్ణుడు, సముచిత రూపం శక్తిసామర్థ్యాలను ఇచ్చి తీర్చి దిద్ది అత్యుత్తమంగా సృష్టించేవాడు. చూడండి, 15:86. [2] వకీలున్ (అల్-వకీలు): కార్యకర్త, కార్యనిర్వాహకుడు, కార్యసాధకుడు, Trustee, Overseer, Guardian, సాక్షి, బాధ్యుడు, సంరక్షకుడు, ధర్మకర్త. చూడండి, 3:173.
Les exégèses en arabe:
لَا تُدْرِكُهُ الْاَبْصَارُ ؗ— وَهُوَ یُدْرِكُ الْاَبْصَارَ ۚ— وَهُوَ اللَّطِیْفُ الْخَبِیْرُ ۟
ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు[1], కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.[2]
[1] ఇహలోకపు జీవితంలో ఎవ్వరూ కూడా ఆయనను చూడలేరు. కాని పునరుత్థాన దినమున సత్పురుషుల ముఖాలు అల్లాహ్ (సు.తా.) ను చూసి కళకళలాడతుంటాయి, (75:22-23). [2] అల్-ల'తీఫు: Un-Fathomable, Subtle, Gentle. సూక్ష్మగ్రాహి, అతి సూక్ష్మ గ్రహణ శక్తి గల, సూక్ష్మ బుద్ధిగల, విస్తారమైన తెలివి యుక్తిగల వాడు, అంటే అల్లాహ్ (సు.తా.) ప్రతి చిన్న దానిని తెలుసుకోగలడు. కాని ఆయనను ఎవ్వరూ తెలుసుకోలేరు. అల్ -ఖ'బీరు: సర్వపరిచితుడు, అంతా ఎరిగినవాడు, All-Aware, చూడండి, 6:18. అల్-ల'తీఫు, అల్'ఖబీరు: ఈ రెండు పదాలు ఖుర్ఆన్ లో చాలా మట్టుకు కలసి వచ్చాయి. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, 22:63, 31:16, 33:34 67:14.
Les exégèses en arabe:
قَدْ جَآءَكُمْ بَصَآىِٕرُ مِنْ رَّبِّكُمْ ۚ— فَمَنْ اَبْصَرَ فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ عَمِیَ فَعَلَیْهَا ؕ— وَمَاۤ اَنَا عَلَیْكُمْ بِحَفِیْظٍ ۟
వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు[1]. మరియు నేను మీ రక్షకుడను కాను."(అని అను).
[1] చూడండి, 17:15.
Les exégèses en arabe:
وَكَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ وَلِیَقُوْلُوْا دَرَسْتَ وَلِنُبَیِّنَهٗ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
మరియు వారు (అవిశ్వాసులు): "నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు." అని అనాలనీ మరియు తెలివి గలవారికి (సత్యాన్ని) స్పష్టపరచుటకూను, మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము.[1]
[1] చూడండి, 25:4-5. ఇంకా చూడండి ఈ ఆయత్ యొక్క తాత్పర్యం కొరకు, నోబుల్ ఖుర్ఆన్ మరియు ము'హమ్మద్ జూనాగఢీ, (మదీనా మునవ్వరహ్ ప్రచురణలు).
Les exégèses en arabe:
اِتَّبِعْ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنْ رَّبِّكَ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِیْنَ ۟
నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) అనుసరించు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ సాటి (భాగస్వాములను) కల్పించే వారి నుండి విముఖుడవగు.
Les exégèses en arabe:
وَلَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكُوْا ؕ— وَمَا جَعَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ۚ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟
మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు[1]. మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు (కార్యకర్తవు) కావు[2].
[1] చూడండి, 2:253 మరియు 6:35. [2] అంటే నీకు వారిపై ఎట్టి అధికారం లేదు. ఒకవేళ దైవప్రవక్త ('స'అస) కు అల్లాహ్ (సు.తా.) ఇతరులపై అధికారం ఇచ్చి ఉంటే, అతను తన పినతండ్రి అబూ - 'తాలిబ్ ను బలవంతంగా ముస్లిం చేసి ఉండేవారు. ఎందుకంటే దైవప్రవక్త ('స'అస) తండ్రి వంటి తన పోషకుణ్ణి తెలిసి ఉండి కూడా నరకాగ్నిలోకి ఎలా పోనివ్వగలరు.
Les exégèses en arabe:
وَلَا تَسُبُّوا الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَیَسُبُّوا اللّٰهَ عَدْوًا بِغَیْرِ عِلْمٍ ؕ— كَذٰلِكَ زَیَّنَّا لِكُلِّ اُمَّةٍ عَمَلَهُمْ ۪— ثُمَّ اِلٰی رَبِّهِمْ مَّرْجِعُهُمْ فَیُنَبِّئُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
మరియు - అల్లాహ్ ను వదలి వారు ప్రార్థిస్తున్న ఇతరులను (వారి దైవాలను) - మీరు దూషించకండి. ఎందుకంటే, వారు ద్వేషంతో, అజ్ఞానంతో అల్లాహ్ ను దూషించ వచ్చు! ఈ విధంగా మేము ప్రతి జాతికి, వారి కర్మలు (ఆచారాలు) వారికి ఆకర్షణీయంగా కనబడేటట్లు చేశాము. తరువాత వారి ప్రభువు వైపునకు వారి మరలింపు ఉంటుంది; అప్పుడు వారికి వారి చేష్టలు తెలుపబడతాయి.
Les exégèses en arabe:
وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَىِٕنْ جَآءَتْهُمْ اٰیَةٌ لَّیُؤْمِنُنَّ بِهَا ؕ— قُلْ اِنَّمَا الْاٰیٰتُ عِنْدَ اللّٰهِ وَمَا یُشْعِرُكُمْ ۙ— اَنَّهَاۤ اِذَا جَآءَتْ لَا یُؤْمِنُوْنَ ۟
మరియు వారు: "ఒకవేళ మా వద్దకు అద్భుత సూచన (మహిమ) వస్తే, మేము తప్పక విశ్వసిస్తాము." అని అల్లాహ్ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: "నిశ్చయంగా, అద్భుత సూచనలు (మహిమలు) అల్లాహ్ వశంలోనే ఉన్నాయి[1]. ఒకవేళ అవి (అద్భుత సూచనలు) వచ్చినా, వారు విశ్వసించరని (ఓ ముస్లిములారా!) మీకు ఏ విధంగా గ్రహింపజేయాలి?"
[1] చూడండి, 17:59.
Les exégèses en arabe:
وَنُقَلِّبُ اَفْـِٕدَتَهُمْ وَاَبْصَارَهُمْ كَمَا لَمْ یُؤْمِنُوْا بِهٖۤ اَوَّلَ مَرَّةٍ وَّنَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟۠
మరియు వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో, అదే విధంగా వారి హృదయాలను మరియు వారి కన్నులను మేము త్రిప్పి వేస్తాము మరియు మేము వారిని వారి తలబిరుసుతనంలో అధులై తిరగటానికి వదలిపెడతాము.
Les exégèses en arabe:
 
Traduction des sens Sourate: Al An'am
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad - Lexique des traductions

Traduit par 'Abd Ar-Rahîm ibn Muhammad.

Fermeture