क़ुरआन के अर्थों का अनुवाद - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - अनुवादों की सूची


अर्थों का अनुवाद सूरा: सूरा अल्-आराफ़   आयत:

సూరహ్ అల్-అరాఫ్

सूरा के उद्देश्य:
انتصار الحق في صراعه مع الباطل، وبيان عاقبة المستكبرين في الدنيا والآخرة.
అసత్యముతో సత్యము పోరాటంలో సత్యమునకు సహాయం చేయటం మరియు ఇహపరాలలో అహంకారుల పర్యవసానాల ప్రకటన.

الٓمّٓصٓ ۟ۚ
అలిఫ్-లామ్-మీమ్-సాద్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
अरबी तफ़सीरें:
كِتٰبٌ اُنْزِلَ اِلَیْكَ فَلَا یَكُنْ فِیْ صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنْذِرَ بِهٖ وَذِكْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ మీపై అవతరింప జేసిన గ్రంధం ఖుర్ఆన్. దాని గురించి మీ హృదయంలో ఎటువంటి చికాకు గాని,సంకోచముగాని ఉండకూడదు. దాని ద్వారా మీరు ప్రజలకు భయపెట్టటానికి,వాదించటానికి,దాని ద్వారా మీరు విశ్వాసపరులకి హితోపదేశం చేయటానికి ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. వారే (విశ్వాసపరులు) హితోపదేశం ద్వారా లబ్ది పొందుతారు.
अरबी तफ़सीरें:
اِتَّبِعُوْا مَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ؕ— قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ ۟
ఓ ప్రజలారా అల్లాహ్ తఆలా మీ పై ఏ గ్రంధాన్నైతే అవతరింప జేశాడో దాన్ని మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క సంప్రదాయాన్ని అనుసరించండి. మరియు ఎవరినైతే మీరు షైతాన్ యోక్క స్నేహితులుగా భావిస్తున్నారో వారి మరియు చెడ్డ(దారి పై నడిచే)పండితుల కోరికలను మీరు అనుసరించకండి. వారిని మీరు అనుసరిస్తూ వారి కోరికల కొరకు మీపై అవతరించిన దాన్ని వదిలేస్తున్నారు. వాస్తవంగా మీరు హితబోధను చాలా తక్కువగా స్వీకరిస్తున్నారు. ఒక వేళ మీరు హితబోధను స్వీకరించేవారై ఉంటే అల్లాహ్ యోక్క హక్కు పై ఇతరవాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. మరియు మీ ప్రవక్త ను అనుసరించేవారు. మరియు ఆయన సంప్రదాయాల పై ఆచరించేవారు. మరియు దాన్ని మినహాయించి ఇతర వాటిని వదిలేసేవారు.
अरबी तफ़सीरें:
وَكَمْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا فَجَآءَهَا بَاْسُنَا بَیَاتًا اَوْ هُمْ قَآىِٕلُوْنَ ۟
మేము ఎన్నో బస్తీలను వారు తమ అవిశ్వాసము,అపమార్గము పై మొండి వైఖరిని ప్రదర్శించినప్పుడు మా శిక్ష ద్వారా నాశనం చేశాము. రాత్రి లేదా పగలు వారు పరధ్యానంలో ఉన్నప్పుడు మా కఠినమైన శిక్ష వారిపై వచ్చి పడింది. తమపై వచ్చిన శిక్షను తమ నుండి తొలగించుకోలేకపోయారు. వారు ఆరోపించుకున్న వారి దేవుళ్ళు కూడా దానిని వారి నుండి తొలగించలేకపోయారు.
अरबी तफ़सीरें:
فَمَا كَانَ دَعْوٰىهُمْ اِذْ جَآءَهُمْ بَاْسُنَاۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اِنَّا كُنَّا ظٰلِمِیْنَ ۟
అల్లాహ్ శిక్ష వచ్చిన తరువాత వారు అల్లాహ్ తో అవిశ్వాసానికి ఒడిగట్టి దుర్మార్గమునకు పాల్పడ్డారని స్వయంగా అంగీకరించటం తప్ప ఇంకేమి ఉండదు.
अरबी तफ़सीरें:
فَلَنَسْـَٔلَنَّ الَّذِیْنَ اُرْسِلَ اِلَیْهِمْ وَلَنَسْـَٔلَنَّ الْمُرْسَلِیْنَ ۟ۙ
మేము ప్రవక్తలను పంపించిన జాతుల వారిని వారు ప్రవక్తలకు సమాధానమిచ్చిన వైనము గురించి ప్రళయదినాన తప్పకుండా ప్రశ్నిస్తాము. అలాగే ప్రవక్తలను కూడా వారికి ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడ్డారో వాటిని చేరవేయటం గురించి,అలాగే వారికి వారి జాతులవారు ఏ సమాధానమిచ్చారో వాటి గురించి మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
अरबी तफ़सीरें:
فَلَنَقُصَّنَّ عَلَیْهِمْ بِعِلْمٍ وَّمَا كُنَّا غَآىِٕبِیْنَ ۟
మానవులు తాము ఇహలోకంలో చేసుకున్న కర్మల గురించి మేము మా జ్ఞానంతో పూసగుచ్చినట్లు వారికి విప్పి జెబుతాము. వారి కర్మల గురించి మాకు తెలుసు. మాకు వాటిలోంచి ఏది గోప్యంగా లేదు. ఏ సమయంలో కూడా మేము వారి నుండి కనుమరగై లేము.
अरबी तफ़सीरें:
وَالْوَزْنُ یَوْمَىِٕذِ ١لْحَقُّ ۚ— فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
ప్రళయదినాన కర్మల తూకము ఎటువంటి అన్యాయం,దుర్మార్గము లేకుండా న్యాయపూరితంగా ఉంటుంది. తూనిక సమయంలో ఎవరి సత్కర్మల పళ్ళెం పాపాల పళ్ళెం కన్న బరువుగా ఉంటుందో వారందరు తమ ఉద్దేశంలో సఫలీకృతమయ్యారు. మరియు భయం నుండి బయటపడ్డారు.
अरबी तफ़सीरें:
وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَظْلِمُوْنَ ۟
మరియు తూనిక సమయంలో ఎవరి పాపాల పళ్ళెం సత్కర్మల పళ్ళెం కన్న బరువుగా ఉంటుందో వారందరు అల్లాహ్ యొక్క ఆయతులను (సూచనలను) తిరస్కరించటం వలన ప్రళయదినాన వినాశనము యొక్క వనరులను తమ స్వయనిర్ణయం ద్వారా తమకు తామే నష్టాన్ని మూట గట్టుకున్నవారవుతారు.
अरबी तफ़सीरें:
وَلَقَدْ مَكَّنّٰكُمْ فِی الْاَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ ؕ— قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۟۠
ఓ ఆదం సంతతి వారా నిశ్చయంగా మేము మిమ్మల్ని భూమిపై నివసింపజేశాము. మరియు మేము మీ కొరకు అందులో జీవన సామగ్రిని ఏర్పాటు చేశాము. కావున మీరు అందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కాని మీ కృతజ్ఞతలు చాలా తక్కువ.
अरबी तफ़सीरें:
وَلَقَدْ خَلَقْنٰكُمْ ثُمَّ صَوَّرْنٰكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ ۖۗ— فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— لَمْ یَكُنْ مِّنَ السّٰجِدِیْنَ ۟
ఓ ప్రజలారా మీ తండ్రి అయిన ఆదం ను మేము సృష్టించినాము. ఆ పిదప ఆయనకు అందమైన రూపమును ప్రసాధించినాము.ఉత్తమమైన రీతిలో తీర్చి దిద్దాము. ఆ పిదప మేము దైవదూతలను ఆయనకు గౌరవంగా సాష్టాంగపడమని ఆదేశించినాము.అయితే వారు ఆదేశాన్ని పాటించి సాష్టాంగ పడ్డారు. కాని ఇబ్లీస్ గర్వం వలన ,వ్యతిరేకత వలన సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• من مقاصد إنزال القرآن الإنذار للكافرين والمعاندين، والتذكير للمؤمنين.
సత్యతిరస్కారులను,వ్యతిరేకులను హెచ్చరించటం,విశ్వాసపరులను హితోపదేశం చేయటం ఖుర్ఆన్ అవతరణ లక్ష్యం.

• أنزل الله القرآن إلى المؤمنين ليتبعوه ويعملوا به، فإن فعلوا ذلك كملت تربيتهم، وتمت عليهم النعمة، وهُدُوا لأحسن الأعمال والأخلاق.
అల్లాహ్ ఖుర్ఆన్ ను విశ్వాసపరుల వైపునకు దానిని అనుసరించటానికి,ఆచరించటానికి అవతరింపజేశాడు. ఒక వేళ వారు అలా చేస్తే వారి క్రమ శిక్షణ,పోషణ పరిపూర్ణమయ్యింది. వారిపై అనుగ్రహం పూర్తయ్యింది. సత్కర్మల కొరకు,సుగుణాల కొరకు వారికి మార్గం చూపించబడింది.

• الوزن يوم القيامة لأعمال العباد يكون بالعدل والقسط الذي لا جَوْر فيه ولا ظلم بوجه.
ప్రళయదినాన దాసుల కర్మల తూకము న్యాయపూరితంగా,సమానంగా ఉంటుంది. అందులో ఏ విధంగాను దుర్మార్గము కాని అన్యాయము కాని ఉండదు.

• هَيَّأ الله الأرض لانتفاع البشر بها، بحيث يتمكَّنون من البناء عليها وحَرْثها، واستخراج ما في باطنها للانتفاع به.
అల్లాహ్ భూమిని మానవుడు దాని ద్వారా లబ్ది పొందటం కొరకు సిద్ధం చేశాడు. ఏ విధంగా నంటే వారు దానిపై కట్టడములు నిర్మించగలుగుతున్నారు,దానిని దున్నగలుగుతున్నారు,దాని లోపల ఉన్న వస్తువులను వెలికి తీసి దాని ద్వారా లబ్ది పొందుతున్నారు.

قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسْجُدَ اِذْ اَمَرْتُكَ ؕ— قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ۚ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟
అల్లాహ్ ఇబ్లీసును మందలిస్తూ ఇలా అన్నాడు : నా ఆదేశమును పాటిస్తూ ఆదం కు సాష్టాంగ పడటం నుండి నిన్ను ఏది వారించింది. ఇబ్లీసు తన ప్రభువు కు సమాధానమిస్తూ ఇలా అన్నాడు : నేను అతని కంటే గొప్ప వాడిని అవ్వటం నన్ను ఆపింది. నీవు నన్ను అగ్గితో సృష్టించావు,అతనిని నీవు మట్టితో సృష్టించినావు. అగ్ని మట్టి కన్న గొప్పది.
अरबी तफ़सीरें:
قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا یَكُوْنُ لَكَ اَنْ تَتَكَبَّرَ فِیْهَا فَاخْرُجْ اِنَّكَ مِنَ الصّٰغِرِیْنَ ۟
అల్లాహ్ అతనితో ఇలా అన్నాడు : నీవు స్వర్గం నుండి దిగిపో. అందులో నీవు గర్వాన్ని చూపటం నీకు తగదు. ఎందుకంటే అది పరిశుద్ధులు,స్వచ్చందుల నివాసము. నీవు అక్కడ ఉండటం సరికాదు. ఓ ఇబ్లీసు ఒక వేళ నీవు నిన్ను ఆదము కన్న గొప్ప వాడిగా భావిస్తే నిశ్చయంగా నీవు నీచుల్లోంచి,దిగజారిన వారిలోంచి వాడివి.
अरबी तफ़सीरें:
قَالَ اَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
ఇబ్లీసు ఇలా వేడుకున్నాడు : ఓ నా ప్రభువా పునరుత్థాన దినం వరకు ప్రజల్లోంచి నేను ఎవరిని భ్రష్టుడిని చేయగలనో అతడిని భ్రష్టుడు చేయటానికి నాకు గడువును ప్రసాదించు.
अरबी तफ़सीरें:
قَالَ اِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟
అల్లాహ్ అతనితో ఇలా అన్నాడు : ఓ ఇబ్లీసు నిశ్చయంగా మొదటి బాకా ఊదబడే రోజు నేను మరణమును రాసిపెట్టిన,గడువు ఇవ్వబడిన వారిలోంచి నీవు ఉంటావు. అప్పుడు ప్రాణులన్నీ చనిపోతాయి. వారి సృష్టికర్త ఒక్కడే మిగులుతాడు.
अरबी तफ़सीरें:
قَالَ فَبِمَاۤ اَغْوَیْتَنِیْ لَاَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِیْمَ ۟ۙ
ఇబ్లీసు ఇలా పలికాడు : నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా చివరికి ఆదం కు సాష్టాంగ పడమన్న నీ ఆదేశమును పాటించటంను నేను వదిలి వేశాను. నేను ఆదం సంతతి కొరకు నీ సన్మార్గం పై మాటు వేసి కూర్చుంటాను. నేను ఏ విధంగా నైతే వారి తండ్రి ఆదంనకు సాష్టాంగ పడటం నుండి భ్రష్టుడినయ్యానో అలా వారిని దాని నుండి మరలించుతాను,వారిని దాని నుండి భ్రష్టుల్ని చేస్తాను.
अरबी तफ़सीरें:
ثُمَّ لَاٰتِیَنَّهُمْ مِّنْ بَیْنِ اَیْدِیْهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ اَیْمَانِهِمْ وَعَنْ شَمَآىِٕلِهِمْ ؕ— وَلَا تَجِدُ اَكْثَرَهُمْ شٰكِرِیْنَ ۟
ఆ తరువాత సందేహాల్లో పడవేసి విస్మరణ ద్వారా,కోరికలను అందంగా అలంకరించటం ద్వారా నేను వారి వద్దకు అన్ని దిశల నుండి వస్తాను. వారికి అవిశ్వాసమును నిర్దేశించటం వలన ఓ నా ప్రభూ వారిలో చాలా మందిని కృతజ్ఞులుగా నీవు పొందవు.
अरबी तफ़सीरें:
قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُوْمًا مَّدْحُوْرًا ؕ— لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنْكُمْ اَجْمَعِیْنَ ۟
అల్లాహ్ అతనితో ఇలా ఆదేశించాడు : ఓ ఇబ్లీసు నీవు అల్లాహ్ కారుణ్యం నుండి తుచ్ఛుడవై,బహిష్కరించబడిన వాడై స్వర్గం నుండి వెళ్లిపో. నేను తప్పకుండా ప్రళయ దినాన నరకమును నీతో మరియు నిన్ను అనుసరించి నీపై విధేయత చూపి తన ప్రభువు ఆదేశంను దిక్కరించిన ప్రతీ ఒక్కరితో నరకమును నింపి వేస్తాను.
अरबी तफ़सीरें:
وَیٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَیْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ ۟
మరియు అల్లాహ్ ఆదం తో ఇలా ఆదేశించాడు : ఓ ఆదం నువ్వు నీ భార్య హవ్వా స్వర్గంలో ఉండండి. మీరిద్దరు అందులో ఉన్న పరిశుధ్ధమైన వాటిలోంచి మీరు కోరిన వాటిని తినండి. మరియు మీరిద్దరు ఈ వృక్షము ఫలాల్లోంచి తినకండి (అల్లాహ్ ఒక వృక్షమును వారిద్దరికి నిర్దేశించాడు). ఒక వేళ మీరిద్దరు నా వారింపు తరువాత దాని నుండి తింటే నిశ్చయంగా మీరిద్దరు అల్లాహ్ హద్దులను దాటిన వారవుతారు.
अरबी तफ़सीरें:
فَوَسْوَسَ لَهُمَا الشَّیْطٰنُ لِیُبْدِیَ لَهُمَا مَا وٗرِیَ عَنْهُمَا مِنْ سَوْاٰتِهِمَا وَقَالَ مَا نَهٰىكُمَا رَبُّكُمَا عَنْ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنْ تَكُوْنَا مَلَكَیْنِ اَوْ تَكُوْنَا مِنَ الْخٰلِدِیْنَ ۟
అయితే ఇబ్లీసు వారిద్దరి మర్మావయవాలు ఏవైతే కప్పి ఉన్నవో వాటిని భహిర్గతం చేయటం కొరకు వారిద్దరి మనస్సులో నెమ్మదిగా ఒక మాట వేశాడు. వారితో ఇలా అన్నాడు : మీరిద్దరు దైవ దూతలుగా అయిపోవటం ఇష్టం లేక,మీరిద్దరు స్వర్గంలో శాస్వతంగా ఉండి పోవటం ఇష్టం లేక అల్లాహ్ మీరిద్దరిని ఆ వృక్షం నుండి తినటం గురించి వారించాడు.
अरबी तफ़सीरें:
وَقَاسَمَهُمَاۤ اِنِّیْ لَكُمَا لَمِنَ النّٰصِحِیْنَ ۟ۙ
(షైతాను) వారిద్దరి ముందు అల్లాహ్ పై (ఇలా) ప్రమాణం చేశాడు : ఓ ఆదం,హవ్వా నిశ్ఛయంగా నేను మీరిద్దరికి సలహా ఇవ్వటంలో శ్రేయోభిలాషిని.
अरबी तफ़सीरें:
فَدَلّٰىهُمَا بِغُرُوْرٍ ۚ— فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْاٰتُهُمَا وَطَفِقَا یَخْصِفٰنِ عَلَیْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؕ— وَنَادٰىهُمَا رَبُّهُمَاۤ اَلَمْ اَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّكُمَاۤ اِنَّ الشَّیْطٰنَ لَكُمَا عَدُوٌّ مُّبِیْنٌ ۟
అయితే అతడు (షైతాను) వారిద్దరిని వారు ఉన్న స్థానం నుండి మోసగించి దించి వేశాడు. ఎప్పుడైతే వారిద్దరు తాము వారించబడిన వృక్షము నుండి తిన్నారో వారిద్దరి మర్మావయవాలు ఒండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి. వారిద్దరు తమ మర్మావయవాలను కప్పుకోవటం కొరకు స్వర్గం యొక్క ఆకులను తమ పై కప్పుకో సాగారు. వారి ప్రభువు వారిద్దరిని పిలుస్తూ ఇలా అన్నాడు : నేను మిమ్మల్ని ఈ వృక్షమునుండి తినటం గురించి వారించలేదా?. నిశ్చయంగా షైతాను మీ శతృవని,అతని శతృత్వం బహిర్గతం అవుతుందని,అతని నుండి జాగ్రత్తగా ఉండమని మీకు నేను చెప్పలేదా?.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• دلّت الآيات على أن من عصى مولاه فهو ذليل.
దైవానికి అవిధేయత చూపేవాడు అవమానానికి గురి అవుతాడని ఆయతులు తెలుపుతున్నవి.

• أعلن الشيطان عداوته لبني آدم، وتوعد أن يصدهم عن الصراط المستقيم بكل أنواع الوسائل والأساليب.
ఆదమ్ సంతతి కొరకు షైతాను తన శతృత్వమును ప్రకటించాడు. మరియు వారిని అన్ని రకాల పద్దతుల ద్వార,కారకాల ద్వారా సన్మార్గం నుండి ఆపుతాడని బెదిరించాడు.

• خطورة المعصية وأنها سبب لعقوبات الله الدنيوية والأخروية.
అవిధేయత ఆధిక్యత అల్లాహ్ యొక్క ఇహ,పరలోక శిక్షలకు కారణమవుతుంది.

قَالَا رَبَّنَا ظَلَمْنَاۤ اَنْفُسَنَا ٚ— وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
ఆదం,హవ్వా ఇలా వేడుకున్నారు : ఓ మా ప్రభూ నీవు మమ్మల్ని ఈ వృక్షము నుండి తినటం గురించి వారించిన దాన్ని పాల్పడి మాపై హింసకు పాల్పడ్డాము (అన్యాయం చేసుకున్నాము). ఒక వేళ నీవు మా పాపములను మన్నించకపోతే,నీ కారుణ్యముతో మాపై దయ చూపకపోతే తప్పకుండా మేము ఇహ,పరాల్లో మా యొక్క వాటాను కోల్పోయి నష్టాన్ని చవిచూసే వారిలోంచి అయిపోతాము.
अरबी तफ़सीरें:
قَالَ اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— وَلَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
అల్లాహ్ ఆదం,హవ్వా,ఇబ్లీసుతో ఇలా పలికాడు : మీరందరు స్వర్గము నుండి భూమి పై దిగిపోండి. తొందరలోనే మీరు ఒండొకరికి శతృవులైపోతారు. భూమిలో మీ కొరకు ఒక నిర్ణీత సమయం వరకు నివాసముండును. మీరు అందులో నిర్ణీత సమయం వరకు ప్రయోజనం పొందండి.
अरबी तफ़सीरें:
قَالَ فِیْهَا تَحْیَوْنَ وَفِیْهَا تَمُوْتُوْنَ وَمِنْهَا تُخْرَجُوْنَ ۟۠
అల్లాహ్ ఆదం,హవ్వా,వారి సంతతిని ఉద్దేశించి ఇలా పలికాడు : అల్లాహ్ మీ కొరకు నిర్ధారించిన వయస్సు వరకు మీరు భువిలో జీవిస్తారు. మరియు అందులోనే మరణిస్తారు,సమాది చేయబడుతారు. మరణాంతర జీవితం కొరకు మీ సమాదుల నుండి తీయబడుతారు.
अरबी तफ़सीरें:
یٰبَنِیْۤ اٰدَمَ قَدْ اَنْزَلْنَا عَلَیْكُمْ لِبَاسًا یُّوَارِیْ سَوْاٰتِكُمْ وَرِیْشًا ؕ— وَلِبَاسُ التَّقْوٰی ۙ— ذٰلِكَ خَیْرٌ ؕ— ذٰلِكَ مِنْ اٰیٰتِ اللّٰهِ لَعَلَّهُمْ یَذَّكَّرُوْنَ ۟
ఓ ఆదం సంతతివారా మీరు మీ మర్మావయవాలను కప్పుకోవటం కొరకు అవసరమగు వస్త్రాలను మీ కొరకు మేము తయారు చేశాము. మరియు మేము మీ కొరకు పరిపూర్ణ వస్త్రాలను తయారు చేశాము. మీరు వాటి ద్వారా ప్రజల్లో అందంగా తయారవుతారు. మరియు దైవభీతితో కూడుకున్న దుస్తులు అవి అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటం ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం. అవి ఎంతో మేలైనవి ఈ ఇంద్రియ దుస్తులు కన్న. ఈ ప్రస్తావించబడిన దుస్తులు అల్లాహ్ శక్తి సామర్ధ్యాల పై సూచించే సూచనల్లోంచివి. తద్వారా మీ పై ఉన్న ఆయన అనుగ్రహాలను మీరు గుర్తు చేసుకుని వాటి గురించి కృతజ్ఞతలు తెలుపుకుంటారని.
अरबी तफ़सीरें:
یٰبَنِیْۤ اٰدَمَ لَا یَفْتِنَنَّكُمُ الشَّیْطٰنُ كَمَاۤ اَخْرَجَ اَبَوَیْكُمْ مِّنَ الْجَنَّةِ یَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِیُرِیَهُمَا سَوْاٰتِهِمَا ؕ— اِنَّهٗ یَرٰىكُمْ هُوَ وَقَبِیْلُهٗ مِنْ حَیْثُ لَا تَرَوْنَهُمْ ؕ— اِنَّا جَعَلْنَا الشَّیٰطِیْنَ اَوْلِیَآءَ لِلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ ۟
ఓ ఆదం సంతతి వారా మర్మావయవాలను కప్పటం కొరకు ఉన్న ఇంద్రియ దుస్తులను లేదా దైవ భీతితో కూడుకున్న దుస్తులను వదిలివేయటం ద్వారా పాపాన్ని అలంకరించి షైతాను మిమ్మల్ని ప్రలోభ పెట్టకూడదు సుమా. వాస్తవానికి అతడు వృక్షము నుండి తినటంను మంచిగా చేసి చూపించి మీ తల్లిదండ్రులను (ఆదం,హవ్వాను) మోసం చేశాడు. చివరికి అది వారిరువురిని స్వర్గం నుంచి తొలగించటం కొరకు దారి తీసింది. మరియు వారిద్దరి మర్మావయవాలు బహిర్గతమై పోయినవి. నిశ్చయంగా షైతాను,అతని సంతానము మిమ్మల్ని చూస్తూ ఉంటారు,మిమ్మల్ని గమనిస్తుంటారు. మరియు మీరు వారిని చూడలేరు,గమనించలేరు. మీరు అతనితో,అతని సంతానముతో జాగ్రత్తగా ఉండాలి. నిశ్చయంగా మేము షైతానులను అల్లాహ్ ను విశ్వసించని వారి కొరకు స్నేహితులుగా చేశాము. సత్కార్యాలు చేసే విశ్వాసపరుల వైపు వారికి ఎటువంటి మార్గం ఉండదు.
अरबी तफ़सीरें:
وَاِذَا فَعَلُوْا فَاحِشَةً قَالُوْا وَجَدْنَا عَلَیْهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا ؕ— قُلْ اِنَّ اللّٰهَ لَا یَاْمُرُ بِالْفَحْشَآءِ ؕ— اَتَقُوْلُوْنَ عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
ముష్రికులు షిర్కు,బైతుల్లాహ్ యొక్క నగ్న ప్రదక్షణ,వేరే ఇతర వాటి లాంటి ఏవైన అత్యంత చెడు కార్యానికి పాల్పడినప్పుడు వారు తమ తాతముత్తాతలను వాటిని పాల్పడుతుండగా పొందారని,అల్లాహ్ వారికి దానిని చేయమని ఆదేశించాడని సాకులు చెబుతారు. ఓ ముహమ్మద్ వారిని ఖండిస్తూ ఇలా పలకండి : నిశ్చయంగా అల్లాహ్ పాపాలకు పాల్పడమని ఆదేశించడు. కాని వాటి నుండి వారిస్తాడు. అయితే దానిని మీరు ఆయనపై ఎందుకు అంటగడుతున్నారు?. ఓ ముష్రికులారా ఏమి మీరు మీకు తెలియని అబద్దపు మాటలను,కల్పితాలను అల్లాహ్ పై పలుకుతున్నారా?.
अरबी तफ़सीरें:
قُلْ اَمَرَ رَبِّیْ بِالْقِسْطِ ۫— وَاَقِیْمُوْا وُجُوْهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ۬— كَمَا بَدَاَكُمْ تَعُوْدُوْنَ ۟ؕ
ఓ ముహమ్మద్ ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : నిశ్చయంగా అల్లాహ్ న్యాయం గురించి ఆదేశించాడు. మరియు ఆయన అశ్లీలత,చెడు గురించి ఆదేశించలేదు. సాధారణంగా ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించమని,ప్రత్యేకించి మస్జిదులలో చేయమని,విధేయత ఆయన ఒక్కడి కొరకే ప్రత్యేకించుకుని మీరు ఆరాధించాలని మిమ్మల్ని ఆదేశించాడు. మిమ్మల్ని ఆయన మొదటిసారి సృష్టించినట్లు రెండోవసారి మరల జీవింప చేసి మిమ్మల్ని మరలుస్తాడు. మిమ్మల్ని మొదటిసారి సృష్టించే సామర్ధ్యం కలవాడు మిమ్మల్ని మరలించటం,మరణాంతరం లేపటం పై సామర్ధ్యం కలవాడు.
अरबी तफ़सीरें:
فَرِیْقًا هَدٰی وَفَرِیْقًا حَقَّ عَلَیْهِمُ الضَّلٰلَةُ ؕ— اِنَّهُمُ اتَّخَذُوا الشَّیٰطِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ اللّٰهِ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ ۟
మరియు అల్లాహ్ ప్రజలను రెండు వర్గాలుగా చేశాడు మీలో నుంచి ఒక వర్గంకు ఆయన సన్మార్గం చూపాడు. దాని కొరకు సన్మార్గమునకు కారకాలను సులభతరం చేశాడు. దాని నుండి వాటికి సంభందించిన ఆటంకాలను తొలగించాడు. మరోక వర్గం పై సత్య మార్గం నుండి భ్రష్టులవ్వటం రూఢీ అయింది. ఇలా ఎందుకంటే వారు అల్లాహ్ ను వదిలి షైతానులను స్నేహితులుగా చేసుకున్నారు. అజ్ఞానం వలన వారిని అనుసరించసాగారు. వారు సన్మార్గం పొందారని భ్రమలో పడి ఉన్నారు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• من أَشْبَهَ آدم بالاعتراف وسؤال المغفرة والندم والإقلاع - إذا صدرت منه الذنوب - اجتباه ربه وهداه. ومن أَشْبَهَ إبليس - إذا صدر منه الذنب بالإصرار والعناد - فإنه لا يزداد من الله إلا بُعْدًا.
ఎవరైతే ఆదంలా తన ద్వారా పాపం జరిగినప్పుడు దానిని అంగీకరించి ,మన్నింపు వేడుకుని,కృంగిపోయి,దానిని తన నుండి తొలగించి వేస్తాడో అతడిని అతని ప్రభువు ఎన్నుకుని సన్మార్గం చూపుతాడు. మరియు ఎవరైతే ఇబ్లీసులా తన నుండి మొండితనం వలన,వ్యతిరేకత వలన పాపం జరిగినప్పుడు అతడు అల్లాహ్ నుండి దూరమును పెంచుకున్నాడు.

• اللباس نوعان: ظاهري يستر العورةَ، وباطني وهو التقوى الذي يستمر مع العبد، وهو جمال القلب والروح.
దుస్తులు రెండు రకాలు. బయటకు కనబడేవి.అవి మర్మావయవాలను కప్పుతాయి.అంతరంగా ఉండేవి.అవి దైవభీతితో కూడుకున్నవి.దాసునితో పాటు ఇమిడి ఉంటాయి.అవి హృదయమునకు,ఆత్మకు అందము.

• كثير من أعوان الشيطان يدعون إلى نزع اللباس الظاهري؛ لتنكشف العورات، فيهون على الناس فعل المنكرات وارتكاب الفواحش.
షైతాను సహాయకులు మర్మావయవాలను బహిర్గతం చేయటం కొరకు బయటకు కనబడే దుస్తులను తీసివేయటం వైపునకు పిలుస్తారు. అప్పుడు చెడు కార్యాలు చేయటం,అశ్లీలతకు పాల్పడటం ప్రజలకు సులభమవుతుంది.

• أن الهداية بفضل الله ومَنِّه، وأن الضلالة بخذلانه للعبد إذا تولَّى -بجهله وظلمه- الشيطانَ، وتسبَّب لنفسه بالضلال.
సన్మార్గము అల్లాహ్ అనుగ్రహము,ఆయన ఉపకారము. అపమార్గము దాసుడిని ఆయన అవమాన పరచటం కొరకు ఎప్పుడైతే అతడు తన అజ్ఞానం,అన్యాయం వలన షైతానును స్నేహితునిగా చేసుకుంటాడో.మరియు అతడు తన స్వయం కొరకు అపమార్గము ద్వారా కారకుడవుతాడు.

یٰبَنِیْۤ اٰدَمَ خُذُوْا زِیْنَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّكُلُوْا وَاشْرَبُوْا وَلَا تُسْرِفُوْا ؕۚ— اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْرِفِیْنَ ۟۠
ఓ ఆదం సంతతివారా మీ మర్మావయవాలను కప్పే వస్త్రములను,నమాజు,ప్రదక్షణ సమయంలో పరిశుభ్రమైన,పరిశుద్దమైనవి మీరు అందమును పొందే వస్త్రాలను మీరు తొడగండి. అల్లాహ్ హలాల్ చేసిన పరిశుద్ధ వస్తువుల్లోంచి మీరు కోరుకున్న వాటిని తినండి,త్రాగండి. ఈ విషయంలో నియంత్రణ పరిమితిని మించకండి. హలాల్ ను వదిలి హరాం వైపునకు వెళ్ళకండి. నిశ్చయంగా నియంత్రణ పరిమితులను మించిపోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు.
अरबी तफ़सीरें:
قُلْ مَنْ حَرَّمَ زِیْنَةَ اللّٰهِ الَّتِیْۤ اَخْرَجَ لِعِبَادِهٖ وَالطَّیِّبٰتِ مِنَ الرِّزْقِ ؕ— قُلْ هِیَ لِلَّذِیْنَ اٰمَنُوْا فِی الْحَیٰوةِ الدُّنْیَا خَالِصَةً یَّوْمَ الْقِیٰمَةِ ؕ— كَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా వస్త్రముల్లోంచి,పరిశుద్ధమైన తినే వస్తువుల్లోంచి,ఇతర వస్తువుల్లోంచి అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరాం చేసుకునే ముష్రికులను ఖండిస్తూ ఇలా పలకండి : మీ అలంకరణ కొరకు ఉన్న వస్త్రములను మీపై ఎవరు నిషేదించాడు?. అల్లాహ్ మీకు ప్రసాదించిన తినే వస్తువులు,త్రాగే వస్తువులను,ఇతర వాటిని మీపై ఎవరు నిషేదించారు ?. ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి నిశ్చయంగా ఈ పరిశుధ్ధ వస్తువులు ఇహలోక జీవితంలో విశ్వాసపరుల కొరకు ఉన్నవి. ఒక వేళ వాటిలో వారితోపాటు ఇతరులు ఇహలోకంలో భాగం పొందినా అవి ప్రళయదినాన వారి కొరకే ప్రత్యేకించబడుతాయి. వాటిలో విశ్వాసపరులతో పాటు అవిశ్వాసపరునికి భాగం లభించదు. ఎందుకంటే స్వర్గం అవిశ్వాసపరులపై నిషేదించబడినది. ఈ విధమైన వివరణ లాగే మేము జ్ఞానం కల జాతి వారికి ఆయతులను వివరించి తెలుపుతాము. ఎందుకంటే వారే వీటి ద్వారా ప్రయోజనం చెందుతారు.
अरबी तफ़सीरें:
قُلْ اِنَّمَا حَرَّمَ رَبِّیَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْاِثْمَ وَالْبَغْیَ بِغَیْرِ الْحَقِّ وَاَنْ تُشْرِكُوْا بِاللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّاَنْ تَقُوْلُوْا عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరామ్ చేసుకునే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నిశ్చయంగా అల్లాహ్ తన దాసులపై అశ్లీల కార్యాలను నిషేదించాడు. అవి అతి చెడ్డ పాపాలు.బాహటంగాను లేదా గోప్యంగాను చేసినవి,పాపకార్యాలన్నింటిని,ప్రజల ధన,మాన,ప్రాణ విషయంలో వారిపై దుర్మార్గమునకు పాల్పడటంను నిషేదించాడు. మీ వద్ద ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్ తో పాటు వేరే ఇతరులను మీరు సాటి కల్పించటంను మీపై నిషేదించాడు. ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ నామముల విషయంలో,ఆయన గుణాల విషయంలో ఆయన కార్యాల విషయంలో,ఆయన శాసనాల విషయంలో మాట్లాడటంను మీపై నిషేదించాడు.
अरबी तफ़सीरें:
وَلِكُلِّ اُمَّةٍ اَجَلٌ ۚ— فَاِذَا جَآءَ اَجَلُهُمْ لَا یَسْتَاْخِرُوْنَ سَاعَةً وَّلَا یَسْتَقْدِمُوْنَ ۟
ప్రతి తరానికి,శతాబ్దానికి వారి వయస్సుకి ఒక గడువు,ఒక నిర్ణీత సమయమున్నది. నిర్ధారించబడిన వారి సమయం వచ్చినప్పుడు వారు దాని నుండి కొద్దిపాటి సమయం వెనుకకు జరగటం కాని ముందుకు జరగటం కాని జరగదు.
अरबी तफ़सीरें:
یٰبَنِیْۤ اٰدَمَ اِمَّا یَاْتِیَنَّكُمْ رُسُلٌ مِّنْكُمْ یَقُصُّوْنَ عَلَیْكُمْ اٰیٰتِیْ ۙ— فَمَنِ اتَّقٰی وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
ఓ ఆదం సంతతి వారా మీ వద్దకు మీ జాతుల నుండి నా తరుపు నుంచి ప్రవక్తలు వచ్చినప్పుడు వారు వారిపై నేను నా గ్రంధముల్లోంచి అవతరించిన ఆయతులను మీ ముందు చదివి వినిపిస్తే మీరు వారిపై విధేయత చూపండి. వారు తీసుకుని వచ్చిన దానిని అనుసరించండి. ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉంటారో,తమ ఆచరణలను సరిదిద్దుకుంటారో వారిపై ప్రళయ దినాన ఎటువంటి భయాందోళనలు ఉండవు. ప్రాపంచిక వాటాల్లోంచి వారు కోల్పోయిన దానిపై దుఃఖించరు.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
మరియు అవిశ్వాసపరులు ఎవరైతే మా ఆయతులను తిరస్కరించారో,వాటి పట్ల విశ్వాసమును కనబర్చరో,వారి వద్దకు వారి ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాని పై ఆచరించటం గురించి దురహంకారమును ప్రదర్శిస్తూ రెచ్చిపోతారో వారందరు నరకాగ్ని వాసులు. ఎల్ల వేళల దానినే అట్టి పెట్టుకుని ఉంటారు,అందులోనే శాస్వతంగా ఉంటారు.
अरबी तफ़सीरें:
فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰیٰتِهٖ ؕ— اُولٰٓىِٕكَ یَنَالُهُمْ نَصِیْبُهُمْ مِّنَ الْكِتٰبِ ؕ— حَتّٰۤی اِذَا جَآءَتْهُمْ رُسُلُنَا یَتَوَفَّوْنَهُمْ ۙ— قَالُوْۤا اَیْنَ مَا كُنْتُمْ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قَالُوْا ضَلُّوْا عَنَّا وَشَهِدُوْا عَلٰۤی اَنْفُسِهِمْ اَنَّهُمْ كَانُوْا كٰفِرِیْنَ ۟
అల్లాహ్ తో పాటు సాటి కల్పించి అబద్దమును అంటగట్టి లేదా లోపమును కల్పించి లేదా ఆయన చెప్పని మాటలను ఆయన చెప్పినట్లు కల్పించి లేదా సన్మార్గమైన ఆయన మార్గము వైపునకు దర్శకం వహించే ఆయన గొప్ప ఆయతులను అబద్దమని తిరస్కరించే వాడికన్న పెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు. ఈ లక్షణాలు కలిగిన వారందరు ప్రాపంచిక సుఖాల్లోంచి లౌహె మహ్ఫూజ్ లో వారి కొరకు వ్రాయబడిన వారి వాటా వారికి లభిస్తుంది. చివరికి వారి వద్దకు వారి ఆత్మలను తీసుకొనుట కొరకు మరణ దూత, దైవ దూతల్లోంచి అతని సహాయకులు వారి వద్దకు వచ్చినప్పుడు వారిని మందలిస్తూ ఇలా అంటారు : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఇతర దేవుళ్లు ఎక్కడ ?. మీకు లాభం చేకూర్చటానికి వారిని మీరు పిలవండి. అప్పుడు ముష్రికులు దైవ దూతలకు సమాధానమిస్తూ ఇలా అంటారు : మేము ఆరాధించే దేవుళ్ళు మా నుండి వెళ్ళిపోయారు,అదృశ్యమైపోయారు. వారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మరియు వారు తాము అవిశ్వాసపరులని స్వయంగా అంగీకరిస్తారు. కాని ఆ సమయంలో వారి అంగీకారము వారికి వ్యతిరేకంగా వాదన అవుతుంది,వారికి ప్రయోజనం చేకూర్చదు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• المؤمن مأمور بتعظيم شعائر الله من خلال ستر العورة والتجمل في أثناء صلاته وخاصة عند التوجه للمسجد.
విశ్వాసి నమాజు సమయంలో ముఖ్యంగా మస్జిదుకు వెళ్లేటప్పుడు మర్మావయవాలను కప్పటం,అలంకరణ ద్వారా అల్లాహ్ ఆచారాలను గౌరవించటం గురించి ఆదేశించబడ్డాడు.

• من فسر القرآن بغير علم أو أفتى بغير علم أو حكم بغير علم فقد قال على الله بغير علم وهذا من أعظم المحرمات.
జ్ఞానం లేకుండా ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) చేసిన వాడు లేదా జ్ఞానం లేకుండా ఫత్వా ఇచ్చిన వాడు లేదా జ్ఞానం లేకుండా తీర్పునిచ్చినవాడు నిశ్ఛయంగా అతడు జ్ఞానం లేకుండా అల్లాహ్ కు వ్యతిరేకంగా పలికిన వాడు అవుతాడు. మరియు ఇది పెద్ద నిషిద్దాల్లోంచిది.

• في الآيات دليل على أن المؤمنين يوم القيامة لا يخافون ولا يحزنون، ولا يلحقهم رعب ولا فزع، وإذا لحقهم فمآلهم الأمن.
విశ్వాసపరులు ప్రళయదినాన భయపడరు,దుఃఖించరు అనటానికి ఆయతుల్లో ఆధారమున్నది. వారికి ఎలాంటి భయాందోళనలు కలగవు. అవి కలిగినప్పుడు వారి నిలయము శాంతి అవుతుంది.

• أظلم الناس من عطَّل مراد الله تعالى من جهتين: جهة إبطال ما يدل على مراده، وجهة إيهام الناس بأن الله أراد منهم ما لا يريده الله.
ప్రజల్లోంచి దుర్మార్గులు అల్లాహ్ నిర్ణయాన్ని రెండు విధాలుగా వృధా చేస్తారు. ఒకటి అల్లాహ్ నిర్ణయం ఏ విషయాన్ని నిర్ధారిస్తుందో దానిని వృధా చేస్తారు. రెండోవది అల్లాహ్ మానవుల నుండి కోరని దానిని అల్లాహ్ కోరినట్లు మానవులను సంశయంలో పడవేస్తారు.

قَالَ ادْخُلُوْا فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ فِی النَّارِ ؕ— كُلَّمَا دَخَلَتْ اُمَّةٌ لَّعَنَتْ اُخْتَهَا ؕ— حَتّٰۤی اِذَا ادَّارَكُوْا فِیْهَا جَمِیْعًا ۙ— قَالَتْ اُخْرٰىهُمْ لِاُوْلٰىهُمْ رَبَّنَا هٰۤؤُلَآءِ اَضَلُّوْنَا فَاٰتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ ؕ۬— قَالَ لِكُلٍّ ضِعْفٌ وَّلٰكِنْ لَّا تَعْلَمُوْنَ ۟
వారితో దైవదూతలు ఇలా అంటారు ఓ ముష్రికులారా : మీరు మీకన్న పూర్వం జిన్నాతుల్లోంచి,మానవుల్లోంచి అవిశ్వాసంలో,అపమార్గంలో ఉండి గతించిన వారందరితో నరకాగ్నిలో ప్రవేశించండి. సమూహాల్లోంచి ఏదైన సమూహం ప్రవేశించినప్పుడు తమ కన్న ముందు ప్రవేశించిన సహవాస సమూహముపై శాపనార్ధాలు పెడుతుంది. ఆఖరికి వారందరు అందులో కలిసిపోయిన తరువాత వారందరూ సమావేశమై వారిలోని తరువాత ప్రవేశించిన వారు అంటే క్రింది వారు,అనుసరించని వారు వారిలోని మొదటివారు అంటే పెద్ద వారు,నాయకులను ఉద్దేశించి ఇలా అంటారు : ఓ మా ప్రభువా ఈ పెద్దవారందరే మమ్మల్ని సన్మార్గము నుంచి తప్పించినారు. అప మార్గమును మాకు అలంకరించి చూపించినందుకు వారికి రెట్టింపు శిక్షను విధించు. అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా అంటాడు : మీలో నుంచి ప్రతి సమూహానికి రెట్టింపు శిక్ష నుండి భాగముంటుంది. కాని అది మీకు అర్ధం కాదు. దానిని మీరు తెలుసుకోలేరు.
अरबी तफ़सीरें:
وَقَالَتْ اُوْلٰىهُمْ لِاُخْرٰىهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَیْنَا مِنْ فَضْلٍ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُوْنَ ۟۠
అనుసరించబడిన నాయకులు తమను అనుసరించిన వారిని ఉద్దేశించి ఇలా అంటారు : ఓ అనుసరించే వారా మీరు మీ నుండి శిక్షను తగ్గించుకోవటానికి మీకు మాపై ఎటువంటి ప్రాధాన్యత లేదు. మీరు చేసిన కర్మల యొక్క లెక్క ప్రకారం జరుగును.అసత్యాన్ని అనుసరించిన విషయంలో మీ కొరకు ఎటువంటి సాకులు (వంకలు) ఉండవు (స్వీకరించబడవు). ఓ అనుసరించేవారా మీరు చేసిన పాపాలు,అవిశ్వాస కార్యాల మూలంగా మేము అనుభవించిన శిక్షను మీరూ అనుభవించండి.
अरबी तफ़सीरें:
اِنَّ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ اَبْوَابُ السَّمَآءِ وَلَا یَدْخُلُوْنَ الْجَنَّةَ حَتّٰی یَلِجَ الْجَمَلُ فِیْ سَمِّ الْخِیَاطِ ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُجْرِمِیْنَ ۟
నిశ్చయంగా ఎవరైతే స్పష్టమైన మా ఆయతులను తిరస్కరిస్తారో,వాటిని అనుసరించటం,విధేయత చూపటం విషయంలో దురహంకారమును ప్రదర్శిస్తారో వారు ప్రతి మేలు గురించి నిరాశులైపోయారు. వారి అవిశ్వాసం వలన వారి ఆచరణల కొరకు,వారు మరణించినప్పుడు వారి ఆత్మల కొరకు ఆకాశ ద్వారములు తెరుచుకోబడవు. జంతువుల్లో పెద్ద జంతువైన ఒంటే అత్యంత బిగుతువుగా ఉండే సూది రంధ్రంలో దూరనంత వరకు వారు ఎన్నడు స్వర్గంలో ప్రవేశించలేరు. ఇది అసాధ్యము. వారు స్వర్గంలో ప్రవేశించటం అసాధ్యము. ఇలాంటి ప్రతిఫలం మాదిరిగానే పెద్ద పాపములు కలవారిని అల్లాహ్ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
अरबी तफ़सीरें:
لَهُمْ مِّنْ جَهَنَّمَ مِهَادٌ وَّمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ؕ— وَكَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟
దురహంకారము కల ఈ తిరస్కారులందరి కొరకు నరకాగ్ని పరుపు ఉంటుంది. దానిపై వారు పడుకుంటారు. వారి కొరకు వారిపై నరకాగ్ని కప్పు (దుప్పట) ఉంటుంది. ఇటువంటి ప్రతిఫలం మాదిరిగానే అల్లాహ్ పై తమ అవిశ్వాసం,అతని నుండి వారి విముఖత ద్వారా అల్లాహ్ హద్దులను దాటే వారిని మేము ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَاۤ ؗ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
మరియు ఎవరైతే విశ్వసించి తమ శక్తికి తగ్గట్టుగా సత్కార్యాలు చేస్తారో అల్లాహ్ ఎవరి పై కూడా వారి శక్తికి మించి భారం వేయడు. వారందరు స్వర్గ వాసులు అందులో వారు ప్రవేశిస్తారు. అందులో శాశ్వతంగా ఉంటారు.
अरबी तफ़सीरें:
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ ۚ— وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ هَدٰىنَا لِهٰذَا ۫— وَمَا كُنَّا لِنَهْتَدِیَ لَوْلَاۤ اَنْ هَدٰىنَا اللّٰهُ ۚ— لَقَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ؕ— وَنُوْدُوْۤا اَنْ تِلْكُمُ الْجَنَّةُ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
అల్లాహ్ వారి హృదయముల్లో ఉన్న ధ్వేషమును,విరోధమును తొలగించటం,వారి క్రింద నుండి కాలువలను ప్రవహింపచేయటం స్వర్గంలో వారికి ప్రసాదించిన పరిపూర్ణ అనుగ్రహాల్లోంచివి. వారు తమపై ఉన్న అనుగ్రహాలను అంగీకరిస్తూ ఇలా అంటారు : పొగడ్తలన్ని అల్లాహ్ కొరకే ఆయనే మేము ఈ స్థానమును పొందటానికి సత్కార్యమును చేసే అనుగ్రహమును ప్రసాదించాడు. ఒక వేళ అల్లాహ్ మాకు దానిని పొందే అనుగ్రహం కలిగించకపోతే మేము మా తరుపు నుండి దానిని పొందే వాళ్ళమే కాము. ఎటువంటి సందేహము లేని సత్యమును,ప్రమాణము,హెచ్చరికల్లో నిజాయితీని తీసుకుని మా ప్రభువు యొక్క ప్రవక్తలు వచ్చారు. ఒక ప్రకటించే వాడు వారిలో ఇలా ప్రకటిస్తాడు : ఇహలోకంలో నా ప్రవక్తలు మీకు సమాచారమిచ్చింది ఈ స్వర్గం గురించే. అల్లాహ్ మన్నతను కోరుకుంటూ మీరు చేసుకున్న సత్కర్మలకు ప్రతిఫలంగా అల్లాహ్ దీనినే మీకు ప్రసాదించాడు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• المودة التي كانت بين المكذبين في الدنيا تنقلب يوم القيامة عداوة وملاعنة.
ఇహలోకంలో సత్య తిరస్కారుల మధ్య ఉన్న స్నేహము ప్రళయ దినాన శతృత్వంగా,శాపనార్ధాలుగా మారిపోతుంది.

• أرواح المؤمنين تفتح لها أبواب السماء حتى تَعْرُج إلى الله، وتبتهج بالقرب من ربها والحظوة برضوانه.
ఆకాశ ద్వారములు విశ్వాసపరుల ఆత్మల కొరకు తెరవబడుతాయి. చివరికి వారు అల్లాహ్ వైపునకు ఎక్కుతారు. వారు తమ ప్రభువు సామిప్యము ద్వారా,ఆయన మన్నతను పొందే స్థాయి ద్వారా సంతోష పడుతారు.

• أرواح المكذبين المعرضين لا تفتح لها أبواب السماء، وإذا ماتوا وصعدت فهي تستأذن فلا يؤذن لها، فهي كما لم تصعد في الدنيا بالإيمان بالله ومعرفته ومحبته، فكذلك لا تصعد بعد الموت، فإن الجزاء من جنس العمل.
విముఖత చూపే సత్యతిరస్కారుల ఆత్మలకొరకు ఆకాశ ద్వారములు తెరవ బడవు. వారు చనిపోయినప్పుడు ఆకాశం వైపునకు ఎక్కి అనుమతి కోరుతారు. వారికి అనుమతివ్వబడదు. ఏ విధంగానంటే వారు ఇహ లోకంలో అల్లాహ్ పై విశ్వాసము ద్వారా,ఆయన్ను గుర్తించటం ద్వారా,ఆయన్ను ప్రేమించటం ద్వారా ఎక్క లేదో అదే విధంగా వారు మరణము తరువాత ఎక్క లేదు. ఎందుకంటే ప్రతిఫలం అన్నది ఆచరణ ఎలా ఉంటే అలా ఉంటుంది.

• أهل الجنة نجوا من النار بعفو الله، وأدخلوا الجنة برحمة الله، واقتسموا المنازل وورثوها بالأعمال الصالحة وهي من رحمته، بل من أعلى أنواع رحمته.
స్వర్గవాసులు అల్లాహ్ మన్నింపు ద్వారా నరకాగ్ని నుండి బతికి పోతారు,అల్లాహ్ కారుణ్యం ద్వారా స్వర్గంలో ప్రవేశించబడుతారు. వారు ఇళ్లను పంచుకుంటారు. సత్కర్మల వలన వాటికి వారు వారసులవుతారు. అది కూడా ఆయన కారుణ్యము ద్వారానే. అంతే కాదు అది ఆయన యొక్క ఎంతోఉన్నత కారుణ్య రకాల్లోంచిది.

وَنَادٰۤی اَصْحٰبُ الْجَنَّةِ اَصْحٰبَ النَّارِ اَنْ قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُّمْ مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ؕ— قَالُوْا نَعَمْ ۚ— فَاَذَّنَ مُؤَذِّنٌ بَیْنَهُمْ اَنْ لَّعْنَةُ اللّٰهِ عَلَی الظّٰلِمِیْنَ ۟ۙ
మరియు స్వర్గములో ఉండే స్వర్గ వాసులు నరకములో ఉండే నరక వాసులను వారిద్దరిలోంచి ప్రతి ఒక్కరు తమ కొరకు తయారు చేయబడిన స్థావరంలో ప్రవేశించిన తరువాత పిలిచి ఇలా అంటారు : నిశ్చయంగా మాకు మాప్రభువు వాగ్ధానం చేసిన స్వర్గమును నిజంగా,సంపూర్ణంగా మేము పొందాము. అయితే మీరు కూడా ఓ సత్య తిరస్కారులారా మీకు అల్లాహ్ వగ్ధానం చేసిన నరకం నిజంగా,సంపూర్ణంగా మీరు పొందారా?. సత్య తిరస్కారులు సమాధానమిస్తూ ఇలా అంటారు : నిశ్చయంగా మాకు వాగ్ధానం చేయబడిన నరకమును మేము నిజంగా పొందాము. ఒక ప్రకటించేవాడు అర్దిస్తూ ఇలా ప్రకటిస్తాడు : అల్లాహ్ దుర్మార్గులను తన కారుణ్యము నుండి ధూత్కరించు గాక. వాస్తవానికి ఆయన కారుణ్య ద్వారములు వారి కొరకు తెరవబడి ఉండేవి. వారు ఇహలోక జీవితంలో వాటి నుండి ముఖము చాటేశారు (విముఖత చూపారు).
अरबी तफ़सीरें:
الَّذِیْنَ یَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَیَبْغُوْنَهَا عِوَجًا ۚ— وَهُمْ بِالْاٰخِرَةِ كٰفِرُوْنَ ۟ۘ
ఈ దుర్మార్గులందరు స్వయంగా అల్లాహ్ మార్గము నుండి విముఖత చూపేవారు,ఇతరులను కూడా వాటి పట్ల విముఖత చూపటానికి ఉసిగొల్పేవారు. సత్య మార్గము పై ప్రజలు నడవకుండా ఉండేటట్లు వంకరుగా అయిపోవాలని కోరుకునేవారు. వారు పరలోకం కొరకు సిద్దం కాకుండా ఉండి తిరస్కరించారు.
अरबी तफ़सीरें:
وَبَیْنَهُمَا حِجَابٌ ۚ— وَعَلَی الْاَعْرَافِ رِجَالٌ یَّعْرِفُوْنَ كُلًّا بِسِیْمٰىهُمْ ۚ— وَنَادَوْا اَصْحٰبَ الْجَنَّةِ اَنْ سَلٰمٌ عَلَیْكُمْ ۫— لَمْ یَدْخُلُوْهَا وَهُمْ یَطْمَعُوْنَ ۟
ఈ ఇరు వర్గాల మధ్య అంటే స్వర్గ వాసుల,నరకవాసుల మధ్య ఒక ఎత్తైన అడ్డు గోడ ఉంటుంది. దానిని ఆరాఫ్ అని పిలుస్తారు. ఈ ఎత్తైన అడ్డు గోడపై కొంత మంది ఉంటారు. వారి పుణ్యాలు,పాపాలు సమానంగా ఉంటాయి. మరియు వారు స్వర్గ వాసులను వారి చిహ్నాలైన ముఖములు తెల్లగా ఉండటం ద్వారా,నరక వాసులను వారి చిహ్నాలైన ముఖములు నల్లగా ఉండటం ద్వారా గుర్తు పడతారు. వీరందరు స్వర్గ వాసులను గౌరవంగా పిలుస్తూ ఇలా అంటారు : "అస్సలాము అలైకుమ్" (మీపై శాంతి కురియుగాక). మరియు స్వర్గ వాసులు ఇప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు (ఆరాఫ్ వారు). వారు అల్లాహ్ కారుణ్యం ద్వారా అందులో (స్వర్గంలో) ప్రవేశించాలని ఆశిస్తుంటారు.
अरबी तफ़सीरें:
وَاِذَا صُرِفَتْ اَبْصَارُهُمْ تِلْقَآءَ اَصْحٰبِ النَّارِ ۙ— قَالُوْا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟۠
ఆరాఫ్ వాసుల దృష్టి నరక వాసుల వైపు మరలినప్పుడు వారు వారిని అందులో కఠిన శిక్షను అనుభవించటం చూస్తారు. అప్పుడు వారు అల్లాహ్ తో ఈ విధంగా అర్ధిస్తూ పలుకుతారు : ఓ మా ప్రభువా నీతోపాటు సాటి కల్పించటం ద్వారా,అవిశ్వాసము ద్వారా దుర్మార్గులైన వారితో పాటు నీవు మమ్మల్ని చేయకు.
अरबी तफ़सीरें:
وَنَادٰۤی اَصْحٰبُ الْاَعْرَافِ رِجَالًا یَّعْرِفُوْنَهُمْ بِسِیْمٰىهُمْ قَالُوْا مَاۤ اَغْنٰی عَنْكُمْ جَمْعُكُمْ وَمَا كُنْتُمْ تَسْتَكْبِرُوْنَ ۟
ఆరాఫ్ వారు అవిశ్వాసపరుల్లోంచి నరకవాసులైన వారిలోంచి చాలా మందిని వారి చిహ్నాలైన వారి నల్ల ముఖముల ద్వారా,వారి నీలి కళ్ళ ద్వారా గుర్తు పడతారు. వారిని ఉద్దేశించి ఇలా అంటారు : మీ ధనము,జనము ఎక్కువవ్వటం మీకు ఏ మాత్రం ప్రయోజనం చేయ లేదు. గర్వం అహంకారం వలన మీరు సత్యం నుండి విముఖత చూపటం మీకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు.
अरबी तफ़सीरें:
اَهٰۤؤُلَآءِ الَّذِیْنَ اَقْسَمْتُمْ لَا یَنَالُهُمُ اللّٰهُ بِرَحْمَةٍ ؕ— اُدْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَیْكُمْ وَلَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ ۟
మరియు అల్లాహ్ అవిశ్వాసపరులను మందలిస్తూ ఇలా అంటాడు : మీరు ప్రమాణాలు చేసి అల్లాహ్ తన కారుణ్యమును కురిపించడు అని చెప్పారో(వారు) వీరేనా?. మరియు అల్లాహ్ విశ్వాస పరులతో ఇలా అంటాడు : ఓ విశ్వాసపరులారా మీరు స్వర్గంలో ప్రవేశించండి. మీరు స్వీకరించిన దానిలో మీకు భయం లేదు,అలాగే మీరు శాస్వత అనుగ్రహాలు పొందినప్పుడు ఇహలోక భాగాలను కోల్పోయిన దానిపై మీకు ఎటువంటి దఃఖము ఉండదు.
अरबी तफ़सीरें:
وَنَادٰۤی اَصْحٰبُ النَّارِ اَصْحٰبَ الْجَنَّةِ اَنْ اَفِیْضُوْا عَلَیْنَا مِنَ الْمَآءِ اَوْ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ؕ— قَالُوْۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَی الْكٰفِرِیْنَ ۟ۙ
నరక వాసులు స్వర్గ వాసులను వేడుకుంటూ ఇలా పలుకుతారు : ఓ స్వర్గ వాసులారా మాపై నీళ్ళను పోయండి లేదా మీకు అల్లాహ్ ప్రసాదించిన ఆహారములోంచి కొద్దిగా ఇటు మా వైపు పడవేయండి. స్వర్గ వాసులు సమాధానమిస్తూ ఇలా అంటారు : నిశ్చయంగా అల్లాహ్ ఆ రెండింటిని సత్య తిరస్కారులపై వారి అవిశ్వాసం వలన నిషేదించాడు. మరియు అల్లాహ్ మీపై నిషేదించిన వాటి విషయంలో మేము ఏమాత్రం మీకు సహాయం చేయలేము.
अरबी तफ़सीरें:
الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَهُمْ لَهْوًا وَّلَعِبًا وَّغَرَّتْهُمُ الْحَیٰوةُ الدُّنْیَا ۚ— فَالْیَوْمَ نَنْسٰىهُمْ كَمَا نَسُوْا لِقَآءَ یَوْمِهِمْ هٰذَا ۙ— وَمَا كَانُوْا بِاٰیٰتِنَا یَجْحَدُوْنَ ۟
ఈ అవిశ్వాసపరులందరు తమ ధర్మమును హాస్యాస్పదంగా,వ్యర్దంగా చేసుకున్నారు. ఇహలోక జీవితం తన అందం,అలంకరణ ద్వారా వారిని మోసగించింది. ప్రళయదినాన అల్లాహ్ వారిని మరచిపోతాడు,వారిని శిక్షను అనుభవిస్తూ ఉండేటట్లు వదిలి వేస్తాడు. వారు ప్రళయ దినం కోసం అమలు చేయకుండా,దాని కోసం సిద్ధం కాకుండా దానిని మరచిపోయినట్లు,అల్లాహ్ వాదనలు,ఆధారాలు సత్యం అని తెలిసి కూడా వాటిని విస్మరించినట్లు,నిరాకరించినట్లు (అల్లాహ్ వారిని మరచి పోతాడు).
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• عدم الإيمان بالبعث سبب مباشر للإقبال على الشهوات.
మరణాంతర జీవితంపై విశ్వాసం లేకపోవటం మనోవాంఛనలకు లోనవటానికి ప్రత్యక్ష కారణం.

• يتيقن الناس يوم القيامة تحقق وعد الله لأهل طاعته، وتحقق وعيده للكافرين.
అల్లాహ్ యొక్క వాగ్ధానము ఆయనపై విధేయత చూపే వారి కొరకు నెరవేరటంను,అవిశ్వాసపరుల కొరకు ఆయన హెచ్చరిక నెరవేరటంను ప్రజలు ప్రళయదినాన నమ్ముతారు.

• الناس يوم القيامة فريقان: فريق في الجنة وفريق في النار، وبينهما فريق في مكان وسط لتساوي حسناتهم وسيئاتهم، ومصيرهم إلى الجنة.
ప్రజలు ప్రళయదినాన రెండు వర్గాలుగా ఉంటారు : ఒక వర్గం స్వర్గంలో ఇంకొక వర్గం నరకంలో ఉంటుంది. వారిద్దరి మధ్య ఒక వర్గం వారి పుణ్యాలు,పాపాలు సమానంగా ఉండటం వలన మధ్య ప్రదేశంలో ఉంటుంది. వారు స్వర్గానికి చేరుతారు.

• على الذين يملكون المال والجاه وكثرة الأتباع أن يعلموا أن هذا كله لن يغني عنهم من الله شيئًا، ولن ينجيهم من عذاب الله.
ధనము,పెద్దరికం,అనుసరించే వారు అధికంగా కలవారు ఇవన్నీ అల్లాహ్ నుండి కాపాడలేవని,అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేవని వారు తప్పకుండా గుర్తించాలి.

وَلَقَدْ جِئْنٰهُمْ بِكِتٰبٍ فَصَّلْنٰهُ عَلٰی عِلْمٍ هُدًی وَّرَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
మరియు మేము వారి వద్దకు ఈ ఖుర్ఆన్ ను చేరవేశాము అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన గ్రంధము. మేము దానిని మా జ్ఞానం ద్వారా విశదీకరించాము. అది విశ్వాసపరుల కొరకు సన్మార్గము,సత్యము వైపునకు మార్గ దర్శకము. మరియు వారికి ఇహలోక,పరలోక శుభాలను నిర్దేశించే కారుణ్యం.
अरबी तफ़सीरें:
هَلْ یَنْظُرُوْنَ اِلَّا تَاْوِیْلَهٗ ؕ— یَوْمَ یَاْتِیْ تَاْوِیْلُهٗ یَقُوْلُ الَّذِیْنَ نَسُوْهُ مِنْ قَبْلُ قَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ۚ— فَهَلْ لَّنَا مِنْ شُفَعَآءَ فَیَشْفَعُوْا لَنَاۤ اَوْ نُرَدُّ فَنَعْمَلَ غَیْرَ الَّذِیْ كُنَّا نَعْمَلُ ؕ— قَدْ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟۠
అవిశ్వాసపరులు కేవలం జరుగుతుందని వారికి తెలుపబడిన బాధాకరమైన శిక్ష జరగటం గురించి వారు నిరీక్షిస్తున్నారు. దాని వైపునే పరలోకంలో వారి విషయం మరలుతుంది. వీటిలోంచి వారికి తెలుపబడినది,విశ్వాసపరులకి తెలుపబడిన పుణ్యము ఆ రోజు వస్తుంది. ఇహలోకంలో ఖుర్ఆన్ ను మరచిపోయిన వారు,అందులో వచ్చిన విషయాలను ఆచరించని వారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మా ప్రభువు ప్రవక్తలు ఎటువంటి సందేహం లేని సత్యమును తీసుకుని వచ్చారు. అది అల్లాహ్ వద్ద నుండి అవ్వటంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ వద్ద మా కొరకు శిక్షను మన్నింపచేయటం కొరకు మధ్యవర్తులు ఉండి సిఫారసు చేస్తే ఎంతో బాగుండును, లేదా మేము చేసిన పాపకార్యాలకు బదులుగా సత్కార్యాలు చేసి వాటి ద్వారా మేము బతికి బయటపడటం కొరకు మేము ఇహలోక జీవితం వైపు మరలిపోయి ఉంటే ఎంతో బాగుండును. ఈ సత్యతిరస్కారులందరు తమ అవిశ్వాసం వలన తమంతటతామే వినాశనమును చవిచూస్తారు.వారు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధించేవారో వారు వారి నుండి మటుమాయమైపోయారు. వారు వారికి ప్రయోజనం చేయలేదు.
अरबी तफ़सीरें:
اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ ۫— یُغْشِی الَّیْلَ النَّهَارَ یَطْلُبُهٗ حَثِیْثًا ۙ— وَّالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُوْمَ مُسَخَّرٰتٍ بِاَمْرِهٖ ؕ— اَلَا لَهُ الْخَلْقُ وَالْاَمْرُ ؕ— تَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు ఆ అల్లాహ్ ఎవరైతే ఎటువంటి పూర్వ నమూనా లేకుండా భూమిని,ఆకాశాలను ఆరు దినాల్లో సృష్టించాడు. ఆ తరువాత ఆయన సుబహానహు వ తఆలా తన ఘనతకు తగిన విధంగా సింహాసనాన్ని అధీష్టించినాడు,ఆసీనుడైనాడు. అది ఏ విధంగా అన్నది మేము గ్రహించలేము. అతడు రాత్రి చీకటిని ఉదయపు వెలుగు ద్వారా,ఉదయపు వెలుగును రాత్రి చీకటి ద్వారా దూరం చేస్తాడు. ఆ రెండింటిలోంచి ప్రతి ఒక్కటి వేరే దాన్ని వేగంగా వెంబడిస్తుంది. ఏ విధంగానంటే దాని నుండి అది ఆలస్యం అవ్వదు. ఎప్పుడైతే ఇది వెళుతుందో అది ప్రవేసిస్తుంది. మరియు ఆయన సుబహానహు వ తఆలా సూర్యుడిని సృష్టించాడు,చంద్రుడిని సృష్టించాడు,మరియు నక్షత్రములను విధేయులుగా,ఆదేశాలకు కట్టుబడి ఉండేవారిగా సృష్టించాడు. వినండి సృష్టి ప్రక్రియ అంతా అల్లాహ్ ఒక్కడి కొరకే. ఆయన కాకుండా సృష్టించేవాడు ఇంకొకడు ఎవరుంటారు ?. ఆజ్ఞాపన ఆయన ఒక్కడి కొరకే. ఆయన మేలు చాలా ఉన్నది. ఆయన ఉపకారములు ఎక్కువే. ఆయన ఘనత,పరిపూర్ణత లక్షణాలు కల సర్వలోకాల ప్రభువు.
अरबी तफ़सीरें:
اُدْعُوْا رَبَّكُمْ تَضَرُّعًا وَّخُفْیَةً ؕ— اِنَّهٗ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟ۚ
ఓ విశ్వాసపరులారా సంపూర్ణ వినయం ద్వారా,గోప్యంగా వినమ్రత ద్వారా మీ యొక్క ప్రభువును వేడుకోండి. వేడుకోవటంలో చిత్తశుద్ధి కలవారై,ప్రదర్శించేవారు కాకుండా,ఆయన సుబహానహు తఆలాతో పాటు వేడుకోవటంలో ఇతరులను సాటి కల్పించేవారు కాకుండా (వేడుకోండి). నిశ్చయంగా వేడుకోవటంలో ఆయన హద్దులను దాటేవారిని ఆయన ఇష్టపడడు. వేడుకోవటంలో ఆయన హద్దులను దాటటంలో అత్యంత పెద్దదైనది ఏమిటంటే ముష్రికులు ఏవిధంగా చేసేవారో ఆ విధంగా వేడుకోవటంలో ఆయన సుబహానహు తఆలాతో పాటు ఇతరులను సాటి కల్పించటం.
अरबी तफ़सीरें:
وَلَا تُفْسِدُوْا فِی الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا وَادْعُوْهُ خَوْفًا وَّطَمَعًا ؕ— اِنَّ رَحْمَتَ اللّٰهِ قَرِیْبٌ مِّنَ الْمُحْسِنِیْنَ ۟
అల్లాహ్ ప్రవక్తలను పంపించటం ద్వారా,తన ఒక్కడిపైనే విధేయతను చూపి భూ నిర్మాణం ద్వారా భూ సంస్కరణ చేసిన తరువాత మీరు పాపాలకు పాల్పడి భూమిలో అల్లకల్లోలాను సృష్టించకండి. మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడుతూ,ఆయన పుణ్యాన్ని పొందటానికి నిరీక్షిస్తూ ఆయన ఒక్కడినే వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యము సజ్జనులకి అతి సమీపములో ఉన్నది. అయితే మీరు వారిలోంచి అయిపోండి.
अरबी तफ़सीरें:
وَهُوَ الَّذِیْ یُرْسِلُ الرِّیٰحَ بُشْرًاۢ بَیْنَ یَدَیْ رَحْمَتِهٖ ؕ— حَتّٰۤی اِذَاۤ اَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنٰهُ لِبَلَدٍ مَّیِّتٍ فَاَنْزَلْنَا بِهِ الْمَآءَ فَاَخْرَجْنَا بِهٖ مِنْ كُلِّ الثَّمَرٰتِ ؕ— كَذٰلِكَ نُخْرِجُ الْمَوْتٰی لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
మరియు అల్లాహ్ సుబహానహు వ తఆలా ఆయనే గాలులను వర్షముల ద్వారా శుభవార్తను ఇస్తూ పంపిస్తాడు. ఆఖరికి గాలులు నీటితో బరువెక్కిన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవమైన ఏదైన ప్రదేశం వైపునకు మరలిస్తాము. ఆ తరువాత మేము ఆ ప్రదేశం పై నీటిని కురిపిస్తాము. ఆ నీటి ద్వారా అన్ని రకాల ఫలాలను వెలికి తీస్తాము. ఫలాలను వెలికి తీసిన విధంగా అదే రూపములో మేము మృతులను వారి సమాదుల నుండి జీవింపజేసి వెలికి తీస్తాము. ఓ ప్రజలారా అల్లాహ్ యొక్క శక్తి సామర్ధ్యాలను,అపూర్వమైన ఆయన పనితనమును ఆయన మృతులను జీవింప చేయటంలో సామర్ధ్యం కలవాడని మీరు గుర్తిస్తారని మేము ఈ విధంగా చేశాము.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• القرآن الكريم كتاب هداية فيه تفصيل ما تحتاج إليه البشرية، رحمة من الله وهداية لمن أقبل عليه بقلب صادق.
పవిత్ర ఖర్ఆన్ మానవాళికి ఏమి అవసరమో వివరించే మార్గదర్శక గ్రంధము. సత్య హృదయంతో దానిని అంగీకరించే వారికి అల్లాహ్ తరపు నుండి కారుణ్యము,మార్గదర్శకము.

• خلق الله السماوات والأرض في ستة أيام لحكمة أرادها سبحانه، ولو شاء لقال لها: كوني فكانت.
అల్లాహ్ తాను కోరుకున్న తత్వజ్ఞానము కొరకు భూమ్యాకాశాలను ఆరు దినములలో సృష్టించాడు. ఆయనే గనుక తలచుకుంటే వాటిని అయిపోమని ఆదేశించేవాడు అవి అయిపోయేవి.

• يتعين على المؤمنين دعاء الله تعالى بكل خشوع وتضرع حتى يستجيب لهم بفضله.
విశ్వాసపరులు అల్లాహ్ ను అన్ని రకాల వినయ వినమ్రతలతో ఆయన తన అనుగ్రహం ద్వారా వారి కొరకు స్వీకరించే వరకు ప్రార్ధించాలి.

• الفساد في الأرض بكل صوره وأشكاله منهيٌّ عنه.
అన్ని రకాల,అన్ని రూపాల్లో భూమిలో అల్లకల్లోలాలు రేకెత్తించటం వారించబడింది.

وَالْبَلَدُ الطَّیِّبُ یَخْرُجُ نَبَاتُهٗ بِاِذْنِ رَبِّهٖ ۚ— وَالَّذِیْ خَبُثَ لَا یَخْرُجُ اِلَّا نَكِدًا ؕ— كَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّشْكُرُوْنَ ۟۠
మంచి నేల అల్లాహ్ ఆదేశానుసారం తన మొక్కలను మంచిగా పరిపూర్ణంగా వెలికి తీస్తుంది. మరియు ఇదేవిధంగా విశ్వాసపరుడు హితోపదేశమును వింటాడు,దాని ద్వారా ప్రయోజనం చెందుతాడు. అది (హితోపదేశం) సత్కర్మను ఉత్పత్తి చేస్తుంది. ఉప్పు నేల (సాల్ట్ మార్ష్నేల) తన మొక్కలను వెలికి తీయదు. కాని ఎటువంటి మేలు లేని కష్టాలను తీసుకుని వస్తుంది. మరియు ఇదే విధంగా అవిశ్వాసపరుడు హితోపదేశం ద్వారా ప్రయోజనం చెందడు. అతని వద్ద ఎటువంటి పుణ్యకార్యం దాని ద్వారా ప్రయోజనం పొందటానికి ఉత్పత్తి అవ్వదు. ఈ అద్భుతమైన వైవిధ్యీకరణ లాగే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను తిరస్కరించకుండా వాటి విషయంలో కృతజ్ఞత తెలుపుకుని,తమ ప్రభువు పై విధేయత చూపే వారి కొరకు మేము సత్యాన్ని నిరూపించటానికి రుజువులను,వాదనలను విస్తరిస్తాము.
अरबी तफ़सीरें:
لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
నిశ్చయంగా మేము నూహ్ ను వారి జాతి వారి వైపునకు వారిని అల్లాహ్ ఏకత్వం వైపునకు,ఆయనను వదిలి ఇతరుల ఆరాధనను త్యజించటం వైపునకు పిలవటానికి ప్రవక్తగా పంపించాము. అయితే ఆయన వారితో ఇలా పలికారు : ఓ నాజాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన కాకుండా మీ కొరకు వేరొక సత్య ఆరాధ్య దైవం లేడు. ఓ నా జాతి వారా అవిశ్వాసంలో మీ మొండి వైఖరి స్థితిలో మీ పై ఒక మహా దినం నాటి శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
अरबी तफ़सीरें:
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰىكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఆయన జాతి నాయకులు,వారి పెద్దలు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : ఓ నూహ్ నిశ్చయంగా మేము మిమ్మల్ని సత్యం నుండి పూర్తి దూరంగా ఉన్నట్లు చూస్తున్నాము (భావిస్తున్నాను).
अरबी तफ़सीरें:
قَالَ یٰقَوْمِ لَیْسَ بِیْ ضَلٰلَةٌ وَّلٰكِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
నూహ్ తన జాతి పెద్దలతో ఇలా అన్నారు : మీరు అనుకుంటున్నట్లు నేను అపమార్గంలో లేను. నేను నా ప్రభువు తరపు నుండి సన్మార్గంపై ఉన్నాను. నేను నా ప్రభువు,మీ ప్రభువు,సర్వలోకాలందరి ప్రభువైన అల్లాహ్ తరపు నుండి మీ వద్దకు ప్రవక్తగా వచ్చాను.
अरबी तफ़सीरें:
اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَاَنْصَحُ لَكُمْ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
అల్లాహ్ మీ వద్దకు వహీ ద్వారా నాకు ఇచ్చి పంపించిన సందేశాలను మీకు చేరవేస్తున్నాను. నేను మీ కొరకు అల్లాహ్ యొక్క ఆదేశము పాటించటం,దానిపై ఏ పుణ్యము లభిస్తుందో మిమ్మల్ని ప్రోత్సహించటం ద్వారా,ఆయన వారించినవి,దాని పై ఏ శిక్ష లభిస్తుందో వాటికి పాల్పడటం నుండి మిమ్మల్ని భయపెట్టటం ద్వారా మేలును ఆశిస్తున్నాను. నాకు అల్లాహ్ సుబహానహు వతఆలా వద్ద నుండి నాకు ఆయన వహీ ద్వారా తెలిపినవి మీకు తెలియనివి విషయాలు నాకు తెలుసు.
अरबी तफ़सीरें:
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰی رَجُلٍ مِّنْكُمْ لِیُنْذِرَكُمْ وَلِتَتَّقُوْا وَلَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟
మీలో నుంచే మీకు తెలిసిన ఒక వ్యక్తి నోట మీ ప్రభువు తరపు నుండి ఒక దైవ వాణి,హితబోధన మీ వద్దకు రావటం మీ ఆశ్చర్యమును పెంచినదా ?. అతడు మీలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు అబద్దపరుడు కాడు. దారి తప్పిన వాడును కాడు,అతడు వేరే జాతికి చెందిన వాడును కాడు. ఒక వేళ మీరు అతనిని తిరస్కరిస్తే,అతనిపై మీరు అవిధేయత చూపితే అల్లాహ్ యొక్క శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టడం కొరకు మీ వద్దకు వచ్చాడు. మీరు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉండటం కొరకు మీ వద్దకు వచ్చాడు. ఒక వేళ మీరు అతనిని విశ్వసిస్తే మీరు కరుణించబడుతారని ఆశిస్తూ.
अरबी तफ़सीरें:
فَكَذَّبُوْهُ فَاَنْجَیْنٰهُ وَالَّذِیْنَ مَعَهٗ فِی الْفُلْكِ وَاَغْرَقْنَا الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا عَمِیْنَ ۟۠
అయితే అతని జాతి వారు అతనిని తిరస్కరించారు. అతనిపై విశ్వాసమును కనబరచలేదు. కాని తమ అవిశ్వాసంలో కొనసాగిపోయారు. అయితే అల్లాహ్ వారిని నాశనం చేయాలని అతడు శపించాడు. మేము ఆయనను,ఆయనతో పాటు నావలో ఉన్న విశ్వాసపరులను మునిగిపోకుండా రక్షించాము. మరియు మాఆయతులను తిరస్కరించి తమ తిరస్కారమును కొనసాగించిన వారిని వారిపై శిక్ష రూపంలో కురిసిన తుఫాను ద్వారా ముంచి మేము నాశనం చేసాము. నిశ్చయంగా వారి హృదయాలు సత్యం నుండి అంధులైపోయినవి.
अरबी तफ़सीरें:
وَاِلٰی عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟
ఆద్ జాతి వారి వద్దకు వారిలోంచి ఒక ప్రవక్తను మేము పంపాము. ఆయనే హూద్ అలైహిస్సలాం. ఆయన (తన జాతి వారిని ఉద్దేశించి) ఇలా అన్నారు : ఓ నా జాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. ఆయన శిక్ష నుండి మీరు సురక్షితంగా ఉండటం కొరకు ఆయన ఆదేశాలను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ మీరు ఆయనకు భయపడరా ?.
अरबी तफ़सीरें:
قَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰىكَ فِیْ سَفَاهَةٍ وَّاِنَّا لَنَظُنُّكَ مِنَ الْكٰذِبِیْنَ ۟
అతని జాతి వారిలోంచి అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను తిరస్కరించిన నాయకులు,పెద్దవారు ఇలా అన్నారు : ఓ హూద్ నీవు ఎప్పుడైతే మమ్మల్ని ఒకే అల్లాహ్ ఆరాధన చేయటం,విగ్రహారాధనను విడనాడటం వైపునకు పిలిచావో మేము నిన్ను బుద్ది లేమి తనంలో,తెలివి తక్కువ తనంలో చూస్తున్నాము. నీవు ప్రవక్తగా పంపించబడ్డావన్న నీ వాదనలో నీవు అబద్దం చెబుతున్నావని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము.
अरबी तफ़सीरें:
قَالَ یٰقَوْمِ لَیْسَ بِیْ سَفَاهَةٌ وَّلٰكِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
హూద్ అలైహిస్సలాం తన జాతి వారిని ఖండిస్తూ ఇలా అన్నారు : ఓ నా జాతి వారా నాకు తెలివి లేకుండా లేదు,బుద్దిలేమి లేదు. కాని నేను సర్వలోకాల ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్తను.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• الأرض الطيبة مثال للقلوب الطيبة حين ينزل عليها الوحي الذي هو مادة الحياة، وكما أن الغيث مادة الحياة، فإن القلوب الطيبة حين يجيئها الوحي، تقبله وتعلمه وتنبت بحسب طيب أصلها، وحسن عنصرها، والعكس.
మంచి సారవంతమైన నేల ఒక ఉదాహరణ, మంచి హృదయముల కొరకు వాటి పై జీవన ఆధారమైన వహీ (దైవ వాణి) వచ్చే వేళ, ఏ విధంగా నైతే వర్షం జీవన ఆధారమో ఆ విధంగా.ఎందుకంటే మంచి హృదయాలు వాటి వద్దకు దైవ వాణి వచ్చినప్పుడు దానిని అంగీకరిస్తాయి,దానిని తెలుసుకుంటాయి,వాటి మూలము మంచిగా ఉండే విధంగా పెరుగుతాయి. దానికి వ్యతిరేకమైతే విరుద్ధముగా.

• الأنبياء والمرسلون يشفقون على الخلق أعظم من شفقة آبائهم وأمهاتهم.
దైవప్రవక్తలు,సందేశహరులు మనుషులపై వారి తండ్రులకన్న,తల్లులకన్న ఎక్కువగా దయ చూపేవారై ఉంటారు.

• من سُنَّة الله إرسال كل رسول من قومه وبلسانهم؛ تأليفًا لقلوب الذين لم تفسد فطرتهم، وتيسيرًا على البشر.
ప్రతి ప్రవక్తను అతని జాతి వారిలోంచి.వారి భాషను తెలిసిన వాడిని వారిలోంచి స్వాభావిక పరంగా చెడ్డ వారు కాని వారి హృదయములను కలపటం కొరకు, మానవాళి పై సులభతరం చేయటం కొరకు పంపటం అల్లాహ్ సంప్రదాయం.

• من أعظم السفهاء من قابل الحق بالرد والإنكار، وتكبر عن الانقياد للعلماء والنصحاء، وانقاد قلبه وقالبه لكل شيطان مريد.
సత్యాన్ని నిరోధించటం,తిరస్కరించటం ద్వారా ఎదిరించిన వాడు,ధార్మిక పండితులను,ఉపదేశకులను అనుసరించటం నుండి గర్వాన్ని ప్రదర్శించిన వాడు,తన మనస్సును అనుసరించి దానిని ప్రతి అవిధేయుడైన షైతాను కొరకు మరల్చిన వాడు పెద్ద బుద్ది లేని వాడు.

اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَاَنَا لَكُمْ نَاصِحٌ اَمِیْنٌ ۟
అల్లాహ్ తన ఏకత్వం గురించి,తన ధర్మం గురించి మీకు చేరవేయమని నాకు ఆదేశించిన వాటిని నేను మీకు చేరవేస్తున్నాను. మరియు నేను మీ కొరకు చేరవేయమని నన్ను ఆదేశించిన వాటి విషయంలో ఉపదేశకుడిని,నీతిమంతుడిని. వాటిలో నేను పెంచను,తగ్గించను.
अरबी तफ़सीरें:
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰی رَجُلٍ مِّنْكُمْ لِیُنْذِرَكُمْ ؕ— وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْ بَعْدِ قَوْمِ نُوْحٍ وَّزَادَكُمْ فِی الْخَلْقِ بَصْۜطَةً ۚ— فَاذْكُرُوْۤا اٰلَآءَ اللّٰهِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
ఏమి దైవ దూతల వర్గంలో నుంచి కాకుండా మరియు జిన్నుల వర్గంలో నుండి కాకుండా మీ వర్గంలో నుండి ఒక వ్యక్తి నోట మీ ప్రభువు తరపు నుండి మిమ్మల్ని హెచ్చరించటానికి ఒక హితోపదేశం మీ వద్దకు రావటం మీ ఆశ్చర్యమును,అచ్చెరువును పెంచినదా ?. మీ కొరకు భూమిలో నివాసమేర్పరచినందుకు మరియు నూహ్ జాతి వారిని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన వినాశనమునకు గురి చేసిన పిదప వారి వారసులుగా మిమ్మల్ని నియమించినందుకు మీ ప్రభువు స్థుతులను పలకండి,ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు శరీరాల్లో అపార బలాధిక్యతను,పట్టుదల ప్రసాదించి మిమ్మల్ని ప్రత్యేకించినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు మీపై ఉన్న అల్లాహ్ విశాల అనుగ్రహాలను మీరు కోరుకుంటున్న దానిలో సాఫల్యం చెందుతారని,భయము నుండి బయటపడతారని ఆశిస్తూ మీరు గుర్తు చేసుకోండి.
अरबी तफ़सीरें:
قَالُوْۤا اَجِئْتَنَا لِنَعْبُدَ اللّٰهَ وَحْدَهٗ وَنَذَرَ مَا كَانَ یَعْبُدُ اٰبَآؤُنَا ۚ— فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఆయన జాతి వారు ఆయనతో ఇలా అన్నారు : ఓ హూద్ అల్లాహ్ ఆరాధన చేయటం గురించి,మా తాత ముత్తాతలు పూజిస్తున్న వాటిని మేము వదిలివేయాలని మమ్మల్ని ఆదేశించటం కొరకు నీవు మా వద్దకు వచ్చావా ? . నీవు ఏ శిక్ష గురించి మమ్మల్ని బెదిరిస్తున్నావో ఒక వేళ నీవు వాదిస్తున్న దానిలో సత్యవంతుడివే అయితే దానిని మా వద్దకు రప్పించు.
अरबी तफ़सीरें:
قَالَ قَدْ وَقَعَ عَلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ رِجْسٌ وَّغَضَبٌ ؕ— اَتُجَادِلُوْنَنِیْ فِیْۤ اَسْمَآءٍ سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّا نَزَّلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— فَانْتَظِرُوْۤا اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ ۟
హూద్ అలైహిస్సలాం ఇలా అంటూ వారిని ఖండించారు : మీరు అల్లాహ్ యొక్క శిక్షను,ఆయన ఆగ్రహమును అనివార్యము చేసుకున్నారు. అది మీపై తప్పక వాటిల్లుతుంది. మీరు,మీ తాతముత్తాతలు దేవుళ్ళుగా పేర్లు పెట్టుకున్న విగ్రహాల గురించి నాతో తగువులాడుతున్నారా ? వాటికి ఎటువంటి వాస్తవికత లేదు. దేవుళ్ళుగా మీరు పూజిస్తున్న వాటి గురించి మీరు వాదించటానికి అల్లాహ్ ఎటువంటి వాదనను దింపలేదు. మీ కొరకు ఏ శిక్ష గురించి తొందరగా రావాలని కోరుకున్నారో దాని గురించి నిరీక్షించండి. మరియు నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తాను. అది వాటిల్లుతుంది.
अरबी तफ़सीरें:
فَاَنْجَیْنٰهُ وَالَّذِیْنَ مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَمَا كَانُوْا مُؤْمِنِیْنَ ۟۠
అయితే మేము హూద్ ను ఆయనతో పాటు ఉన్న విశ్వాసపరులను మా కారుణ్యం ద్వారా రక్షించినాము. మా ఆయతులను (సూచనలను) తిరస్కరించిన వారిని వినాశనం ద్వారా మేము నిర్మూలించాము. వారు విశ్వసించరు. కాని వారు తిరస్కరిస్తారు. అయితే వారు శిక్షార్హులయ్యారు.
अरबी तफ़सीरें:
وَاِلٰی ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— قَدْ جَآءَتْكُمْ بَیِّنَةٌ مِّنْ رَّبِّكُمْ ؕ— هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَكُمْ اٰیَةً فَذَرُوْهَا تَاْكُلْ فِیْۤ اَرْضِ اللّٰهِ وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
మరియు మేము సమూద్ జాతి వారి వైపునకు వారి సోదరుడు సాలిహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము. ఆయన వారిని అల్లాహ్ ఏకత్వం వైపున,అతని ఆరాధన వైపునకు పిలిచారు. సాలిహ్ వారితో ఇలా అన్నారు : ఓ నా జాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆయన కాకుండా వేరే వారు ఆరాధనకు అర్హులు,ఆరాధ్య దైవాలు కారు. నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది సత్యం అవటంలో అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన సూచన మీ వద్దకు వచ్చినది. ఒక ఒంటె మాదిరిగా అది ఒక రాతి బండ నుండి వెలికి వస్తుంది. నీరు త్రాగటానికి దాని కొరకు ఒక సమయం ఉంటుంది. మరియు మీ కొరకు నీరు త్రాగటానికి ఒక నిర్దేశిత రోజు ఉంటుంది. దానిని అల్లాహ్ నేలలో తినటానికి వదిలి వేయండి. మీరు దానికి సరఫరా చేయవలసిన అవసరం లేదు. దానికి మీరు హాని తలపెట్టకండి. ఒక వేళ అదే జరిగితే దాన్ని బాధ పెట్టటం వలన మీ పై బాధాకరమైన శిక్ష వచ్చి చేరుతుంది.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• ينبغي التّحلّي بالصبر في الدعوة إلى الله تأسيًا بالأنبياء عليهم السلام.
అల్లాహ్ వైపు దావత్ కార్యంలో దైవ ప్రవక్తలను సల్లల్లాహు అలైహిముస్సలాం నమూనాగా తీసుకుని సహనాన్ని ఎంచుకోవటం మంచిది.

• من أولويات الدعوة إلى الله الدعوة إلى عبادة الله وحده لا شريك له، ورفض الإشراك به ونبذه.
అల్లాహ్ వైపున దావత్ యొక్క ప్రాధాన్యతల్లో ఒకటి ఏకైక ఎటువంటి సాటి లేని అల్లాహ్ ఆరాధన వైపునకు పిలవటం. మరియు ఆయనతో పాటు సాటి కల్పించటంను రద్దు పరచటం,దానిని విస్మరించటం.

• الاغترار بالقوة المادية والجسدية يصرف صاحبها عن الاستجابة لأوامر الله ونواهيه.
శారీరక బలం,అంగ బలం ద్వార మోసపోవటం అవి అల్లాహ్ ఆదేశాలను,ఆయన వారించిన వాటిని స్పందించకుండా దృష్టిని మరల్చుతాయి.

• النبي يكون من جنس قومه، لكنه من أشرفهم نسبًا، وأفضلهم حسبًا، وأكرمهم مَعْشرًا، وأرفعهم خُلُقًا.
సందేశహరుడు తన జాతి వారిలో నుంచే ఉంటాడు. కాని అతడు వారిలో వంశపరంగా ఉన్నతమైన వాడై,గొప్ప వాడై ఉంటాడు. సామాజిక పరంగా వారి కన్న గౌరవోన్నతుడై ఉంటాడు. గుణాల్లో వారి కన్న గొప్పవాడై ఉంటాడు.

• الأنبياء وورثتهم يقابلون السّفهاء بالحِلم، ويغضُّون عن قول السّوء بالصّفح والعفو والمغفرة.
దైవప్రవక్తలు,వారి వారసులు మూర్ఖులతో సహనం ద్వారా వ్యవహరిస్తారు. చెడు మాటలను క్షమాపణ,మన్నింపు,విమోచనము ద్వారా విస్మరిస్తారు.

وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْ بَعْدِ عَادٍ وَّبَوَّاَكُمْ فِی الْاَرْضِ تَتَّخِذُوْنَ مِنْ سُهُوْلِهَا قُصُوْرًا وَّتَنْحِتُوْنَ الْجِبَالَ بُیُوْتًا ۚ— فَاذْكُرُوْۤا اٰلَآءَ اللّٰهِ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟
ఆద్ జాతి వారికి మీరు వారసులుగా అయిన వేళ మీపై కలిగిన అల్లాహ్ అనుగ్రహమును గుర్తు చేసుకోండి. మరియు ఆయన మిమ్మల్ని భూమిలో దింపినాడు (నివాసం ఏర్పరచాడు) దాని ద్వారా మీరు ప్రయోజనం చెందుతున్నారు. మరియు మీరు కోరుకున్న వాటిని పొందుతున్నారు. ఇదంత ఆద్ జాతి వారు అవిశ్వాసం,తిరస్కరణలో వారి నిలకడ తరువాత వినాశనమునకు గురైన తరువాత అయ్యింది. భూ మైదానాల్లో మీరు భవనాలను నిర్మిస్తున్నారు. మీ కొరకు గృహాలను నిర్మించుకొనుటకు కొండలను తొలచి వేశారు. మీపై ఉన్న అనుగ్రహాలకు అల్లాహ్ ని కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి. భూమిలో అల్లకల్లోలాను సృష్టించే ప్రయత్నాలు మానుకోండి. ఇది అల్లాహ్ పై అవిశ్వాసమును,పాపములను విడనాడటం ద్వారా జరుగును.
अरबी तफ़सीरें:
قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لِلَّذِیْنَ اسْتُضْعِفُوْا لِمَنْ اٰمَنَ مِنْهُمْ اَتَعْلَمُوْنَ اَنَّ صٰلِحًا مُّرْسَلٌ مِّنْ رَّبِّهٖ ؕ— قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلَ بِهٖ مُؤْمِنُوْنَ ۟
అతని జాతి వారిలోంచి గర్వానికి లోనైన నాయకులు,పెద్దవారు అతని జాతి వారిలోంచి వారు బలహీనులుగా భావించే విశ్వాసపరులతో ఇలా అన్నారు : ఓ విశ్వాసపరులారా సాలిహ్ అల్లాహ్ తరుపునుండి పంపించబడిన ప్రవక్తనన్న విషయం నిజంగానే మీకు తెలుసా?. బలహీన వర్గమైన విశ్వాసపరులు వారికి ఇలా సమాధానమిచ్చారు : సాలిహ్ మా వద్దకు ఇచ్చి పంపించబడిన దానిని మేము నిజమని నమ్ముతున్నాము,దృవీకరిస్తున్నాము,విధేయత చూపుతున్నాము,ఆయన ధర్మ శాసనాలను ఆచరిస్తున్నాము.
अरबी तफ़सीरें:
قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا بِالَّذِیْۤ اٰمَنْتُمْ بِهٖ كٰفِرُوْنَ ۟
అతని జాతి వారిలోంచి గర్విష్టులు ఇలా అన్నారు : ఓ విశ్వాసపరులారా నిశ్చయంగా మేము మీరు విశ్వసిస్తున్న వాడిని తిరస్కరిస్తున్నాము.మేము అతనిని విశ్వసించమంటే విశ్వసించము,అతని ధర్మాన్ని ఆచరంచము.
अरबी तफ़सीरें:
فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ وَقَالُوْا یٰصٰلِحُ ائْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِیْنَ ۟
అయితే ఏ ఒంటెనైతే బాధపెట్టే ఉద్దేశంతో తాకవద్దని ఆయన వారించాడో అల్లాహ్ ఆదేశమును పాటించటం నుండి వారు తలబిరుసుతనం ప్రదర్శిస్తు చంపివేశారు. మరియు సాలిహ్ అలైహిస్సలాం వారిని దేని గురించి బెదిరించారో దానిని దూరంగా భావిస్తూ,ఎగతాళి చేస్తూ ఇలా పలికారు : ఓ సాలిహ్ నీవు నిజంగా అల్లాహ్ ప్రవక్తవైతే ఏ బాధాకరమైన శిక్ష గురించి మమ్మల్ని బెదిరించావో దానిని మా వద్దకు తీసుకుని రా.
अरबी तफ़सीरें:
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ ۟
అయితే అవిశ్వాసపరులు ఏ శిక్ష గురించి తొందర చేశారో అది వారి వద్దకు వచ్చింది. ఏవిధంగా అంటే తీవ్రమైన భూకంపం వారిని పట్టుకుంది. వారి ముఖాలు,మోకాళ్ళు నేలకు ఆనే విధంగా బోర్లా పడిపోయారు. వారిలోంచి ఎవరు కూడా వినాశనము నుండి బ్రతికి బయటపడలేదు.
अरबी तफ़सीरें:
فَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّیْ وَنَصَحْتُ لَكُمْ وَلٰكِنْ لَّا تُحِبُّوْنَ النّٰصِحِیْنَ ۟
సాలిహ్ అలైహిస్సలాం తన జాతి వారి స్వీకారము నుండి నిరాశులైన తరువాత వారి నుండి ముఖము త్రిప్పుకున్నారు. మరియు వారితో ఇలా అన్నారు : ఓ నా జాతి వారా అల్లాహ్ మీకు చేరవేయమని నాకు ఇచ్చిన ఆదేశాలను మీకు చేరవేశాను. మరియు మీ కొరకు ఆశిస్తూ,భయపడుతూ మిమ్మల్ని ఉపదేశించాను. కాని మీకు మేలును చూపించటానికి మిమ్మల్ని చెడు నుండి దూరంగా ఉంచటమును ఆశిస్తూ ఉపదేశించే వారిని మీరు ఇష్టపడటం లేదు.
अरबी तफ़सीरें:
وَلُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ اَحَدٍ مِّنَ الْعٰلَمِیْنَ ۟
మరియు లూతును ;అతడు తన జాతి వారిని అసహ్యించుకుని ఇలా పలికిన వేళను గుర్తు చేసుకోండి : ఏమి మీరు అసహ్యమైన,చెడ్డదైన చర్యకు పాల్పడుతున్నారా ? అది మగ వారి వద్దకు (లైంగిక కోరికలు తీర్చుకోవటం కొరకు) రావటం. మీరు సృష్టించిన ఈ చర్య మీ కన్న ముందు నుండి ఇంత వరకు ఎవరూ చేయలేదు.
अरबी तफ़सीरें:
اِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ مُّسْرِفُوْنَ ۟
నిశ్చయంగా మీరు కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించబడ్డ స్త్రీలను వదిలి మగవారి వద్దకు వస్తున్నారు. మీ ఈ చర్యలో మీరు మీ బుద్దిని కాని, దైవాదేశాలను కాని. స్వభావమును కాని అనుసరించ లేదు. కాని మీరు మానవ నియంత్రణ పరిమితి నుండి బయటకు రావటం ద్వారా,ఆరోగ్యకరమైన మనస్సులకు,ఉన్నతమైన ప్రవృత్తికి అవసరమైన దాని నుండి మీరు నిష్క్రమించటం ద్వారా మీరు అల్లాహ్ హద్దులను (పరిమితులను) మించిపోయారు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• الاستكبار يتولد غالبًا من كثرة المال والجاه، وقلة المال والجاه تحمل على الإيمان والتصديق والانقياد غالبًا.
ధనము,స్థానము నుండి ఎక్కువగా అహంకారము జన్మిస్తుంది. ధనము,స్థానము తక్కువగా ఉండటం విశ్వాసము,నమ్మకము,విధేయత చూపటంపై ఎక్కువగా ప్రేరేపిస్తుంది.

• جواز البناء الرفيع كالقصور ونحوها؛ لأن من آثار النعمة: البناء الحسن مع شكر المنعم.
భవనాలు వాటి లాంటి ఇతరత్రా ఎత్తైన నిర్మాణాలు చేయటం ధర్మసమ్మతమే. ఎందుకంటే అనుగ్రహించిన వారికి కృతజ్ఞత తెలుపుకోవటంతో పాటు మంచి నిర్మాణమును నిర్మించటం అనుగ్రహ సూచనల్లోంచిది.

• الغالب في دعوة الأنبياء أن يبادر الضعفاء والفقراء إلى الإصغاء لكلمة الحق التي جاؤوا بها، وأما السادة والزعماء فيتمردون ويستعلون عليها.
ఎక్కువగా ప్రవక్తల సందేశప్రచారం లో వారు బలహీనులను,పేదలను వారు తీసుకుని వచ్చిన సత్య వాక్యాన్ని శ్రద్ధతో వినటం వైపునకు పిలుస్తారు. సర్దారులు,నాయకుల విషయానికొస్తే వారు అవిధేయత చూపుతారు,దాని పై అహంకారమును ప్రదర్శిస్తారు.

• قد يعم عذاب الله المجتمع كله إذا كثر فيه الخَبَث، وعُدم فيه الإنكار.
సమాజంలో చెడు ఎక్కువై అందులో దాని విరోధము లేకుండా పోతే అల్లాహ్ యొక్క శిక్ష పూర్తి సమాజంపై వచ్చి పడుతుంది.

وَمَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْهُمْ مِّنْ قَرْیَتِكُمْ ۚ— اِنَّهُمْ اُنَاسٌ یَّتَطَهَّرُوْنَ ۟
ఆయన వారిపై ఏ అశ్లీల చర్యను అసహ్యించుకున్నారో ఆయన జాతి వారు దానికి పాల్పడుతూ సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధంగా పలుకుతూ ఖండించారు : మీరు లూత్ ను,ఆయన ఇంటి వారిని మీ ఊరి నుండి బహిష్కరించండి. నిశ్చయంగా వారు మన ఈ చర్య నుండి పరిశుద్ధులుగా చెప్పుకుంటున్నారు. వారు మన మధ్య ఉండటం సముచితం కాదు.
अरबी तफ़सीरें:
فَاَنْجَیْنٰهُ وَاَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ ۖؗ— كَانَتْ مِنَ الْغٰبِرِیْنَ ۟
అయితే మేము ఆయనను,ఆయన ఇంటి వారిని ఆ ఊరి నుండి దేనిపైనైతే శిక్ష వచ్చి పడబోతున్నదో రాత్రికి రాత్రే బయలుదేరమని ఆదేశించి రక్షించాము. కాని ఆయన భార్య ఆయన జాతి వారిలో ఉండి పోయే వారితో పాటు ఉండిపోయినది. వారికి సంభవించిన శిక్షే ఆమెకు సంభవించినది.
अरबी तफ़सीरें:
وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ؕ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِیْنَ ۟۠
మరియు మేము వారిపై భారీ వర్షాన్ని కురిపించాము ఏవిధంగానంటే వారిని మట్టి రాళ్ళతో కొట్టాము. మేము ఊరిని త్రిప్పి వేశాము. దాని పై భాగమును దాని క్రిందికి చేశాము. ఓ ప్రవక్తా అపరాదులైన లూత్ జాతి వారి పరిణామం ఏమయిందో మీరు యోచించండి. వాస్తవానికి వారి పరిణామం వినాశనము,శాస్వతమైన పరాభవము.
अरबी तफ़सीरें:
وَاِلٰی مَدْیَنَ اَخَاهُمْ شُعَیْبًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— قَدْ جَآءَتْكُمْ بَیِّنَةٌ مِّنْ رَّبِّكُمْ فَاَوْفُوا الْكَیْلَ وَالْمِیْزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تُفْسِدُوْا فِی الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟ۚ
మరియు మేము మద్యన్ జాతి వారి వైపునకు వారి సోదరుడు షుఐబ్ అలైహిస్సలాం ను ప్రవక్తగా పంపించాము. ఆయన వారితో ఇలా అన్నారు : ఓ నా జాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి,మీ కొరకు ఆయన తప్ప వేరే ఆరాధనకు అర్హత కలిగిన ఆరాధ్యదైవం లేడు. నా ప్రభువు వద్ద నుండి మీ వద్దకు నేను తీసుకుని వచ్చినది నిజము అనటానికి అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన ఆధారము,స్పష్టమైన వాదన మీ వద్దకు వచ్చినది. మీరు పరిపూర్ణమైన కొలతలు,పరిపూర్ణమైన తూకముల ద్వారా ప్రజల యొక్క హక్కులను చెల్లించండి. ప్రజల వ్యాపార వస్తువుల్లో లోపం చూపించి,అందులో అల్పమును చూపించి లేదా వాటిని కలిగిన వారిని మోసం చేసి తగ్గించకండి. ముందు నుంచే ప్రవక్తలను పంపించి భూమిలో సంస్కరణ జరిగిన తరువాత అవిశ్వాసము,పాపములకు పాల్పడి అందులో చెడును సృష్టించకండి. ఒకవేళ మీరు విశ్వాసపరులే ఐతే అల్లాహ్ వారించిన పాప కార్యముల నుండి జాగ్రత్త పడుతూ విడనాడి,అల్లాహ్ ఆదేశించినవి వేటిలో నైతే అల్లాహ్ సామిప్యమున్నదో వాటిని పాటించటం వలన ఈ ప్రస్తావించబడినవి మీ కొరకు మేలైనవి,ఎంతో లాభదాయకమైనవి.
अरबी तफ़सीरें:
وَلَا تَقْعُدُوْا بِكُلِّ صِرَاطٍ تُوْعِدُوْنَ وَتَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ مَنْ اٰمَنَ بِهٖ وَتَبْغُوْنَهَا عِوَجًا ۚ— وَاذْكُرُوْۤا اِذْ كُنْتُمْ قَلِیْلًا فَكَثَّرَكُمْ ۪— وَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِیْنَ ۟
ప్రజలు నడిచే మార్గాల్లో వారి సంపదను దోచుకోవటానికి (కాజేయటానికి),అల్లాహ్ ధర్మము మార్గమును పొందాలని ఆశించిన వారిని ఆల్లాహ్ ధర్మము నుండి ఆపటానికి అల్లాహ్ మార్గము వక్రంగా తయారై ప్రజలు దానిపై నడవటానికి వీలు కాకుండా ఉండటాన్ని ఆశిస్తు బెదిరించటానికి కూర్చోకండి. మరియు మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి. మీ సంఖ్య బలం తక్కువగా ఉండేది ఆయన మిమ్మల్ని అధికం చేశాడు. మీకన్నా ముందు భూమిలో అల్లకల్లోలాను సృష్టించే వారి పరిణామం ఏమయిందో ఆలోచించండి. నిశ్చయంగా వారి పరిణామం వినాశనము,అధ్వానము.
अरबी तफ़सीरें:
وَاِنْ كَانَ طَآىِٕفَةٌ مِّنْكُمْ اٰمَنُوْا بِالَّذِیْۤ اُرْسِلْتُ بِهٖ وَطَآىِٕفَةٌ لَّمْ یُؤْمِنُوْا فَاصْبِرُوْا حَتّٰی یَحْكُمَ اللّٰهُ بَیْنَنَا ۚ— وَهُوَ خَیْرُ الْحٰكِمِیْنَ ۟
ఒక వేళ మీలో నుంచి ఒక వర్గం నా ప్రభువు వద్ద నుండి నేను తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసిస్తే,ఇంకో వర్గం దానిని విశ్వసించకపోతే ఓ తిరస్కరించే వారా మీ మధ్య అల్లాహ్ ఏమి తీర్పు చెబుతాడో నిరీక్షించండి. ఆయన మంచిగా తీర్పు నిచ్చే వాడును,న్యాయపరంగా చేసే న్యాయమూర్తిను.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• اللواط فاحشة تدلُّ على انتكاس الفطرة، وناسب أن يكون عقابهم من جنس عملهم فنكس الله عليهم قُراهم.
స్వలింగ సంపర్కము అశ్లీల కార్యము అది స్వభావము తలక్రిందులు అవటం పై సూచిస్తుంది. వారి చర్యకు తగ్గట్టుగా వారి పరిణామం ఉండటం సముచితము. అందుకనే అల్లాహ్ వారి ఊర్లను వారిపై తలక్రిందులుగా చేశాడు.

• تقوم دعوة الأنبياء - ومنهم شعيب عليه السلام - على أصلين: تعظيم أمر الله: ويشمل الإقرار بالتوحيد وتصديق النبوة. والشفقة على خلق الله: ويشمل ترك البَخْس وترك الإفساد وكل أنواع الإيذاء.
ప్రవక్తల సందేశప్రచార కార్యం రెండు మూలాలపై ఆధారపడి ఉన్నది.వారిలోంచి షుఐబ్ అలైహిస్సలాం కూడాను. ఒకటి అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించటం.తౌహీదును రూఢీ పరచటం,దైవదౌత్యమును అంగీకరించటం అందులో వస్తాయి. రెండు అల్లాహ్ సృష్టితాలపై కనికరించటం,జాలి చూపించటం. అన్యాయమును వదిలి వేయటం,అల్లకల్లోలాను (ఫసాద్ ను) విడనాడటం,అన్నిరకాల బాధలు పెట్టటంను వదిలివేయటం ఇందులో వస్తాయి.

• الإفساد في الأرض بعد الإصلاح جُرْم اجتماعي في حق الإنسانية؛ لأن صلاح الأرض بالعقيدة والأخلاق فيه خير للجميع، وإفساد الأرض عدوان على الناس.
సంస్కరణల తరువాత భూమిలో అల్లకల్లోలాలు (అవినీతి) మాననవత్వము యొక్క హక్కులో సామాజిక నేరము. ఎందుకంటే భూమిలో విశ్వాసముల ద్వారా (అఖీదా ద్వారా),గుణాల ద్వారా (మంచి నడవడి ద్వారా) సంస్కరణ అందరికి మేలైనది. భూమిలో అల్లకల్లోలాలతో పాటు చెడును వ్యాపింప చేయటం మనుషులపై శతృత్వమే.

• من أعظم الذنوب وأكبرها وأشدها وأفحشها أخذُ ما لا يحقُّ أخذه شرعًا من الوظائف المالية بالقهر والجبر؛ فإنه غصب وظلم وعسف على الناس وإذاعة للمنكر وعمل به ودوام عليه وإقرار له.
ఆర్ధిక విధులను తీసుకోవటం సముచితం కాని వాటిని బలవంతముగా తీసుకోవటం మహా పాపాల్లోంచిది,పెద్ద పాపాల్లోంచిది,తీవ్రమైనది,అతి చెడ్డదైనది. ఎందుకంటే అది మనుషులను బలవంతం చేయటం,దౌర్జన్యం చేయటం,అన్యాయం చేయటం. మరియు చెడును ప్రసారం చేయటం,దానిని ఆచరించటం,దానిని శాస్వతంగా చేయటం,దానిని అంగీకరించటం.

قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لَنُخْرِجَنَّكَ یٰشُعَیْبُ وَالَّذِیْنَ اٰمَنُوْا مَعَكَ مِنْ قَرْیَتِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ— قَالَ اَوَلَوْ كُنَّا كٰرِهِیْنَ ۟ۚ
షుఐబ్ జాతి వారిలోంచి అహంకారానికి లోనైన పెద్దవారు,నాయకులు షుఐబ్ అలైహిస్సలాంతో ఇలా అన్నారు : ఓ షుఐబ్ మేము నిన్ను,నీతోపాటు ఉన్న నిన్ను విశ్వసించిన వారిని మా ఊరి నుండి బహిష్కరిస్తాము. కాని నీవు మా ధర్మం వైపునకు మరలితే తప్ప. షుఐబ్ ఆలోచిస్తూ,ఆశ్ఛర్యపోతూ వారితో ఇలా అన్నారు : ఏమి మేము మీ ధర్మాన్ని,మతాన్ని మా జ్ఞానము ద్వారా దానిని అసత్యం అని తెలుసుకుని అయిష్టత చూపుతూ అనుసరిస్తామా ?.
अरबी तफ़सीरें:
قَدِ افْتَرَیْنَا عَلَی اللّٰهِ كَذِبًا اِنْ عُدْنَا فِیْ مِلَّتِكُمْ بَعْدَ اِذْ نَجّٰىنَا اللّٰهُ مِنْهَا ؕ— وَمَا یَكُوْنُ لَنَاۤ اَنْ نَّعُوْدَ فِیْهَاۤ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ رَبُّنَا ؕ— وَسِعَ رَبُّنَا كُلَّ شَیْءٍ عِلْمًا ؕ— عَلَی اللّٰهِ تَوَكَّلْنَا ؕ— رَبَّنَا افْتَحْ بَیْنَنَا وَبَیْنَ قَوْمِنَا بِالْحَقِّ وَاَنْتَ خَیْرُ الْفٰتِحِیْنَ ۟
మీరు ఉన్న అవిశ్వాసము,షిర్కు నుండి అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మమ్మల్ని రక్షించిన తరువాత కూడ మేము దానిని విశ్వసిస్తే అల్లాహ్ పై మేము అబద్దమును కల్పించిన వారమవుతాము. మరియు మేము మీ అసత్య ధర్మము వైపునకు మేము మరలటం మా కొరకు సముచితం కాదు,సరి కాదు. కాని మా ప్రభువైన అల్లాహ్ తలచుకుంటే తప్ప. అందరు ఆయన సుబహానహు తఆలా చిత్తమునకు లోబడి ఉండాలి. మా ప్రభువు ప్రతి వస్తువును జ్ఞానము ద్వారా చుట్టుముట్టి ఉన్నాడు. ఆయనపై అందులో నుంచి ఏ వస్తువు గోప్యంగా లేదు. మేము సన్మార్గముపై నిలకడగా ఉండటంను ప్రసాదించటం కొరకు,నరక మార్గము నుండి మమ్మల్ని రక్షించటం కొరకు మేము అల్లాహ్ ఒక్కడిపై నమ్మకమును కలిగి ఉన్నాము. ఓ మా ప్రభువా నీవు మా మధ్యన,మా అవిశ్వాస జాతి వారి మధ్యన న్యాయంగా తీర్పునివ్వు. నీవు హింసకు గురైన హక్కుదారునికి వ్యతిరేకుడైన దుర్మార్గుడికి విరుద్ధంగా సహాయం చేయి. ఓ మా ప్రభువా నీవే అందరిలోకెల్ల అత్యుత్తమంగా తీర్పునిచ్చేవాడివి.
अरबी तफ़सीरें:
وَقَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ لَىِٕنِ اتَّبَعْتُمْ شُعَیْبًا اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ ۟
మరియు షుఐబ్ నుండి హెచ్చరిస్తూ తౌహీద్ దావత్ ను తిరస్కరించిన ఆయన జాతి వారిలోంచి అవిశ్వాసపరులైన పెద్దవారు,సర్దారులు ఇలా అన్నారు : ఓ మా జాతి వారా ఒక వేళ మీరు షుఐబ్ ధర్మంలోకి వెళ్ళి మీ ధర్మాన్ని,మీ తాతముత్తాతల ధర్మాన్ని వదిలేస్తే నిశ్చయంగా మీరు నాశనమైపోతారు.
अरबी तफ़सीरें:
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ ۟
వారిని తీవ్రమైన భూకంపం కబళించింది. వారు తమ ఇళ్ళలోనే వినాశనము అయినట్లు,తమ ముఖములపై,తమ మోకాళ్ళపై బోర్లాపడిపోయినట్లు తమ ఇంటిలోనే చనిపోయినట్లు అయిపోయారు.
अरबी तफ़सीरें:
الَّذِیْنَ كَذَّبُوْا شُعَیْبًا كَاَنْ لَّمْ یَغْنَوْا فِیْهَا ۛۚ— اَلَّذِیْنَ كَذَّبُوْا شُعَیْبًا كَانُوْا هُمُ الْخٰسِرِیْنَ ۟
షుఐబ్ ను తిరస్కరించిన వారందరు నాశనమైపోయారు. వారందరు తమ ఇళ్ళలో నివాసము లేనట్లు,వాటి ద్వారా ప్రయోజనం చెందలేదన్నట్లు అయిపోయారు. షుఐబ్ ను తిరస్కరించిన వారే నష్టాన్ని చవిచూసారు. ఎందుకంటే వారు స్వయంగా నష్టాన్ని చవిచూసారు,వారు అధికారమును పొందలేదు. ఈ తిరస్కారులైన అవిశ్వాసపరులందరు పేర్కొన్నట్లు ఆయన జాతి వారిలోంచి విశ్వాసపరులు నష్టాన్ని చవిచూడలేదు.
अरबी तफ़सीरें:
فَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَنَصَحْتُ لَكُمْ ۚ— فَكَیْفَ اٰسٰی عَلٰی قَوْمٍ كٰفِرِیْنَ ۟۠
వారందరు వినాశనమై పోయినప్పుడు వారి ప్రవక్త అయిన షుఐబ్ అలైహిస్సలాం వారి నుండి ముఖము త్రిప్పుకున్నారు,వారిని ఉద్దేశించి ఇలాపలికారు : ఓ నా జాతి వారా నా ప్రభువు నన్ను మిమ్మల్ని చేరవేయమని ఆదేశించిన వాటన్నింటిని మీకు చేరవేశాను. మరియు నేను మిమ్మల్ని ఉపదేశించాను (హితోపదేశం చేసాను). మీరు నా హితోపదేశాన్ని స్వీకరించలేదు. మీరు నా నిర్దేశాలను అనుసరించలేదు. అలాంటప్పుడు అల్లాహ్ ను అవిశ్వసించే జాతి,తమ అవిశ్వాసం పై మొండి వైఖరిని చూపే వారిపై నేను ఎలా దుఃఖించగలను?.
अरबी तफ़सीरें:
وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْیَةٍ مِّنْ نَّبِیٍّ اِلَّاۤ اَخَذْنَاۤ اَهْلَهَا بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ یَضَّرَّعُوْنَ ۟
నగరముల్లోంచి ఏ నగరంలో నైన అల్లాహ్ ప్రవక్తల్లోంచి ఏ ప్రవక్తను మేము పంపినా అక్కడి వాసులు తిరస్కరించారు,అవిశ్వసించారు. కాని మేము వారు అల్లాహ్ కు విధేయులై వారు ఉన్న అవిశ్వాసము,అహంకారమును వదిలి వేస్తారని ఆశిస్తూ వారిని కష్టాలకు,పేదరికానికి,రోగాలకు గురి చేసి పట్టుకున్నాము. తిరస్కారులైన జాతుల్లో అల్లాహ్ సంప్రదాయమును ప్రస్తావించటం ద్వారా ఖురైష్ జాతి వారి కొరకు,అవిశ్వాసమును కనబరచి తిరస్కరించే వారందరికి ఇది ఒక హెచ్చరిక.
अरबी तफ़सीरें:
ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّیِّئَةِ الْحَسَنَةَ حَتّٰی عَفَوْا وَّقَالُوْا قَدْ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَالسَّرَّآءُ فَاَخَذْنٰهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟
ఆ పిదప మేము వారిని కష్టాలకు,రోగాలకు గురి చేసి శిక్షించిన తరువాత మేలుకు,మంచి స్థితికి,శాంతికి గురి చేసి మార్చి వేశాము. తుదకు వారి సంఖ్యా బలం పెరిగింది,వారి సంపద పెరిగింది. ఆ తరువాత వారు ఇలా అన్నారు : చెడు మరియు మంచి మనకు ఏదైతే సంభవించిందో అది ముందు మన పూర్వికులకు సంభవించిన స్థిరమైన అలవాటే. వారికి సంభవించిన శిక్ష ఉద్దేశము గుణపాఠము అని,వారికి కలిగిన అనుగ్రహాలు నెమ్మది నెమ్మదిగా వారిని (శిక్షకు) దగ్గర చేసే ఉద్దేశంతో అన్న విషయాన్ని వారు గుర్తించ లేదు. మేము వారిని అకస్మాత్తుగా శిక్ష ద్వారా పట్టుకున్నాము. వారు శిక్షను గ్రహించలేక పోయారు,దానికి వారు సిద్ధము కాలేదు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• من مظاهر إكرام الله لعباده الصالحين أنه فتح لهم أبواب العلم ببيان الحق من الباطل، وبنجاة المؤمنين، وعقاب الكافرين.
నీతిమంతులైన అల్లాహ్ దాసుల కొరకు ఆయన ప్రసాదించిన గౌరవ మర్యాదల రూపాల్లోంచి ఆయన అసత్యము నుండి సత్యమును వివరించటం ద్వారా,విశ్వాసపరులకు విముక్తి,అవిశ్వాసపరులను శిక్షంచటం ద్వారా వారి కొరకు జ్ఞానము యొక్క ద్వారాలను తెరచి వేశాడు.

• من سُنَّة الله في عباده الإمهال؛ لكي يتعظوا بالأحداث، ويُقْلِعوا عما هم عليه من معاص وموبقات.
అల్లాహ్ యొక్క దాసులు సంఘటనల ద్వారా హితోపదేశం గ్రహించటానికి,వారి వలన జరిగిన పాపాలు,అవిధేయ కార్యాలను వారు విడనాడటం కొరకు అల్లాహ్ వారికి గడువు ఇవ్వటం అల్లాహ్ సంప్రదాయం.

• الابتلاء بالشدة قد يصبر عليه الكثيرون، ويحتمل مشقاته الكثيرون، أما الابتلاء بالرخاء فالذين يصبرون عليه قليلون.
కష్టము ద్వారా పరీక్ష లో సహనం చూపేవారు చాలా మంది ఉంటారు,వాటి బాధలను భరించేవారు చాలా మంది ఉంటారు. అయితే సుఖము ద్వారా పరీక్షలో సహనం చూపేవారు చాలా తక్కువ మంది ఉంటారు.

وَلَوْ اَنَّ اَهْلَ الْقُرٰۤی اٰمَنُوْا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَیْهِمْ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ وَلٰكِنْ كَذَّبُوْا فَاَخَذْنٰهُمْ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟
మేము ప్రవక్తలను పంపించిన ఈ బస్తీల వారు వారి వద్దకు వారి ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని స్వీకరించి,పాపములను,అవిధేయ కార్యాలను విడనాడి తమ ప్రభువు పట్ల భయభీతి కలిగి ఉండి,ఆయన ఆదేశాలను పాటిస్తూ ఉంటే మేము వారిపై అన్ని వైపుల నుండి శుభాల ద్వారాలను తెరిచివేసేవారము. కాని వారు స్వీకరించనూలేదు,భయభీతి కలిగి ఉండలేదు. అంతే కాక వారి వద్దకు వారి ప్రవక్తలు తీసుకుని వచ్చిన దానిని తిరస్కరించారు. వారు చేసుకున్న పాపాలు,దుష్కర్మల వలన అకస్మాత్తుగా వారిని మేము శిక్ష ద్వారా పట్టుకున్నాము.
अरबी तफ़सीरें:
اَفَاَمِنَ اَهْلُ الْقُرٰۤی اَنْ یَّاْتِیَهُمْ بَاْسُنَا بَیَاتًا وَّهُمْ نَآىِٕمُوْنَ ۟ؕ
అయితే తిరస్కారులైన ఈ బస్తీలవారు సుఖశాంతుల్లో మునిగి ఉండి నిదురపోతుండగా రాత్రిపూట వారి వద్దకు మా శిక్ష రావటం నుండి నిర్భయంగా ఉన్నారా ?.
अरबी तफ़सीरें:
اَوَاَمِنَ اَهْلُ الْقُرٰۤی اَنْ یَّاْتِیَهُمْ بَاْسُنَا ضُحًی وَّهُمْ یَلْعَبُوْنَ ۟
లేదా వారు తమ ప్రాపంచిక కార్యాల వలన నిమగ్నమై ఉండటం చేత అశ్రద్దులై ఉన్న స్థితిలో పగటి మొదటి వేళలో మా శిక్ష వారి వద్దకు రావటం గురించి నిర్భయంగా ఉన్నారా ?.
अरबी तफ़सीरें:
اَفَاَمِنُوْا مَكْرَ اللّٰهِ ۚ— فَلَا یَاْمَنُ مَكْرَ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْخٰسِرُوْنَ ۟۠
మీరు దాని వైపున చూడండి అల్లాహ్ ఏ గడువునైతే వారికి ప్రసాదించి దాని ద్వారా వారికి బలాన్ని,ఆహారములో విశాలము (బర్కత్) ను ప్రసాదించి వారిని నెమ్మది నెమ్మదిగా (శిక్ష వైపునకు) తీసుకుని వెళ్ళటంకొరకు. ఏమీ ఈ బస్తీల వారిలోంచి తిరస్కారులైన వీరందరు అల్లాహ్ వ్యూహం నుండి,ఆయన రహస్య వ్యూహాల నుండి నిర్భయులైపోయారా ?. అల్లాహ్ వ్యూహం నుండి వినాశనమునకు గురయ్యే వారే నిర్భయులవుతారు. అనుగ్రహించబడిన వారు ఆయన వ్యూహం నుండి భయపడుతుంటారు. దాని ద్వారా ఆయన వారికి ప్రసాదించిన వాటి వలన వారు మోసపోరు. వారు మాత్రం తమపై ఆయన ఉపకారంగా భావిస్తారు. ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటారు.
अरबी तफ़सीरें:
اَوَلَمْ یَهْدِ لِلَّذِیْنَ یَرِثُوْنَ الْاَرْضَ مِنْ بَعْدِ اَهْلِهَاۤ اَنْ لَّوْ نَشَآءُ اَصَبْنٰهُمْ بِذُنُوْبِهِمْ ۚ— وَنَطْبَعُ عَلٰی قُلُوْبِهِمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟
మరియు తమ పూర్వ జాతులైన వారు తమ పాపముల వలన వినాశనమునకు గురి అయిన తరువాత భూమిలో ప్రతినిధులైన వారి కొరకు తేటతెల్లం కాలేదా ?. ఆ పిదప వారి పైకి సంభవించిన దాని వలన వారు గుణపాఠం నేర్చుకోలేదు. కాని వారు వారి కార్యాలనే చేశారు. అల్లాహ్ ఒకవేళ తన సంప్రదాయం ప్రకారం వారికి వారి పాపాల వలన శిక్షించదలచుకుంటే వారిని దానికి తప్పకుండా గురి చేస్తాడు అన్న విషయం వారికి తేటతెల్లం కాలేదా (అవగతం కాలేదా)?. మరియు వారి హృదయాలపై సీలు వేస్తాడు. వారు హితోపదేశం ద్వారా హితోపదేశం గ్రహించరు.వారికి హితోపదేశం ప్రయోజనం చేకూర్చదు.
अरबी तफ़सीरें:
تِلْكَ الْقُرٰی نَقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآىِٕهَا ۚ— وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ— فَمَا كَانُوْا لِیُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا مِنْ قَبْلُ ؕ— كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰی قُلُوْبِ الْكٰفِرِیْنَ ۟
వారందరు గతించిన బస్తీలవారైన నూహ్,హూద్,సాలిహ్,లూత్,షుఐబ్ జాతుల బస్తీలు. ఓ ప్రవక్తా మేము మీకు వారు దేనిపైనైతే ఉన్నారో తిరస్కారము,వ్యతిరేకత గురించి,దాని వలన వారిపై కురిసిన వినాశనమును గురించి చదివి వినిపిస్తాము. మీకు వారి సమాచారమిస్తాము అది గుణపాఠం నేర్చుకోదలచిన వారికి గుణపాఠం అవ్వటానికి,హితబోధన గ్రహించదలచిన వారికి హితబోధ అవటానికి. నిశ్చయంగా ఈ బస్తీలవారి వద్దకు వారి ప్రవక్తలు తాము నీతి మంతులు అనటానికి స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. వారు దానిని తిరస్కరిస్తారని అల్లాహ్ ముందస్తు జ్ఞానంలో ఉండటం వలన వారు ప్రవక్తలు వచ్చినప్పుడు విశ్వసించే వారు కాదు. తమ ప్రవక్తలను తిరస్కరించే ఈ బస్తీలవారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినట్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించేవారి హృదయాలపై అల్లాహ్ సీలు వేస్తాడు. వారు విశ్వాసము కొరకు మార్గమును పొందలేరు.
अरबी तफ़सीरें:
وَمَا وَجَدْنَا لِاَكْثَرِهِمْ مِّنْ عَهْدٍ ۚ— وَاِنْ وَّجَدْنَاۤ اَكْثَرَهُمْ لَفٰسِقِیْنَ ۟
ప్రవక్తలు పంపించబడిన జాతులవారిని చాలా మందిని అల్లాహ్ ఆదేశించి వాటిని పూర్తి చేసినట్లు,పాటించినట్లు మేము పొందలేదు. వారు ఆయన ఆదేశాలను అనుసరించినట్లు మేము పొందలేదు. మేము వారిలో చాలా మందిని అల్లాహ్ విధేయత నుండి తొలగి పోయినట్లు మాత్రం పొందాము.
अरबी तफ़सीरें:
ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُّوْسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَظَلَمُوْا بِهَا ۚ— فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِیْنَ ۟
మరియు మేము ఈ ప్రవక్తలందరి తరువాత మూసా అలైహిస్సలాంను ఆయన నిజాయితిని సూచించే మా వాదనలను,స్పష్టమైన ఆధారాలను ఇచ్చి ఫిర్ఔన్,అతని జాతి వారి వద్దకు పంపాము. అయితే వారు ఆ సూచనలను తిరస్కరించటం,వాటిపట్ల అవిశ్వాసమును చూపటం తప్ప ఇంకేమి చేయలేక పోయారు. అల్లాహ్ వారిని ముంచి వినాశనమునకు గురి చేశాడు. ఇహపరలోకాల్లో వారి వెనుక శాపమును అంటగట్టాడు.
अरबी तफ़सीरें:
وَقَالَ مُوْسٰی یٰفِرْعَوْنُ اِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
అల్లాహ్ మూసా అలైహిస్సలాంను ఫిర్ఔన్ వద్దకు పంపించినప్పుడు అతనితో ఇలా అన్నారు : ఓ ఫిర్ ఔన్ నిశ్చయంగా నేను సమస్త సృష్టిరాసుల సృష్టికర్త,వారి యజమాని,వారి కార్యనిర్వాహకుడి వద్ద నుండి ప్రవక్తగా పంపించబడ్డాను.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• الإيمان والعمل الصالح سبب لإفاضة الخيرات والبركات من السماء والأرض على الأمة.
విశ్వాసము,సత్కార్యములు ఆకాశము,భూమి నుండి ఉమ్మత్ పై శుభాలు,మేళ్ళు కురవటానికి కారణమవుతాయి.

• الصلة وثيقة بين سعة الرزق والتقوى، وإنْ أنعم الله على الكافرين فإن هذا استدراج لهم ومكر بهم.
భంధుత్వము,జీవనోపాధిలో సమృద్ది,దైవ భీతికి మధ్య సంభంధమును కలుపును. ఒకవేళ అల్లాహ్ అవిశ్వాసపరులకు అనుగ్రహిస్తే నిశ్చయంగా అది వారిని నెమ్మది నెమ్మదిగా (శిక్ష వైపునకు) తీసుకుని వెళ్ళటం,వారి పట్ల ఒక వ్యూహం.

• على العبد ألا يأمن من عذاب الله المفاجئ الذي قد يأتي في أية ساعة من ليل أو نهار.
దాసుడు అకస్మాత్తుగా వచ్చే అల్లాహ్ శిక్ష నుండి నిర్భయంగా ఉండకూడదు. అది రాత్రి లేదా పగలు యొక్క ఏ ఘడియలోనైన వస్తుంది.

• يقص القرآن أخبار الأمم السابقة من أجل تثبيت المؤمنين وتحذير الكافرين.
ఖుర్ఆన్ పూర్వ జాతుల సమాచారములను విశ్వాసపరులను దృడపరచటాని,అవిశ్వాసపరులను హెచ్చరించటానికి తెలుపుతుంది.

حَقِیْقٌ عَلٰۤی اَنْ لَّاۤ اَقُوْلَ عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ— قَدْ جِئْتُكُمْ بِبَیِّنَةٍ مِّنْ رَّبِّكُمْ فَاَرْسِلْ مَعِیَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : నేను ఆయన (అల్లాహ్) తరపు నుండి ప్రవక్త అవటం వలన నేను ఆయన పేరుతో సత్యాన్ని మాత్రమే పలకటానికి అర్హుడిని. నిశ్చయంగా నేను మీ వద్దకు స్పష్టమైన ఒక వాదనను తీసుకుని వచ్చాను. అది నేను సత్యవంతుడిని అనటానికి,నా ప్రభువు తరపు నుండి మీ వద్దకు పంపించబడ్డ ప్రవక్తను అనటాన్ని దృవీకరిస్తుంది. నీవు ఇస్రాయీలు సంతతివారిని బంధీ ,ఆదీనం నుండి విముక్తి కల్పించి నాతోపాటు పంపించు.
अरबी तफ़सीरें:
قَالَ اِنْ كُنْتَ جِئْتَ بِاٰیَةٍ فَاْتِ بِهَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఫిర్ఔన్ మూసాతో ఇలా పలికాడు : ఒకవేళ నీవు వాదిస్తున్నట్లు ఏదైన సూచనను (మహిమను) తెచ్చి ఉంటే, నీవు నీ వాదనలో సత్యవంతుడివే నయితే దానిని ప్రదర్శించు.
अरबी तफ़सीरें:
فَاَلْقٰی عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌ ۟ۚۖ
అయితే మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అది దానిని చూసేవారి కొరకు పెద్ద సర్పముగా మారిపోయినది.
अरबी तफ़सीरें:
وَّنَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۟۠
మరియు ఆయన తన చొక్కా తెరిచిన భాగము వద్ద నుండి తన హృదయము దగ్గర నుండి లేదా తన సంక క్రింది నుండి తన చేతిని వెలికి తీశారు (బయటకు ప్రదర్శించాడు). అది బొల్లి రోగం లేకుండా తెల్లగా వెలితికి వచ్చినది. దాని అధిక తెల్లదనం వలన చూసేవారికి మిణుకు మిణుకు అనిపించసాగింది.
अरबी तफ़सीरें:
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِیْمٌ ۟ۙ
మరియు పెద్దవారు,నాయకులు మూసా చేతికర్రను సర్పముగా మారటంను,ఆయన చేయి ఎటువంటి బొల్లి రోగం లేకుండా తెల్లగా మారిపోవటమును చూసి "మూసా మంత్రజాలము గురించి బలమైన జ్ఞానం కల మంత్రజాలకుడు" అన్నారు.
अरबी तफ़सीरें:
یُّرِیْدُ اَنْ یُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ ۚ— فَمَاذَا تَاْمُرُوْنَ ۟
అతను చేస్తున్నది మిమ్మల్ని మీ ఈ నేల మిసర్ నుండి వెళ్ళగొట్టే ఉద్దేశముతోనే. ఆ తరువాత ఫిర్ఔన్ మూసా విషయంలో వారితో సలహా కోరుతూ "అతని విషయంలో మీరు నాకు ఏమి సలహా ఇస్తారు" ? అన్నాడు.
अरबी तफ़सीरें:
قَالُوْۤا اَرْجِهْ وَاَخَاهُ وَاَرْسِلْ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۙ
వారు ఫిర్ ఔన్ తో ఇలా పలికారు : నీవు మూసాను,అతని సోదరుడు హారూన్ ను కొంత గడువునివ్వు. మరియు మిసర్ పట్టణాల్లో మంత్రజాలకులను సమీకరించే వారిని పంపించు.
अरबी तफ़सीरें:
یَاْتُوْكَ بِكُلِّ سٰحِرٍ عَلِیْمٍ ۟
పట్టణాల నుండి మంత్రజాలకులను సమీకరించటానికి నీవు పంపించిన వారు మంత్రజాలంలో నైపుణ్యత కలవారిని,దానిని చేయటంలో బలమైన వారిని నీ వద్దకు తీసుకుని వస్తారు.
अरबी तफ़सीरें:
وَجَآءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوْۤا اِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ ۟
అయితే ఫిర్ఔన్ మాంత్రజాలకులను సేకరించే వారిని పంపించాడు,మంత్రజాలకులు ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు ఒకవేళ వారు తమ మంత్రజాలము వలన మూసాను ఓడిస్తే,అతనిపై వారు విజయం సాధిస్తే వారి కొరకు ఏమైన పారితోషికం ఉన్నదా ? అని అతనిని అడిగారు.
अरबी तफ़सीरें:
قَالَ نَعَمْ وَاِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِیْنَ ۟
ఫిర్ఔన్ తన మాట ద్వారా వారికి సమాధానమిచ్చాడు : అవును నిశ్చయంగా మీ కొరకు ప్రతిఫలము,పారితోషికం ఉన్నది. మరియు మీరు హోదాల ద్వారా సామిప్యాన్ని పొందేవారిలోంచి అవుతారు.
अरबी तफ़सीरें:
قَالُوْا یٰمُوْسٰۤی اِمَّاۤ اَنْ تُلْقِیَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ نَحْنُ الْمُلْقِیْنَ ۟
మంత్రజాలకులు మూసాపై గెలుస్తామన్న ధీమాతో గర్వము,అహంకారముతో ఇలా అన్నారు : ఓ మూసా దేనినైతే మీరు వేయదలుచుకున్నారో దానిని వేసి మీరు మొదలు పెట్టదలచుకున్న దానిని ఎంచుకోండి లేదా మేము దాన్ని మొదలు పెడుతాము.
अरबी तफ़सीरें:
قَالَ اَلْقُوْا ۚ— فَلَمَّاۤ اَلْقَوْا سَحَرُوْۤا اَعْیُنَ النَّاسِ وَاسْتَرْهَبُوْهُمْ وَجَآءُوْ بِسِحْرٍ عَظِیْمٍ ۟
మూసా వారిని పట్టించుకోకుండా తన కొరకు తన ప్రభువు సహాయము పై నమ్మకముతో వారికి ఇలా సమాధానమిచ్చారు : మీరు మీ త్రాళ్ళను,మీ చేతి కర్రలను విసరండి. వారు వాటిని విసిరినప్పుడు ప్రజల కళ్ళను సరిగా గుర్తించటం నుండి మరల్చి కనికట్టు చేశారు. మరియు వారిని భయభ్రాంతులకు లోను చేశారు. చూసేవారి కళ్ళకు పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు.
अरबी तफ़सीरें:
وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنْ اَلْقِ عَصَاكَ ۚ— فَاِذَا هِیَ تَلْقَفُ مَا یَاْفِكُوْنَ ۟ۚ
మరియు అల్లాహ్ తన ప్రవక్త అయిన,తాను మాట్లాడిన వ్యక్తి అయిన మూసా అలైహిస్సలాంతో ఇలా అన్నాడు : ఓ మూసా మీరు మీ చేతి కర్రను విసరండి. ఆయన దానిని విసిరారు. చేతి కర్ర పెద్ద సర్పంగా మారి వారి త్రాళ్ళను,వారి చేతికర్రలను వేటినైతే వారు వాస్తవ రూపాల నుంచి మార్చి,ప్రజలు వాటిని సర్పాలు పరుగెడుతున్నట్లు భావించేటట్లు చేసి ఉపయోగించారో వాటిని మ్రింగ సాగింది.
अरबी तफ़सीरें:
فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟ۚ
ఈ విధంగా సత్యం బహిర్గతమైనది,మూసా తీసుకుని వచ్చిన నిజాయితి స్పష్టమైనది. మరియు మంత్రజాలకులు చేసిన మంత్రజాలము అసత్యమని స్పష్టమైనది.
अरबी तफ़सीरें:
فَغُلِبُوْا هُنَالِكَ وَانْقَلَبُوْا صٰغِرِیْنَ ۟ۚ
అయితే వారు ఓడిపోయారు,పరాభవమునకు లోనైనారు. ఆ సన్నివేశంలో మూసా వారిపై జయించారు,వారు ఓడిపోయి పరాభవులై వెనుతిరిగారు.
अरबी तफ़सीरें:
وَاُلْقِیَ السَّحَرَةُ سٰجِدِیْنَ ۟ۙ
మంత్రజాలకులు అల్లాహ్ యొక్క గొప్ప సామర్ధ్యమును చూసినప్పుడు,స్పష్టమైన సూచనలను చూసినప్పుడు వారు అల్లాహ్ సుబహానహు వ తఆలా కొరకు సాష్టాంగ పడటం తప్ప వేరే మార్గం లేదు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• من حكمة الله ورحمته أن جعل آية كل نبي مما يدركه قومه، وقد تكون من جنس ما برعوا فيه.
ప్రతి ప్రవక్త యొక్క మహిమను వారి జాతి వారు అర్ధం చేసుకునే వాటిలోంచి చేయటము అల్లాహ్ వివేకము,కారుణ్యము. అది ఒక్కొక్కసారి వారి నైపుణ్యత కల వాటిలోంచి కూడా ఉంటుంది.

• أنّ فرعون كان عبدًا ذليلًا مهينًا عاجزًا، وإلا لما احتاج إلى الاستعانة بالسحرة في دفع موسى عليه السلام.
ఫిర్ఔన్ అవమానకరమై,దిగజారిన,నిస్సహాయుడైన దాసుడు లేకపోతే అతను మూసా అలైహిస్సలాంను ఎదుర్కొవటానికి మంత్రజాలకుల సహాయం తీసుకోవలసిన అవసరమేముండేది.

• يدل على ضعف السحرة - مع اتصالهم بالشياطين التي تلبي مطالبهم - طلبهم الأجر والجاه عند فرعون.
ఇది మంత్రజాకుల యొక్క బలహీనతను చూపిస్తుంది,వారి డిమాండ్లను తీర్చే షైతానులతో వారి సంబంధము,ఫిర్ ఔన్ వద్ద వేతనం మరియు ప్రతిష్ట కోసం వారి కోరిక ఉండటం.

قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
సమస్త సృష్టి రాసుల ప్రభువును మేము విశ్వసించాము అని మంత్రజాలకులు పలికారు.
अरबी तफ़सीरें:
رَبِّ مُوْسٰی وَهٰرُوْنَ ۟
మూసా,హారూన్ అలైహిముస్సలాం ప్రభువు. ఆయన కాక ఇతర పేరొందిన దేవతలు కాకుండా ఆయనే ఆరాధనకు అర్హుడు.
अरबी तफ़सीरें:
قَالَ فِرْعَوْنُ اٰمَنْتُمْ بِهٖ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ۚ— اِنَّ هٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوْهُ فِی الْمَدِیْنَةِ لِتُخْرِجُوْا مِنْهَاۤ اَهْلَهَا ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۟
వారు ఒకే అల్లాహ్ ను విశ్వసించిన తరువాత ఫిర్ఔన్ వారిని హెచ్చరిస్తూ ఇలా పలికాడు : నేను మీకు అనుమతివ్వకముందే మూసాను విశ్వసిస్తారా అతడిపై మీ విశ్వాసము,మూసా తీసుకుని వచ్చిన దానిపై మీ నమ్మకము ఒక మోసము,మీరు,మూసా అందరు కలిసి పట్టన వాసులను అక్కడి నుండి వెళ్ళగొట్టటానికి పన్నిన వ్యూహము. ఓ మంత్రజాలకులారా మీపై వచ్చే శిక్షను,మీరు చేసే గుణపాఠరహిత శిక్షను తొందరలోనే తెలుసుకుంటారు.
अरबी तफ़सीरें:
لَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ ثُمَّ لَاُصَلِّبَنَّكُمْ اَجْمَعِیْنَ ۟
నేను తప్పకుండా మీలో నుంచి ప్రతి ఒక్కరి యొక్క కుడి చేయిని,ఎడమ కాలుని లేదా ఎడమ చేయిని,కుడి కాలిని నరికి వేస్తాను. ఆ తరువాత మిమ్మల్నందరిని శిక్షించటానికి,ఆ స్థితిలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి భయం కలిగించటానికి మిమ్మల్నందరిని ఖర్జూరపు చెట్ల మానులపై వ్రేలాడదీస్తాను.
अरबी तफ़सीरें:
قَالُوْۤا اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنْقَلِبُوْنَ ۟ۚ
ఫిర్ఔన్ హెచ్చరికను ఖండిస్తూ మంత్రజాలకులు ఇలా అన్నారు : నిశ్చయంగా మేమందరం ఒక్కడైన మా ప్రభువు వైపునకు మరలి వెళ్ళేవారము. నీవు బెదిరిస్తున్న బెదిరింపులను లెక్కచేయము.
अरबी तफ़सीरें:
وَمَا تَنْقِمُ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاٰیٰتِ رَبِّنَا لَمَّا جَآءَتْنَا ؕ— رَبَّنَاۤ اَفْرِغْ عَلَیْنَا صَبْرًا وَّتَوَفَّنَا مُسْلِمِیْنَ ۟۠
ఓ పిర్ఔన్ మూసా ద్వారా మా ప్రభువు వద్ద నుండి సూచనలు వచ్చినప్పుడు కేవలం మేము వాటిని విశ్వసించామని నీవు మమ్మల్ని విస్మరించావు,మాపై ఆగ్రహాన్ని చూపావు. ఒకవేళ ఇది లోపం చూపించదగిన పాపం అయితే అది మా పాపమే. ఆ తరువాత వారు అణుకువతో ఇలా దుఆ చేస్తూ అల్లాహ్ వైపు మరలారు : ఓ మా ప్రభువా మాపై సహనాన్ని కురిపించు. కడకు అది మేము సత్యంపై నిలకడ చూపటానికి మమ్మల్ని ముంచివేయాలి. నీకు విధేయిలుగా నీ ఆదేశానికి కట్టుబడి ఉండేటట్లు,నీ ప్రవక్తను అనుసరించే వారిగా ఉన్న స్థితిలోనే మాకు మరణాన్ని ప్రసాదించు.
अरबी तफ़सीरें:
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اَتَذَرُ مُوْسٰی وَقَوْمَهٗ لِیُفْسِدُوْا فِی الْاَرْضِ وَیَذَرَكَ وَاٰلِهَتَكَ ؕ— قَالَ سَنُقَتِّلُ اَبْنَآءَهُمْ وَنَسْتَحْیٖ نِسَآءَهُمْ ۚ— وَاِنَّا فَوْقَهُمْ قٰهِرُوْنَ ۟
ఫిర్ఔన్ జాతివారిలోంచి నాయకులు,పెద్దవారు ఫిర్ఔన్ ను మూసా,ఆయనతోపాటు విశ్వసించిన వారికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఇలా : అన్నారు ఓ ఫిర్ఔన్ ఏమి నీవు మూసా,అతని జాతివారిని భూమిలో అల్లకల్లోలాలను వ్యాపింపచేయటానికి మరియు వారు నిన్ను,నీ ఆరాధ్య దైవాలను వదిలి పెట్టటానికి,వారు ఒకే అల్లాహ్ ఆరాధన వైపునకు పిలవటానికి వదిలివేస్తావా ?. ఫిర్ఔన్ ఇలా పలికాడు : తొందరలోనే మేము ఇస్రాయీలు సంతతివారి మగ పిల్లలను చంపివేస్తాము,వారి స్త్రీలను సేవకోసం వదిలివేస్తాము. మరియు మేము వారిపై అణిచివేత,అధికారము,ఆధిపత్యము కలిగి ఉన్నాము.
अरबी तफ़सीरें:
قَالَ مُوْسٰی لِقَوْمِهِ اسْتَعِیْنُوْا بِاللّٰهِ وَاصْبِرُوْا ۚ— اِنَّ الْاَرْضَ لِلّٰهِ ۙ۫— یُوْرِثُهَا مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ— وَالْعَاقِبَةُ لِلْمُتَّقِیْنَ ۟
మూసా తన జాతివారికి తాకీదు చేస్తూ ఇలా అన్నారు : ఓ నా జాతివారా మీరు నష్టమును దూరం చేయటంలో,మీకు లాభం కలగటంలో ఒకే అల్లాహ్ తో సహాయమును అర్ధించండి. మీపై వచ్చే పరీక్షల్లో సహనమును చూపండి. నిశ్చయంగా భూమి ఒక్కడైన అల్లాహ్ ది. అధికారము చెలాయించటానికి ఫిర్ఔన్ ది కాదు. మరియు అల్లాహ్ దాన్ని ప్రజల మధ్య వారి విధివ్రాత ప్రకారం త్రిప్పుతూ ఉంటాడు. కాని అల్లాహ్ ఆదేశాలను పాటించి,అల్లాహ్ వారించిన వాటికి దూరంగా ఉండే విశ్వాసపరులకు మంచి పరిణామం ఉంటుంది. అది వారి కొరకే. ఒకవేళ ఆపదలు,పరీక్షలు వారికి చేరినా.
अरबी तफ़सीरें:
قَالُوْۤا اُوْذِیْنَا مِنْ قَبْلِ اَنْ تَاْتِیَنَا وَمِنْ بَعْدِ مَا جِئْتَنَا ؕ— قَالَ عَسٰی رَبُّكُمْ اَنْ یُّهْلِكَ عَدُوَّكُمْ وَیَسْتَخْلِفَكُمْ فِی الْاَرْضِ فَیَنْظُرَ كَیْفَ تَعْمَلُوْنَ ۟۠
ఇస్రాయీలు సంతతి నుంచి మూసా జాతివారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ మూసా ఫిర్ఔన్ చేతిలో మా కుమారుల హత్య ద్వారా,మా స్త్రీలను వదిలివేయటం ద్వారా మీరు మా వద్దకు రాక మునుపు,మీరు వచ్చిన తరువాత పరీక్షింపబడ్డాము (బాదింపబడ్డాము). మూసా వారిని హితోపదేశం చేస్తూ,సుఖవంతమైన జీవితపు శుభవార్తనిస్తూ ఇలా పలికారు : బహుశా మీ ప్రభువు మీ శతృవులైన ఫిర్ఔన్,అతని జాతివారిని వినాశనమునకు గురిచేస్తాడు. వారి తరువాత భూమిలో మీకు నివాసమును కలిగిస్తాడు. దీని తరువాత కృతజ్ఞత లేదా కృతఘ్నత లోంచి మీరు ఏమి చేస్తారో ఆయన చూస్తాడు.
अरबी तफ़सीरें:
وَلَقَدْ اَخَذْنَاۤ اٰلَ فِرْعَوْنَ بِالسِّنِیْنَ وَنَقْصٍ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ یَذَّكَّرُوْنَ ۟
మేము ఫిర్ఔన్ జనులను దుర్భిక్షానికి,అనావృష్టికి గురిచేసి శిక్షించాము. మరియు భూమిలో పండ్ల ఉత్పత్తిని,ధాన్యాలను తగ్గించి వారిపై ఇదంతా కేవలం వారి అవిశ్వాసము వలన వచ్చిన శిక్ష అని వారు హితోపదేశం గ్రహిస్తారని,గుణపాఠం నేర్చుకుంటారని,అల్లాహ్ వైపు ప్రాయశ్చిత్తముతో మరలుతారని ఆశిస్తూ వారిని పరీక్షించాము.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• موقف السّحرة وإعلان إيمانهم بجرأة وصراحة يدلّ على أنّ الإنسان إذا تجرّد عن هواه، وأذعن للعقل والفكر السّليم بادر إلى الإيمان عند ظهور الأدلّة عليه.
మంత్రజాలకుల వైఖరి,వారు సాహసోపేతముగా,బహిరంగముగా తమ విశ్వాసము ప్రకటన మనిషి తన మనోవాంచనల నుండి ఖాళీ అయిపోయినప్పుడు,బుద్ధిని,సరైన ఆలోచనకు విధేయుడైనప్పుడు విశ్వాసము యొక్క ఆధారాలు ప్రస్పుటమయిన వేళ శీఘ్రంగా విశ్వసిస్తాడు అన్న దానిపై సూచిస్తుంది.

• أهل الإيمان بالله واليوم الآخر هم أشدّ الناس حزمًا، وأكثرهم شجاعة وصبرًا في أوقات الأزمات والمحن والحروب.
అల్లాహ్ ను,అంతిమ దినమును విశ్వసించేవారు ప్రజల్లో చాలా ఎక్కువగా జాగ్రత వహించేవారై ఉంటారు. యుద్ధాలు,ఆపదలు,కష్టాల సమయాల్లో చాలా ధైర్యవంతులై,సహనము పాటించేవారై ఉంటారు.

• المنتفعون من السّلطة يُحرِّضون ويُهيِّجون السلطان لمواجهة أهل الإيمان؛ لأن في بقاء السلطان بقاء لمصالحهم.
అధికారము నుండి లబ్ది పొందేవారు విశ్వాసులను ఎదుర్కోవటానికి అధికారము కలవాడిని రెచ్చగొడుతారు,ప్రేరేపిస్తారు. ఎందుకంటే అధికారి మనుగడలోనే వారి ప్రయోజనాల మనుగడ ఉన్నది.

• من أسباب حبس الأمطار وغلاء الأسعار: الظلم والفساد.
హింస,అల్లకల్లోలాలు వర్షాలు ఆగిపోవటానికి,ధరలు పెరిగిపోవటానికి కారణం.

فَاِذَا جَآءَتْهُمُ الْحَسَنَةُ قَالُوْا لَنَا هٰذِهٖ ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّطَّیَّرُوْا بِمُوْسٰی وَمَنْ مَّعَهٗ ؕ— اَلَاۤ اِنَّمَا طٰٓىِٕرُهُمْ عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
ఫిర్ఔన్ జనుల వద్దకు మేలిమి,మంచిఫలాలు,చౌకధరలు వచ్చినప్పుడు ఇలా అనే వారు : మేము వాటి హక్కుదారులం కావటం వలన,మేము వాటికి ప్రత్యేకులం కావటం వలన ఇవి మనకు ప్రసాదించబడినవి. ఒకవేళ దుర్భిక్షి,కలిమి,రోగాలు అధికమవ్వటం అవే కాకుండా ఇతర ఆపదల్లోంచి వారిపై వస్తే లేదా వారికి కలిగితే వారు మూసా,ఆయనతోపాటు ఇస్రాయీలు సంతతి ద్వారా అపశకునంగా భావించేవారు. వాస్తవానికి వారిపై వచ్చిన ఆ ఆపదంతా అల్లాహ్ విధి వ్రాతలో ఉన్నది. వారికి,మూసాకి అందులో స్థానం లేదు.మూసా వారిపై శాపం కురవమని దుఆ చేస్తే తప్ప వేరేది లేదు. కాని వారిలో చాలా మందికి తెలియదు. వారు దానిని అల్లాహేతరులతో సంబంధం కలుపుతారు.
अरबी तफ़सीरें:
وَقَالُوْا مَهْمَا تَاْتِنَا بِهٖ مِنْ اٰیَةٍ لِّتَسْحَرَنَا بِهَا ۙ— فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِیْنَ ۟
ఫిర్ఔన్ జాతివారు సత్యాన్ని వ్యతిరేకిస్తూ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఏ మహిమను,ఆధారమును నీవు మా వద్దకు తీసుకుని వచ్చినా,మా వద్ద ఉన్న దాని నుండి మమ్మల్ని మరల్చటానికి మా వద్ద ఉన్నది అసత్యము అని నిరూపించటం కొరకు,నీవు తీసుకుని వచ్చినది సత్యము అనటం కొరకు నీవు ఏ వాదనను స్థాపించినా మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము.
अरबी तफ़सीरें:
فَاَرْسَلْنَا عَلَیْهِمُ الطُّوْفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ اٰیٰتٍ مُّفَصَّلٰتٍ ۫— فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِیْنَ ۟
మేము వారి తిరస్కారము,వారి వ్యతిరేకత వలన వారికి శిక్షగా వారిపై ఎక్కువగా నీటిని కురిపించాము. అది వారి పంటలను,ఫలాలను ముంచివేసింది. మరియు మేము వారిపై మిడతలను పంపాము. అవి వారి చేతికి వచ్చిన పంటను తినివేశాయి. మరియు మేము వారిపై పేలు అని పిలవబడే పురుగులను పంపాము. అవి పంటను నాశనంచేస్తాయి లేదా మనిషి జుట్టులో బాధను కలిగిస్తాయి. మరియు మేము వారిపై కప్పలను పంపాము. అవి వారి పాత్రలను నింపివేశాయి,వారి ఆహారపదార్దాలను పాడుచేశాయి. వారి పడకలపై పడుకున్నాయి. మరియు మేము వారిపై రక్తమును పంపాము. అది వారి నూతుల,కాలువల నీళ్ళని రక్తంగా మర్చివేసింది. వీటన్నింటిని మేము స్పష్టమైన వేరు వేరు మహిమలుగ ఒకదాని వెనుక ఒకటిగా పంపించాము. ఇవన్ని శిక్షలు వారిపై వచ్చినప్పటికి వారు అల్లాహ్ పై విశ్వాసము నుండి,మూసా తీసుకుని వచ్చిన దాన్ని నిజమని అంగీకరించటం నుండి అహంకారమును చూపారు. వారు పాపాలకు పాల్పడేవారు. అసత్యాన్ని విడనాడరు,సత్యం వైపునకు మార్గం పొందరు.
अरबी तफ़सीरें:
وَلَمَّا وَقَعَ عَلَیْهِمُ الرِّجْزُ قَالُوْا یٰمُوْسَی ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ— لَىِٕنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ۚ
ఈ విషయాల ద్వారా వారికి శిక్ష కలిగినప్పుడు వారు మూసా వైపునకు మరలారు,ఆయనతో ఇలా పలికారు : ఓ మూసా నీ ప్రభువు నీకు ప్రత్యేకించిన దైవదౌత్యం (నుబువ్వత్) ద్వారా,శిక్షను తౌబా ద్వారా తొలగిస్తానని నీకు ఆయన చేసిన వాగ్దానం ద్వారా మాపై వచ్చిన శిక్షను మా నుండి తొలగించమని మా కొరకు నీ ప్రభువుతో వేడుకో. ఒకవేళ నీవు దాన్ని మా నుండి తొలగిస్తే నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము,ఇస్రాయీల్ సంతతివారిని మేము నీతో పాటు తప్పకుండా పంపిస్తాము,వారిని మేము విముక్తి కలిగిస్తాము.
अरबी तफ़सीरें:
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ اِلٰۤی اَجَلٍ هُمْ بٰلِغُوْهُ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟
మేము వారిని ముంచి నాశనం చేయక మునుపు ఒక నిర్ణీత కాలము వరకు వారి నుండి శిక్షను తొలగించినప్పుడు వారు విశ్వసిస్తారని,ఇస్రాయీల్ సంతతివారిని పంపిస్తారని వారు చేసిన వాగ్ధానమును భంగపరిచారు. మరియు తమ అవిశ్వాసమును కొనసాగించారు. ఇస్రాయీల్ సంతతివారిని మూసా అలైహిస్సలాం తోపాటు పంపించటం నుండి ఆగిపోయారు.
अरबी तफ़सीरें:
فَانْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ فِی الْیَمِّ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِیْنَ ۟
వారిని నాశనం చేయటం కొరకు నిర్ణీత సమయం వచ్చినప్పుడు వారు అల్లాహ్ మహిమలను తిరస్కరించటం వలన,ఎటువంటి సందేహం లేని సత్యంను నిర్దేశించే వాటినుండి వారి విముఖత వలన మేము వారిని సముద్రంలో ముంచటం ద్వారా వారిపై మా శిక్షను కురిపించాము.
अरबी तफ़सीरें:
وَاَوْرَثْنَا الْقَوْمَ الَّذِیْنَ كَانُوْا یُسْتَضْعَفُوْنَ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِیْ بٰرَكْنَا فِیْهَا ؕ— وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنٰی عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ۬— بِمَا صَبَرُوْا ؕ— وَدَمَّرْنَا مَا كَانَ یَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهٗ وَمَا كَانُوْا یَعْرِشُوْنَ ۟
ఫిర్ఔన్,అతని జాతివారు హీనంగా భావించే ఇస్రాయీల్ సంతతివారిని మేము భూమండల ప్రాక్పశ్చిమాలకు వారసులుగా చేశాము. దాని ఉద్దేశం సిరియా ప్రాంతపు పట్టణాలు. ఈ పట్టణాల్లో అల్లాహ్ వాటి పంటలను,ఫలాలను పూర్తి స్ధాయిలో వెలికి తీయటం ద్వారా శుభాలను కురిపించాడు. ఓ ప్రవక్త మీ ప్రభువు యొక్క మంచి మాట (వాగ్ధానం) పూర్తయింది. ఏదైతే అల్లాహ్ యొక్క ఈ వాక్యములో ప్రస్తావించబడినదో. وَنُرِيدُ أَنْ نَمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُالْوَارِثِينَ﴾ [القصص: ٥]فَ మరియు భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలని,వారికి సారధ్య బాధ్యతలు అప్పగించాలని,వారిని వారసులుగా చేయాలని మేముకోరుకున్నాము.(సూరతుల్ ఖసస్ 5).అయితే అల్లాహ్ ఫిర్ఔన్,అతని జాతివారి నుండి వారికి కలిగిన బాధపై వారి సహనము వలన భూమండలంలో వారికి అధికారమును కలిగించాడు. మరియు మేము ఫిర్ఔన్ ఏర్పరచిన పంటలను,నివాసములను,వారు నిర్మించుకున్న భవనములను నేలమట్టం చేశాము.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• الخير والشر والحسنات والسيئات كلها بقضاء الله وقدره، لا يخرج منها شيء عن ذلك.
మేలు,కీడు,పుణ్యాలు,పాపాలు అన్నీ అల్లాహ్ నిర్ణయం వలన,అతని విధివ్రాత వలన జరుగుతాయి. దాని నుండి వాటిలోంచి ఏవి బయటకు తొలగవు.

• شأن الناس في وقت المحنة والمصائب اللجوء إلى الله بدافع نداء الإيمان الفطري.
పరీక్షలు,ఆపదల సమయంలో విశ్వాసము యొక్క స్వాభావిక పిలుపు ద్వారా అల్లాహ్ రక్షణలో చేరటం ప్రజల వైఖరి అవుతుంది.

• يحسن بالمؤمن تأمل آيات الله وسننه في الخلق، والتدبر في أسبابها ونتائجها.
అల్లాహ్ సూచనల్లో,సృష్టితాల విషయంలో ఆయన సంప్రదాయాల్లో యోచించటం,వాటి కారకాల్లో,వాటి ఫలితాల్లో యోచించటం విశ్వాసపరునికి ఉత్తమం.

• تتلاشى قوة الأفراد والدول أمام قوة الله العظمى، والإيمان بالله هو مصدر كل قوة.
అల్లాహ్ గొప్ప శక్తి ముందు వ్యక్తుల,రాజ్యాల శక్తి మసకబారుతుంది. అల్లాహ్ పై విశ్వాసం అన్ని శక్తులకు మూలము.

• يكافئ الله تعالى عباده المؤمنين الصابرين بأن يمكِّنهم في الأرض بعد استضعافهم.
అల్లాహ్ సహనమును పాటించే విశ్వాసపరులైన తన దాసులను భూమండలంలో బలహీనులుగా భావించబడిన తరువాత వారికి అధికారమును ప్రసాదిస్తాడు.

وَجٰوَزْنَا بِبَنِیْۤ اِسْرَآءِیْلَ الْبَحْرَ فَاَتَوْا عَلٰی قَوْمٍ یَّعْكُفُوْنَ عَلٰۤی اَصْنَامٍ لَّهُمْ ۚ— قَالُوْا یٰمُوْسَی اجْعَلْ لَّنَاۤ اِلٰهًا كَمَا لَهُمْ اٰلِهَةٌ ؕ— قَالَ اِنَّكُمْ قَوْمٌ تَجْهَلُوْنَ ۟
మూసా తన చేతి కర్రను సముద్రంపై కొడితే అది రెండుగా విడిపోయినప్పుడు ఇస్రాయీలు సంతతివారిని మేము సముద్రమును దాటించినాము. ఆ తరువాత వారు అల్లాహ్ ను వదిలి తమ విగ్రహాలను ఆరాధిస్తున్న ఒక జాతివారి వద్ద నుండి నడిచారు. ఇస్రాయీలు సంతతివారు మూసా అలైహిస్సలాంతో ఇలా అన్నారు : ఓ మూసా వారికి ఏ విధంగానైతే ఆరాధనకు అల్లాహ్ కాకుండా ఆరాధ్యదైవాలు ఉన్నాయో అలాగే మా కోసం కూడా మేము ఆరాధించటానికి ఒక విగ్రహాన్ని తయారు చేయి. మూసా వారితో ఇలా పలికారు : ఓ నా జాతివారా నిశ్చయంగా మీరు అల్లాహ్ కొరకు తప్పనిసరి అయిన ఔన్నత్యము (అజ్మత్),ఏకత్వము (తౌహీదు) ను,ఆయన కొరకు తగని షిర్కు,ఆయనను వదిలి వేరే వారిని ఆరాధించటం గురించి తెలియని మూర్ఖులు.
अरबी तफ़सीरें:
اِنَّ هٰۤؤُلَآءِ مُتَبَّرٌ مَّا هُمْ فِیْهِ وَبٰطِلٌ مَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟
నిశ్చయంగా తమ విగ్రహారధనలో నిమగ్నమై ఉండే వారి అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన నాశనమవుతుంది. వారు చేసుకున్న విధేయత కార్యాలన్ని ఆరాధనలో వారు అల్లాహ్ తోపాటు వేరే వారిని సాటి కల్పించటం వలన శూన్యమైనవి.
अरबी तफ़सीरें:
قَالَ اَغَیْرَ اللّٰهِ اَبْغِیْكُمْ اِلٰهًا وَّهُوَ فَضَّلَكُمْ عَلَی الْعٰلَمِیْنَ ۟
మూసా తన జాతివారితో ఇలా పలికారు ఓ నా జాతివారా : మీరు ఆరాధించటానికి మీ కొరకు అల్లాహ్ ను కాదని వేరే ఆరాధ్య దైవమును నేను ఎలా కోరుకుంటాను ?. వాస్తవానికి మీరు ఆయన యొక్క గొప్ప మహిమలను చూశారు. మరియు ఆయన సుబహానహు వతఆలా మీ శతృవులను వినాశనము చేసి,మిమ్మల్ని భూమండలంలో ప్రతినిధులుగా చేసి,అందులో మీకు అధికారమును ప్రసాదించి మీపై అనుగ్రహాలను ప్రసాదించి మీ కాలములో మిమ్మల్ని సమస్తలోక వాసులపై ప్రాధాన్యతను ఇచ్చినాడు.
अरबी तफ़सीरें:
وَاِذْ اَنْجَیْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ ۚ— یُقَتِّلُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟۠
ఓ ఇస్రాయీలు సంతతివారా మేము మిమ్మల్ని ఫిర్ఔన్ అతని జాతివారి అవమానకరమైన జీవితము నుండి విముక్తి కలిగించటం ద్వారా మిమ్మల్ని రక్షించిన వేళను గుర్తు చేసుకోండి. వారు మీ మగ సంతానమును హతమార్చి,మీ స్త్రీలను సేవకోసం వదిలివేసి మిమ్మల్ని రకరకాల శిక్షల రుచి చూపించేవారు. ఫిర్ఔన్,అతని జాతివారి నుండి మీకు విముక్తి కలిగించటంలో మీ ప్రభువు తరుపు నుండి పెద్ద పరీక్ష ఉన్నది. అది మీ నుండి కృతజ్ఞతను కోరుతుంది.
अरबी तफ़सीरें:
وَوٰعَدْنَا مُوْسٰی ثَلٰثِیْنَ لَیْلَةً وَّاَتْمَمْنٰهَا بِعَشْرٍ فَتَمَّ مِیْقَاتُ رَبِّهٖۤ اَرْبَعِیْنَ لَیْلَةً ۚ— وَقَالَ مُوْسٰی لِاَخِیْهِ هٰرُوْنَ اخْلُفْنِیْ فِیْ قَوْمِیْ وَاَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِیْلَ الْمُفْسِدِیْنَ ۟
మరియు అల్లాహ్ మూసాతో సంభాషించటం కొరకు ముప్పై రాత్రుల వాగ్ధానం చేశాడు. ఆ పిదప వాటిని అల్లాహ్ పది పెంచి పరిపూర్ణం చేశాడు. అప్పుడు అవి నలభై అయినవి. ఎప్పుడైతే మూసా తన ప్రభువుతో సంభాషన కొరకు వెళ్ళదలచుకున్నారో తన సోదరుడు హారూనుతో ఇలా పలికారు : ఓ హారూన్ నీవు నా జాతివారిలో నా ప్రతినిధిగా ఉండు. మరియు నీవు వారి వ్యవహారాలను ఉత్తమ పరిపాలన ద్వారా,వారి పట్ల మృధు వైఖరి ద్వారా చక్కదిద్దు (సంస్కరించు). పాపాలకు పాల్పడి నీవు అరాచకాలు చేసేవారి మార్గంలో నడవకు. అవిధేయులకు సహాయకుడిగా నీవు అవ్వకు.
अरबी तफ़सीरें:
وَلَمَّا جَآءَ مُوْسٰی لِمِیْقَاتِنَا وَكَلَّمَهٗ رَبُّهٗ ۙ— قَالَ رَبِّ اَرِنِیْۤ اَنْظُرْ اِلَیْكَ ؕ— قَالَ لَنْ تَرٰىنِیْ وَلٰكِنِ انْظُرْ اِلَی الْجَبَلِ فَاِنِ اسْتَقَرَّ مَكَانَهٗ فَسَوْفَ تَرٰىنِیْ ۚ— فَلَمَّا تَجَلّٰی رَبُّهٗ لِلْجَبَلِ جَعَلَهٗ دَكًّا وَّخَرَّ مُوْسٰی صَعِقًا ۚ— فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبْحٰنَكَ تُبْتُ اِلَیْكَ وَاَنَا اَوَّلُ الْمُؤْمِنِیْنَ ۟
మరియు మూసా తన ప్రభువుతో సంభాషించటానికి తన కొరకు నిర్ధారించిన వేళలో వచ్చినప్పుడు అది పూర్తిగా నలభై రాత్రులు. ఆదేశించిన విషయాలు,వారించిన విషయాల గురించి,ఇతర విషయాల గురించి ఆయన ప్రభువు ఆయనతో మాట్లాడారు. తన ప్రభువును చూడాలని ఆయన మనస్సు ఆరాటపడింది. అయితే ఆయన అతని వైపు చూస్తానని అతనితో (అల్లాహ్ తో) వేడుకున్నారు. అల్లాహ్ సుబహానహు వ తఆలా ఆయనకు ఇలా సమాధానమిచ్చాడు : నీవు నన్ను చూసే సామర్ధ్యం లేకపోవటం వలన నన్ను ఇహలోక జీవితంలో చూడలేవు. కాని నేను పర్వతంపై కాంతిని ప్రభవింప చేసినప్పుడు నీవు దానిని చూడు. ఒకవేళ అది తన స్థానంలో యదావిధిగా ఉంటే (నీపై) ప్రభావం చూపదు. తొందరలోనే నీవు నన్ను చూడగలుగుతావు. ఒకవేళ అది నేలమట్టం అయిపోతే నీవు ఈ లోకంలో ఖచ్చితంగా నన్ను చూడలేవు. అల్లాహ్ పర్వతంపై కాంతిని ప్రభవింప చేసినప్పుడు దానిని నేలమట్టం చేసేశాడు. మూసా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆ తరువాత ఆయనకు సంభవించిన అపస్మారక స్థితి నుండి స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన ఇలా పలికారు : ఓ నా ప్రభువా నేను నీకు తగని ప్రతి విషయం నుండి నిన్ను పరిశుధ్ధుడిగా భావిస్తున్నాను. ఇదిగో నేను నిన్ను ఇహలోకంలో చూడటం గురించి నిన్ను కోరటం నుండి నీతో క్షమాపణ కోరుతున్నాను. మరియు నేను నా జాతివారిలోంచి విశ్వసించిన వారిలో మొట్ట మొదటి వాడిని.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• تؤكد الأحداث أن بني إسرائيل كانوا ينتقلون من ضلالة إلى أخرى على الرغم من وجود نبي الله موسى بينهم.
ఇస్రాయీలు సంతతివారు వారి మధ్యలో అల్లాహ్ ప్రవక్త మూసా ఉన్నప్పటికీ ఒక అపమార్గము నుండి ఇంకో అపమార్గము వైపునకు మరిలేవారని జరిగిన సంఘటనలు దృవీకరిస్తున్నాయి.

• من مظاهر خذلان الأمة أن تُحَسِّن القبيح، وتُقَبِّح الحسن بمجرد الرأي والأهواء.
చెడును మంచిగా భావించటం,మంచిని అభిప్రాయాల ద్వారా,మనోవాంచనల ద్వారా చేడుగా చేయటం ఉమ్మత్ (జాతి) వైఫల్య స్వరూపాల్లో నుండే.

• إصلاح الأمة وإغلاق أبواب الفساد هدف سام للأنبياء والدعاة.
జాతిని సంస్కరించటం,అవినీతి తలుపులు మూసి వేయటం ప్రవక్తల,ప్రచారకుల ఉన్నత లక్ష్యం.

• قضى الله تعالى ألا يراه أحد من خلقه في الدنيا، وسوف يكرم من يحب من عباده برؤيته في الآخرة.
ఇహలోకంలో అల్లాహ్ తన సృష్టిలోంచి ఎవరూ ఆయనను చూడకూడదని నిర్ణయించాడు. మరియు ఆయన త్వరలోనే తన దాసుల్లోంచి ఎవరిని ఇష్టపడితే వారిని పరలోకంలో తనను చూసే గౌరవాన్ని ప్రసాదిస్తాడు.

قَالَ یٰمُوْسٰۤی اِنِّی اصْطَفَیْتُكَ عَلَی النَّاسِ بِرِسٰلٰتِیْ وَبِكَلَامِیْ ۖؗ— فَخُذْ مَاۤ اٰتَیْتُكَ وَكُنْ مِّنَ الشّٰكِرِیْنَ ۟
అల్లాహ్ మూసాతో ఇలా పలికాడు : ఓ మూసా నేను నిన్ను ప్రజల వద్దకు ప్రవక్తగా పంపించిన వేళ నేను నిన్ను నా సందేశాల ద్వారా జనులపై ప్రాధాన్యతను ఇచ్చాను,నిన్ను ఎన్నుకున్నాను. మరియు ఎటువంటి మూలాధారము లేకుండా నీతో నా సంభాషణ ద్వారా నేను నీకు ప్రాధాన్యతను ప్రసాదించాను. కాబట్టి నీవు నేను నీకు ప్రసాదించిన ఈ గౌరవ మర్యాదలను పుచ్చుకో,ఈ గొప్ప బహుమానము పై నీవు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకునే వారిలో అయిపో.
अरबी तफ़सीरें:
وَكَتَبْنَا لَهٗ فِی الْاَلْوَاحِ مِنْ كُلِّ شَیْءٍ مَّوْعِظَةً وَّتَفْصِیْلًا لِّكُلِّ شَیْءٍ ۚ— فَخُذْهَا بِقُوَّةٍ وَّاْمُرْ قَوْمَكَ یَاْخُذُوْا بِاَحْسَنِهَا ؕ— سَاُورِیْكُمْ دَارَ الْفٰسِقِیْنَ ۟
మరయు మేము ఇస్రాయీలు సంతతి వారికి అవసరమగు వారి ధార్మిక ఆదేశాల్లోంచి,వారి ప్రాపంచిక విషయాల్లోంచి,వారిలోంచి హితోపదేశమును గ్రహించే వారి కొరకు హితోపదేశమును,వివరణ అవసరమగు ఆదేశాల కొరకు వివరణను మూసాకు చెక్క పలకల్లో,ఇతర వాటిలో వ్రాసి ఇచ్చినాము. అయితే ఓ మూసా నీవు ఈ తౌరాతును శ్రద్ధతో,కష్టపడి పుచ్చుకో (శ్రద్ధతో,కష్టపడి వాటి ఆదేశాలను పాటించు). వాటిలోని ఆదేశాలు వేటి పుణ్యం అయితే అధికంగా ఉన్నదో వాటిని ఆదేశించబడిన వాటిని పరిపూర్ణంగా చేయటం,సహనం పాటించటం,మన్నించటం లాంటి వాటిలాగ ఉత్తమంగా పాటించమని నీ జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని నీవు ఆదేశించు. నేను తొందరలోనే నా ఆదేశాన్ని వ్యతిరేకించిన వారి,నా విధేయత నుండి వైదొలగిన పరిణామమును,వారికి కలిగిన వినాశమును మీకు చూపిస్తాను.
अरबी तफ़सीरें:
سَاَصْرِفُ عَنْ اٰیٰتِیَ الَّذِیْنَ یَتَكَبَّرُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ ؕ— وَاِنْ یَّرَوْا كُلَّ اٰیَةٍ لَّا یُؤْمِنُوْا بِهَا ۚ— وَاِنْ یَّرَوْا سَبِیْلَ الرُّشْدِ لَا یَتَّخِذُوْهُ سَبِیْلًا ۚ— وَاِنْ یَّرَوْا سَبِیْلَ الْغَیِّ یَتَّخِذُوْهُ سَبِیْلًا ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِیْنَ ۟
అల్లాహ్ దాసులపై,సత్యానికి వ్యతిరేకంగా దుర్మార్గం ద్వారా అహంకారమును ప్రదర్శించే వారిని జగతిలో నా సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకోవటం నుండి,నా గ్రంధ ఆయతులను అర్ధం చేసుకోవటం నుండి మరల్చివేస్తాను. ఒక వేళ వారు ప్రతి సూచనను చూసినా దాని పట్ల వారి అభ్యంతరం,దాని పట్ల వారి విముఖత వలన,అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల వారి వ్యతిరేకత వలన (ద్వేషం వలన) దాన్ని అంగీకరించరు. ఒక వేళ వారు అల్లాహ్ మన్నత వైపునకు తీసుకుని వెళ్లే సత్య మార్గమును చూసినా అందులో వారు నడవరు. అందులో వారికి ఆసక్తి కూడా ఉండదు. ఒక వేళ వారు అల్లాహ్ ఆగ్రహమునకు చేర్చే పెడ దారులను,అప మార్గములను చూస్తే అందులో వారు నడుస్తారు. అది ఏదైతే వారికి సంభవించినదో దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చినది సత్యము అని నిర్దేశించే అల్లాహ్ గొప్ప సూచనలను వారు తిరస్కరించటం వలన,అందులో వారు యోచన చేయటం నుండి అశ్రద్ధ వహించటం వలన వారికి సంభవించినది.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَلِقَآءِ الْاٰخِرَةِ حَبِطَتْ اَعْمَالُهُمْ ؕ— هَلْ یُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟۠
మరియు ఎవరైతే మన ప్రవక్త నీతిని నిర్దేశించే మా సూచనలను తిరస్కరిస్తారో,ప్రళయ దినాన అల్లాహ్ ను కలవటంను తిరస్కరిస్తారో వారి ఆచరణలు విధేయతలకు సంబంధించినవి వ్యర్ధమైపోతాయి. వాటి షరతుల్లోంచిదైన విశ్వాసము లేకపోవటం వలన వాటికి ప్రతిఫలం వారికి ప్రసాధించబడదు. వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసం వలన చేసుకున్న కర్మలకు ఆయనతో సాటి కల్పించటంనకు మాత్రమే వారికి ప్రళయ దినాన ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. నరకంలో ఎల్లప్పుడు,శాస్వతంగా ఉండటమే దాని ప్రతిఫలం.
अरबी तफ़सीरें:
وَاتَّخَذَ قَوْمُ مُوْسٰی مِنْ بَعْدِهٖ مِنْ حُلِیِّهِمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ ؕ— اَلَمْ یَرَوْا اَنَّهٗ لَا یُكَلِّمُهُمْ وَلَا یَهْدِیْهِمْ سَبِیْلًا ۘ— اِتَّخَذُوْهُ وَكَانُوْا ظٰلِمِیْنَ ۟
మూసా జాతి వారు ఆయన తన ప్రభువుతో సంభాషించటానికి వెళ్లిన తరువాత తమ నగలతో ఆవు దూడ శిల్పమును తయారు చేసి పెట్టుకున్నారు. అందులో ప్రాణం లేదు,దాని కొరకు ఒక శబ్దం ఉండేది. ఈ ఆవు దూడ వారితో మాట్లాడదని,వారికి మంచి ఇంద్రియ లేద నైతిక మార్గమును చూపించ లేదని మరియు వారి కొరకు లాభమును తీసుకుని రాలేదని లేద వారి నుండి నష్టమును దూరం చేయలేదని వారికి తెలియదా?. వారు దాన్ని ఆరాధ్య దైవముగా చేసుకున్నారు. దాని వలన వారు తమపై అన్యాయానికి పాల్పడిన వారైపోయారు.
अरबी तफ़सीरें:
وَلَمَّا سُقِطَ فِیْۤ اَیْدِیْهِمْ وَرَاَوْا اَنَّهُمْ قَدْ ضَلُّوْا ۙ— قَالُوْا لَىِٕنْ لَّمْ یَرْحَمْنَا رَبُّنَا وَیَغْفِرْ لَنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
వారు ఎప్పుడైతే చింతించారో,అయోమయంలో పడిపోయారో ఆవు దూడను అల్లాహ్ తో పాటు ఆరాధ్య దైవంగా చేసుకుని సన్మార్గం నుంచి వారు తప్పి పోయారని తెలుసుకున్నారో అల్లాహ్ తో కడువినయంగా వేడుకుని ఇలా పలికారు : ఒక వేళ మా ప్రభువు ఆయన విధేయత కొరకు సౌభాగ్యం ద్వారా మాపై కరుణించకపోతే,ఆవు దూడ ఆరాధనకు పాల్పడినందుకు మమ్మల్ని క్షమించకపోతే మేము తప్పకుండా తమ ఇహపరాలను నష్టం చేసుకున్న వారిలోంచి అయిపోతాము.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• على العبد أن يكون من المُظْهِرين لإحسان الله وفضله عليه، فإن الشكر مقرون بالمزيد.
అల్లాహ్ ఉపకారమును,ఆయన అనుగ్రహమును దాసుడు వ్యక్తపరిచే వారిలోంచి తప్పకుండా అవ్వాలి. ఎందుకంటే కృతజ్ఞత తెలుపుకోవటం అధికంగా లభించటానికి ముడిపడి ఉంది.

• على العبد الأخذ بالأحسن في الأقوال والأفعال.
మాటల్లో,చేతల్లో దాసుడు ఉత్తమ విదానంను ఎంచుకోవటం అవసరం.

• يجب تلقي الشريعة بحزم وجد وعزم على الطاعة وتنفيذ ما ورد فيها من الصلاح والإصلاح ومنع الفساد والإفساد.
ధర్మాన్ని ఎంత గంభీరముతో దృడ సంకల్పముతో పొందటం అవసరమంటే అందులో వచ్చిన మేలును ,సంస్కరణను అవలంబించాలి,అందులో వచ్చే కీడును,చెడును సృష్టించటంను ఆపాలి.

• على العبد إذا أخطأ أو قصَّر في حق ربه أن يعترف بعظيم الجُرْم الذي أقدم عليه، وأنه لا ملجأ من الله في إقالة عثرته إلا إليه.
దాసుడు తన ప్రభువు హక్కులో ఏదైన తప్పుచేసి ఉంటే,లోపం చేసి ఉంటే తాను పాల్పడిన పెద్ద పాపమును అంగీకరించాలి. ఎందుకంటే తన పొరపాట్లను తొలగించటంలో అల్లాహ్ తప్ప వేరే ఆశ్రయం లేదు.

وَلَمَّا رَجَعَ مُوْسٰۤی اِلٰی قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۙ— قَالَ بِئْسَمَا خَلَفْتُمُوْنِیْ مِنْ بَعْدِیْ ۚ— اَعَجِلْتُمْ اَمْرَ رَبِّكُمْ ۚ— وَاَلْقَی الْاَلْوَاحَ وَاَخَذَ بِرَاْسِ اَخِیْهِ یَجُرُّهٗۤ اِلَیْهِ ؕ— قَالَ ابْنَ اُمَّ اِنَّ الْقَوْمَ اسْتَضْعَفُوْنِیْ وَكَادُوْا یَقْتُلُوْنَنِیْ ۖؗ— فَلَا تُشْمِتْ بِیَ الْاَعْدَآءَ وَلَا تَجْعَلْنِیْ مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
మరియు మూసా తన ప్రభువుతో సంభాషణంతరం తన జాతి వారి వైపునకు మరలినప్పుడు ఆవు దూడ ఆరాధనలో వారిని పొందినందుకు వారిపై ఆగ్రహంతో నిండి ,విచారముతో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నేను మీ వద్ద నుండి వెళ్ళిన తరువాత మీరు నా ప్రాతినిధ్యం వహించి చేసిన స్థితి అది వినాశనమును,కష్టమును చేకూర్చటం వలన ఎంత చెడ్డదైనది. ఏమి మీరు నా కోసం ఎదురు చూస్తూ అలసిపోయి ఆవు దూడ ఆరాధనకు పాల్పడ్డారా ?. వారి వలన ఆయనకు కలిగిన తీవ్ర ఆగ్రహానికి,దఃఖానికి పలకలను విసిరి వేశారు. తన సోధరుడు హారూన్ వారితోపాటు ఉండి కూడా వారు ఆవు దూడ ఆరాధన చేస్తుంటే చూసి ఆయన మార్పు తీసుకుని రానందుకు అతని తలను,గెడ్డమును పట్టి తన వైపునకు గుంజసాగారు. హారున్ మూసాతో క్షమాపణ కోరుతూ,తనపై దయ చూపమని ఇలా విన్నపించుకున్నారు : ఓ నా తల్లి కుమారా ( నా సోదరా) నిశ్చయంగా జాతి వారు నన్ను బలహీనుడిగా భావించి నన్ను అవమానపాలు చేసారు,దగ్గర దగ్గర నన్ను చంపివేసేవారు,మీరు నా శతృవులు సంతోషపడటానికి నన్ను ఏ శిక్షకూ గురి చేయకండి. మీకు నాపై కోపం వలన జాతి వారిలోంచి అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన చేయటం వలన దుర్మార్గులైన వారిలో నన్ను లెక్క వేయకండి.
अरबी तफ़सीरें:
قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَلِاَخِیْ وَاَدْخِلْنَا فِیْ رَحْمَتِكَ ۖؗ— وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟۠
అయితే మూసా తన ప్రభువుతో ఇలా వేడుకున్నారు : ఓ నా ప్రభువా నీవు నన్ను,నా సోదరుడగు హారూన్ ను మన్నించు,మమ్మల్ని నీ కారుణ్యంలో చేర్చు,దాన్ని మా నలు వైపుల చుట్టుముట్టే విధంగా చేయి,ఓ మా ప్రభువా నీవే కరుణించే వారిలో కెల్ల ఎక్కువగా మాపై కరుణించే వాడివి.
अरबी तफ़सीरें:
اِنَّ الَّذِیْنَ اتَّخَذُوا الْعِجْلَ سَیَنَالُهُمْ غَضَبٌ مِّنْ رَّبِّهِمْ وَذِلَّةٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُفْتَرِیْنَ ۟
నిశ్చయంగా ఎవరైతే ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకుని ఆరాధించేవారో వారికి తొందరలోనే తమ ప్రభువును ఆగ్రహానికి గురి చేసినందుకు,ఆయనను అవమాన పరిచినందుకు తమ ప్రభువు వద్ద నుండి వారికి తీవ్ర ఆగ్రహము,అవమానము ఇహలోక జీవితంలోనే చేరుతుంది. ఈ విధమైన ప్రతిఫలం లాంటి దాన్నే మేము అల్లాహ్ పై అబద్దమును అంటగట్టే వారికి ప్రసాదిస్తాము.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ عَمِلُوا السَّیِّاٰتِ ثُمَّ تَابُوْا مِنْ بَعْدِهَا وَاٰمَنُوْۤا ؗ— اِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,అవిధేయ కార్యాలకు పాల్పడి దుష్కార్యాలు చేస్తారో ఆపిదప అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తాము చేసే అవిధేయ కార్యాలను విడనాడి అల్లాహ్ తో పశ్చాత్తాపపడుతారో ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఈ పశ్చాత్తాపము,షిర్కు నుండి విశ్వాసము వైపునకు,అవిధేయ కార్యాల నుండి విధేయత వైపునకు మరలటం తరువాత పాపములపై పరదా కప్పటం,మన్నించటం ద్వారా వారిని క్షమించే వాడును,వారిపై కరుణించే వాడును.
अरबी तफ़सीरें:
وَلَمَّا سَكَتَ عَنْ مُّوْسَی الْغَضَبُ اَخَذَ الْاَلْوَاحَ ۖۚ— وَفِیْ نُسْخَتِهَا هُدًی وَّرَحْمَةٌ لِّلَّذِیْنَ هُمْ لِرَبِّهِمْ یَرْهَبُوْنَ ۟
మూసా కోపం తగ్గి ఆయన శాంతించినప్పుడు కోపం వలన ఆయన విసిరేసిన పలకలను ఎత్తుకున్నారు (తీసుకున్నారు). ఈ పలకల్లో తమ ప్రభువుతో భయపడే వారి కొరకు,ఆయన శిక్ష నుండి భయపడే వారి కొరకు అప మార్గము నుండి సన్మార్గమును చూపటం,సత్యమును ప్రకటించటం పొందపరచబడి ఉంది,కారుణ్యము అందులో ఉన్నది.
अरबी तफ़सीरें:
وَاخْتَارَ مُوْسٰی قَوْمَهٗ سَبْعِیْنَ رَجُلًا لِّمِیْقَاتِنَا ۚ— فَلَمَّاۤ اَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ اَهْلَكْتَهُمْ مِّنْ قَبْلُ وَاِیَّایَ ؕ— اَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَآءُ مِنَّا ۚ— اِنْ هِیَ اِلَّا فِتْنَتُكَ ؕ— تُضِلُّ بِهَا مَنْ تَشَآءُ وَتَهْدِیْ مَنْ تَشَآءُ ؕ— اَنْتَ وَلِیُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَیْرُ الْغٰفِرِیْنَ ۟
మూసా తన జాతి వారిలోంచి ఉత్తములైన డెబ్బై మందిని తన జాతి వారిలోంచి మూర్ఖులు ఆవు దూడ ఆరాధనకు పాల్పడిన దాని గురించి తమ ప్రభువు వద్ద క్షమాపణ కోరటాన్ని ఎన్నుకున్నారు. వారు హాజరు కావటానికి ఒక నిర్ధారిత సమయమును అల్లాహ్ వారికి వాగ్ధానం చేశాడు. వారు హాజరు అయినప్పుడు అల్లాహ్ ముందు ధైర్యం చూపారు,అల్లాహ్ ను వారికి ప్రత్యక్షంగా చూపించమని మూసాతో కోరారు. వారికి భూకంపం చుట్టుముట్టింది. దాని భయం వలన వారు స్పృహ కోల్పోయారు. చనిపోయారు. ఆ తరువాత మూసా తన ప్రభువుతో కడు వినయంగా వేడుకున్నారు,ఇలా పలికారు : ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారిని తుదిముట్టించదలచుకుంటే,నన్ను వారితోపాటు నేను వారి వద్దకు రాక ముందు తుదిముట్టించదలచుకుంటే నీవు వారిని వినాశనమునకు గురి చేసే వాడివి. ఏమి నీవు మాలోని బుద్ది తక్కువ వారు చేసిన పనికి మమ్మల్ని వినాశనమునకు గురి చేస్తావా ?. నా జాతి వారు ఆవు దూడ ఆరాధనకు పాల్పడినది కేవలం పరీక్ష మాత్రమే,దాని ద్వారా నీవు కోరుకున్న వారిని అపమార్గానికి గురి చేస్తావు,నీవు కోరుకున్న వారిని సన్మార్గం చూపుతావు. నీవే మా విషయాలకు సంరక్షకుడవు. అయితే నీవు మా పాపములను మన్నించు. మాపై నీ విశాలమైన కరుణను కురిపించు. పాపములను మన్నించే,తప్పిదాలను క్షమించే గొప్ప వాడివి నీవే.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• في الآيات دليل على أن الخطأ في الاجتهاد مع وضوح الأدلة لا يعذر فيه صاحبه عند إجراء الأحكام عليه، وهو ما يسميه الفقهاء بالتأويل البعيد.
ఆధారాలు స్పష్టమైన తరువాత జాగరూతలో (ఇజ్తిహాద్ లో) తప్పిదం చేసేవాడి పై ఆదేశాలను జారీ చేసేటప్పుడు అతడు క్షమించదగినవాడు కాడు అన్న దాని గురించి ఆయతుల్లో ఆధారమున్నది. దానిని ధార్మిక విధ్వాంసులు దూరపు వ్యాఖ్యానం (తావీలుల్ బయీద్) అని నామకరణము చేశారు.

• من آداب الدعاء البدء بالنفس، حيث بدأ موسى عليه السلام دعاءه فطلب المغفرة لنفسه تأدُّبًا مع الله فيما ظهر عليه من الغضب، ثم طلب المغفرة لأخيه فيما عسى أن يكون قد ظهر منه من تفريط أو تساهل في رَدْع عَبَدة العجل عن ذلك.
ముందు స్వయం కోసం అర్ధించాలి (దుఆ చేయాలి) ఏ విధంగా నైతే మూసా అలైహిస్సలాం దుఆ చేశారో అలాగా. ఆయన స్వయం కోసం ఆయనకు ఏదైతే కోపం వచ్చినదో దాని విషయంలో అల్లాహ్ తో గౌరవ ప్రదంగా మన్నింపును కోరుకున్నారు,ఆ తరువాత ఆయన సోదరుని కొరకు ఏదైతే ఆవు దూడ ఆరాధకుల విషయంలో దాని నుండి (ఆరాధన నుండి) వారించటంలో ఆయన ద్వారా జరిగిన లోపము,బద్దకము విషయంలో మన్నింపును కోరారో.

• التحذير من الغضب وسلطته على عقل الشخص؛ ولذلك نسب الله للغضب فعل السكوت كأنه هو الآمر والناهي.
కోపము నుండి,అది మనిషి బుద్ధిని ఆక్రమించుకుంటుందన్న దాని నుండి హెచ్చరిక. అందుకనే అల్లాహ్ నిశ్శబ్ధముగా ఉండటమును దాని కొరకు సంబంధమును కలిపాడు ఏవిధంగా నంటే ఆయనే దాని గురించి ఆదేశించే వాడును,వారించే వాడును.

• ضرورة التوقي من غضب الله، وخوف بطشه، فانظر إلى مقام موسى عليه السلام عند ربه، وانظر خشيته من غضب ربه.
అల్లాహ్ కోపం నుండి జాగ్రత్తపడటం,ఆయన అణచివేతకు భయపడటం అవసరం ఉంది. మూసా అలైహిస్సలాం యొక్క స్థానం ఆయన ప్రభువు వద్ద ఎంత ఉండేదో చూడండి,అలాగే ఆయనకు తన ప్రభువు కోపము నుండి భయమును చూడండి.

وَاكْتُبْ لَنَا فِیْ هٰذِهِ الدُّنْیَا حَسَنَةً وَّفِی الْاٰخِرَةِ اِنَّا هُدْنَاۤ اِلَیْكَ ؕ— قَالَ عَذَابِیْۤ اُصِیْبُ بِهٖ مَنْ اَشَآءُ ۚ— وَرَحْمَتِیْ وَسِعَتْ كُلَّ شَیْءٍ ؕ— فَسَاَكْتُبُهَا لِلَّذِیْنَ یَتَّقُوْنَ وَیُؤْتُوْنَ الزَّكٰوةَ وَالَّذِیْنَ هُمْ بِاٰیٰتِنَا یُؤْمِنُوْنَ ۟ۚ
మరియు నీవు ఎవరినైతే ఇహలోకంలో అనుగ్రహాల ద్వారా,మన్నింపుల ద్వారా గౌరవాన్ని ప్రసాదించావో,సత్కార్యములు చేయటానికి సౌభాగ్యమును ప్రసాదించావో,ఎవరి కొరకైతే నీవు నీ దాసుల్లోంచి పుణ్యాత్ముల కొరకు పరలోకంలో స్వర్గాన్ని తయారు చేశావో మమ్మల్ని వారిలోంచి చేయి. నిశ్చయంగా మేము మా తప్పిదమును (లోపమును) అంగీకరించి నీ వైపునకు తౌబా చేస్తున్నాము,మరలుతున్నాము. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు : దౌర్భాగ్య కారకాల ద్వారా ఆచరించే వారిలోంచి నేను కోరుకున్న వారికి నా శిక్షను కలిగింప చేస్తాను. నా యొక్క కారుణ్యం ఇహలోకంలో ప్రతి వస్తువును ఆవరించి ఉన్నది. అల్లాహ్ కారుణ్యం చేరకుండా ఏ సృష్టిరాసి లేదు. దాన్ని (సృష్టిరాసిని) ఆయన అనుగ్రహం,ఆయన ఉపకారం కప్పి ఉన్నది. అయితే అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాటించేవారు,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే వారి కొరకు,ఎవరైతే తమ సంపద నుండి జకాత్ తీసి దాని హక్కు దారులకు ఇస్తారో వారి కొరకు,ఎవరైతే నా ఆయతులపై విశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు తొందరలోనే నేను పరలోకంలో నా కారుణ్యమును వ్రాస్తాను.
अरबी तफ़सीरें:
اَلَّذِیْنَ یَتَّبِعُوْنَ الرَّسُوْلَ النَّبِیَّ الْاُمِّیَّ الَّذِیْ یَجِدُوْنَهٗ مَكْتُوْبًا عِنْدَهُمْ فِی التَّوْرٰىةِ وَالْاِنْجِیْلِ ؗ— یَاْمُرُهُمْ بِالْمَعْرُوْفِ وَیَنْهٰىهُمْ عَنِ الْمُنْكَرِ وَیُحِلُّ لَهُمُ الطَّیِّبٰتِ وَیُحَرِّمُ عَلَیْهِمُ الْخَبٰٓىِٕثَ وَیَضَعُ عَنْهُمْ اِصْرَهُمْ وَالْاَغْلٰلَ الَّتِیْ كَانَتْ عَلَیْهِمْ ؕ— فَالَّذِیْنَ اٰمَنُوْا بِهٖ وَعَزَّرُوْهُ وَنَصَرُوْهُ وَاتَّبَعُوا النُّوْرَ الَّذِیْۤ اُنْزِلَ مَعَهٗۤ ۙ— اُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟۠
ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తున్నారో ఆయన వ్రాయలేని,చదవలేని నిరక్షరాసి. ఆయనపై ఆయన ప్రభువు దైవ వాణిని మాత్రమే అవతరింప చేస్తాడు. ఆయన నామమును,ఆయన గుణాలను,ఆయనపై అవతరింపబడిన దానిని వారు మూసాపై అవతరింపబడిన తౌరాతులో,ఈసాపై అవతరింపబడిన ఇంజీలులో లిఖిత పూర్వకంగా పొందుతారు,దేని మంచి గురించినైతే,మేలు గురించినైతే తెలుస్తుందో దాని గురించే వారికి ఆదేశిస్తాడు. మంచి మనసుల్లో,స్వఛ్ఛమైన స్వభావముల్లో చెడుగా గర్తింపు ఉన్న వాటి నుండి వారిని వారిస్తాడు. అభిరుచులను ఎటువంటి నష్టం లేని తినే వస్తువుల్లోంచి,త్రాగే వస్తువుల్లోంచి,స్త్రీల్లోంచి వారి కొరకు అనుమతినిస్తున్నాడు. వాటిలోంచి అశుధ్దమైన వాటిని వారిపై నిషేధిస్తున్నాడు. వారిపై మోయబడిన కష్టమైన బాధలను తొలగిస్తాడు హత్య చేసిన వాడిని హతమార్చడం అనివార్యమవటం లాంటి ఆ హత్య కావాలని చేసిన,అనుకోకుండా చేసిన. అయితే ఎవరైతే ఇస్రాయీలు సంతతి వారిలో నుండి,ఇతరుల్లో నుండి ఆయనను విశ్వసిస్తారో,ఆయనను గౌరవిస్తారో,ఆయన పెద్దరికాన్ని తెలుపుతారో ఆయన్ని వ్యతిరేకించే సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేస్తారో,సన్మార్గమును చూపే వెలుగుగా ఆయనపై అవతరింపబడిన ఖుర్ఆన్ ను అనుసరిస్తారో వారందరు తాము ఆశించిన వాటిని పొందుతూ తాము భయపడే దాని నుండి పరిరక్షింపబడి సాఫల్యం చెందుతారు.
अरबी तफ़सीरें:
قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ جَمِیْعَا ١لَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ یُحْیٖ وَیُمِیْتُ ۪— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهِ النَّبِیِّ الْاُمِّیِّ الَّذِیْ یُؤْمِنُ بِاللّٰهِ وَكَلِمٰتِهٖ وَاتَّبِعُوْهُ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరి వైపు మీలో నుండి అరబ్బులకు,మీలో నుండి ఆరబేతరులకు అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తగా వచ్చాను. ఆయన ఒక్కడి కొరకే ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు ఆయన కొరకే భూమి పై సామ్రాజ్యాధికారము. పరిశుద్దుడైన ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. ఆయన మృతులను జీవింప జేస్తాడు. జీవించి ఉన్న వారికి మరణాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఓ ప్రజలారా మీరు అల్లాహ్ ను విశ్వసించండి. మరియు వ్రాయలేని,చదవలేని ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మీరు విశ్వసించండి. ఆయన వైపునకు దైవ వాణి ద్వారా ఆయన ప్రభువు తెలిపిన వాటిని మాత్రమే ఆయన తీసుకుని వచ్చారు,ఆయనే అల్లాహ్ ను విశ్వసిస్తున్నారు,ఆయన పై అవతరింప బడిన దానిని,ఆయన కన్న మునుపు ప్రవక్తలపై అవతరింపబడిన వాటిని ఎటువంటి వ్యత్యాసం లేకుండా విశ్వసిస్తున్నారు. మరియు మీరు ఇహపర లోకాల్లో మీ శ్రేయస్సు ఉన్న దాని వైపు మీరు సన్మార్గం పొందుతారని ఆశిస్తు ఆయన తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో ఆయనని అనుసరించండి.
अरबी तफ़सीरें:
وَمِنْ قَوْمِ مُوْسٰۤی اُمَّةٌ یَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ یَعْدِلُوْنَ ۟
మరియు ఇస్రాయీలు సంతతి అయిన మూసా జాతిలో నుండి ఒక వర్గము సత్య ధర్మము పై నిలబడి ఉన్నది. వారు ప్రజలను దాని వైపునకు మార్గదర్శకత్వం వహించే వారు,న్యాయపరంగా నిర్ణయాలు తీసుకువే వారు. దుర్మార్గమునకు పాల్పడే వారు కాదు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• تضمَّنت التوراة والإنجيل أدلة ظاهرة على بعثة النبي محمد صلى الله عليه وسلم وعلى صدقه.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం,ఆయన నీతి గురించి ప్రత్యక్ష ఆధారాలు తౌరాతు,ఇంజీలులో కలవు.

• رحمة الله وسعت كل شيء، ولكن رحمة الله عباده ذات مراتب متفاوتة، تتفاوت بحسب الإيمان والعمل الصالح.
అల్లాహ్ కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉన్నది. కాని అల్లాహ్ కారుణ్యం దాసుల కొరకు వేరు వేరు స్థానాలు కలదై ఉంటుంది. విశ్వాసము,సత్కార్యాలకు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది.

• الدعاء قد يكون مُجْملًا وقد يكون مُفَصَّلًا حسب الأحوال، وموسى في هذا المقام أجمل في دعائه.
సంధర్భాలను బట్టి దుఆ ఒక్కొక్కసారి సంక్షిప్తంగా ఉంటుంది,ఒక్కొక్కసారి వివరణగా ఉంటుంది. మరియు మూసా ఈ స్థానములో తన దుఆను అత్యంత సంక్షిప్తంగా చేసేవారు.

• من صور عدل الله عز وجل إنصافه للقِلَّة المؤمنة، حيث ذكر صفات بني إسرائيل المنافية للكمال المناقضة للهداية، فربما توهَّم متوهِّم أن هذا يعم جميعهم، فَذَكَر تعالى أن منهم طائفة مستقيمة هادية مهدية.
విశ్వాసపరులు తక్కువగా ఉన్నా అల్లాహ్ యొక్క న్యాయ వ్యవహారం ఉండటం అల్లాహ్ న్యాయ స్వరూపాల్లోంచిది. అయితే ఆయన సన్మార్గమును (హిదాయత్ ను) విచ్చిన్నం చేసే,పరిపూర్ణతను వ్యతిరేకించే ఇస్రాయీలు సంతతి వారి లక్షణాలను ప్రస్తావించాడు. సందేహపడేవాడు ఇది వారందరిలో ఉన్నదని సందేహ పడవచ్చు అందుకనే మహోన్నతుడైన అల్లాహ్ వారిలోంచి ఒక వర్గము సవ్యంగా,సన్మార్గము పై ఉన్నదని ప్రస్తావించాడు.

وَقَطَّعْنٰهُمُ اثْنَتَیْ عَشْرَةَ اَسْبَاطًا اُمَمًا ؕ— وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اِذِ اسْتَسْقٰىهُ قَوْمُهٗۤ اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْحَجَرَ ۚ— فَانْۢبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَیْنًا ؕ— قَدْ عَلِمَ كُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْ ؕ— وَظَلَّلْنَا عَلَیْهِمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَیْهِمُ الْمَنَّ وَالسَّلْوٰی ؕ— كُلُوْا مِنْ طَیِّبٰتِ مَا رَزَقْنٰكُمْ ؕ— وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిని పన్నెండు తెగలుగా విభజించాము. మూసాను ఆయన జాతి వారు తమ కొరకు నీళ్ళను ఏర్పాటు చేయమని అల్లాహ్ ను వేడుకోమని కోరినప్పుడు మేము ఆయనకు దైవ వాణి ద్వారా ఓ మూసా మీ చేతి కర్రను రాయి పై కొట్టండి అని ఆదేశించాము. మూసా దానిని కొట్టారు. అప్పుడు దానితో వారి పన్నెండు తెగలకు సమానంగా పన్నెండు ఊటలు ప్రవహించ సాగాయి. వారిలోంచి ప్రతి తెగ నీటిని త్రాగే తమ ప్రత్యేక ప్రదేశమును తెలుసుకుంది. అందులో ఒక తెగ తోపాటు వేరొక తెగ భాగసాములు కారు. వారిపై మేఘమును నీడగా చేశాము. అది వారు నడిచే చోటు నడిచేది. వారు ఆగే చోటు ఆగేది. మరియు మేము వారిపై మా అనుగ్రహాల్లోంచి తేనె మాదిరిగా తియ్యగా ఉండే పానియమును,పిట్టల మాదిరిగా స్వచ్చమైన మాంసము కల చిన్న పక్షులను దించాము. మరియు మేము వారితో ఇలా పలికాము : మీకు మేము ప్రసాదించిన ధర్మ సమ్మతమైన వాటిలోంచి మీరు తినండి. వారి నుండి జరిగిన అన్యాయము,అనుగ్రహాల పట్ల కృతఘ్నత వైఖరి,వాటి పట్ల ఏవిధమైన మర్యాద ఉండాలో ఆ విధమైన మర్యాద లేక పోవటం వలన వారు మాకు ఎటువంటి నష్టం చేకూర్చ లేదు. కాని వారు అల్లాహ్ ఆదేశమునకు వ్యతిరేకించటము,ఆయన అనుగ్రహాలను తిరస్కరించటం లాంటి కార్యాలకు పాల్పడటం వలన వినాశమునకు గురి అయినప్పుడు అనుగ్రహాల వాటాను కోల్పోవటం ద్వారా వారు తమ స్వయానికే అన్యాయం చేసుకున్నారు.
अरबी तफ़सीरें:
وَاِذْ قِیْلَ لَهُمُ اسْكُنُوْا هٰذِهِ الْقَرْیَةَ وَكُلُوْا مِنْهَا حَیْثُ شِئْتُمْ وَقُوْلُوْا حِطَّةٌ وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِیْٓـٰٔتِكُمْ ؕ— سَنَزِیْدُ الْمُحْسِنِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఒక సారి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికిన ఆ సంధర్భాన్ని గుర్తు చేసుకోండి మీరు బైతుల్ మఖ్దిస్ లో ప్రవేశించండి. దాని బస్తీ నుండి ఫలాలను మీరు ఏ చోటు నుండి,ఏ సమయములో మీరు కోరుకుంటే అప్పుడు తినండి. మరియు మీరు ఓ మా ప్రభువా మా పాపములను మన్నించు అని అనండి. మరియు మీరు మీ ప్రభువు కొరకు సాష్టాంగపడుతూ అణుకువతో ద్వారం గుండా ప్రవేశించండి. ఒక వేళ మీరు ఇలా చేస్తే మేము మీ పాపములను మన్నించి వేస్తాము. మరియు తొందరలోనే మేము సజ్జనులకు ఇహపర లోకాల మేళ్ళను (శుభాలను) ఎక్కువగా ప్రసాదిస్తాము.
अरबी तफ़सीरें:
فَبَدَّلَ الَّذِیْنَ ظَلَمُوْا مِنْهُمْ قَوْلًا غَیْرَ الَّذِیْ قِیْلَ لَهُمْ فَاَرْسَلْنَا عَلَیْهِمْ رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا یَظْلِمُوْنَ ۟۠
వారిలోంచి దుర్మార్గులు తమకు ఆదేశించబడిన మాటను మార్చి వేశారు. మన్నింపును వేడుకోమని వారికి ఆదేశించబడిన ఆదేశమునకు బదులుగా హబ్బతున్ ఫీ షరతిన్ అని పలికారు. మరియు వారు వారికి ఆదేశించబడిన కార్యమును మార్చి వేశారు. వారు అల్లాహ్ కొరకు అణకువతో తమ శిరసాలను వంచుతూ ప్రవేశించటమునకు బదులుగా తమ పిరుదులపై పాకుతూ ప్రవేశించారు. అయితే మేము వారి దుర్మార్గము వలన వారిపై ఆకాశము నుండి శిక్షను కురిపించాము.
अरबी तफ़सीरें:
وَسْـَٔلْهُمْ عَنِ الْقَرْیَةِ الَّتِیْ كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ ۘ— اِذْ یَعْدُوْنَ فِی السَّبْتِ اِذْ تَاْتِیْهِمْ حِیْتَانُهُمْ یَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَّیَوْمَ لَا یَسْبِتُوْنَ ۙ— لَا تَاْتِیْهِمْ ۛۚ— كَذٰلِكَ ۛۚ— نَبْلُوْهُمْ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟
ఓ ప్రవక్త మీరు యూదులను వారి పూర్వికులను అల్లాహ్ శిక్షించిన వైనమును గుర్తు చేస్తూ సముద్రానికి దగ్గరలో ఉండే బస్తీ వారి సంఘటనను గురించి అడగండి. వారు శనివారము రోజున వేటాడటం నుండి వారిని వారించినప్పటికి వేటాడి అల్లాహ్ హద్దులను దాటివేశారు. అల్లాహ్ వారిని పరీక్షించినాడు. చేపలు సముద్ర ఉపరితలంపై ప్రత్యక్షమై వారి వద్దకు శనివారం రోజు వచ్చేవి. ఇతర దినముల్లో అవి వారి వద్దకు వచ్చేవి కావు. వారు విధేయత నుండి తొలగి పోవటం వలన,అవిధేయత కార్యాలకు పాల్పడటం వలన అల్లాహ్ వారిని ఇలా పరీక్షించాడు. వాటిని వేటాడటం కొరకు తమ వలలను ఏర్పాటు చేసి,గుంతలను త్రవ్వి వ్యూహం పన్నారు.పెద్ద పెద్ద చేపలు శనివారం రోజు వచ్చి వాటిలో పడేవి. ఆదివారం రోజున వారు వాటిని పట్టుకుని తినేవారు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• الجحود والكفران سبب في الحرمان من النعم.
తిరస్కారము,కృతఘ్నత అనుగ్రహాలను కోల్పోవటానికి కారణమవుతాయి.

• من أسباب حلول العقاب ونزول العذاب التحايل على الشرع؛ لأنه ظلم وتجاوز لحدود الله.
యాతన కలగటానికి,శిక్ష కురవటానికి కారణాల్లోంచి ధర్మాన్ని అతిక్రమించటం ఒకటి. ఎందుకంటే అది దుర్మార్గము,అల్లాహ్ హద్దులను దాటటం.

وَاِذْ قَالَتْ اُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُوْنَ قَوْمَا ۙ— ١للّٰهُ مُهْلِكُهُمْ اَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا ؕ— قَالُوْا مَعْذِرَةً اِلٰی رَبِّكُمْ وَلَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
ఓ ప్రవక్తా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి వారిలోంచి ఒక వర్గము వారిని ఈ దుష్కార్యము నుండి వారిస్తున్నది,దాని నుండి వారిని హెచ్చరిస్తుంది. అయితే వారిని ఉద్దేశించి ఇంకో వర్గం ఇలా పలికింది : ఆ వర్గాన్ని ఎవరినైతే అల్లాహ్ ఇహలోకంలో వారు చేసుకున్న అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) వినాశనం చేయబోతున్నాడో లేదా వారిని ప్రళయ దినాన కఠిన శిక్షకు గురి చేయబోతున్నాడో వారిని మీరు ఎందుకు హితోపదేశం చేస్తున్నారు ?. హితోపదేశం చేసేవారు ఇలా పలికారు : వారికి మా హితోపదేశం అల్లాహ్ మాకు ఆదేశించిన మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించే కార్యం చేయటం ద్వారా అల్లాహ్ వద్ద సంజాయిషీ చెప్పుకోవటానికి కడకు దానిని వదిలి వేయటం ద్వారా అల్లాహ్ మనల్ని శిక్షించకుండా ఉండటానికి,వారు హితోపదేశం ద్వారా ప్రయోజనం చెంది తాము ఉన్న అవిధేయ కార్యల నుండి వైదొలుగుతారని.
अरबी तफ़सीरें:
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖۤ اَنْجَیْنَا الَّذِیْنَ یَنْهَوْنَ عَنِ السُّوْٓءِ وَاَخَذْنَا الَّذِیْنَ ظَلَمُوْا بِعَذَابٍۭ بَىِٕیْسٍ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟
అయితే ఎప్పుడైతే అవిధేయులు (పాపాత్ములు) హిత బోధకుల హిత బోధన నుండి విముఖత చూపారో,ఆగలేదో చెడు నుంచి వారించిన వారిని మేము శిక్ష నుండి రక్షించినాము,శనివారం రోజు వేటాడి హద్దు మీరి దుర్మార్గమునకు పాల్పడిన వారిని అల్లాహ్ విధేయత నుండి వారు తొలిగి పోవటం వలన,పాప కార్యాల్లో (అవిధేయ కార్యాల్లో) వారి తలబిరుసు తనం వలన మేము కఠినమైన శిక్ష ద్వారా పట్టుకున్నాము.
अरबी तफ़सीरें:
فَلَمَّا عَتَوْا عَنْ مَّا نُهُوْا عَنْهُ قُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِىِٕیْنَ ۟
మరియు ఎప్పుడైతే వారు గర్వంగా,మొండిగా అల్లాహ్ కు అవిధేయతలో హద్దుమీరి పోయారో, హితోపదేశమును గ్రహించలేదో వారితో మేము ఇలా అన్నాము : "ఓ అవిధేయులారా మీరు నీచమైన కోతులుగా మారిపోండి". అప్పుడు వారు మేము కోరిన విధంగా అయిపోయారు. మేము ఏదైన వస్తువును తలచుకుంటే మా ఆదేశం ఇలా ఉంటుంది. మేము దానితో అంటాము "నీవు అయిపో" అది అయిపోతుంది.
अरबी तफ़सीरें:
وَاِذْ تَاَذَّنَ رَبُّكَ لَیَبْعَثَنَّ عَلَیْهِمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ مَنْ یَّسُوْمُهُمْ سُوْٓءَ الْعَذَابِ ؕ— اِنَّ رَبَّكَ لَسَرِیْعُ الْعِقَابِ ۖۚ— وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా యూదులపై వారి ఇహలోక జీవితంలో ప్రళయదినం వరకు వారిని అవమానానికి గురి చేసే వారిని,పరాభవమునకు గురి చేసే వారిని అంటగడతాడని అల్లాహ్ ఎటువంటి సందేహం లేని స్పష్టంగా చేసిన ప్రకటన చేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు తనపై అవిధేయత చూపే వారిని శీఘ్రంగా శిక్షిస్తాడు. చివరికి ఆయన ఇహలోకంలోనే అతనిని శిక్షించటంలో తొందర చేస్తాడు. తన దాసుల్లోంచి అతనితో పాపముల మన్నింపు వేడుకునే వారిని క్షమించే వాడును,వారిపై అపారంగా కరుణించే వాడును.
अरबी तफ़सीरें:
وَقَطَّعْنٰهُمْ فِی الْاَرْضِ اُمَمًا ۚ— مِنْهُمُ الصّٰلِحُوْنَ وَمِنْهُمْ دُوْنَ ذٰلِكَ ؗ— وَبَلَوْنٰهُمْ بِالْحَسَنٰتِ وَالسَّیِّاٰتِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
మరియు మేము వారిని భూమండలంలో (తెగలుగా,వర్గాలుగా) విభజించాము,అందులో వారు కలిసి ఉన్నప్పటికీ మేము వారిని అనేక వర్గాలుగా చీల్చి వేశాము. వారిలోంచి కొందరు అల్లాహ్ యొక్క హక్కులను,ఆయన దాసుల యొక్క హక్కులను నిర్వర్తించే సజ్జనులు ఉన్నారు. వారిలోంచి మధ్యే మార్గమును అనుసరించే వారు ఉన్నారు. వారిలోంచి అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) తమపై అన్యాయము చేసుకునే వారు ఉన్నారు. మరియు మేము వారిని సౌలభ్యము ద్వారా కష్టతరము ద్వారా వారు ఉన్న స్థితి నుండి మరలుతారని ఆశిస్తూ పరీక్షించినాము.
अरबी तफ़सीरें:
فَخَلَفَ مِنْ بَعْدِهِمْ خَلْفٌ وَّرِثُوا الْكِتٰبَ یَاْخُذُوْنَ عَرَضَ هٰذَا الْاَدْنٰی وَیَقُوْلُوْنَ سَیُغْفَرُ لَنَا ۚ— وَاِنْ یَّاْتِهِمْ عَرَضٌ مِّثْلُهٗ یَاْخُذُوْهُ ؕ— اَلَمْ یُؤْخَذْ عَلَیْهِمْ مِّیْثَاقُ الْكِتٰبِ اَنْ لَّا یَقُوْلُوْا عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ وَدَرَسُوْا مَا فِیْهِ ؕ— وَالدَّارُ الْاٰخِرَةُ خَیْرٌ لِّلَّذِیْنَ یَتَّقُوْنَ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
అప్పుడు వారందరి తరువాత వారి ప్రాతినిద్యమును వహిస్తూ చెడ్డవారు వచ్చారు. వారు తమ పూర్వికుల నుండి తౌరాతును పుచ్చుకున్నారు. వారు దానిని చదివే వారు,అందులో ఉన్న వాటిని ఆచరించేవారు కాదు. అల్లాహ్ గ్రంధాన్నివక్రీకరించటానికి,అందులో అవతరింపబడని ఆదేశమును ఇవ్వటానికి ప్రాపంచిక నాసిక రకమైన సామగ్రిని లంచముగా పుచ్చుకునేవారు. వారి పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు అని వారు నమ్మేవారు. ఒక వేళ ప్రాపంచిక సాధారణ సామగ్రి వారి వద్దకు వస్తే దాన్ని వారు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు. ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా అల్లాహ్ పై సత్యమును తప్ప వేరేది మాట్లాడ కూడదని వీరందరితో అల్లాహ్ వాగ్ధానములను,నిభందనలను తీసుకోలేదా ?. గ్రంధంపై ఆచరణ వారు జ్ఞానం లేకుండా కాదు జ్ఞానం ఉండే వదిలేశారు. అందులో ఉన్న వాటిని చదివారు,దానిని తెలుసుకున్నారు. వారి పాపము చాలా తీవ్రమైనది. అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారి కొరకు పరలోక నిలయము,పరలోకములో ఉండే శాస్వత అనుగ్రహాలు ఈ అశాస్వత సామగ్రి కన్న మేలైనవి. అయితే ఏమిటీ దైవభీతి కల వారి కొరకు అల్లాహ్ పరలోకంలో తయారు చేసి ఉన్నది మేలైనదని,శాస్వతమైనదని ఈ సాధారణమైన (అల్పమైన) సామగ్రిని పుచ్చుకునే వారందరు గ్రహించలేరా ?.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ یُمَسِّكُوْنَ بِالْكِتٰبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ— اِنَّا لَا نُضِیْعُ اَجْرَ الْمُصْلِحِیْنَ ۟
మరియు ఎవరైతే గ్రంధంపై పట్టు కలిగి ఉన్నారో,అందులో ఉన్న వాటన్నింటిని ఆచరిస్తారో,నమాజులను వాటి వేళలను,వాటి షరతులను,వాటి అనివార్య కార్యాలను,వాటి సున్నతులను పరిరక్షిస్తూ పాటిస్తారో వారందరిని తొందరలోనే అల్లాహ్ వారి ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అయితే అల్లాహ్ పుణ్యపరంగా ఉండే ఆచరణ కలిగిన వారి ప్రతిఫలాన్ని వృధా చేయడు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• إذا نزل عذاب الله على قوم بسبب ذنوبهم ينجو منه من كانوا يأمرون بالمعروف وينهون عن المنكر فيهم.
ఏదైన జాతి వారిపై వారి యొక్క పాపముల వలన అల్లాహ్ శిక్ష వచ్చి పడితే వారిలో నుండి ఎవరైతే మంచి గురించి ఆదేశిస్తారో,చెడు నుండి వారిస్తారో వారు దాని నుండి మోక్షం పొందుతారు.

• يجب الحذر من عذاب الله؛ فإنه قد يكون رهيبًا في الدنيا، كما فعل سبحانه بطائفة من بني إسرائيل حين مَسَخَهم قردة بسبب تمردهم.
అల్లాహ్ శిక్ష విషయంలో జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ఎందుకంటే అది ఇహలోకంలో భయంకరంగా ఉంటుంది ఏవిధంగా అంటే ఇస్రాయీలు సంతతివారిలో నుండి ఒక వర్గమును వారి తిరుగుబాటు కారణంగా అల్లాహ్ సుబహానహు వతఆలా వారి రూపాలను మార్చి కోతుల మాదిరిగా చేశాడో ఆవిధంగా (ఉంటుంది).

• نعيم الدنيا مهما بدا أنه عظيم فإنه قليل تافه بجانب نعيم الآخرة الدائم.
అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిపై అవమానమును,దారిద్య్రమును రాసేశాడు. మరియు వారి దుర్మార్గం వలన,మరలి పోవటం వలన ప్రతీ కాలంలో వారిని బాధ పెట్టే వారిని వారిపై పంపించాలని ప్రకటించాడు.

• أفضل أعمال العبد بعد الإيمان إقامة الصلاة؛ لأنها عمود الأمر.
ఇహలోక అనుగ్రహాలు ఒక వేళ అవి పెద్దవిగా కనబడిన పరలోక శాశ్వత అనుగ్రహాల ముందు అవి అల్పమైనవి,తక్కువైనవి.

• كتب الله على بني إسرائيل الذلة والمسكنة، وتأذن بأن يبعث عليهم كل مدة من يذيقهم العذاب بسبب ظلمهم وانحرافهم.
విశ్వాసము తరువాత దాసుని యొక్క ఆచరణల్లో నమాజును నెలకొల్పటం ఎంతో గొప్పదైనది. ఎందుకంటే అది ఆచరణల మూల స్తంభము.

وَاِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَاَنَّهٗ ظُلَّةٌ وَّظَنُّوْۤا اَنَّهٗ وَاقِعٌ بِهِمْ ۚ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِیْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟۠
ఓ ప్రవక్తా ఇస్రాయీలు సంతతివారు తౌరాతులో ఉన్న వాటిని స్వీకరించటం నుండి నిరాకరించినప్పుడు మేము పర్వతమును పెకలించి వారిపై తీసుకుని వచ్చి నిలబెట్టినప్పటి సంఘటనను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఆ పర్వతం వారి తలలకు నీడనిచ్చే మేఘముగా మారిపోయినది. అది వారిపై ఖచ్చితంగా వచ్చి పడుతుందని వారు అనుకున్నారు. మరియు వారితో ఇలా తెలపటం జరిగింది : మేము మీకు ప్రసాదించిన దానిని మీరు కష్టపడే తత్వంతో,జాగరూకతతో,దృడ సంకల్పంతో పుచ్చుకోండి. మరియు మీ కొరకు అల్లాహ్ నిర్దేశించినవి అందులో ఉన్నటువంటి ఆదేశాలను మీరు నెలకొల్పినప్పుడు అల్లాహ్ భయభీతి కలిగి ఉంటారని ఆశిస్తూ మీరు గర్తుంచుకోండి,వాటిని మరవకండి.
अरबी तफ़सीरें:
وَاِذْ اَخَذَ رَبُّكَ مِنْ بَنِیْۤ اٰدَمَ مِنْ ظُهُوْرِهِمْ ذُرِّیَّتَهُمْ وَاَشْهَدَهُمْ عَلٰۤی اَنْفُسِهِمْ ۚ— اَلَسْتُ بِرَبِّكُمْ ؕ— قَالُوْا بَلٰی ۛۚ— شَهِدْنَا ۛۚ— اَنْ تَقُوْلُوْا یَوْمَ الْقِیٰمَةِ اِنَّا كُنَّا عَنْ هٰذَا غٰفِلِیْنَ ۟ۙ
ఓ ముహమ్మద్ మీరు ఒక సారి గుర్తు చేసుకోండి నీ ప్రభువు ఆదమ్ సంతతి వీపుల నుండి వారి సంతానమును తీసి వారి స్వభావములో నాటిన వాగ్ధానము ద్వారా తన దైవత్వమును (రుబూబియత్ ను) నిరూపించటానికి వారితో నేను మీ ప్రభువును కానా ? అని పలుకుతూ ప్రమాణం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన వారి సృష్టి కర్త,వారి ప్రభువు. వారందరు ఎందుకు కాదు నీవు మా ప్రభువు అని సమాధానమిచ్చారు. ఆయన (అల్లాహ్) ఇలా సమాధానమిచ్చాడు : మీరు ప్రళయ దినాన మీపై ఉన్న అల్లాహ్ వాదనను నిరాకరించకుండా ఉండటానికి,దాని గురించి మీరు మీకు జ్ఞానం లేదు అని అనకుండా ఉండటానికి మేము మిమ్మల్ని పరీక్షించినాము,మీపై ప్రమాణమును తీసుకున్నాము.
अरबी तफ़सीरें:
اَوْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اَشْرَكَ اٰبَآؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّیَّةً مِّنْ بَعْدِهِمْ ۚ— اَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُوْنَ ۟
లేదా మీ తాత ముత్తాతలు వారే వాగ్ధానమును (ఒప్పందమును) భంగపరచి అల్లాహ్ తోపాటు సాటి కల్పించారని,మీరు మీ తాతముత్తాతలను షిర్కు (బహుదైవారాధన) చేస్తుండగా పొంది వారిని అనుకరించే వారని అప్పుడు మీరు ఓ ప్రభువా మా తాత ముత్తాతలు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి తమ ఆచరణలను వృధా చేసుకున్న వారి చర్యపై మమ్మల్ని పట్టుకుంటావా ,మమ్మల్ని శిక్షిస్తావా అని ? వాదించకుండా ఉండటానికి. మా అజ్ఞానము వలన మా తాత ముత్తాతలను మేము అనుకరించటం వలన మాదే పాపము లేదు.
अरबी तफ़सीरें:
وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ وَلَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
తిరస్కారులైన జాతుల పరిణామం విషయంలో సూచనలను మేము స్పష్ట పరచినట్లు వీరందరు షిర్కు నుండి అల్లాహ్ ఒక్కడి ఏకత్వము వైపునకు,ఆయన ఆరాధన వైపునకు ఏదైతే వారు వాగ్ధానములో అల్లాహ్ కొరకు తమపై తప్పనిసరి చేసుకున్నారో మరలుతారని ఆశిస్తూ వాటిని అదేవిధంగా మేము స్పష్ట పరుస్తాము.
अरबी तफ़सीरें:
وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ الَّذِیْۤ اٰتَیْنٰهُ اٰیٰتِنَا فَانْسَلَخَ مِنْهَا فَاَتْبَعَهُ الشَّیْطٰنُ فَكَانَ مِنَ الْغٰوِیْنَ ۟
ఓ ప్రవక్తా ఇస్రాయీలు సంతతి వారికి ఆ వ్యక్తి యొక్క సమాచారమును (వృత్తాంతమును) చదివి వినిపించండి. అతనికి మేము మా సూచనలను (ఆయతులను) ప్రసాదించినాము. అతడు వాటిని తెలుసుకున్నాడు. అవి నిర్దేశిస్తున్న సత్యమును అతను అర్ధం చేసుకున్నాడు. కాని అతను వాటిని ఆచరించలేదు. అంతే కాదు అతడు వాటిని వదిలేశాడు,వాటి నుండి దూరమైపోయాడు. అప్పుడు షైతాను అతని వెంట పడిపోయాడు. అతనికి స్నేహితుడైపోయాడు. అయితే అతడు సన్మార్గం పొంది సాఫల్యం చెందిన వారిలోంచి అయిన తరువాత మార్గభ్రష్టుడై వినాశనం పొందే వారిలోంచి అయిపోయాడు.
अरबी तफ़सीरें:
وَلَوْ شِئْنَا لَرَفَعْنٰهُ بِهَا وَلٰكِنَّهٗۤ اَخْلَدَ اِلَی الْاَرْضِ وَاتَّبَعَ هَوٰىهُ ۚ— فَمَثَلُهٗ كَمَثَلِ الْكَلْبِ ۚ— اِنْ تَحْمِلْ عَلَیْهِ یَلْهَثْ اَوْ تَتْرُكْهُ یَلْهَثْ ؕ— ذٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ۚ— فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ ۟
ఒక వేళ మేము ఈ ఆయతుల ద్వారా అతని లాభమును ఆశిస్తే అతను వాటిపై ఆచరించే సౌభాగ్యమును కలిగించి మేము అతనిని ఉన్నత స్థానాలకు చేర్చుతాము. అప్పుడు అతను ఇహపరాల్లో ఉన్నత స్థానమును పొందుతాడు. కాని అతను తన పరలోకము పై ఇహలోకమునకు ప్రాధాన్యతనిస్తూ ప్రాపంచిక కోరికల వైపు వాలిన వేళ అతను తన ఓటమికి కారణమయ్యే వాటిని ఎంచుకున్నాడు. మరియు తన మనస్సు కోరే అసత్యాలను అనుసరించాడు. ఇహలోకంపై అత్యాశ యొక్క తీవ్రతలో అతని ఉపమానము కుక్క ఉపమానము లాంటిది. అది అన్ని పరిస్థితుల్లో నాలుకను బయటకు తీసి రొప్పుతూ ఉంటుంది. ఒక వేళ అది కట్టివేయబడినా నాలుక బయటకు తీసి రొప్పుతుంది,తరిమేసినా రొప్పుతుంది. ఈ ప్రస్తావించబడిన ఉపమానము మా ఆయతులను తిరస్కరించటం వలన మార్గభ్రష్టులైన జాతి వారి ఉపమానము. అయితే ఓ ప్రవక్తా మీరు వారు యోచన చేసి వారు ఉన్న తిరస్కారము,మార్గభ్రష్టతను విడనాడుతారని ఆశిస్తూ వారికి ఈ గాధలను వినిపిస్తూ ఉండండి.
अरबी तफ़सीरें:
سَآءَ مَثَلَا ١لْقَوْمُ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَاَنْفُسَهُمْ كَانُوْا یَظْلِمُوْنَ ۟
మా వాదనలను,మా ఆధారాలను తిరస్కరించి,వాటిని విశ్వసించని వారి కంటే ఎక్కువ హీనులు ఉండరు. దీని వలనే వారందరు విధ్వంసమును కొని తెచ్చుకోవటం ద్వారా తమను తాము హింసించుకున్నారు.
अरबी तफ़सीरें:
مَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِیْ ۚ— وَمَنْ یُّضْلِلْ فَاُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟
ఎవరికైతే అల్లాహ్ తన సన్మార్గమైన ఋజు మార్గము కొరకు సౌభాగ్యమును కలిగింప జేస్తాడో అతడే వాస్తవానికి ఋజు మార్గంపై ఉన్నాడు. మరియు ఎవరినైతే ఆయన సన్మార్గము నుండి దూరం చేస్తాడో వారందరు వాస్తవానికి తమకు తాము తమ వాటాలను కోల్పోయిన వారవుతారు. వారే తమని,తమ ఇంటి వారిని ప్రళయదినాన నష్టం కలిగించిన వారవుతారు. వినండి అదే స్పష్టమైన నష్టము.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• المقصود من إنزال الكتب السماوية العمل بمقتضاها لا تلاوتها باللسان وترتيلها فقط، فإن ذلك نَبْذ لها.
దివ్య గ్రంధాల అవతరణ ఉద్దేశం వాటికి తగ్గట్టుగా ఆచరించాలి. కేవలం వాటిని నాలుకతో చదవటం,ఆగి ఆగి (తర్తీలుతో) చదవటం కాదు. అలా చేస్తే వాటిని నిరాకరించటమే (అంటే ఆచరణ లేకుండా కేవలం చదవటం వాటిని నిరాకరించటం అవుతుంది).

• أن الله خلق في الإنسان من وقت تكوينه إدراك أدلة الوحدانية، فإذا كانت فطرته سليمة، ولم يدخل عليها ما يفسدها أدرك هذه الأدلة، وعمل بمقتضاها.
అల్లాహ్ మానవుడిని సృష్టించినప్పటి నుండి మానవునిలో ఏకత్వము యొక్క ఆధారాల జ్ఞానమును సృష్టించినాడు. అతని స్వభావము సరిగా ఉన్నంత వరకు అందులో ఈ ఆధారాలను పొందటం నుండి,వాటికి తగ్గట్టుగా ఆచరణ నుండి పాడు చేసే విషయాలు ప్రవేశించవు.

• في الآيات عبرة للموفَّقين للعمل بآيات القرآن؛ ليعلموا فضل الله عليهم في توفيقهم للعمل بها؛ لتزكو نفوسهم.
ఖుర్ఆన్ ఆయతులపై ఆచరించే సౌభాగ్యం కలిగిన వారికి వాటిని ఆచరించే సౌభాగ్యము వారికి కలిగించే విషయంలో వారిపై అల్లాహ్ అనుగ్రహమును వారు తెలుసుకోవటం కొరకు,వారు తమ మనస్సులను శుద్ధపరచటం కొరకు సూచనల్లో గుణపాఠం ఉన్నది.

• في الآيات تلقين للمسلمين للتوجه إلى الله تعالى بطلب الهداية منه والعصمة من مزالق الضلال.
ఆయతుల్లో ముస్లిములను అల్లాహ్ తో సన్మార్గమును,మార్గభ్రష్టతలో జారటం నుండి రక్షణను కోరుతూ ఆయన వైపునకు మరలటం గురించి నేర్పించటం జరిగింది

وَلَقَدْ ذَرَاْنَا لِجَهَنَّمَ كَثِیْرًا مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ۖؗ— لَهُمْ قُلُوْبٌ لَّا یَفْقَهُوْنَ بِهَا ؗ— وَلَهُمْ اَعْیُنٌ لَّا یُبْصِرُوْنَ بِهَا ؗ— وَلَهُمْ اٰذَانٌ لَّا یَسْمَعُوْنَ بِهَا ؕ— اُولٰٓىِٕكَ كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْغٰفِلُوْنَ ۟
మా (ముందస్తు) జ్ఞానము వలన ఎంతో మంది జిన్నాతులను,ఎంతో మంది మానవులను వారు నరక వాసుల చర్యకు పాల్పడుతారని నరకం కొరకు సృష్టించినాము. వారికి హృదయాలు ఉన్నవి వాటి ద్వారా వారు తమకు ఏది లాభం చేకూరుస్తుందో,ఏది నష్టం కలిగిస్తుందో గ్రహించలేరు. వారికి కళ్ళు ఉన్నవి వాటి ద్వారా వారు తమలో,సృష్టిలో ఉన్న అల్లాహ్ యొక్క సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి చూడలేరు. వారికి చెవులు ఉన్నవి వాటి ద్వారా అల్లాహ్ యొక్క ఆయతుల్లో ఉన్న దానిని యోచన చేయటానికి వినలేరు. ఈ గుణాలను కలిగిన వీరందరు బుద్దిని కోల్పోవటంలో పశువుల్లాంటి వారు. కాదు వారు మార్గ విహీనతలో పశువుల కంటే చాలా దూరం వెళ్ళిపోయారు. వారందరు అల్లాహ్ పై,పరలోకం పై విశ్వాసము నుండి పరధ్యానంలో పడిపోయారు.
अरबी तफ़सीरें:
وَلِلّٰهِ الْاَسْمَآءُ الْحُسْنٰی فَادْعُوْهُ بِهَا ۪— وَذَرُوا الَّذِیْنَ یُلْحِدُوْنَ فِیْۤ اَسْمَآىِٕهٖ ؕ— سَیُجْزَوْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
అల్లాహ్ కొరకు ఆయన గొప్పతనమును,ఆయన పరిపూర్ణతను సూచించే మంచి మంచి పేర్లు కలవు. వాటి ద్వారా మీరు కోరుకుంటున్న వాటిని అడుగుతూ అల్లాహ్ తో వేడుకోండి. వాటి ద్వారా ఆయన్ను పొగడండి. మరియు ఈ నామములను అల్లాహేతరుల కొరకు చేసి,లేదా వాటిని ఆయన నుండి నిరాకరించి లేదా వాటి అర్ధాన్ని మార్చి లేదా వాటి ద్వారా ఆయనను వదిలి వేరే వారికి పోల్చి వాటి విషయంలో విముఖత చూపే వారిని మీరు వదిలి వేయండి. వాటి ద్వారా సత్యము నుండి విముఖత చూపే వీరందరికి మేము తొందరలోనే వారు చేసిన కార్యాలకు ప్రతిఫలంగా బాధాకరమైన శిక్షను ప్రసాదిస్తాము.
अरबी तफ़सीरें:
وَمِمَّنْ خَلَقْنَاۤ اُمَّةٌ یَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ یَعْدِلُوْنَ ۟۠
మేము సృష్టించిన వారిలో స్వయంగా సత్యానికి అనుగుణంగా సన్మార్గమును పొందే,వారే కాకుండా ఇతరులు కూడా సన్మార్గం పొందటానికి దాని వైపున పిలిచే,దాని ద్వారా న్యాయ పూరితంగా,దుర్మార్గమునకు పాల్పడకుండా నిర్ణయం తీసుకునే ఒక సముదాయం (వర్గం) ఉన్నది.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِّنْ حَیْثُ لَا یَعْلَمُوْنَ ۟ۚ
మరియు ఎవరైతే మన ఆయతులను తిరస్కరిస్తారో,వాటిని విశ్వసించరో అంతే కాకుండా వాటిని నిరాకరిస్తారో వారి కొరకు మేము తొందరలోనే ఆహారోపాధి ద్వారాలను వారికి గౌరవప్రదంగా కాకుండా వారిని వారు ఉన్న మార్గ భ్రష్టతలో ఇంకా పెరిగిపోయే వరకు క్రమక్రమంగా బిగుసుపోయే వరకు తెరుస్తాము. మరల వారు పరధ్యానంలో ఉన్నప్పుడు మా శిక్ష వారిపై వచ్చి పడుతుంది.
अरबी तफ़सीरें:
وَاُمْلِیْ لَهُمْ ؕ— اِنَّ كَیْدِیْ مَتِیْنٌ ۟
వారు శిక్షించబడరని సందేహపడే వరకు,వారిపై శిక్ష పెంచబడే వరకు తమ తిరస్కారము,తమ అవిశ్వాసము పై కొనసాగటం కొరకు నేను వారి నుండి శిక్షను ఆలస్యం చేస్తాను. నిశ్చయంగా నా వ్యూహం బలమైనది. అయితే నేను వారిపై దాతృత్వం చూపిస్తాను. వారు నిరాశులు కావాలని (విఫలం కావాలని) నేను కోరుకుంటున్నాను.
अरबी तफ़सीरें:
اَوَلَمْ یَتَفَكَّرُوْا ٚ— مَا بِصَاحِبِهِمْ مِّنْ جِنَّةٍ ؕ— اِنْ هُوَ اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిచ్చివారు కాదని,అల్లాహ్ శిక్ష గురించి స్పష్టంగా హెచ్చరించటం కొరకు అల్లాహ్ ఆయనను హెచ్చరికునిగా పంపించిన సందేశహరుడు మాత్రమే అని వారికి స్పష్టం అవటం కొరకు తమ బుద్దులను పనిలో పెట్టడం ద్వారా ఈ సత్య తిరస్కారులందరు అల్లాహ్ సూచనల్లో,ఆయన ప్రవక్తల్లో ఎందుకు యోచన చేయటం లేదు ?.
अरबी तफ़सीरें:
اَوَلَمْ یَنْظُرُوْا فِیْ مَلَكُوْتِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا خَلَقَ اللّٰهُ مِنْ شَیْءٍ ۙ— وَّاَنْ عَسٰۤی اَنْ یَّكُوْنَ قَدِ اقْتَرَبَ اَجَلُهُمْ ۚ— فَبِاَیِّ حَدِیْثٍ بَعْدَهٗ یُؤْمِنُوْنَ ۟
మరియు వారందరు భూమిలో,ఆకాశములో ఉన్న అల్లాహ్ యొక్క రాజ్యాధికారము వైపునకు గుణపాఠం నేర్చుకునే దృష్టితో ఎందుకు చూడటం లేదు ?. మరియు వాటిలో అల్లాహ్ సృష్టించిన జంతువులను,వృక్షాలను ఇతరత్రా వాటి వైపునకు ఎందుకు చూడటం లేదు ?. సమయం దాటక ముందే పశ్చాత్తాప్పడటానికి తమ సమయాల ముగింపు దగ్గర పడి ఉండవచ్చని ఎందుకు వాటి వైపు చూడటం లేదు ?. అయితే వారు ఖుర్ఆన్ ను,అందులో ఉన్న వాగ్ధానమును,హెచ్చరికను విశ్వసించనప్పుడు దానిని కాకుండా వేరే ఏ గ్రంధాన్ని విశ్వసిస్తారు ?.
अरबी तफ़सीरें:
مَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَا هَادِیَ لَهٗ ؕ— وَیَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
అల్లాహ్ ఎవరినైతే సత్యం వైపునకు మార్గం పొందటం నుండి విఫలం చేస్తాడో,అల్లాహ్ అతనిని సన్మార్గం నుంచి తప్పించి వేస్తాడో అతనని దాని వైపునకు దారి చూపించే వాడు ఎవడూ ఉండడు. అల్లాహ్ వారిని వారి మార్గభ్రష్టతలోనే,వారి తిరస్కారంలోనే అయోమయంలో పడి ఉండేటట్లు,దేని వైపున మార్గం పొందకుండా ఉండేటట్లు వదిలి వేస్తాడు.
अरबी तफ़सीरें:
یَسْـَٔلُوْنَكَ عَنِ السَّاعَةِ اَیَّانَ مُرْسٰىهَا ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّیْ ۚ— لَا یُجَلِّیْهَا لِوَقْتِهَاۤ اِلَّا هُوَ ؔؕۘ— ثَقُلَتْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— لَا تَاْتِیْكُمْ اِلَّا بَغْتَةً ؕ— یَسْـَٔلُوْنَكَ كَاَنَّكَ حَفِیٌّ عَنْهَا ؕ— قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
మొరోటోళ్ళు అయిన సత్యతిరస్కారులు ప్రళయం గురించి అది ఎప్పుడు వస్తుంది,దాని గురించి జ్ఞానము ఎప్పుడు స్థిరపడును ? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ముహమ్మద్ మీరు ఇలా సమాధానమివ్వండి : దాని జ్ఞానము నాకు లేదు,ఇతరులకు లేదు. దాని జ్ఞానము కేవలం ఒక్కడైన అల్లాహ్ కు ఉన్నది. దాని కోసం నిర్ధారించిన వేళ అల్లాహ్ తప్ప ఇంకెవరికి బహిర్గతం అవలేదు. దాని బహిర్గతమయ్యే విషయం ఆకాశ వాసులు,భూ వాసుల పై గోప్యము. అది మీ వద్దకు అకస్మాత్తుగా మాత్రం వస్తుంది. ప్రళయ జ్ఞానం గురించి మీరు అత్యాశ చూపిస్తున్నట్లు వారు మిమ్మల్ని ప్రళయం గురించి ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభువు గురించి మీకు పరిపూర్ణ జ్ఞానం ఉండటం వలన దాని గురించి మీరు అడగటం లేదన్న విషయం వారికి తెలియదు. ఓ ముహమ్మద్ ప్రళయం గురించి జ్ఞానము కేవలం ఒక్కడైన అల్లాహ్ వద్దే ఉన్నదని,కాని చాలా మందికి దాని గురించి తెలియదని వారికి తెలియపరచండి.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• خلق الله للبشر آلات الإدراك والعلم - القلوب والأعين والآذان - لتحصيل المنافع ودفع المضار.
అల్లాహ్ మానవుని కొరకు గ్రహించే,తెలుసుకునే సాధనాలైన హృదయాలు,కళ్ళు,చెవులను ప్రయోజనాలను పొందటానికి,నష్టాలను తొలగించటానికి సృష్టించినాడు.

• الدعاء بأسماء الله الحسنى سبب في إجابة الدعاء، فيُدْعَى في كل مطلوب بما يناسب ذلك المطلوب، مثل: اللهمَّ تب عَلَيَّ يا تواب.
అల్లాహ్ యొక్క మంచి మంచి నామముల ద్వారా దుఆ చేయటం దుఆ స్వీకరించబడటానికి కారణమవును. అయితే కోరుకునే ప్రతి విషయంలో దానికి సరి అగు వాటి ద్వారా దుఆ చేయాలి. ఉదాహరణకి : ఓ మన్నించే వాడా నన్ను మన్నించు {اللهمَّ تب عَلَيَّ يا تواب}.

• التفكر في عظمة السماوات والأرض، والتوصل بهذا التفكر إلى أن الله تعالى هو المستحق للألوهية دون غيره؛ لأنه المنفرد بالصنع.
భూమ్యాకాశాల గొప్పతనం విషయంలో యోచన చేయటం ఆ యోచన ద్వారా అల్లాహ్ ఒక్కడే దైవత్వమునకు అర్హుడు అన్న విషయానికి చేరుకోవటం,ఎందుకంటే తయారు చేయటంలో (సృష్టించటంలో) ఆయన ఒక్కడే.

قُلْ لَّاۤ اَمْلِكُ لِنَفْسِیْ نَفْعًا وَّلَا ضَرًّا اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ— وَلَوْ كُنْتُ اَعْلَمُ الْغَیْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَیْرِ ۛۚ— وَمَا مَسَّنِیَ السُّوْٓءُ ۛۚ— اِنْ اَنَا اِلَّا نَذِیْرٌ وَّبَشِیْرٌ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟۠
ఓ ముహమ్మద్ మీరు తెలియపరచండి : అల్లాహ్ తలచుకుంటేనే తప్ప నేను నా స్వయం కొరకు లాభం చేకూర్చుకునే,నష్టమును దూరం చేసుకునే శక్తి లేదు. అది కేవలం అల్లాహ్ కే చెందుతుంది. అల్లాహ్ నాకు తెలియపరిచినదే నాకు తెలుసు. నాకు అగోచర విషయాల గురించి జ్ఞానము లేదు. ఒక వేళ నాకు అగోచర విషయాల గురించి జ్ఞానముంటే వస్తువలు అవ్వకముందే వాటి గురించి నా జ్ఞానము వలన వాటి వలన జరిగే పరిణామము గురించి నా జ్ఞానము వలన నాకు ప్రయోజనాలను చేకూర్చేవి,నా నుండి నష్టాలను దూరం చేసే కారకాలను తెలుసుకుని వాటినే చేస్తాను. నేను కేవలం అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సందేశహరుడిని మాత్రమే. నేను బాధాకరమైన ఆయన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడతాను. నేను ఆయన సుబహానహు వ తఆలా తరపునుండి ప్రవక్త అని విశ్వసించే,నేను తీసుకుని వచ్చిన దాన్ని సత్యమని విశ్వసించే జాతి వారికి గౌరవప్రదమైన ప్రతిఫలం గురించి శుభవార్తనిస్తాను.
अरबी तफ़सीरें:
هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّجَعَلَ مِنْهَا زَوْجَهَا لِیَسْكُنَ اِلَیْهَا ۚ— فَلَمَّا تَغَشّٰىهَا حَمَلَتْ حَمْلًا خَفِیْفًا فَمَرَّتْ بِهٖ ۚ— فَلَمَّاۤ اَثْقَلَتْ دَّعَوَا اللّٰهَ رَبَّهُمَا لَىِٕنْ اٰتَیْتَنَا صَالِحًا لَّنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِیْنَ ۟
ఓ పురుషులారా,స్త్రీలారా ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి అయిన ఆదమ్ అలైహిస్సలాం నుండి పుట్టించాడు. ఆదమ్ అలైహిస్సలాం నుండి ఆయన భార్య హవ్వాను సృష్టించాడు. ఆయన ఆమెతో తృప్తి చెందటానికి,ఆమె ద్వారా ప్రశాంతతను పొందటానికి ఆమెను అతని ప్రక్కటెముక ద్వారా సృష్టించాడు. భర్త తన భార్యతో సమాగమం జరిపినప్పుడు ఆమె తేలికైన భారం (గర్భం) దాల్చింది. దాని అనుభూతి ఆమెకు కలుగలేదు. ఎందుకంటే అది దాని ఆరంభంలోనే ఉన్నది. ఆమె తన అవసరాల నిమిత్తం అటూ ఇటూ తిరుగుతూ ఎటువంటి బారము అనుభూతి లేకుండా తన గర్భాన్నికొనసాగించింది. అది ఆమే గర్భంలో పెద్దదై దానిని ఆమె భారంగా పొందినప్పుడు భార్యాభర్తలు ఇరువురు ఇలా పలుకుతూ దుఆ చేశారు : ఓ మా ప్రభువా ఒక వేళ నీవు మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీ అనుగ్రహము పై తప్పకుండా కృతజ్ఞత తెలుపుకునే వారమైపోతాము.
अरबी तफ़सीरें:
فَلَمَّاۤ اٰتٰىهُمَا صَالِحًا جَعَلَا لَهٗ شُرَكَآءَ فِیْمَاۤ اٰتٰىهُمَا ۚ— فَتَعٰلَی اللّٰهُ عَمَّا یُشْرِكُوْنَ ۟
అల్లాహ్ వారిద్దరి దుఆను స్వీకరించి వారిద్దరు దుఆ చేసినట్లే వారికి ఏ లోపము లేని సంతానమును ప్రసాదించినప్పుడు వారికి ప్రసాదించిన దానిలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించారు. తమ కుమారుడిని ఇతరులకు పూజించారు. మరియు వారు అతనికి అబ్దుల్ హారిస్ అని పేరు పెట్టారు. అయితే అల్లాహ్ భాగస్వామ్య చేష్టలన్నింటి నుండి అతీతుడు,పరిశుద్ధుడు.ఉలూహియత్,రుబూబియత్ లో ఆయన ఒక్కడే.
अरबी तफ़सीरें:
اَیُشْرِكُوْنَ مَا لَا یَخْلُقُ شَیْـًٔا وَّهُمْ یُخْلَقُوْنَ ۟ۚ
ఏమి వారు ఈ విగ్రహాలను,ఇతర వాటిని ఆరాధన విషయంలో అల్లాహ్ కు సాటి కల్పిస్తున్నారా ? అవి ఆరాధనకు అర్హులు అవ్వటానికి దేనిని సృష్టించలేదని,అవి కూడా సృష్టితాలే అని వారికి తెలుసు. అయితే వారు ఎలా వాటిని అల్లాహ్ కు సాటిగా కల్పిస్తున్నారు ?.
अरबी तफ़सीरें:
وَلَا یَسْتَطِیْعُوْنَ لَهُمْ نَصْرًا وَّلَاۤ اَنْفُسَهُمْ یَنْصُرُوْنَ ۟
ఈ ఆరాధ్య దైవాలకు తమను ఆరాధించే వారికి సహాయం చేసే శక్తిసామర్ధ్యాలు లేవు. మరియు వారి స్వయం కోసం సహాయము చేసుకునే శక్తి లేదు. అటువంటప్పుడు వారు వాటిని ఎలా ఆరాధిస్తున్నారు ?.
अरबी तफ़सीरें:
وَاِنْ تَدْعُوْهُمْ اِلَی الْهُدٰی لَا یَتَّبِعُوْكُمْ ؕ— سَوَآءٌ عَلَیْكُمْ اَدَعَوْتُمُوْهُمْ اَمْ اَنْتُمْ صَامِتُوْنَ ۟
ఓ ముష్రికులారా (సాటి కల్పించేవారా) ఒక వేళ మీరు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న ఈ విగ్రహాలను సన్మార్గం వైపునకు పిలిస్తే వారు మీరు దేని వైపునైతే పిలిచారో దాన్ని స్వీకరించరు. మిమ్మల్ని అనుసరించరు. వారి ముందు దానికొరకు (సన్మార్గం కొరకు) పిలవటం,మరియు మీరు దాని నుండి మౌనంగా ఉండటం రెండూ సమానము. ఎందుకంటే అవి కేవలం బుద్ధి లేని,వినలేని,మాట్లాడలేని జీవం లేని స్థిర రాసులు.
अरबी तफ़सीरें:
اِنَّ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ عِبَادٌ اَمْثَالُكُمْ فَادْعُوْهُمْ فَلْیَسْتَجِیْبُوْا لَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ముష్రికులారా నిశ్చయంగా మీరు ఎవరినైతే అల్లాహ్ ను వదిలి మొరపెట్టుకుంటున్నారో వారందరు అల్లాహ్ కొరకు సృష్టించబడినవారు,ఆయన ఆదీనంలో ఉండేవారు. వారు ఈ విషయంలో మీ లాంటి వారే దీనికి తోడు మీరే ఉన్నత స్థితిలో ఉన్నారు ; ఎందుకంటే మీరు మాట్లాడగలిగే,నడవగలిగే,చూడగలిగే జీవం కలిగినవారు. మరియు మీ విగ్రహాలు అలా లేవు (జీవం లేనివి). అయితే మీరు వారిని మొరపెట్టుకోండి. మీరు వారికి మొరపెట్టుకున్న వాటిలో సత్యవంతులే అయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.
अरबी तफ़सीरें:
اَلَهُمْ اَرْجُلٌ یَّمْشُوْنَ بِهَاۤ ؗ— اَمْ لَهُمْ اَیْدٍ یَّبْطِشُوْنَ بِهَاۤ ؗ— اَمْ لَهُمْ اَعْیُنٌ یُّبْصِرُوْنَ بِهَاۤ ؗ— اَمْ لَهُمْ اٰذَانٌ یَّسْمَعُوْنَ بِهَا ؕ— قُلِ ادْعُوْا شُرَكَآءَكُمْ ثُمَّ كِیْدُوْنِ فَلَا تُنْظِرُوْنِ ۟
మీ అవసరాల్లో శ్రమించటానికి మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న ఈ విగ్రహాలందరికి కాళ్ళు ఉన్నాయా ?. లేదా శక్తితో మీ నుండి గట్టిగా నెట్టడానికి (మీ నుండి తొలగించటానికి ) వారికి చేతులున్నాయా ?. లేదా మీ కంటికి కనబడని వాటిని చూసి మీ కొరకు వెలికి తీయటం కొరకు వారికి కళ్ళు ఉన్నాయా ?. లేదా మీ నుండి గోప్యంగా ఉన్న వాటిని విని వాటి జ్ఞానమును మీకు చేరవేయటానికి వారికి చెవులు ఉన్నాయా ?. ఒకవేళ అవన్ని వారికి లేక పోతే అవి ప్రయోజనాన్ని చేకూరుస్తాయని లేదా నష్టాన్ని దూరం చేస్తాయని ఆశిస్తూ మీరు ఎలా వాటిని ఆరాధిస్తారు. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : మీరు ఎవరినైతే అల్లాహ్ కు సమానంగా చేసుకున్నారో వారిని పిలుచుకోండి. ఆ తరువాత మీరంత నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి. మీరు నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• في الآيات بيان جهل من يقصد النبي صلى الله عليه وسلم ويدعوه لحصول نفع أو دفع ضر؛ لأن النفع إنما يحصل من قِبَلِ ما أرسل به من البشارة والنذارة.
ప్రయోజనం పొందటానికి లేదా నష్టమును దూరం చేయటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించుకుని ఆయనను మొరపెట్టుకునే వారి అజ్ఞానము యొక్క ప్రకటన ఆయతుల్లో ఉన్నది. ఎందుకంటే ప్రయోజనం అన్నది ఆయన దేనినిచ్చి పంపించబడ్డారో ఆ శుభవార్త మరియు హెచ్చరిక ద్వారా కలుగుతుంది.

• جعل الله بمنَّته من نوع الرجل زوجه؛ ليألفها ولا يجفو قربها ويأنس بها؛ لتتحقق الحكمة الإلهية في التناسل.
అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మగవారి జాతి నుండే అతని భార్యను ఆమెతో ప్రేమానురాగాలు వెలుబుచ్చటానికి,ఆమె సామిప్యాన్ని ఆరబెట్టకుండా ఉండటానికి,ఆమెతో అలవాటు అవటానికి పునరుత్పత్తిలో ఉన్న దైవ వివేకమును నిరూపించటానికి సృష్టించాడు.

• لا يليق بالأفضل الأكمل الأشرف من المخلوقات وهو الإنسان أن يشتغل بعبادة الأخس والأرذل من الحجارة والخشب وغيرها من الآلهة الباطلة.
సృష్టిరాసుల్లో శ్రేష్టమైవ,పరిపూర్ణమైన,గౌరవోన్నతుడైన మానవునికి అసత్య దైవాల్లోంచి హీనమైన దిగజారిన రాళ్ళ,కట్టెల,ఇతర వాటి ఆరాధనలో నిమగ్నమవ్వటం తగదు.

اِنَّ وَلِیِّ اللّٰهُ الَّذِیْ نَزَّلَ الْكِتٰبَ ۖؗ— وَهُوَ یَتَوَلَّی الصّٰلِحِیْنَ ۟
నిశ్చయంగా నా యొక్క సహాయకుడైన,నాకు తోడ్పడేవాడైన అల్లాహ్ ఏ నన్ను రక్షిస్తాడు. ఆయన తప్ప ఇంకొకరితో ఆశించను. మీ విగ్రహాల్లోంచి ఎవరితోను నేను భయపడను. ఆయనే ఖుర్ఆనును ప్రజలకు సన్మార్గం చూపే దానిగా నాపై అవతరింపజేశాడు. ఆయనే తన దాశుల్లోంచి సద్వర్తనులతో స్నేహం చేసి ఆయనే వారిని పరిరక్షిస్తాడు మరియు వారికి సహాయపడుతాడు.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَسْتَطِیْعُوْنَ نَصْرَكُمْ وَلَاۤ اَنْفُسَهُمْ یَنْصُرُوْنَ ۟
ఓ ముష్రికులారా మీరు ఈ విగ్రహాల్లోంచి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారికి మీకు సహాయం చేసే శక్తి లేదు. తమ స్వయానికి కూడా సహాయం చేసుకునే శక్తి లేదు. వారు నిస్సహాయులు.అటువంటప్పుడు మీరు అల్లాహ్ ని వదిలి వారిని ఎలా ఆరాధిస్తారు ?.
अरबी तफ़सीरें:
وَاِنْ تَدْعُوْهُمْ اِلَی الْهُدٰی لَا یَسْمَعُوْا ؕ— وَتَرٰىهُمْ یَنْظُرُوْنَ اِلَیْكَ وَهُمْ لَا یُبْصِرُوْنَ ۟
ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని ఒక వేళ మీరు సన్మార్గం వైపునకు పిలిచినా వారు మీ పిలుపును వినలేరు. నీవు వారిని నీ ముందట నిలబడి శిల్పించబడిన కళ్ళతో చూస్తున్నట్లుగా భావిస్తావు. అవి స్ధిరంగా ఉన్నవి అవి చూడలేవు. వారు (ముష్రికులు) ఆదమ్ యొక్క సంతతి రూపంలో,జంతువుల రూపంలో విగ్రహాలను తయారు చేసేవారు. వాటికి చేతులు ,కాళ్లు,కళ్లు ఉండేవి. కాని అవి కదలలేని స్ధిర రాసులు.వాటిలో ఎటువంటి జీవము లేదు. ఎటువంటి కదలిక లేదు.
अरबी तफ़सीरें:
خُذِ الْعَفْوَ وَاْمُرْ بِالْعُرْفِ وَاَعْرِضْ عَنِ الْجٰهِلِیْنَ ۟
ఓ ప్రవక్త ప్రజల మనసులు దేనిని అనుమతిస్తాయో వాటిని,వారిపై సౌలభ్యమైన కార్యాలు,గుణాలను వారి నుండి స్వీకరించండి. వారి మనస్సులు అంగీకరించని వాటిని వారిపై బాధ్యతగా వేయకండి. ఎందుకంటే అవి వారిలో ధ్వేషాన్ని పెంచుతాయి. ప్రతి మంచి మాట,మంచి కార్యము చేయటం గురించి మీరు ఆదేశించండి. మూర్ఖుల నుండి ముఖము త్రిప్పుకోండి. వారి మూర్ఖత్వముతో మీరు వారితో పోటీపడకండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని బాధపెట్టకండి. మిమ్మల్ని నిరాకరించిన వారిని నిరాకరించకండి.
अरबी तफ़सीरें:
وَاِمَّا یَنْزَغَنَّكَ مِنَ الشَّیْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ— اِنَّهٗ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ ప్రవక్తా షైతాను మిమ్మల్ని దుష్ప్రేరణ ద్వార ,మంచి చేయటం నుండి నిరుత్సాహము ద్వారా ముట్టుకుంటాడని తెలిస్తే మీరు అల్లాహ్ ను వేడుకోండి,ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మీరు చెబుతున్న వాటిని ఆయన వినేవాడును,మీ వేడుకలను బాగా తెలిసిన వాడును. అయితే ఆయన షైతాను నుండి మిమ్మల్ని కాపాడుతాడు.
अरबी तफ़सीरें:
اِنَّ الَّذِیْنَ اتَّقَوْا اِذَا مَسَّهُمْ طٰٓىِٕفٌ مِّنَ الشَّیْطٰنِ تَذَكَّرُوْا فَاِذَا هُمْ مُّبْصِرُوْنَ ۟ۚ
నిశ్చయంగా అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగిన వారికి పాపమునకు పాల్పడటానికి షైతాను తరపు నుండి దుష్ప్రేరణ కలిగినప్పుడు వారు అల్లాహ్ గొప్పతనమును,ఆయన పై అవిధేయతకు పాల్పడే వారి కొరకు ఆయన శిక్షను,విధేయత చూపే వారికి ఆయన పుణ్యమును గుర్తు చేసుకుంటారు. వారు తమ వలన జరిగిన పాపము నుండి మన్నింపు వేడుకుంటారు. తమ ప్రభువు వైపునకు మరలుతారు. అప్పుడు వారు సత్యముపై సక్రమంగా ఉంటారు. వారు ఉన్న దాని నుండి మేల్కొంటారు,విడనాడుతారు.
अरबी तफ़सीरें:
وَاِخْوَانُهُمْ یَمُدُّوْنَهُمْ فِی الْغَیِّ ثُمَّ لَا یُقْصِرُوْنَ ۟
పాపాత్ములు,అవిశ్వాసపరుల్లోంచి షైతానుల సోదరులకు షైతానులు పాపము వెనుక పాపము ద్వారా అపమార్గములో వారిని పెంచుకుంటూ పోతారు. మార్గవిహీనతకు గురి చేయటం నుండి,అప మార్గమునకు గురి చేయటం నుండి షైతానులు,మానవుల్లోంచి పాపాత్ములు ఆగరు.
अरबी तफ़सीरें:
وَاِذَا لَمْ تَاْتِهِمْ بِاٰیَةٍ قَالُوْا لَوْلَا اجْتَبَیْتَهَا ؕ— قُلْ اِنَّمَاۤ اَتَّبِعُ مَا یُوْحٰۤی اِلَیَّ مِنْ رَّبِّیْ ۚ— هٰذَا بَصَآىِٕرُ مِنْ رَّبِّكُمْ وَهُدًی وَّرَحْمَةٌ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఏదైన సూచనను తీసుకుని వచ్చినప్పుడు వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. దాని నుండి ముఖము తిప్పేస్తారు. ఒక వేళ మీరు వారి వద్దకు సూచనను తీసుకుని రాకపోతే వారు ఇలా అంటారు : మీరు మీ తరపు నుండి ఏదైన సూచనను కనిపెట్టలేరా,తయారు చేయలేరా?. ఓ ప్రవక్తా మీరు వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : నా తరపు నుండి ఏ ఒక సూచనను తీసుకు రావటం తగదు. కేవలం నేను అల్లాహ్ నా వైపు దైవవాణి ద్వారా తెలిపిన దానిని మాత్రమే అనుసరిస్తాను. నేను మీపై చదివిన ఈ ఖుర్ఆను మీ సృష్టికర్త అయిన,మీ వ్యవహారాలను పర్యాలోచనము చేసేవాడైన అల్లాహ్ తరపు నుండి వాదనలు,ఋజువులు (ఆధారాలు). మరియు ఆయన దాసుల్లోంచి విశ్వాస పరుల కొరకు మార్గదర్శకత్వము,కారుణ్యము. విశ్వాస పరులు కాని వారందరు మార్గ విహీనులు,నిర్భాగ్యులు.
अरबी तफ़सीरें:
وَاِذَا قُرِئَ الْقُرْاٰنُ فَاسْتَمِعُوْا لَهٗ وَاَنْصِتُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟
ఖుర్ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు మీరు దాని పారాయణంను శ్రద్ధగా వినండి. మరియు మీరు మాట్లాడకండి,అల్లాహ్ మీపై కనికరిస్తాడని ఆశిస్తూ అది కాకుండా వేరే దానిలో నిమగ్నమవకండి.
अरबी तफ़सीरें:
وَاذْكُرْ رَّبَّكَ فِیْ نَفْسِكَ تَضَرُّعًا وَّخِیْفَةً وَّدُوْنَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْاٰصَالِ وَلَا تَكُنْ مِّنَ الْغٰفِلِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువైన అల్లాహ్ ను నిమమ్రతతో,అణుకువతో,భయభక్తితో స్మరించండి. మీ దుఆను మధ్యేమార్గంలో స్వరమును బిగ్గరకు,మెల్లగకు మధ్యలో దిన మొదటి వేళలో ఆరెండు వేళల గొప్పతనము వలన చేయండి. అల్లాహ్ స్మరణ నుండి పరధ్యానంలో ఉండేవారిలోంచి మీరు కాకండి.
अरबी तफ़सीरें:
اِنَّ الَّذِیْنَ عِنْدَ رَبِّكَ لَا یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَیُسَبِّحُوْنَهٗ وَلَهٗ یَسْجُدُوْنَ ۟
ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న వారు దైవదూతలు పరిశుద్ధుడైన ఆయన ఆరాధన చేయటం నుండి గర్వాన్ని చూపరు. కాని వారు దానిని అంగీకరిస్తూ అశ్రధ్ధ వహించకుండా అనుసరిస్తారు. వారు రాత్రింబవళ్ళు అల్లాహ్ కు తగని గుణాల నుండి ఆయన పరిశుధ్దతను తెలుపుతూ ఉంటారు. మరియు వారు ఆయన ఒక్కడికే సాష్టాంగపడుతూ ఉంటారు.
अरबी तफ़सीरें:
इस पृष्ठ की आयतों से प्राप्त कुछ बिंदु:
• في الآيات بشارة للمسلمين المستقيمين على صراط نبيهم صلى الله عليه وسلم بأن ينصرهم الله كما نصر نبيه وأولياءه.
బుద్ధిమంతుడిపై మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన తప్పనిసరి. ఎందుకంటే ఆయనే ధర్మం యొక్క గొప్ప శాస్త్రాలు కలిగి ఉన్న గ్రంధాన్ని అవతరింపజేసి అతని కొరకు ప్రాపంచిక ప్రయోజనాలను సమకూర్చాడు. మరియు తన దాసుల్లోంచి నీతిమంతులైన వారికి తన రక్షణ,వారి కొరకే తన సహాయము,పరిరక్షణను కలిగించటం ద్వారా ఇహలోక ప్రయోజనాలను సమకూర్చాడు. వారితో శతృత్వమును చూపే వారి శతృత్వము వారికి నష్టం కలిగించదు.

• في الآيات جماع الأخلاق، فعلى العبد أن يعفو عمن ظلمه، ويعطي من حرمه، ويصل من قطعه.
తమ ప్రవక్త మార్గముపై సక్రమంగా ఉండే ముస్లిముల కొరకు అల్లాహ్ తన ప్రవక్త,తన స్నేహితులకు సహాయం చేసినట్లు వారికి సహాయం చేస్తాడన్న శుభవార్త ఆయతుల్లో ఉంది.

• على العبد إذا مَسَّه سوء من الشيطان - فأذنب بفعل محرم، أو ترك واجب - أن يستغفر الله تعالى، ويستدرك ما فرط منه بالتوبة النصوح والحسنات الماحية.
ఆయతుల్లో సుగుణాలు సమీకరించబడ్డాయి. దాసుడు తనపై దౌర్జన్యమునకు పాల్పడిన వారిని క్షమించి వదిలి వేయాలి,తనకు ఇవ్వని వాడికి ఇవ్వాలి,తన నుండి సంబంధము త్రెంచుకున్న వాడితో సంబంధము కలపాలి.

• الواجب على العاقل عبادة الله تعالى؛ لأنه هو الذي يحقق له منافع الدين بإنزال الكتاب المشتمل على العلوم العظيمة في الدّين، ومنافع الدنيا بتولّي الصالحين من عباده وحفظه لهم ونصرته إياهم، فلا تضرهم عداوة من عاداهم.
దాసుడు తనకి షైతాను తరపు నుండి చెడు వాటిల్లి నిషిద్ధకార్యమునకు పాల్పడి పాపము చేస్తే లేదా విధిగావించబడిన దానిని వదిలివేస్తే మహోన్నతుడైన అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవటం,నిజమైన పశ్చాత్తాపము చేసి,పాపాలను తుడిచివేసే సత్కార్యాలు చేసి తన ద్వారా జరిగిన తప్పిదమును విడనాడటం దాసుడిపై తప్పనిసరి.

 
अर्थों का अनुवाद सूरा: सूरा अल्-आराफ़
सूरों की सूची पृष्ठ संख्या
 
क़ुरआन के अर्थों का अनुवाद - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - अनुवादों की सूची

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

बंद करें