क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद * - अनुवादों की सूची

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

अर्थों का अनुवाद सूरा: सूरा अर्-रअ़्द   आयत:

సూరహ్ అర్-రఅద్

الٓمّٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ ؕ— وَالَّذِیْۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟
అలిఫ్ - లామ్ - మీమ్ - రా[1]. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు. మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యం! అయినా చాలా మంది, విశ్వసించటం లేదు.
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
अरबी तफ़सीरें:
اَللّٰهُ الَّذِیْ رَفَعَ السَّمٰوٰتِ بِغَیْرِ عَمَدٍ تَرَوْنَهَا ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ؕ— كُلٌّ یَّجْرِیْ لِاَجَلٍ مُّسَمًّی ؕ— یُدَبِّرُ الْاَمْرَ یُفَصِّلُ الْاٰیٰتِ لَعَلَّكُمْ بِلِقَآءِ رَبِّكُمْ تُوْقِنُوْنَ ۟
మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీత కాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది.[1] ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగా నైనా) మీరు మీ ప్రభువున కలుసుకో వలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని.
[1] చూడండి, 36:38, 39 మరియు 7:54.
अरबी तफ़सीरें:
وَهُوَ الَّذِیْ مَدَّ الْاَرْضَ وَجَعَلَ فِیْهَا رَوَاسِیَ وَاَنْهٰرًا ؕ— وَمِنْ كُلِّ الثَّمَرٰتِ جَعَلَ فِیْهَا زَوْجَیْنِ اثْنَیْنِ یُغْشِی الَّیْلَ النَّهَارَ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟
మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు.[1] ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి.
[1] వృక్షకోటిలో కూడా ఆడ-మగ అంతరం ఉంది. సాధారణంగా ఆడ-మగ అంగాలు ఒకే పువ్వులో ఉంటాయి. ఉదా: మామిడి, కొన్ని ఒకే వృక్షం మీద వేర్వేరు పువ్వులలో ఉంటాయి. ఉదా:దోసతీగ. మరికొన్ని వేర్వేరు వృక్షాలపై ఉంటాయి. ఉదా: ఖర్జూరపు చెట్లు.
अरबी तफ़सीरें:
وَفِی الْاَرْضِ قِطَعٌ مُّتَجٰوِرٰتٌ وَّجَنّٰتٌ مِّنْ اَعْنَابٍ وَّزَرْعٌ وَّنَخِیْلٌ صِنْوَانٌ وَّغَیْرُ صِنْوَانٍ یُّسْقٰی بِمَآءٍ وَّاحِدٍ ۫— وَنُفَضِّلُ بَعْضَهَا عَلٰی بَعْضٍ فِی الْاُكُلِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟
మరియు భూమిలో వేర్వేరు రకాల (నేలలు) ఒకదాని కొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్షతోటలు, పంటపొలాలు మరియు ఖర్జూరపు చెట్లు, కొన్ని ఒక్కొక్కటి గానూ, మరికొన్ని గుచ్చలు - గుచ్చలు (జతలు) గానూ ఉన్నాయి.[1] వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కాని తినటానికి వాటి రుచులు, ఒకటి మరొకదాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా వీటన్నింటిలో అర్థం చేసుకో గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి.[2]
[1] కొన్ని చెట్లు ఒకే కాండం గలవి. మరికొన్ని శాఖలు గలవి ఉన్నాయి. [2] చూడండి, 6:99 మరియు 141.
अरबी तफ़सीरें:
وَاِنْ تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ ءَاِذَا كُنَّا تُرٰبًا ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ؕ۬— اُولٰٓىِٕكَ الَّذِیْنَ كَفَرُوْا بِرَبِّهِمْ ۚ— وَاُولٰٓىِٕكَ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ ۚ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: "ఏమీ? మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా?" అలాంటి వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటి వారి మెడలలో సంకెళ్ళు వేయబడి ఉంటాయి.[1] మరియు అలాంటి వారే నరకవాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.
[1] చూడండి, 34:33, 36:8.
अरबी तफ़सीरें:
وَیَسْتَعْجِلُوْنَكَ بِالسَّیِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلٰتُ ؕ— وَاِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلٰی ظُلْمِهِمْ ۚ— وَاِنَّ رَبَّكَ لَشَدِیْدُ الْعِقَابِ ۟
మరియు వారు మేలుకు ముందు కీడును (తెమ్మని) నిన్ను తొందర పెడుతున్నారు.[1] మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసినప్పటికీ![2] నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజల యెడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు.[3]
[1] చూడండి, 6:57-58; 8:32. [2] చూడండి, 35:45. [3] చూడండి, 6:47; 7:167; 15:49-50, 10:11.
अरबी तफ़सीरें:
وَیَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— اِنَّمَاۤ اَنْتَ مُنْذِرٌ وَّلِكُلِّ قَوْمٍ هَادٍ ۟۠
మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1] వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే! మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు.[2]
[1] చూడండి, 6:7, 111; 10:96-97 మరియు 13:31 [2] చూడండి, 35:24, 6:131.
अरबी तफ़सीरें:
اَللّٰهُ یَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ اُ وَمَا تَغِیْضُ الْاَرْحَامُ وَمَا تَزْدَادُ ؕ— وَكُلُّ شَیْءٍ عِنْدَهٗ بِمِقْدَارٍ ۟
అల్లాహ్ కు, ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది[1] మరియు గర్భకాలపు హెచ్చు-తగ్గులు[2] కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది.
[1] త'హ్ మిలు: Bear, Carry, అంటే కలిగి ఉండు, సహించు, మోయు, వహించు, భరించు, పెట్టుకొను. ఇక్కడ స్త్రీ గర్భంలో ఉన్న శిశువు యొక్క స్వభావం, లక్షణాలు, అదృష్టం, వయస్సు అని అర్థం. [2] త'గీదుల్ అర్'హామ్: Fall short, Absorb, అంటే గర్భకాలపు హెచ్చుతగ్గులు.
अरबी तफ़सीरें:
عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ الْكَبِیْرُ الْمُتَعَالِ ۟
ఆయన అగోచర మరియు గోచర విషయాన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు,[1] సర్వోన్నతుడు.[2]
[1] అల్-కబీర్: = అల్-అజీమ్ The Incoparably Great, The Greatest, మహనీయుడు, గొప్పవాడు, మహత్త్వం, ప్రభావం, ప్రతాపం గలవాడు, గొప్పదనానికి సరోవరం. ఇవ్ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. చూడండి, 22:62, 31:30 మొదలైనవి. [2] అల-ముత'ఆలి: Most High, He who is higher than every (other) high one. సర్వోన్నతుడు, అందరి కంటే అత్యుతన్నతుడు. ఖుర్ఆన్ లో ఇక్కడ మాత్రమే ఒకేసారి వచ్చింది. అల్-అలియ్యు: మహోన్నతుడు, చూడండి, 2:255. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
अरबी तफ़सीरें:
سَوَآءٌ مِّنْكُمْ مَّنْ اَسَرَّ الْقَوْلَ وَمَنْ جَهَرَ بِهٖ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِالَّیْلِ وَسَارِبٌ بِالنَّهَارِ ۟
మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)![1]
[1] ఈ తాత్పర్యం ము'హమ్మద్ జూనాగఢీ గారి అనువాదాన్ని అనుసరించి ఉంది. అంటే అల్లాహ్ (సు.తా.)కు అంతా తెలుస్తుంది. ఆయన నుండి దాగింది ఏదీ లేదు.
अरबी तफ़सीरें:
لَهٗ مُعَقِّبٰتٌ مِّنْ بَیْنِ یَدَیْهِ وَمِنْ خَلْفِهٖ یَحْفَظُوْنَهٗ مِنْ اَمْرِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُغَیِّرُ مَا بِقَوْمٍ حَتّٰی یُغَیِّرُوْا مَا بِاَنْفُسِهِمْ ؕ— وَاِذَاۤ اَرَادَ اللّٰهُ بِقَوْمٍ سُوْٓءًا فَلَا مَرَدَّ لَهٗ ۚ— وَمَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّالٍ ۟
ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియమించిన, ఒకరి వెంట ఒకరు వచ్చే[1] కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు.[2] అల్లాహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు.
[1] అంటే ఎడతెగకుండా ఒకరి తరువాత ఒకరు రాత్రింబవళ్ళు కాపలా ఉంటారు. [2] చూడండి, 8:53.
अरबी तफ़सीरें:
هُوَ الَّذِیْ یُرِیْكُمُ الْبَرْقَ خَوْفًا وَّطَمَعًا وَّیُنْشِئُ السَّحَابَ الثِّقَالَ ۟ۚ
ఆయనే! మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు.
अरबी तफ़सीरें:
وَیُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهٖ وَالْمَلٰٓىِٕكَةُ مِنْ خِیْفَتِهٖ ۚ— وَیُرْسِلُ الصَّوَاعِقَ فَیُصِیْبُ بِهَا مَنْ یَّشَآءُ وَهُمْ یُجَادِلُوْنَ فِی اللّٰهِ ۚ— وَهُوَ شَدِیْدُ الْمِحَالِ ۟ؕ
మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)![1] మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్యతిరస్కారులు) అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు.[2]
[1] చూడండి, 17:44. [2] షదీదుల్ మి'హాల్: ఖుర్ఆన్ లో ఈ వాక్యం కేవలం ఇక్కడే ఒకేసారి వచ్చింది. మి'హాల్: Contrivance, అంటే యుక్తి, కల్పన, తంత్రం, పన్నుగడ, కుట్ర, ఉపాయం, మొదలైనవి. షదీద్: Severe, Strong, కఠిన, తీవ్ర, దృఢ, బల, అద్భుత, ఘనమైనది.
अरबी तफ़सीरें:
لَهٗ دَعْوَةُ الْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَسْتَجِیْبُوْنَ لَهُمْ بِشَیْءٍ اِلَّا كَبَاسِطِ كَفَّیْهِ اِلَی الْمَآءِ لِیَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهٖ ؕ— وَمَا دُعَآءُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟
ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏ విధమైన సమాధాన మివ్వలేవు. అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి, అది (నీరు) నోటి దాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమై పోతాయి.
अरबी तफ़सीरें:
وَلِلّٰهِ یَسْجُدُ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّظِلٰلُهُمْ بِالْغُدُوِّ وَالْاٰصَالِ ۟
మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి).[1]
[1] చూడండి, 16:48-49 మరియు 22:18. భూమి చుట్టూ తాను తిరగటం వల్ల రాత్రింబవళ్ళు వస్తాయి. సూర్యచంద్రులు కూడా గమనంలో ఉన్నాయి. ఇదంతా అల్లాహ్ (సు.తా.) ఆదేశంతో జరుగుతోంది. కాబట్టి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం పొడుగ్గా ఉండి మధ్యాహ్నం చిన్నదవటం కూడా అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను అనుసరిచటమే!
अरबी तफ़सीरें:
قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قُلِ اللّٰهُ ؕ— قُلْ اَفَاتَّخَذْتُمْ مِّنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ لَا یَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ نَفْعًا وَّلَا ضَرًّا ؕ— قُلْ هَلْ یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ۙ۬— اَمْ هَلْ تَسْتَوِی الظُّلُمٰتُ وَالنُّوْرُ ۚ۬— اَمْ جَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ خَلَقُوْا كَخَلْقِهٖ فَتَشَابَهَ الْخَلْقُ عَلَیْهِمْ ؕ— قُلِ اللّٰهُ خَالِقُ كُلِّ شَیْءٍ وَّهُوَ الْوَاحِدُ الْقَهَّارُ ۟
ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త.[1] మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)"[2]
[1] అల్-ఖాలిఖు: సృష్టికర్త, అల్లాహ్ (సు.తా.) యే ఏ నమూనా లేకుండా క్రొత్తగా సృష్టించేవాడు. ఆయన (సు.తా.) ఏదైనా చేయటానికి పూనుకున్నప్పుడు దానిని : 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. చూడండి, 102 మరియు 2:117. [2] అల్ వాహిద్, అల్ ఖహ్హార్ లకు చూడండి, 12:39.
अरबी तफ़सीरें:
اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَالَتْ اَوْدِیَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّیْلُ زَبَدًا رَّابِیًا ؕ— وَمِمَّا یُوْقِدُوْنَ عَلَیْهِ فِی النَّارِ ابْتِغَآءَ حِلْیَةٍ اَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهٗ ؕ— كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ الْحَقَّ وَالْبَاطِلَ ؕ۬— فَاَمَّا الزَّبَدُ فَیَذْهَبُ جُفَآءً ۚ— وَاَمَّا مَا یَنْفَعُ النَّاسَ فَیَمْكُثُ فِی الْاَرْضِ ؕ— كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ ۟ؕ
ఆయన (అల్లాహ్) ఆకాసం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా[1] ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బి వస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి.[2] ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరి పోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు.[3]
[1] బి ఖద్ రిహా: తమ తమ పరిమాణాన్ని బట్టి పూర్తిగా నిండి. [2] పారే నీటిపై వచ్చే నురుగు గానీ, వెండి, బంగారు కరిగించినపుడు వచ్చే నురుగు గానీ, మాలిన్యాలే. అవి ఎగిరిపోతాయి. మరియు అసలే క్రింద మిగిలిపోతుంది. [3] చూడండి, 24:39-40.
अरबी तफ़सीरें:
لِلَّذِیْنَ اسْتَجَابُوْا لِرَبِّهِمُ الْحُسْنٰی ؔؕ— وَالَّذِیْنَ لَمْ یَسْتَجِیْبُوْا لَهٗ لَوْ اَنَّ لَهُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ سُوْٓءُ الْحِسَابِ ۙ۬— وَمَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمِهَادُ ۟۠
తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది. మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా, మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచుకున్నా (అది స్వీకరించబడదు).[1] అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భరమైన విరామ స్థలము.
[1] చూడండి, 3:91; 10:54.
अरबी तफ़सीरें:
اَفَمَنْ یَّعْلَمُ اَنَّمَاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ اَعْمٰی ؕ— اِنَّمَا یَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِ ۟ۙ
ఏమీ? నీ ప్రభువు నుండి నీపై అవతరింప జేయబడినది (ఈ సందేశం) సత్యమని తెలుసుకున్నవాడు, గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా, బుద్ధిమంతులే ఇది (ఈ విషయం) గ్రహించగలరు.
अरबी तफ़सीरें:
الَّذِیْنَ یُوْفُوْنَ بِعَهْدِ اللّٰهِ وَلَا یَنْقُضُوْنَ الْمِیْثَاقَ ۟ۙ
వారే, ఎవరైతే అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరో![1]
[1] చూడండి, 5:1
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ یَصِلُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ یُّوْصَلَ وَیَخْشَوْنَ رَبَّهُمْ وَیَخَافُوْنَ سُوْٓءَ الْحِسَابِ ۟ؕ
మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో![1] మరియు తమ ప్రభువుకు భయపడతారో మరియు దారుణంగా (ఖచ్చితంగా) తీసుకోబడే లెక్కకు భయపడుతారో!
[1] చూడండి, 8:75
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ صَبَرُوا ابْتِغَآءَ وَجْهِ رَبِّهِمْ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِیَةً وَّیَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّیِّئَةَ اُولٰٓىِٕكَ لَهُمْ عُقْبَی الدَّارِ ۟ۙ
మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి[1] మరియు నమాజ్ స్థాపించి[2] మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో;[3] అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది.
[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను పాటించటం మరయు పాపాల నుండి తప్పించుకోవటం ఒక సహనం. మరియు బాధలలో, ఆపదలలో సహనం వహించటం రెండవది. సత్పురుషులు ఈ రెండు రకాల సహనాన్ని వహిస్తారు. [2] నమా'జ్ స్థాపించటం అంటే నమా'జ్ ను దాని సమయంలో, భయభక్తులతో సరిగ్గా సలపటం. [3] వారు, ఎవరికైతే చెడు సంభవిస్తే దానికి బదులుగా మంచి చేస్తారో లేక మన్నించి సహనం వహిస్తారో, చూడండి, 41:34.
अरबी तफ़सीरें:
جَنّٰتُ عَدْنٍ یَّدْخُلُوْنَهَا وَمَنْ صَلَحَ مِنْ اٰبَآىِٕهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّیّٰتِهِمْ وَالْمَلٰٓىِٕكَةُ یَدْخُلُوْنَ عَلَیْهِمْ مِّنْ كُلِّ بَابٍ ۟ۚ
శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో[1] వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు (అజ్వాజ్) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు.[2] మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.
[1] 'అద్నున్: అంటే శాశ్వతమైన స్వర్గవనాలు. [2] చూడండి, 52:21.
अरबी तफ़सीरें:
سَلٰمٌ عَلَیْكُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَی الدَّارِ ۟ؕ
(దేవదూతలు అంటారు): "మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది!"
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ یَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْ بَعْدِ مِیْثَاقِهٖ وَیَقْطَعُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ یُّوْصَلَ وَیُفْسِدُوْنَ فِی الْاَرْضِ ۙ— اُولٰٓىِٕكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ ۟
మరియు అల్లాహ్ తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తిచేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది.
अरबी तफ़सीरें:
اَللّٰهُ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— وَفَرِحُوْا بِالْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَمَا الْحَیٰوةُ الدُّنْیَا فِی الْاٰخِرَةِ اِلَّا مَتَاعٌ ۟۠
అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వారికి) పరిమితం చేస్తాడు.[1] మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు, కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖసంతోషాలు తాత్కాలికమైనవే (తుచ్ఛమైనవే)!
[1] అల్లాహ్ (సు.తా.) తాను కోరింది చేస్తాడు. ఇహలోకంలో పుష్కలంగా జీవనోపాధి ఉన్నవాడితో అల్లాహ్ (సు.తా.) సంతోషపడ్డాడని మరియు ఇహలోక జీవితంలో కష్టాలలో ఉన్న వాడితో అల్లాహ్ (సు.తా.) సంతోషపడలేదని, దీని అర్థం కాదు. ఎవరికైనా అత్యధికంగా ధనసంపత్తులు ఇవ్వటం కేవలం అతనిని పరీక్షించటానికే! సత్యధర్మం మీద ఉండి సత్కార్యాలు చేసేవారే సాఫల్యం పొందుతారు.
अरबी तफ़सीरें:
وَیَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— قُلْ اِنَّ اللّٰهَ یُضِلُّ مَنْ یَّشَآءُ وَیَهْدِیْۤ اِلَیْهِ مَنْ اَنَابَ ۟ۖۚ
మరియు సత్యతిరస్కారులు: "అతని (ముహమ్మద్) పై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1] అని అంటున్నారు. వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా వదలుతాడు మరియు పశ్చాత్తాప పడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు."
[1] చూడండి, 6:109.
अरबी तफ़सीरें:
اَلَّذِیْنَ اٰمَنُوْا وَتَطْمَىِٕنُّ قُلُوْبُهُمْ بِذِكْرِ اللّٰهِ ؕ— اَلَا بِذِكْرِ اللّٰهِ تَطْمَىِٕنُّ الْقُلُوْبُ ۟ؕ
ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.
अरबी तफ़सीरें:
اَلَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ طُوْبٰی لَهُمْ وَحُسْنُ مَاٰبٍ ۟
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (ఇహలోకంలో) ఆనందం, సర్వసుఖాలు[1] మరియు (పరలోకంలో) మంచి గమ్యస్థానం ఉంటాయి.
[1] 'తూబా: అంటే స్వర్గంలో మంచి స్థానం మరియు దాని భోగభాగ్యాలు.
अरबी तफ़सीरें:
كَذٰلِكَ اَرْسَلْنٰكَ فِیْۤ اُمَّةٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهَاۤ اُمَمٌ لِّتَتْلُوَاۡ عَلَیْهِمُ الَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ وَهُمْ یَكْفُرُوْنَ بِالرَّحْمٰنِ ؕ— قُلْ هُوَ رَبِّیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— عَلَیْهِ تَوَكَّلْتُ وَاِلَیْهِ مَتَابِ ۟
అందుకే (ఓ ముహమ్మద్!) మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము - వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి - నీవు నీపై మేము అవతరింప జేసిన దివ్యజ్ఞానం వారికి వినిపించటానికి! ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు.[1] వారితో అను: "ఆయనే నా ప్రభూవు! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలి పోవలసి ఉన్నది."
[1] మక్కా ముష్రికులు రహ్మాన్ శబ్దాన్ని తిరస్కిరించేవారు. కావున హుదైబియా ఒప్పందం రోజు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస): "బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్." అని ఒప్పందం వ్రాయించడం ప్రారంభించినప్పుడు, ఒప్పందం చేసుకోవడానికి వచ్చిన రాయబారి: "అర్-రహ్మాన్ అర్-రహీమ్ ను" మేము ఎరుగము "బిస్మిక అల్లాహుమ్మ" అని వ్రాయలి." అని పట్టుపట్టాడు. ఖతదా('ర.ది.'అ.) కథనం, 'స. బు'ఖారీ).
अरबी तफ़सीरें:
وَلَوْ اَنَّ قُرْاٰنًا سُیِّرَتْ بِهِ الْجِبَالُ اَوْ قُطِّعَتْ بِهِ الْاَرْضُ اَوْ كُلِّمَ بِهِ الْمَوْتٰی ؕ— بَلْ لِّلّٰهِ الْاَمْرُ جَمِیْعًا ؕ— اَفَلَمْ یَایْـَٔسِ الَّذِیْنَ اٰمَنُوْۤا اَنْ لَّوْ یَشَآءُ اللّٰهُ لَهَدَی النَّاسَ جَمِیْعًا ؕ— وَلَا یَزَالُ الَّذِیْنَ كَفَرُوْا تُصِیْبُهُمْ بِمَا صَنَعُوْا قَارِعَةٌ اَوْ تَحُلُّ قَرِیْبًا مِّنْ دَارِهِمْ حَتّٰی یَاْتِیَ وَعْدُ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُخْلِفُ الْمِیْعَادَ ۟۠
మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ ను) పఠించటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమి చీల్చబడినా, లేదా దాని వల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది.[1] ఏమీ? ఒకవేళ అల్లాహ్ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు?[2] మరియు అల్లాహ్ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది.[3] నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు.
[1] ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) అంటారు: 'ప్రతి దివ్యగ్రంథం ఖుర్ఆన్ అనబడుతోంది.' ఒక 'హదీస్'లో ఉంది: 'దావూద్ (అ.స.) పశువులను సిద్ధపరచమని ఆజ్ఞాపించి ఆ సమయంలో ఖుర్ఆన్ పఠనం పూర్తి చేసుకునేవారు.' ('స. బు'ఖారీ, కితాబ్ అల్ అంబియా, బాబె ఖౌల్ అల్లాహుతా'ఆలా: 'వ ఆతైనా దావూద జబూరా.') ఇక్కడ ఖుర్ఆన్ అంటే జబూర్ అని అర్థం. ఈ వాక్యపు అర్థం ఏమిటంటే ఒకవేళ ఇంతకూ పూర్వం దివ్యగ్రంథం చదువటం వలన కొండలు కదిలింపబడితే (పొడిపొడిగా మారిపోతే), లేక మృతులు మాట్లాడగలిగితే, ఈ ఖుర్ఆన్ లో కూడా అటువంటి లక్షణాలు ఉండేవి. మరికొందరి అభిప్రాయం ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ లో ఇటువంటి విశేష లక్షణాలు ఉండినా, ఈ సత్యతిరస్కారులు దీనిని ఏ మాత్రమూ విశ్వసించేవారు కారు. ఎందుకంటే వారిని విశ్వాసులుగా చేయటం అల్లాహ్ (సు.తా.) పనే. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ కూడా మార్చడు. ఎంతవరకైతే వారు తమను తాము మార్చుకోవటానికి ప్రయత్నించరో! [2] చూడండి, 2:26-27 మరియు 6:149. [3] చూడండి, 5:33.
अरबी तफ़सीरें:
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَاَمْلَیْتُ لِلَّذِیْنَ كَفَرُوْا ثُمَّ اَخَذْتُهُمْ ۫— فَكَیْفَ كَانَ عِقَابِ ۟
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించ బడ్డారు, కావున (మొదట) నేను సత్యతిరస్కారులకు వ్యవధి నిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో![1]
[1] 'హదీస్'లో కూడా ఉంది: 'అల్లాహ్ (సు.తా.) దుర్మార్గులకు వ్యవధినిస్తూ పోతాడు, చివరకు వారిని శిక్షించటానికి పట్టుకున్నప్పుడు ఏ మాత్రమూ వదలడు.' దైవప్రవక్త ('స'అస), ఇది వినిపించిన తరువాత, ఆయత్ 11:102 ను చదివి వినిపించారు. ('స'హీ'హ్ బు'ఖారీ, 'స. ముస్లిం).
अरबी तफ़सीरें:
اَفَمَنْ هُوَ قَآىِٕمٌ عَلٰی كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۚ— وَجَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ ؕ— قُلْ سَمُّوْهُمْ ؕ— اَمْ تُنَبِّـُٔوْنَهٗ بِمَا لَا یَعْلَمُ فِی الْاَرْضِ اَمْ بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ ؕ— بَلْ زُیِّنَ لِلَّذِیْنَ كَفَرُوْا مَكْرُهُمْ وَصُدُّوْا عَنِ السَّبِیْلِ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
ఏమీ? ఆయన (అల్లాహ్), ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకొని ఉండేవాడు (మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: "(నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా?[1] వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించచబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు. [2]
[1] మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. మీరు ఏ దేవతలనైతే ఆరాధిస్తున్నారో అవి మీకు కీడు గానీ, మేలు గానీ చేయలేవు. మీరు పిలిచేవి - వాటి పేర్లే. అవి మీరో లేక మీ తండ్రితాతలో ఇచ్చినవే. అవి మీ కల్పిత దైవాలే. చూడండి, 53:23, 7:71 మరియు 12:40. [2] చూడండి, 5:41 మరియు 16:37.
अरबी तफ़सीरें:
لَهُمْ عَذَابٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَلَعَذَابُ الْاٰخِرَةِ اَشَقُّ ۚ— وَمَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ ۟
వారికి ఇహలోక జీవితంలో శిక్ష వుంది. మరియు వారి పలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. మరియు వారిని అల్లాహ్ (శిక్ష) నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. [1]
[1] ఈ ప్రపంచ శిక్ష (అ'జాబ్) పరలోక శిక్ష కంటే చాలా తేలికైనది. ఈ ప్రపంచ శిక్ష తాత్కాలికమైనది. పరలోక శిక్ష శాశ్వతమైనది. నరకాగ్ని భూలోక అగ్ని కంటే 69 రెట్లు అధిక తీవ్రత గలది. ('స'హీ'హ్ ముస్లిం).
अरबी तफ़सीरें:
مَثَلُ الْجَنَّةِ الَّتِیْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ— تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— اُكُلُهَا دَآىِٕمٌ وَّظِلُّهَا ؕ— تِلْكَ عُقْبَی الَّذِیْنَ اتَّقَوْا ۖۗ— وَّعُقْبَی الْكٰفِرِیْنَ النَّارُ ۟
దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి.[1] దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి.[2] దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే!
[1] స్వర్గనరకాలు మానవుల జ్ఞానపరిధికి అగోచర విషయాలు. కావున వాటిని మానవులకు తెలిసిన ఉద్యానవనాలు మరియు అగ్నితో పోల్చి చెప్పబడుతోంది. చూడండి, 47:15. [2] "జిల్లున్: అర్థం కొరకు చూడండి, 4:57 చివరి భాగం.
अरबी तफ़सीरें:
وَالَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ یَفْرَحُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمِنَ الْاَحْزَابِ مَنْ یُّنْكِرُ بَعْضَهٗ ؕ— قُلْ اِنَّمَاۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ وَلَاۤ اُشْرِكَ بِهٖ ؕ— اِلَیْهِ اَدْعُوْا وَاِلَیْهِ مَاٰبِ ۟
మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింప జేయబడిన దాని (ఈ గ్రంథం) వలన సంతోషపడుతున్నారు.[1] మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు.[2] వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయన వద్దనే ఉంది!
[1] వీరు ముస్లింలు. [2] వీరు క్రైస్తవులు, యూదులు మరియు ముష్రికులు.
अरबी तफ़सीरें:
وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ حُكْمًا عَرَبِیًّا ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا وَاقٍ ۟۠
మరియు ఈ విధంగా మేము అరబ్బీ భాషలో మా శాసనాన్ని అవతరింప జేశాము.[1] ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ నుండి నిన్ను రక్షించేవాడు గానీ, కాపాడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
[1] చూడండి, 14:4 మరియు12:2. ప్రతి ప్రవక్తపై అతన ప్రజల కొరకు ఆ ప్రాంతపు భాషలోనే దివ్యగ్రంథం అవతరింపజేయబడింది. వారు దానిని సులభంగా అర్థం చేసుకోవాలని. ఈ ఖుర్ఆన్ దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పై సర్వలోకాల వారి కొరకు, అవతరింపజేయబడిన అంతిమ దివ్యగ్రంథం. చూడండి, 7:158.
अरबी तफ़सीरें:
وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ اَزْوَاجًا وَّذُرِّیَّةً ؕ— وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— لِكُلِّ اَجَلٍ كِتَابٌ ۟
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యాపిల్లలను ప్రసాదించాము.[1] అల్లాహ్ అనుమతి లేకుండా, ఏ అద్భుత సంకేతాన్ని (స్వయంగా) తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు.[2] ప్రతి వాగ్దానానికి (విషయానికి) వ్రాయబడిన ఒక ఆదేశం (శాసనం) ఉంది.[3]
[1] చూడండి, 25:7 దైవప్రవక్తలు అందరూ మానవులే. వారికి కుటుంబం ఉండేది. వారికి భార్యాబిడ్డలుండిరి. వారు సాధారణ మానవుల వలే తినేవారు, త్రాగేవారు, ప్రజలతో కలిసి మెలిసి తిరిగే వారు. కాని వారిపై దివ్యజ్ఞాన (వ'హీ) వస్తూ ఉండేది. దానిని వారు ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా ప్రజలకు వినిపించి సత్యధర్మం వైపునకు ఆహ్వానించేవారు. ఒకవేళ వారు దైవదూతలైతే వారికెలా సంతానం మరియు కుటుంబం ఉంటాయి? [2] అద్భుత సంకేతాల శక్తి కేవలం అల్లాహ్ (సు.తా.)కే ఉంది. ఆయన అనుమతి లేనిదే ఏ ప్రవక్త కూడా వాటిని చూపలేడు. అల్లాహ్ (సు.తా.) తన ఇష్టప్రకారం తాను అవసరం అనుకున్నప్పుడు వాటిని చూపుతాడు. చూడండి, 6:109 [3] అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రతి వాగ్దానికి ఒక సమయం నియమింపబడి ఉంది.అల్లాహుతా'ఆలా ఆ సమయం వచ్చే వరకు ప్రజలకు వ్యవధినిస్తాడు. అది వచ్చిన తరువాత దానిని ఎవ్వరూ ఆపలేరు. అల్లాహ్ (సు.తా.) తన వాగ్దానం పూర్తి చేసి తీరుతాడు. దీని మరొక తాత్పర్యం: 'ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉంది.'
अरबी तफ़सीरें:
یَمْحُوا اللّٰهُ مَا یَشَآءُ وَیُثْبِتُ ۖۚ— وَعِنْدَهٗۤ اُمُّ الْكِتٰبِ ۟
అల్లాహ్ తాను కోరిన దానిని రద్దు చేస్తాడు మరియు (తాను కోరిన దానిని) స్థిరపరుస్తాడు.[1] మరియు మాతృగ్రంథం (ఉమ్ముల్ కితాబ్)[2] ఆయన దగ్గరే ఉంది.
[1] చూడండి, 2:106 [2] చూడండి, 43:4 మరియు 85:22. ఉమ్ముల్ కితాబ్, అంటే లౌ'హె మ'హ్ ఫూ"జ్. సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యథాస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.
अरबी तफ़सीरें:
وَاِنْ مَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ وَعَلَیْنَا الْحِسَابُ ۟
మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని చూపక ముందు) నిన్ను మరణింపజేసినా, నీ బాధ్యత కేవలం (మా సందేశాన్ని) అందజేయటమే! మరియు లెక్క తీసుకోవటం కేవలం మా పని.
अरबी तफ़सीरें:
اَوَلَمْ یَرَوْا اَنَّا نَاْتِی الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ— وَاللّٰهُ یَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهٖ ؕ— وَهُوَ سَرِیْعُ الْحِسَابِ ۟
ఏమీ? వాస్తవానికి మేము భూమిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నామనేది వారు చూడటం లేదా?[1] మరియు అల్లాహ్ యే ఆజ్ఞ ఇస్తాడు! ఆయన ఆజ్ఞను మార్చే వాడు ఎవ్వడు లేడు. మరియు ఆయన లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.
[1] అంటే, 'అరేబియా భూభాగం, రోజు రోజుకు ముష్రికుల కొరకు తగ్గుతూ పోవడం మరియు ముస్లింలు దానిని ఆక్రమించుకోవడం వారు (ముష్రికులు) చూడటం లేదా?
अरबी तफ़सीरें:
وَقَدْ مَكَرَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَلِلّٰهِ الْمَكْرُ جَمِیْعًا ؕ— یَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ؕ— وَسَیَعْلَمُ الْكُفّٰرُ لِمَنْ عُقْبَی الدَّارِ ۟
మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్రలన్నీ అల్లాహ్ కే చెందినవి. ప్రతి ప్రాణి సంపాందించేది ఆయనకు తెలుసు. మరియు (మేలైన) అంతమ (పరలోక) నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు.
अरबी तफ़सीरें:
وَیَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْا لَسْتَ مُرْسَلًا ؕ— قُلْ كَفٰی بِاللّٰهِ شَهِیْدًا بَیْنِیْ وَبَیْنَكُمْ ۙ— وَمَنْ عِنْدَهٗ عِلْمُ الْكِتٰبِ ۟۠
మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు నీతో అంటున్నారు: "నీవు సందేశహరుడవు కావు!" వారితో అను: "నాకూ - మీకూ మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు! మరియు వారి (సాక్ష్యం), ఎవరికైతే గ్రంథజ్ఞానం ఉందో!"[1]
[1] అంటే, ఇస్లాం స్వీకరించిన 'అబ్దుల్లాహ్ బిన్ సల్లాం మరియు సల్మాన్ ఫారసీ (ర'ది.'అన్హుమ్)ల వంటి యూదుల మరియు క్రైస్తవుల సాక్ష్యం అన్నమాట!
अरबी तफ़सीरें:
 
अर्थों का अनुवाद सूरा: सूरा अर्-रअ़्द
सूरों की सूची पृष्ठ संख्या
 
क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद - अनुवादों की सूची

पवित्र क़ुरआन के अर्थों का तेलुगु अनुवाद, अनुवादक : अब्दुर रहीम बिन मुहम्मद

बंद करें