क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद * - अनुवादों की सूची

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

अर्थों का अनुवाद आयत: (3) सूरा: सूरा अन्-निसा
وَاِنْ خِفْتُمْ اَلَّا تُقْسِطُوْا فِی الْیَتٰمٰی فَانْكِحُوْا مَا طَابَ لَكُمْ مِّنَ النِّسَآءِ مَثْنٰی وَثُلٰثَ وَرُبٰعَ ۚ— فَاِنْ خِفْتُمْ اَلَّا تَعْدِلُوْا فَوَاحِدَةً اَوْ مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ؕ— ذٰلِكَ اَدْنٰۤی اَلَّا تَعُوْلُوْا ۟ؕ
మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించ లేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే; [1] లేదా మీ స్వాధీనంలో నున్నవారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి.[2] ఒకే వైపునకు మొగ్గకుండా (అన్యాయవర్తన నుండి దూరంగా ఉండటానికి) ఇదే సముచితమైన మార్గం.
[1] ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది: "మీరు వారి (స్త్రీల) మధ్య న్యాయం చేయలేమనే భయం ఉంటే ఒకామెను మాత్రమే వివాహమాడండి." అని. నలుగురి కంటే ఎక్కువ వివాహమాడ కండని మరియు అంత కంటే ఎక్కువ భార్యలను ఏక కాలంలో ఉంచుకోరాదని, దివ్యఖుర్ఆన్ తప్ప, ఇతర ఏ మత గ్రంథంలో కూడా వ్రాయబడ లేదు. అందుకే పూర్వకాలంలో చాలా మంది భార్యలు ఉండటం అన్ని ధర్మాల వారి ఆచారమై ఉండెను. ఇంకా ముందు దివ్యఖుర్ఆన్ లో ఇలా చెప్పబడింది: "మీరు ఎంత ప్రయత్నం చేసినా వారి (భార్యల) మధ్య న్యాయం చేయటం చాలా కష్టం అట్టి సమయంలో ఒకామెను పూర్తిగా ఉపేక్షించకండి." (చూడండి 4:129). ఈ విధంగా ఖుర్ఆన్ లో స్త్రీలకు ఇవ్వబడినంత గౌరవం, రక్షణ, హక్కులు ఇతర మత గ్రంథాలలో పేర్కొనబడ లేదు. బానిసత్వాన్ని, బానిసత్వ వ్యాపారాన్ని నిర్మూలిస్తూ, కేవలం యుద్ధఖైదీలను తప్ప ఇతరులను బానిసలుగా ఉంచగూడదని కూడా ఖుర్ఆన్ 1400 సంవత్సరాల ముందు ఆదేశించింది. ముస్లింలు అయిన బానిస స్త్రీలతో వివాహమాడటాన్ని కూడా ప్రోత్సహించింది. చూడండి, 1400 సంవత్సరాల ముందు ఇస్లాంలో మానవహక్కులు (Human Rights) మరియు స్త్రీల హక్కులు ఏ విధంగా రక్షింపబడ్డాయో! [2] చూడండి, 24:32.
अरबी तफ़सीरें:
 
अर्थों का अनुवाद आयत: (3) सूरा: सूरा अन्-निसा
सूरों की सूची पृष्ठ संख्या
 
क़ुरआन के अर्थों का अनुवाद - तेलुगू अनुवाद - अब्दुर रहीम बिन मुहम्मद - अनुवादों की सूची

पवित्र क़ुरआन के अर्थों का तेलुगु अनुवाद, अनुवादक : अब्दुर रहीम बिन मुहम्मद

बंद करें