Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (144) Surah: Surah Al-Baqarah
قَدْ نَرٰی تَقَلُّبَ وَجْهِكَ فِی السَّمَآءِ ۚ— فَلَنُوَلِّیَنَّكَ قِبْلَةً تَرْضٰىهَا ۪— فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَحَیْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَكُمْ شَطْرَهٗ ؕ— وَاِنَّ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ لَیَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا یَعْمَلُوْنَ ۟
ఓ ప్రవక్త ఖిబ్లా విషయంలో మీరు కోరుకున్న వైపు,దాని మార్పుకు సంబంధించిన దైవవాణి అవతరణ కొరకు నిరీక్షిస్తూ,కోరుతూ ఆకాశము వైపునకు మీ యొక్క ముఖముని,దృష్టిని త్రిప్పుతుండగా మేము చూశాము.అయితే ఏ ఖిబ్లానైతే మీరు కోరుకుంటున్నారో,ఇష్టపడుతున్నారో బైతుల్ మఖ్దిస్ కు బదులుగా బైతుల్ హరామ్ వైపునకు ఇప్పుడు మేము తప్పకుండా మీ దిశను మారుస్తాము.అయితే మీరు మక్కతుల్ ముకర్రమహ్ లో గల గౌరవప్రధమైన అల్లాహ్ గృహము వైపునకు మీ యొక్క ముఖమును త్రిప్పుకోండి,ఓ విశ్వాసపరులారా మీరు ఎక్కడ ఉన్నా నమాజును చేసే సమయంలో దాని వైపునకే అభిముఖమవ్వండి.నిశ్చయంగా గ్రంధవహుల్లోంచి యూదులు,క్రైస్తవులు ఖిబ్లా మార్పు ఆదేశం వారి కార్యాల నిర్దేశకుడు,వారి సృష్టికర్త తరపు నుండి అవతరింప బడిన వాస్తవమైన ఆదేశం అని తెలుసుకుంటారు.ఎందుకంటే వారి గ్రంధాలలో దాని ఆధారాలు ఉన్నవి,మరయు అల్లాహ్ వాస్తవాన్ని వ్యతిరేకించే వీరి కర్మలనుండి ఏమరుపాటుకు లోనుకాడు,కాని పరిశుద్దుడైన అతడు వీటన్నింటి గురించి బాగా తెలిసినవాడు,వారికి దాని ప్రకారమే పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• أن الاعتراض على أحكام الله وشرعه والتغافل عن مقاصدها دليل على السَّفَه وقلَّة العقل.
అల్లాహ్ ఆదేశాలు,ఆయనశాసనాల పట్ల వ్యతిరేకత వాటి లక్ష్యాల పట్ల నిర్లక్ష్యం బుద్దిలేమి తనము, తెలివి తక్కువ తనమునకు ఆధారము.

• فضلُ هذه الأمة وشرفها، حيث أثنى عليها الله ووصفها بالوسطية بين سائر الأمم.
ఎప్పుడైతే అల్లాహ్ ఈజాతిని (ఉమ్మతే ముహమ్మదియా) పొగడటం,జాతులందరిలో న్యాయపూరిత జాతిగా వర్ణించడం జరిగిందో దానికి గౌరవం,గొప్పతనము లభించింది.

• التحذير من متابعة أهل الكتاب في أهوائهم؛ لأنهم أعرضوا عن الحق بعد معرفته.
గ్రంధవహుల కోరికలను అనుసరించడం గురించి హెచ్చరించడం జరిగింది,ఎందుకంటే వారు వాస్తవమును తెలుసుకున్న తరువాత దాని పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.

• جواز نَسْخِ الأحكام الشرعية في الإسلام زمن نزول الوحي، حيث نُسِخَ التوجه إلى بيت المقدس، وصار إلى المسجد الحرام.
దైవవాణి అవతరణ కాలంలో ఇస్లాంలో ధర్మ ఆదేశాలను రద్దు పరచడం సరైనదే,అలాగే బైతుల్ మఖ్దిస్ వైపు నుంచి ఖిబ్లా రద్దు పరచబడి మస్జిదే హరాం వైపునకు మారి పోయినది.

 
Terjemahan makna Ayah: (144) Surah: Surah Al-Baqarah
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Daftar isi terjemahan

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Tutup