Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: Asy-Syu'arā`   Ayah:
اِنْ هٰذَاۤ اِلَّا خُلُقُ الْاَوَّلِیْنَ ۟ۙ
ఇది మాత్రం పూర్వికుల ధర్మము,వారి అలవాట్లు,వారి గుణాలు.
Tafsir berbahasa Arab:
وَمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟ۚ
మేము శిక్షించబడము.
Tafsir berbahasa Arab:
فَكَذَّبُوْهُ فَاَهْلَكْنٰهُمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
అప్పుడు వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరిస్తూనే ఉన్నారు. అప్పుడు మేము వారి తిరస్కారమునకు బదులుగా వంధ్య గాలితో వారిని వినాశనమునకు గురి చేశాము. నిశ్చయంగా ఈ వినాశనములో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Tafsir berbahasa Arab:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Tafsir berbahasa Arab:
كَذَّبَتْ ثَمُوْدُ الْمُرْسَلِیْنَ ۟ۚۖ
సమూద్ జాతి తమ ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలందరిని తిరస్కరించింది.
Tafsir berbahasa Arab:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ صٰلِحٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వంశ పరంగా సోదరుడైన సాలిహ్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
Tafsir berbahasa Arab:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని. దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను.
Tafsir berbahasa Arab:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Tafsir berbahasa Arab:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
Tafsir berbahasa Arab:
اَتُتْرَكُوْنَ فِیْ مَا هٰهُنَاۤ اٰمِنِیْنَ ۟ۙ
ఏమీ మీరు ఉన్న సుఖబోగాల్లో,అనుగ్రహాల్లో నిశ్ఛింతగా మీరు భయపడకుండా వదలివేయబడుతారని ఆశిస్తున్నారా ?!.
Tafsir berbahasa Arab:
فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ
తోటలలో,ప్రవహించే చెలమలలో,
Tafsir berbahasa Arab:
وَّزُرُوْعٍ وَّنَخْلٍ طَلْعُهَا هَضِیْمٌ ۟ۚ
మరియు పంట చేలలో, పండిపోయి మెత్తగా ఉన్న ఖర్జూరపు పండ్ల తోటలలో.
Tafsir berbahasa Arab:
وَتَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا فٰرِهِیْنَ ۟ۚ
మరియు మీరు నివసించటానికి ఇండ్లు నిర్మించటానికి పర్వతాలను చెక్కుతారు. మరియు మీరు వాటిని చెక్కటంలో నైపుణ్యవంతులు.
Tafsir berbahasa Arab:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Tafsir berbahasa Arab:
وَلَا تُطِیْعُوْۤا اَمْرَ الْمُسْرِفِیْنَ ۟ۙ
మరియు మీరు పాపములకు పాల్పడి తమ స్వయం పై మితిమీరే వారి ఆజ్ఞను అనుసరించకండి.
Tafsir berbahasa Arab:
الَّذِیْنَ یُفْسِدُوْنَ فِی الْاَرْضِ وَلَا یُصْلِحُوْنَ ۟
వారే ఎవరైతే పాప కార్యములను వ్యాపింపజేసి భూమిలో అల్లకల్లోలాలను రేకెత్తిస్తారో,అల్లాహ్ విధేయతను చేపట్టి స్వయం సంస్కరణ చేయరో.
Tafsir berbahasa Arab:
قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِیْنَ ۟ۚ
అతనితో అతని జాతివారు ఇలా పలికారు : నీవు మాత్రం పదే పదే మంత్రజాలమునకు వశపరచబడి చివరికి మంత్రజాలము వారి బుద్దులను వశపరచుకుని తీసుకుని వెళ్ళిపోయిన వారిలో వాడివి.
Tafsir berbahasa Arab:
مَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ۖۚ— فَاْتِ بِاٰیَةٍ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
నీవు మాత్రం మాలాంటి ఒక మనిషి మాత్రమే,నీవు ప్రవక్త అవటానికి నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. నీవు ప్రవక్త అని వాదించే విషయంలో ఒక వేళ సత్యమంతుడివే అయితే నీవు ప్రవక్త అవటంపై సూచించే ఒక సూచనను తీసుకుని రా.
Tafsir berbahasa Arab:
قَالَ هٰذِهٖ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَّلَكُمْ شِرْبُ یَوْمٍ مَّعْلُوْمٍ ۟ۚ
సాలిహ్ అలైహిస్సలాం - వాస్తవానికి అల్లాహ్ ఆయనకు ఒక సూచనను ప్రసాదించాడు. అది ఒక ఆడ ఒంటె. దాన్ని అల్లాహ్ రాతి బండ నుండి వెలికి తీశాడు - వారితో ఇలా పలికారు : ఇది చూడబడే,తాకబడే ఒక ఆడ ఒంటె.దాని కొరకు నీటిని త్రాగే ఒక వంతు మరియు మీ కొరకు ఒక వంతు నిర్ధారితమై ఉన్నది. మీ వంతు దినమున అది త్రాగదు మరియు దాని వంతు దినమున మీరు త్రాగరు.
Tafsir berbahasa Arab:
وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابُ یَوْمٍ عَظِیْمٍ ۟
మరియు మీరు దాన్ని కోయటం ద్వారా గానీ లేదా కొట్టడం ద్వారా గానీ దానికి కీడు కలిగించే దానితో ముట్టుకోకండి. అప్పుడు దాని వలన మీపై ఆపద కురిసే గొప్ప దినములో అల్లాహ్ శిక్ష మిమ్మల్ని వినాశనమునకు గురి చేస్తుంది.
Tafsir berbahasa Arab:
فَعَقَرُوْهَا فَاَصْبَحُوْا نٰدِمِیْنَ ۟ۙ
వారందరు దాని వెనుక కాలి మోకాలి వద్ద నరమును కోసి చంపటానికి కలిసి కట్టుగా నిర్ణయించుకున్నారు. వారిలో పెద్ద దుష్టుడు దాన్ని కోసి చంపివేశాడు. ఎప్పుడైతే వారు తమపై ఖచ్చితంగా శిక్ష కురుస్తుందని తెలుసుకున్నారో వారు తాము ముందడుగు వేసిన దానిపై పశ్ఛాత్తాప్పడే వారిలో నుంచి అయిపోయారు. కానీ శిక్షను ప్రత్యక్ష్యంగా చూసినప్పుడు ప్రయోజనం ఉండదు.
Tafsir berbahasa Arab:
فَاَخَذَهُمُ الْعَذَابُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
అయితే వారితో వాగ్దానం చేయబడిన భూకంపము,భయంకర శబ్దము ద్వారా వారిని శిక్ష కబళించింది. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సాలిహ్,ఆయన జాతి వారి గాధలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు.
Tafsir berbahasa Arab:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• توالي النعم مع الكفر استدراج للهلاك.
అవిశ్వాసంతో పాటు వరుస అనుగ్రహాలు కలగటం వినాశనము కొరకు నెమ్మది నెమ్మదిగా దగ్గర చేయటం.

• التذكير بالنعم يُرتجى منه الإيمان والعودة إلى الله من العبد.
అనుగ్రహాలను గుర్తు చేసి దాసుడి నుండి విశ్వాసము,అల్లాహ్ వైపునకు మరలటమును ఆశించబడుతుంది.

• المعاصي هي سبب الفساد في الأرض.
పాపకార్యాలు భూమిలో కల్లోలాలకు కారణం.

 
Terjemahan makna Surah: Asy-Syu'arā`
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup