Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Mục lục các bản dịch


Ý nghĩa nội dung Chương: Chương Al-Shu-'ara'   Câu:

సూరహ్ అష్-షుఅరా

Trong những ý nghĩa của chương Kinh:
بيان آيات الله في تأييد المرسلين وإهلاك المكذبين.
సందేశహరులకు మద్దతిచ్చే విషయంలో,సత్యతిరస్కారులను వినాశపరిచే విషయంలో అల్లాహ్ ఆయతులను తెలపటం.

طٰسٓمّٓ ۟
.(طسٓمٓ) తా - సీన్ - మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Các Tafsir tiếng Ả-rập:
تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟
ఇవి అసత్యము నుండి సత్యమును స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు.
Các Tafsir tiếng Ả-rập:
لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ اَلَّا یَكُوْنُوْا مُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా బహుశా మీరు వారు సన్మార్గము పొందాలనే మీ ఆశ వలన వారి సన్మార్గము పొందటంపై బాధతో ఆశతో మీ ప్రాణములను కోల్పోతారేమో.
Các Tafsir tiếng Ả-rập:
اِنْ نَّشَاْ نُنَزِّلْ عَلَیْهِمْ مِّنَ السَّمَآءِ اٰیَةً فَظَلَّتْ اَعْنَاقُهُمْ لَهَا خٰضِعِیْنَ ۟
ఒక వేళ మేము ఆకాశము నుండి వారిపై ఏదైన నిదర్శనమును అవతరించదలిస్తే వారిపై దాన్ని అవతరింపజేసే వారము. అప్పుడు వారి మెడలు దాని కొరకు వంగిపోయి లొంగిపోతాయి. కానీ వారి పరీక్ష కొరకు మేము అలా తలచుకోలేదు. ఏమీ వారు అగోచర విషయాలను విశ్వసిస్తారా ?.
Các Tafsir tiếng Ả-rập:
وَمَا یَاْتِیْهِمْ مِّنْ ذِكْرٍ مِّنَ الرَّحْمٰنِ مُحْدَثٍ اِلَّا كَانُوْا عَنْهُ مُعْرِضِیْنَ ۟
ఈ ముష్రికుల వద్దకు కరుణామయుడి వద్ద నుండి ఏదైన నూతన హితోపదేశం ఆయన ఏకత్వమును,ఆయన ప్రవక్త నిజాయితీని సూచించే వాదనలతో అవతరించి వచ్చినా వారు దాన్ని వినటం నుండి,దాన్ని నమ్మటం నుండి విముఖత చూపకుండా ఉండలేదు.
Các Tafsir tiếng Ả-rập:
فَقَدْ كَذَّبُوْا فَسَیَاْتِیْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
నిశ్ఛయంగా వారు తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించారు. తొందరలోనే వారు దేని గురించైతే హేళన చేసేవారో వాటి వార్తల నిరూపణ వారి వద్దకు వస్తుంది. మరియు వారిపై శిక్ష వాటిల్లుతుంది.
Các Tafsir tiếng Ả-rập:
اَوَلَمْ یَرَوْا اِلَی الْاَرْضِ كَمْ اَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِیْمٍ ۟
ఏ వారు భూమిలో మేము మంచి దృశ్యం కల చాలా ప్రయోజనాలు కల రకరకాల మొక్కల్లోంచి ప్రతి రకములో నుండి ఎన్ని మొలకెత్తించామో వాటిని చూడకుండా వీరందరు తమ అవిశ్వాసంపై మొండిగా ఉండిపోయారా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా వేరు వేరు రకాల మొక్కలతో భూమిని మొలకెత్తించటంలో వాటిని మొలకెత్తించిన వాడి సామర్ధ్యం మృతులను జీవింపజేయటంలో ఉన్నదనటానికి స్పష్టమైన ఆధారం కలదు. వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తనపై ఎవరూ ఆధిక్యతను కనబరచని ఆధిక్యుడు. తన దాసులపై కరుణిెంచేవాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِذْ نَادٰی رَبُّكَ مُوْسٰۤی اَنِ ائْتِ الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు మూసాను అల్లాహ్ పై తమ అవిశ్వాసం వలన,మూసా జాతి వారిని బానిసలుగా చేసుకోవటం వలన హింసకు పాల్పడిన జాతి వారి వద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ పిలిచినప్పటి వైనమును గుర్తు చేసుకోండి.
Các Tafsir tiếng Ả-rập:
قَوْمَ فِرْعَوْنَ ؕ— اَلَا یَتَّقُوْنَ ۟
వారు ఫిర్ఔన్ జాతి వారు. అప్పుడు ఆయన వారికి అల్లాహ్ ఆదేశములను పాటించటం ద్వారా,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ భయభీతి కలిగి ఉండాలని సున్నితంగా,మృధువుగా ఆదేశిస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ رَبِّ اِنِّیْۤ اَخَافُ اَنْ یُّكَذِّبُوْنِ ۟ؕ
మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నిశ్ఛయంగా నీ వద్ద నుండి నేను వారికి చేరవేసిన వాటి విషయంలో వారు నన్ను తిరస్కరిస్తారని నేను భయపడుతున్నాను.
Các Tafsir tiếng Ả-rập:
وَیَضِیْقُ صَدْرِیْ وَلَا یَنْطَلِقُ لِسَانِیْ فَاَرْسِلْ اِلٰی هٰرُوْنَ ۟
వారు నన్ను తిరస్కరించటం వలన నా హృదయం కుంచించుకుపోతుంది (ఇబ్బందికి గురి అవుతుంది). నా నాలుక మాట్లాడటం నుండి ఆగిపోతుంది. అయితే నీవు జిబ్రయీల్ అలైహిస్సలాంను నా సోదరుడు హారూన్ వద్దకు అతడు నాకు సహాయకుడిగా అవటానికి పంపించు.
Các Tafsir tiếng Ả-rập:
وَلَهُمْ عَلَیَّ ذَنْۢبٌ فَاَخَافُ اَنْ یَّقْتُلُوْنِ ۟ۚۖ
మరియు వారి వద్ద నేను ఖిబ్తీను హత్య చేయటం వలన నాపై ఒక నేరం ఉన్నది. అయితే వారు నన్ను హతమారుస్తారని నేను భయపడుతున్నాను.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ كَلَّا ۚ— فَاذْهَبَا بِاٰیٰتِنَاۤ اِنَّا مَعَكُمْ مُّسْتَمِعُوْنَ ۟
అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : అలా జరగదు. వారు నిన్ను హతమార్చరు. అయితే నీవు మరియు నీ సోధరుడు హారూన్ మీ నిజీయితీని దృవీకరించే మా సూచనలను తీసుకుని వెళ్ళండి. నిశ్ఛయంగా మేము మీరు ఏమి పలుకుతారో వాటికి,వారు మీకు ఏమి పలుకుతారో వాటికి సహాయము ద్వారా మద్దతు ద్వారా మేము మీకు తోడుగా ఉంటాము. వాటి లో నుండి ఏది మా నుండి తప్పిపోదు.
Các Tafsir tiếng Ả-rập:
فَاْتِیَا فِرْعَوْنَ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
అయితే మీరిద్దరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళి అతనితో ఇలా పలకండి : నిశ్ఛయంగా మేము సమస్త సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి నీ వద్దకు ప్రవక్తలుగా పంపించబడ్డాము.
Các Tafsir tiếng Ả-rập:
اَنْ اَرْسِلْ مَعَنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
కావున నీవు ఇస్రాయీలు సంతతి వారిని మాతోపాటు పంపించు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ اَلَمْ نُرَبِّكَ فِیْنَا وَلِیْدًا وَّلَبِثْتَ فِیْنَا مِنْ عُمُرِكَ سِنِیْنَ ۟ۙ
మూసా అలైహిస్సలాంతో పిర్ఔన్ ఇలా సమాధానమిచ్చాడు : ఏమీ మేము నిన్ను బాల్యంలో మా వద్ద పోషించలేదా, నీవు మా మధ్యలో నీ వయస్సులోని చాలా సంవత్సరాలు ఉండిపోయావు. అయితే దైవ దౌత్యం యొక్క వాదన వైపునకు నిన్ను ఏది పిలుస్తుంది ?.
Các Tafsir tiếng Ả-rập:
وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِیْ فَعَلْتَ وَاَنْتَ مِنَ الْكٰفِرِیْنَ ۟
మరియు నీ జాతి వారిలో నుండి ఒక వ్యక్తికి సహాయం చేయటానికి ఖిబ్తీని హతమార్చినప్పుడు నీవు గొప్ప ఘనకార్యం చేశావు. మరియు నీవు నీపై ఉన్న నా అనుగ్రహాలను తిరస్కరించే వారిలో నుంచి అయిపోయావు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• حرص الرسول صلى الله عليه وسلم على هداية الناس.
మనుషుల సన్మార్గం పట్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారికి గల మక్కువ.

• إثبات صفة العزة والرحمة لله.
అల్లాహ్ కొరకు ఆధిక్యత,కారుణ్యం రెండు గుణముల నిరూపణ.

• أهمية سعة الصدر والفصاحة للداعية.
ప్రచారకర్త కొరకు హృదయ విశాలత్వము,వాగ్ధాటి యొక్క ప్రాముఖ్యత.

• دعوات الأنبياء تحرير من العبودية لغير الله.
ప్రవక్తల పిలుపులు అల్లాహేతరుల బానిసత్వము నుండి విముక్తి కలిగించటం.

• احتج فرعون على رسالة موسى بوقوع القتل منه عليه السلام فأقر موسى بالفعلة، مما يشعر بأنها ليست حجة لفرعون بالتكذيب.
మూసా అలైహిస్సలాం ద్వారా హత్య జరగటము, ఆయన దాన్ని చేయటమును అంగీకరించటమును ఫిర్ఔన్ మూసా దైవ దౌత్యమునకు వ్యతిరేకముగా ఆధారముగా చేశాడు. ఇది తిరస్కరించటానికి ఫిర్ఔన్ కొరకు వాదన కాదని తెలుస్తుంది.

قَالَ فَعَلْتُهَاۤ اِذًا وَّاَنَا مِنَ الضَّآلِّیْنَ ۟ؕ
మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో అంగీకరిస్తూ ఇలా పలికారు : నేను ఆ మనిషిని నా వద్దకు దైవ వాణి రాక ముందు అజ్ఞానుల్లోంచి ఉన్నప్పుడు హత్య చేశాను.
Các Tafsir tiếng Ả-rập:
فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِیْ رَبِّیْ حُكْمًا وَّجَعَلَنِیْ مِنَ الْمُرْسَلِیْنَ ۟
అతన్ని హత్య చేసిన తరువాత మీరు నన్ను అతనికి బదులుగా నన్ను హతమారుస్తారని నేను భయపడినప్పుడు మద్యన్ బస్తీ వైపునకు మీ నుండి పారిపోయాను. అప్పుడు నా ప్రభువు నాకు జ్ఞానమును ప్రసాదించాడు. మరియు ఆయన నన్ను తాను ప్రజల వైపునకు ప్రవక్తలుగా పంపించే తన ప్రవక్తల్లోంచి చేశాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَیَّ اَنْ عَبَّدْتَّ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
మరియు నీవు నన్ను బానిసగా చేయకుండా ఇస్రాయీలు సంతతి వారిని బనిసలుగా చేసి నన్ను నీవు పోషించటాన్ని నిజంగా నాపై చేసిన ఉపకారంగా ఎత్తిపొడుస్తున్నావు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعٰلَمِیْنَ ۟
ఫిర్ఔన్ మూసా అలైహిస్సలాంను ఇలా అడిగాడు : ఆయన దూతగా నీవు చెప్పుకున్న సృష్టితాల ప్రభువు ఎవడు ?.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ؕ— اِنْ كُنْتُمْ مُّوْقِنِیْنَ ۟
మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కు సమాధానమిస్తూ ఇలా పలికారు : సృష్టితాల ప్రభువు,ఆకాశముల ప్రభువు,భూమి యొక్క ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్న వాటి యొక్క ప్రభువు ఒక వేళ ఆయన వారి ప్రభువు అని మీరు నమ్మే వారైతే మీరు అతనొక్కడినే ఆరాధించండి.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ لِمَنْ حَوْلَهٗۤ اَلَا تَسْتَمِعُوْنَ ۟
ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు : మీరు మూసా సమాధానమును,అందులో ఉన్న అబద్దపు వాదనను వినటంలేదా ?!.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ رَبُّكُمْ وَرَبُّ اٰبَآىِٕكُمُ الْاَوَّلِیْنَ ۟
మూసా అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : అల్లాహ్ మీ ప్రభువు,మీ పూర్వ తాతముత్తాతల ప్రభువు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ اِنَّ رَسُوْلَكُمُ الَّذِیْۤ اُرْسِلَ اِلَیْكُمْ لَمَجْنُوْنٌ ۟
ఫిర్ఔన్ ఇలా పలికాడు : నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదించే ఇతను ఎలా సమాధానం ఇవ్వాలో తెలియని పిచ్చివాడు. తనకు అర్ధం కాని వాటిని చెబుతున్నాడు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَیْنَهُمَا ؕ— اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ ۟
మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నేను మిమ్మల్ని పిలిచే అల్లాహ్ తూర్పునకు ప్రభువు,పడమరనకు ప్రభువు మరియు ఆ రెండింటికి మధ్య ఉన్న వాటికి ప్రభువు ఒక వేళ మీకు వాటిని అర్ధం చేసుకునే బుద్దులు ఉంటే.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ لَىِٕنِ اتَّخَذْتَ اِلٰهًا غَیْرِیْ لَاَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُوْنِیْنَ ۟
ఫిర్ఔన్ ముసాతో వాదించటం నుండి అశక్తుడైన తరువాత మూసాతో ఇలా పలికాడు : నీవు నన్ను కాదని మరెవరినైన ఆరాధ్య దైవంగా ఆరాధిస్తే నేను నిన్ను చెరసాలలో బందీలుగా ఉన్నవారిలో చేరుస్తాను.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ اَوَلَوْ جِئْتُكَ بِشَیْءٍ مُّبِیْنٍ ۟ۚ
మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కి ఇలా సమాధానమిచ్చారు : ఏమీ ఒక వేళ నేను అల్లాహ్ వద్ద నుండి నీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నా నిజాయితీని స్పష్టపరిచే దాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చిన తరువాత కూడా నీవు నన్ను చెరసాలలో బందీలుగా ఉన్న వారిలో చేరుస్తావా ?.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ فَاْتِ بِهٖۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
నీవు వాదిస్తున్న విషయంలో ఒక వేళ నీవు నిజాయితీ పరులలోంచి అయితే నీ నిజాయితీని సూచిస్తుందని నీవు ప్రస్తావించిన దాన్ని తీసుకుని రా అని అతడు పలికాడు.
Các Tafsir tiếng Ả-rập:
فَاَلْقٰی عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌ ۟ۚۖ
అప్పుడు మూసా తన చేతి కర్రను భూమిపై విసిరారు అది అకస్మాత్తుగా చూసేవారికి ఒక స్పష్టమైన సర్పంగా మారిపోయింది.
Các Tafsir tiếng Ả-rập:
وَّنَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۟۠
మరియు ఆయన తన చేతిని తెల్లగా లేకుండా ఉన్న స్థితిలో తన జేబులో దూర్చారు. అప్పుడు ఆయన దాన్ని బొల్లి తెల్లదనం కాకుండా వెలిగిపోతున్న తెల్లదనముతో బయటకు తీశారు. దాన్ని చూసేవారు చూశారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ لِلْمَلَاِ حَوْلَهٗۤ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِیْمٌ ۟ۙ
ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు : నిశ్చయంగా ఈ వ్యక్తి మంత్రజాలము తెలిసిన ఒక మంత్రజాలకుడు.
Các Tafsir tiếng Ả-rập:
یُّرِیْدُ اَنْ یُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهٖ ۖۗ— فَمَاذَا تَاْمُرُوْنَ ۟
ఇతను తన మంత్రజాలముతో మిమ్మల్ని మీ భూమి నుండి వెళ్ళగొట్ట గోరుతున్నాడు. అయితే మేము అతని విషయంలో తీసుకునే చర్య గురించి మీ సలహా ఏమిటి ?.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْۤا اَرْجِهْ وَاَخَاهُ وَابْعَثْ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۙ
వారు అతనికి ఇలా సమాధానమిచ్చారు : అతన్ని,అతని సోదరుడిని ఇద్దరిని శిక్షించటంలో తొందర చేయకుండా గడువు ఇచ్చి మిసర్ పట్టణాలలో మంత్రజాలకులను సమీకరించే వారిని పంపించండి.
Các Tafsir tiếng Ả-rập:
یَاْتُوْكَ بِكُلِّ سَحَّارٍ عَلِیْمٍ ۟
వారు మంత్రజాలమును తెలిసిన ప్రతీ మంత్రజాలకుడిని నీ వద్దకు తీసుకుని వస్తారు.
Các Tafsir tiếng Ả-rập:
فَجُمِعَ السَّحَرَةُ لِمِیْقَاتِ یَوْمٍ مَّعْلُوْمٍ ۟ۙ
అప్పుడు ఫిర్ఔన్ మూసాతో పోటీ చేయటానికి తన మంత్రజాలకులను ఒక నిర్ణీత ప్రదేశంలో,నిర్ణీత కాలంలో సమీకరించాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَّقِیْلَ لِلنَّاسِ هَلْ اَنْتُمْ مُّجْتَمِعُوْنَ ۟ۙ
మరియు ప్రజల్లో ఇలా ప్రకటించబడినది : ఏమీ మీరు గెలిచే వాడిని చూడటానికి సమావేశమవుతారా అతడు మూసానా లేదా మంత్రజాలకులా ?.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• أخطاء الداعية السابقة والنعم التي عليه لا تعني عدم دعوته لمن أخطأ بحقه أو أنعم عليه.
ధర్మ ప్రచారకుని పూర్వ తప్పిదాలు,అతనిపై చేయబడిన ఉపకారములు తన హక్కు విషయంలో తప్పిదం చేసిన వారిని లేదా తనపై ఉపకారం చేసిన వారికి ధర్మ ప్రచారం చేయటం నుండి ఆపదు.

• اتخاذ الأسباب للحماية من العدو لا ينافي الإيمان والتوكل على الله.
శతృవు నుండి రక్షణ కొరకు కారకాలను ఏర్పరచుకోవటం విశ్వాసమునకు,అల్లాహ్ పై నమ్మకమునకు విరుద్ధము కాదు.

• دلالة مخلوقات الله على ربوبيته ووحدانيته.
అల్లాహ్ సృష్టితాల యొక్క సూచన ఆయన దైవత్వముపై,ఆయన ఏకత్వముపై.

• ضعف الحجة سبب من أسباب ممارسة العنف.
హింసకు కారణం పేలవమైన వాదన ఒకటి.

• إثارة العامة ضد أهل الدين أسلوب الطغاة.
ధర్మ ప్రజలకు (అహ్లె దీన్) వ్యతిరేకంగా సాధారణ ప్రజలను రెచ్చ గొట్టటం నిరంకుశుల శైలి.

لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ اِنْ كَانُوْا هُمُ الْغٰلِبِیْنَ ۟
ఒక వేళ మంత్రజాలకులకు మూసా అలైహిస్సలాంపై గెలుపు కలిగితే మేము వారి ధర్మము విషయంలో వారిని అనుసరించాలని ఆశ.
Các Tafsir tiếng Ả-rập:
فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالُوْا لِفِرْعَوْنَ اَىِٕنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ ۟
మంత్రజాలకులు మూసాపై గెలవటానికి ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు వారు అతనితో ఇలా పలికారు : ఒక వేళ మూసా పై మనకు గెలుపు కలిగితే మనకు ఆర్ధిక ప్రతిఫలం లేదా నైతిక ప్రతిఫలం ఉంటుందా ?.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ نَعَمْ وَاِنَّكُمْ اِذًا لَّمِنَ الْمُقَرَّبِیْنَ ۟
ఫిర్ఔన్ వారితో ఇలా పలికాడు : అవును మీ కొరకు ప్రతిఫలం గలదు. నిశ్ఛయంగా మీరు అతనిపై సఫలీకృతమైతే నా వద్ద మీకు ఉన్నత స్థానాలను ప్రసాదించటం ద్వారా సన్నిదుల్లోంచి అవుతారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ لَهُمْ مُّوْسٰۤی اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ ۟
మూసా అలైహిస్సలాం అల్లాహ్ సహాయముపై నమ్మకమును కలిగి ఉండి మరియు తన వద్ద ఉన్నది మంత్రజాలము కాదని స్పష్టపరుస్తూ వారితో ఇలా పలికారు : మీరు వేయదలచుకున్న మీ త్రాళ్ళను,మీ చేతి కర్రలను వేయండి.
Các Tafsir tiếng Ả-rập:
فَاَلْقَوْا حِبَالَهُمْ وَعِصِیَّهُمْ وَقَالُوْا بِعِزَّةِ فِرْعَوْنَ اِنَّا لَنَحْنُ الْغٰلِبُوْنَ ۟
అప్పుడు వారు తమ త్రాళ్ళను,చేతి కర్రలను విసిరారు.వాటిని విసిరినప్పుడు వారు ఇలా పలికారు : ఫిర్ఔన్ గొప్పతనము సాక్షిగా నిశ్ఛయంగా మేమే విజయం పొందే వారము. మరియు మూసా అతడే ఓడిపోయేవాడు.
Các Tafsir tiếng Ả-rập:
فَاَلْقٰی مُوْسٰی عَصَاهُ فَاِذَا هِیَ تَلْقَفُ مَا یَاْفِكُوْنَ ۟ۚۖ
అప్పుడు మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అప్పుడు అది సర్పముగా మారిపోయింది. అప్పుడు అది వారు మంత్రజాలముతో ప్రజలను మోసం చేసిన దాన్ని మింగసాగింది.
Các Tafsir tiếng Ả-rập:
فَاُلْقِیَ السَّحَرَةُ سٰجِدِیْنَ ۟ۙ
మంత్రజాలకులు మూసా చేతి కర్ర వారు విసిరిన తమ మంత్రజాలమును మ్రింగి వేయటమును చూసినప్పుడు సాష్టాంగపడిపోయారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
వారు ఇలా అన్నారు : మేము సృష్టితాలన్నిటి ప్రభువును విశ్వసించాము.
Các Tafsir tiếng Ả-rập:
رَبِّ مُوْسٰی وَهٰرُوْنَ ۟
మూసా,హారూన్ అలైహిమస్సలాం ప్రభువును.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ۚ— اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ— فَلَسَوْفَ تَعْلَمُوْنَ ؕ۬— لَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُوصَلِّبَنَّكُمْ اَجْمَعِیْنَ ۟ۚ
ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును ఖండిస్తూ ఇలా పలికాడు : ఏమీ నేను మీకు దీని అనుమతి ఇవ్వక ముందే మీరు మూసా పై విశ్వాసమును కనబరుస్తారా ?!. నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ పెద్దవాడు. వాస్తవానికి మీరందరు మిసర్ వాసులందరిని దాని నుండి వెళ్ళగొట్టడానికి కుట్ర పన్నారు. నేను మీకు ఏ శిక్ష విధిస్తానో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. నేను తప్పకుండా మీలో నుండి ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేయిని ఆ రెండింటి మధ్య వ్యతిరేక దిశలో కోసివేస్తాను ఎడమ చేతితోపాటు కుడి కాలును కోయటం లేదా దానికి భిన్నంగా. మరియు నేను తప్పకుండా మీ అందరిని ఖర్జూరపు చెట్టు బోదెలపై సిలువ వేస్తాను. మీలో నుండి ఎవరినీ నేను వదలను.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا لَا ضَیْرَ ؗ— اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنْقَلِبُوْنَ ۟ۚ
మంత్రజాలకులు ఫిర్ఔన్ కు ఇలా సమాధానమిచ్చారు : ఇహ లోకంలో నీవు కోయటం,సిలువ వేయటం గురించి మమ్మల్ని బెదిరిస్తున్న దానిలో ఎటువంటి నష్టం లేదు. నీ శిక్ష తరిగిపోతుంది. మరియు మేము మా ప్రభువు వైపునకు మరలి వెళ్ళుతాము. మరియు ఆయన మమ్మల్ని తన శాశ్వత కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّا نَطْمَعُ اَنْ یَّغْفِرَ لَنَا رَبُّنَا خَطٰیٰنَاۤ اَنْ كُنَّاۤ اَوَّلَ الْمُؤْمِنِیْنَ ۟ؕ۠
నిశ్చయంగా మొదట మేమే మూసాపై విశ్వాసమును కనబరచి ఆయనను నమ్మాము కాబట్టి అల్లాహ్ మేము పాల్పడిన పూర్వ పాపాలను తుడిచి వేస్తాడని మేము ఆశిస్తున్నాము.
Các Tafsir tiếng Ả-rập:
وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنْ اَسْرِ بِعِبَادِیْۤ اِنَّكُمْ مُّتَّبَعُوْنَ ۟
మరియు మేము మూసా అలైహిస్సలాం వైపునకు ఆయన ఇస్రాయీలు సంతతి వారిని రాత్రి తీసుకుని వెళ్ళమని ఆదేశిస్తూ దైవ వాణిని అవతరింపజేశాము. ఎందుకంటే ఫిర్ఔన్,అతనితో పాటు ఉన్నవారు వారిని పట్టుకోవటానికి వారిని వెంబడిస్తారు.
Các Tafsir tiếng Ả-rập:
فَاَرْسَلَ فِرْعَوْنُ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۚ
అయితే ఫిర్ఔన్ పట్టణాలలో ఇస్రాయీలు సంతతి వారిని పట్టుకోవటానికి ఎప్పుడైతే మిసర్ నుండి వారి బయలదేరటమును తెలుసుకున్నాడో సైన్యములను సమీకరించే వారిని తన సైన్యముల్లోంచి కొంత మందిని పంపించాడు.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ هٰۤؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِیْلُوْنَ ۟ۙ
ఫిర్ఔన్ ఇస్రాయీలు సంతతి వారి విషయంలో చిన్నవిగా చూపిస్తూ ఇలా పలికాడు : నిశ్ఛయంగా వీరందరు చిన్న వర్గము.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّهُمْ لَنَا لَغَآىِٕظُوْنَ ۟ۙ
మరియు నిశ్ఛయంగా వారు వారిపై మమ్మల్ని ఆగ్రహమును కలిగించే చర్యలకు పాల్పడ్డారు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّا لَجَمِیْعٌ حٰذِرُوْنَ ۟ؕ
మరియు నిశ్ఛయంగా మేము వారి కొరకు సిద్ధంగా,అప్రమత్తంగా ఉన్నాము.
Các Tafsir tiếng Ả-rập:
فَاَخْرَجْنٰهُمْ مِّنْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ
కావున మేము ఫిర్ఔన్ ను,అతని జాతి వారిని దట్టమైన తోటలు,నీటితో ప్రవహించే కాలువలు గల మిసర్ భూమి నుండి వెళ్ళగొట్టాము.
Các Tafsir tiếng Ả-rập:
وَّكُنُوْزٍ وَّمَقَامٍ كَرِیْمٍ ۟ۙ
మరియు సంపదల నిధులు గల,మంచి నివాసాలు గల (భూమి నుండి)
Các Tafsir tiếng Ả-rập:
كَذٰلِكَ ؕ— وَاَوْرَثْنٰهَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
ఈ విధంగా మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని ఈ అనుగ్రహాల నుండి వెళ్ళగొట్టి వారి తరువాత ఈ అనుగ్రహాలను షామ్ ప్రాంతములో ఇస్రాయీలు సంతతి వారి కొరకు చేశాము.
Các Tafsir tiếng Ả-rập:
فَاَتْبَعُوْهُمْ مُّشْرِقِیْنَ ۟
ఫిర్ఔన్,అతని జాతి వారు సూర్యోదయ సమయంలో ఇస్రాయీలు సంతతి వారిని వెంబడించారు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• العلاقة بين أهل الباطل هي المصالح المادية.
అసత్యపరుల మధ్య సంబంధము అది భౌతిక ప్రయోజనాలు.

• ثقة موسى بالنصر على السحرة تصديقًا لوعد ربه.
మంత్రజాలకులపై విజయంపై మూసా అలైహిస్సలాం నమ్మకం తన ప్రభువు వగ్దానమునకు దృవీకరంగా.

• إيمان السحرة برهان على أن الله هو مُصَرِّف القلوب يصرفها كيف يشاء.
మంత్రజాలకులు విశ్వసించటం అల్లాహ్ హృదయములను తాను ఎలా తలచుకుంటే అలా మలిచే వాడనటానికి ఆధారము.

• الطغيان والظلم من أسباب زوال الملك.
నిరంకుశత్వము,దుర్మార్గము రాజ్యము పతనానికి కారణం.

فَلَمَّا تَرَآءَ الْجَمْعٰنِ قَالَ اَصْحٰبُ مُوْسٰۤی اِنَّا لَمُدْرَكُوْنَ ۟ۚ
ఎప్పుడైతే ఫిర్ఔన్ అతని జాతి వారు మూసా అలైహిస్సలాం,అయన జాతి వారితో ఎదురుపడి ప్రతీ పక్షము రెండోవ పక్షమును చూసే విధంగా అయిపోయారో మూసా అనుచరులు నిశ్ఛయంగా ఫిర్ఔన్,అతని జాతి వారు మమ్మల్ని పట్టుకుంటారు. వారిని ఎదుర్కునే శక్తి మాకు లేదు అని అన్నారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ كَلَّا ۚ— اِنَّ مَعِیَ رَبِّیْ سَیَهْدِیْنِ ۟
మూసా అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : విషయం మీరు అనుకున్నట్లు కాదు. ఎందుకంటే నిశ్చయంగా మద్దతుతో,సహాయముతో నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. తొందరలోనే ఆయన నన్ను విముక్తి మార్గము వైపునకు మార్గ దర్శకత్వము చేస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
فَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْبَحْرَ ؕ— فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِیْمِ ۟ۚ
అప్పుడు మేము మూసాను తన చేతి కర్రను సముద్రంపై కొట్టమని ఆదేశిస్తూ దైవ వాణి అవతరింపజేశాము. అప్పుడు ఆయన దాన్ని దానితో కొట్టారు. అప్పుడు సముద్రం చీలిపోయి ఇస్రాయీలు సంతతి వారి తెగల లెక్క ప్రకారం పన్నెండు మార్గములుగా మారిపోయింది. అప్పుడు సముద్రం యొక్క చీలిన ప్రతీ ముక్క పెద్దది అవటంలో,స్థిరత్వంలోపెద్ద పర్వతము వలె అందులో నుండి ఎటువంటి నీరు ప్రవహించకుండా ఉన్నట్లు అయిపోయినది.
Các Tafsir tiếng Ả-rập:
وَاَزْلَفْنَا ثَمَّ الْاٰخَرِیْنَ ۟ۚ
మరియు మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సమీపింపజేశాము చివరికి వారు మార్గమును దారిగా భావిస్తూ సముద్రంలో ప్రవేశించారు.
Các Tafsir tiếng Ả-rập:
وَاَنْجَیْنَا مُوْسٰی وَمَنْ مَّعَهٗۤ اَجْمَعِیْنَ ۟ۚ
మరియు మేము మూసా అలైహిస్సలాం,ఆయనతోపాటు ఉన్న ఇస్రాయీలు సంతతి వారిని రక్షించాము. వారిలో నుంచి ఎవరూ నాశనం కాలేదు.
Các Tafsir tiếng Ả-rập:
ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِیْنَ ۟ؕ
ఆ తరువాత మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సముద్రంలో ముంచి తుదిముట్టించాము.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా మూసా అలైహిస్సలాం కొరకు సముద్రం విడిపోయి ఆయనకు విముక్తి కలగటంలో,ఫిర్ఔన్,అతని జాతి వారికి వినాశనం కలగటంలో మూసా నిజాయితీ పై సూచించే ఒక సూచన కలదు. మరియు ఫిర్ఔన్ తో పాటు ఉన్న చాలా మంది విశ్వసించరు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ اِبْرٰهِیْمَ ۟ۘ
ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం గాధను వారికి చదివి వినిపించండి.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَا تَعْبُدُوْنَ ۟
ఆయన తన తండ్రి ఆజరుతో,తన జాతి వారితో మీరు అల్లాహ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారు ? అని అడిగినప్పుడు.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا نَعْبُدُ اَصْنَامًا فَنَظَلُّ لَهَا عٰكِفِیْنَ ۟
ఆయన జాతి వారు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : మేము కొన్ని విగ్రహాలను వాటి ఆరాధనను వాటి కొరకు అట్టిపెడుతూ పాటిస్తూ ఆరాధిస్తున్నాము.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ هَلْ یَسْمَعُوْنَكُمْ اِذْ تَدْعُوْنَ ۟ۙ
ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు విగ్రహాలను పిలుస్తున్నప్పుడు వారు మీ పిలుపును వింటున్నారా ? అని ప్రశ్నించారు.
Các Tafsir tiếng Ả-rập:
اَوْ یَنْفَعُوْنَكُمْ اَوْ یَضُرُّوْنَ ۟
లేదా ఒక వేళ మీరు వారికి విధేయత చూపితే మీకు వారు ప్రయోజనం చేకూరుస్తారా ? లేదా ఒక వేళ మీరు వారికి అవిధేయులైతే వారు మీకు నష్టం చేకూరుస్తారా ? అని వారితో అడిగారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا بَلْ وَجَدْنَاۤ اٰبَآءَنَا كَذٰلِكَ یَفْعَلُوْنَ ۟
వారు ఇలా సమాధానమిచ్చారు : మేము వారిని పిలిచినప్పుడు వారు మమ్మల్ని విన లేదు,ఒక వేళ మేము వారికి విధేయత చూపితే వారు మమ్మల్ని ప్రయోజనం కలిగించరు,ఒక వేళ మేము వారికి అవిధేయత చూపితే వారు మమ్మల్ని నష్టం కలిగించలేరు. కాని జరిగిందేమిటంటే మేము మా తాతముత్తాతలను ఇలా చేస్తుండగా చూశాము. మేము వారిని అనుకరిస్తున్నాము.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ اَفَرَءَیْتُمْ مَّا كُنْتُمْ تَعْبُدُوْنَ ۟ۙ
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : మీరు యోచన చేసి చూశారా ?మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలను;
Các Tafsir tiếng Ả-rập:
اَنْتُمْ وَاٰبَآؤُكُمُ الْاَقْدَمُوْنَ ۟ؗ
మరియు మీ పూర్వ తాతముత్తాతలు ఆరాధన చేసే వాటిని.
Các Tafsir tiếng Ả-rập:
فَاِنَّهُمْ عَدُوٌّ لِّیْۤ اِلَّا رَبَّ الْعٰلَمِیْنَ ۟ۙ
నిశ్చయంగా వారందరు నాకు శతృవులు ఎందుకంటే సమస్త సృష్టి రాసుల ప్రభువైన అల్లాహ్ తప్ప వారందరు అసత్యులు.
Các Tafsir tiếng Ả-rập:
الَّذِیْ خَلَقَنِیْ فَهُوَ یَهْدِیْنِ ۟ۙ
ఆయనే నన్ను సృష్టించాడు. కనుక ఆయన నన్ను ఇహపరాల మంచి వైపునకు మార్గ నిర్దేశకం చేస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَالَّذِیْ هُوَ یُطْعِمُنِیْ وَیَسْقِیْنِ ۟ۙ
ఆయన ఒక్కడే నాకు ఆకలి కలిగినప్పుడు నాకు తినిపిస్తాడు,నాకు దాహం వేసినప్పుడు నాకు త్రాపిస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِذَا مَرِضْتُ فَهُوَ یَشْفِیْنِ ۟
మరియు ఆయన ఒక్కడే నాకు రోగం కలిగినప్పుడు రోగము నుండి నన్ను నయం చేస్తాడు. ఆయన తప్ప ఇంకెవరూ నాకు నయం చేసేవాడు లేడు.
Các Tafsir tiếng Ả-rập:
وَالَّذِیْ یُمِیْتُنِیْ ثُمَّ یُحْیِیْنِ ۟ۙ
ఆయన ఒక్కడే నా వయస్సు అంతమైపోయినప్పుడు నన్ను మరణింపజేస్తాడు,నేను మరణించిన తరువాత నన్ను జీవింపజేస్తాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَالَّذِیْۤ اَطْمَعُ اَنْ یَّغْفِرَ لِیْ خَطِیْٓـَٔتِیْ یَوْمَ الدِّیْنِ ۟ؕ
ప్రతిఫలం దినం నాడు నా పాపములను మన్నిస్తాడని ఆయన ఒక్కడితోనే నేను ఆశిస్తున్నాను.
Các Tafsir tiếng Ả-rập:
رَبِّ هَبْ لِیْ حُكْمًا وَّاَلْحِقْنِیْ بِالصّٰلِحِیْنَ ۟ۙ
ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువుతో దుఆ చేస్తూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నాకు ధర్మ అవగాహన ప్రసాదించు. మరియు నన్ను నా కన్నా మునుపటి పుణ్యాత్ములైన దైవ ప్రవక్తలతో వారితో పాటు నన్ను స్వర్గంలో ప్రవేశింపజేసి కలుపు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الله مع عباده المؤمنين بالنصر والتأييد والإنجاء من الشدائد.
అల్లాహ్ సహాయము ద్వారా,మద్దతు ద్వారా,ఆపదల నుండి విముక్తి కలిగించటం ద్వారా తన దాసులైన విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు.

• ثبوت صفتي العزة والرحمة لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ఆధిక్యత,కనికరము రెండు లక్షణాల నిరూపణ.

• خطر التقليد الأعمى.
గుడ్డిగా అనుకరించటం యొక్క ప్రమాదం.

• أمل المؤمن في ربه عظيم.
మహోన్నతుడైన తన ప్రభువు విషయంలో విశ్వాసపరుని ఆశ.

وَاجْعَلْ لِّیْ لِسَانَ صِدْقٍ فِی الْاٰخِرِیْنَ ۟ۙ
మరియు నీవు నా తరువాత వచ్చే తరాలలో నా కొరకు అందమైన చర్చను,మంచి కీర్తిని కలిగించు.
Các Tafsir tiếng Ả-rập:
وَاجْعَلْنِیْ مِنْ وَّرَثَةِ جَنَّةِ النَّعِیْمِ ۟ۙ
మరియు నీవు నన్ను స్వర్గ స్థానాలకు వారసులై వాటిలో సుఖభోగాలను అనుభవించే విశ్వాసపరులైన నీ దాసుల్లో చేర్చి వాటిలో నాకు నివాసం కల్పించు.
Các Tafsir tiếng Ả-rập:
وَاغْفِرْ لِاَبِیْۤ اِنَّهٗ كَانَ مِنَ الضَّآلِّیْنَ ۟ۙ
మరియు నీవు నా తండ్రిని మన్నించు. నిశ్ఛయంగా అతడు ,షిర్కు వలన సత్యము నుండి తప్పిన వారిలో అయిపోయాడు. ఇబ్రాహీం అలైహ్స్సలాం తన తండ్రి కొరకు అతను నరక వాసుల్లోంచి వాడు అని స్పష్టమవక మునుపు దుఆ చేశారు. ఎప్పుడైతే అది స్పష్టమైనదో ఆయన అతడి నుండి విసిగిపోయారు,అతని కొరకు దుఆ చేయలేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَلَا تُخْزِنِیْ یَوْمَ یُبْعَثُوْنَ ۟ۙ
లెక్క తీసుకోబడటం కొరకు ప్రజలు లేపబడే రోజున నన్ను శిక్షించి బట్టబయలు చేయకు.
Các Tafsir tiếng Ả-rập:
یَوْمَ لَا یَنْفَعُ مَالٌ وَّلَا بَنُوْنَ ۟ۙ
ఆ రోజు మనిషి ఇహలోకంలో సమీకరించిన సంపద గానీ,సంతానం గానీ ప్రయోజనం చేకూర్చవు. ప్రతి ఒక్కరు వారిపై జయిస్తారు.
Các Tafsir tiếng Ả-rập:
اِلَّا مَنْ اَتَی اللّٰهَ بِقَلْبٍ سَلِیْمٍ ۟ؕ
ఎటువంటి సాటి గానీ,కపటత్వం గానీ,ప్రదర్శనా బుద్ది గానీ,అహంకారము గానీ లేని నిర్మలమైన హృదయమును తీసుకుని అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు మాత్రమే. అతడే అల్లాహ్ మార్గంలో తాను ఖర్చు చేసిన సంపద ద్వారా,అతని కొరకు దుఆ చేసే తన సంతానము ద్వారా ప్రయోజనం చెందుతాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَاُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِیْنَ ۟ۙ
మరియు తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భీతి కలిగిన వారి కొరకు స్వర్గము దగ్గర చేయబడుతుంది.
Các Tafsir tiếng Ả-rập:
وَبُرِّزَتِ الْجَحِیْمُ لِلْغٰوِیْنَ ۟ۙ
సత్య ధర్మము నుండి తప్పిపోయి మార్గ భ్రష్టులయ్యే వారి కొరకు మహషర్ లో నరకాగ్ని ప్రత్యక్షపరచబడుతుంది.
Các Tafsir tiếng Ả-rập:
وَقِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تَعْبُدُوْنَ ۟ۙ
మీరు ఆరాధించే విగ్రహాలు ఏవి అని వారితో దూషిస్తూ అడగటం జరుగుతుంది.
Các Tafsir tiếng Ả-rập:
مِنْ دُوْنِ اللّٰهِ ؕ— هَلْ یَنْصُرُوْنَكُمْ اَوْ یَنْتَصِرُوْنَ ۟ؕ
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అల్లాహ్ శిక్షను మీ నుండి ఆపి మీకు సహాయం చేయగలరా ? లేదా వారు తమ స్వయం కొరకు సహాయం చేసుకోగలరా ?.
Các Tafsir tiếng Ả-rập:
فَكُبْكِبُوْا فِیْهَا هُمْ وَالْغَاوٗنَ ۟ۙ
వారు,వారిని మార్గభ్రష్టతకు గురి చేసిన వారు నరకంలో ఒకరిపై ఒకరు విసిరివేయబడుతారు.
Các Tafsir tiếng Ả-rập:
وَجُنُوْدُ اِبْلِیْسَ اَجْمَعُوْنَ ۟ؕ
మరియు షైతానుల్లోంచి ఇబ్లీసు సహాయకులందరు కూడా. వారిలో నుండి ఎవరు వదిలి వేయబడరు.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا وَهُمْ فِیْهَا یَخْتَصِمُوْنَ ۟ۙ
అల్లాహేతరులను ఆరాధించి వారిని ఆయనను వదిలి సాటి కల్పించేవారు వారునూ,ఎవరినైతే వారు ఆరాధించేవారో వారితో తగువులాడుతూ ఇలా పలుకుతారు :
Các Tafsir tiếng Ả-rập:
تَاللّٰهِ اِنْ كُنَّا لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟ۙ
అల్లాహ్ సాక్షిగా నిశ్ఛయంగా మేము సత్యము నుండి స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ نُسَوِّیْكُمْ بِرَبِّ الْعٰلَمِیْنَ ۟
మేము మిమ్మల్ని సమస్త సృష్టి రాసుల ప్రభువుతో సమానులుగా చేసి ఆయనను మేము ఆరాధించినట్లే మిమ్మల్ని ఆరాధించాము.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَضَلَّنَاۤ اِلَّا الْمُجْرِمُوْنَ ۟
అల్లాహ్ ను వదిలి వారి ఆరాధన వైపునకు మమ్మల్ని పిలిచిన అపరాధులు మాత్రమే మమ్మల్ని సత్య మార్గము నుంచి తప్పించారు.
Các Tafsir tiếng Ả-rập:
فَمَا لَنَا مِنْ شَافِعِیْنَ ۟ۙ
అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేసి ఆయన శిక్ష నుండి మమ్మల్ని విముక్తి కలిగించటానికి సిఫారసు చేసే వారు లేరు.
Các Tafsir tiếng Ả-rập:
وَلَا صَدِیْقٍ حَمِیْمٍ ۟
మా తరపు నుండి ప్రతిఘటించే,మా కొరకు సిఫారసు చేసే ప్రత్యక ఆప్యాయత కల ఎటువంటి స్నేహితుడు మాకు లేడు.
Các Tafsir tiếng Ả-rập:
فَلَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
అయితే ఒక వేళ మా కొరకు ఇహలోక జీవితం వైపు మరలటం అన్నది ఉంటే మేము అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారిలోంచి అయిపోతాము.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గాధలో,తిరస్కారుల పరిణామంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
كَذَّبَتْ قَوْمُ نُوْحِ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ
నూహ్ అలైహిస్సలాం జాతి వారు నూహ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ نُوْحٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వంశ పరంగా సోదరుడైన నూహ్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను.అల్లాహ్ నా వైపునకు వహీ చేసిన దానిలో నేను అధికం చేయని,తరగించని నీతిమంతుడను.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ۚ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ؕ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْۤا اَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْاَرْذَلُوْنَ ۟ؕ
ఆయనతో ఆయన జాతి వారు ఇలా అన్నారు : ఓ నూహ్ మేము నిన్ను అనుసరించాలా ? మరియు నీవు తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించి ఆచరించాలా , పరిస్థితి చూస్తే నిన్ను అనుసరిస్తున్నది మాత్రం ప్రజల్లోంచి అధములే. వారిలో నాయకులు,గొప్పవారు దొరకరు ?!.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• أهمية سلامة القلب من الأمراض كالحسد والرياء والعُجب.
అసూయ,ప్రదర్శనా బుద్ధి,అహంకారము లాంటి రోగాల నుండి హృదయమును పరిరక్షించటం యొక్క ప్రాముఖ్యత.

• تعليق المسؤولية عن الضلال على المضلين لا تنفع الضالين.
మార్గభ్రష్టత గురించి మార్గభ్రష్టతకు లోను చేసే వారు ప్రశ్నించబడటం మార్గభ్రష్టులయ్యే వారికి లాభం కలిగించదు.

• التكذيب برسول الله تكذيب بجميع الرسل.
అల్లాహ్ ప్రవక్తను తిరస్కరించటం ప్రవక్తలందరినీ తిరస్కరించటం.

• حُسن التخلص في قصة إبراهيم من الاستطراد في ذكر القيامة ثم الرجوع إلى خاتمة القصة.
ఇబ్రాహీం అలైహిస్సలాం గాధలో మంచి పధ్ధతిలో ఏ విధంగా కూడా తెలియకుండా ప్రళయదినం ప్రస్తావనలో అంశం మారింది. ఆ తరువాత గాధ యొక్క ముగింపు వైపునకు మరలటం జరిగింది.

قَالَ وَمَا عِلْمِیْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟ۚ
నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : ఈ విశ్వాసపరులందరు ఏమి చేసేవారో నాకు తెలియదు. నేను వారి ఆచరణలను లెక్కవేసే పరిరక్షకుడిగా వారిపై లేను.
Các Tafsir tiếng Ả-rập:
اِنْ حِسَابُهُمْ اِلَّا عَلٰی رَبِّیْ لَوْ تَشْعُرُوْنَ ۟ۚ
వారి లెక్క మాత్రం వారి రహస్యాలను,వారి బహిరంగాలను తెలిసిన అల్లాహ్ పై ఉన్నది. నా వద్ద లేదు. మీరు ఏమి చెప్పారో ఒక వేళ మీరు తెలుసుకుంటే చెప్పేవారు కాదు.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَنَا بِطَارِدِ الْمُؤْمِنِیْنَ ۟ۚ
మరియు నేను మీరు విశ్వసించటానికి మీ కోరికను అంగీకరిస్తూ విశ్వాసపరులను నా సభ నుండి గెంటివేసే వాడను కాను.
Các Tafsir tiếng Ả-rập:
اِنْ اَنَا اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟ؕ
నేను హెచ్చరికను స్పష్టపరిచే హెచ్చరిక చేసేవాడను మాత్రమే నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తున్నాను.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰنُوْحُ لَتَكُوْنَنَّ مِنَ الْمَرْجُوْمِیْنَ ۟ؕ
ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : నీవు మమ్మల్ని పిలుస్తున్న దాని నుండి ఆపకపోతే నీవు తప్పకుండా దూషించబడిన వారిలో నుంచి,రాళ్ళతో కొట్టబడి హతమార్చబడిన వారిలో నుంచి అయిపోతావు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ رَبِّ اِنَّ قَوْمِیْ كَذَّبُوْنِ ۟ۚۖ
నూహ్ అలైహిస్సలాం తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నా జాతి వారు నన్ను తిరస్కరించారు. మరియు నేను నీ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను సత్యవంతుడని నమ్మలేదు.
Các Tafsir tiếng Ả-rập:
فَافْتَحْ بَیْنِیْ وَبَیْنَهُمْ فَتْحًا وَّنَجِّنِیْ وَمَنْ مَّعِیَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
అయితే నీవు నాకూ,వారికి మధ్య అసత్యముపై వారు మొండిగా ఉండటం వలన వారిని తుదిముట్టించే ఒక తీర్పును ఇవ్వు. నీవు నా జాతి వారిలో నుంచి అవిశ్వాసపరులని దేనితోనైతే వినాశనమునకు గురి చేస్తావో దాని నుండి నన్ను,నాతోపాటు ఉన్న విశ్వాసపరులని రక్షించు.
Các Tafsir tiếng Ả-rập:
فَاَنْجَیْنٰهُ وَمَنْ مَّعَهٗ فِی الْفُلْكِ الْمَشْحُوْنِ ۟ۚ
అప్పుడు మేము అతని కొరకు అతని దుఆను స్వీకరించాము. మరియు మేము అతనిని,అతనితోపాటు ఉన్న విశ్వాసపరులని మనుషులతో,జంతువులతో నిండి ఉన్న నావలో రక్షించాము.
Các Tafsir tiếng Ả-rập:
ثُمَّ اَغْرَقْنَا بَعْدُ الْبٰقِیْنَ ۟ؕ
ఆ తరువాత మేము వారిలో మిగిలి ఉన్న వారిని ముంచి వేశాము, వారు నూహ్ జాతివారు.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,అతని జాతి వారి గాధలో,నూహ్,అతనితో పాటు ఉన్న విశ్వాసపరుల విముక్తిలో,అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరుల వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం కలదు. మరియు వారిలో నుండి చాలా మంది విశ్వసించటం లేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
كَذَّبَتْ عَادُ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ
ఆద్ జాతి వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ هُوْدٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వంశ పరంగా సోదరుడైన హూద్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను. అల్లాహ్ నన్ను చేరవేయమని ఆదేశించిన దానిలో నేను అధికం చేయని,అందులో తరగించని నీతిమంతుడను.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
Các Tafsir tiếng Ả-rập:
اَتَبْنُوْنَ بِكُلِّ رِیْعٍ اٰیَةً تَعْبَثُوْنَ ۟ۙ
ఏమీ మీరు ప్రతీ ఎత్తైన స్థలంలో మీ ఇహములో లేదా మీ పరములో మీపై మరలని ప్రయోజనం లేని ఒక నిష్ప్రయోజనమైన స్మారక కట్టడమును నిర్మిస్తారా ?!.
Các Tafsir tiếng Ả-rập:
وَتَتَّخِذُوْنَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُوْنَ ۟ۚ
మీరు ఈ ఇహలోకములో శాస్వతంగా ఉండిపోయేటట్లుగా కోటలను,భవనములను నిర్మిస్తున్నారు. మీరు వాటి నుండి మరలించరని.
Các Tafsir tiếng Ả-rập:
وَاِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِیْنَ ۟ۚ
మరియు మీరు హత్య ద్వారా,కొట్టడం ద్వారా దాడి చేసినప్పుడు దయా,దాక్షిణ్యాలు లేని దౌర్జన్యపరులుగా దాడి చేస్తారు.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَاتَّقُوا الَّذِیْۤ اَمَدَّكُمْ بِمَا تَعْلَمُوْنَ ۟ۚ
మరియు మీరు మీకు తెలిసిన అనుగ్రహాలు ప్రసాదించిన ఆ అల్లాహ్ క్రోధము నుండి మీరు భయపడండి.
Các Tafsir tiếng Ả-rập:
اَمَدَّكُمْ بِاَنْعَامٍ وَّبَنِیْنَ ۟ۚۙ
ఆయన మీకు పశువులను ప్రసాదించాడు,మీకు సంతానమును ప్రసాదించాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَجَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۚ
మీకు తోటలను,ప్రవహించే చెలమలను ప్రసాదించాడు.
Các Tafsir tiếng Ả-rập:
اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟ؕ
ఓ నా జాతి వారా నిశ్ఛయంగా నేను మీపై గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا سَوَآءٌ عَلَیْنَاۤ اَوَعَظْتَ اَمْ لَمْ تَكُنْ مِّنَ الْوٰعِظِیْنَ ۟ۙ
అతని జాతి వారు అతనితో ఇలా పలికారు : మాకు నీ హితబోధన చేయటం,చేయకపోవటం మా వద్ద సమానము. మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము. మేము ఉన్న దాని నుండి మరలమంటే మరలము.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• أفضلية أهل السبق للإيمان حتى لو كانوا فقراء أو ضعفاء.
విశ్వాసములో మందంజ వేసే వారి ప్రాముఖ్యత ఉన్నది చివరికి ఒక వేళ వారు పేదవారైనా,బలహీనులైనా.

• إهلاك الظالمين، وإنجاء المؤمنين سُنَّة إلهية.
దుర్మార్గులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము.

• خطر الركونِ إلى الدنيا.
ఇహలోకముపై ఆధారపడటం యొక్క ప్రమాదము.

• تعنت أهل الباطل، وإصرارهم عليه.
అసత్యపరుల యొక్క మొండితనము,దానిపై వారి పట్టుబట్టడం.

اِنْ هٰذَاۤ اِلَّا خُلُقُ الْاَوَّلِیْنَ ۟ۙ
ఇది మాత్రం పూర్వికుల ధర్మము,వారి అలవాట్లు,వారి గుణాలు.
Các Tafsir tiếng Ả-rập:
وَمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟ۚ
మేము శిక్షించబడము.
Các Tafsir tiếng Ả-rập:
فَكَذَّبُوْهُ فَاَهْلَكْنٰهُمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
అప్పుడు వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరిస్తూనే ఉన్నారు. అప్పుడు మేము వారి తిరస్కారమునకు బదులుగా వంధ్య గాలితో వారిని వినాశనమునకు గురి చేశాము. నిశ్చయంగా ఈ వినాశనములో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
كَذَّبَتْ ثَمُوْدُ الْمُرْسَلِیْنَ ۟ۚۖ
సమూద్ జాతి తమ ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలందరిని తిరస్కరించింది.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ صٰلِحٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వంశ పరంగా సోదరుడైన సాలిహ్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని. దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
Các Tafsir tiếng Ả-rập:
اَتُتْرَكُوْنَ فِیْ مَا هٰهُنَاۤ اٰمِنِیْنَ ۟ۙ
ఏమీ మీరు ఉన్న సుఖబోగాల్లో,అనుగ్రహాల్లో నిశ్ఛింతగా మీరు భయపడకుండా వదలివేయబడుతారని ఆశిస్తున్నారా ?!.
Các Tafsir tiếng Ả-rập:
فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ
తోటలలో,ప్రవహించే చెలమలలో,
Các Tafsir tiếng Ả-rập:
وَّزُرُوْعٍ وَّنَخْلٍ طَلْعُهَا هَضِیْمٌ ۟ۚ
మరియు పంట చేలలో, పండిపోయి మెత్తగా ఉన్న ఖర్జూరపు పండ్ల తోటలలో.
Các Tafsir tiếng Ả-rập:
وَتَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا فٰرِهِیْنَ ۟ۚ
మరియు మీరు నివసించటానికి ఇండ్లు నిర్మించటానికి పర్వతాలను చెక్కుతారు. మరియు మీరు వాటిని చెక్కటంలో నైపుణ్యవంతులు.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَلَا تُطِیْعُوْۤا اَمْرَ الْمُسْرِفِیْنَ ۟ۙ
మరియు మీరు పాపములకు పాల్పడి తమ స్వయం పై మితిమీరే వారి ఆజ్ఞను అనుసరించకండి.
Các Tafsir tiếng Ả-rập:
الَّذِیْنَ یُفْسِدُوْنَ فِی الْاَرْضِ وَلَا یُصْلِحُوْنَ ۟
వారే ఎవరైతే పాప కార్యములను వ్యాపింపజేసి భూమిలో అల్లకల్లోలాలను రేకెత్తిస్తారో,అల్లాహ్ విధేయతను చేపట్టి స్వయం సంస్కరణ చేయరో.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِیْنَ ۟ۚ
అతనితో అతని జాతివారు ఇలా పలికారు : నీవు మాత్రం పదే పదే మంత్రజాలమునకు వశపరచబడి చివరికి మంత్రజాలము వారి బుద్దులను వశపరచుకుని తీసుకుని వెళ్ళిపోయిన వారిలో వాడివి.
Các Tafsir tiếng Ả-rập:
مَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ۖۚ— فَاْتِ بِاٰیَةٍ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
నీవు మాత్రం మాలాంటి ఒక మనిషి మాత్రమే,నీవు ప్రవక్త అవటానికి నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. నీవు ప్రవక్త అని వాదించే విషయంలో ఒక వేళ సత్యమంతుడివే అయితే నీవు ప్రవక్త అవటంపై సూచించే ఒక సూచనను తీసుకుని రా.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ هٰذِهٖ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَّلَكُمْ شِرْبُ یَوْمٍ مَّعْلُوْمٍ ۟ۚ
సాలిహ్ అలైహిస్సలాం - వాస్తవానికి అల్లాహ్ ఆయనకు ఒక సూచనను ప్రసాదించాడు. అది ఒక ఆడ ఒంటె. దాన్ని అల్లాహ్ రాతి బండ నుండి వెలికి తీశాడు - వారితో ఇలా పలికారు : ఇది చూడబడే,తాకబడే ఒక ఆడ ఒంటె.దాని కొరకు నీటిని త్రాగే ఒక వంతు మరియు మీ కొరకు ఒక వంతు నిర్ధారితమై ఉన్నది. మీ వంతు దినమున అది త్రాగదు మరియు దాని వంతు దినమున మీరు త్రాగరు.
Các Tafsir tiếng Ả-rập:
وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابُ یَوْمٍ عَظِیْمٍ ۟
మరియు మీరు దాన్ని కోయటం ద్వారా గానీ లేదా కొట్టడం ద్వారా గానీ దానికి కీడు కలిగించే దానితో ముట్టుకోకండి. అప్పుడు దాని వలన మీపై ఆపద కురిసే గొప్ప దినములో అల్లాహ్ శిక్ష మిమ్మల్ని వినాశనమునకు గురి చేస్తుంది.
Các Tafsir tiếng Ả-rập:
فَعَقَرُوْهَا فَاَصْبَحُوْا نٰدِمِیْنَ ۟ۙ
వారందరు దాని వెనుక కాలి మోకాలి వద్ద నరమును కోసి చంపటానికి కలిసి కట్టుగా నిర్ణయించుకున్నారు. వారిలో పెద్ద దుష్టుడు దాన్ని కోసి చంపివేశాడు. ఎప్పుడైతే వారు తమపై ఖచ్చితంగా శిక్ష కురుస్తుందని తెలుసుకున్నారో వారు తాము ముందడుగు వేసిన దానిపై పశ్ఛాత్తాప్పడే వారిలో నుంచి అయిపోయారు. కానీ శిక్షను ప్రత్యక్ష్యంగా చూసినప్పుడు ప్రయోజనం ఉండదు.
Các Tafsir tiếng Ả-rập:
فَاَخَذَهُمُ الْعَذَابُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
అయితే వారితో వాగ్దానం చేయబడిన భూకంపము,భయంకర శబ్దము ద్వారా వారిని శిక్ష కబళించింది. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సాలిహ్,ఆయన జాతి వారి గాధలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• توالي النعم مع الكفر استدراج للهلاك.
అవిశ్వాసంతో పాటు వరుస అనుగ్రహాలు కలగటం వినాశనము కొరకు నెమ్మది నెమ్మదిగా దగ్గర చేయటం.

• التذكير بالنعم يُرتجى منه الإيمان والعودة إلى الله من العبد.
అనుగ్రహాలను గుర్తు చేసి దాసుడి నుండి విశ్వాసము,అల్లాహ్ వైపునకు మరలటమును ఆశించబడుతుంది.

• المعاصي هي سبب الفساد في الأرض.
పాపకార్యాలు భూమిలో కల్లోలాలకు కారణం.

كَذَّبَتْ قَوْمُ لُوْطِ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ
లూత్ అలైహిస్సలాం జాతి వారు తమ ప్రవక్త లూత్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలను తిరస్కరించారు.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ لُوْطٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వారి సోదరుడు లూత్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటంను విడనాడి భయపడరా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు.
Các Tafsir tiếng Ả-rập:
اَتَاْتُوْنَ الذُّكْرَانَ مِنَ الْعٰلَمِیْنَ ۟ۙ
ఏమీ మీరు ప్రజల్లోంచి మగవారి వద్దకు (కామ కోరికలను తీర్చుకోవటానికి) వారి వెనుక భాగంలో వస్తున్నారా ?!.
Các Tafsir tiếng Ả-rập:
وَتَذَرُوْنَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِّنْ اَزْوَاجِكُمْ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ عٰدُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ మీరు మీ కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించిన మీ భార్యల మర్మావయవాల వద్దకు రావటమును వదిలివేశారు. కానీ మీరు ఈ చెడు అపరిమితితో అల్లాహ్ హద్దులను మితిమీరిపోయారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰلُوْطُ لَتَكُوْنَنَّ مِنَ الْمُخْرَجِیْنَ ۟
ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు : ఓ లూత్ నీవు ఒక వేళ మమ్మల్ని ఈ చర్య నుండి ఆపటం నుండి, దాన్ని మాపై ఇష్టపడకపోవటం నుండి విడనాడకపోతే తప్పక నీవు,నీతోపాటు ఉన్న వారు మా ఊరి నుండి వెళ్ళగొట్టబడుతారు.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ اِنِّیْ لِعَمَلِكُمْ مِّنَ الْقَالِیْنَ ۟ؕ
లూత్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నిశ్ఛయంగా మీ ఈ చర్యను అసహ్యించుకునే,ధ్వేషించుకునే వారిలో నేనూ ఉన్నాను.
Các Tafsir tiếng Ả-rập:
رَبِّ نَجِّنِیْ وَاَهْلِیْ مِمَّا یَعْمَلُوْنَ ۟
ఆయన తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు వీరందరికి వీరు చేసిన దుష్కర్మల వలన కలిగే శిక్ష నుండి నన్ను రక్షించు, నా ఇంటి వారిని రక్షించు.
Các Tafsir tiếng Ả-rập:
فَنَجَّیْنٰهُ وَاَهْلَهٗۤ اَجْمَعِیْنَ ۟ۙ
అప్పుడు మేము అతని దఆను స్వీకరించి అతన్నీ,అతని ఇంటి వారందరినీ రక్షించాము.
Các Tafsir tiếng Ả-rập:
اِلَّا عَجُوْزًا فِی الْغٰبِرِیْنَ ۟ۚ
ఆయన సతీమణి తప్ప. ఆమె అవిశ్వాసపరురాలు. ఆమె వెళ్ళిపోయె వారిలో,వినాశనం చెందేవారిలో నుండి అయిపోయింది.
Các Tafsir tiếng Ả-rập:
ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِیْنَ ۟ۚ
ఆ పిదప లూత్,ఆయన ఇంటి వారు ఊరి నుండి (సదూమ్) బయలదేరిన తరువాత మిగిలి ఉన్న ఆయన జాతి వారిని మేము తీవ్రంగా వినాశనమునకు గురి చేశాము.
Các Tafsir tiếng Ả-rập:
وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ۚ— فَسَآءَ مَطَرُ الْمُنْذَرِیْنَ ۟
మరియు మేము వారిపై వర్షమును కురిపించేటట్లుగా ఆకాశము నుండి రాళ్ళను కరిపించాము. లూత్ అలైహిస్సలాం ఎవరినైతే అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించారో,వారిని భయ పెట్టారో ఒక వేళ వారు తాము ఉన్న దుష్కర్మలను పాల్పడటంలో కొనసాగితే వారందరిపై కురిసే వర్షం ఎంతో చెడ్డదైనది.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన లూత్ అలైహిస్సలాం జాతి వారిపై ఆశ్లీల కార్యము వలన కురిసే శిక్షలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
كَذَّبَ اَصْحٰبُ لْـَٔیْكَةِ الْمُرْسَلِیْنَ ۟ۚۖ
మద్యన్ కు దగ్గరలో ఉన్న దట్టమైన చెట్లు కల పట్టణం వారు తమ ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
Các Tafsir tiếng Ả-rập:
اِذْ قَالَ لَهُمْ شُعَیْبٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వారి ప్రవక్త ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటమును విడనాడి భయపడరా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్ఛయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని,నాకు ఆయన దేనిని చేరవేయమని ఆదేశించాడో దానిపై నేను అధికం చేయను,తగ్గించను.
Các Tafsir tiếng Ả-rập:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు.
Các Tafsir tiếng Ả-rập:
اَوْفُوا الْكَیْلَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُخْسِرِیْنَ ۟ۚ
మీరు ప్రజలకు అమ్మేటప్పుడు పూర్తిగా కొలవండి. ప్రజలకు అమ్మినప్పుడు కొలవటంలో తగ్గించే వారిలో మీరు కాకండి.
Các Tafsir tiếng Ả-rập:
وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِیْمِ ۟ۚ
ఇతరుల కొరకు తూకమేసేటప్పుడు సరైన తూకముతో తూకమేయండి.
Các Tafsir tiếng Ả-rập:
وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟ۚ
మరియు మీరు ప్రజల హక్కులను తగ్గించకండి. మరియు మీరు పాపకార్యములకు పాల్పడి భూమిలో ఉపద్రవాలను అధికం చేయకండి.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• اللواط شذوذ عن الفطرة ومنكر عظيم.
స్వలింగ సంపర్కము అనేది స్వభావం నుండి ఒక క్రమరాహిత్యం మరియు ఒక పెద్ద అసహ్యకరమైన చర్య.

• من الابتلاء للداعية أن يكون أهل بيته من أصحاب الكفر أو المعاصي.
సందేశ ప్రచారకుని ఇంటి వారు అవిశ్వాసపరులు,పాపాత్ములు కావటం అతని కొరకు పరీక్ష.

• العلاقات الأرضية ما لم يصحبها الإيمان، لا تنفع صاحبها إذا نزل العذاب.
భూ సంబంధాలు కలవారికి విశ్వాసం లేకపోతే శిక్ష అవతరించేటప్పుడు అవి ప్రయోజనం కలిగించవు.

• وجوب وفاء الكيل وحرمة التَّطْفِيف.
తూకములను సంపూర్ణంగా వేయటం తప్పనిసరి. మరియు తూకముల్లో హెచ్చుతగ్గులు చేయటం నిషేధము.

وَاتَّقُوا الَّذِیْ خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْاَوَّلِیْنَ ۟ؕ
ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో మరియు పూర్వ సమాజాలను సృష్టించాడో ఆయన మీపై తన శిక్షను అవతరింపజేస్తాడని ఆయనతో భయముతో భీతిని కలిగి ఉండండి.
Các Tafsir tiếng Ả-rập:
قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِیْنَ ۟ۙ
షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా ఫలికారు : నీవు మాత్రం పదే పదే మంత్రజాలము సంభవించిన వారిలోంచి వాడివి చివరికి మంత్రజాలము నీ బుద్ధిని వశపరచుకుని దాన్ని పోగొట్టింది.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا وَاِنْ نَّظُنُّكَ لَمِنَ الْكٰذِبِیْنَ ۟ۚ
మరియు నీవు మాత్రం మాలాంటి మనిషివి మాత్రమే నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు నీవు ఎలా ప్రవక్తవవుతావు ?. నీవు ప్రవక్తవని వాదిస్తున్న విషయంలో నిన్ను అసత్యడువని మేము భావిస్తున్నాము.
Các Tafsir tiếng Ả-rập:
فَاَسْقِطْ عَلَیْنَا كِسَفًا مِّنَ السَّمَآءِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟ؕ
నీవు వాదిస్తున్న విషయంలో ఒక వేళ సత్యవంతుడివి అయితే ఆకాశము నుండి ఒక తునకను మాపై పడవేయి.
Các Tafsir tiếng Ả-rập:
قَالَ رَبِّیْۤ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ ۟
షుఐబ్ వారితో ఇలా పలికారు : మీరు చేస్తున్న షిర్కు ,పాపకార్యాల గురించి మా ప్రభువుకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు.
Các Tafsir tiếng Ả-rập:
فَكَذَّبُوْهُ فَاَخَذَهُمْ عَذَابُ یَوْمِ الظُّلَّةِ ؕ— اِنَّهٗ كَانَ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
అయితే వారు తమ తిరస్కారముపైనే కొనసాగారు. అప్పుడు వారికి పెద్ద శిక్ష తీవ్ర వేడి కల దినము తరువాత ఒక మేఘము వారిని నీడ నిచ్చేటట్లు చుట్టుకుంది. అప్పుడు అది వారిపై అగ్నిని కురిపించి వారిని కాల్చివేసింది. నిశ్ఛయంగా వారి వినాశనము యొక్క దినము పెద్ద భయంకర దినమైనది.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన షుఐబ్ అలైహిస్సలాం జాతి వారి వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّهٗ لَتَنْزِیْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన ఈ ఖుర్ఆన్ సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.
Các Tafsir tiếng Ả-rập:
نَزَلَ بِهِ الرُّوْحُ الْاَمِیْنُ ۟ۙ
దీన్ని విశ్వసనీయుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని దిగారు.
Các Tafsir tiếng Ả-rập:
عَلٰی قَلْبِكَ لِتَكُوْنَ مِنَ الْمُنْذِرِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా అతడు దాన్ని తీసుకుని నీ హృదయంపై నీవు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించే, వారిని భయపెట్టే ప్రవక్తల్లోంచి అవటానికి దిగాడు.
Các Tafsir tiếng Ả-rập:
بِلِسَانٍ عَرَبِیٍّ مُّبِیْنٍ ۟ؕ
అతడు దాన్ని స్పష్టమైన అరబీ భాషలో తీసుకుని దిగాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَاِنَّهٗ لَفِیْ زُبُرِ الْاَوَّلِیْنَ ۟
మరియు నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ పూర్వ గ్రంధాలలో ప్రస్తావించబడినది. నిశ్ఛయంగా పూర్వ దివ్య గ్రంధాలు దీని గురించి శుభవార్తను ఇచ్చినవి.
Các Tafsir tiếng Ả-rập:
اَوَلَمْ یَكُنْ لَّهُمْ اٰیَةً اَنْ یَّعْلَمَهٗ عُلَمٰٓؤُا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
ఏమీ అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి ఇస్రాయీలు సంతతి వారి పండితులకు సయితం మీపై అవతరింపబడిన దాని వాస్తవికత తెలిసి ఉండటం మీ నిజాయితీపై ఒక సూచనగా మిమ్మల్ని తిరస్కరించే వీరందరికి సరిపోదా ?.
Các Tafsir tiếng Ả-rập:
وَلَوْ نَزَّلْنٰهُ عَلٰی بَعْضِ الْاَعْجَمِیْنَ ۟ۙ
మరియు ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబీ మట్లాడలేని అరబ్బేతరుల్లోంచి కొందరిపై అవతరింపజేసి ఉంటే.
Các Tafsir tiếng Ả-rập:
فَقَرَاَهٗ عَلَیْهِمْ مَّا كَانُوْا بِهٖ مُؤْمِنِیْنَ ۟ؕ
అప్పుడు అతను దాన్ని వారికి చదివి వినిపించినా వారు దాన్ని విస్వసించేవారు కాదు; ఎందుకంటే వారు మాకు అది అర్ధం కాలేదు అంటారు. కావున వారు అది వారి భాషలో అవతరింపబడినది కాబట్టి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
Các Tafsir tiếng Ả-rập:
كَذٰلِكَ سَلَكْنٰهُ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَ ۟ؕ
ఈ విధంగా మేము తిరస్కారమును,అవిశ్వాసమును అపరాధుల హృదయాలలో ప్రవేశింపజేశాము.
Các Tafsir tiếng Ả-rập:
لَا یُؤْمِنُوْنَ بِهٖ حَتّٰی یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَ ۟ۙ
వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు తాము ఉన్న అవిశ్వాసము నుండి మారరు,విశ్వసించరు.
Các Tafsir tiếng Ả-rập:
فَیَاْتِیَهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟ۙ
అప్పుడు ఈ శిక్ష వారి వద్దకు అకస్మాత్తుగా వచ్చిపడుతుంది. వారి వద్దకు అది అకస్మాత్తుగా వచ్చేంతవరకు దాని రావటమును వారు గుర్తించరు.
Các Tafsir tiếng Ả-rập:
فَیَقُوْلُوْا هَلْ نَحْنُ مُنْظَرُوْنَ ۟ؕ
వారిపై శిక్ష అకస్మాత్తుగా అవతరించినప్పుడు వారు తీవ్ర బాధతో ఇలా పలుకుతారు : మేము అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడటానికి మాకు గడువు ఇవ్వబడుతుందా ?!.
Các Tafsir tiếng Ả-rập:
اَفَبِعَذَابِنَا یَسْتَعْجِلُوْنَ ۟
ఏమి ఈ తిరస్కారులందరు మా శిక్ష గురించి ఇలా పలుకుతూ తొందర చేస్తున్నారా : నీవు మాపై వాదించినట్లు ఆకాశము ఏదైన తునకమును పడవేసేనంత వరకు మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము ?!
Các Tafsir tiếng Ả-rập:
اَفَرَءَیْتَ اِنْ مَّتَّعْنٰهُمْ سِنِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు నాకు తెలపండి ఒక వేళ మేము మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటము నుండి విముఖత చూపే ఈ అవిశ్వాసపరులందరికి కొంత కాలము అనుగ్రహాల ద్వారా ప్రయోజనం చేకూర్చినా.
Các Tafsir tiếng Ả-rập:
ثُمَّ جَآءَهُمْ مَّا كَانُوْا یُوْعَدُوْنَ ۟ۙ
ఆ తరువాత వారు ఈ అనుగ్రహాలను పొందిన కాలం తరువాత వారితో వాగ్దానం చేయబడిన శిక్ష వారి వద్దకు వచ్చినది.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• كلما تعمَّق المسلم في اللغة العربية، كان أقدر على فهم القرآن.
ఎప్పుడెప్పుడైతే ముస్లిము అరబీ భాష లోతులోకి వెళ్తాడో అతడు ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునే సామర్ధ్యమును కలిగి ఉంటాడు.

• الاحتجاج على المشركين بما عند المُنْصِفين من أهل الكتاب من الإقرار بأن القرآن من عند الله.
గ్రంధవహుల్లోంచి న్యాయపరుల వద్ద ఉన్న ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అనటంపై అంగీకారము ద్వారా ముష్రికులకు వ్యతిరేకంగా వాదించటం.

• ما يناله الكفار من نعم الدنيا استدراج لا كرامة.
అవిశ్వాసపరులు ఏవైతే ప్రాపంచిక అనుగ్రహాలు పొందారో అవి ఒక ఎర మాత్రమే గౌరవం కాదు.

مَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یُمَتَّعُوْنَ ۟ؕ
ఇహ లోకంలో వారికి ఉన్నఅనుగ్రహాలు వారికి ఏమి ప్రయోజనం కలిగించగలవు ?!. నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలన్నీఅంతమైపోయాయి. మరియు అవి ఏవి లాభం కలిగించవు.
Các Tafsir tiếng Ả-rập:
وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا لَهَا مُنْذِرُوْنَ ۟
సమాజాల్లోంచి ఏ సమాజమును కూడా వారి వద్దకు ప్రవక్తలను పంపించి,గ్రంధాలను అవతరింపజేసి సాకులు లేకుండా చేసిన తరువాతే మేము నాశనం చేశాము.
Các Tafsir tiếng Ả-rập:
ذِكْرٰی ۛ۫— وَمَا كُنَّا ظٰلِمِیْنَ ۟
వారికి ఉపదేశముగా,హితోపదేశముగా. మరియు ప్రవక్తలను పంపించి,గ్రంధములను అవతరింపజేసి వారి వద్ద సాకులు లేకుండా చేసిన తరువాత వారిని శిక్షించటం వలన మేము అన్యాయము చేసిన వారము కాము.
Các Tafsir tiếng Ả-rập:
وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّیٰطِیْنُ ۟ۚ
ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై దిగలేదు.
Các Tafsir tiếng Ả-rập:
وَمَا یَنْۢبَغِیْ لَهُمْ وَمَا یَسْتَطِیْعُوْنَ ۟ؕ
వారు ఆయన హృదయంపై దిగటం సరి కాదు. మరియు వారికి దాని శక్తి లేదు.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُوْلُوْنَ ۟ؕ
వారికి దాని శక్తి లేదు ఎందుకంటే వారు ఆకాశము నుండి దూరపు స్థలంలో తొలగించబడ్డారు. అప్పుడు వారు దాని వద్దకు ఎలా చేర గలరు. మరియు దాన్ని తీసుకుని ఎలా దిగ గలరు ?!.
Các Tafsir tiếng Ả-rập:
فَلَا تَدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتَكُوْنَ مِنَ الْمُعَذَّبِیْنَ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆయనతో పాటు మీరు సాటి కల్పిస్తూ ఆరాధించకండి. అప్పుడు మీరు దాని కారణం వలన శిక్షింపబడే వారిలో అయిపోతారు.
Các Tafsir tiếng Ả-rập:
وَاَنْذِرْ عَشِیْرَتَكَ الْاَقْرَبِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారిలోంచి దగ్గర బంధువులను ఒక వేళ వారు షిర్కు పై ఉంటే వారికి అల్లాహ్ శిక్ష కలగనంత వరకు హెచ్చరిస్తూ ఉండండి.
Các Tafsir tiếng Ả-rập:
وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟ۚ
మరియు విశ్వాసపరులోంచి నిన్ను అనుసరించిన వారి కొరకు నీ రెక్కలను కర్మ పరంగా,మాట పరంగా వారిపై కనికరిస్తూ,దయను చూపుతూ మృధు వైఖరిని కలిగి ఉండు.
Các Tafsir tiếng Ả-rập:
فَاِنْ عَصَوْكَ فَقُلْ اِنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تَعْمَلُوْنَ ۟ۚ
ఒక వేళ వారు నీపై అవిధేయత చూపి,నీవు వారికి ఆదేశించిన అల్లాహ్ ఏకత్వమును,ఆయన విధేయతను స్వీకరించకపోతే, మీరు వారితో ఇలా పలకండి : మీరు చేస్తున్న షిర్కు,పాప కార్యాల నుండి నేను అతీతుడను.
Các Tafsir tiếng Ả-rập:
وَتَوَكَّلْ عَلَی الْعَزِیْزِ الرَّحِیْمِ ۟ۙ
మరియు నీవు నీ వ్యవహారాలన్నింటిలో తన శతృవులతో ప్రతీకారం తీసుకునే సర్వ శక్తిమంతుడి పై,వారిలోంచి అతని వైపు మరలే వారిపై కరుణించేవాడిపై నమ్మకమును కలిగి ఉండు.
Các Tafsir tiếng Ả-rập:
الَّذِیْ یَرٰىكَ حِیْنَ تَقُوْمُ ۟ۙ
పరిశుద్ధుడైన ఆయనే నీవు నమాజు కొరకు నిలబడినప్పుడు చూస్తున్నాడు.
Các Tafsir tiếng Ả-rập:
وَتَقَلُّبَكَ فِی السّٰجِدِیْنَ ۟
మరియు పరిశుద్ధుడైన ఆయన నమాజ్ చదివే వారిలో ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మీ మారటమును చూస్తున్నాడు. మీరు నెలకొల్పిన (నమాజులను) వాటిలోంచి,ఇతరులు నెలకొల్పిన వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Các Tafsir tiếng Ả-rập:
اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
నిశ్ఛయంగా ఆయనే మీరు పఠించిన ఖుర్ఆన్ ను,మీ నమాజులో స్మరణను వినే వాడును,మీ ఉద్దేశమును తెలిసినవాడును.
Các Tafsir tiếng Ả-rập:
هَلْ اُنَبِّئُكُمْ عَلٰی مَنْ تَنَزَّلُ الشَّیٰطِیْنُ ۟ؕ
ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు దిగుతారని మీరు వాదించారో వారు ఎవరిపై దిగుతారో మీకు నేను తెలియపరచనా ?.
Các Tafsir tiếng Ả-rập:
تَنَزَّلُ عَلٰی كُلِّ اَفَّاكٍ اَثِیْمٍ ۟ۙ
షైతానులు జ్యోతిష్యుల్లోంచి అధికంగా పాపాలకు,అవిధేయ కార్యాలకు పాల్పడే ప్రతీ అసత్యపరునిపై దిగుతారు.
Các Tafsir tiếng Ả-rập:
یُّلْقُوْنَ السَّمْعَ وَاَكْثَرُهُمْ كٰذِبُوْنَ ۟ؕ
షైతానులు పై లోకాల్లో ఉన్న దూతల (మలయే ఆలా) నుండి విన్న వాటిని ఎత్తుకుని వచ్చి జ్యోతిష్యుల్లోంచి తమ స్నేహితులకు చేరవేసేవారు. చాలామంది జ్యోతిష్యులు అసత్యపరులై ఉంటారు. ఒక వేళ వారు ఒక మాట నిజం పలికినా దానితో పాటు వంద మాటలు అబద్దాలు పలుకుతారు.
Các Tafsir tiếng Ả-rập:
وَالشُّعَرَآءُ یَتَّبِعُهُمُ الْغَاوٗنَ ۟ؕ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కవుల్లోంచి అని మీరు వాదిస్తున్నారో వారిని సన్మార్గము నుండి,ఋజు మార్గము నుండి తప్పిపోయిన వారే అనుసరిస్తారు. వారు ఏ కవిత్వాలను పలుకుతారో వాటినే వారు చదువుతారు.
Các Tafsir tiếng Ả-rập:
اَلَمْ تَرَ اَنَّهُمْ فِیْ كُلِّ وَادٍ یَّهِیْمُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు చూడలేదా - వారి అపమార్గపు దృశ్యాల్లోంచి వారు ప్రతీ లోయలో ఒకోసారి పొగుడుతూ తచ్చాడితే ఒకోసారి దూషిస్తూ తచ్చాడితే,ఒకో సారి వేరే వాటిలో తచ్చాడతున్నారు.
Các Tafsir tiếng Ả-rập:
وَاَنَّهُمْ یَقُوْلُوْنَ مَا لَا یَفْعَلُوْنَ ۟ۙ
మరియు వారు అబద్దం పలుకుతున్నారని, మేము ఇలా చేశాము అని అంటారు. కాని వార అలా చేయలేదు.
Các Tafsir tiếng Ả-rập:
اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَذَكَرُوا اللّٰهَ كَثِیْرًا وَّانْتَصَرُوْا مِنْ بَعْدِ مَا ظُلِمُوْا ؕ— وَسَیَعْلَمُ الَّذِیْنَ ظَلَمُوْۤا اَیَّ مُنْقَلَبٍ یَّنْقَلِبُوْنَ ۟۠
కవుల్లోంచి ఎవరైతే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో, అధికంగా అల్లాహ్ స్మరణ చేశారో, అల్లాహ్ శతృవులు వారిపై అన్యాయమునకు పాల్పడిన తరువాత వారిపై గెలుస్తారో వారు కాదు. ఉదాహరణకు హస్సాన్ బిన్ సాబిత్ రజిఅల్లాహు అన్హు. మరియు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,ఆయన దాసులపై హింసకు పాల్పడిన వారు ఎవరి వైపు మరల వలసినదో తొందలోనే మరలి వెళుతారు. వారు గొప్ప స్థానము,ఖచ్చితమైన గణన వైపునకు మరలుతారు.
Các Tafsir tiếng Ả-rập:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• إثبات العدل لله، ونفي الظلم عنه.
న్యాయమును అల్లాహ్ కొరకు నిరూపించటం,హింసను ఆయన నుండి జరగటంను తిరస్కరించటం.

• تنزيه القرآن عن قرب الشياطين منه.
షైతానులు ఖుర్ఆన్ దరిదాపులకు రావటం నుండి అది పరిశుద్ధమైనది.

• أهمية اللين والرفق للدعاة إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారికి మృధుత్వము,మెత్తదనము ఉండటం యొక్క ప్రాముఖ్యత.

• الشعر حَسَنُهُ حَسَن، وقبيحه قبيح.
కవిత్వము దాని మంచితనము మంచిది మరియు దాని చెడు చెడ్డది.

 
Ý nghĩa nội dung Chương: Chương Al-Shu-'ara'
Mục lục các chương Kinh Số trang
 
Bản dịch ý nghĩa nội dung Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Mục lục các bản dịch

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Đóng lại