Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: Al-An'ām   Ayah:
وَاِذْ قَالَ اِبْرٰهِیْمُ لِاَبِیْهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصْنَامًا اٰلِهَةً ۚ— اِنِّیْۤ اَرٰىكَ وَقَوْمَكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఓ ప్రవక్తా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ముష్రిక్ తండ్రి అయిన ఆజర్ తో మాట్లాడిన వేళను గుర్తు చేసుకోండి : "ఓ నా ప్రియ తండ్రి మీరు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తూ వాటిని ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారా?.నిశ్చయంగా నేను మిమ్మల్ని,విగ్రహాలను ఆరాధిస్తున్న మీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత (అపమార్గం) లోను,మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధించటం వలన సత్య మార్గము నుండి తికమక అయ్యి తప్పిపోయారని భావిస్తున్నాను.పరిశుద్ధుడు అయిన ఆయనే సత్య ఆరాధ్య దైవము,ఆయన కాకుండ ఇతరులు అసత్య దైవాలు".
Tafsir berbahasa Arab:
وَكَذٰلِكَ نُرِیْۤ اِبْرٰهِیْمَ مَلَكُوْتَ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلِیَكُوْنَ مِنَ الْمُوْقِنِیْنَ ۟
మరియు మేము ఆయనకు ఆయన తండ్రి,ఆయన జాతి వారి మార్గ భ్రష్టతను చూపించామో అలాగే మేము ఆయనకు విశాలమైన భూమ్యాకాశాల అధికారమును చూపిస్తాము.ఆ విశాల అధికారము ద్వారా అల్లాహ్ ఏకత్వము,ఆరాధనకు ఆయన ఒక్కడే అర్హుడు అనడానికి ఆధారము చేసుకొనుట కొరకు, అల్లాహ్ ఒక్కడే ఆయనకు ఎవరు సాటి లేరు,ఆయన ప్రతీ దానిపై అధికారము కలవాడు అన్న నమ్మకమును కలిగిన వారిలోంచి ఆయన కావటం కొరకు (భూమ్యాకాశముల అధికారమును చూపిస్తాము).
Tafsir berbahasa Arab:
فَلَمَّا جَنَّ عَلَیْهِ الَّیْلُ رَاٰ كَوْكَبًا ۚ— قَالَ هٰذَا رَبِّیْ ۚ— فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الْاٰفِلِیْنَ ۟
రాత్రి చీకటి అయినప్పుడు ఆయన ఒక నక్షత్రాన్ని చూసి ఇది నా ప్రభువు అన్నారు.ఎప్పుడైతే నక్షత్రము అదృశ్యం అయినదో అదృశ్యం అయ్యే వాటిని నేను ఇష్టపడను. ఎందుకంటే వాస్తవ ఆరాధ్య దైవం ప్రత్యక్షం అయి ఉంటాడు అదృశ్యం అవ్వడు అని ఆయన అన్నారు.
Tafsir berbahasa Arab:
فَلَمَّا رَاَ الْقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّیْ ۚ— فَلَمَّاۤ اَفَلَ قَالَ لَىِٕنْ لَّمْ یَهْدِنِیْ رَبِّیْ لَاَكُوْنَنَّ مِنَ الْقَوْمِ الضَّآلِّیْنَ ۟
మరియు ఆయన చంద్రుడిని ఉదయించినప్పుడు చూసి ఇది నా ప్రభువు అన్నారు.ఎప్పుడైతే అది అదృశ్యం అయినదో ఇలా అన్నారు: ఒక వేళ అల్లాహ్ ఆయన ఏకత్వము,ఆయన ఒక్కడి ఆరాధన చేయటం కొరకు నాకు అనుగ్రహాన్ని ప్రసాదించకుండా ఉంటే నేను ఆయన సత్యధర్మము నుండి దూరమైన వారిలోంచి అయిపోతాను.
Tafsir berbahasa Arab:
فَلَمَّا رَاَ الشَّمْسَ بَازِغَةً قَالَ هٰذَا رَبِّیْ هٰذَاۤ اَكْبَرُ ۚ— فَلَمَّاۤ اَفَلَتْ قَالَ یٰقَوْمِ اِنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَ ۟
మరియు ఆయన సూర్యుడిని ఉదయించినప్పుడు చూసి ఇతడు నా ప్రభువు అన్నారు.ఈ ఉదయించేవాడు నక్షత్రము,చంద్రుడి కన్న చాలా పెద్దగా ఉన్నాడు.అది అదృశ్యమైనది చూసి ఇలా అన్నారు : ఓ నా జాతివారా మీరు అల్లాహ్ తోపాటు ఎవరినైతే సాటి కల్పిస్తున్నారో వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు.
Tafsir berbahasa Arab:
اِنِّیْ وَجَّهْتُ وَجْهِیَ لِلَّذِیْ فَطَرَ السَّمٰوٰتِ وَالْاَرْضَ حَنِیْفًا وَّمَاۤ اَنَا مِنَ الْمُشْرِكِیْنَ ۟ۚ
నిశ్చయంగా నేను నా ధర్మమును పూర్వ ఎటువంటి నమూనా లేకుండా భూమ్యాకాశాలను పుట్టించిన ఆయన కొరకు షిర్క్ నుండి స్వచ్చమైన తౌహీదు (ఏక దైవోపాసన) వైపునకు మరలుతూ ప్రత్యేకించుకున్నాను.
Tafsir berbahasa Arab:
وَحَآجَّهٗ قَوْمُهٗ ؕ— قَالَ اَتُحَآجُّوْٓنِّیْ فِی اللّٰهِ وَقَدْ هَدٰىنِ ؕ— وَلَاۤ اَخَافُ مَا تُشْرِكُوْنَ بِهٖۤ اِلَّاۤ اَنْ یَّشَآءَ رَبِّیْ شَیْـًٔا ؕ— وَسِعَ رَبِّیْ كُلَّ شَیْءٍ عِلْمًا ؕ— اَفَلَا تَتَذَكَّرُوْنَ ۟
ముష్రికులైన ఆయన జాతివారు అల్లాహ్ సుబహానహు తఆలా తౌహీదు (ఏక దైవోపాసన) విషయంలో ఆయనతో వాదించారు.వారు తమ విగ్రహాల ద్వారా ఆయనను భయపెట్టారు.అప్పుడు ఆయన వారితో ఇలా పలికారు : ఏ మీరు అల్లాహ్ యొక్క తౌహీద్ విషయంలో,ఆరాధనలో ఆయన ఒక్కడే అన్న విషయంలో నాతో వాదిస్తున్నారా.వాస్తవానికి నా ప్రభువు నాకు దానిని అనుగ్రహించాడు.నేను మీ విగ్రహాలతో భయపడను.ఎందుకంటే వారికి నన్ను నష్టం,లాభం కలిగించే శక్తి లేదు.కాని అల్లాహ్ తలుచుకుంటే జరిగిద్ది.అల్లాహ్ ఏది తలచుకుంటే అది అయిపోతుంది.ప్రతి వస్తువు అల్లాహ్ జ్ఞానంలో ఉన్నది.భూమ్యాకాశాల్లో ఉన్న ఏ వస్తువు ఆయన నుండి గోప్యంగా ఉండదు.అయితే ఓ నా జాతివారా అల్లాహ్ పై అవిశ్వాసం,ఆయనతోపాటు సాటి కల్పిస్తున్న మీరు ఏకైక అల్లాహ్ ను విశ్వసించి హితబోధనను గ్రహించరా?.
Tafsir berbahasa Arab:
وَكَیْفَ اَخَافُ مَاۤ اَشْرَكْتُمْ وَلَا تَخَافُوْنَ اَنَّكُمْ اَشْرَكْتُمْ بِاللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ عَلَیْكُمْ سُلْطٰنًا ؕ— فَاَیُّ الْفَرِیْقَیْنِ اَحَقُّ بِالْاَمْنِ ۚ— اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟ۘ
మరియు అల్లాహ్ ను వదిలి విగ్రహాల్లోంచి మీరు ఆరాధిస్తున్న వాటికి నేను ఎలా భయపడుతాను.మరియు అల్లాహ్ మీ కొరకు ఎటువంటి ఆధారమును సృష్టించలేదు అటువంటి వారిని మీరు ఆయనతోపాటు సాటి కల్పిస్తున్నప్పుడు మీ షిర్కు చేయటం నుండి మీకు ఎందుకని భయం కలగటం లేదు?.తౌహీదును విశ్వసించే వర్గము,బహుదైవారదకుల వర్గము ఈ రెండు వర్గముల్లోంచి శాంతి,భధ్రతలకు ఎక్కువ హక్కుదారులు ఎవరు?.వారిలోంచి ఎవరు ఉత్తములని మీరు తెలుసుకుంటారో వారిని అనుసరించండి.వారిద్దరిలోంచి విశ్వాసపరులు,ఏకదైవోపాసన చేసే వర్గము ఉత్తములు అవటంలో ఎటువంటి సందేహం లేదు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الاستدلال على الربوبية بالنظر في المخلوقات منهج قرآني.
సృష్టితాల్లో దృష్టిని సారించి తౌహీదె రుబూబియ్యత్ గురించి ఆధారం చూపటం ఇది ఖుర్ఆన్ పద్దతి.

• الدلائل العقلية الصريحة توصل إلى ربوبية الله.
స్పష్టమైన బౌద్ధిక ఆధారాలు తౌహీదె రుబూబియ్యత్ నకు చేరవేస్తున్నాయి.

 
Terjemahan makna Surah: Al-An'ām
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup