Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Surah: Al-An'ām   Ayah:
وَمَا عَلَی الَّذِیْنَ یَتَّقُوْنَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّلٰكِنْ ذِكْرٰی لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,అల్లాహ్ వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారిపై ఈ దుర్మార్గులందరి లెక్కల బాధ్యత ఏదీ లేదు.వారు చేస్తున్న చెడుల నుండి వారించటం మాత్రమే వారిపై బాధ్యత.బహుశా వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతారేమో.
Tafsir berbahasa Arab:
وَذَرِ الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَهُمْ لَعِبًا وَّلَهْوًا وَّغَرَّتْهُمُ الْحَیٰوةُ الدُّنْیَا وَذَكِّرْ بِهٖۤ اَنْ تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ ۖۗ— لَیْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ وَلِیٌّ وَّلَا شَفِیْعٌ ۚ— وَاِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا یُؤْخَذْ مِنْهَا ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ اُبْسِلُوْا بِمَا كَسَبُوْا ۚ— لَهُمْ شَرَابٌ مِّنْ حَمِیْمٍ وَّعَذَابٌ اَلِیْمٌ بِمَا كَانُوْا یَكْفُرُوْنَ ۟۠
ఓ ప్రవక్తా తమ ధర్మమును ఆటగా,వినోదంగా చేసుకుని దానిని పరిహాసంగా,హేళనగా చేసుకున్న ఈ ముష్రికులందరిని వదిలివేయండి. వారిని ప్రాపంచిక జీవితం తనలో ఉన్న అశాస్వత సామగ్రి ద్వారా మోసపుచ్చింది. ఓప్రవక్తా ప్రజల్లోని ప్రతి వ్యక్తిని తన పాపాల ద్వారా వినాశనము బారిన పడనంత వరకు ఖుర్ఆన్ ద్వారా హితోపదేశం చేస్తూ ఉండండి. అతని కొరకు అల్లాహ్ తప్ప సహాయం అర్ధించటం కొరకు వేరే ఎవరు సంరక్షకుడు లేడు. ప్రళయదినాన అల్లాహ్ శిక్షను అతని నుండి ఆపేవాడు మధ్యవర్తి ఎవడూ ఉండడు. అతడు అల్లాహ్ శిక్షకు బదులుగా ఏదైన పరిహారము ఇచ్చినప్పుడు అతని నుండి స్వీకరించబడదు. వారందరు తాము చేసుకున్న పాపాలవలన వినాశనమునకు గురి అయ్యారు. వారి కొరకు అవిశ్వాసం వలన ప్రళయదినమున త్రాగటానికి అత్యంత వేడిదైన నీరు,బాధాకరమైన శిక్ష ఉంటాయి.
Tafsir berbahasa Arab:
قُلْ اَنَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُنَا وَلَا یَضُرُّنَا وَنُرَدُّ عَلٰۤی اَعْقَابِنَا بَعْدَ اِذْ هَدٰىنَا اللّٰهُ كَالَّذِی اسْتَهْوَتْهُ الشَّیٰطِیْنُ فِی الْاَرْضِ حَیْرَانَ ۪— لَهٗۤ اَصْحٰبٌ یَّدْعُوْنَهٗۤ اِلَی الْهُدَی ائْتِنَا ؕ— قُلْ اِنَّ هُدَی اللّٰهِ هُوَ الْهُدٰی ؕ— وَاُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా అనండి : ఏ మేము అల్లాహ్ ను వదిలి మమ్మల్ని ఎటువంటి లాభం చేకూర్చలేని,మనకు ఎటువంటి నష్టం కలిగించలేని విగ్రహాలను ఆరాధించాలా?,అల్లాహ్ మనకు విశ్వాసము యొక్క సౌభాగ్యం కలిగించిన తరువాత దాని నుండి మేము వెను తిరిగిపోవాల ?.అలాంటప్పుడు మేము షైతానులు మార్గభ్రష్టులు చేసిన వారి మాదిరిగా అయిపోతాము.వారు అతడిని సన్మార్గం పొందక దిక్కులు చూస్తూ ఉండిపోయేలా వదిలి వేస్తారు.అతని కొరకు సహవాసులు సన్మార్గంపై ఉండి అతనిని సత్యం వైపునకు పిలుస్తూ ఉంటారు.అతడు వారు దేనివైపునైతే పిలుస్తున్నారో దానిని స్వీకరించటం నుండి ఆగిపోతాడు.ఓ ప్రవక్తా వారితో అనండి నిశ్చయంగా అల్లాహ్ మార్గమే సత్య మర్గము.మరియు అల్లాహ్ మమ్మల్ని ఆయన ఏకత్వమును తెలుపుతూ,ఆయన ఒక్కడి ఆరాధన చేస్తూ విధేయత చూపమని ఆదేశించాడు.సర్వలోకాల ప్రభువు ఆయనే.
Tafsir berbahasa Arab:
وَاَنْ اَقِیْمُوا الصَّلٰوةَ وَاتَّقُوْهُ ؕ— وَهُوَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
మరియు ఆయన మమ్మల్ని నమాజును సంపూర్ణంగా నెలకొల్పమని ఆదేశించాడు,మరియు ఆయన మమ్మల్ని అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉండటం గురించి ఆదేశించాడు.ఆయన ఒక్కడి వైపే ప్రళయదినాన దాసులు తమ ఆచరణల ప్రతిఫలం పొందటం కొరకు సమీకరించబడుతారు.
Tafsir berbahasa Arab:
وَهُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ؕ— وَیَوْمَ یَقُوْلُ كُنْ فَیَكُوْنُ ؕ۬— قَوْلُهُ الْحَقُّ ؕ— وَلَهُ الْمُلْكُ یَوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ ؕ— عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ ۟
మరియు ఆయన సుబ్,హానహు తఆలా భూమ్యాకాశాలను సత్యబద్దంగా సృష్టించాడు.ఆ రోజు అల్లాహ్ ప్రతి వస్తువుతో ఇలా అంటాడు : నీవు అయిపో అయితే అది అయిపోతుంది.ప్రళయదినాన ఆయన మీరు నిలబడండి అని అంటాడు అయితే వారందరు నిలబడుతారు.సత్య బద్దమైన ఆయన మాట తప్పకుండా ఏర్పడుతుంది.ప్రళయదినాన ఇస్రాఫీల్ అలైహిస్సలాం రెండోవసారి బాకా (సూర్) ఊదేటప్పుడు అధికారము ఆయన సుబ్,హానహు ,వతఆలా ఒక్కడి కొరకే ఉంటుంది.అగోచర విషయాల గురించి జ్ఞానం కలవాడు,గోచర విషయాల గురించి జ్ఞానం కలవాడు.తన సృష్టించటంలో,తన నిర్వహణలో ఆయనే వివేకవంతుడు.సర్వము తెలిసినవాడు ఆయనపై ఏ విషయం గోప్యంగా ఉండదు,అంతర్గత విషయాలు ఆయన వద్ద బహిర్గత విషయాల్లాంటివి.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• الداعية إلى الله تعالى ليس مسؤولًا عن محاسبة أحد، بل هو مسؤول عن التبليغ والتذكير.
అల్లాహ్ వైపున పిలిచేవారు ఎవరి లెక్కల గురించి ప్రశ్నించబడరు కాని వారు సందేశములను చేరవేయటం గురించి,హితోపదేశం చేయటం గురించి ప్రశ్నించబడుతారు.

• الوعظ من أعظم وسائل إيقاظ الغافلين والمستكبرين.
హితోపదేశం అహంకారులను,పరధ్యానంలో ఉన్న వారిని మేల్కొలిపే గొప్ప కారకాల్లోంచి.

• من دلائل التوحيد: أن من لا يملك نفعًا ولا ضرًّا ولا تصرفًا، هو بالضرورة لا يستحق أن يكون إلهًا معبودًا.
లాభం చేకూర్చలేని వాడు,నష్టం చేయలేని వాడు,కార్య నిర్వహణ చేయలేని వాడు ఖచ్చితంగా అతడు ఆరాధ్య దైవం అవటానికి అర్హుడు కాడు అనటం తౌహీద్ ఆధారములలోనిది.

 
Terjemahan makna Surah: Al-An'ām
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup