クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - 対訳の目次


対訳 章: アル・ヒジュル章   節:

సూరహ్ అల్-హిజ్ర్

本章の趣旨:
توعد المستهزئين بالقرآن، والوعد بحفظه تأييدًا للنبي وتثبيتًا له.
ఖుర్ఆన్ ను అపహాస్యం చేసేవారిని హెచ్చరించటం మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు మద్దతుగా మరియు ఆయనకు స్థిరపరచటం కొరకు ఖుర్ఆన్ పరిరక్షణ వాగ్దానం చేయటం.

الٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ وَقُرْاٰنٍ مُّبِیْنٍ ۟
{అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. ఉన్నతమైన స్థానము కల ఈ ఆయతులు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడ్డాయి అనటము పై నిరూపిస్తున్నాయి. ఇవి ఏకేశ్వరోపాసన,ధర్మ శాసనాలను స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు.
アラビア語 クルアーン注釈:
رُبَمَا یَوَدُّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ كَانُوْا مُسْلِمِیْنَ ۟
అవిశ్వాసపరులు వారికి విషయం స్పష్టమైనప్పుడే,ఇహలోకములో వారు పాల్పడిన అవిశ్వాసము అసత్యమని తేటతెల్లమైనప్పుడే వారు ముస్లిములైపోతే బాగుండేదని ప్రళయదినాన ఆశిస్తారు.
アラビア語 クルアーン注釈:
ذَرْهُمْ یَاْكُلُوْا وَیَتَمَتَّعُوْا وَیُلْهِهِمُ الْاَمَلُ فَسَوْفَ یَعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులందరిని పశువుల్లాగా తింటూఉండగా మరియు అంతమైపోయే ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తుండగా వదిలివేయండి. మరియు సుదీర్ఝ ఆశలు వారిని విశ్వాసము నుండి సత్కర్మల నుండి దూరం చేస్తాయి. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో వచ్చినప్పుడు వారు ఉన్నది నష్టం లోనే అని తెలుసుకుంటారు.
アラビア語 クルアーン注釈:
وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُوْمٌ ۟
మరియు మేము దుర్మార్గులైన బస్తీల్లోంచి ఏదైన బస్తీ పై వినాశనమును దించితే దాని కొరకు నిర్ణీత గడువు అల్లాహ్ జ్ఞానంలో ఉంటుంది. అది దాని నుండి ముందూ జరగదు వెనుకకు నెట్టబడదు.
アラビア語 クルアーン注釈:
مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا یَسْتَاْخِرُوْنَ ۟
జాతుల వారిలోంచి ఏ జాతిపై దాని వినాశనము దాని గడువు సమయం రాక ముందు రాదు. మరియు దాని సమయం వచ్చినప్పుడు దాని నుండి వినాశనము వెనుకకు నెట్టడం జరగదు. అయితే దుర్మార్గులు అల్లాహ్ వారికి ఇచ్చిన గడువుతో మోసపోకూడదు.
アラビア語 クルアーン注釈:
وَقَالُوْا یٰۤاَیُّهَا الَّذِیْ نُزِّلَ عَلَیْهِ الذِّكْرُ اِنَّكَ لَمَجْنُوْنٌ ۟ؕ
మక్కా వాసుల్లోంచి అవిశ్వాసపరులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికారు : ఓ తనపై ఖుర్ఆన్ అవతరింపబడినది అని వాదించేవాడా నిశ్చయంగా నీవు నీ ఈ వాదనలో పిచ్చాళ్ళ మరలే లాగా మరలుతున్న పిచ్చివాడువు.
アラビア語 クルアーン注釈:
لَوْ مَا تَاْتِیْنَا بِالْمَلٰٓىِٕكَةِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
నీవు సత్యవంతుల్లోంచి అయితే నీవు పంపించబడ్డ సందేశహరుడని మరియు మాపై శిక్ష అవతరిస్తుందని నీ కొరకు సాక్ష్యం పలికే దైవదూతలను మా వద్దకు ఎందుకని తీసుకునిరావు.
アラビア語 クルアーン注釈:
مَا نُنَزِّلُ الْمَلٰٓىِٕكَةَ اِلَّا بِالْحَقِّ وَمَا كَانُوْۤا اِذًا مُّنْظَرِیْنَ ۟
అల్లాహ్ ఎవరైతే దైవదూతలు రావాలని ఆయనకు సూచించారో వారిని ఖండిస్తూ ఇలా పలికాడు : శిక్ష ద్వారా మిమ్మల్ని వినాశనమునకు గురి చేసే సమయం ఆసన్నమయినప్పుడు జ్ఞానం ద్వారా అవసరమయ్యే దాని ప్రకారం తప్ప మేము దైవదూతలను దించము. మేము దైవదూతలను తీసుకుని వచ్చినప్పుడు వారు విశ్వసించకుండా ఉంటే వారు గడువు ఇవ్వబడిన వారిలోంచి అవ్వరు. అంతే కాక వారు శీఘ్రంగా శిక్షకు గురి అవుతారు.
アラビア語 クルアーン注釈:
اِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ ۟
నిశ్చయంగా మేమే ఈ ఖుర్ఆన్ ను ప్రజల కొరకు హితబోధనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై అవతరింపజేశాము. మరియు మేమే ఖుర్ఆన్ ను హెచ్చు,తగ్గులు మరియు మార్పు,చేర్పుల నుండి పరిరక్షించే వాళ్ళము.
アラビア語 クルアーン注釈:
وَلَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ شِیَعِ الْاَوَّلِیْنَ ۟
మరియు ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మీకన్న ముందు పూర్వ అవిశ్వాసపరులైన వర్గాల్లో ప్రవక్తలను పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు. అయితే మీ జాతి వారు మీకు తిరస్కరించటంలో ప్రవక్తల్లోంచి మీరు కొత్త కాదు.
アラビア語 クルアーン注釈:
وَمَا یَاْتِیْهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
పూర్వ అవిశ్వాసపరుల వర్గాల వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని తిరస్కరించారు. మరియు వారు అతన్ని పరిహసించారు.
アラビア語 クルアーン注釈:
كَذٰلِكَ نَسْلُكُهٗ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَ ۟ۙ
ఈ జాతుల వారి హృదయముల్లో మేము తిరస్కారమును ప్రవేశపెట్టినట్లే దాన్ని అలాగే మేము మక్కా బహుదైవారాధకుల హృదయాల్లో వారి విముఖత ద్వారా మరియు వారి మొండితనము ద్వారా ప్రవేశపెడతాము.
アラビア語 クルアーン注釈:
لَا یُؤْمِنُوْنَ بِهٖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْاَوَّلِیْنَ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను వారు విశ్వసించటం లేదు. తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించిన వారిని వినాశనంచేసే విషయంలో అల్లాహ్ సంప్రదాయం జరిగింది. అయితే మిమ్మల్ని తిరస్కరించేవారు గుణపాఠం నేర్చుకోవాలి.
アラビア語 クルアーン注釈:
وَلَوْ فَتَحْنَا عَلَیْهِمْ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوْا فِیْهِ یَعْرُجُوْنَ ۟ۙ
ఈ తిరస్కారులందరు మొండి పట్టుదల కలిగి ఉంటారు చివరికి ఒక వేళ స్పష్టమైన ఆధారాలతో సత్యము వారి ముందు స్పష్టమైనా అప్పుడు ఒక వేళ మేము వారి కొరకు ఆకాశములో ఒక ద్వారాన్ని తెరిస్తే వారు ఎక్కుతూ పోతూ కూడా
アラビア語 クルアーン注釈:
لَقَالُوْۤا اِنَّمَا سُكِّرَتْ اَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُوْرُوْنَ ۟۠
వారు నమ్మలేదు.మరియు వారు ఇలా పలికారు : కేవలం మా కళ్ళు చూపు నుండి బంధించబడ్డాయి.అంతే కాదు మేము చూసినది మంత్రజాల ప్రభావము. అప్పుడు మేము మంత్రజాలము చేయబడ్డాము.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• القرآن الكريم جامع بين صفة الكمال في كل شيء، والوضوح والبيان.
పవిత్ర ఖుర్ఆన్ ప్రతీ వస్తువులో పరిపూర్ణతను,స్పష్టతను,ప్రకటనను మిళితము చేస్తుంది.

• يهتم الكفار عادة بالماديات، فتراهم مُنْغَمِسين في الشهوات والأهواء، مغترين بالأماني الزائفة، منشغلين بالدنيا عن الآخرة.
అవిశ్వాసపరులు సాధారణంగా సిద్ధాంతాలను అనుసరిస్తారు. అయితే మీరు వారిని కోరికల్లో,మనోవాంచనల్లో మునిగి ఉండగా,అవాస్తవ ఆకాంక్షలతో మోసపోతుండగా,పరలోకమునకు బదులుగా ఇహలోక విషయాల్లో నిమగ్నమై ఉండగా చూస్తారు.

• هلاك الأمم مُقَدَّر بتاريخ معين، ومقرر في أجل محدد، لا تأخير فيه ولا تقديم، وإن الله لا يَعْجَلُ لعجلة أحد.
జాతుల వినాశనం ఒక నిర్ణీత తేదీలో అంచనా వేయబడింది.మరియు అది ఒక నిర్దిష్ట సమయంలో నిర్ణయించబడుతుంది. అందులో ఎటువంటి ఆలస్యము చేయటము గాని తొందర చేయటము గాని ఉండదు.మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరు తొందరపెట్టినా తొందరపడడు.

• تكفل الله تعالى بحفظ القرآن الكريم من التغيير والتبديل، والزيادة والنقص، إلى يوم القيامة.
మహోన్నతుడైన అల్లాహ్ ఎటువంటి మార్పు,చేర్పులు జరగకుండా మరియు హెచ్చు,తగ్గులు జరగకుండా ప్రళయదినం వరకు పవిత్ర ఖుర్ఆన్ యొక్క పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు.

وَلَقَدْ جَعَلْنَا فِی السَّمَآءِ بُرُوْجًا وَّزَیَّنّٰهَا لِلنّٰظِرِیْنَ ۟ۙ
మరియు నిశ్చయంగా మేము ప్రజలు భూమిలో,సముద్రములో తమ ప్రయాణముల్లో దారిని పొందే పెద్ద పెద్ద నక్షత్రాలను ఆకాశములో సృష్టించాము. మరియు దాన్ని చూసేవారి కొరకు,దాన్ని దర్శించేవారి కొరకు వారు దాని ద్వారా పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యము పై ఆధారమును పొందటం కొరకు దానిని అందముగా చేశాము.
アラビア語 クルアーン注釈:
وَحَفِظْنٰهَا مِنْ كُلِّ شَیْطٰنٍ رَّجِیْمٍ ۟ۙ
మరియు మేము ఆకాశమును అల్లాహ్ కారుణ్యము నుంచి బహిష్కరించబడిన ప్రతీ షైతాను నుండి రక్షించాము.
アラビア語 クルアーン注釈:
اِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَاَتْبَعَهٗ شِهَابٌ مُّبِیْنٌ ۟
కానీ ఎవరైతే మలయిల్ ఆలా దైవ దూతలను దొంగ చాటుగా వింటాడో అతడిని కాంతివంతమైన అగ్ని జ్వాల వెంటాడుతుంది. మరియు అతన్ని దహించివేస్తుంది.
アラビア語 クルアーン注釈:
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَلْقَیْنَا فِیْهَا رَوَاسِیَ وَاَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ شَیْءٍ مَّوْزُوْنٍ ۟
మరియు మేము భూమిని ప్రజలు దానిపై నివాసం ఏర్పరచుకోవటం కొరకు విస్తరింపజేశాము.మరియు అది ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా ఉండటానికి అందులో మేము స్థిరమైన పర్వతాలను నాటాము.మరియు అందులో విజ్ఞతను నిర్ణయిచటం ద్వారా నిర్ధారించబడిన,నిర్ణయించబడిన రకరకాల మొక్కలను మొలకెత్తించాము.
アラビア語 クルアーン注釈:
وَجَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ وَمَنْ لَّسْتُمْ لَهٗ بِرٰزِقِیْنَ ۟
ఓ ప్రజలారా మేము మీ కొరకు ఇహలోకములో మీరు జీవించి ఉన్నంత వరకు మీకు జీవనాన్ని కలిగించే తినే వస్తువులను,త్రాగే వస్తువులను భూమిలో తయారు చేశాము. మీరే కాకుండా ప్రజల్లోంచి,జంతువుల్లోంచి వారికి జీవనాన్ని కలిగించే ఆహారోపాధిని మీరు ఏర్పాటు చేయలేని వారి కొరకు మేము తయారు చేశాము.
アラビア語 クルアーン注釈:
وَاِنْ مِّنْ شَیْءٍ اِلَّا عِنْدَنَا خَزَآىِٕنُهٗ ؗ— وَمَا نُنَزِّلُهٗۤ اِلَّا بِقَدَرٍ مَّعْلُوْمٍ ۟
మరియు ప్రజలు,పశువులు ప్రయోజనం చెందే వస్తువులను సృష్టించటంలో,వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనం చేయటంలో మేమే సామర్ధ్యం కలవారము.మరియు వాటిలో నుంచి మేము సృష్టించే వాటిని మా విజ్ఞత మరియు మా ఇచ్ఛ నిర్ణయించే నిర్ణీత పరిణామం ద్వారా మాత్రమే మేము సృష్టిస్తాము.
アラビア語 クルアーン注釈:
وَاَرْسَلْنَا الرِّیٰحَ لَوَاقِحَ فَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسْقَیْنٰكُمُوْهُ ۚ— وَمَاۤ اَنْتُمْ لَهٗ بِخٰزِنِیْنَ ۟
మరియు మేము మేఘములను సంపర్కముచేసే గాలులను పంపాము. అప్పుడు వాటి ద్వారా సంపర్కము చెందిన మేఘముల ద్వారా మేము వర్షమును కురిపించాము. మేము మీకు వర్షపు నీటిని త్రాపించాము. ఓ ప్రజలారా మీరు ఈ నీటిని సెలయేర్లు,బావులు అవటానికి భూమిలో నిల్వచేయలేరు. అల్లాహ్ మాత్రమే దానిని అందులో నిల్వచేస్తాడు.
アラビア語 クルアーン注釈:
وَاِنَّا لَنَحْنُ نُحْیٖ وَنُمِیْتُ وَنَحْنُ الْوٰرِثُوْنَ ۟
మరియు నిశ్చయంగా మేము మృతులను ఉనికిలో లేని స్థితి నుండి వారిని సృష్టించటం ద్వారా,వారిని మరణం తరువాత లేపటం ద్వారా జీవింప చేశాము. మరియు జీవించి ఉన్నవారిని వారి గడువు పూర్తయిన తరువాత మేము మరణింపజేస్తాము.మరియు మేమే భూమికి,దానిపై ఉన్న వాటికి వారసులుగా మిగులుతాము.
アラビア語 クルアーン注釈:
وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِیْنَ مِنْكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَاْخِرِیْنَ ۟
వాస్తవానికి మీలో నుండి పుట్టుకలో,మరణంలో ముందు గతించిన వారి గురించి మాకు తెలుసు.ఆ రెండింటిలో తరువాత వచ్చే వారి గురించి మాకు తెలుసు.అందులో నుంచి ఏదీ మాపై గోప్యంగా లేదు.
アラビア語 クルアーン注釈:
وَاِنَّ رَبَّكَ هُوَ یَحْشُرُهُمْ ؕ— اِنَّهٗ حَكِیْمٌ عَلِیْمٌ ۟۠
ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు సత్కర్మలు చేసిన వాడికి అతని సత్కర్మకు దుష్కర్మకు పాల్పడే వాడికి అతని దుష్కర్మకు ప్రతిఫలమును ప్రసాదించటానికి వారందరిని ప్రళయదినాన సమావేశపరుస్తాడు. నిశ్చయంగా ఆయన తన పర్యాలోచనలో వివేచనాపరుడు. ఆయనపై ఏదీ గోప్యంగా లేని సర్వజ్ఞుడు.
アラビア語 クルアーン注釈:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟ۚ
మరియు నిశ్చయంగా మేము ఆదమ్ ను పొడి బంకమట్టితో సృష్టించాము. ఒక వేళ దాన్ని తట్టితే శభ్ధం చేస్తుంది.మరియు అతను సృష్టించబడిన ఈ మట్టి నల్లనిది, అది ఎక్కువ కాలం ఉండిపోవటం వలన వాసన మారిపోయింది.
アラビア語 クルアーン注釈:
وَالْجَآنَّ خَلَقْنٰهُ مِنْ قَبْلُ مِنْ نَّارِ السَّمُوْمِ ۟
మరియు మేము జిన్నుల తండ్రిని ఆదం అలైహిస్సలాంను సృష్టించక మునుపు తీవ్ర వేడి గల అగ్నితో సృష్టించాము.
アラビア語 クルアーン注釈:
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟
ఓ ప్రవక్తా నీ ప్రభువు దైవ దూతలతో మరియు వారితోపాటు ఉన్న ఇబ్లీసుతో ఇలా పలకినప్పటి వైనమును నీవు గుర్తు చేసుకో : నిశ్చయంగా నేను తట్టినప్పుడు మ్రోగే,వాసనను మార్చే నల్లటి పొడి బంక మట్టితో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
アラビア語 クルアーン注釈:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
నేను అతని రూపమును చక్కదిద్ది అతన్ని సృష్టించటంను పూర్తి చేసినప్పుడు మీరు నా ఆదేశమును పాటిస్తూ,అతనికి నమస్కరిస్తూ అతనికి సాష్టాంగపడండి.
アラビア語 クルアーン注釈:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దైవదూతలందరు తమ ప్రభువు తమకు ఆదేశించినట్లే ఆయనకి సాష్టాంగపడి విధేయత చూపారు.
アラビア語 クルアーン注釈:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰۤی اَنْ یَّكُوْنَ مَعَ السّٰجِدِیْنَ ۟
కాని దైవదూతలతోపాటు ఉండి కూడా వారిలో నుంచి కాని ఇబ్లీసు దైవదూతలతోపాటు ఆదంకి సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• ينبغي للعبد التأمل والنظر في السماء وزينتها والاستدلال بها على باريها.
దాసుడు ఆకాశములో,దాని అలంకరణలో చూడటం,యోచన చేయటం మరియు వాటి ద్వారా దాన్ని సృష్టించిన వాడి గురించి ఆధారం చూపటం అవసరం.

• جميع الأرزاق وأصناف الأقدار لا يملكها أحد إلا الله، فخزائنها بيده يعطي من يشاء، ويمنع من يشاء، بحسب حكمته ورحمته.
అన్ని జీవనోపాధులు, అన్ని రకాల విధివ్రాతలు అల్లాహ్ తప్ప ఇంకెవరికి వాటి అధికారము లేదు.వాటి నిధులు ఆయన చేతిలో ఉన్నవి.తన విజ్ఞతకు,తన కారుణ్యమునకు తగ్గట్టుగా తాను తలచుకున్నవారికి ఇస్తాడు మరియు తాను తలచుకున్న వారికి ఆపుతాడు.

• الأرض مخلوقة ممهدة منبسطة تتناسب مع إمكان الحياة البشرية عليها، وهي مثبّتة بالجبال الرواسي؛ لئلا تتحرك بأهلها، وفيها من النباتات المختلفة ذات المقادير المعلومة على وفق الحكمة والمصلحة.
భూమి చదును చేయబడిన,విస్తరించబడిన సృష్టి దానితోపాటు దానిపై మానవుని జీవన అవకాశమునకు అనుకూలంగా ఉన్నది. మరియు దానిపై నివాసము ఉన్న వారిని తీసుకుని కదలకుండా ఉండటానికి అది ఎత్తైన పర్వతాలతో స్థిరపరచబడినది.అందులో జ్ఞానం,ఆసక్తి ప్రకారం నిర్ణీత,నిర్ధారితమైన రకరకాల మొక్కలు కలవు.

• الأمر للملائكة بالسجود لآدم فيه تكريم للجنس البشري.
దైవదూతలు ఆదంనకు సాష్టాంగపడే ఆదేశం అందులో మానవ జాతికి గౌరవము కలదు.

قَالَ یٰۤاِبْلِیْسُ مَا لَكَ اَلَّا تَكُوْنَ مَعَ السّٰجِدِیْنَ ۟
ఇబ్లీసు ఆదంనకు సాష్టాంగపడటం నుండి ఆగిపోయిన తరువాత అల్లాహ్ ఇబ్లీసుతో ఇలా పలికాడు : నా ఆదేశమునకు కట్టుబడి సాష్టాంగపడిన దైవదూతలతోపాటు నీవు సాష్టాంగ పడటం నుండి ఏది నిన్ను ఆపినది,నిన్ను ఏది ప్రేరేపించినది ?.
アラビア語 クルアーン注釈:
قَالَ لَمْ اَكُنْ لِّاَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهٗ مِنْ صَلْصَالٍ مِّنْ حَمَاٍ مَّسْنُوْنٍ ۟
ఇబ్లీసు అహంకారముతో ఇలా సమాధానమిచ్చాడు : నీవు పొడిమట్టితో అది కూడా నల్లగా మారిన బంకమట్టితో సృష్టించిన ఒక మానవునికి నేను సాష్టాంగపడటం నాకు తగదు.
アラビア語 クルアーン注釈:
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙ
అల్లాహ్ ఇబ్లీసుకు ఇలా ఆదేశమిచ్చాడు : నీవు స్వర్గము నుండి వెళ్ళిపో. నిశ్చయంగా నీవు ధూత్కరించబడ్డావు.
アラビア語 クルアーン注釈:
وَّاِنَّ عَلَیْكَ اللَّعْنَةَ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟
నిశ్చయంగా నీపై శాపము,నా కారుణ్యము నుండి ధూత్కారము ప్రళయదినం వరకు ఉంటుంది.
アラビア語 クルアーン注釈:
قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
ఇబ్లీసు ఇలా వేడుకున్నాడు : ఓ నా ప్రభువా నీవు మానవులు తిరిగి లేపబడే దినం వరకు నాకు మరణం కలిగించకుండా గడువును ప్రసాధించు.
アラビア語 クルアーン注釈:
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ
అల్లాహ్ అతనికి ఇలా సమాధానమిచ్చాడు : నిశ్చయంగా నీవు నేను ఆయుషును వెనుకకు చేసిన గడువు ఇవ్వబడిన వారిలోంచివి.
アラビア語 クルアーン注釈:
اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟
మొదటి శంఖం ఊదినప్పుడు సృష్టితాలన్ని మరణించే సమయం వరకు.
アラビア語 クルアーン注釈:
قَالَ رَبِّ بِمَاۤ اَغْوَیْتَنِیْ لَاُزَیِّنَنَّ لَهُمْ فِی الْاَرْضِ وَلَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
ఇబ్లీసు ఇలా పలికాడు : ఓ నా ప్రభువా నీవు నన్ను అపమార్గమునకు గురి చేసినందుకు నేను భూమిలో వారి కొరకు దుష్కర్మలను మంచిగా చూపిస్తాను.మరియు వారందరిని సన్మార్గము నుండి తప్పిస్తాను.
アラビア語 クルアーン注釈:
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟
నీవు నీ ఆరాధన కొరకు ప్రత్యేకించుకున్న నీ దాసులను తప్ప.
アラビア語 クルアーン注釈:
قَالَ هٰذَا صِرَاطٌ عَلَیَّ مُسْتَقِیْمٌ ۟
అల్లాహ్ ఇలా సమాధానమిచ్చాడు : ఇది నన్ను చేరే సన్మార్గము.
アラビア語 クルアーン注釈:
اِنَّ عِبَادِیْ لَیْسَ لَكَ عَلَیْهِمْ سُلْطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغٰوِیْنَ ۟
నిశ్చయంగా మార్గ భ్రష్టుల్లోంచి నిన్ను అనుసరించిన వారు తప్ప నా ప్రత్యేక దాసులకు అపమార్గమునకు లోను చేసె అధికారము కాని ఆధిక్యత కాని నీకు లేదు.
アラビア語 クルアーン注釈:
وَاِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
నిశ్చయంగా ఇబ్లీసు కొరకు మరియు అతన్ని అనుసరించిన మార్గ భ్రష్టులందరి కొరకు వాగ్ధానం చేయబడిన చోటు నరకము.
アラビア語 クルアーン注釈:
لَهَا سَبْعَةُ اَبْوَابٍ ؕ— لِكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُوْمٌ ۟۠
నరకము కొరకు ఏడు ద్వారములు కలవు. వారు వాటిలో నుండి ప్రవేశిస్తారు. దాని ద్వారముల్లోంచి ప్రతి ద్వారము ద్వారా ఇబ్లీసును అనుసరించే వారిలో నుంచి ప్రత్యేకించబడి నిర్ధారించబడిన వారు ప్రవేశిస్తారు.
アラビア語 クルアーン注釈:
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ؕ
నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ దైవభీతి కలిగిన వారు స్వర్గవనాల,సెలయేరుల మధ్య ఉంటారు.
アラビア語 クルアーン注釈:
اُدْخُلُوْهَا بِسَلٰمٍ اٰمِنِیْنَ ۟
అందులో ప్రవేశించేటప్పుడు వారితో ఇలా అనబడుతుంది : మీరు అందులో ఆపదల నుండి నిశ్చింతగా,భయాందోళనల నుండి సురక్షితంగా ఉండి ప్రవేశించండి.
アラビア語 クルアーン注釈:
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ اِخْوَانًا عَلٰی سُرُرٍ مُّتَقٰبِلِیْنَ ۟
మేము వారి హృదయముల్లో కల ద్వేషమును,శతృత్వమును తొలగించాము. ఒకరినొకరు ప్రేమించుకునే సోధరులు పీఠాలపై కూర్చుని ఒకరినొకరు చూసుకుంటుంటారు.
アラビア語 クルアーン注釈:
لَا یَمَسُّهُمْ فِیْهَا نَصَبٌ وَّمَا هُمْ مِّنْهَا بِمُخْرَجِیْنَ ۟
అందులో వారికి ఎటువంటి అలసట కలుగదు. మరియు వారిని అక్కడ నుండి వెళ్ళకొట్టడం జరగదు. కానీ వారు అందులో శాస్వతంగా ఉంటారు.
アラビア語 クルアーン注釈:
نَبِّئْ عِبَادِیْۤ اَنِّیْۤ اَنَا الْغَفُوْرُ الرَّحِیْمُ ۟ۙ
ఓ ప్రవక్తా నిశ్చయంగా నేనే వారిలోంచి పశ్చాత్తాప్పడే వాడిని మన్నించే వాడునని, వారి పై కరుణించే వాడునని నా దాసులకు నీవు తెలియజేయి.
アラビア語 クルアーン注釈:
وَاَنَّ عَذَابِیْ هُوَ الْعَذَابُ الْاَلِیْمُ ۟
మరియు నా శిక్షే బాధాకరమైన శిక్ష అని వారికి తెలియజేయి. అయితే వారు నా మన్నింపును పొందటానికి,నా శిక్ష నుండి రక్షణను పొందటానికి పశ్చాత్తాప్పడాలి.
アラビア語 クルアーン注釈:
وَنَبِّئْهُمْ عَنْ ضَیْفِ اِبْرٰهِیْمَ ۟ۘ
మరియు వారికి ఇబ్రాహీం అలైహిస్సలాంకు కుమారుడి శుభవార్త ఇవ్వటానికి,లూత్ జాతి వారిని తుదిముట్టించటానికి వచ్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం అతిధులైన దైవదూతల వార్తను నీవు వారికి తెలియజేయి.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• في الآيات دليل على تزاور المتقين واجتماعهم وحسن أدبهم فيما بينهم، في كون كل منهم مقابلًا للآخر لا مستدبرًا له.
ఆయతులలో దైవభీతి కలవారు పరస్పరం కలుసుకోటం,వారి సమావేశము,వారి మధ్య ఉన్న వ్యవహారాల్లో మంచి పద్దతులపై ఆధారం ఉన్నది. వారిలో నుంచి ప్రతి ఒక్కరు ఇంకొకరకి ఎదురుగా ఉండటంలో వీపు త్రిప్పి కాదు.

• ينبغي للعبد أن يكون قلبه دائمًا بين الخوف والرجاء، والرغبة والرهبة.
దాసుని హృదయం ఎల్లప్పుడు భయము,ఆశ మరియు కోరిక,భీతి మధ్య ఉండాలి.

• سجد الملائكة لآدم كلهم أجمعون سجود تحية وتكريم إلا إبليس رفض وأبى.
దైవ దూతలందరు ఆదంకు శుభాకాంక్షలు తెలుపుతూ,గౌరవముతో సాష్టాంగపడ్డారు.కాని షైతాను ఆక్షేపించాడు,నిరాకరించాడు.

• لا سلطان لإبليس على الذين هداهم الله واجتباهم واصطفاهم في أن يلقيهم في ذنب يمنعهم عفو الله.
అల్లాహ్ ఎవరినైతే సన్మార్గం చూపించి,ఎంచుకుంటాడో,ఇష్టపడుతాడో వారిని అల్లాహ్ మన్నింపు నుండి ఆపే, పాపములో పడవేసే ఎటువంటి అధికారము ఇబ్లీసుకు లేదు.

اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ— قَالَ اِنَّا مِنْكُمْ وَجِلُوْنَ ۟
వారు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతనితో సలాం (నీపై అల్లాహ్ శాంతి కురియుగాక) పలికారు.ఆయన కూడా వారు చేసిన సలాంనకు మంచిగా ప్రతిసలాం చేశారు. మరియు ఆయన వారి ముందట కాల్చబడిన ఒక గొర్రె పిల్లను వారు మనషులని భావించి వారు తినటానికి పెట్టారు. వారు దానిని తినకపోవటమును చూసి నిశ్చయంగా మేము మీతో భయపడుతున్నాము అన్నారు.
アラビア語 クルアーン注釈:
قَالُوْا لَا تَوْجَلْ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمٍ عَلِیْمٍ ۟
దైవదూతలు ఇలా సమాధానమిచ్చారు : నీవు భయపడకు.నిశ్చయంగా మేము నీకు జ్ఞానవంతుడైన మగ సంతానము కలుగుతుందని నీకు సంతోషమును కలిగించే వార్తను ఇస్తున్నాము.
アラビア語 クルアーン注釈:
قَالَ اَبَشَّرْتُمُوْنِیْ عَلٰۤی اَنْ مَّسَّنِیَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُوْنَ ۟
ఇబ్రాహీమ్ తనకు కుమారుడు కలుగుతాడని వారిచ్చిన శుభవార్త వలన ఆశ్చర్య పడుతూ వారితో ఇలా పలికారు : ఏమీ మీరు నాకు కలిగిన వృద్ధాప్యంలో,ముసలితనంలో కుమారుడు కలుగుతాడని శుభవార్త ఇస్తున్నారా,అయితే మీరు నాకు ఏ ఆధారంతో శుభవార్తనిస్తున్నారు ?.
アラビア語 クルアーン注釈:
قَالُوْا بَشَّرْنٰكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِّنَ الْقٰنِطِیْنَ ۟
దైవదూతలు ఇబ్రాహీంతో ఇలా పలికారు : మేము ఎటువంటి సందేహం లేని సత్యమైన శుభవార్తను నీకు ఇచ్చాము. అయితే మేము నీకు ఇచ్చిన శుభవార్తను గురించి నిరాశ చెందే వారిలో నీవు చేరకు.
アラビア語 クルアーン注釈:
قَالَ وَمَنْ یَّقْنَطُ مِنْ رَّحْمَةِ رَبِّهٖۤ اِلَّا الضَّآلُّوْنَ ۟
ఇబ్రాహీం ఇలా పలికారు : అల్లాహ్ ఋజు మార్గము నుండి మడమ త్రిప్పిన వారు తప్ప ఇంకెవరు తన ప్రభువు కారుణ్యము నుండి నిరాశ చెందుతారు ?.
アラビア語 クルアーン注釈:
قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ ۟
ఇబ్రాహీం ఇలా పలికారు : ఓ మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చిన దూతలారా మీకు మీ ఏ విషయం తీసుకుని వచ్చినది ?.
アラビア語 クルアーン注釈:
قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰی قَوْمٍ مُّجْرِمِیْنَ ۟ۙ
దైవదూతలు ఇలా సమాధానమిచ్చారు : నిశ్చయంగా తీవ్ర ఉపద్రవాలను సృష్టించిన,మహా చెడులకు పాల్పడిన జాతి అయిన లూత్ జాతి వారిని తుదిముట్టించటానికి అల్లాహ్ మమ్మల్ని పంపించాడు.
アラビア語 クルアーン注釈:
اِلَّاۤ اٰلَ لُوْطٍ ؕ— اِنَّا لَمُنَجُّوْهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
లూత్ ఇంటివారు,ఆయనను అనసరించిన విశ్వాసపరులు తప్ప.వారికి వినాశనము కలుగదు.నిశ్చయంగా మేము వారందరిని దాని నుండి రక్షిస్తాము.
アラビア語 クルアーン注釈:
اِلَّا امْرَاَتَهٗ قَدَّرْنَاۤ ۙ— اِنَّهَا لَمِنَ الْغٰبِرِیْنَ ۟۠
కాని అతని భార్య,నిశ్చయంగా ఆమె వెనుక ఉండిపోయి వినాశనం చెందే వారిలోంచి అయిపోతుందని మేము నిర్ణయించాము.
アラビア語 クルアーン注釈:
فَلَمَّا جَآءَ اٰلَ لُوْطِ ١لْمُرْسَلُوْنَ ۟ۙ
పంపబడిన దైవదూతలు లూత్ వద్దకు మనుషుల రూపములో వచ్చినప్పుడు;
アラビア語 クルアーン注釈:
قَالَ اِنَّكُمْ قَوْمٌ مُّنْكَرُوْنَ ۟
లూత్ అలైహిస్సలాం వారితో మీరు పరిచయం లేని వ్యక్తులు అని పలికారు.
アラビア語 クルアーン注釈:
قَالُوْا بَلْ جِئْنٰكَ بِمَا كَانُوْا فِیْهِ یَمْتَرُوْنَ ۟
దైవ దూతలు లూత్ తో ఓ లూత్ నీవు భయపడకు. నీ జాతి వారు సందేహిస్తున్న వారిని తుదిముట్టించే శిక్షను మేము నీ వద్దకు తీసుకుని వచ్చాము అని పలికారు.
アラビア語 クルアーン注釈:
وَاَتَیْنٰكَ بِالْحَقِّ وَاِنَّا لَصٰدِقُوْنَ ۟
మేము ఎటువంటి పరిహాసము లేని సత్యాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చాము. నిశ్చయంగా మేము నీకు తెలియపరచిన విషయంలో సత్యవంతులము.
アラビア語 クルアーン注釈:
فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّیْلِ وَاتَّبِعْ اَدْبَارَهُمْ وَلَا یَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ وَّامْضُوْا حَیْثُ تُؤْمَرُوْنَ ۟
అయితే నీవు రాత్రి కొంత భాగం గడిచిన తరువాత నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు,వారి వెనుకే నీవు పో. మీ లో నుంచి ఎవరూ వారికి ఏమి జరిగిందో చూడటానికి వెనుకకు తిరుగకూడదు. మీకు అల్లాహ్ ఎక్కడకు వెళ్లమని ఆదేశించాడో అటు వెళ్ళిపోండి.
アラビア語 クルアーン注釈:
وَقَضَیْنَاۤ اِلَیْهِ ذٰلِكَ الْاَمْرَ اَنَّ دَابِرَ هٰۤؤُلَآءِ مَقْطُوْعٌ مُّصْبِحِیْنَ ۟
మరియు మేము నిర్ధారించుకున్న ఆ ఆదేశము అది ఈ జాతి వారందరు తెల్లవారే సరికి వారి చివరి వరకు సమూలంగా నిర్మూలించబడుతారన్నది మేము లూత్ అలైహిస్సలాంకు వహీ ద్వారా తెలియపరచాము.
アラビア語 クルアーン注釈:
وَجَآءَ اَهْلُ الْمَدِیْنَةِ یَسْتَبْشِرُوْنَ ۟
మరియు సదూమ్ వాసులు లూత్ అలైహిస్సలాం అతిధులతో అశ్లీల కార్యమును ఆశిస్తూ సంబరపడుతూ వచ్చారు.
アラビア語 クルアーン注釈:
قَالَ اِنَّ هٰۤؤُلَآءِ ضَیْفِیْ فَلَا تَفْضَحُوْنِ ۟ۙ
లూత్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : వీరందరు నా అతిధులు.మీరు వారితో ఏది ఆశిస్తున్నారో దాని ద్వారా నా పరువు తీయకండి.
アラビア語 クルアーン注釈:
وَاتَّقُوا اللّٰهَ وَلَا تُخْزُوْنِ ۟
మరియు మీరు ఈ అశ్లీల కార్యమును వదిలి వేసి అల్లాహ్ కి భయపడండి. మరియు మీ ఈ దుష్చర్య ద్వారా మీరు నన్ను అవమానపరచకండి.
アラビア語 クルアーン注釈:
قَالُوْۤا اَوَلَمْ نَنْهَكَ عَنِ الْعٰلَمِیْنَ ۟
ప్రజల్లోంచి ఎవరిని చేర్చుకోవటం నుండి నిన్ను మేము వారించలేదా ? అని అతని జాతి వారు అతనితో అన్నారు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• تعليم أدب الضيف بالتحية والسلام حين القدوم على الآخرين.
ఎవరి వద్దనన్న అతిధులు వచ్చినప్పుడు వారిని శుభాకాంక్షలు చెబుతూ,సలాం చేస్తూ గౌరవించాలని నేర్పించటం జరిగింది.

• من أنعم الله عليه بالهداية والعلم العظيم لا سبيل له إلى القنوط من رحمة الله.
అల్లాహ్ ఎవరికైన ఋజు మార్గమును,మహోన్నత జ్ఞానమును అనుగ్రహిస్తే అతను అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ చెందటానికి ఎటువంటి ఆస్కారము లేదు.

• نهى الله تعالى لوطًا وأتباعه عن الالتفات أثناء نزول العذاب بقوم لوط حتى لا تأخذهم الشفقة عليهم.
మహోన్నతుడైన అల్లాహ్ లూత్ ను,అతన్ని అనుసరించేవారిని లూత్ జాతి వారిపై శిక్ష కొనసాగేటప్పుడు వారిపై వారికి దయకలగకుండా ఉండటానికి వెనుకకు తిరగటం నుండి వారించాడు.

• تصميم قوم لوط على ارتكاب الفاحشة مع هؤلاء الضيوف دليل على طمس فطرتهم، وشدة فحشهم.
ఈ అతిధులందరితో అశ్లీల కార్యమునకు పాల్పడటంపై లూత్ జాతి వారి సంకల్పము వారి స్వభావము కోల్పోవటం,వారి అశ్లీలత తీవ్రతకు ఆధారము.

قَالَ هٰۤؤُلَآءِ بَنَاتِیْۤ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟ؕ
లూత్ అలైహిస్సలాం తన అతిధుల ముందు తన తరపు నుండి క్షమాపణ కోరుతూ వారితో ఇలా పలికారు : మీ మహిళలందరిలో నుంచి వీరు నా కుమార్తెలు. ఒక వేళ మీరు మీ కోరికలను తీర్చుకోవాలనుకుంటే వారిని వివాహం చేసుకోండి.
アラビア語 クルアーン注釈:
لَعَمْرُكَ اِنَّهُمْ لَفِیْ سَكْرَتِهِمْ یَعْمَهُوْنَ ۟
ఓ ప్రవక్తా నీ జీవితం సాక్షి నిశ్చయంగా లూత్ జాతి తమ కామ కోరికల్లో హద్దు మీరి త్రోవ తప్పి తిరుగుతున్నారు.
アラビア語 クルアーン注釈:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُشْرِقِیْنَ ۟ۙ
సూర్యోదయం అయ్యే సమయంలో వారు ప్రవేశించినప్పుడు ప్రాణాంతకమైన పెద్ద స్వరం వారిని పట్టుకున్నది.
アラビア語 クルアーン注釈:
فَجَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَیْهِمْ حِجَارَةً مِّنْ سِجِّیْلٍ ۟ؕ
అప్పుడు మేము వారి బస్తీలను తలక్రిందులగా త్రిప్పి వేశాము. మరియు మేము వారిపై బంక మట్టితో తయారు చేయబడిన కంకర రాళ్ళను కురిపించాము.
アラビア語 クルアーン注釈:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّلْمُتَوَسِّمِیْنَ ۟
నిశ్చయంగా లూత్ జాతి వారిపై కురిసిన ఈ వినాశన ప్రస్తావనలో యోచన చేసే వారి కొరకు సూచనలు కలవు.
アラビア語 クルアーン注釈:
وَاِنَّهَا لَبِسَبِیْلٍ مُّقِیْمٍ ۟
నిశ్చయంగా లూత్ జాతి బస్తీలు రహదారి పైనే ఉన్నవి. వాటి వద్ద నుండి వెళ్ళే ప్రయాణికులు వాటిని చూస్తూ ఉంటారు.
アラビア語 クルアーン注釈:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّلْمُؤْمِنِیْنَ ۟ؕ
నిశ్చయంగా ఈ సంభవించిన దానిలో దాని ద్వారా గుణపాఠం నేర్చుకునే విశ్వాసపరుల కొరకు సూచన ఉన్నది.
アラビア語 クルアーン注釈:
وَاِنْ كَانَ اَصْحٰبُ الْاَیْكَةِ لَظٰلِمِیْنَ ۟ۙ
దట్టమైన వనవాసులు కల షుఐబ్ జాతి వారు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన,తమ ప్రవక్త ను తిరస్కరించటం వలన దుర్మార్గులుగా ఉండేవారు.
アラビア語 クルアーン注釈:
فَانْتَقَمْنَا مِنْهُمْ ۘ— وَاِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِیْنٍ ۟ؕ۠
కావున వారికి శిక్ష పట్టుకున్నప్పుడు మేము వారి మీద ప్రతీకారం తీసుకున్నాము.నిశ్చయంగా లూత్ జాతి వారి బస్తీలు,షుఐబ్ జాతి వారి ప్రాంతములు ఒక ప్రధాన మార్గంలో ఉన్నవి దానిపై నడిచే వారి కొరకు.
アラビア語 クルアーン注釈:
وَلَقَدْ كَذَّبَ اَصْحٰبُ الْحِجْرِ الْمُرْسَلِیْنَ ۟ۙ
నిశ్చయంగా హిజాజ్ మరియు షామ్ (సిరియా) మధ్య కల ప్రాంతమైన హిజ్ర్ వాసులైన సమూద్ జాతివారు తమ ప్రవక్త అయిన సాలిహ్ అలైహిస్సలాంను ఎప్పుడైతే తిరస్కరించారో ప్రవక్తలందరిని తిరస్కరించారు.
アラビア語 クルアーン注釈:
وَاٰتَیْنٰهُمْ اٰیٰتِنَا فَكَانُوْا عَنْهَا مُعْرِضِیْنَ ۟ۙ
మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి ఏవైతే తీసుకుని వచ్చారో అందులో ఆయన నిజాయితీపై వాదనలను,ఆధారాలను మేము వారికి ప్రసాధించాము. ఒంటె వాటిలోంచిదే.కాని వారు ఆ ఆధారాలతో గుణపాఠం నేర్చుకోలేదు,వారు వాటి గురించి పట్టించుకోలేదు.
アラビア語 クルアーン注釈:
وَكَانُوْا یَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا اٰمِنِیْنَ ۟
మరియు వారు తమ కొరకు గృహాలను నిర్మించుకోవటానికి పర్వతాలను తొలిచేవారు. తాము భయపడే వాటి నుండి నిశ్చింతగా వాటిలో నివాసముండేవారు.
アラビア語 クルアーン注釈:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُصْبِحِیْنَ ۟ۙ
వారిపై తెల్లవారుతుండగా భయంకర గర్జన శిక్ష వారిని పట్టుకుంది.
アラビア語 クルアーン注釈:
فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟ؕ
అప్పుడు వారు సంపాదించుకున్న వారి సంపదలు,నివాసాలు అల్లాహ్ శిక్షను వారిపై నుండి తొలగించలేక పోయాయి.
アラビア語 クルアーン注釈:
وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ ؕ— وَاِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِیْلَ ۟
మరియు మేము భూమ్యాకాశములను,వాటిలో ఉన్న వాటన్నింటిని విజ్ఞత లేకుండా శూన్యంగా సృష్టించలేదు. మేము వాటన్నింటిని సత్యంతో మాత్రమే సృష్టించాము. మరియు నిశ్చయంగా ప్రళయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓ ప్రవక్తా మిమ్మల్ని తిరస్కరించిన వారి నుండి మీరు విముఖత చూపండి,వారిని ఉత్తమ రీతిలో మన్నించండి.
アラビア語 クルアーン注釈:
اِنَّ رَبَّكَ هُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ ۟
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువే సర్వాన్ని సృష్టించి వాటి గురించి జ్ఞానం కలవాడు.
アラビア語 クルアーン注釈:
وَلَقَدْ اٰتَیْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِیْ وَالْقُرْاٰنَ الْعَظِیْمَ ۟
నిశ్చయంగా మేము ఏడు ఆయతులు కల ఫాతిహాను మీకు అనుగ్రహించాము. మరియు అది మహోన్నతమైన ఖుర్ఆన్.
アラビア語 クルアーン注釈:
لَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰی مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَیْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِیْنَ ۟
అవిశ్వాసపరుల్లోంచి పలు వర్గాల వారికి మేము ఇచ్చిన అంతమైపోయే ప్రాపంచిక సంపద వైపునకు నీవు నీ దృష్టిని సారించకు.మరియు నీవు వారి తిరస్కారముపై బాధపడకు,విశ్వాసపరుల కొరకు అణకువను చూపించు.
アラビア語 クルアーン注釈:
وَقُلْ اِنِّیْۤ اَنَا النَّذِیْرُ الْمُبِیْنُ ۟ۚ
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా నేనే శిక్ష నుండి స్పష్టమైన హెచ్చరిక చేసే వాడిని.
アラビア語 クルアーン注釈:
كَمَاۤ اَنْزَلْنَا عَلَی الْمُقْتَسِمِیْنَ ۟ۙ
అల్లాహ్ గ్రంధాలను వేరు వేరు భాగములుగా చేసుకుని కొన్నింటిని విశ్వసించి కొన్నింటిని తిరస్కరించిన వారిపై అల్లాహ్ కురిపించినట్లు మీపై కూడా సంభవిస్తుందని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• أن الله تعالى إذا أراد أن يهلك قرية ازداد شرهم وطغيانهم، فإذا انتهى أوقع بهم من العقوبات ما يستحقونه.
• నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ఏదైన బస్తీ వారిని తుదిముట్టించాలని నిర్ణయించుకుంటే వారి చెడును,వారి అతిక్రమించటమును అధికం చేస్తాడు.అది ముగిసినప్పుడు వారికి తగినటువంటి శిక్షలను వారిపై కలిగిస్తాడు.

• كراهة دخول مواطن العذاب، ومثلها دخول مقابر الكفار، فإن دخل الإنسان إلى تلك المواضع والمقابر فعليه الإسراع.
• శిక్షలు కలిగిన ప్రదేశములలో ప్రవేశించటం అయిష్టము,అలాగే అవిశ్వాసపరుల సమాదుల వద్దకు ప్రవేశము కూడా అలాంటిదే. ఒక వేళ ఎవరైన ఈ ప్రదేశాల నుండి,సమాదులపై నుండి వెళితే అతడు వేగంగా వెళ్ళిపోవటం తప్పనిసరి.

• ينبغي للمؤمن ألا ينظر إلى زخارف الدنيا وزهرتها، وأن ينظر إلى ما عند الله من العطاء.
విశ్వాసి లోకపు అలంకరణలను దాని వైభోగాలను చూడకూడదు. అతడు అల్లా వద్ద ఉన్న ప్రసాదాలను చూడాలి.

• على المؤمن أن يكون بعيدًا من المشركين، ولا يحزن إن لم يؤمنوا، قريبًا من المؤمنين، متواضعًا لهم، محبًّا لهم ولو كانوا فقراء.
• ముష్రికుల నుండి దూరంగా ఉండటం,ఒక వేళ వారు విశ్వసించకపోతే బాధపడక ఉండటం,విశ్వాసపరుల కొరకు అణకువను చూపిస్తూ, ఒక వేళ వారు పేదవారైతే వారిపై ప్రేమను చూపిస్తూ వారికి దగ్గరవటం విశ్వాసపరునిపై తప్పనిసరి.

الَّذِیْنَ جَعَلُوا الْقُرْاٰنَ عِضِیْنَ ۟
ఎవరైతే ఖుర్ఆన్ ను విడి విడి భాగములు చేసుకున్నారో వారు దాన్ని మంత్రజాలము (జాదూ) లేదా జోతిష్యము లేదా కవిత్వము అన్నారు.
アラビア語 クルアーン注釈:
فَوَرَبِّكَ لَنَسْـَٔلَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా నీ ప్రభువు సాక్షిగా దాన్ని(ఖుర్ఆన్ ని) విడి విడి భాగములుగా చేసిన వారందరిని ప్రళయదినాన మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
アラビア語 クルアーン注釈:
عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟
వారు ఇహలోకములో చేసుకున్న అవిశ్వాసము,అవిధేయ కార్యాల గురించి మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
アラビア語 クルアーン注釈:
فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِیْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దేని గురించి పిలుపునివ్వమని ఆదేశించాడో దాన్ని బహిరంగంగా చేయండి. మరియు ముష్రికులు ఏదైతే పలుకుతున్నారో,ఏదైతే చేస్తున్నారో దాని వైపు తిరిగి చూడకండి.
アラビア語 クルアーン注釈:
اِنَّا كَفَیْنٰكَ الْمُسْتَهْزِءِیْنَ ۟ۙ
మరియు మీరు వారితో భయపడకండి. ఖురైష్ లో నుండి అవిశ్వాసపరులైన నాయకుల్లోంచి పరిహాసమాడే వారి నుండి రక్షించటానికి మేము మీకు చాలు.
アラビア語 クルアーン注釈:
الَّذِیْنَ یَجْعَلُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۚ— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟
అల్లాహ్ తోపాటు ఇతరులను ఆరాధ్య దైవముగా చేసుకునేవారు తమ షిర్కు యొక్క దుష్పరిణామమును తొందరలోనే తెలుసుకుంటారు.
アラビア語 クルアーン注釈:
وَلَقَدْ نَعْلَمُ اَنَّكَ یَضِیْقُ صَدْرُكَ بِمَا یَقُوْلُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని తిరస్కరించటం వలన,మిమ్మల్ని ఎగతాళి చేయటం వలన మీకు మనస్తాపం కలుగుతుందన్న విషయం మాకు తెలుసు.
アラビア語 クルアーン注釈:
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِّنَ السّٰجِدِیْنَ ۟ۙ
అయితే మీరు అల్లాహ్ వైపునకు ఆయనకు తగని గుణాల నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ, ఆయన పరిపూర్ణ గుణాల ద్వారా ఆయన స్థుతులను తెలుపుతూ ఆశ్రయించు. మరియు నీవు అల్లాహ్ కొరకు ఆరాధన చేసే వారిలో,ఆయన కొరకు నమాజులు పాటించే వారిలో అయిపో. ఇందులో మీకు కలిగిన మనస్తాపమునకు వైధ్యం ఉన్నది.
アラビア語 クルアーン注釈:
وَاعْبُدْ رَبَّكَ حَتّٰی یَاْتِیَكَ الْیَقِیْنُ ۟۠
మరియు నీవు నీ ప్రభువు ఆరాధనను ఎడతెగకుండా చేయి, నీవు జీవించి ఉన్నంత కాలం దానిపై కొనసాగు,చివరికి నీకు మరణం సంభవించినప్పుడు నీవు దానిపైనే ఉండు.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• عناية الله ورعايته بصَوْن النبي صلى الله عليه وسلم وحمايته من أذى المشركين.
ప్రవక్త సల్లల్లాహుహు అలైహి వసల్లంను కాపాడటం ద్వారా,ముష్రికుల కీడు నుండి ఆయనను రక్షించటం ద్వారా అల్లాహ్ అనుగ్రహము,ఆయన సంరక్షణ.

• التسبيح والتحميد والصلاة علاج الهموم والأحزان، وطريق الخروج من الأزمات والمآزق والكروب.
పరిశుద్ధతను కొనియాడటం,స్థుతులను పలకటం,నమాజును పాటించటం చింతలకు,దుఃఖాలకు చికిత్స మరియు సంక్షోభాలు,సందిగ్దతలు,వేదనల నుండి బయటపడే మార్గము.

• المسلم مطالب على سبيل الفرضية بالعبادة التي هي الصلاة على الدوام حتى يأتيه الموت، ما لم يغلب الغشيان أو فقد الذاكرة على عقله.
ముస్లిమునకు అరాధన విధిగా చేయటమును కోరటమైనది అది నమాజ్ స్థిరంగా తనకు మరణం వచ్చే వరకు చేస్తూ ఉండాలి. అతనికి మతి కోల్పోవటం గాని లేదా అతని జ్ఞాపక శక్తి కోల్పోవటంగాని జరగక ఉండాలి.

• سمى الله الوحي روحًا؛ لأنه تحيا به النفوس.
అల్లాహ్ దైవ వాణి ని ఆత్మ పేరుతో సంబోధించాడు ఎందుకంటే దాని ద్వారానే మనస్సులు జీవించి ఉంటాయి.

• مَلَّكَنا الله تعالى الأنعام والدواب وذَلَّلها لنا، وأباح لنا تسخيرها والانتفاع بها؛ رحمة منه تعالى بنا.
మహోన్నతుడైన అల్లాహ్ పశువులను,జంతువులను మా ఆదీనంలో చేశాడు, వాటిని మాకు లోబడి ఉండేటట్లు చేశాడు. మరియు వాటిని లోబడించుకోవటమును, వాటి ద్వారా ప్రయోజనం చెందటమును మాపై మహోన్నతుడైన తన వద్ద నుండి కారుణ్యముగా మా కొరకు ధర్మసమ్మతం చేశాడు.

 
対訳 章: アル・ヒジュル章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - 対訳の目次

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

閉じる