Check out the new design

クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) * - 対訳の目次


対訳 章: 雌牛章   節:
وَاقْتُلُوْهُمْ حَیْثُ ثَقِفْتُمُوْهُمْ وَاَخْرِجُوْهُمْ مِّنْ حَیْثُ اَخْرَجُوْكُمْ وَالْفِتْنَةُ اَشَدُّ مِنَ الْقَتْلِ ۚ— وَلَا تُقٰتِلُوْهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتّٰی یُقٰتِلُوْكُمْ فِیْهِ ۚ— فَاِنْ قٰتَلُوْكُمْ فَاقْتُلُوْهُمْ ؕ— كَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِیْنَ ۟
మీరు వారిని ఎక్కడ ఎదురైతే అక్కడే వారిని వదించండి,ఎక్కడ నుంచి మిమ్మల్ని వారు తీసివేశారో అక్కడ నుంచి వారిని తీసి వేయండి,ఆ ప్రదేశం మక్కా నగరం.విశ్వాస పరుడిని అతని ధర్మం నుండి ఆపి అవిశ్వాసం వైపునకు అతనిని మరల్చడం వలన కలిగే ఉపద్రవము (ఫిత్న) హత్య కన్న ఘోరమైన పాపము.మస్జిదుల్ హరామ్ వద్ద దాని గొప్పతనం ఏదైతే ఉన్నదో దాని కారణం చేత వారు మీతో యుద్దము చేయనంత వరకు మీరు వారితో యుద్దమును మొదలెట్టకండి.,ఒక వేళ వారు మస్జిదుల్ హరామ్ వద్ద మొదలెడితే వారిని వదించండి,మస్జిదుల్ హరామ్ లో వారు హద్దుమీరినప్పుడు వారిని వదించడమే దీని ప్రతిఫలము,అది సత్య తిరస్కారులకు ప్రతిఫలము అవుతుంది.
アラビア語 クルアーン注釈:
فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఒక వేళ వారు మీతో యుద్దం చేయటం,వారి తిరస్కారమును మానుకుంటే మీరు కూడా వారి నుండి ఆగిపోండి,ఎందుకంటే అల్లాహ్ క్షమాపణ కోరే వారిని మన్నించే వాడు,వారి గతించిన పాపములపై వారిని శిక్షించడు,వారిని కరుణించే వాడు,వారిని శిక్షించడంలో తొందర పడడు.
アラビア語 クルアーン注釈:
وَقٰتِلُوْهُمْ حَتّٰی لَا تَكُوْنَ فِتْنَةٌ وَّیَكُوْنَ الدِّیْنُ لِلّٰهِ ؕ— فَاِنِ انْتَهَوْا فَلَا عُدْوَانَ اِلَّا عَلَی الظّٰلِمِیْنَ ۟
మీరు బహుదైవారాధన,ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి ఆపడం,సత్య తిరస్కారము జరగనంత వరకు,అదీష్టించే ధర్మం అల్లాహ్ ధర్మం అయ్యేంత వరకు సత్య తిరస్కారులతో యుద్దం చేయండి.ఒక వేళ వారు తమ తిరస్కార వైఖరి నుంచి,అల్లాహ్ మార్గము నుంచి ఆపటం నుంచి ఆగిపోతే మీరు వారితో యుద్దమును ఆపివేయండి,ఎందుకంటే అవిశ్వాసం,అల్లాహ్ మార్గం నుండి ఆపటం వలనే దుర్మార్గులపై ఆధిక్యాన్ని చూపాలి.
アラビア語 クルアーン注釈:
اَلشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمٰتُ قِصَاصٌ ؕ— فَمَنِ اعْتَدٰی عَلَیْكُمْ فَاعْتَدُوْا عَلَیْهِ بِمِثْلِ مَا اعْتَدٰی عَلَیْكُمْ ۪— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟
అల్లాహ్ మిమ్మల్ని ఏడవ సంవత్సరంలో హరమ్ లో ప్రవేశింపజేసి ,ఉమ్రాను నిరవేర్పజేసి మీకు స్థానమును కల్పించిన పవిత్ర మాసము,అది ఆరవ సంవత్సరంలో బహు దైవారాదకులు మిమ్మల్ని హరమ్ లో ప్రవేశించకుండ ఆపిన పవిత్ర మాసమునకు బదులు,నిషిద్దతలు కలవు,ఉదాహరణకు హరమ్ ప్రాంత నిషిద్దత,నిషిద్ద మాసములు,ఇహ్రామ్అతిక్రమించే వారిపై ,వీటిలో ప్రతీకారము తీసుకోవచ్చు.వీటిలో మీపై ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే వారు మీపట్ల వ్యవహరించిన విధంగా వారి పట్ల వ్యవహరించండి.సమానమైన పరిమితిని మించకండి.నిశ్చయంగా అల్లాహ్ హద్దుమీరే వారిని ఇష్టపడడు.మీకు అనుమతించబడిన విషయాల్లో హద్దు మీరటం గురించి అల్లాహ్ కు భయపడండి.అల్లాహ్ ప్రసాదించడంలో,మద్దతివ్వటంలో దైవభీతి కలవారికి తోడుగా ఉంటాడన్న విషయమును తెలుసుకోండి.
アラビア語 クルアーン注釈:
وَاَنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا تُلْقُوْا بِاَیْدِیْكُمْ اِلَی التَّهْلُكَةِ ۛۚ— وَاَحْسِنُوْا ۛۚ— اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۟
అల్లాహ్ విధేయతకు సంబంధించిన ధర్మ పోరాటంలో,ఇతర కార్యాల్లో ధనమును ఖర్చు చేయండి,ధర్మ పోరాటమును,అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటంను వదిలేసి లేదా మిమ్మల్ని వినాశనమునకు కారణమయ్యే విషయాల్లో మిమ్మల్ని పడవేసి మీకు మీరే వినాశనంలో నెట్టి వేయకండి,మీరు మీ ఆరాధనలను,మీ వ్యవహారాలను,మీ గుణాలను మంచిగా చేసుకోండి.నిశ్చయంగా అల్లాహ్ తమ వ్యవహారాలన్నింటిని మంచిగా చేసే వారిని ఇష్టపడుతాడు.వారికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు,వారికి సన్మార్గమును పొందే సౌభాగ్యమును కలిగిస్తాడు.
アラビア語 クルアーン注釈:
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِ ؕ— فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰی یَبْلُغَ الْهَدْیُ مَحِلَّهٗ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ بِهٖۤ اَذًی مِّنْ رَّاْسِهٖ فَفِدْیَةٌ مِّنْ صِیَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍ ۚ— فَاِذَاۤ اَمِنْتُمْ ۥ— فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَی الْحَجِّ فَمَا اسْتَیْسَرَ مِنَ الْهَدْیِ ۚ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ فِی الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْ ؕ— تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ— ذٰلِكَ لِمَنْ لَّمْ یَكُنْ اَهْلُهٗ حَاضِرِی الْمَسْجِدِ الْحَرَامِ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟۠
అల్లాహ్ మన్నతను ఆశిస్తూ హజ్,ఉమ్రాలను పూర్తి చేయండి. ఆ రెండిటిని పూర్తి చేయటం నుండి అనారోగ్యం,శతృవుల వలన ఆపబడినప్పుడు మీరు ఒంటె,ఆవు,గొర్రెల్లోంచి అందుబాటులో ఉన్న దేనినైన ఒకదానిని మీ ఇహ్రామ్ దీక్ష నుండి హలాల్ అవ్వటం కొరకు ఖుర్బానీగా ఇవ్వండి. ఖుర్బానీ దాని స్థానమునకు చేరే వరకు మీ శిరో ముండనం కాని,వెంట్రుకలను కత్తిరించటం కాని చేయకూడదు,ఒక వేళ హరమ్ ప్రాంతంలో ప్రవేశించడం నుంచి ఆపబడితే మీరు ఆపబడిన ప్రాంతంలోనే జిబహ్ చేయండి. ఒకవేళ హరమ్ నుండి ఆపబడకపోతే హరమ్లోనే ఖుర్బానీ ఇచ్చే రోజున లేదా దాని తరువాత తష్రీఖ్ దినాల్లో జిబాహ్ చేయండి. మీలో నుంచి ఎవరైన అనారోగ్యానికి గురైనా లేదా అతని తలలో పేలు వేరే వాటి వలన ఏదైన బాధ ఉన్న కారణంగా శిరో ముండనం చేసుకోవచ్చు,ఆతనిపై ఎటువంటి దోషము లేదు. కాని అతను మూడు రోజులు ఉపవాసముండాలి లేదా ఆరుగురు నిరు పేదలకు భోజనం పెట్టాలి లేదా ఒక జంతువును జిబాహ్ చేసి హరమ్ ప్రాంతంలోని పేదవారిలో పంచి పరిహారంగా చల్లించాలి. మీరు భయాందోళనలో కాకుండా ప్రశాంతతలో ఉన్నప్పుడు మీలో నుంచి ఎవరైన హజ్ మాసములో ఉమ్రా చేసి ప్రయోజనం పొందదలుచుకుని ఇహ్రామ్ నుంచి బయటకు వచ్చి హజ్ కొరకు ఇహ్రామ్ కట్టేవరకు ఇహ్రామ్ స్థితిలో ఆపబడిన కార్యాల నుండి లబ్ది పొందదలుచుకంటే ఒక గొర్రెను జిబాహ్ చేయాలి లేదా ఒక ఒంటెలో లేదా ఒక ఆవులో ఏడుగురు భాగస్వాములు కావచ్చు. ఖుర్బానీ ఇవ్వలేని వారు దానికి బదులుగా హజ్ దినాల్లో మూడు రోజులు ఉపవాసం పాటించాలి,ఇంకా ఇంటికి వాపసు అయిన తరువాత పది రోజుల ఉపవాసాలు పూర్తి అవటం కొరకు ఏడు రోజులు ఉపవాసం ఉండాలి. ఈ హజ్జె తమత్తు లో ఖుర్బానీ తప్పనిసరిగా ఇవ్వటం,స్థోమత లేనివాడు ఉపవాసాలుండటం హరమ్ ప్రాంతం వారు కాకుండా దూర ప్రాంతముల నుండి హజ్ కొరకు వచ్చిన వారి కొరకు వర్తిస్తుంది. అల్లాహ్ నిర్దేశించిన వాటిని పాటించటంలో,ఆయన హద్దులను గౌరవించటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఆదేశాలను వ్యతిరేకించే వారిని ఆయన కఠినంగా శిక్షిస్తాడని మీరు తెలుసుకోండి.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• مقصود الجهاد وغايته جَعْل الحكم لله تعالى وإزالة ما يمنع الناس من سماع الحق والدخول فيه.
ఆదేశమును అల్లాహ్ మన్నత కొరకు చేయటం,సత్యమును వినటము నుండి,సత్యములో ప్రవేశించటం నుండి ప్రజలను ఆటంకం కలిగించే వాటిని దూరం చేయటం జిహాద్ (ధర్మ పోరాటం) ఉద్దేశము,లక్ష్యము.

• ترك الجهاد والقعود عنه من أسباب هلاك الأمة؛ لأنه يؤدي إلى ضعفها وطمع العدو فيها.
జిహాద్ ను వదిలి వేయటం,దాని నుండి వెనుకంజ వేయటం ఉమ్మత్ వినాశనమునకు కారణమవుతుంది.ఎందుకంటే అది ఉమ్మత్ ని బలహీనతకు చేరుస్తుంది,వారిలో శతృవులు దురాశను చూపుతారు.

• وجوب إتمام الحج والعمرة لمن شرع فيهما، وجواز التحلل منهما بذبح هدي لمن مُنِع عن الحرم.
హజ్ మరియు ఉమ్రా ఫ్రారంభించిన వారికి వాటిని పూర్తి చేయటం తప్పనిసరి.హరమ్ ప్రాంతములో ప్రవేశము నుండి ఆపబడిన వారు ఒక జంతువును జిబాహ్ చేసి ఇహ్రామ్ దీక్ష నుండి బయటకు రావటం ధర్మసమ్మతమే.

 
対訳 章: 雌牛章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) - 対訳の目次

- Tafsir Center for Quranic Studies - 発行

閉じる