Check out the new design

クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) * - 対訳の目次


対訳 節: (112) 章: 雌牛章
بَلٰی ۗ— مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ ۪— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟۠
స్వర్గములో మాత్రం అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో ఉండి ఆయన వైపునకు మరలేవాడు ప్రవేశిస్తాడు. మరియు అతడు తన చిత్తశుద్ధితో పాటు ప్రవక్త తెచ్చిన దాన్ని అనుసరించటం ద్వారా తన ఆరాధనను మెరుగుపరచుకునేవాడై ఉంటాడు. అతడే స్వర్గములో ప్రవేశిస్తాడు అతడు ఏ వర్గములో నుంచి అయినా సరే. మరియు అతని కొరకు అతని ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంటుంది. పరలోకంలో వారు ఎదుర్కొనే వాటి గురించి వారిపై ఎటువంటి భయముండదు. మరియు ఇహలోకములో నుంచి వారు కోల్పోయిన దానిపై వారికి బాధ ఉండదు. మరియు ఈ లక్షణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత ముస్లిముల్లో మాత్రమే నిరూపితమైనవి.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• أن الأمر كله لله، فيبدل ما يشاء من أحكامه وشرائعه، ويبقي ما يشاء منها، وكل ذلك بعلمه وحكمته.
వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. కావున ఆయన తన ఆదేశముల్లోంచి మరియు తన శాసనముల్లోంచి తాను తలచుకున్న వాటిని మార్చివేస్తాడు మరియు వాటిలో నుంచి తాను తలచుకున్న వాటిని అట్టే ఉంచుతాడు. మరియు ఇవన్ని ఆయన జ్ఞానముతో మరియు విజ్ఞతతో జరుగును.

• حَسَدُ كثيرٍ من أهل الكتاب هذه الأمة، لما خصَّها الله من الإيمان واتباع الرسول، حتى تمنوا رجوعها إلى الكفر كما كانت.
ఈ సమాజముపై గ్రంధవహుల తరపు నుండి చాలా అసూయ కలదు ఎందుకంటే అల్లాహ్ వారిని విశ్వాసముతో మరియు ప్రవక్తను అనుసరించటంతో ప్రత్యేకించాడు. చివరికి వారు తాము ఉన్న అవిశ్వాసం వైపునకు వారి మరలటమును ఆశించారు.

 
対訳 節: (112) 章: 雌牛章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) - 対訳の目次

- Tafsir Center for Quranic Studies - 発行

閉じる