Check out the new design

クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) * - 対訳の目次


対訳 章: 砂丘章   節:
وَاِذَا حُشِرَ النَّاسُ كَانُوْا لَهُمْ اَعْدَآءً وَّكَانُوْا بِعِبَادَتِهِمْ كٰفِرِیْنَ ۟
మరియు వారు ఇహలోకములో వారికి ప్రయోజనం కలిగించకపోవటంతో పాటు వారు ప్రళయదినము నాడు సమీకరించబడినప్పుడు తమను ఆరాధించేవారికి శతృవులైపోతారు. మరియు వారికి తమకి సంబంధం లేదంటారు. మరియు వారు తమను ఆరాధించిన విషయం తెలవటం గురించి నిరాకరిస్తారు.
アラビア語 クルアーン注釈:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۙ— هٰذَا سِحْرٌ مُّبِیْنٌ ۟ؕ
మరియు మన ప్రవక్తపై అవతరించబడిన మా ఆయతులను వారి ముందట చదివి వినిపించబడినప్పుడు తమ ప్రవక్త చేత తమ వద్దకు వచ్చిన ఖుర్ఆన్ ను తిరస్కరించిన వారు ఇలా పలుకుతారు : ఇది స్పష్టమైన మంత్రజాలము. మరియు అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి దైవవాణి కాదు.
アラビア語 クルアーン注釈:
اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ؕ— قُلْ اِنِ افْتَرَیْتُهٗ فَلَا تَمْلِكُوْنَ لِیْ مِنَ اللّٰهِ شَیْـًٔا ؕ— هُوَ اَعْلَمُ بِمَا تُفِیْضُوْنَ فِیْهِ ؕ— كَفٰی بِهٖ شَهِیْدًا بَیْنِیْ وَبَیْنَكُمْ ؕ— وَهُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟
ఏమీ ఈ ముష్రికులందరు : నిశ్ఛయంగా ముహమ్మద్ ఈ ఖుర్ఆన్ ను కల్పించుకుని దాన్ని అల్లాహ్ కు అంటగట్టాడు అని పలుకుతున్నారా ?. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను దాన్ని నా వద్ద నుండి కల్పించుకుని ఉండి అల్లాహ్ నన్ను శిక్షించదలచి ఉంటే మీకు నా విషయంలో ఎటువంటి ఉపాయం ఉండదు. అటువంటప్పుడు ఆయనపై అబద్దమును అపాదించి నేను ఎలా నా స్వయమును శిక్షకు సమర్పించుకుంటాను ?. మీరు అల్లాహ్ విషయంలో ఆయన ఖుర్ఆన్ విషయంలో దూషిస్తున్న వాటి గురించి మరియు నా విషయంలో అపనిందపాలు చేస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు. నాకు,మీకు మధ్య సాక్ష్యంగా పరిశుద్ధుడైన ఆయన చాలు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛత్తాపముతో మరలే వారి పాపములను బాగా మన్నించేవాడును,వారిపై అపారంగా కరుణించేవాడును.
アラビア語 クルアーン注釈:
قُلْ مَا كُنْتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَاۤ اَدْرِیْ مَا یُفْعَلُ بِیْ وَلَا بِكُمْ ؕ— اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤی اِلَیَّ وَمَاۤ اَنَا اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
ఓ ప్రవక్తా మీ దైవదౌత్యమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : నేను మీకు ఇచ్చిన నా పిలుపునకు మీరు ఆశ్ఛర్యపోవటానికి నేను అల్లాహ్ పంపించిన మొట్టమొదటి ప్రవక్తని కాదు. వాస్తవానికి నా కన్న మునుపు చాలా మంది ప్రవక్తలు గతించారు. నా పట్ల అల్లాహ్ ఏమి చేస్తాడో మరియు మీ పట్ల ఇహలోకంలో ఏమి చేస్తాడో నాకు తెలియదు. అల్లాహ్ నాకు దైవవాణి ద్వారా తెలియపరచిన దాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను ఏదన్న పలికిన,ఏదన్న చేసిన ఆయన దైవ వాణి ప్రకారం మాత్రమే ఉంటుంది. మరియు నేను మాత్రం అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించే వాడిని మాత్రమే.
アラビア語 クルアーン注釈:
قُلْ اَرَءَیْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ وَكَفَرْتُمْ بِهٖ وَشَهِدَ شَاهِدٌ مِّنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ عَلٰی مِثْلِهٖ فَاٰمَنَ وَاسْتَكْبَرْتُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟۠
ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అయ్యి వుండి,మీరు దాన్ని తిరస్కరించి ఉండి,బనీ ఇస్రాయీల్ నుండి ఒక సాక్ష్యం పలికే వాడు దాని విషయంలో తౌరాత్ లో వచ్చిన దాన్ని నమ్ముతూ అది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని సాక్ష్యం పలికి,దానిపై అతను విశ్వాసమును కనబరచి ఉండి మరియు మీరు దానిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపితే అప్పుడు మీరు దుర్మార్గులు కారా ?! నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గ ప్రజలకు సత్యము కొరకు సౌభాగ్యం కలిగించడు.
アラビア語 クルアーン注釈:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْا لَوْ كَانَ خَیْرًا مَّا سَبَقُوْنَاۤ اِلَیْهِ ؕ— وَاِذْ لَمْ یَهْتَدُوْا بِهٖ فَسَیَقُوْلُوْنَ هٰذَاۤ اِفْكٌ قَدِیْمٌ ۟
మరియు ఖుర్ఆన్ ని,తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించిన వారు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు : ఒక వేళ ముహమ్మద్ తీసుకుని వచ్చినది మంచి వైపునకు మార్గదర్శకం చేసే సత్యమే అయితే ఈ నిరుపేదలు,బానిసలు,బలహీనులు మా కన్న ముందు దానివైపునకు సాగరు. మరియు ఎందుకంటే వారు తమ వద్దకు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దానితో మార్గదర్శకం పొందలేదు. తొందరలోనే వారు ఇలా అంటారు : అతడు మా వద్దకు తీసుకుని వచ్చినది ఇది ప్రాచీన అబద్దము. మరియు మేము అబద్దమును అనుసరించము.
アラビア語 クルアーン注釈:
وَمِنْ قَبْلِهٖ كِتٰبُ مُوْسٰۤی اِمَامًا وَّرَحْمَةً ؕ— وَهٰذَا كِتٰبٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِیًّا لِّیُنْذِرَ الَّذِیْنَ ظَلَمُوْا ۖۗ— وَبُشْرٰی لِلْمُحْسِنِیْنَ ۟
ఈ ఖుర్ఆన్ కన్న మునుపు అల్లాహ్ మూసా అలైహిస్సలాంపై అవతరింపజేసిన గ్రంధం తౌరాత్ మార్గదర్శకంగా సత్యం విషయంలో అనుసరించటానికి మరియు బనీ ఇస్రాయీల్లోంచి దానిపై విశ్వాసమును కనబరచి దాన్ని అనుసరించిన వారి కొరకు కారుణ్యంగా ఉన్నది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అరబీ భాషలో దాని కన్న మునుపటి గ్రంధములను దృవీకరించే గ్రంధము. అల్లాహ్ కి సాటి కల్పించటం ద్వారా,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారికి దాని ద్వారా హెచ్చరించటానికి. మరియు ఇది తమ సంబంధమును తమ సృష్టికర్తతో మరియు తమ సంబంధమును ఆయన సృష్టితో మెరుగుపరచిన సజ్జనులకు ఒక శుభవార్త.
アラビア語 クルアーン注釈:
اِنَّ الَّذِیْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ۚ
నిశ్ఛయంగా ఎవరైతే మనకు అల్లాహ్ తప్ప ఇంకెవరూ ప్రభువు లేడూ అని పలికి ఆ తరువాత విశ్వాసముపై మరియు సత్కర్మపై స్థిరంగా ఉంటారో వారిపై పరలోకంలో వారు ఎదుర్కొనే వాటి విషయంలో ఎటువంటి భయం ఉండదు. మరియు ఇహలోక భాగముల నుండి వారు కోల్పోయిన వాటిపై మరియు తమ వెనుక వారు వదిలి వచ్చిన వాటి పై వారు దుఃఖించరు.
アラビア語 クルアーン注釈:
اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ خٰلِدِیْنَ فِیْهَا ۚ— جَزَآءً بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఈ గుణాలతో వర్ణించబడిన వారు స్వర్గవాసులు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు ఇహలోకములో ముందు పంపించుకున్న తమ సత్కర్మలపై వారికి ప్రతిఫలంగా.
アラビア語 クルアーン注釈:
本諸節の功徳:
• كل من عُبِد من دون الله ينكر على من عبده من الكافرين.
అల్లాహ్ ను వదిలి ఆరాధించబడిన ప్రతీది అవిశ్వాసపరుల్లోంచి తనను ఆరాధించిన వారిని తిరస్కరిస్తుంది.

• عدم معرفة النبي صلى الله عليه وسلم بالغيب إلا ما أطلعه الله عليه منه.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు అగోచర విషయముల గురించి అల్లాహ్ తెలియపరిస్తే తప్ప తెలియదు.

• وجود ما يثبت نبوّة نبينا صلى الله عليه وسلم في الكتب السابقة.
పూర్వ గ్రంధముల్లో మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవదౌత్యమును నిరూపించేవి ఉండటం.

• بيان فضل الاستقامة وجزاء أصحابها.
స్థిరంగా ఉండటం యొక్క ప్రముఖ్యత మరియు దాన్ని కలిగిన వారి ప్రతిఫలం యొక్క ప్రకటన.

 
対訳 章: 砂丘章
章名の目次 ページ番号
 
クルアーンの対訳 - クルアーン簡潔注釈(テルグ語対訳) - 対訳の目次

- Tafsir Center for Quranic Studies - 発行

閉じる